వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కథ!

వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కథ!

.

క్రౌంచ పక్షులను నిషాదుడు చంపగా వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన రామాయణ శ్లోకం

మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త.

ఒక నాడు నారద మహర్షి వాల్మీకి అశ్రమమునకు వస్తారు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతారు.మంజూష

కః ను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కః చ వీర్యవాన్

ధర్మజ్ఞః చ క్రుతజ్ఞః చ సత్యవాక్యో ధ్రుడ వ్రతః

ఈ కాలం లో,ఈ లోకం లో గుణవంతుడు,యుద్ధం లో శత్రువుని ధైర్యం గా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువని వాడు,ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు, అనుకున్న పని ని ధ్రుడ సంకల్పం తో చేసేవాడు ఎవడయిన వున్నడా..? వుంటె వాని గురించి చెప్పు అని అడుగుతారు.

అవియే కాక అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు... అలా 16 గుణములు చెప్పి అవన్ని వున్నవాడు ఈ భూమి మీద వున్నడా అని వాల్మికి మహర్షి అడుగుతారు.

అప్పుడు నారదుడు ఇట్లా చెబుతారు.

మహర్షీ మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేల..!

కానీ అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెపుతాను అని ఈ విధముగా చెప్పనారంభించెను.

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః

నియతాత్మా మహవీర్యో ధ్యుతిమాన్ ధ్రుతిమాన్ వశీ.

ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు వున్నాడు, ఆయన అపారమైన శక్తి కలవాడు, సంకల్పశక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించ గల్గిన వాడు, ఈ ప్రపంచాన్ని అంతటిని పొషించగల్గిన వాడు,సముద్రమంత గాంభీర్యం వున్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం వున్నవాడు, సాక్షాత్ శ్రీ మహవిష్ణువయా అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభిచెను.

సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మికి మహర్షి కి చెప్పెను. అప్పుడు వాల్మికి మహర్షి అమితానందభరుతుడయ్యెను. పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి వుంటుందో అలా ఆయన హృదయమంత రామాయణం నిండిపోయెను.

ఆ మరునాడు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.

"మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:

యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్"

.

"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి,

నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి"

.

శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని,అది రామాయణం వినుటవలన తటస్థించెనని 

సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. 

ఆప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి,

శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.

.

"యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే

తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.

రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్"

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!