నీకున్,మాంసమువాంఛయేని కరవా!

నీకున్,మాంసమువాంఛయేని కరవా! / నీచేత లేడుండగా
జొకైనట్టి కుఠారముండ ననల / జ్యోతుండ నీరుండగా
పాకంబొప్పఘటించి చేతిపునుకన్ / భక్షింప కాబోయచే
చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా / శ్రీకాళహస్తీశ్వరా!

శ్రీకాళహస్తీశ్వర శతకము(ధూర్జటీ.)

శ్రీకాళహస్తీశ్వరా! నీకు మాంసమును తినవలెనని కోరిక ఉన్నచో జింక ఉన్నది.పదునైన కత్తి ఉన్నది.నీ కంటిలో అగ్ని యున్నది.శిరస్సుపై గంగ చేతియందు నీళ్ళు ఉన్నవి.వాని అన్నింటితో వండుకొని,నీ పుఱ్ఱెయగు భిక్షా పాత్ర యందు పెట్టుకొని తినవచ్చును గదా!ఆ బోయవాడైన తిన్నడు పెట్టిన ఎంగిలి మాంసము తినుట న్యాయము గాదు! అనగా నీ భక్తులు ఇచ్చినది దేనినైనను స్వీకరించెదవు కదా.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !