ఆంధ్రుల భోజనం.!


.

ఆంధ్రుల భోజనం.!

.

అన్నం తెల్లగా మల్లెపూవులా మెతుకు మెతుకు అంటుకోకుండా ఉండాలి.

అన్నంలోకి వేడి,వేడి కమ్మని నేయి, చక్కని ముద్ద పప్పు, లేహ్యాలు, చోష్యాలు

అంటే పచ్చళ్ళు, పులుసులు, ముక్కల పులుసుని ‘దప్పళం’ అనికూడా అంటారు,

ఇంకా తోట కూర పులుసు,మజ్జిగ పులుసు, చారు.(సాంబారు,రసం మనవి కావు.

)అందులోకి వడియాలు, అప్పడాలు.

.

కూరలు- వంకాయకూర తప్పని సరి, పనసపొట్టు కూర, తీయ గుమ్మడికూర, కంద,అరటి,పొట్ల, దొండ,దోస, కాకర,బచ్చలి,తోట కూరలు, బెండకాయ వేపుడు. ఆవకాయి,మాగాయి, గోంగూర, కొబ్బరి నూల పచ్చళ్ళు.

.

పొడులు- కంది పొడి, పెసరపొడి, పప్పుల పొడి, కారపు పొడి.

.

ఇంక పిండివంటలు –వీటిని భక్ష్యాలు అంటారు.

వడలు, ఆవడలు, పెరుగువడలు, జంతికలు,పప్పు చెక్కలు, చేగోణి(డి)లు,ఇవి కారం. ఇక మధురం-అతిరసాలు( అరిసెలు) బొబ్బట్లు, పూర్ణాలు,( వీటిని బూరెలు అనికూడా అంటారు) సొజ్జేఅప్పాలు, అప్పాలు,లడ్లు ( వీటిని మోదకాలు అంటారు) మినప సున్ని ఉండలు, కొబ్బరి ఉండలు, కజ్జికాయలు,మొ// అన్నంతో చేసేవి--క్షీరాన్నం,లేక పాయసం( పయః అంటే పాలు) పుళిహోర, –(పుళి అనగా చింత పండు, హోర అనగా అన్నం.) దీనినే చిత్రాన్నం అంటారు. దధ్యోదనం, (దధి=పెరుగు. ఓదనం=అన్నం.) వెన్ పొంగలి, (తెల్లని ) దీనిని పులగం అని కూడా అంటారు. శర్కర లేక చెక్కర పొంగలి, చివరగా చక్కని, చిక్కని గడ్డ మీగడ పెరుగు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!