పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 5 /5/16. )

పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 5 /5/16. )
.
ఓయమ్మ నీ కుమారుడు
మాయిండ్లలొ పాలుపెరుగు మననీడమ్మా
.
పోయెద మెక్కడికైనను
మా యన్నల సురభులాన మంజులవాణీ"
.
తెలుగులో ఇంతకంటే సరళమైన పద్యం ఉండదు .
.
ఒక్క సురభులాన అన్న పదం తప్పితే
మిగిలీన పదాలన్నీ మనం ప్రతిదినం వాడేవే
. శ్రీకృష్ణుడు చిలిపి పనులు చేస్తున్నాడు . వెన్న కనిపిస్తే వదలడు
. పాలు పెరుగు మాట వేరే చెప్పవలసిన పని లేదు .
గొల్లభామలకు ఏం చేయాలో తోచలేదు . యశోదమ్మ దగ్గరకు వెళ్ళి
” అమ్మా ! నీ కొడుకు మా ఇళ్ళలో పాలూ , పెరుగూ దక్కనీయడం లేదు . ఈ బాధలు భరించలేము . . ఇక పిల్లాపాపలతో ఎక్కడికైనా వెళ్ళిపోతాం . మా ఆవులమీద ఒట్టు ” అని మొరపెట్టుకున్నారు .
ఇవేవో మన ఇళ్ళల్లో మాట్లాడుకున్నట్టుగా లేవూ ?
.
ఈ పద్యం శ్రీకృష్ణుని కాలంలోని ప్రజల అమాయకపుదనాన్ని ,
ముగ్ధత్వాన్ని తెలియజేస్తుంది
. ఇంత సరళంగా మన అలోచనలుంటే
మన జీవితం కూడా చింతలకూ చీకాకులకూ దూరమవుతుంది .

x

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!