భర్తృహరి నీతి శతకం -ఏనుగు లక్ష్మణ కవి

భర్తృహరి నీతి శతకం -ఏనుగు లక్ష్మణ కవి

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి య
స్తోకాంబోధిఁ, బయోధి నుండి పవనాంథోలోకముం జేరె గం
గాకూలంకష! పెక్కు భంగులు వివేకభ్రష్ఠ సంపాతముల్! |శా|


అతనికి వార్థి కుల్య యగు, నగ్ని జలంబగు, మేరు శైలమం
చిత శిల లీలనుండు, మద సింహము జింక తెఱంగుఁ దాల్చు, గో
పిత ఫణి పూలదండయగు, భిష్మవిషంబు సుధారసంబగున్,
క్షితి జన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్ |చ|



ఆపదలందు ధైర్య గుణ, మంచిత సంపదలందుఁ దాల్మియున్,
భూప సభంతరాళమునఁ బుష్కల వాక్చతురత్వ, మాజి బా
హా పటు శక్తియున్, Yఅశమునం దనురక్తియు, విద్య యందు వాం
ఛా పరివృద్ధియున్, బ్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్ |ఉ|



ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ |శా|



ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచోశాకము లారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనం,
బొక్కచో బొంత ధరించు, నొక్కొక తఱిన్ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ |చ|



గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన, విశీర్ణమైన, సా
యాసమునైన, నష్టరుచి యైనను, బ్రాణభయార్తమైన, ని
స్త్రాసమదేభకుంభ పిశిత గ్రహ లాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే? |ఉ|



తమ కార్యంబుఁ బరిత్యజించియుఁ బరార్థ ప్రాపకుల్ సజ్జనుల్,
తమ కార్యంబు ఘటించుచున్ బర హితార్థ వ్యాపృతుల్ మధ్యముల్,
తమకై యన్య హితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్థ భం
గము గావించెడివార లెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్? |మ|



తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! ||



తెలివి యొకింత లేని యెడ దృప్తుడనై కరి భంగి సర్వముం
దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితిఁదొల్లి, యిప్పుడు
జ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై
తెలియనివాడనై మెలంగితిం, గతమయ్యె నితాంత గర్వమున్! |చ|



వనజభవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్
వనజవనీ విహార కలనంబుఁ దొలంగగఁ జేయుఁగాని, గుం
భవమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ
జనిత మహా యశో విభవ సారము హంసకు మాన్పఁ జాలునే? |చ|



విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
చారు మాణిక్య భూషిత శస్త మస్త
కంబయిన పన్నగము భయంకరము గాదె! |తే|



విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుడున్,
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాలపూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే? |ఉ|



క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి
త్రము దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి
త్త, ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్య మీక్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టునఁ దత్కవచాదులేటికిన్? |చ|



క్షీరము మున్ను నీటి కొసగెన్ స్వగుణంబులు దన్నుఁ జేరుటన్
క్షీరము తప్తమౌటగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు
ర్వార సుహృద్విపత్తిఁ గని వహ్ని చొరంజనె దుగ్ధమంతలో
నీరముఁ గూడి శాంతమగు; నిల్చు మహాత్ముల మైత్రి యీగతిన్ |చ|

Comments

  1. వైరాగ్య శతకం తెలుగు పెట్టండి.

    ReplyDelete
    Replies
    1. వైరాగ్య శతకం తెలుగులో పెట్టండి.
      alapavanamaravati @gmail.com

      Delete
    2. జీవితంలో దెబ్బతిన్న వారు మన కళ్ల ముందు ఎంతోమంది ఉన్నారు. గంగానది ఆకాశంలో పుట్టి శివుని శిరస్సు పై పడింది. అక్కడి నుంచి హిమాలయాలపై పడింది. వాటిపై నుంచి భూమిపై పడింది. భూమిపై ప్రవహించి సముద్రంలో కలిసింది. అక్కడి నుంచి పాతాళానికి చేరింది. ఆకాశంలో పుట్టి పాతాళానికి చేరింది. వివేకాన్ని కోల్పోతే మనం కూడా జీవితంలో అలాగే జారిపోతాం!

      Delete
    3. పాలలో నీళ్లు పోయండి. ఆ తరువాత ఏం చేసినా సరే పాలు, నీళ్లు వేరు చేయలేరు. క్షీరము మున్ను నీటి కొసగెన్‌ స్వగుణంబులు తన్ను చేరుటన్‌ అంటే.. పాలు, నీళ్లను పిలిచి మనం ఇద్దరం ఒకటే అని కలిపేసుకుని నీళ్లను కూడా పాలలా మార్చేసింది. ఎన్ని నీళ్లు కలిసినా అవి పాలే అవుతాయి కానీ నీళ్లు కావు కదా! పాలు తన గుణాలన్నీ ఇచ్చేసి, నీళ్లను కూడా పాలగా మార్చేసింది. అప్పుడు నీరు ఏం చేసింది? క్షీరము తప్తమౌట గని చిచ్చురికెన్‌ వెతచే జలంబు అంటే.. పాలు వేడి చేస్తాం కదా! వేడి చేసినప్పుడు పాలు వేడెక్కిపోతూ ఉంటే నీళ్లకు బాధ కలిగిందట.
      ఆ బాధతో నీరు ఆవిరిరూపంలో బయటకు పోవడం మొదలుపెట్టిందట! అందుకే పాలు ఎక్కువ సేపు వేడి చేస్తే నీళ్లన్నీ పోయి చిక్కటి పాలే మిగులుతాయి. దుర్వార సుహృత్విపత్తిగని వహ్ని జొరంజనె దుగ్ధ.... నీళ్లు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోవడం చూసి పాలు తట్టుకోలేక పొంగి పొయ్యి మీద పడిపోతున్నాయట! నీరము గూడి శాంతమగు... పొంగిపోతున్న పాలను ఆపడానికి బయట నుంచి మళ్లీ నీళ్లు చల్లుతారు. అప్పుడు పాలు, హమ్మయ్యా! నా నీళ్లు నా దగ్గరకు వచ్చేశాయి అనుకుని పొంగడం ఆగిందట! నిజంగా మహాత్ములు ఇలాగే ఉంటారు. నిల్చు మహాత్ముల మైత్రి యీగతిన్‌... వాళ్ల స్నేహం అలాగే ఉంటుంది.

      Delete
    4. BVSN Murthyగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.

      Delete
  2. Vairagyadatakam telugu audio
    lo pettan di please

    ReplyDelete
  3. విద్యచే భూషితుండయి వెలయుచున్నఁ
    దొడరి వర్జింపనగుఁ జుమీ దుర్జనుండు
    చారు మాణిక్య భూషిత శస్త మస్త
    కంబయిన పన్నగము భయంకరము గాదె!

    ఈ యొక్క పద్యానికి భావం ఏమిటి

    ReplyDelete
    Replies

    1. దుష్టుడు గొప్ప విద్యావంతుడై ఎంత కీర్తి సంపాదించినా, అతని దుర్మార్గపు స్వభావమును దృష్టిలో ఉంచుకొని అతడితో సహవాసము గానీ, సంబంధాలను గానీ విడిచిపెట్టవలసిందే. ఏ విధంగానంటే, సర్పము పడగపై ఎన్ని మణిమాణిక్యములతో ప్రకాశిస్తున్నా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోముగా! అనగా అది విషపూరితమైనది, భయంకరమైనదే కదా!

      Delete
  4. Ravanudu Brahmanudu anni
    Vdjidyalu thelisinavaadu ainappatiki
    Seetha Devini cherabatti naasanaanni koni thechhukunnadu.
    Elaagante padaga meeda Rathnaanni dharinchinappatiki.
    Vishaanni chusi ,prajalu Rallatho
    Kotti champuthaaru.

    ReplyDelete
  5. సహస్ర కోటి వందనాలు

    ReplyDelete
  6. జనకునిపూజలన్ పద్య పూరణ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!