పోతనగారి "రుక్మిణీకళ్యాణము" నుండి.
పోతనగారి "రుక్మిణీకళ్యాణము" నుండి.
ఖగనాథుం డమరేంద్రుఁ గెల్చి సుధ మున్ గైకొన్నచందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులంగెల్చి భ
ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్
శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకి రుక్మిణీకల్యాణ గాథ చెబుతున్నాడు. ఓ రాజా! పూర్వం గరుత్మంతుడు ఇంద్రుడిని గెలిచి అమృతమును పొందిన విధంగా, అనేకమంది రాజులను, శిశుపాలుని మిత్రుడైన సాళ్వుడు మొదలైన దుష్టులను గెలిచి శుభంకరుడైన శ్రీకృష్ణుడు, భీష్మకరాజు పుత్రియు, పద్మగంధియు లక్ష్మీయంశసంభూతయు, గొప్ప సుగుణాలరాశియు అయిన రుక్మిణిని వరించెను.
భద్ర - శుభమును గ – పొందుట; భద్రగుడై – శుభమును పొందినవాడై.

Comments
Post a Comment