కల్యాణి .... రాగరంజని.!

కల్యాణి .... రాగరంజని.!

.

కల్యాణి రాగం సంపూర్ణ రాగం .అంటే 

ఇందులో షడ్జమం ,చతుశ్రుతి రిషభం,అంతర గాంధారం ,ప్రతి మధ్యమం,పంచమం,చతుశ్రుతి దైవతం,కైశికి నిషాదం షడ్జమం అనే ఏడు స్వరాలు ఉంటాయి .

ఇవన్నీ తీవ్ర స్వరాలు(షార్ప్ నోట్స్) .అందువల్లే ఈ రాగం వినటానికి శ్రావ్యంగా,హాయిగా వుంది మనసును త్వరితం గా రంజింప చేస్తుంది..

ఈ రాగం కీర్తనలు,కృతులుతిల్లాన లు ,జావళీలు,పదాలు శ్లోకాలు,పద్యాలు,దండకాలు,భక్తిగీతాలు,భజనలు గజళ్ళు,శృంగార గీతాలు ఎలా అన్నీ రకాల సంగీత ప్రక్రియలకీ అనువైన రాగం.

చలన చిత్రసంగీతంలో 1950 నుండి 1980 వరకు వచ్చిన చిత్రాలన్నింటిలోనూ ఈ రాగం వినిపించేది.

ఈ రాగం లో చలన చిత్రాల వల్ల బాగా ప్రాచుర్యం పొందిన

త్యాగ రాజ కీర్తనలు `నిధి చాలా సుఖమా'(ఈ కీర్తనని నాగయ్య `త్యాగయ్య' చిత్రంలో పాడారు) ,

ఏ తావునరా..నిలకడ నీకు' (ఈ కీర్తనని వరుడు కావాలి లో భానుమతి పాడారు).

సినిమాలలో మన సంగీత దర్శకులు అద్భుత మైన ప్రయోగాలు చేసి అన్నీ రకాల భావాలూ ఈ రాగంలో పలికించి ఈ రాగం యొక్క బహుముఖ సౌందర్యాన్ని ఆవిష్కరింప చేసేరు.

ఈ రాగంలో స్వరపరచిన భక్తీ గీతాలు:

(స్వచ్చమైన కల్యాణి కి ఒక మంచి ఉదాహరణ )

రావే నా చెలియా (మంచి మనసుకు మంచి రోజుల్లు - సంగీతం,గానం :ఘంటసాల )(స్వచ్చమైన కల్యాణి కి ఒక మంచి ఉదాహరణ )

చల్లని వెన్నెల లో చక్కని కన్నె సమీపంలో (సంతానం -సుసర్ల దక్షిణా మూర్తి -ఘంటసాల

ఎవరివో నీవెవరివో (పునర్జన్మ-టి.వి.చలపతి రావు -ఘంటసాల)

బహుదూరపు బాటసారి (ప్రైవేటు రికార్డు -సగీతం,గానం :ఘంటసాల )

జోరు మీదున్నావు తుమ్మెదా (కల్యాణి -రమేష్ నాయుడు-సుశీల)

(మంచి కళ్యాణికి ఒక చక్కని ఉదాహరణ )

నవ రాగానికే నడకలు వచ్చేనూ కల్యాణి -రమేష్ నాయుడు -బాలు,సుశీల)

(మంచి కళ్యాణికి ఒక చక్కని ఉదాహరణ )

మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన (

యుగళ గీతాలు:

మనసులోని కోరికా తెలుసు ప్రేమ మాలికా (భీష్మ -సాలూరు రాజేశ్వర రావు -పి.బి.శ్రీనివాస్ -సుశీల)

నాదు ప్రేమ భాగ్య రాసి నీవే ప్రేయసి(భక్త జయదేవ -సాలూరు రాజేశ్వర రావు-ఘంటసాల ,సుశీల)

కిల కిల నవ్వులు కురియగా (చదువుకున్న అమ్మాయిలు--సాలూరు రాజేశ్వర రావు-ఘంటసాల,సుశీల) 

చెలికాడు నిన్నే రమ్మని పిలువా (కులగోత్రాలు -సాలూరు రాజేశ్వర రావు -ఘటసాల,సుశీల)

జగమే మారినది మధురముగా ఈవేళా...(దేశ ద్రోహులు-సాలూరు రాజేశ్వర రావు -ఘంటసాల,సుశీల)

మధుర భావాల సుమమాల (జైజవాన్-సాలూరు రాజేస్వ్వర'` రావు -ఘంటసాల -సుశీల)

చక్కని వాద్య గోష్టి తో ,మధురమైన కల్యాణి రాగంలో ఒక నిత్యవసంత గీతం ఇది.

చిగురులు వేసిన కలలన్ని (పూలరంగడు - రాజేశ్వర రావు-జయదేఅవ్,సుశీల)

తోటలో నారాజు తొంగి చూసెను నాడు (ఏకవీర -మహదేవన్-ఘంటసాల,సుశీల)..

.....

హిందీ చిత్రాలలో యమన్/కల్యాణ్ 0రాగం లో బాగా పొపులర్ అయిన పాటలు :

జియలేగాయోజి మోర్ సావరియన్ (అన్ పద్-మదన్మోహన్-లత)

తుమ్బిన్ జీవన్ కైసే బీతాన్ (అనిత-లక్ష్మికాంట్ ,ప్యారేలాల్ -ముకేష్)

(an excellent song from the composition and rendering view point)

దో సితారోంక జమీన్ పర్ హై మిలన్ ఆజ్ కి రాత్ (కోహినూర్-నౌషాద్-రఫీ,లత)

సౌసాల్ పహేలే ముజ్హే తుమ్సే ప్యార్ తా (జబ్ ప్యార్ కిసిసే హోతాహై -శంకర్ జైకిషన్ -రఫీ,లత)

బీతీన బీతా యే రైనా బిర్హా సే హోతే నైనా (పరిచయ్-అర.డి.బర్మన్ -లత,భూపేంద్ర)

నాం గూం జాఏగా ,చెహ్ర ఏ బదల్ జాఏగా (కినారా-అర.డి.బర్మన్ -లత,భూపేంద్ర)

దిలే బెతాబ్ కో సీనేసే లగానా హోగా (పాల్కి-నౌషాద్ -రఫీ,సుమన్ కల్యాన్పుర్)

రే మన్ సుర్ మే గా (లాల్ పతర్-శంకర్ జైకిషన్ -మన్నా డే)

(స్వచ్చమైన కల్యాణి రాగానికి ఒక మంచి ఉదాహరణ)

ఇస్ మోడ్ పే జాతే హై(అంది-ఆర్.డి.బర్మన్ -కిశోరే -లత )

ముసం హాయ్ ఆశికానా (పాకీజా -గులాం అలీ-లతా)(a song composed in typical Pursian style of rag yaman)

చందన్ స బదన్ చంచల్ చిత్ వన్ (సరస్వతి చంద్ర -కల్యాణ్ జి ,ఆనంద్ జి - ముకేష్-మురళీమోహన్ గాత్రంలో)

ఘజల్:

జిందగీ భర్ నహి భూలేగి ఓ బర్సాత్ కి రాత్ ( -బర్సాత్ కి రాత్-రవి -రఫీ -మురళీమోహన్ గాత్రంలో)

రంజిష్ హీ సహీ దిల్హి దుఖానే కే లీయే ఆ (ప్రఖ్యాత ఘజల్ గాయకుడు పాడిన ఒక మంచి ఘజల్)

విషాద గీతాలు :

మధ్యమ ,నిషాద స్వరాలకి ప్రాధాన్యత ఇస్తూ కంపిత స్వరాలుగా ప్రయోగించడం ద్వారా ,పంచమ ,షడ్జమాలని కొద్దిగా స్ప్రుసించడం ద్వారా కల్యాణి రాగంలో విషాద చాయలు కల్పించవచ్చని పెద్దలు చెప్తారు.

ముఖేష్ స్లో టెంపో లో పాడిన `అంసూ భరీ హాయ్ '(పర్వరిష్-దత్తరాం),

భూలీ హుయి యాదే ( సంజోగ్ -మదన్

మోహన్ ).ఈ రెండు పాటలూ మంచి` కల్యాణి 'కి ఉదాహరణలు.

పెను చీకటాయే లోకం (మాంగల్య బలం -మాస్టర్ వేణు-ఘంటసాల )

కామెడీ సాంగ్ :

మై తేరే ప్యార్ క బీమార్ హూన్ క్యా అర్జ్ కరూన్ 

(లవ్ ఇన్ టోక్యో -శంకర్ జైకిషన్ -మన్నా డే)

దండకం:

మాణిక్య వీణాం ఉపలాలయన్తీం (sankaraabharanam)

పద్యం :

రంగారు బంగారు (లవకుశ-సంగీతం ,గానం -ఘంటసాల

ఈ పద్యం మంచి కల్యాణి కి ఉదాహరణ గా పేర్కొనవచ్చు

`సింధుభైరవి 'చిత్రం కోసం ఇలయ రాజా ప్రయోగాత్మకంగా ఒక్క ఆరోహణ స్వరాలనే ఉపయోగిస్తూ ` కల్యాణ యే''అనే ఒక చక్కని మెలోడి ని ఇచ్చారు

.సుప్రసిద్ధమైన ఒక ఇంగ్లీష్ పాటని తీసుకుని దానిని కల్యాణి రాగం లో స్వరబద్ధం చేసి రాక్,జాజ్ మిళితం చేసి మురళి కృష్ణ ప్రయోగాత్మకంగా రికార్డు చేసిన పాట ఇది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!