నంది తిమ్మన గారి "పారిజాతాపహరణము" నుండి.

మగమీల నగఁ జాలు తెగఁ గీలుకొను వాలుఁ
గనుఁగవ కొక వింత కాంతి యొదవె
వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు
చనుదోయి కొక వింత చాయ దోఁచె
నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము
గలవేణి కొక వింత నలుపు మీఱె
నల చెందొవల విందు చెలువెందు వెదచిందు
మొగమున కొక వింత జిగి దొలంకెఁ
జక్కఁదనమున కొక వింత చక్కఁదనము
జవ్వనంబున కొక వింత జవ్వనంబు
విభ్రమంబున కొక వింత విభ్రమంబు
గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి
శ్రీకృష్ణుడు రుక్మిణీ మందిరంలో ఉండగా కలహప్రియుడైన నారదుడు పారిజాత పుష్పాన్ని ఆయనకిచ్చి నీ భార్యలలో నీకెవరు ఎక్కువ ఇష్టమయితే వారికీ దివ్యకుసుమాన్ని ఇవ్వు అని ఇరకాటంలో పెట్టాడు. పాపం శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణీ దేవికి ఇవ్వక తప్పింది కాదు. ఆవిడ భక్తితో దాన్ని జడలో తురుముకుంది.
ఆ దివ్య పారిజాత కుసుమాన్ని అలంకరించుకోడం చేత -
అసలే గండు చేపల్ని సైతం పరహసించే ఆవిడ కళ్ళకి ఒక వింత కాంతి వచ్చి చేరింది. పూర్వం కంటే ఎక్కువ శొభాయమానమయ్యాయని. గుండ్రని చక్రవాక పక్షుల గొప్పలు (పెక్కువలు) కించపరిచేట్టు (తక్కువగ చేసే) ఉండే ఆమె నిక్కిన చనుగవకి ఒక వింత నిగారింపు వచ్చింది. లేప్రాయపు తేనెటీగల గర్వాన్ని దూరంగా పారద్రోలేతంతటి అందమైన ఆమె శిరోజాలకి ఒక చెప్పరాని సౌందర్యం ఏర్పడింది. అసలే నల్లగా ఉండే ఆమె కురులు ఇంకా నల్లగా నిగ నిగలాడాయని. చెందొవల విందు చెలువుడు - ఎర్ర కలువలకి పండుగ వంటి చెలికాడు - చంద్రుడు. చంద్రుని అందాన్ని అన్నివైపులకీ వ్యాపింప చేస్తుందా అన్నట్టు ఉండే ఆమె ముఖబింబానికి ఒక వింత కాంతి (జిగి) వచ్చి చేరింది.
పారిజాత పుష్పం వల్ల (దివ్య కుసుమ కతన), ఆమె చక్కదానికి ఒక వింత చక్కదనమూ, ఆమె యౌవనానికి అపూర్వమైన ఒక తారుణ్యమూ, ఆమె విలాసానికి ఒక వింత విలాసమూ వచ్చి చేరాయి.

Comments
Post a Comment