తిరుపతి వేంకట కవుల నాటకీయత!

తిరుపతి వేంకట కవుల నాటకీయత!


.


అద్యత నాంధ్ర సాహిత్య క్షేత్రంలో అవధానగరిమనేగాక నాటక రచనాప్రావీణ్యాన్ని ప్రకటించిన మహాకవుల తిరుపతి వేంకట కవులు. జంటకవులైన వీరు "పాండవ ఉద్యోగ విజయములను "-పేర నొకనాటకమును రచియించి ఆబాల గోపాలము నలరించిరి. సహస్రాధిక ప్రదర్శనల తో యావద్భారతము నుర్రూత లూగించిన యీనాటకమున శ్రీ కృష్ణ రాయ బార ఘట్టము అనుపమానమైనది అందుండి కొన్నిపద్యములను పునః స్మరించి యానందము నందుకొందాము;

శ్రీ కృష్ణుఁడు కౌరవ సభలో-

" చెల్లియో చెల్లకో తమకు సేసిన యెగ్గులు సైచిరందరున్ ,

తొల్లి , గతించె; నను దూతగఁ బంపిరి సంధిసేయ , నీ

పిల్లలు పాపలున్ బ్రజలు పెంపు వహింపఁగ సంధిసేసెదో,

యెల్లి ,రణంబెఁ గూర్చెదవొ , యేర్పడఁ జెప్పుము? కౌరవేశ్వరా!

.

" అలుఁగుటయే యెఱుంగని మహా మహితాత్ముఁ డజాత శత్రువే

యలిగిన నాడు సాగరములన్నియు యేకముఁ గాక పోవు; క

ర్ణులు పదివేవురైన యని జత్తురు ,నొత్తురు ,రాజరాజ! నా

పలుకుల విశ్వసింపుము! విపన్నుల లోకులఁ గావు మెల్లరన్;

.

" జండాపై కపిరాజు ముందు శితవాజి శ్రేణియుం బూన్చి నే

దండంబున్ గొని దోల స్యందనము మీదన్నారి సారించుచున్ 

గాండీవంబు ధరించి ఫల్గుణుఁడు మూకం జెండుచున్నప్పు డొ

క్కండున్ నీమొఱలాలకిపడు ; కురుక్ష్మానాధ! సంధింపఁగన్ !

నను దూతగఁ బంపిరి సంధిసేయ!

ఇదీ సందేశం! పద్యాలు వాడుక భాషలోనే వ్రాశారు. నాటినుండి

నేటివరకు ఆంధ్రుల రసనాగ్రములపై నలవోకగా నిలచిపోతూ తలచినపుడల్లా ఆనందాన్ని అందించే యీపద్యాల సౌరభం దిగంత పరివ్యాప్తమై

తిరుపతికవుల కవితా యశః పతాకలై ఆచంద్రార్కముగా నిలచి యుంటాయనటంలో నత్యుక్తి యేమాత్రం లేదు!

జయన్తి తే సుకృతినో రస సిధ్ధాః కవీశ్వరాః

నాస్తి యేషాం యశః కాయో జరామరణజం భయమ్!!

.

శ్రీ కృష్ణుఁడు అంటే మన అన్నగారు ఎన్టి రామారావు గారే గుర్తుకు వస్తారు.

స్వస్తి!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!