Sunday, July 22, 2018

జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩 పరమపావన!

జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩జై శ్రీరామా 🚩


పరమపావన!

(పోతన విరచిత శ్రీమత్తెలుగుభాగవత తృతీయ స్కంధాంత ప్రార్థన.)

-త.


💥"పరమపావన! విశ్వభావన! బాంధవప్రకరావనా! 

శరధిశోషణ! సత్యభాషణ! సత్కృపామయ భూషణా! 

దురితతారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా! 

ధరణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా!


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


👉👉

శ్రీరామచంద్రప్రభు!

నీవు పరమపావనుడవు. విశ్వభావనుడవు. బంధుజనావనుడవు. సముద్రజలాలను శోషింపజేసిన వాడవు. సత్యభాషణుడవు, అపారదయాగుణ భూషణుడవు. దురితాలను గట్టెక్కించే వాడవు. 

జగత్ సృష్టికి కారణభూతుడవు. దుష్టులను చీల్చి చెండాడు వాడవు. మహారాజవు. ధర్మాన్ని పాలించేవాడవు. రాక్షసులను నిర్మూలించే వాడవు. .


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Tuesday, July 17, 2018

🚩‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ 🚩


🚩‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ 🚩

💥

👉🏿తండ్రి తానే కుమారుడై పుట్టి తన ప్రకాంశంతో వెలుగొందుతాడు !


👉🏿భర్త భార్యయందు ప్రవేశించి, గర్భంలో నవమాసాలు ఉండి పుత్రుడై పుడతాడు. 

కాబట్టి ‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ ( శరీరం ను్డి పుడుతున్నావు) అని వేదం చెబుతోంది.


👉🏿దాని వలన తండ్రి కొడుకులకు భేదం లేదు.


👉🏿గార్హపత్యం అనబడే అగ్ని ఏ విధంగా ఆహవనీయంలో ప్రజ్వలింపబడి వెలుగుతుందో, అలాగే, తండ్రి తానే కుమారుడై తన ప్రకాంశంతో వెలుగొందుతాడు. మగవాడు తన నీడను నీళ్ళలో ఎలా స్పష్టంగా చూసుకో గలుగుతాడో, అలాగే తండ్రి కొడుకుని చూసి మహదానందాన్ని పొందుతాడు.


👉🏿‘ పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర ’ అని వేద వచనం.

కనుక ఉత్తమ శీలం కల పుత్రుడు తలిదండ్రుల ఉభయ వంశాల వారినీ ఉద్ధరిస్తాడు. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్టుగా నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు.


👉🏿నీ కుమారుని కౌగలించుకో. ఆ సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలూ, దట్టంగా పులుముకున్న పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల .... ఇవేవీ కూడ కుమారుని కౌగిలించు కోవడం వల్ల మనసుకి కలిగేటటు వంటి సుఖాన్నీ, చల్లదనాన్నీ ఇవ్వ లేవు !


Saturday, July 14, 2018

శ్రీ కృష్ణుడు తో నెయ్యం. 🚩 మీరా బాయి భజన !

శ్రీ కృష్ణుడు తో నెయ్యం. 🚩


మీరా బాయి భజన !

💥

👉🏿బ్రజ్ లోని ఆ చీకటి నివాసి

తానొక్కడే నాకు ఆశ్రయం.


👉🏿ఓ నా తోడూనీడా, ప్రాపంచిక సౌక్యం ఒక భ్రమ,

అది దొరికిన వెంటనే, చేజారిపోతుంది.


👉🏿నేను శరణుకోసం అక్షయాన్ని ఎన్నుకొన్నాను,

మృత్యువనే సర్పం కబళించలేని అతనినే.

👉🏿నా ప్రియుడు నా హృదయంలోనే రోజంతా ఉంటాడు,

ఆ స్వర్గ నివాసాన్ని నేను వాస్తవంగా అనుభవించాను.

👉🏿మీరా స్వామి హరి, నాశనం చేయబడలేని వాడు.

నా భగవంతుడా, నేను నీ ఆశ్రయం పొందాను, నీ సేవకురాలిని🚩


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Friday, July 13, 2018

👉🏿 అజరామర సూక్తి 🚩 (ఆది భిక్షవు -శివుడు .)


👉🏿 అజరామర సూక్తి 🚩

(ఆది భిక్షవు -శివుడు .)


💥


గృహం గృహమటన్ భిక్షుః శిక్షతే న తు యాచతే |


అదత్వా మాదృశో మా భూః దత్వా త్వం త్వాదృశో భవ ||


- అజ్ఞాత కవి


👉🏿ఇల్లిల్లూ భిక్షాటనతో యాచించే యాచకుడు ఏమని


సందేశ మిస్తున్నాడంటే ' మీరెప్పుడూ ఇచ్చేవారిగానే ఉండండి,


నా లాగా గ్రహీతగా మారిపోవద్దు.'

🌺


'చేతులకు తొడవు అనగా ఆభరణము దానము' అన్నది ఆర్యోక్తి.


ఇంకొక మాట కూడా వుంది


👉🏿"దరిద్రాయ కృతం దానం శూన్య లింగస్య పూజనం


అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ సమం విధుః"


💥


👉🏿లేనివానికి ఇచ్చుట,


పూజలేక ఉండిపోయిన లింగమునకు పూజచేయుట ,


తల కొరివి పెట్టె వారసుడు లేని మృతునికి దహన సంస్కారము


చేయుట కోటి యజ్ఞములు చేసిన ఫలము నిస్తుంది అని.


👉🏿అసలు జీవన గమనమునకు ఇచ్చుట పుచ్చుకొనుట రెండు


చక్రాలు. ఇస్తేనే తీసుకొనుటకు అధికారమొస్తుంది.


ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆత్మ అంటే పరమాత్మనే కదా .


మరి పరమాత్మను సంతృప్తి పరిస్తే మనకు ఆనందాన్ని


ఆయన కలిగిస్తాడు. ఈ జీవన సత్య మొకటి గుర్తుంటే ప్రపంచము


సౌఖ్యము సౌభాగ్యముతో నిండిపోదా !


💥


👉🏿నకర్మణా, నప్రజయా, నధనేన, త్యాగైనైకానామృతత్వ


మానసుః- అని వేదవాక్యం!


👉🏿దానంగొప్పది. అది యమృతత్వమునకు దారిచూపును.


👉🏿ఇకభిక్షులవిషయం; వారు చేస్తున్నది భిక్షాటన కాదు.


మనకుపదేశంచేయటమే!


👉🏿యెవరికీ యింత పెట్టక నేనిలాగైనాను మీరు నావలెగావలదు.


నలుగుర కింతబెట్టి మీవలెనే సుఖసంపదలతో నానంగింపుఁడని


యాసందేశము!


చెవిని బెట్టుఁడు;


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

🚩శుభోదయం -భగవద్గీత 🙏


🚩శుభోదయం -భగవద్గీత 🙏

💥

👉🏿భగవద్గీత ఆన్నది రాజకీయ బోధ కాదు .

ఆది ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని బోధించేది.


👉🏿భగవద్గీత హిందువులకుమాత్రమే అనుకోవటం పోర బాటు .

ఆది అందరిదీ .

👉🏿జ్యూ అయిన న్యూటన్ గురుత్వాకర్షణసిద్ధాంతాన్ని కనీ పెట్టాడు కనుక ఆది యూదులకు మాత్రమె వర్తిస్తుందంటే వెర్రి తనం

కాదా .

👉🏿సనాతన ధర్మం అంటే విశ్వ నిబంధన, చట్టం ధర్మం,

న్యాయం . (యూని వరసల్ లా,).కృష్ణుడు బోధించి నప్పుడు ఆయన హిందువు అని అనుకో లేదు .ఆయనేమీ హిందూ మతాన్ని సృష్టించ లేదు .

👉🏿కృష్ణుడు గుర్తు చేసింది ”స్వధర్మం ”నే .స్వధర్మం అంటే

హిందూ ధర్మం అని కాదు .స్వీయ మైన ,వైయక్తిక మైన ధర్మం అని అర్ధం ..

👉🏿గీత ఒక చక్కని డిబేట్ .సందేహాలకు సమాధానాలు .

ఈ గ్రంధం ఇలా చెప్పింది ,ఆ గ్రంధం అలా చెప్పింది అని శంకలు పనికి రావు .అవన్నీ చిన్న టాంకుల లో ఉన్న నీరు లాంటివి ..అసలు అనంత నీటి ప్రవాహమే వస్తే ,వీటి ఉనికే ఉండదు కదా . నేను చెబుతున్న వన్నీ ,నేను అనుభవ పూర్వకం గా తెలుసుకోన్నవే .


👉🏿మీ స్వధర్మమే అన్నిటి కన్నా ఉన్నత మైనది, ఉత్తమ మైనది అని మర్చి పోరాదు .అంతశ్సో ధన చేసుకోండి .మిమ్మల్ని అప్పుడు మీరే నడి పించుకో గల సామర్ధ్యాన్ని పొంద గలుగుతారు .ముందుగా దానికి అర్హత సంపాదించాలి .


👉🏿చిన్న పిల్లాడు ఐన్ స్టీన్ గారిE=mc 2సూత్రాన్ని బట్టీ పట్టి తనకు సాపేక్ష సిద్ధాంతం అర్ధం అయింది అని చెప్పటం లా ఉంటుంది .

👉🏿గీత లోని మాటలకు అర్ధ తాత్పర్యాలు తెలిసి నంత మాత్రం చేత గీత నీకు ఆవ గాహన అయి నట్లు కాదని తెలుసుకోవాలి .

నీకు నీ స్వధర్మం -అంటే స్వీయ ధర్మం (లా ఆఫ్ ది సెల్ఫ్ )తెలియాలి అప్పుడే ఆది అర్ధము అయినట్లు .


👉🏿 టెక్నాలజీ నిన్నేమీ ”నన్ను ఉపయోగించుకో ”అని కోరటం లేదే .ఆది అందు బాటు లో ఉంది నువ్వుదాన్ని నీ సౌకర్యం కోసం వాడుకొంటున్నావు .

👉🏿ఇక్కడ సమస్య ఏమిటి అంటే -నీ శరీరం తో ఎలా పని చేయించుకోవాలి ,నీ మెదడు మనసు లతో ఏవిధమైన పనులు చేయించు కోవాలో నీకు తెలియదు .

👉🏿అలాగే నీ భావోద్రేకాలను, నీ శరీర ధర్మాన్ని ఎలా నియంత్రించు కోవాలో తెలీని మూర్ఖత్వం లో ఉంటున్నావు .అందుకని నీ చుట్టూ ఉన్న ప్రతి దాని పైనా ఫిర్యాదులు చేస్తూండటం నీకు అలవాటై పోయింది .

👉🏿ఆధ్యాత్మికత్వం అంటే మింగుడు పడనీ పదార్ధం అనుకొని పోర బడుతున్నావు .అవసరం వచ్చి నప్పుడు సాంకేతిక సహాయం తీసుకో .మిగిలిన కాలాని ధ్యానం లో గడుపు .

అప్పుడు అంతా స్వచ్చం గా కనీ పిస్తుంది .


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, July 12, 2018

🚩“అమ్మలగన్నయమ్మ”-పోతన వినయం🙏

🚩“అమ్మలగన్నయమ్మ”-పోతన వినయం🙏


💥

"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు!

శూలికైన దమ్మిచూలికైన!


విబుధజనుల వలన విన్నంత కన్నంత,


దెలియవచ్చినంత తేటపరతు!!

.

🚩ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి!

భాగవతము ఎవరు చెప్పగలరు? 

భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు.

జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. 

ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది.

కానీ “మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది 

చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన దానిని, 

నాకు శారదాదేవి ఏది కృపచేసిందో దానిని నేను చెప్పుకుంటున్నాను” అన్నారు. ఆయన అంటారు – 

.💥💥


"అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె


ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో


నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా


యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!


💥💥💥💥💥💥💥💥💥

.


🚩విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది.

ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాన్ని ఇచ్చేస్తాయి. 

🚩ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. 

కొన్ని కొన్ని చేయకూడదు. పక్కని గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు.

మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. 

కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


🚩“అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు 

ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. 

అటువంటి దుర్గమ్మ మాయమ్మ. “ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.


🚩“అమ్మలగన్నయమ్మ” – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? 

మనకి లలితాసహస్రం “శ్రీమాతా” అనే నామంతో ప్రారంభమవుతుంది. 

🚩“శ్రీమాతా” అంటే “శ”కార “ర”కార “ఈ”కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ –


🚩ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు ఎన్నదో ఆయమ్మ –


🚩అంటే “లలితాపరాభట్టారికా స్వరూపం” – ఆ అమ్మవారికి దుర్గాస్వరూపమునకు భేదం లేదు –


🚩అందుకని “అమ్మలగన్నయమ్మ” “ముగ్గురమ్మల మూలపుటమ్మ” 

– ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు.


🚩ఈ ముగురమ్మల మూలపుటమ్మ. “చాల పెద్దమ్మ” – 

ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. 

ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

.


🚩

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.


🚩“సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ” – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ.


🚩 దితి. దితి అయ్యే అని ఏడిచేటటుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


🚩“తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ” – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకొని శక్తితో తిరుగుతున్న వారెవరు?


🚩

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి


🚩చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

.


🚩మనకి సంప్రదాయంలో “అష్టమాతృకలు” అని ఉన్నారు.

వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము.


🚩 బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, 

చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.


🚩ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. 

వీరిని “అష్టమాతృకలు” అని పిలుస్తారు. 

ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. 

వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ,

అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

.

🚩“రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం”


అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు.

ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.


🚩“మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్” – ఇప్పుడు

ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.

.


🚩అమ్మవారికి “శాక్తేయప్రణవములు” అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి.


🚩ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు 

అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు.

కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. 

కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. 

మహత్వమునకు బీజాక్షరము “ఓం”, కవిత్వమునకు బీజాక్షరము

“ఐం”, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము “హ్రీం”, 

ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – “శ్రీం”.

.


🚩ఇపుడు “ఓంఐంహ్రీంశ్రీం” – అమ్మలగన్నయమ్మ “శ్రీమాత్రేనమః”

.


🚩మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు.

కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అంటున్నారనుకోండి

అపుడు మీరు మరోరూపంలో “ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః” – “ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః” అనేస్తున్నారు. 

మీరు అస్తమానూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది.


🚩అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. 

అందుకే లలితా సహస్రం “శ్రీమాతా” అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

.


🚩ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది.

🚩 ఇప్పుడు మీరు “ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః” అనలేకపోవచ్చు.


🚩 “అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ “ అనడానికి కష్టం ఏమిటి?


ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని 

ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన


కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి.


అందుకని ఆ పద్యమును ఇచ్చారు.


 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

మరపు🚩 (నండూరి వాి యెంకి పాట.)

మరపు🚩


(నండూరి వాి యెంకి పాట.)


💥


ఏటికోయి మనచెలిమి-నీట చిత్తరవుల కలిమి ?

కలయె తెలుపు మనమనసుల కలయికల నిజానిజాల !


అలక నలసి నేను కునుక

తెలివిని నను నీవు చెనక-

కనకె నీ సరాగసరణి

కల రెక్కల పరతుదివిని ! ఏటికోయి....


💥


కనులుకునుక బొమలుకులుకు

నని నను తనివారక నెదు

యెరుగవింత కలలోనా

మరుగుమరులు తిరుగుతెరలు ! ఏటికోయి....


💥


నీ యెద వూయల లీయెడ

పోయెద కల పలుపోకల-

కలలో కలగందు నొకట

తెలివి నిదుర లచట నచట ! ఏటికోయి....


💥


యీ నందనమును నిను నను

ఆనంద సుఖమున మరతు !

కలలో నను చూతువేమొ

కత్తికెరను జేతువేమొ ! ఏటికోయి....


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Tuesday, July 10, 2018

అబ్బబ్బ వెధవ బండి' 💥

అబ్బబ్బ వెధవ బండి' 💥


(వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం)

🌺🌺🌺🌺🌺🌺


👉🏿ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.


👉🏿బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందునలన, వేరే బండివాడిని తీసుకరాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండి తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.


👉🏿పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా ఉండదు. నల్లేరు మీద బండి నడక కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది. 

కుదుపులు ఎక్కువ ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.


👉🏿దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).


👉🏿

దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.


*****


ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.

👉🏿ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,

పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.


👉🏿రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.


👉🏿అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.


👉🏿దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.


👉🏿పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.


👉🏿ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.


👉🏿అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.


👉🏿ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.


👉🏿, మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.


చదివినందులకు ధన్యవాదాలు.

శుభం 🚩 💥

శుభం 🚩


💥


భాగవతం.......పోతనామాత్యుడు.!

💥💥💥

హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం


హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో


హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా


హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.


💥💥💥💥💥💥💥💥


👉🏾భావము:


మనోహర హారాలు ధరించువాడికిం;

సంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; 

తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; 

భక్తుల పరితాపాలను పరిహరించువాడికి;

గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి;

దుష్టుల సంపదలను హరించిన వాడికి; 

వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి;

పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని

మట్టు పెట్టినవాడికి.

నా స్వామికి సమర్పితంగా 

శ్రీమద్భాభాగవత పురాణం తెనిగించటానికి పూనుకొన్నాను.


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Saturday, July 7, 2018

చూచారా మన కవిసామ్రాట్ ని? (చింతా రామ కృష్ణా రావు.)


-

చూచారా మన కవిసామ్రాట్ ని?

(చింతా రామ కృష్ణా రావు.)


ఆ. విశ్వ నాధుఁడైన పృథ్వీశు రాముని,

కల్పవృక్షమందు గాంచ చేసి,

కవి వతంసు లెన్న కమనీయ కావ్యాన

వెలుగు చుంటివయ్య విశ్వనాధ.

.

చ. భరమగు నారికేళ పరిపాక కవిత్వ సుధా పయోధిగా

గురుతరమైన రామ కథ కోరి రచించిన భాగ్యశాలివే.

స్తిరముగ కీర్తి చంద్రికలు చిందులు వేయుచు భూ నభంబులన్.

సురుచిరమై వెలుంగును. విశుద్ధ కవిత్వ ఝరీస్వరూపుఁడా!

.

ఉ. పాకము నారికేళమది బ్రహ్మయు మెచ్చు విధాన గొల్పుటన్

నీకిక సాటి లేరనుట నిక్కము. కాంచగ చిత్రముల్. స్వయం

పాకము లోన కూడ సరి వారలు గల్గిరె? యన్న యట్లు యీ

లోకులు మెచ్చుతీరున సులోచన మైనను లేక చేయుదే?

( సులోచనము=కళ్ళజోడు)

.

ఆ. మనుమరాలు నేర్వ మహనీయ మగు వంట

చేయుచుంటి వీవు చేవ చూపి.

కవులు నేర్చునట్లు కల్పవృక్షము వ్రాసి

అంద జేసి తీవు విందు చేయ..

.

నశ్యం పండిత లక్షణం.

ఉ. నశ్యము పీల్చు పండితులు. నశ్యము కాని కవిత్వ సృష్టిచే

నశ్యము పీల్చ నీకగును నాసరి పండితు లేరటంచు. నీ

వశ్యము వాణి. పల్కెడిది బంగరు పల్కయి కావ్య రూపమై

దృశ్య కవిత్వమై పఱగు. దివ్య కవిత్వ విశిష్ట తేజుఁడా!

.

విశ్వ నాథ మనకు ఎదురుగానే ఉన్నారు కదా!

Friday, July 6, 2018

భీష్మ శ్రీ కృష్ణ స్తుతి 🚩


-

భీష్మ శ్రీ కృష్ణ స్తుతి 🚩


మందాకినీనందను డైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామభావంతో, నిర్మలధ్యానంతో పీతాంబరధురుడు, చతుర్భుజుడు, పురాణపురుషుడు, పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతిసిద్ధాలైన సంసారబంధాలను పరిహరించే ఉద్ధేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు


💥


-మ.


"త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ

రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక

వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.


భావము:

“ముల్లోకాలకు సమ్మోహనమైన నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం గలవాడు; పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు; నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు; ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు; మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు; అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి.


💥💥

-మ.


హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ

చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.


భావము:

గుఱ్ఱాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా; ముంగురులు చెదిరి పోతున్నా; అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా; ముచ్చటైన ముఖమంతా ఎఱ్ఱగా అవుతున్నా; నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను.


💥💥💥


-మ.


నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో

బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం

బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.


భావము:

ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు, పగవారి కళ్ళెదురుగానే రథాన్ని తీసుకు వెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో; చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో; ఆ శ్రీకృష్ణపరమాత్మ నా హృదయపద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక.

💥💥💥💥


-క.


తనవారిఁ జంపఁజాలక

వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్

ఘన యోగవిద్యఁ బాపిన

మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.


భావము:

రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి, సందేహాలు పోగొట్టి, యుద్ధంలో ముందంజ వేయించిన వాని; మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక.


💥💥💥💥💥


-సీ.


కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; 

గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ; 

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; 

జగముల వ్రేఁగున జగతి గదలఁ; 

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; 

బైనున్న పచ్చనిపటము జాఱ; 

నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; 

మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;


-తే.


గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి 

నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు

విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.


భావము:

ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది; కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి; ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది; చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది; “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవ ” ద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష.


💥💥💥💥💥


-మ.


తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న

ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్

మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్

జనులన్మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.


భావము:

చుచు; జనులన్ = ప్రజలను; మోహము = మోహము; ఒందన్ = పొంద; చేయు = చేయుచున్న; పరమ = మిక్కిలి; ఉత్సాహున్ = ఉత్సాహముగలవానిని; ప్రశంసించెదన్ = స్తోత్రము చేసెదను.


💥💥💥💥💥💥


-క.


పలుకుల నగవుల నడపుల

నలుకల నవలోకనముల నాభీరవధూ

కులముల మనముల తాలిమి

కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్.


భావము:

తియ్యని మాటలతో మందహాసాలతో, ప్రవర్తనలతో, ప్రణయకోపాలతో, వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను.


💥💥💥💥💥💥


-ఆ.


మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా

మందిరమున యాగమండపమునఁ

జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది

దేవుఁ డమరు నాదు దృష్టియందు.


భావము:

మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు.


💥💥💥💥💥💥


-మ.


ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో

లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ

న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ

పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై."


భావము:

ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను."


 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Tuesday, July 3, 2018

శారదాదేవి ఆశీర్వాదం 🚩

శారదాదేవి ఆశీర్వాదం 🚩


💥

👉🏿రామకృష్ణ పరమహంస మరణించిన తరువాత వివేకానందుడు 

అమెరికా వెళ్ళి భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి విప్పి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.


👉🏿తనకు మాతృ సమానురాలయిన రామకృష్ణ పరమహంస భార్య ఐన శారదాదేవి ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్ళాడు. ఆమె యింట్లో వంట చేస్తూ వుంది. 

👉🏿వివేకానందుడు ఆమెకు నమస్కరించి ‘అమ్మా! నేను అమెరికా వెళుతున్నాను. భారతీయ ధర్మాన్ని పాశ్చాత్య ప్రపంచానికి చాటి చెప్పడానికి వెళుతున్నాను. మన ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని తెలుపడానికి ఈ ప్రయాణం పెట్టుకున్నాను. యింత పవిత్ర కార్యాన్ని నిర్వర్తించే ముందు మాతృమూర్తి ఐన మీ ఆశీర్వచనం నాకు అనివార్యం. మీరు నన్ను ఆశీర్వదించందే నా యాత్రకు సంపూర్ణత, సమగ్రత చేకూరదు’ అన్నాడు.


👉🏿శారదాదేవి వంట పనిలో వుంది. వివేకానందుడు చెప్పినవన్నీ విన్నది. వెంటనే స్పందించలేదు. వివేకానందుడు ఆశ్చర్యపోయాడు. నేనేం తప్పు చేశాను? అనుకున్నాడు. 

శారదాదేవి కాసేపటికి ‘నేను ఆ విషయం గురించి కొంత ఆలోచించి కానీ చెప్పలేను’ అంది.

👉🏿వివేకానందుడు విస్తుపోయాడు. ఆశీర్వదించడానికి ఆలోచించడమా?’ అనుకున్నాడు. పరిస్థితి చిత్రంగా వుంది. వింతగా అనిపించింది. 

👉🏿శారదాదేవి వంట పనిలో వుంటూనే వివేకానందుణ్ణి గమనించింది. కాసేపటికి ‘నాయనా! కూరగాయలు తరగాలి. అక్కడ వున్న కత్తిని కాస్త అందివ్వు అంది. వివేకానందుడు కత్తినిచ్చాడు. ఆమె కత్తి తీసుకుని చిరునవ్వుతో ‘నాయనా! నిన్ను హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. నీవల్ల అందరికీ మేలు జరుగుతుంది. నీ ప్రయాణం విజయవంతమవుతుంది. వెళ్ళిరా’ అంది.

👉🏿వివేకానందుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! నీ ఆశీర్వాదానికి, ఈ కత్తికి వున్న సంబంధమేమిటి?’ అన్నాడు.

👉🏿శారదాదేవి ‘వుంది నాయనా! నేను కత్తిని అడిగినపుడు నువ్వెలా యిస్తావో పరిశీలించాను. కత్తి పిడిని పట్టుకుని యిస్తావా? లేదా కత్తి కొనను పట్టుకుని పిడిని నావేపు పెట్టి అందిస్తావా? అని గమనించాను. కత్తి కొనను నీ చేతిలో పట్టుకుని పిడిని నాకు అందించావు. దాన్ని బట్టి నీ తత్వం గ్రహించాను. నీలో అనురాగముంది, అధికారం లేదు, ఆత్మరక్షణ లేదు, ప్రతీకారం లేదు. నువ్వు కత్తి కొనను పట్టుకొన్నావు. దానివల్ల నీ వేలు తెగే వీలుంది. కానీ దాన్ని నువ్వు లక్ష్యపెట్టలేదు. నీ కన్నా నా భద్రతే నువ్వు ముఖ్యంగా భావించావు. యిది చిన్ని విషయమే కావచ్చు. కానీ ఇది నీ మనస్తత్వాన్ని తెలుపుతోంది. 

👉🏿నీకు అంతా మేలే జరుగుతుంది. యితరుల మేలు కోరేవాడు ఆత్మరక్షణ గురించి ఆలోచించడు’ అంది. వివేకానందుడు శారదామాత పాదాల్ని స్పర్శించాడు.

(మనమెవరైనా కూడా కత్తిని అందించేటప్పుడు పిడిని పట్టుకొనే అందిస్తాము కదా)!

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩