Posts

Showing posts from April, 2019

🌹💥అడవి రాముడు 💥🌹

Image
🌹💥అడవి రాముడు 💥🌹 -ఆడవి రాముడు  సినిమా  విశేషాలు . 23-04-2017 ఆంధ్ర జ్యోతి .(డా: రెంటాల జయదేవ్ గారు )  1. బాక్సాఫీస్ రాముడు ఎన్టీయార్‌ సాధారణంగా ఒక గిరి గీసుకొని, సినిమాలు చేస్తుంటారు. మిగిలిన చాలామంది తారల లాగా ఆయన గనక గిరి దాటి నటిస్తే... ఇక ఆ సినిమా ఒక ప్రభంజనమే! - ప్రసిద్ధ దర్శక - నిర్మాత స్వర్గీయ బి.ఎన. రెడ్డి 1970ల తొలినాళ్ళలో ఎన్టీయార్‌ మీద ప్రత్యేక సంచిక వేస్తున్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అప్పట్లో బి.ఎన్‌.రెడ్డి ఈ మాటలు అన్నారు. ఆ తరువాత కొన్నేళ్ళకు...ఎన్టీయార్‌కు అయిదున్నర పదుల ఏళ్ళు మీద పడ్డాయి. కెరీర్‌ జోరుగా సాగుతున్నా... ఎక్కడో చిన్న స్తబ్ధత. నవరసాల్లో ఏదైనా పండించగల అభినయ ప్రతిభ... అపారమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న ఒక స్టార్‌ హీరో ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఏది ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు? సరిగ్గా అదే టైమ్‌లో కేవలం మూడే సినిమాల అనుభవమున్న ఒక యువ దర్శకుడికి ఎన్టీయార్‌ సినిమా చేసే అరుదైన ఛాన్స్‌... ఇంకా చెప్పాలంటే అదృష్టం తలుపు తట్టింది. అంతే... అప్పటికి సరైన హిట్లు కూడా లేని ఆ యువకుడు బోలెడంత హోమ్‌ వర్క్‌ చేశాడు. ఒక స్టార్‌ హీరోకు ఎలాంటి కథ, క

Ramuni Avatharam - "Telugu Movie Full Video Songs" - BhooKailas(NTR,ANR,...

💥🙏🏿‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ 🙏🏿💥 (Sri Anappindi Suryalakshmi Kameswara Rao)గారి వ్యాసం .) 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥  శ్రీ రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. ఇది నక్షత్ర క్రమంలో ఏడవది. శ్రీ రాముడు కూడా మహా విష్ణువెత్తిన ఏడవ అవతారం. పునర్వసు పేరు సూచిస్తున్నట్టే రాముడు కూడా ‘పునర్వాసం’ ఏర్పరచుకున్నాడు.  ‘భూ కైలాస్, 1958’ చిత్రంలో సముద్రాల వారు నారద పరంగా చెప్పిన ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం’ అనే భవిష్య వాణిలో మనకు వినిపించేవి కూడా ఏడు చరణ ధ్వనులే. మొత్తం రామాయణాన్ని 7 నిమిషాల్లో ఎంత అందం గా చెప్పాడో కదా మహానుభావుడు. కొంచం ప్రశాంతంగా భూ కైలాస్ సినిమా లోని "రాముని అవతారం" పాట వింటే , నిజంగా సముద్రాల గారు ఎన్ని సార్లు రామ దర్శనం చేస్తే ఈ పాట రాయ గలిగారో కదా అని అనిపించక మానదు. పార్వతి మాత శివ సాన్నిహిత్యానికి దూరం కావడం "విష్ణు" మాయ ప్రభావమే అని నారదుడు చెప్పగా "తనకు" కలిగిన కష్టం ఆ నారాయణుడికి కూడా కలగాలి అని శాప వచనం ఇచ్చిన సందర్భంలో, ఇదే ఒక మహత్తర లోక కళ్యాణంకు మార్గం అవుతుంది అని నారదుని భక్తా వేశం రామావతార గ

శ్రీ కృష్ణ కర్ణామృతం!

Image
శ్రీ కృష్ణ కర్ణామృతం! 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః! 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 ఈ శ్లోకం ఎక్కడో విన్నట్లున్నది కదా! గాన గంధర్వుడైన మహానుభావుడు ఘంటసాల గారి మధుర గాత్రంలో ఆంధ్రదేశమంతటా మారుమోగిన “పాండురంగమహత్యం” సినిమాలోని  “జయ కృష్ణా ముకుందా మురారే” అనే పాట గుర్తుంది కదా? ఆపాటలో సమయోచితంగా, సందర్భోచితంగా వాడిన శ్లోకమిది. మరి ఈ శ్లోకానికి మూలమెక్కడుంది? సంస్కృత సాహిత్యంలో ప్రముఖ స్థానమలంకరించిన శ్రీ కృష్ణుని స్తుతి కావ్యం “శ్రీకృష్ణకర్ణామృతం”లోది ఈ శ్లోకం. కృష్ణభక్తిని మధురంగా గానం చేసే గ్రంధాలలో విశిష్టమైన జయదేవుని “గీత గోవిందమూ”, నారాయణ తీర్ధుల “కృష్ణలీలా తరంగిణీ,” “క్షేత్రయ్య పదాలూ” వీటి కోవలోకి వచ్చేదే “శ్రీ కృష్ణకర్ణామృతం”. ఈ నాలుగు గ్రంధాలూ ఆంధ్రదేశం నాలుగు మూలలా నిన్న మొన్నటి వరకూ పండిత పామరులు చాలామంది నోళ్ళల్లో నానుతూ ఉండేవి. మన దురదృష్

🌹🌺 ముళ్ళపూడి వారి అనువాదాలు .🌺🌹

Image
🌹🌺 ముళ్ళపూడి వారి అనువాదాలు .🌺🌹 నా చిన్నప్పుడు ,   నేను చదివిన మొదటి నవల ఆంధ్ర పత్రిక లో సీరియల్ గ వచ్చిన నవల స్కార్లెట్ పింపర్నల్.  రాబిన్ హుడ్ తరహాలో ఎక్కడ అన్యాయం జరిగినా ఒక అజ్నాత వ్యక్తి వచ్చి కాపాడుతుంటాడు. తన గుర్తుగా scarlet pimparnal పూవు వదలి పెడుతుంటాడు. ఒక అమాయకుడు కూడా ఉంటాడు. పిరికివాడు. నాయకి అతడిని ఆట పట్టిస్తూ ఉంటుంది. నవల చివర్లో ఆ పిరికివాడే అజ్నాత వ్యక్తి అని తెలియడం thrilling గా ఉండేది. కొంచెం పెద్దయ్యాక ఎన్ టి ఆర్ , భానుమతి నటించిన అగ్గి రాముడు సినిమా చూసినపుడు నాకు scarlet pimparnal కధ గుర్తుకు వచ్చింది. అలాగే Count of Monte Cristo by Alexander Dumas. ఇంకొక నవల around the world in 80 days by Jules Verne. 80 రోజులలో భూ ప్రదక్షిణ పేరుతో ముళ్ళపూడి వెంకట రమణ గారి అనువాదం.‌ S పార్ధసారధి అన్న మారు పేరుతో. (21-12-1960 to 12-07-1961 ఆంధ్ర సచిత్ర వార పత్రికలలో) మొన్న 1957 లో వచ్చిన English movie చూసేను. కొంచెం కష్టపడి ముళ్ళపూడి అనువాదపు నవల తెప్పించ గలిగేను, లోగిలి వారి ధర్మమా అని. మరొక రెండు రోజులు కాలక్షేపం. లండన్ to సూయజ్ 7రోజులు సూయజ్

నటభూషణం-నాగభూషణం.💥🌹 👉🏿విలనిజానికి భూషణం నాగభూషణం..........

Image
నటభూషణం-నాగభూషణం.💥🌹 👉🏿విలనిజానికి భూషణం నాగభూషణం.......... గుంటూరు గాంధీ పార్కులో నాటకం జరుగుతోంది... గాంధీ పార్కు అని పెట్టారు రామా... కన్ను చించుకు చూసినా గాంధీ బొమ్మ కనిపించదు రామా.. అంటూ  డైలాగ్ కొట్టగానే చప్పట్లు మారు మోగేవి. బందరులో ప్రదర్శన జరుగుతోంది... ఓ పాత్ర వచ్చి ఏం జబ్బు నాయనా.. అనడగుతుంది. బ్రహ్మానందరెడ్డిని కులం అడిగినట్టుంది రామా.. చూస్తుంటే ఏం జబ్బో తెలియడం లేదా అమ్మా.. అంటాడు. ఇలా ఏ ఏరియాలో నాటక ప్రదర్శన జరిగితే.. ఆ ఏరియాకు చెందిన విశేషాలను డైలాగుల్లో జొప్పిస్తూ...  చప్పట్ల మీద చప్పట్లు కొట్టించుకుంటాడు. ఆయన ఇంటి పేరు ఏమిటో పెద్దగా ఎవరూ తెలియదు కానీ రక్తకన్నీరు అనడం ఆలస్యం... నాగభూషణం కదూ అని టక్కున గుర్తుపట్టేస్తారు. జయంతి నాడు ఓ సారి ఆయన్ను తలుచుకుంటే ఆ కాలపు సినీ మాధుర్యం ఏమిటో అవగతమవుతుంది. ఓ అరగంట టైం తీసుకుంటుంది... విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. చక్రవర్తుల నాగభూషణం పూర్తి పేరు. ఏప్రిల్ 19న నెల్లూరులో జననం.. ఇంటర్మీడియట్ వరకూ సజావుగా సాగిన చదువు.... ఆర్ధిక లోపం కారణంగ

🌹💥పచ్చి నిజాలు.💥🌹

Image
🌹💥పచ్చి నిజాలు.💥🌹 🔥🔥 success ఉన్నోడి వెనుకే ఆడవారు అందం ఉన్న అమ్మాయినే అబ్బాయిలు చూస్తారు వారితో మాట్లాడాలని తహ తహ లాడుతారు  . అదే ఒక అమ్మాయి handicaped అయితే ఎవ్వడూ ఆ అమ్మాయిని ప్రేమించడు 🔥🔥 ప్రపంచంలో నిజమైన ప్రేమ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారు ప్రేమించిన వ్యక్తుల నుండి ఆశిస్తున్నారు కాబట్టి . 🔥🔥 ఇక భర్త భార్య ల విషయానికి వస్తే ఎవ్వరిది ఆదర్శ దాంపత్యం కాదు  ఎందుకంటే కట్నం తీసుకోనిది ఈయన పెళ్ళి చేసుకోడు  జాబ్ లేనిది ఈమె పెళ్ళి చేసుకోలేదు. 🔥🔥. ఇంకో నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఫర్ ఫెక్ట్ కాదు . 🔥🔥 నీకు బాధలు ఉండొద్దు అంటే ఎవ్వర్ని సీరియస్ గా తీసుకోకు  ఎవరి కోసమో మారకు 🔥🔥 నీ స్వేచ్చా ప్రపంచాన్ని వదులుకోకు  మొదట్లో బాగానే ఉంటుంది తర్వాతే తెలుస్తుంది అనవసరంగా నా ప్రపంచాన్ని వదులుకున్నానే అని  🔥🔥 భవిష్యత్త్ లేదన్న వాడు మూర్ఖుడు  గతాన్ని మర్చిపో అన్నవాడు అమాయకుడు  ఎందుకంటే ప్రపంచం నడుస్తుంది గతం నుండి భవిష్యత్త్ కొరకే. 🔥🔥🔥🔥

👉🏿ఒక పెళ్ళికాని ప్రసాదు లాజిక్ ☺️

Image
👉🏿ఒక పెళ్ళికాని ప్రసాదు లాజిక్ ☺️ 💥💥💥 . " మన జీవితం కార్లో ప్రయాణం చెయ్యడం లాంటిది . మనం ఒక్కళ్ళం వెళ్తే హ్యాపీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు... ఎంత స్పీడ్తో కావాలంటే అంత స్పీడ్తో వెళ్ళచ్చు.. అలా కాదని పెళ్ళి చేసుకుని పెళ్ళం పిల్లలని ఎక్కించుకుంటే,,, " నాన్నా...!!! అక్కడకి తీసుకెళ్ళు ఇక్కడకి తీసుకెళ్ళూ " అని పిల్లలూ,,, " ఏవండీ అంత స్పీడ్ ఎందుకండీ కొంచం స్లోగా వెళ్ళండి " అని భార్యా సతాయిస్తూ మనలని కంట్రోల్ చేస్తూ ఉంటారు .. అప్పుడు నేను ఆ కార్కి డ్రైవర్లా ఉంటాను తప్ప ఓనర్లా అనిపించను,,, నా కార్కి నేను ఓనర్గా మాత్రమే ఉండాలనుకుంటున్నా తప్ప డ్రైవర్గా  కాదు....!!! . అందుకే నేను పెళ్ళి చేసుకోనండీ "