ద్వైతం అద్వైతం విశిస్టాద్వైతం అంటే ఏమిటి?

ద్వైతం అద్వైతం విశిస్టాద్వైతం అంటే ఏమిటి?
.
ద్వైతం : నీవు దైవం ; నేను జీవున్ని ..... 
నీవు గురువు , నేను శిష్యుణ్ణీ అన్నది ద్వైతం .
మధ్వాచార్యులు ప్రవచించిన మతం.
జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.
సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ.... కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
---------------------------------------------------------------------
అద్వైతం : నీవు -నేను ఒక్కటే అన్నది అద్వైతం .
అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, 
జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. 
ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం.
.
చారిత్రకంగా దీని ప్రతిపాదకుడు గౌడపాదాచార్యుడు. 
ఇతడు శంకరుని గురువైన గోవింద భగవత్పాదునకు గురువు. 
అయితే మనకు లభించిన సాహిత్యం ప్రకారం ఈ తత్వానికి 
మూలగ్రంధాలు ప్రస్థానాత్రయం (Prasthanatrayi) — అనగా ఉపనిషత్తులు, భగవద్గీత మరియు బ్రహ్మసూత్రాలకు శంకరుడు రచించిన భాష్యాలు.
.........
శిష్టాద్వైతం : నీవు(దేవుడు) -నేను(జీవి) -
ప్రకృతి(పంచభూతాలు) అన్నవి వేర్వేరు 
అయినా ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి .
విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన వేదాంత దర్శనము.
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
భాషా భారతి's photo.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.