మా అమ్మ వింజమూరి నరసింహ క్రిష్ణమ్మ!

మా అమ్మ వింజమూరి నరసింహ క్రిష్ణమ్మ!

.

సీ. మా అమ్మ క్రిష్ణమ్మ మంచి కుటుంబాన 

మురిపాల కడగొట్టు ముద్దుబిడ్డ 

గారాల పెరిగెను గాని మా అమ్మెంత 

అనురాగముల పంచె అత్త యింట 

అనుకూల సతి భర్త అడుగుజాడ నడచె 

ఆడబడుచులకు అమ్మగాను 

పెండ్లి పేరంటాలు పెద్దగా జేసేను 

ఆదర్సవంతురాలైన అమ్మ.

ఆ. ఆటు పోటులకును దీటుగ నిలబడి 

బిడ్డల చదివించె బాగుగాను 

పరువు తోడ బతికె పదిమంది మెచ్చగా 

సమత మమత జూపు సాద్వి అమ్మ. 

.

సీ. గీత భాగవత భారతములు నిత్య పా

రాయణ గ్రంధము లమ్మ కెపుడు

నాల్గవ తరగతి నాడు దుర్గాబాయి 

బడిలోన చదివిన భాగ్యమనగ 

దెశభక్తి ప్రబోధా గీతములు పాడు 

చుండె మా కంతయు వేడ్క గలుగ

మార్గదర్సిగ మాకు మంచిని భోధించె 

శక్తి సామర్ధ్యాలు, భక్తి నిలిపె.

ఆ. దానధర్మమన్న తడుముకోకుండగ 

పంచి యిచ్చు తల్లి పరమ సాద్వి 

తృప్తి గలిగి యండె తనకున్న దానితో 

అమ్మబాట మాకు అమృత బాట.

మా సోదరి ..తరణికంటి సూర్య లక్ష్మి కవిత.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!