శ్రీ కాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి
శ్రీ కాళహస్తి మాహాత్మ్యము
- ధూర్జటి
"ఓ సామీ ఇటువంటి కొండ దరిలో, నొంటింబులుల్, సింగముల్
గాసిం బెట్టెడు కుట్ర నట్టడవిలోఁ, గల్జువ్వి క్రీనీడ, నే
యాసం గట్టితి వేటిగడ్డ నిలు? నీవాఁకొన్నచోఁ గూడు నీ
ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా! | శా | [3-65]
"కొండలఁ గానలం దిరిగి క్రొవ్విన పందుల లేళ్ళ దుప్పులన్
జెండినఁ, బెక్కుచందములఁ జిన్నక పెద్దక గారుకమ్మఁగా
వండుదు, రట్ల పిట్టలను వండుదు, రిచ్చట నుండనేల ? నా
కొండొక టానతీక, యుడుమూరికి రాఁ గదవయ్య లింగమా! | శా | [3-66]
"ఓ లింగమ, విను నివ్వరి
ప్రాలును, నొడిపిళ్ళు గునుకుఁ బ్రాలును, వెదురుం
బ్రాలును, సవరపు మెకముల
పాలును, గల వచట నీకుఁ బాయసమునకున్ | క | [3-67]
"పుట్ట తేనియ పెరతేనె పుట్టజున్ను
తొర్రతేనియ గల వందుఁ దోఁచి తోఁచి
కాలి దులదులనై పిండి పోలె రాలు
నట్లు నింజెట్లు గలవు నీ కారగింప | గీ | [3-68]
"నేరెడి పండులు, నెలయుట్టి పండులుఁ,
--గొండమామిడి పండ్లు, దొండ పండ్లుఁ,
బాల పండులు, నెమ్మి పండులు, బరివంక
--పండులుఁ, జిటిముటి పండ్లుఁ, గలివి
పండులుఁ, దొడివెంద పండ్లుఁ, దుమ్మికి పండ్లు,
--జాన పండులు, గంగ రేఁగుఁ బండ్లు,
వెలగ పండులు, పుల్ల వెలగ పండులు, మోవి
--పండ్లు, నంకెన పండ్లు, బలుసు పండ్లు, | సీ |
బీర పండ్లును, బిచ్చుక బీర పండ్లుఁ,
గొమ్మి పండ్లీత పండ్లును, గొంజి పండ్లు,
మేడి పండ్లును మొదలుగాఁ గూడిమాడి
చెంచెతలు తెత్తు రిత్తు విచ్చేయు మయ్య | గీ | [3-69]
"ఇల్లో, ముంగిలియో, యనుంగుఁ జెలులో, యీడైన చుట్టంబులో,
యిల్లాలో, కొడుకో, తరింప వశమే, యేపోఁడుముల్ లేక? మా
పల్లెం గోరిన వెల్లనుం గలవు తెప్పల్ గాఁగ నీ కిచ్చెదన్
జెల్లం బో ! యిట నొంటినుండ కటు విచ్చేయంగదే లింగమా | శా | [3-70]
"చుఱుకుఁ జూపునఁ గాలిన కొఱత నుఱుకు
నుఱుకు జూపులఁ బుట్టించు నెఱుకు వారి
యిఱుకు వలిగుబ్బ పాలిండ్ల యిగురుఁ బోండ్ల
సేవ కిచ్చెద నీకు విచ్చేయుమయ్య" | గీ | [3-71]
"నేఁడేడు దినంబులయ్యెం
బోఁడిమి చెడసాగి, నీదుబూటకమో? యె
వ్వాఁడైనను జేసెనొ ఇది?
వేఁడెద సత్యంబుఁ జెప్పవే కరుణాబ్ధీ! | క | [3-98]
"ప్రాఁతలు మీఁదఁ గప్పినఁ గృపామతి నోర్చితి, నీచు పొత్తునన్
బ్రాఁతిమెయిన్ మెసంగితివి, భక్తుఁడు కుంటెనఁ బంపఁబోతి, మై
పూఁత యొనర్చుకొంటి శవ భూతిఁ, గపాలమునన్ భుజించి, తీ
రోఁతలు పెక్కులుండ నివి రోయుదువే, యిఁక భక్తవత్సలా!" | ఉ | [3-100]
పరిచిత బంధనైపుణి, నపార కళానుభవ ప్రసక్తి, నా
దర సువివేక సంపద, సదాశుక వాక్య సుధానుభూతి, మో
హ రహితవృత్తిఁ, బ్రస్ఫురదనంగ రహస్య విచారబుద్ధి, న
ప్పురమునఁ గామినీ జనులు పొల్తురు యోగిజనంబు పోలికన్ | చ | [1-24]
స్వానుభవంబునఁ దథ్యము
గానంబడుఁ గాని నీయఖండాద్వైత
జ్ఞానమయాకృతి బహుభా
షానైపుణిఁ దెలియునది యశక్యమఁట శివా ! | క | [1-80]
"కాళహస్తి మాహాతంయము వంటి గ్రంథము తెలుగులో మరి యొకటి లేదు.... ఆ పద్యములెంత రమణీయముగా నుండునో చదివిన వారికే తెలియును....ఈ యేనుగు, పాము, తిన్నడి కథలు చదివి ఆనందించని తెలుగు వాని జన్మ యెందులకు? వాడు తానొక సాహితీ వేత్తననుకొన్నచో వాని సాహిత్య మెంతటిది?"

Comments
Post a Comment