(hells and heavens)- Are they different for different religions? -

Vvs Sarma
హిందువులలో, క్రైస్తవులలో, ఇతర మతాలవారిలో భగవంతుని స్ఫురణ, ఆధ్యాత్మిక అనుభవాలు కలిగినవారు ఉంటారు కదా! మరి మీరే మంటారు? నరకాలు, స్వర్గాలు
(hells and heavens)- Are they different for different religions? - ఇది గీతా శర్మగారి పోస్ట్
ఈ పోస్ట్ నాకు నచ్చింది. నా సమాధానం ఇది. నరకాలు స్వర్గాలు మాత్రమే కాదు దేవుడు కూడా ఎవరిదేవుడు వారికే అన్నాను. దీనికి వచ్చిన అనేకవ్యాఖ్యలు, స్పందనలూ చూస్తే ఒకటి అర్థం అవుతుంది. ఎవరికీ కొన్ని ఊహలు తప్ప consistent thought process and reasoning లేదు.
1. కొందరి దృష్టిలో ఇవన్నీ కథలు. (అంటే కల్పితాలు). "అనగా అనగా ఒక రాజుకి ముగ్గురు కొడుకులు. ఆయన ఐదో కూతురు పేరు సుబ్బారావు." ఇది సరిగా ఉన్నదా? నాదృష్టిలో సరిగానే ఉన్నది. ముగ్గురు కొడుకులు అన్నానుకాని, కూతుళ్ళెంతమందో, ఉన్నారోలేదో, చెప్పలేదు.అమ్మాయిపేరు సుబ్బారావు ఎందుకౌతుంది? అంటే ఎందుకు కాకూడదు? అన్నది కౌంటర్. ఆపేరు ఉన్న ఒక అమ్మాయి నాకు తెలుసుకూడా.
2. చర్చ లో ప్రశ్న అడిగిన ఆవిడ ప్రశ్నకు సమాధాన ఇవ్వాలి. ఆవిడకు స్వర్గ నరకాల మీద నమ్మకం ఉన్నది. క్రైస్తవులకు ముస్లిములకు కూడా అలాటి విశ్వాసాలున్నాయని విన్నది. అవి ఒకటేనా? వేరు వేరా? అని అడిగారు ఆమె.
3. ఆమె ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వాలంటే అసలు మతాలు ఎందుకు వేరు, ఆ మతస్థుల నమ్మకాలు ఎందుకు వేరు? అనేది తెలుసుకోవాలి.
A) హిందువుల నమ్మకాలు ఏమిటి? దీనికి చాలామంది హిందువులే సమాధానం చెప్పలేరు.
క్రైస్తవులకు ఒకరే దేవుడు. ఇంగ్లిషులో గాడ్ అంటారు.స్వర్గం (హెవెన్)లో ఉంటాడు. ఆయనపేరు యెహోవా. ఆయన భార్య ప్రసక్తి ఎక్కడా లేదు. మరి ఆయన ఉన్నట్లు అందరికీ ఎలా తెలిసినది. మోజెస్ అనే ఆయన దేవుని మాటలు విన్నాడు. నేను ఆయన మాటలు మీకు అందజేస్తున్నాను అన్నాడు. అవి ఒక పుస్తకంలో వ్రాసుకున్నారు. ఆమాటలు విన్న ఆయనను ప్రవక్త (ప్రోఫెట్) అన్నారు. ఆయన మాటలుగా ఈయన చెప్పినది యూదుమతం అనిపిలువబడినది. చాలా ఏళ్ళకి జాషువా అనే ఆయన పుట్టాడు. జోసెఫ్, మేరీల కొడుకు. ఈయననే తరువాత యేసుక్రీస్తు అన్నారు. దేవుని ఏకైక కుమారుడన్నారు. ఈ రెండో అయన బోధలు దేవుని వాక్యాలే అన్నారు. అది బైబిల్. దేవదూతలు, సైతాను, స్వర్గం, నరకం, భూమి, ఏర్పడి సృష్టి జరిగింది. చనిపోయినవారు సమాధిలో నిద్రపోతారు. కూడా ఉన్న ఆత్మకూడా అక్కడె సేద తీరుతుంది.(RIP) క్రీస్తు చెప్పినది ఆయన మతం, ఆకథ ఆయన పుస్తకం. కొన్నాళ్ళకు మహమ్మదు అనే ఆయన అరేబియాలో పుట్టాడు. ఆయనను దేవుని దూత అన్నారు ఆయనకు కూడా దేవునితో సంభాషణ జరిగినది. నాతరువాత దేవుడు మరెవరితో మాట్లాడడు అన్నాడు. ఆయన అనుయాయులు ముస్లిములు. ఈ మతస్థులందరూ ఎప్పటికో దేవుని న్యాయ స్థానానికి వెళ్ళి శాశ్వత స్వర్గానికో నరకానికో పోతారు. యూదులకు మోజెస్, క్రైస్తవులకు మోజెస్, జీసస్, ముస్లిములకు మొజెస్ (మూసా), జీసస్ (యీసా) మహమ్మదు ప్రవక్తలయ్యారు. వారి వలన తెలిసిన సృష్టి సమాచారం వారి పుస్తకాలలో వ్రాసుకుని దానిని నమ్ముతారు.
B) ఇక హిందువుల సృష్టి క్రమం ఏమిటి? ప్రపంచంలో ఒకటే సత్యవస్తువు ఉన్నది. అది నిరాకారం, నిర్గుణం, నిరంజనం, అనిర్వచనీయం. అది స్థాణువుకూడా. అది బ్రహ్మ వస్తువు (నపుంసక లింగం) దానిలో చైతన్యం (movement, perturbation) వస్తే అది రెండు అవుతున్నది. ఒకటి రెండవడమే పరిణామం, వివర్తం కూడా. Change- real or apparent. (పురుషుడు, ప్రకృతి, శక్తి లేదా పురుషుడు, మాయ). సృష్టి సంకల్పం ఎరిగిన వాడు మహావిష్ణువు. సాంకేతికంగా పాలకడలి (cosmos) లో పవళించిన వాడు, ఆదిశేషువు శక్తికి సంకేతం. వేదంలో పురుషసూక్తంలో వర్ణించిన పరమపురుషుడు ఇతడే. ఇతడు సృష్టించినదే బ్రహ్మాండము. (can be imagined as being analogous to Milky Way galaxy). అనేక బ్రహ్మాండాలున్నాయి. ప్రతిబ్రహ్మాండములోను వారి వారి శక్తులతోకూడిన త్రిమూర్తులుంటారు. బ్రహ్మ ప్రతిసృష్టి చేస్తాడు. మన బ్రహ్మాండములో 14 లోకాలు సృష్టించాడు. భూలోకముపైన ఉన్న ఆరుతొ కలిపి ఏడు ఊర్ధ్వలోకములు, ఏడు అధోలోకములు. తరువాత ఆయాలోకములలోని జీవులను సృష్టించాడు. విష్ణువు స్థితినీ, రుద్రుడు లయాన్నీ కలిగిస్తారు. భూలోక జీవులు తమకర్మల ఫలంగా పరిణామంచెంది క్రమంగా ఊర్ధ్వముఖంగా ప్రయాణము చేస్తారు. అంతిమంగా జీవుడు జనన మరణ చక్రం నుంచి విముక్తి చెందుతాడు. హిందూ మతానికి ప్రవక్తలు లేరు. మన దేవతలు ఋషులూ అందరూచేసినది తపస్సు. Pointed inquiry and meditation. వారికి శ్రుతిగా వేదము వినిపించినది. కొన్ని వందల మహర్షులు గ్రహించిన విజ్ఞానము సనాతన ధర్మం. క్రైస్తవ మహమ్మదీయ మతాలు ఒక ప్రవక్త చెప్పిన బోధనలు. ఈ లోకాలు, దేవతలు ఉన్నట్లు ఎలాతెలిసింది? యోగ సాధనలో శరీర చైతన్యాన్ని సాధనతో ఉద్దీపనం చేసుకుంటే, ఈ లోకాల జ్ఞానాన్ని అంతర్ముఖుడై చేసిన తపస్సు ద్వారా తెలుసుకోవచ్చు, దర్శించవచ్చుకూడా.
It is not logical to say God is different for different religions and heaven and hell are different. But logic does not lead to absolute truth. Earth is one concept, Bhuloka is different. Man is one concept, Atman is another. Lokas and God are not physical entities – which can be perceived by senses. In the elephant and blind men story what each person saw is true and that is his perception. Each religion is a well and the believer is a frog in that well. Each world seen by each frog is true as far as the particular frog is considered. For Hindus the well is the Brahmanda.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!