సీతా స్వయంవరము.

ద్రవిడ కర్ణా టాంధ్ర యవన మహారాష్ట్ర
రాజకుమారులు తేజ మలర,
పాండ్య ఘూర్జర లాట బర్బర మలయాళ
భూపనందనులు విస్ఫూర్తి మీఱ,
గౌళ కేరళ సింధు కాశి కోసల సాళ్వ
ధరణీశపుత్రులు సిరి వెలుంగ,
మగధ మత్స్య కళింగ మాళవ నేపాళ
నృపతనూభవులు నెన్నికకు నెక్క,

మఱియు నుత్కళ కొంకణ మద్ర పౌండ్ర
వత్స గాంధార సౌరాష్ట్ర వంగ చోళ
రాజ్యముల నొప్పు ఛప్పన్న రాజసుతులు
వచ్చి ర క్కామినీ స్వయంవరమునకును !

కొందఱు పల్లకీల, మఱికొందఱు తేరుల, నందలంబులం
గొందఱు, కొంద ఱశ్వములఁ, గొందఱు మత్తగజేంద్రసంఘమున్,
గొందఱు స్వర్ణడోలికలఁ, గోరిక నెక్కి నృపాలనందనుల్
సందడిగాగ వచ్చిరి బుజంబు బుజంబును ద్రోపులాడగన్ !

(రామాయణము, బాలకాండము - మొల్ల)

సీతా స్వయంవరమునకు వచ్చిన రాజకుమారుల సంరంభం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!