" జాతి ఏదైనా, మతమేదైనా (మన) జన్మకు కారణం అమ్మే,

" జాతి ఏదైనా, మతమేదైనా (మన) జన్మకు కారణం అమ్మే,

అమ్మలేని జన్మ ఉండదు, అమ్మ ని గౌరవించని , ప్రేమించని వ్యక్తులు మనుషులు కాదు.

అమ్మ పాదాలదగ్గర స్వర్గం ఉందని నమ్ముదాం, అమ్మ అనే కమ్మదనాన్ని ఆస్వాదిద్దాం ...M.F."

.

అమ్మను మించిన దైవం లేదు అమ్మ ఎవరికైనా అమ్మే

తల్లులందరికి నా పాదాభి వందనాలు తల్లిని దైవంగా భావించమన్నారు మనఋషులు. అంటే దైవాన్ని ఆరాధించినట్లు తల్లిని చూడమన్నారు. దాని అర్థం తల్లియే దైవము. మరొక దైవము అవసరము లేదు అని అర్థం కాదు. తల్లి దైవం కాలేదు సర్వజ్ఞత్వది లక్షణాలు ఆమెలో లేవు. కానీ, దైవంలాగా తల్లిని చూసుకోవాలి అనేదే తాత్పర్యము. (మాతాదేవో యస్య సః దేవతావహ్ ఉపాస్యా ఏతే ఇత్యర్థః)

. అమ్మానాన్నల్ని మరచిపోవద్దు అంతే. అమ్మ ఇచ్చిన దేహంతో తింటున్నాం, తిరుగుతున్నాం. అమ్మను మరచిపోవటం అన్యాయం, అధర్మం.

మన దేహానికి తల్లి ఉపాదానకారణమైతే తండ్రి నిమిత్తకారణంగా ఉన్నాడు. తండ్రి పోషణలోనే పెరిగాము. మనం పెరగటానికి చేసే ప్రయత్నంలో తండ్రి అన్నివిధాలా తరిగిపోయాడు, కరిగిపోయాడు. తండ్రి ఋణం తీర్చుకోలేము. దైవంలాగా తండ్రిని భావించాలి, ఆరాధించాలి.

ప్రారబ్ధ ఫలంగా ప్రాప్తించిన దేహాన్ని తల్లిదండ్రులు పోషిస్తే, పురుషార్థ సాధను అనుకూలంగా మనస్సును ఆచార్యుడు పోషించాడు. మనస్సులో విలువలు నింపాడు. బుద్ధిలో వెలుగులు దించాడు. బ్రతుకును భవ్యంగా, దివ్యంగా మార్చాడు. ఆశలులేని వాడు ఆచార్యుడు. ఆయన ఋణాన్ని తీర్చుకోలేము. అందుకే రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. దేవుడికి దణ్ణం పెట్టినట్లు ఆచార్యునికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తున్నాం.

ఒక చిన్న విత్తనాన్ని మనం భూమిలో నాటితే అది పెరిగి మొలకై, మొక్కై, మ్రానై, ఫల పుష్పాదుల్ని అందిస్తోంది. అలా కావటానికి భూమి, వాయువు, జలము, సూర్యరశ్మి, ఆకాశము ఇలా ఎన్నో కారణాలుగా కనిపిస్తున్నాయి. బీజంలాగా తల్లిగర్భంలో పడి ఉండిన మనం నేడు లేదా ఓనాడు మహావృక్షాలై జీవన ఫలాలతో శోభిస్తున్నామంటే భూదేవి సహనంతో శక్తితో తల్లి మనల్ని ధరించింది, భరించింది. వాయువులాగా సంచరించి తండ్రి మనకొరకు ఆర్జించి పోషించాడు. జ్ఞానజలంతో ఆచార్యుడు బుద్ధిని తడిపి బ్రతుకును పండించాడు.

దైవదర్శనంతో మన బ్రతుకులు తరించిపోవడానికి ఈమువ్వురు ప్రధానంగా గోచరిస్తున్నారు. కనుక తల్లి, తండ్రి, గురువు, దైవము అని క్రమపరచారు. తల్లితండ్రి, గురువు సహకారంతో ఆశీస్సులతో మనం దైవాన్ని దర్శిస్తాము అని అర్థము. మరోవిధంగా చెబితే ఈమువ్వురు దేవతలను మనకనుగ్రహించిన దైవానికి మనం సదా ఋణపడియున్నాం. ఆమహాత్ముని దర్శనానికి అన్నివైపులా చూస్తున్నాం.

నేను ఈలోకానికి వచ్చాను. ఇక్కడ ఉంటున్నాను. ఈలోకం ఒకటి ఉంది అని నాకు తెలుసా?ఈలోకంలోనే నేను వసిస్తున్నా, ప్రక్క ఇంటిలో ఎవరున్నారో నాకు తెలియదు. అలాంటప్పుడు ఈలోకానికి రాకముందు ఈలోకమున్నట్లు నాకు తెలుసా? తెలియదు. తెలియని నేను ఈలోకానికి ఎలావచ్చాను? ఎవరో పంపితే వచ్చాను. ఎవరు పంపితే వచ్చాను? భగవంతుడు పంపితే వచ్చాను. మరి, నన్ను ఈలోకానికి పంపిన భగవంతుడు నన్ను చూడటానికి రాడా? రాకుండా ఎలాఉంటాడు? పిల్లల్ని రెసిదెన్షియల్ పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులు అప్పుడప్పుడు వెళ్ళి చూడకుండా ఉన్నారా? చూడకుండా ఉండగలరా? ఆమాత్రం ప్రేమ భగవంతుడికి ఆయన బిడ్డల మీద ఉండదా? కనుక నావద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని దైవంలా చూసుకుంటాను. అతిథిదేవోభవ! పరమాత్మ అతిథిగా రావచ్చు. ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు. వచ్చినవాడు భగవంతుడైతే అన్నం పెడితే సరిపోతుందా? అందుకే దణ్ణం కూడా పెడతాము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!