తలపాగా! (జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ.)

తలపాగా!

(జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ.)

.

అలోమల్లో రాగూల మల్లు

రాగూల కేసినా రంగూపురి సాప

సాపాదిరుగోలె సౌకారు కోట

కోట్లెన్ని కొమ్మాలెన్ని

కొమ్మాల సందూన మర్రియాకు

మర్రి మర్రీకే జిల్లేడాకు

జిల్లేడాకూల బెల్లముండె

నీకూ దొరికాక నక్కాకు దొరికె

అటుగుంజి ఇటుగుంజి జివ్వేడాకె

జివ్వోడి కాపుల్‌ మరి మంచోళ్ళు

బతుకూమాని రెండూ మామిళ్ళిచ్చిరి

మామిళ్ళ దర్మాన పూతా గూసె

పూతాదర్మాన కాతాగాసె

కాతాదర్మాన పనలేమక్కె

పనలా దర్మాన పైకాలొచ్చె

పైకాల దర్మాన పాగాలొచ్చె

పాగా జుట్టుకొని పల్లెకు పోతే

పల్లె కుక్కాలన్ని బవ్‌ బవ్‌ మనె

అప్పుడే నాకడుపు జల్లూమనె

చిత్రం...వడ్డాది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!