రామాయణము - బాలకాండ - మొదటి సర్గ - శ్లోకం 77,78

రామాయణము - బాలకాండ - మొదటి సర్గ - శ్లోకం 77,78

తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం |
రామాయ ప్రియం ఆఖ్యాతుం పునః ఆయాత్ మహాకపిః |1-1-77|

సః అభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం |
న్యవేదయత్ అమేయాత్మా దృష్టా సీతా ఇతి తత్త్వతః |1-1-78|

(రావణాజ్ఞననుసరించి, రాక్షసులు తనతోకకు నిప్పంటింపగా) మారుతి తనవాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమునుదప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవికుశలవార్తను దెలిపి, శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువుసమీపమునకు మఱలివచ్చెను.
మహాబుద్ధిశాలియైన పవనసుతుడు "కనుగొంటిని సీతమ్మను" అని పలికి, రామునకు ప్రదక్షిణమొనర్చెను. సీతాదేవి యెడబాటునకు లోనయ్యును, నిశ్చలుడై యున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. [1-1-77, 78

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!