Skip to main content
లావొక్కింతయు లేదు!
అసలు పోతన గారి పద్యం ఇది
.
"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్:
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్:
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్:
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా."
.
ఇక చోద్యం కి వద్దం.
అయినా విడ్డూరం కాకపోతే లావు ఒకింత ఎక్కడైనా ఉంటుందా?
ఉంటే లావు, లేకపోతే సన్నం అంతే కానీ
ఒకింత’ లావు చూడాలంటే నడుము దగ్గర తడుముకోండి
ఒకింత కూడ లేకపోవడం ఉంటుంది – జీరోసైజని
..........
.
లావొక్కింతయు లేదు వేళ్ళ కొనలన్ లాస్యంబుగా పట్టగా
సావొచ్చే పనియౌను దట్టపు పొగల్ సర్దాగ సృష్టింపగా
రావే కమ్మని కైపులెంత కసిగా లాగించి నే పీల్చినా?
పోవో! ఈ సిగరెట్టు ఎందు సరిపోబోదోయి నా చుట్టతో
పొగ చుట్టలెన్ని యైనను సిగరెట్టుకి సాటి రావు అన్నాడు శ్రీశ్రీ
.
కాస్త “లంచ” మి స్తే చలం ని కూడా తిరగేయవచ్చు....
.
Comments
Post a Comment