కాక మానురాయ నీకు తగుర !

కాక మానురాయ నీకు తగుర !

.

అసలు పేరు కాకమాని రాయ మూర్తి.అని అంటారు. 

రామకృష్ణుడి కీ భట్టుమూర్తికీ అసలు పడేది కాదు.ఒకసారి 

రామకృష్ణుడు ఈ క్రింది పద్యం చెప్పాడట.సభలో.

.

"అల్లసాని వారి అల్లిక జిగిబిగి 

ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు 

పాండురంగ విభుని పద గుంభనంబు 

కాక మానురాయ నీకు తగుర "

.

పైవన్నీ కాకమాను రాయని కవిత్వం లో వున్నాయని ఒక అర్థం.

తనను యిన్నాళ్ళకు రామకృష్ణుడు పొగడి నాడని భట్టుమూర్తి 

సంతోష పడ్డాడట.బయటకు వెళ్ళాక మిగతా పండితులందరూ 

అదేమిటి నీకూ భట్టుమూర్తి కీ అసలు పడదు కదా! 

అంతలా మీకందరికీ సమానమంటూ అలా పొగిడా వేమిటి?అడిగారట అందుకు రామకృష్ణుడు నవ్వి 

మీకు తెలీదనుకుంటా అతని వీపులో తామర (రోగం)వుంది అందుకే అతనికి 

జిల పెడుతూ వుంటుంది.మీరు గమనించారో లేదో ఎప్పుడూ అతను తన తోటలోని చెట్టుకు వీపు రుద్దుతూ వుంటాడు.సభలో కూడా అతను ఒక స్థంభం దగ్గర కూచుంటాడు.ఎప్ప్పుడూ ఆ స్తంభానికి వీపు రాస్తుంటాడు.

.

అందుకే మానుకు (చెట్టుకు)రాసుకోవడానికే నీకు తగును అని అర్థం వచ్చేట్టు నేను అలా చెప్పాను అని చెప్తే అందరూ బాగా నవ్వ్వుకున్నారట.

తర్వాత వాళ్ళు అతను తోటలో చొక్కా లేకుండా తిరుగుతూ చెట్టుకు వీపు రుద్దుతుండడం చాటు నుంచి చూసి అతనికి తామర వున్నట్టు నిర్ధారణ చేసుకున్నారట.ఈ విషయం భట్టుమూర్తికి తెలిసి మండి పడ్డాడని కథనం .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!