Skip to main content
పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 8 /5/16. )
.
పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 8 /5/16. )
.
ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొక్కడై తోచు పో
లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూ
పకుడై యొప్పుచునుండునట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై
.
(పదవిభాగం: ఒక, సూర్యుండు, సమస్త, జీవులకు, తాను, ఒక్కొక్కడై, తోచు, పోలికన్,
ఏ, దేవుడు, సర్వకాలము, మహాలీలన్, నిజ, ఉత్పన్న, జన్య, కదంబంబుల,
హృత్, సరోరుహములన్, నానా, విధానూన, రూపకుడై, ఒప్పుచున్, ఉండునట్టి, హరిన్,
నే, ప్రార్థింతు, శుద్ధుండనై.)
.
భావం: ఒకే సూర్యుడు, సమస్త జీవులకు వేర్వేరుగా ఒక్కొక్క సూర్యుడు ఉన్నట్లు కనిపిస్తాడు.
.
ఏ దేవుడు తన అద్భుతమైన లీలలతో, తన నుండి పుట్టిన జీవసమూహాల మనస్సులలో
.
అనేక రూపాలలో ఉంటాడో, అటువంటి దేవుడైన శ్రీకృష్ణుడిని, నేను మంచిమనసుతో
.
ప్రార్థిస్తాను.
Comments
Post a Comment