Posts

Showing posts from August, 2018

కొల్హాపూర్ - శ్రీ మహా లక్ష్మీ అమ్మవారు🔔

Image
కొల్హాపూర్ - శ్రీ మహా లక్ష్మీ అమ్మవారు🔔 💥 శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం భారతదేశం లోని  మహారాష్ట్ర రాష్ట్రనికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం.  ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. 💥💥 పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. 7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది. 💥💥💥 ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు.  💥💥💥 ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల  వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల

పలుకు తేనియలు - కాళిదాసు కధ !

Image
పలుకు తేనియలు - కాళిదాసు కధ ! భార్య శాపం ఇచ్చిన తరువాత అక్కడ నుండి బయటకు వెళ్ళిన కాళిదాసు వేశ్యాలోలుడౌతాడు. అద్భుతమైన రచనలు చేస్తూ భోజుడి సభలో పండితుడిగా పేరు పొంది ఎన్నెన్నో రచనలు చేస్తాడు. కాని రాజుకు కాళిదాసుకు తరుచుగా వాగ్వివాదాలు జరగటం కాళిదాసు అలిగి రాజ్యం వదిలి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అట్లా ఒకసారి రాజు కోపంలో కాళిదాసుకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. అతను వెళ్ళి ఒక వేశ్య ఇంట తలదాచుకొని అఙ్ఞాతంలో నివసిస్తూ ఉంటాడు. ఆ సమయంలో భోజుడు రామాయణం చంపూ కావ్యం రచిస్తాడు. ఆ కావ్యం కాళిదాసు చదివి సవరణలు చేయాలని ఆయనకు ఆరాటం. కాని కాళిదాసు ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు. కాళిదాసు కవితాప్రాభవం తెలిసిన రాజుగారు ఒక సమస్యా పూరణం చేయమని ప్రకటిస్తాడు. పూరించిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని కూడా అంటాడు. "కుసుమే కుసుమోత్పత్తిః శృయతే న చ దృష్టతే" అంటే ఒక పుష్పం మీద మరో పుష్పం పూసింది అన్న మాట వినటమే కాని ఎక్కడా చూడలేదు. ఈ సమస్యకు పూరణ కేవలం కాళిదాసే చేయగలడు అన్న నమ్మకం రాజుకు. రాజుగారి ప్రకటన చూసిన కాళిదాసుకు ఆశ్రయమిచ్చిన వేశ్యకు దురాశ కలుగుతుంది. ఎట్లాగయినా కాళిదాసు చేత

దయ ఎలా ఉంటుందంటే..!

Image
దయ ఎలా ఉంటుందంటే..! అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మవారొక రోజు చెరువులో జలకాలు ఆడుతున్నదట. స్నానం కానిచ్చి ఒడ్డుకి వచ్చి పర్ణశాలకి దారి తీస్తుండగా, దార్లో ఓ ముల్లు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహు సుకుమారి. కళ్లంట జివ్వున నీళ్ళు చిప్పిల్లాయి. అల్లంత దూరాన ఉన్న రాముల వారిని " స్వామీ..!" అని పిలిచి, పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట. పరుగున వచ్చిన రాముల వారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట. ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ఆ ముల్లును బయటకు లాగి, సీత మొహం వైపు చూసారట.ముల్లు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో! జలజలా నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా "వచ్చేసిందా?" అన్నట్టు చూస్తోందట ఆయన వైపు. ఏడు మల్లెలెత్తు రాకుమారిని అడవులంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు, చేతిలో ఉన్న ముల్లు వైపు క్రోధంగా చూసారట. అది చూపా? అనల బాణమా? ముల్లు భగ్గున మండి బూడిదైపోయిందట. ఇదంతా చూస్తున్న సీతమ్మ వారు " అయ్యో, ఏలే దొరలే కిను

ఆ ముగ్గురు భామల ముచ్చట కధ ☝️ (ముళ్ళపూడి గారి ముచ్చట్లు.) 🐦

Image
ఆ ముగ్గురు భామల ముచ్చట కధ ☝️ (ముళ్ళపూడి గారి ముచ్చట్లు.) 🐦 మీరు నమ్మండి- ఇది నిజం – మా హైకమాండ్ కమిటి సెలక్షన్ పరీక్షల్లో "హేమమాలిని, జయలలితను" కూడా చూసాం.  టెస్టులు తీసాం. వాళ్ళిద్దరూ సినిమాలకి పనికి రారని రూలింగ్ ఇచ్చేశాం! 👩 మొన్నటి హేమమాలిని – నిన్నటి డ్రీం గర్ల్ కాదు- సన్నగా చీపురుపుల్లలా చిటికెనవేలు లావుండేది. మాకు రేకు గ్లాసుల్లో టీ ఇచ్చింది. వాళ్ళమ్మగారు కూడా చెప్పారు- చాన్స్ ఇస్తే ఆపిల్సు, బత్తాయి రసం ఇచ్చి పుష్టిగా చేస్తా నన్నారు. ఐనా మేం ఒప్పుకోలేదు. . తరువాత హేమ(గారు) అనంతస్వామి అనే లాయరు గారి కాంట్రాక్ట్ ద్వారా డ్రీం గర్ల్ గా రూపు ధరించి ఎదిగి రాజకపూర్ తీసిన ‘సపనోం కీ సౌదాగర్’ చిత్రంతో గొప్ప తార అయింది.  ‘షోలే’ లో వసంతి-‘నసంతి’ లాటి వేషాలతో రెండు దశాబ్దాలు (ధర్మేంద్ర) మహారాణిగా ఏలింది.  ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టారే! తన కూతుళ్ళతో పోటీపడి నాట్యం చేయగల గొప్ప నర్తకి. 👩 అలాగే జయలలితకి స్లైయిట్ మెల్ల (అదృష్టం మెల్ల) అన్నారు సెల్వరాజు గారు. ఆమె దరిమిలా తెలుగు తమిళ చిత్రాల్లో సూపర్ స్టార్ అయింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయింది.

ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం

Image
ఏ రోడ్డు చరిత్ర చూచినా, ఏమున్నది గర్వకారణం రహదార్ల చరిత్ర సమస్తం, దూళిధూసర పరిన్యస్తం. రహదారి చరిత్ర సమస్తం, యాతాయత జన సంయుక్తం రహదారి చరిత్ర సమస్తం, పథిక వాహన ప్రయాణ సిక్తం అంటూ కొనసాగించి – భూంకార గర్జిత దిగ్భాగం, చక్రాంగ జ్వలిత సమస్తాంగం రహదారి చరిత్ర సమస్తం, పైజమ్మాలను పాడుచేయడం అని చెపుతారు.

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️🇵🇾️

Image
- స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు! . మాదీ స్వతంత్రదేశం లలితగీతాన్ని రచించినది స్వరపరచినది డా. బాలాంత్రపు రజనీకాంతరావుగారు. బిలహరి రాగం ఆది తాళంలో (కహరువా తాళం హిందూస్తానీలో) కూర్చారు. టంగుటూరి సూర్యకుమారి గానం చేయగా ఎంతో ప్రాచుర్యం పొందింది. పాట సాహిత్యo పల్లవి: మాదీ స్వతంత్ర దేశం - మాదీ స్వతంత్ర జాతి భరతదేశమే మా దేశం - భారతీయులం మా ప్రజలం || మాదీ స్వతంత్ర దేశం || చరణం 1: వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి || మాదీ స్వతంత్ర దేశం|| చరణం 2: ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం || మాదీ స్వతంత్ర దేశం || చరణం 3: అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు || మాదీ స్వతంత్ర దేశం || చరణం 4: స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు ☝️ ☝️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾 ️ 🇵🇾

గజేంద్రుని దీనాలాపము-తత్వవిశ్లేషణ. 🚩 💥

Image
గజేంద్రుని దీనాలాపము-తత్వవిశ్లేషణ. 🚩 💥 -ఉ ☝️ "ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;  యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.! భావము: ☝️ ఈ లోకమంతా ఎవరి వల్లనైతే పుడుతుందో;  ఎవరిలో కలిసి ఉంటుందో; ఎవరి లోపల లయం అయిపోతుందో; ఎవరు పరమాత్ముడో; ఎవరు సృష్టికి ప్రధానకారణమై ఉన్నాడో; ఎవరైతే పుట్టడం, గిట్టడం, వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో; తుది, మొదలు మధ్య లేని అనంతుడో; ఎవరైతే సమస్తమైన సృష్టి తానే అయ్యి ఉంటాడో; అటువంటి స్వయంభువు, ప్రభువు ఐన భగవంతుణ్ణి నే శరణు కోరుతున్నాను. తత్వవిశ్లేషణ... ☝️ తత్వవిచారణాక్రమంలో యీపద్యం చాలా విలువైనదీ, ముఖ్యమైనది.  ఒక దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దాన్నిఎన్నికోణాల్లోంచి, ఎన్నివిధాలుగా ప్రశ్నించి పరిశీలించాలో యీ పద్యంలో పోతనగారు చెప్పారు.  ఆయన స్వయంగా ఒకయోగి. యోగ తత్వరహస్యాలెన్నింటినో ఆయన భాగవతంలోచొప్పించారు. . ప్రస్తుతంయీపద్యాన్నినాలుగుముక్కలుగావిడదీసుకోవాలి. ☝️ మొదటిది ప్రశ్నా

ఓ విభావరి ఓహో విభావరి- 🚩

Image
ఓ విభావరి ఓహో విభావరి- 🚩 (సాలూరి సన్యాసిరాజు/రాజేశ్వరరావు) 💥 ఓ విభావరి ఓహో విభావరి నీహార తీర నీలాంబరి ధారిణి మనో హారిణి ఓ విభావరి ఓహో విభావరి నీ చెంచల చేలాంచల నిభృత స్వప్నసీమలలో ఎలా భయ ఛాయ జాల మేలా సౌఖ్య రో చీర్నీల ఓ విభావరి ఓహో విభావరి సంతత శాంత తరంగిణి మదభరయువ కురంగిణి ఎలా అలస్గమనముు ఎలా నవ విలస్నముు ఓ విభావరి ఓహో విభావరి ధరణీ తలా చంద్రశిలా తరళ మంటపమున నిలచి యుగములుగ పరీబ్రమింతు గమ్యుడవ్ ఎవని వలచి ఓ విభావరి ఓహో విభావరి https://www.youtube.com/watch?v=ioc7VsUaTO0

బొడ్డపాటి కృష్ణారావు 🚩 (సేకరణ ) 💥

Image
బొడ్డపాటి కృష్ణారావు 🚩 (సేకరణ ) 💥 స్వచ్ఛమైన భాష--'మాయాబజార్‌'లోనే ఒకే దృశ్యంలో  'శంఖుతీర్థులు' కనిపిస్తారు. '' శంకుతీర్థుల వారంటే- కూలంకష ప్రజ్ఞావంతులు!'' అని,  కౌరవుల పక్షంలో ఉన్న శాస్త్రి (వంగర) శ్లాఘిస్తారు. ఆ శంఖుతీర్థులు బొడ్డపాటి. బొడ్డపాటి కృష్ణారావు. స్కూలు మాస్టరు ఉద్యోగం చేసేవారు బందర్లో.  వేద పండితుడు. పురాణాలు క్షుణ్నంగా చదువుకున్నారు.  నాటకాల్లో హాస్యపాత్రలు ధరించేవారు. 'వినాయకచవితి' (1957)లో వినాయక పాత్ర పెద్ద పాత్ర. అయితే, గజముఖం వెనక ఉన్న అసలు ముఖం ఎవరికి తెలుస్తుంది? చెబితే తప్ప! అప్పట్లో ఆయన ''నాదేరా టైటిల్‌ రోలు'' అని గర్వంగా సరదాగా చెప్పేవారు. సినిమాల్లో చాలా వేషాలు వేశారు. 'గుండమ్మ కథ'లోనూ ఒక్కచోట  కనిపిస్తారు. సాయంకాలం వేళ, రోజూ ఎన్‌.టి.రామారావు గారింటికి వెళ్లి ఆయన పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పేవారు. తను తీసిన అన్ని చిత్రాల్లోనూ రామారావుగారు ఏదో వేషం వేయించేవారు. బొడ్డపాటి, చేతిలో గొడుగు పట్టుకుని నిరంతరం వేటే!  వేషాలకి. ఆయన వెయ్యదగ్గ వేషం ఉంటే మాత్రం త