తెలుగోళ్లు.....మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్‌,....అన్నాడు గిరిశం



తెలుగోళ్లు.....మనవాళ్లువొట్టివెధవాయలోయ్‌,....అన్నాడు గిరిశం
.
ఇలాంటి వాళ్లు ప్రపంచం మొత్తం లో వున్నారా? లేక మన దేశం లోనే వున్నారా? లేక మన ఆంధ్రుల నే అన్నాడా గురజాడ?!
యెందుకంటే, ఇలాంటి వాళ్లు, తెల్లారి లేచిన దగ్గరనుంచీ, యెవరో ఒకళ్లని--"వాడు ఓ వెధవ!" "అది ఓ ......!"--అని తిడుతూనే వుంటారు.
.
పోనీ వాళ్లకి తిట్టే వాళ్లమీద యేదైనా ప్రత్యేకమైన కోపం వుందా? వాళ్ల వల్ల వీళ్లకి యేమైనా నష్టం జరిగిందా?......యేమీ వుండదు....తమ అక్కసు వెళ్లబోసుకోవడం తప్ప..వాళ్ల గురించి వీళ్లకి పూర్తిగా తెలుసా అంటే, లేదు!..పోనీ మిగిలిన విషయాల్లో యేమైనా పరిజ్ఞానం వుందా? అదీ లేదు. తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాం అని కూడా అనుకోరు వీళ్లు. వీళ్లలో పెద్దలూ, పిన్నలూ వగైరా తేడాలు లేవు!.
మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్‌,....అన్నాడు గిరిశం
డా`మిట్‌. ఇలాటి మాటలంటే నాకు కోపంవొస్తుంది.
ఇది బేస్‌ ఇన్గ్రా`టిట్యూడ్‌. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్‌.
ఆమాటకొస్తె నీకున్న లాం`గ్వేజి నీ మా`ష్టరుకుందీ? విడో మారియేజి విషయమై, నాచ్చి కొశ్చన్‌ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! నాదగ్గిర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడుకాలేదు.
పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజస్‌ ఫర్ది డిజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడుఘంటలు ఒక్కబిగిని లెక్చెర్‌ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు. మొన్నబంగాళీవాడు యీవూళ్లో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ?
మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్‌, చుట్టనేర్పినందుకు థా`ంక్‌ చెయ్క, తప్పుపట్టుతున్నావ్‌? చుట్టకాల్చడంయొక్క మజా నీకు యింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్టగాల్చబట్టే కదా దొర్లింత గొప్పవాళ్లయినారు. చుట్టకాల్చని యింగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణి మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టా`డు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా?
శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పా`నే.
సూత ఉవాచ-
క॥ ఖగపతి యమృతముతేగా ।
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్‌ ।
పొగ చెట్టై జన్మించెను ।
పొగతాగనివాడు దున్నపోతైబుట్టునూ॥
.
యిది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వున్నది.
అది అలావుణ్ణీగాని నీ అంత తెలివైన కుఱ్ఱవాణ్ణి ఫెయిల్‌ చేసినందుకు నీ మా`ష్టరుమీద
నావొళ్లు మహా మండుతూంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!