కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో

పోతన గారి భాగవతం.

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ
హాటకగర్భు రాణి! నిను ఆకటి కైకొనిపోయి అల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

ఒక రోజు పోతన గారు భుక్తి కోసం దుక్కి దున్నుతూ చెమటలోడుస్తున్నారట. బావమరిది శ్రీనాథుడు పల్లకీలో పోతూ, “ బావా! ఎందుకొచ్చిన శ్రమయ్యా! ఆ రాస్తున్న భాగవతం ఏ రాజుకో అంకితమిచ్చి నాలాగా సుఖపడ రాదుటయ్యా” అని సలహా పారేశాడుట. పోతన గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడుట.

సరస్వతీ దేవికి గుండెగుభేలు మందిట. ఆ శ్రీనాథుడి మాట విని, పోతన గారు తనని, ఏ రాజుకో అమ్ముతాడేమోనని సరస్వతి భయపడింది.

ఆ రాత్రికి రాత్రి పోతనగారికి సరస్వతి కలలో కనపడి, కాటుక కరిగిపోయేటంతగా కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చిందిట. ఆ సమయంలో పోతనగారు సరస్వతికి ఒట్టేసి భరోసా ఇచ్చాడుట. “తల్లీ! నేను భాగవతాన్ని ఎవ్వరికీ అమ్మను, నన్ను నమ్మవమ్మా,” అని.
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌
సొమ్ములు కొన్ని” పుచ్చుకోను, శ్రీహరికే అంకితమిస్తాను సుమా అని.

పోతన గారు భాగవతాన్ని రాజుల చేతుల్లో పడకుండా భూమిలో పాతిపెట్టాడు, అని. ఇందులో నిజం ఎంతో నాకయితే తెలియదు కానీ, శిధిలమైపోయిన కొన్ని భాగవత భాగాలు, సింగన, గంగనలు పరిష్కరించారట.

కాటుక కంటినీరు పద్యం గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపిస్తుంద ి “Great poetry ought to be free, like beautiful things are!”

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!