గజేంద్ర మోక్షం పద్యాలు.
గజేంద్ర మోక్షం పద్యాలు. . కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! . కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! . లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! . ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! . లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !! . అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి హ్వల నాగేంద్ర...

ప్రముఖ ఆకాశవాణి ఆర్టిస్ట్ వింజమూరి సీతాదేవి గారు కాలం చేసారని ఈ రోజు వార్తాపత్రికలో చదివాను. ఆమె బంధువు వింజమూరి వెంకట అప్పారావు గారు ఆ వార్త ఫేస్బుక్ లో తెలియజేసారని కూడా పత్రికలో వ్రాసారు. మీరేనా?
ReplyDeleteఆమె మృతి పట్ల మా సంతాపం తెలియజేసుకుంటున్నాము.