వసుచరిత్రము .
మ. సతి యూరుద్యుతి జెందఁబూని నిజదుశ్చర్మాపనోద క్రియా
రతి పాథోలవ పూరితోదరములై రంభేభ హస్తంబులు
న్నంతఱిన్, వీడె మరుద్విభూతిఁ గదళిన్ త్వగ్దోషమాచంచలో
ద్ధతశుండాతతి బాయదయ్యె నదెపో తద్వైరమూలంబిలన్
. ప్రసిద్ధమైన ఈ పద్యం వసుచరిత్రము అనే ప్రభంధం లోనిది. కవి రామరాజభూషణుడు. ఈయనకు భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. రామరాజభూషణుడు చాలా గొప్ప కవి. చూశారు గదా.
ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక.
అమ్మాయి గారి తొడలు కరిశుండానికన్నా, రంభాస్తంభాలకన్నా అందమైనవి. తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ రెండూ సతి ఊరుద్యుతిని పొందలేవు. దుశ్చర్మాన్ని పోగొట్టుకుంటే అరటి స్థంభాన్ని కొంచెం పోల్చవచ్చునేమో కానీ, ఏనుగు తొండానికి మాత్రం ఆ అవకాశమూ లేదు. అమ్మాయి ఊరువుల కాంతిని తెలిపేందుకు ఈ పోలికలు, కల్పన చేశాడు కవి.
రంభ (అరటి), ఇభహస్తములు (ఏనుగు తొండాలు), సతి ఊరుద్యుతి జెందబూని, పాథోలవ పూరిత ఉదరములై, నిజ దుశ్చర్మ అపనోద క్రియారతిని ఉన్న తరిన్, మరుద్విభూతి త్వగ్దోషము వీడె కదళిన్, ఆ చంచలోద్ధత శుండాతతి పాయదయ్యె, అదెపో తద్వైర మూలంబు, ఇలన్ — ఏనుగు తొండాన్ని వర్ణిస్తూ మత్తేభ వృత్తంలో వ్రాయడం బాగున్నది.

Comments
Post a Comment