‘నిధి చాల సుఖమా... రాముని సన్నిధి సుఖమా...

శుభోదయం.!

.

నిధి చాల సుఖమా?తాను నమ్మిన దానికి కట్టు బడి ఉండటం సుఖమా ?

.

ఈ రోజు త్యాగరాజ స్వామి జన్మ దినం .

అయన నుంచి మనము నేర్చు కోవలసినది కేవలం సంగీతం ఒక్కటే కాదు .

‘నిధి చాల సుఖమా... రాముని సన్నిధి సుఖమా... అని నిధులు, నిక్షేపాలు కన్నా తా ను నమ్ముకున్న శ్రీరాముని కే ’ ప్రాధాన్యత నిచ్చారు .

అయన అంటే అందుకే సంగీతాభిమానుల కే గాక , అందరికీ గౌరవం, భక్తీ ఉన్నాయి. నమ్మిన దానికి కట్టు బడి ఉన్న పోతన తో వీరిని పోల్చ వచ్చు 

కళ ల నీ ,సాహిత్యాన్ని మేధా సంపత్తి నీ తాకట్టు పెట్టి దానితో వచ్చే తాత్కాలిక మైన సంతోషం కన్నా , తాము నమ్మిన దానికి కట్టు బడి ఉండటం, తద్వారా ఎన్నో కష్టాలను బాధలను , అవమానాలు ను ఎదుర్కోవటం అందరికీ సులభ సాధ్యం కాదు . 

ఒక్క మహాత్ముల కే చెల్లు తుంది

ఒకరు దేవుని నమ్ము తారు . కొలుస్తారు . ఇంకొకరు మానవ సేవే మాధవ సేవ అంటారు . కానీ వారు అంటున్న మాటల ను ఆచరణ లో పెట్టిన నాడే వారు మంచి వ్యక్తిత్వం కల వారు అవుతారు . ఒకరు గొప్ప రచయిత కావచ్చు లేదా చిత్రకారుడు కావచ్చు కానీ ఓ మంచి మనిషి గా కావటం మటుకు చాలా కష్టం .

https://www.youtube.com/watch?v=64JyLaF7PJU

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!