వింజామరలు...
వింజామరలు...
1) మునిమాణిక్యంగారు ఒక సభలో ఈవిధముగా మాట్లాడారు.
"నేను ఈ నెల జీతం అలవాటు ప్రకారము మా ఆవిడకి యిచ్చాను. లెక్క చూసుకుని 'ఏమండీ? ఈ నెల తక్కువ యిచ్చారేమండీ?" అంది. "వాళ్ళు తీసుకున్నారే" అన్నా. "ఎవరండీ?" అంది. "అదేనే, ఆఫీసువాళ్ళు" అన్నా. "ఎందుకండీ?""యుద్ధం చేస్తున్నారు కదా? అందుకని." "ఎవరు చేస్తున్నారు ? ఎవరితోచేస్తున్నారు?దానికీ మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఏమిటి సంబంధం?" అని ఆరా తీయసాగింది."అదేనోయ్!
మన దేశం వాళ్ళు చైనా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కదా? మరి ఖర్చవుతుందికదా?" అని వివరించా. "అంత పెద్దదేశం చైనా వాళ్ళతో మనవాళ్ళు యుద్ధం చేస్తారా? దానికి ఖర్చవుతుందా? అందుకని మీ జీతం కోస్తారా?" అన్నింటికీ అవునంటూ బుర్ర వూపా...అప్పుడు
మా ఆవిడ "యుద్ధం చేయడానికి డబ్బుల్లేకపోతే మీలాంటి వాళ్ళ పొట్ట కొట్టడమెందుకండీ...అంత డబ్బుల్లేని వెర్రిముండా గవర్నమెంట్
యుద్ధం చేయకపోతే వచ్చే నష్టమేమిటిట?" మా ఆవిడ లాజిక్ కి అవాక్కయి- ఇదిగో ఇలా వచ్చేసా!" అని హర్షధ్వానాలమధ్య ముగించారు.
2)Mr.రావ్.. మీరోసారి ఇలా రండి.. ఆ గుప్తా బ్రదర్స్ ఫైలు పట్రండి..
భార్య: (మళ్ళీ ఫోన్)...
బాస్: ఎవరోయ్ అస్తమానూ ఫోన్..ఇలా నాకియ్యి...(తీసుకుంటాడు)
భార్య: (ఫోనులో) ఎప్పుడూ బాస్ ... బాస్ అంటారేమిటి. ఆయనకేం పనిలేదా ? చీటికీ మాటికీ మిమ్మల్ని పిలవడమేనా.. మీ ఆఫీసులో ఇంకెవ్వరూ ఉద్యోగాలు చెయ్యటంలేదా... అసలు ఆ బాసు గాడికి మొహాన నవ్వూ తుళ్ళూ ఏమైనా ఉంటాయా... లేపోతే మన హాసం క్లబ్ కు తీసుకురండి.. నవ్వడం అంటే ఏమిటో తెలుస్తుంది. అయినా నా సంగతి తెలియదేమో గురుడికి....
" అంబనహో..శక్తి నహో..... అంకాళ దేవతనహో
మన ఊర వెలసిన జడల మారెమ్మనహో "
బాస్:: ఓర్నాయనోయ్.. ఎవత్తయ్యా ఈవిడా.. ఇలా వాయించేస్తోంది.. నీకు తెలుసా ?
భర్త:: నా భార్య సార్
బాస్: నీ భార్యా ? ఓహ్.. సారీ... సారీ ఆఫీస్ ఫోనులు ఇలా సొంతానికి ఇలా... ఇలా.. టూ మచ్... థ్రీ మచ్.. గట్టిగా మాట్లాడితే బోల్డు మచ్...నో ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్.. నీకో ఇంక్రిమెంట్ కట్..నీ సెల్ ఫోన్ కట్.. నీ ఇంటి ఫోను కూడా కట్..
భర్త: సా....ర్...
బాస్: నో మోర్ ఆర్గ్యుమెంట్... గో....( జుత్తు పీక్కుంటూ కుర్చీలో కూలబడ్తాడు....)
3)(ఆఫీసు సీను.. భర్త ఆఫీసుకి చేరాడు)
భర్త:: గుడ్ మార్నింగ్ సర్ !
బాస్: గుడ్ మార్నింగ్ Mr.రావ్ !
భార్య: (ఫోన్ రింగ్) హలో.. నీవేనా నను తలచినదీ.. నీవేనా నను పిలచినదీ...
భర్త: అబ్బా ఏమిటే నీ గోల.. మా బాస్ దగ్గరున్నాను ..
భార్య: స్కిట్ వ్రాసారేమో అడుగుదామని...
భర్త: ఇంకా సీటుకి కూడా వెళ్లలేదు.. ఫోన్ పెట్టేయవే బాబూ...
బాస్: ఎవరయ్యా ఫోన్..
భర్త: అబ్బెబ్బే.. ఏమీ లేదండి..
3)భర్త దారిలో ఉంటాడు.. జేబులో ఫోన్ మ్రోగుతుంది.)
భార్య: (ఫోన్ రింగ్) .. నన్నువదలి నీవు పోలేవులే.. అదీ నిజములే
ఏమండీ.. ఈ పాట రింగ్ టోన్ వచ్చిందా ?
భర్త: (ఇబ్బందిగా స్కూటర్ మీద కూర్చుని.. ఓ చెవిలో ఫోన్) వచ్చింది తల్లీ, మళ్లీ నువ్వు పాడడమెందుకు ?
భార్య: లైవ్ షో అండీ, లైవ్లీగా ఉంటుందని. ఇంతకీ స్కిట్ వ్రాసారా ?
భర్త:: అబ్బా.. ఇంకా ఆఫీసుకి చేరలేదమ్మా .. దారిలో ఉన్నాను.. ఇక్కడ విపరీతంగా ఉంది ట్రాఫిక్.. ఫోన్ పెట్టేయ్ తల్లీ...
4)అజ్ఞానిని చూసినట్టు నారదుణ్ణి జాలిగా చూసి చెప్పాడు గద్దర్. “చూడన్నా! మీ దేవ రహస్యాల్లాగే మాక్కూడా కొన్ని విప్లవ రహస్యాలు ఉంటాయి. సాటి గాయకుడివి కాబట్టి చెబుతున్నాను. విను … గుళ్ళూ, గోపురాలు, పూజలూ, పునస్కారాలు ఇవన్నీ జనం సంస్కృతిలో భాగమే … జనంతో పాటే మనం .. గుడికొచ్చినంత మాత్రాన పోరాటాలు ఆపం కదన్నా! దేని దారి దానిదే …”
“మరేం … కవి అన్నాక కాసింత విప్లవ పోషణ కూడా ఉండాలి” సమర్థించాడు నారదుడు. గద్దరు సలాం కొట్టి బయల్దేరబోతుండగా నారదుడు ఆపాడు. “చూడు నాయనా! ఎలాగూ తెలంగాణలో ఉన్న భద్రాద్రికి వచ్చావు. అలాగే రాయలసీమలో వేంచేసి ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారినీ, ఆంధ్రలో అవతరించిన సింహాచలం వరాహలక్ష్మీ నరసింహం వారిని కూడా దర్శించుకుంటే తరిస్తావు. ఆ ప్రాంతాల్లో కూడా నీకు అభిమానులు ఉన్నారు కదా!” సలహా ఇచ్చాడు నారదుడు.
“మస్తు అయిడియా ఇచ్చినావన్నా! గిప్పుడే బయల్దేరతా … రామదండ్రామదండెన్నీయల్లో .. రామ సక్కనిదీ దండెన్నీయల్లో .. పాడుకుంటూ బయల్దేరాడు గద్దర్.
***
నారదుడు చెప్పినట్టే సింహాచలం వెళ్ళి, అప్పన్నని దర్శించుకుని, కప్ప స్తంభం కౌగలించుకుని, అక్కడ్నించి తిరుపతి చేరుకున్నాడు గద్దర్. తిరుమల కొండ ఎక్కబోతూ, అలిపిరి దగ్గర కాస్సేపాగి, ఆ ప్రదేశాన్ని కలయచూసి, ‘ప్చ్!’ అనుకుని భారంగా ఓ నిట్టూర్పు వదిలాడు. తిరుమల ఆలయాన్ని చేరుకుని పాట అందుకున్నాడు.
“తందనానా ఆహి … తందనానా … పురే … తందనానా .. భళా … తందనానా .. లక్ష్యమొక్కటే .. మన లక్ష్యమొక్కటే … సర్కార్ కూల్చుటొక్కటే …” అలా ఎంతసేపు చిందులు తొక్కినా తిరుమలేశుడు కరుణించలేదు. గద్దర్ మరో పాట ప్రారంభించాడు. “ఏడు కొండల స్వామీ, ఎక్కడున్నావయ్యా, ఎన్ని స్టెప్స్ వేసినా కానరావేమయ్యా …”
నారదుడు ప్రత్యక్షమయ్యాడు.
“గిదేంది నారదన్నా! మల్లొచ్చినావు … భూలోకంలోనే సెటిలై పోయినావా … లేకుంటే ఏదన్నా మీడియాలో ఉద్యోగం గినా వచ్చిందా?” ఆరా తీశాడు గద్దర్.
“ఆ వెంకన్నస్వామి కూడా నిన్ను ఆశీర్వదించాడు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను.”
“హమ్మయ్య .. బతికించినవ్ … నువ్వు చెప్పినట్టే మూడు ప్రాంతాల్లో గుళ్ళు తిరిగాను … ఇక హైదరాబాద్ పోతా” వెళ్ళబోతున్న గద్దర్ని ఆపాడు నారదుడు.
“మరో సమస్య తలెత్తే ప్రమాదం ఉంది గద్దర్! నువ్వు మూడు ప్రాంతాల్లోనూ వైష్ణవ ఆలయాల్ని మాత్రమే సందర్శిస్తే శివుడు .. పాపం … చిన్న బుచ్చుకోడూ! వేములవాడ రాజన్ననీ, శ్రీశైలం మల్లికార్జునుడినీ, ద్రాక్షారామ భీమేశ్వరుణ్ణి కూడా పలకరించి వస్తే ఓ పనైపోతుంది కదా!”
గద్దర్ ఆలోచనలో పడ్డాడు. “గంతేనంటావా నారదన్నా!” అన్నాడు.
“అంతేనా అంటే అంతేకాదు. ఇంకా చాలా ఉంది. మనం ఆడదేవుళ్ళతో పేచీ పెట్టుకోకూడదు. బెజవాడ కనకదుర్గమ్మ, అనకాపల్లి నూకాలమ్మ, విశాఖ కనకమాలక్ష్మి … ఇలా ఊరూరా అమ్మవార్లు ఎందరో ఉన్నారు. ఆ తల్లుల ఆశీర్వచనం కూడా కావాలి కదా!”
గద్దర్ ఏడుపు మొహం పెట్టాడు. నారదుడు తన వాగ్ధాటి కొనసాగించాడు.
“పోలవరం నిర్వాసితుల పక్షాన నిలబడి భద్రాద్రి వెళ్ళావు. బాగానే ఉంది. మరి మిగతా ప్రాజెక్టుల నిర్వాసితుల మాటేమిటి? వాళ్ళ తరఫున కూడా అక్కడున్న దేవుళ్ళకి మొక్కితే వాళ్ళ పోరాటాలు కూడా సఫలమవుతాయి కదా! ఉదాహరణకి … బాక్సయిట్ తవ్వకాలు వద్దంటున్న విశాఖ ఏజెన్సీ గిరిజనుల తరఫున పాడేరు మోదకొండమ్మకీ … తోటపల్లి నిర్వాసితుల తరఫున విజయనగరం పైడితల్లికీ …”
గద్దర్ పిచ్చిచూపులు చూస్తున్నా నారదుడు చెప్పడం ఆపలేదు.
“అసలు సంగతి మర్చిపోయానయ్యా గద్దరూ! పోరాటాలు చేస్తున్న ప్రజల్లో అన్ని మతాల వారూ ఉంటారు కాబట్టి చర్చిలకీ, దర్గాలకీ, గురుద్వారాలకీ కూడా వెళ్ళడం మర్చిపోకు సుమా!” అన్నాడు.
అప్పటికే గద్దర్ కిందపడి బ్రహ్మానందంలా గిలగిల కొట్టుకుంటున్నాడు.

Comments
Post a Comment