అంత్యప్రాసాలంకారం!

అంత్యప్రాసాలంకారం!

.

మొదటి పాదం చివర ముగిసిన అక్షారసమూహంతోనే 

తరువాతి పాదం కూడా ముగిస్తే అది అంత్యప్రాసం అవుతుంది.

వివరణ: సాధారణంగా ప్రాస అంటే రెండో అక్షరానికి వర్తిస్తుంది.

గమనిస్తే అన్నమయ్యకీర్తనలలో ప్రతిచర్ణంలోనూ రెండో అక్షరం 

ఒకే గుణింతంలోనుండి వస్తుంది. 

ఉదాహరణకు "ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు, 

తిద్దరాని మహిమల దేవకీ సుతుడు" అనే పల్లవిని పరికిస్తే 

"ముద్దు, తిద్ద" - ఈ రెండు శబ్దాలకూ ప్రాస కుదిరింది. 

అలాగే సుమతీ శతకంలో (కందపద్యాలలో) ప్రతీ పాదంలోనూ 

రెండో అక్షరానికి ప్రాస కుదురుతుంది. 

ఉదాహరణకు: "అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు" లో 

"క్క" తో ప్రాస కుదురింది. 

ఇదే నియమం పాదంలో ఆఖరి అక్షరానికి వాడితే అది అంత్యప్రాసం అవుతుంది. భావకవిత్వంలో పాదం బదులు "వాక్యం" చివరి అక్షరసమూహాన్ని పరిగణించడం రివాజు.

.

ఉదా:

సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం, 

ప్రతిపొద్దూ ప్రణయావేశం, పెదవులపై హాసం

సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం, ప్రతిరోజూ ఒక శ్రీకారం, పరవశశృంగారం

. ముక్కలైపోయిన గుండెలగురించి గుక్కతిప్పుకోకుండా చెప్పే "మనసు-కవి", "మన-సుకవి" ఆత్రేయగారు, ఈ పాటలో ఒక్కటైపోయిన మనసుల గురించి చక్కగా చెప్పారు . ఒక్కో మాటలోనూ ఎంతో లోతైన భావం ఉంది, 

ఎంతో చక్కందనం ఉంది. 

అందుకే ఈ అంత్యప్రాస బాగా కుదిరింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!