Tuesday, December 31, 2013

శ్రీకాళహస్తీశ్వరా!

తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు. శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!


శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా

రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్

దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా

సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!


ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్. సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం. అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన. తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది. అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి. "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా, అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను".

Monday, December 30, 2013

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం..

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం


ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |

భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || ౧ ||


పూతాత్మా పరమాత్మా చ ముక్తానాంపరమాగతిః |

అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోzక్షర ఏవ చ || ౨ ||


యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః |

నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః || ౩ ||


సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః || ౪ ||


స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |

అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || ౫ ||


అప్రమేయో హృషీకేశః పద్మనాభోzమరప్రభుః |

విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః || ౬ ||


అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |

ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ || ౭ ||


ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః || ౮ ||


ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః |

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ || ౯ ||


సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |

అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః || ౧౦ ||


అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |

వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిఃసృతః || ౧౧ ||


వసుర్వసుమనాః సత్యః సమాత్మాzసమ్మితః సమః |

అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః || ౧౨ ||


రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |

అమృతః శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః || ౧౩ ||


సర్వగః సర్వవిద్భానుర్విష్వక్సేనో జనార్దనః |

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః || ౧౪ ||


లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |

చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః || ౧౫ ||


భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః || ౧౬ ||


ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |

అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః || ౧౭ ||


వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః || ౧౮ ||


మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |

అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ || ౧౯ ||


మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః |

అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః || ౨౦ ||


మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |

హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః || ౨౧ ||


అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |

అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా || ౨౨ ||


గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |

నిమిషోzనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః || ౨౩ ||


అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః |

సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ || ౨౪ ||


ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |

అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః || ౨౫ ||


సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |

సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః || ౨౬ ||


అసంఖ్యేయోzప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |

సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః || ౨౭ ||


వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః || ౨౮ ||


సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |

నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః || ౨౯ ||


ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |

ఋద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః || ౩౦ ||


అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |

ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః || ౩౧ ||


భూతభవ్యభవన్నాథః పవనః పావనోzనలః |

కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః || ౩౨ ||


యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః |

అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ || ౩౩ ||


ఇష్టోzవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః || ౩౪ ||


అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |

అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః || ౩౫ ||


స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |

వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః || ౩౬ ||


అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |

అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః || ౩౭ ||


పద్మనాభోzరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |

మహర్ద్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః || ౩౮ ||


అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః |

సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః || ౩౯ ||


విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః |

మహీధరో మహాభాగో వేగవానమితాశనః || ౪౦ ||


ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |

కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః || ౪౧ ||


వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |

పరర్ద్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః || ౪౨ ||


రామో విరామో విరజో మార్గో నేయో నయోzనయః |

వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః || ౪౩ ||


వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః || ౪౪ ||


ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |

ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః || ౪౫ ||


విస్తారః స్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ |

అర్థోzనర్థో మహాకోశో మహాభోగో మహాధనః || ౪౬ ||


అనిర్విణ్ణః స్థవిష్ఠోzభూర్ధర్మయూపో మహామఖః |

నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః || ౪౭ ||


యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః |

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ || ౪౮ ||


సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |

మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః || ౪౯ ||


స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ |

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః || ౫౦ ||


ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరమ్ |

అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః || ౫౧ ||


గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః |

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః || ౫౨ ||


ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |

శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః || ౫౩ ||


సోమపోzమృతపః సోమః పురుజిత్పురుసత్తమః |

వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్త్వతాంపతిః || ౫౪ ||


జీవో వినయితా సాక్షీ ముకుందోzమితవిక్రమః |

అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోzంతకః || ౫౫ ||


అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |

ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః || ౫౬ ||


మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః |

త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ || ౫౭ ||


మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |

గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః || ౫౮ ||


వేధాః స్వాంగోzజితః కృష్ణో దృఢః సంకర్షణోzచ్యుతః |

వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః || ౫౯ ||


భగవాన్ భగహాzzనందీ వనమాలీ హలాయుధః |

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః || ౬౦ ||


సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః |

దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః || ౬౧ ||


త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |

సన్న్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ || ౬౨ ||


శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |

గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః || ౬౩ ||


అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |

శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః || ౬౪ ||


శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్లోకత్రయాశ్రయః || ౬౫ ||


స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |

విజితాత్మాzవిధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః || ౬౬ ||


ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |

భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః || ౬౭ ||


అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |

అనిరుద్ధోzప్రతిరథః ప్రద్యుమ్నోzమితవిక్రమః || ౬౮ ||


కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః |

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః || ౬౯ ||


కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |

అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోzనంతో ధనంజయః || ౭౦ ||


బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |

బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః || ౭౧ ||


మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |

మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః || ౭౨ ||


స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః || ౭౩ ||


మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః || ౭౪ ||


సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః || ౭౫ ||


భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోzనలః |

దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోzథాపరాజితః || ౭౬ ||


విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |

అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః || ౭౭ ||


ఏకో నైకః స్తవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ |

లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః || ౭౮ ||


సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |

వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః || ౭౯ ||


అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ |

సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః || ౮౦ ||


తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః |

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః || ౮౧ ||


చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః |

చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ || ౮౨ ||


సమావర్తోzనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా || ౮౩ ||


శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |

ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః || ౮౪ ||


ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |

అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ || ౮౫ ||


సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః |

మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః || ౮౬ ||


కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోzనిలః |

అమృతాంశోzమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః || ౮౭ ||


సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః |

న్యగ్రోధోzదుంబరోzశ్వత్థశ్చాణూరాంధ్రనిషూదనః || ౮౮ ||


సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |

అమూర్తిరనఘోzచిన్త్యో భయకృద్భయనాశనః || ౮౯ ||


అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |

అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః || ౯౦ ||


భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |

ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః || ౯౧ ||


ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |

అపరాజితః సర్వసహో నియంతాzనియమోzయమః || ౯౨ ||


సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |

అభిప్రాయః ప్రియార్హోzర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః || ౯౩ ||


విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |

రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః || ౯౪ ||


అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోzగ్రజః |

అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః || ౯౫ ||


సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |

స్వస్తిదః స్వస్తికృత్స్వస్తి స్వస్తిభుక్స్వస్తిదక్షిణః || ౯౬ ||


అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |

శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః || ౯౭ ||


అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః || ౯౮ ||


ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |

వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః || ౯౯ ||


అనంతరూపోzనంతశ్రీర్జితమన్యుర్భయాపహః |

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః || ౧౦౦ ||


అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |

జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః || ౧౦౧ ||


ఆధారనిలయోzధాతా పుష్పహాసః ప్రజాగరః |

ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || ౧౦౨ ||


ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ప్రాణజీవనః |

తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః || ౧౦౩ ||


భూర్భువఃస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః || ౧౦౪ ||


యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధనః |

యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ || ౧౦౫ ||


ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |

దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః || ౧౦౬ ||


శంఖభృన్నందకీ చక్రీ శార్‍ఙ్గధన్వా గదాధరః |

రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః || ౧౦౭ ||

సర్వప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి |


వనమాలీ గదీ శార్‍ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ |

శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోzభిరక్షతు || ౧౦౮ ||

శ్రీ వాసుదేవోzభిరక్షతు ఓమ్ నమ ఇతి |

పార్థు గారి చక్కటి మాటలు.

ఓదార్పు ఒకసారే కోరుకోవాలి 

తరువాత మనల్ని మనమే ఓదార్చుకోవాలి .... ఆధారపడవద్దు 

బాధను మిగులుస్తాయి బయట బంధాలు 

ఆనందం నిపుతుంది ఆత్మ సంబంధం !

పార్థు గారి చక్కటి మాటలు.

ఆంజనేయ దండకం..

ఆంజనేయ దండకం..

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం

భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు

సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ

నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై

రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్

నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే

నా మొరాలించితే నన్ను రక్షించితే

అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్

దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్

దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై

స్వామి కార్యార్థమై యేగి

శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి

సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి

వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి

కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్

యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి

యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి

సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి

యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై

యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు

సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని

వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ

నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,

సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,

యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న

నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్

దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర

నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్

వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్

తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల

కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్

పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్

నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని

రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి

రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి

వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా

నమస్తే సదా బ్రహ్మచారీ

నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

Sunday, December 29, 2013

పాహి రామప్రభో -----------------

పాహి రామప్రభో

-----------------


పాహి రామప్రభో పాహి రామప్రభో

పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో

పాహి రామప్రభో


ఇందిరా హృదయారవిందాధి రూఢ

సుందరాకార నానంద రామప్రభో

ఎందునే చూడ మీ సుందరానందము

కందునో కన్నులింపొంద శ్యామప్రభో


బృందారకాది బృందార్చిత పదార

విందముల సందర్శితానంద రామప్రభో

తల్లివి నీవె మా తండ్రివి నీవె

మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో


నీదు బాణంబులను నాదు శతృల బట్టి

బాధింపకున్నావదేమి రామప్రభో

ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు

వాదింతునే జగన్నాథ రామప్రభో


శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము

సారె సారె కును వింతగా చదువు రామప్రభో

శ్రీ రామ నీ నామ చింతనామృత పాన

సారమే నాదు మది గోరు రామప్రభో


కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు

వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో

అవ్యయుడవైన ఈ అవతారములవలన

దివ్యులైనారు మునులయ్య రామప్రభో


పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల

పాలింపుమా భద్రశీల రామప్రభో

పాహి రామప్రభో పాహి రామప్రభో

పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో

http://www.youtube.com/watch?v=M8HVCnTnZ58

Saturday, December 28, 2013

సూత ఉవాచ:


సూత ఉవాచ:

ఖగపతి యమృతముతేగా

భుగభుగ మని పొంగి చుక్క భూమిని వ్రాలెన్

పొగచెట్టై జన్మించెను

పొగతాగనివాడు దున్నపోతై బుట్టునూ |క|


ఇది బృహన్నారదీయం నాలుగో ఆశ్వాసంలో వున్నది.

(గురజాడ వారి కన్యా శుల్కం నుండి.)

 

యెంకి పాటలు....

యెంకి పాటలు....

౧.కనుబొమ్మలు


నన్ను తలుసుకు యెంకి కన్ను మూయాలి!


కనుబొమ్మ సూడాలి!

కరిగిపోవాలి!


నన్ను కలలో సూసి నవ్వుకోవాలి!

కనుబొమ్మ సూడాలి!

కరువు దీరాలి!


నిదరలో సిగపూలు సదురుకోవాలి!

కనుబొమ్మ సూడాలి!

కమ్మగుండాలి!


పిలుపేదొ యినగానె తెలివి రావాలి!

కనుబొమ్మ సూడాలి!

కతలు తెలియాలి

.................................

౨. ముద్దుల నా యెంకి


గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

కూకుండ నీదురా కూసింత సేపు!

…………………..

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,

యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,

దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

యీడుండమంటాది ఇలు దూరిపోతాది,

యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

మందో మాకో యెట్టి మరిగించినాదీ,

వల్లకుందామంటే పాణ మాగదురా!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

Friday, December 27, 2013

తెర వెనుక వారు తెర మరుగుననే పడిపోతున్నారు.


రు.కన్యాశుల్కం సినిమా కోసం కళా దర్శకుడు వాలి రూపొందించిన గెటప్ స్కెచెస్. గిరీశం గా ఎన్టీఆర్, మధురవాణి గా సావిత్రి, బుచ్చెమ్మ గా జానకి, రామప్ప పంతులు గా సీయస్సార్. సినిమా చూస్తాం, ఆనందిస్తాం. కాని సినిమా విజయవంతం కావడాని తెరవెనుక వ్యక్తుల కృషి ఎంతవుంటుందో గమనించం. వారికి తగిన ఆదారణ కాని, బిరుదులూ లభించ

Hema malini ji...

Hema malini ji before entering films...


పుష్ప విలాపం కరుణ శ్రీ

పుష్ప విలాపం 

కరుణ శ్రీ

చేతులారంగ నిన్ను పూజించుకొరకు

కోడి కూయంగనే మేలుకొంటి నేను;

గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి

పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో

రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా

ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా

మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు

ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి

అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!

హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;

బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;

బండబారె నటోయి నీ గుండెకాయ!

శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా

తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై

నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే

హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం

గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే

త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో

తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు

ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి

శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి

త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలు దారాలతో గొంతు కురి బిగించి

గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము

అకట! దయలేని వారు మీ యాడువారు

గుండె తడి లేక నూనెలో వండి పిండి

అత్తరులు చేసి మా పేద నెత్తురులను

కంపు దేహాలపై గుమాయింపు కొరకు

పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్

ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో

ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై

రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ

జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా

యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ

మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు

సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?

అందమును హత్య చేసెడి హంతకుండ!

మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!

కోయ బోకుము మా పేద కుత్తుకలను

అకట! చేసేత మమ్ముల హత్య చేసి

బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి

నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;

ఏమి తోచక దేవర కెరుక సేయ

వట్టి చేతులతో ఇటు వచ్చినాను.


అమృతం కురిసిన రాత్రి...

అమృతం  కురిసిన  రాత్రి...

శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం - పూర్వపీఠిక

శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రం - పూర్వపీఠిక


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || ౧ ||


యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ |

విఘ్నం నిఘ్నంతి సతతం విష్వకసేనం తమాశ్రయే || ౨ ||


వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || ౩ ||


వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |

నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || ౪ ||


అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |

సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే || ౫ ||


యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ |

విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || ౬ ||


ఓమ్ నమో విష్ణవే ప్రభవిష్ణవే |


శ్రీవైశంపాయన ఉవాచ-

శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః |

యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత || ౭ ||


యుధిష్ఠిర ఉవాచ-

కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్ |

స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ || ౮ ||


కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |

కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసారబంధనాత్ || ౯ ||


శ్రీ భీష్మ ఉవాచ-

జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమమ్ |

స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః || ౧౦ ||


తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |

ధ్యాయన్స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ || ౧౧ ||


అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |

లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ || ౧౨ ||


బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ |

లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్ || ౧౩ ||


ఏష మే సర్వధర్మాణాం ధర్మోzధికతమో మతః |

యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || ౧౪ ||


పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |

పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ || ౧౫ ||


పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |

దైవతం దైవతానాం చ భూతానాం యోzవ్యయః పితా || ౧౬ ||


యతః సర్వాణి భూతాని భవన్త్యాదియుగాగమే |

యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే || ౧౭ ||


తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే |

విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ || ౧౮ ||


యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |

ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || ౧౯ ||


ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః |

ఛందోzనుష్టుప్ తథా దేవో భగవాన్దేవకీసుతః || ౨౦ ||


అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |

త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియోజ్యతే || ౨౧ ||


అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || ౨౨ ||

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |


శ్రీవేదవ్యాస ఉవాచ ---

ఓమ్ అస్య శ్రీవిష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య ||

శ్రీ వేదవ్యాసో భగవానృషిః | అనుష్టుప్ ఛందః |

శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |

అమృతాంశూద్భవో భానురితి బీజమ్ |

దేవకీనందనః స్రష్టేతి శక్తిః |

ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః |

శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |

శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |

రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రమ్ |

త్రిసామా సామగః సామేతి కవచమ్ |

ఆనందం పరబ్రహ్మేతి యోనిః |

ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ||

శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ |

శ్రీమహావిష్ణుప్రీత్యర్థం సహస్రనామజపే వినియోగః ||


 || అథ ధ్యానమ్ |

క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేర్మౌక్తికానాం

మాలాక్ళుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః |

శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః

ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః || ౧ ||


భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే

కర్ణావాశాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః |

అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః

చిత్రం రంరమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి || ౨ ||


ఓమ్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |

లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ || ౩ ||


మేఘశ్యామం పీతకౌశేయవాసం

శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్ |

పుణ్యోపేతం పుండరీకాయతాక్షం

విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ || ౪ ||


నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే |

అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || ౫ ||


సశంఖచక్రం సకిరీటకుండలం

సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |

సహారవక్షఃస్థలకౌస్తుభశ్రియం

నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ || ౬ ||


ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి

ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ |

చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం

రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || ౭ ||

పోతన సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణము. .


పోతన సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించడమే అతని కవిత్వమాధుర్యానికి కారణము. . 

అతని యీ రెండు పద్యాలు అతి మధరం.

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

భారతీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాడీ పద్యంలో. తెల్లని వస్తువులని ఏకరువుపెట్టి, అలాంటి శుభాకారతతో వెలిగే నీ రూపాన్ని ఎప్పుడు చూస్తానో కదా అని ఆ సరస్వతిని వేడుకుంటున్నాడు. ఒక్క శరత్ జ్యోత్స్నతో తృప్తిపడలేదు పోతన మనసు! శరత్కాలపు మేఘాలు, చంద్రుడు, కర్పూరము, చందనము, హంస, మల్లెల మాల, మంచు, సముద్రపు నురుగు, హిమాలయము, ఱెల్లుగడ్డి, ఆదిశేషువు, మొల్లలు, తెల్ల మందారము, సుధాసముద్రము, తెల్లతామర, ఆకాశగంగ - ఇవన్నీ గుర్తుకొచ్చాయి అతనికి. వాటన్నిటితో పోలిస్తే కాని తృప్తి కలగలేదతనికి! 

ఇక రెండో పద్యం:

క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికి, చంచరీకచయ సుందరవేణికి, రక్షితామర

శ్రేణికి, తోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్

వాణికి, అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్

ఏదేమయినా కవిత్వం, అందునా అలాంటి తియ్యని కవిత్వం సృజించగలగడం ఒక అద్భుత శక్తి...

పనిలో పనిగా మిగిలిన ఇద్దరు ప్రధానశక్తులు, లక్ష్మీ దుర్గల గూర్చి, పోతనగారే చేసిన స్తుతిని కూడా చదువుకొని ఆనందిద్దాం:

హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో, వర్థంబు పెన్నిక్క, చం

దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

పోతన పద్యాల గురించి కరుణశ్రీగారి పద్యములు ...

పోతన పద్యాల గురించి కరుణశ్రీగారి పద్యములు ...


అచ్చపు జుంటితేనియల, నైందవబింబ సుధారసాల, గో

ర్వెచ్చని పాలమీగడల, విచ్చిన కన్నెగులాబి మొగ్గలన్

మచ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ

వెచ్చట నేర్చినావు సుకవీ! సుకుమారకళా కళానిధీ!


పోతన కవితామాధుర్యాన్ని కొన్ని వస్తువులతో పోలుస్తున్నారిక్కడ. స్వఛ్చమైన జుంటితేనె, చంద్రబింబంనుండి స్రవించే అమృతరసము, గోర్వెచ్చని పాలమీగడ, అప్పుడే విచ్చుకున్న గులాబి మొగ్గలు - వీటికి అసూయ కలిగించేలా ఉంటుందట పోతన కవిత్వం. ఏదో రకంగా తాను చవిచూసిన మాధుర్యాన్ని మాటల్లో చెప్పాలన్న తాపత్రయమే కాని, నిజానికి ఆ మాధుర్యం అనుభవైకవేద్యమే కాని ఉపమానాలకి అందుతుందా! అంతటి మధుర మంజుల మోహన ముగ్ధ శైలి ఎక్కడినుండి వచ్చిందో, అని ఆశ్చర్యపోతున్నారు కూడా. అలా ఆశ్చర్యపడి ఊరుకో లేదు...


ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ

ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో

పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!


అని దానికొక అందమైన ఊహనికూడా జోడించారు. ఆ మాధుర్యం వెనక కారణం పంచదార అని కరుణశ్రీగారి ఊహ. అంటే అంత తియ్యగా ఉంటుంది అతని రచన అని! కరుణశ్రీ స్వయంగా ఒక కవి కాబట్టి కవితాత్మకమైన అలాంటి కల్పన చేసారు. ఒక వ్యక్తిలో కనిపించే అసాధారణ విశిష్టత గురించి ఏవో కల్పనలు చెయ్యడం మానవ సహజం కాబోలు. ముఖ్యంగా మన భారతీయులకి అది బాగా అలవాటనుకుంటాను.

Thursday, December 26, 2013

విష్ణుః షోడశనామస్తోత్రం

 
విష్ణుః షోడశనామస్తోత్రం


ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనమ్ |

శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్ || ౧ ||


యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమమ్ |

నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే || ౨ ||


దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్ |

కాననే నారసింహం చ పావకే జలశాయినమ్ || ౩ ||


జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్ |

గమనే వామనం చైవ సర్వకార్యేషు మాధవమ్ || ౪ ||


షోడశైతాని నామాని ప్రాతరూత్థాయ యః పఠేత్ |

సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకే మహీయతే || ౫ ||

Wednesday, December 25, 2013

ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!

'విశ్వనాధ పంచశతి ' 

.

అదియెమిటో  గానీ విశ్వనాధ గారంటే అందరికీ గంభీరమైన పద్యాలే గుర్తుకు వస్తాయి. నాకు మాత్రం ఆయనలోని సునిశితమైన వ్యంగ్యం, హాస్య చతురతా జ్ఞాపకం వస్తాయి.

'విశ్వనాధ పంచశతి ' అని వారు ఐదు వందల పద్యాలు వ్రాశారు సరదాగా.

ఏ పద్యానికాపద్యమే ఓ రస గుళిక.

ఒక్కో పద్యాన్ని పంచ్ లైన్ గా తీసుకొని ఒక్కో కథ వ్రాయవచ్చు. 

" వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ

సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు

అంగనామణి పెండిలియాడి కూడ

ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె "

" ఊరి భార్యలెల్లరూహించి యామెను

మంచంబుతోనిడిరి శ్మశానమందు

అట పిశాచకాంతలాలోచనము జేసి

పడతి మరల నూరి నడుమనిడిరి "

ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి

శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి


ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర

 వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః || ౧ ||


న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే

 దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః || ౨ ||


మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్

 మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః || ౩ ||


నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే

 నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః || ౪ ||


రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్

 కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః || ౫ ||


య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ

 యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః || ౬ ||


ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్

 నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః || ౭ ||


య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః

 సుజ్ఞానగోచరాయాzస్తు యకారాయ నమో నమః || ౮ ||

Tuesday, December 24, 2013

ద్రౌపది!.


ద్రౌపది!................   (కామేశ్వర రావు భైరవభట్ల  )

. ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట?

సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు. ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది. ఆమె అంటుందీ:

"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు

పెద్దవారి యట్ల పిన్నవారు

గాన, బతుల విధమ కాక యే శైలూషి

గాననంగ రాదు కంక భట్ట

అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"

"ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? అంతే కాదండోయ్! నా భర్తగారు నటుడే (శైలూషుడు అంటే నటుడు) కాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి?!


విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం

విష్ణుః అష్టావింశతినామ స్తోత్రం


అర్జున ఉవాచ-

కిం ను నామ సహస్రాణి జపతే చ పునః పునః |

యాని నామాని దివ్యాని తాని చాచక్ష్వ కేశవ || ౧ ||


శ్రీ భగవానువాచ-

మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనమ్ |

గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనమ్ || ౨ ||


పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధమ్ |

గోవర్ధనం హృషీకేశం వైకుంఠం పురుషోత్తమమ్ || ౩ ||


విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిమ్ |

దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజమ్ || ౪ ||


అనంతం కృష్ణగోపాలం జపతో నాస్తి పాతకమ్ |

గవాం కోటిప్రదానస్య అశ్వమేధశతస్య చ || ౫ ||


కన్యాదానసహస్రాణాం ఫలం ప్రాప్నోతి మానవః |

అమాయాం వా పౌర్ణమాస్యామేకాదశ్యాం తథైవ చ || ౬ ||


సంధ్యాకాలే స్మరేన్నిత్యం ప్రాతఃకాలే తథైవ చ |

మధ్యాహ్నే చ జపన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే || ౭ ||

Monday, December 23, 2013

రామ ఆపదుద్ధారక స్తోత్రం

 
రామ ఆపదుద్ధారక స్తోత్రం


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ||


నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ |

దండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే || ౧ ||


ఆపన్నజనరక్షైకదీక్షాయామితతేజసే |

నమోస్తు విష్ణవేతుభ్యం రామాయాపన్నివారిణే || ౨ ||


పదాంభోజరజస్స్పర్శ పవిత్రమునియోషితే |

నమోస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే || ౩ ||


దానవేంద్ర మహామత్త గజపంచాస్యరూపిణే |

నమోస్తు రఘునాధాయ రామాయాపన్నివారిణే || ౪ ||


మహిజాకుచసంలగ్నకుంకుమారుణవక్షసే |

నమః కల్యాణరూపాయ రామాయాపన్నివారిణే || ౫ ||


పద్మసంభవ భూతేశ మునిసంస్తుతకీర్తయే |

నమో మార్తాండ వంశ్యాయ రామాయాపన్నివారిణే || ౬ ||


హరత్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః |

నమోస్తు హరయే తుభ్యం రామాయాపన్నివారిణే || ౭ ||


తాపకారణసంసారగజసింహస్వరూపిణే |

నమో వేదాంతవేద్యాయ రామాయాపన్నివారిణే || ౮ ||


రంగత్తరంగజలధి గర్వహచ్ఛరధారిణే |

నమః ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే || ౯ ||


దారోసహిత చంద్రావతంస ధ్యాతస్వమూర్తయే |

నమః సత్యస్వరూపాయ రామాయాపన్నివారిణే || ౧౦ ||


తారానాయక సంకాశవదనాయ మహౌజసే |

నమోస్తు తాటకాహంత్రే రామాయాపన్నివారిణే || ౧౧ ||


రమ్యసాను లసచ్చిత్రకూటాశ్రమ విహారిణే |

నమస్సౌమిత్రిసేవ్యాయ రామాయాపన్నివారిణే || ౧౨ ||


సర్వదేవాహితాసక్త దశాననవినాశినే |

నమోస్తు దుఃఖధ్వంసాయ రామాయాపన్నివారిణే || ౧౩ ||


రత్న సానునివాసైక వంద్యపాదాంబుజాయ చ |

నమస్త్రైలోక్యనాథాయ రామాయాపన్నివారిణే || ౧౪ ||


సంసారబంధమోక్షైకహేతుదామప్రకాశినే |

నమః కలుషసంహర్త్రే రామాయాపన్నివారిణే || ౧౫ ||


పవనాశుగ సంక్షిప్త మారీచాద్యసురారయే |

నమో ముఖపరిత్రాత్రే రామాయాపన్నివారిణే || ౧౬ ||


దాంభికేతరభక్తౌఘమహానందప్రదాయినే |

నమః కమలనేత్రాయ రామాయాపన్నివారిణే || ౧౭ ||


లోకత్రయోద్వేగకర కుంభకర్ణశిరశ్ఛిదే |

నమో నీరదదేహాయ రామాయాపన్నివారిణే || ౧౮ ||


కాకాసురైకనయన హరల్లీలాస్త్రధారిణే |

నమో భక్తైకవేద్యాయ రామాయాపన్నివారిణే || ౧౯ ||


భిక్షురూపసమాక్రాంతబలిసర్వైకసంపదే |

నమో వామనరూపాయ రామాయాపన్నివారిణే || ౨౦ ||


రాజీవ నేత్రసుస్పంద రుచిరాంగసురోచిషే |

నమః కైవల్యనిధయే రామాయాపన్నివారిణే || ౨౧ ||


మందమారుతసంవీత మందారద్రుమవాసినే |

నమః పల్లవపాదాయ రామాయాపన్నివారిణే || ౨౨ ||


శ్రీకంఠచాపదళన ధురీణబలబాహవే |

నమః సీతానుషక్తాయ రామాయాపన్నివారిణే || ౨౩ ||


రాజరాజసుహృద్యోషార్చిత మంగళమూర్తయే |

నమ ఇక్ష్వాకువంశ్యాయ రామాయాపన్నివారిణే || ౨౪ ||


మంజులాదర్శ విప్రేక్షణోత్సుకైకవిలాసినే |

నమః పాలితభక్తాయ రామాయాపన్నివారిణే || ౨౫ ||


భూరిభూధర కోదండమూర్తి ధ్యేయస్వరూపిణే |

నమోస్తు తేజోనిధయే రామాయాపన్నివారిణే || ౨౬ ||


యోగీంద్రహృత్సరోజాతమధుపాయ మహాత్మనే |

నమో రాజాధిరాజాయ రామాయాపన్నివారిణే || ౨౭ ||


భూవరాహస్వరూపాయ నమో భూరిప్రదాయినే |

నమో హిరణ్యగర్భాయ రామాయాపన్నివారిణే || ౨౮ ||


యోషాంజలివినిర్ముక్త లాజాంచితవపుష్మతే |

నమస్సౌందర్యనిధయే రామాయాపన్నివారిణే || ౨౯ ||


నఖకోటి వినిర్భిన్న దైత్యాధిపతివక్షసే |

నమో నృసింహరూపాయ రామాయాపన్నివారిణే || ౩౦ ||


మాయామానుషదేహాయ వేదోద్ధరణ హేతవే |

నమోస్తు మత్స్యరూపాయ రామాయాపన్నివారిణే || ౩౧ ||


మితిశూన్య మహాదివ్యమహిమ్నే మానితాత్మనే |

నమో బ్రహ్మస్వరూపాయ రామాయాపన్నివారిణే || ౩౨ ||


అహంకారీతరజన స్వాంతసౌధవిహారిణే |

నమోస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే || ౩౩ ||


సీతాలక్ష్మణసంశోభిపార్శ్యాయ పరమాత్మనే |

నమః పట్టాభిషిక్తాయ రామాయాపన్నివారిణే || ౩౪ ||


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |

లోకాభిరామం శ్రీరామం భూయోభూయోనమామ్యహమ్ || ౩౫ ||


ఫలశ్రుతి-

ఇమం స్తవం భగవతః పఠేద్యః ప్రీతమానసః |

ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః || ౧ ||


స తు తీర్త్వా భవాంబోధిమాపదస్సకలానపి |

రామసాయుజ్యమాప్నోతి దేవదేవప్రసాదతః || ౨ ||


కారాగృహాదిబాధాసు సంప్రాప్తే బహుసంకటే |

ఆపన్నివారకస్తోత్రం పఠేద్యస్తు యథావిధిః || ౩ ||


సంయోజ్యానుష్టుభం మంత్రమను శ్లోకం స్మరన్విభుమ్ |

సప్తాహాత్సర్వబాధాభ్యో ముచ్యతే నాత్ర సంశయః || ౪ ||


ద్వాత్రింశద్వారజపతః ప్రత్యహం తు దృఢవ్రతః |

వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసంఖ్యయా || ౫ ||


ధనవాన్ ధనదప్రఖ్యస్స భవేన్నాత్ర సంశయః |

బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః || ౬ ||


తం తం కామమవాప్నోతి స్తోత్రేణానేన మానవః |

యంత్రపూజావిధానేన జపహోమాదితర్పణైః || ౭ ||


యస్తు కుర్వీత సహసా సర్వాన్కామానవాప్నుయాత్ |

ఇహలోకే సుఖీ భూత్వా పరే ముక్తో భవిష్యతి || ౮ ||

హనుమన్నమస్కారః

హనుమన్నమస్కారః


గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ |

రామాయణమహామాలారత్నం వందేzనిలాత్మజమ్ || ౧ ||


అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్ |

కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ || ౨ ||


మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్ |

కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || ౩ ||


ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః |

ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ || ౪ ||


మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |

వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || ౫ ||


ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్ |

పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్ || ౬ ||


యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |

బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్ || ౭ ||

Sunday, December 22, 2013

మధురాష్టకం

మధురాష్టకం


అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ |

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౧ ||


వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ |

చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౨ ||


వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ |

నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౩ ||


గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ |

రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౪ ||


కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ |

వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౫ ||


గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా |

సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౬ ||


గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ |

దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౭ ||


గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా |

దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౮ ||

అల వైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు .

అల వైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా


పల మందార వనాంతరామృత సర: ప్రాంతేందుకంతోపలో


తృలపర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి


హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించిసం రంభియై....


గజేంద్రుడు మొరపెట్టుకునే సమయంలో ఆ దేవ దేవుడు యేస్తితిలో ఉన్నాడో వర్ణించడం ఈపద్యంలోని చిత్రం..ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మహా విష్ణువు అప్పుడు రమాసాంగత్యంలో తేలియాడుతున్నాడు.

అల వైకుంఠపురం;ఆ పురంలో అంత:పురం.అందులో ప్రధాన సౌధ సమీపంలో అమృతసరోవరం,అక్కడ చంద్రకాంత వేదికపై కలువల పానుపు,,,ఆ పానుపుపై క్రీడిస్తున్న నారాయణుడు ఇదీ పోతన కట్టిన చిత్ర తోరణం

జన పద గీతం....చల్ మోహనరంగా...

జన పద గీతం....చల్ మోహనరంగా... 

నీకు నీ వారు లేరు నాకు నావారు లేరు 

ఏతి ఒడ్డున ఇల్లు కడదాము పదరా చల్ మోహనరంగా

నీకు నాకు జోదు కలిసెను గదరా

మల్లె తోటలోన మంచి నీళ్ళ బావి కాద

ఉంగరాలు మరిచి వస్తిని కదరా ||చల్ మోహనరంగ||

కంటికి కాతుకేట్టీ కడవా సంకాన బట్టి

కంటి నీరు కడవ నింపితి గదరా ||చల్ మోహనరంగ||

గుట్టు దాటి ప్పుట్టదాటి - ఘనమైన అడవిదాతి

అన్నిదాటి అడవి బడితిమి కదరా ||చల్ మోహనరంగ||

నీకి నాకు జోడు అయితే - మల్లెపూలా తెప్పగట్టీ

త్ర్ప్పమీద తేలిపోదము పదరా ||చల్ మోహనరంగ||

అదిరా నీ గుండెలదరా - మధురా వెన్నెల రేయి

నిదరాకు రమ్మంటిని కదరా ||చల్ మోహనరంగ||

జన పద గీతం..

జన పద గీతం..

చీరల్ కావలెనా


చీరల్ కావలెనా రవికల్ కావలెనా

నీకేమి కావాలెనే పొద్దుటూరి సంతలోనా


చీరల్ నాకొద్దురో రవికల్ నా కొద్దురో

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా


డావుల్ కావలెనా ఆరం కావలెనా

నీకేమి కావాలెనే పులివెందుల సంతలోనా


డావుల్ నాకొద్దురో ఆరం నాకొద్దురో

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా


కమ్మల్ కావలెనా కడియాల్ కావలెనా

నీకేమి కావాలెనే దర్మారం సంతలోనా


కమ్మల్ నాకొద్దురో కడియాల్ నాకొద్దురో

నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

Saturday, December 21, 2013

ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు.

ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు.

(పోతనామాత్యుడు.)

చదువని వాడజ్ఞుండగు

చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !

చదువగ వలయును జనులకు

చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !

చదివించిరి నను గురువులు

చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే

చదివినవి గలవు పెక్కులు

చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !!

ఇందు గలడందు లేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి జూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే !!

మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు బోవునే మదనములకు !

నిర్మల మందాకినీ వీచికల దూగు 

రాయంచ సనునె తరంగిణులకు !

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు

కోయిల సేరునే కుటజములకు !

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక

మ్మరుగునే సాంద్ర నీహారములకు !

అంబుజోదర దివ్య పాదారవింద

చింతనామృత పాన విశేష మత్త

చిత్త మే రీతి నితరంబు చేర నేర్చు

వినుత గుణ శీల మాటలు వేయు నేల !!

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము 

విష్ణు నాకర్ణించు వీనులు వీనులు 

మధువైరి దవిలిన మనము మనము 

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి 


లలిత సహస్ర నామము.


శ్రీ మాత్రే నమః


హయగ్రివుల వారు "వశిన్యాది వాగ్ధేవతలు" స్తుతించిన రహస్య నామ స్తోత్రం అగస్త్యుల వారికి తెలుపగా, వ్యాసులవారిచే గ్రంధస్తం చేయబడినది లలిత సహస్ర నామము.


లలితా పరాభట్టారిక మూర్తి మన అందరి ఇండ్లలో / లలిత సహస్ర నామ పుస్తకాలలో (-పటం 1) లాగా ఉంటుంది... కానీ దీనిలో ఒక చిన్న పొరపాటు ఉంది...


లలితా సహస్ర నామ స్తోత్రములో ప్రార్ధన ఇలా ఉంటుంది కదా...


"" సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత""


అనగా " చామర(మృగము వెంట్రకలతో చేయబడిన) వింజమరములను చేతిలో కలిగిన రమా(లక్ష్మి దేవి), వాణి(సరస్వతీ దేవి) ఎడమ(సవ్య), కుడి(దక్షిణ) వైపు ఉండి సేవిస్తుంటారు."


కానీ పటం 1 చాలా ప్రాచుర్యం పొందినా దానిలో కొంత పొరపాటు ఉన్నదని గమనించ గలరు.

స్తోత్రములో చెప్పిన విధంగా పటం2లో లలితాదేవి ఉంటుంది అని గమనించగలరు( కావలసిన వారు డౌన్‌లోడ్ చేసుకోన వచ్చును).


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి పాదాభివన్దనములు. 

Friday, December 20, 2013

భీమ శతకం...రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

భీమ శతకం...రచన: ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం.

1 బ్రదుకు వ్యథలు క్రమ్మి బరువెక్క నీ బుర్ర,


ఇల్లు వదలి బైట కెళ్ళి చూడు,


ఎన్నిరెట్లు బాధ లున్నవో ధర లోన -


2ఎండమావుల కొఱ కెందుకీ పరుగులు?


సుంత ఆగి శ్రమ నొకింత మఱువ


చుట్టు నున్న ప్రకృతి శోభను వీక్షించు!


విమల సుగుణ ధామ వేము భీమ.3ఉదయమందు లేచి ఉద్యానవన మేగి,


సుంత విచ్చి నట్టి సుమము చూడ,


కలుగు సంతసమ్ము తెలుపంగ తరమౌనె!


విమల సుగుణ ధామ వేము భీమ.


4ముళ్ళమొక్క పీకి, పూలమొక్కను పెంచు,


మత్సరమ్ము నణచి మంచి పెంచు,


మంచి కన్న జగతి మించిన దేదిరా!


విమల సుగుణ ధామ వేము భీమ.

- బాలముకుందాష్టకం

- బాలముకుందాష్టకం


కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |

వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || ౧ ||


సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |

సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || ౨ ||


ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |

సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || ౩ ||


లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |

బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౪ ||


శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |

భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || ౫ ||


కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |

తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౬ ||


ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |

ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౭ ||


ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |

సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || ౮ ||

"భాస్కర రామాయణము" లోని కిష్కింధాకాండము

"భాస్కర రామాయణము" లోని కిష్కింధాకాండము మల్లికార్జునభట్టు ప్రణీతము!

(వివరణ....పిస్కా సత్యనారాయణ గారు.)

వాలి వధ జరిగిన తర్వాత, వర్షాకాలం వచ్చిన సందర్భములోని ఒక పద్యమును అవలోకిద్దాం. 


మొదట ఆ పద్యాన్ని చిత్తగించండి. 

యమునద్గంగము, కృష్ణభూమదిల, మబ్జాక్ష న్మనుష్యంబు, నీ 

ల మహీధ్రన్నిఖిలాచలావళి, తమాలద్భూజ, మిందీవర 

త్కుముదశ్రేణి, పికద్విహంగము, దమస్తోమద్గ్రహోర్క ప్రభా 

సముదాయం బగుచుండె లోక మలఘు శ్యామాభ్రముల్ బర్వినన్.


ఇప్పుడు పద్యభావమును పరిశీలిద్దాము. 

వర్షారంభ సూచనగా ఆకాశం అంతా దట్టంగా నల్లని మేఘాలు 

కమ్ముకున్నాయి. సందులేకుండా, గగనతలం నిండుగా కరిమబ్బులు 

ఆక్రమించాయి. లోకమంతా ఆ మబ్బుల వల్ల చీకటైపోయింది. ప్రకృతిలోని 

ప్రతి వస్తువు పైనా నీలినీడలు కమ్మి, వాటి రూపురేఖలూ, స్వభావాలూ 

పూర్తిగా మారిపోయినట్లుగాఅనిపించింది.

మరి, ఏవి ఎలా మారినాయో కాస్త వివరంగా తెలుసుకుందాం. 


గంగానది కాస్తా యమునానది అయిందిట! 'ఇదేమిటీ! ఇదెలా సంభవం?!' అనుకుంటున్నారు కాబోలు! తెల్లని గంగాజలం కాలమేఘచ్ఛాయ వలన నల్లగా మారేసరికి, అది యమునానదిలా కనబడింది. గంగ నీరు తెల్లగా, యమున నీరు నల్లగా ఉండడం లోకప్రసిద్ధం! అందుకే "యమునద్గంగము" అన్నాడు కవి. పుడమి మొత్తం కృష్ణభూమిగా, అనగా నల్లని నేలగా మారిపోయింది. కృష్ణవర్ణమంటే నలుపురంగు! ఇక, మనుష్యులందరూ "అబ్జాక్షులు" ఐనారట! ' అబ్జాక్షుడు ' అంటే పద్మాల వంటి కన్నులు కలవాడని అర్థం. అనగా, విష్ణుమూర్తి! జనులందరూ విష్ణుమూర్తులు అయినారు అంటే నీలమేఘశ్యాములైనారని అర్థం! పర్వతాలు, కొండలు అన్నీ నీలగిరులైనాయట! వృక్షాలన్నీ తమాలభూజములుగా, అనగా కాటుకచెట్లుగా మారిపోయినవి! సరస్సుల్లో ఉండే కలువపూవులు ఇందీవరములుగా, అంటే నల్లకలువలుగా దర్శనమిచ్చాయి! పక్షులన్నీ కూడా నల్లగా కోకిలల వలె కనిపించసాగాయి! సూర్యుడు, ఇతరగ్రహాల కాంతి మీద మేఘచ్ఛాయ పడి, వాటి ప్రభాసముదాయమంతా చీకటికప్పుగా మారిపోయింది!


తెలిసిన సంగతులే!

తెలిసిన సంగతులే!

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15 న విడుదలయ్యింది. అప్పటి నుండి ఇప్పటివరకు కొన్ని వేల సినిమాలు తెలుగులో వచ్చాయి. ఆ సినిమాల్లో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాఫులు. కానీ ఆ సినిమాల్లో మనకు తెలిసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అలాంటి తెలిసిన సంగతులు కొన్ని...

* 'ఆంధ్రా దిలీప్' అని నటుడు చలం ను పిలుస్తారు. అలా మొదట పిలిచినవారెవరో తెలుసా? హిందీ నటుడు 'పృధ్వీరాజ్ కపూర్' (రాజ్ కపూర్ తండ్రి).

* హాస్యనటుడు రాజబాబు అసలుపేరు 'పుణ్యమూర్తుల అప్పల్రాజు'. మరి మురళీ మోహన్ అసలు పేరేంటో తెలుసా? 'రాజబాబు'.

* తెలుగులో ఎక్కువమంది హీరోయిన్ లతో హీరోగా చేసిన నటుడు 'చంద్రమోహన్'. ఆయనతో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ లు అయిన వారిలో 'శ్రీదేవి, జయసుధ, జయప్రద, వాణిశ్రీ, విజయశాంతి, రాధ, సుహాసిని'లు కొందరు.

* ఎస్వీ కృష్ణారెడ్డి అనగానే మనకు చక్కటి హాస్య చిత్రాలను అందించిన దర్శకుడిగా తెలుసు. ఆయన హీరోగా 'ఉగాది, అభిషేకం' చిత్రాల్లో చేశాడు. ఈ రెండు సినిమాల కన్నా ముందు 'పగడాల పడవ' పేరుతో ఒక సినిమా ప్రారంభించి అందులో హీరోగా నటించాడు. కానీ ఆసినిమా ఆగిపోయింది. అందులో హీరోయిన్ ఎవరనుకున్నారు? సూపర్ కృష్ణ కుమార్తె 'మంజుల'.

* 'విజయ ప్రొడక్షన్స్' అనగానే మనకు 'మాయాబజార్' సినిమా గుర్తుకు వస్తుంది. అపూర్వ కళాఖండం 'మాయాబజార్'. ఈ సినిమాకు ముందుగా పెట్టాలనుకున్న పేరు 'శశిరేఖా పరిణయం'. కానీ ఎందుకో ఆపేరు పెట్టడం ఇష్టం లేక 'మాయాబజార్' పెట్టారు.

* తెలుగు సినిమాకు, సూపర్ స్టార్ కృష్ణకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమా మార్పులు కృష్ణతోనే మొదలయ్యాయి. అవేటంటే -

తొలి సినిమా స్కోపు చిత్రం - అల్లూరి సీతారామరాజు.

తొలి కౌబాయ్ సినిమా - మోసగాళ్ళకు మోసగాడు.

తొలి బాండ్ చిత్రం - గూడాఛారి 116.

తొలి డిటియస్ చిత్రం - తెలుగు వీర లేవరా.

* తొలి తెలుగు సినిమాలు

తొలి టాకీ సినిమా - భక్త ప్రహ్లాద.

తొలి రంగుల సినిమా - లవకుశ.

తొలి ద్విపాత్రాభినయ సినిమా - ఇద్దరు మిత్రులు.

తొలి అనువాద సినిమా - ఆహుతి.

తొలి జానపద సినిమా - కనకతార.

తొలి బాలల సినిమా - ధ్రువ - అనసూయ.

తొలి తెలుగు నవలా సినిమా - బారిస్టరు పార్వతీశం.

ఔట్ డోర్ లో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా - సాక్షి.

విదేశాల్లో ప్రదర్శితమైన తొలి సినిమా - మల్లీశ్వరి.

తొలి సోషియో ఫాంటసీ సినిమా - దేవాంతకుడు.

తొలి సినిమా హాలు - విజయవాడ మారుతి టాకీస్.

తొలి సినిమా పత్రిక - చిత్రకళ.

తెలుగు నుండి డబ్ చేయబడిన తొలి చిత్రం - కీలు గుర్రం(తమిళం లోకి)

* 'నీ గొంతు పనికిరాదు'? 'నువ్వు సినిమాల్లో పనికిరావ్ పో!' అంటూ అనిపించుకున్నా నిరాశపడక శోధించి సాధించిన నటుల్లో 'రావుగోపాలరావు' ఒకరు. 'ముత్యాలముగ్గు' సినిమాలోని డైలాగ్ లతో కూడిన గ్రామ్ ఫోన్ రికార్డులు అప్పట్లో బాగా అమ్ముడుపోయాయి. దటీజ్ రావుగోపాలరావు!

* భారతదేశ చరిత్రలో ఎన్నికల్లో పోటీచేసి లోక్ సభకు ఎన్నికైన తొలి సినీ నటుడు మన తెలుగు నటుడే. ఆయన ఎవరో తెలుసా? కె. జగ్గయ్య. (1967 లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున).

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సబ్సిడీని అందుకున్న మొదటి చిత్రం 'పదండి ముందుకు'. తొలి తెలుగు రాజకీయ చిత్రం కూడా ఇదే.

* 'తోట రాముడు' సినిమాలో హీరోగా నటించిన నటుడు చలం. కానీ ఇదే 'తోట రాముడు' పేరుతో ఎన్.టి.ఆర్ హీరోగా ఒక చిత్రం ప్రారంభం కావాల్సింది. ఎందుకనో ఆగిపోయింది.

* 'వెంకటేశ్వర మహాత్యం' చిత్రాన్ని రెండుసార్లు రూపొందించిన వారు దర్శక నిర్మాత పి. పుల్లయ్య.

* 'అనుపమ ఫిలిమ్స్' వారి తొలిచిత్రం 'ముద్దుబిడ్డ'. కానీ ఈపేరు కన్నా ముందు అనుకున్న పేరు 'బిందుగారబ్బాయి'. ఇదే అనుపమ వారి నిర్మించిన 'ఎం.ఎల్.ఎ' కు మొదట 'పుట్టినరోజు' అనే పేరు అనుకున్నారు.

* 'జయసుధ' అసలుపేరు 'సుజాత'.

* తొలి టాకీ చిత్రనాయిక - 'సురభి' కమలాబాయి.

* హీరోయిన్ కి గ్లామర్ తెచ్చిన తొలి నటీమణి - కాంచనమాల.

* తొలి తెలుగు సినిమా నేపధ్య గాయని - రావు బాలసరస్వతి.

* వంశీ దర్శకత్వంలో 'గాలి గొండపురం రైల్వే స్టేషన్' పేరుతో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ చేశారు. లతా మంగేష్కర్ తో ఒక పాట పాడించారు కూడా. కానీ సినిమా మాత్రం ఆగిపోయింది. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరనుకుంటున్నారు? 'వెంకటేష్'.

* కె. విశ్వనాథ్, కళ్యాణ చక్రవర్తి కాంబినేషన్ లో 'సిరిమువ్వల సింహనాదం' పేరుతో ఒక సినిమా షూటింగ్ జరుపుకుని ఆడియో కూడా విడుదలైంది. కానీ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు.

* పూర్తిగా జంతువులతో షూటింగ్ జరుపుకుని విడుదలైన చిత్రం - మాకూ స్వాతంత్ర్యం కావాలి.

* ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, కృష్ణంరాజు లతో బాలనటిగా నటించి ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా నటించిన నటి - శ్రీదేవి.

* ఈ మధ్యకాలంలో అన్ని వరుస ఫ్లాపులతో ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెడుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆ మధ్య 'వైజయంతీ మూవీస్' పై నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఓ చిత్రంలో హీరోయిన్ గా ఊర్మిళ నటించింది. ఎందుకనో ఈ సినిమా ఆగిపోయింది. ఇంతకూ ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరో తెలుసా? 'చిరంజీవి'.

* బుల్లితెర పై(టి.వి) నటించిన తొలి హీరో - మురళీ మోహన్.

* సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి చిత్రం ఆదూర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన సినిమా 'తేనె మనసులు' అని చాలామంది అనుకుంటారు. నిజానికి ఈ సినిమా కృష్ణ హీరోగా నటించిన తొలి సినిమా. అంతకు ముందు కొన్నిచిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు కృష్ణ. అందులో నటుడు జగ్గయ్య నిర్మించిన 'పదండి ముందుకు' ఒక సినిమా.

* 'మా సినిమా నువ్వే హీరోయిన్ వి' అన్నారు. అది కూడా అక్కినేని పక్కన నటించే అవకాశం. తీరా - ఆ దర్శకుడు లాభం లేదు! నువ్వు హీరోయిన్ గా బాగుండవన్నారు. మళ్ళీ ఇంకో సినిమాలో చిన్న నర్తకి వేషం వేసింది ఆ నటి. ఇంకో సినిమాలో కాస్త గుర్తింపు ఉండే వేషం వేసింది. అప్పుడు వచ్చింది ఒక సినిమా. ఆ నటి జాతకం మార్చింది. ఆ సినిమానే 'దేవదాసు' - ఆ నటే 'సావిత్రి'. హీరోయిన్ గా బాగుండవన్న దర్శకుడు 'ఎల్.వి. ప్రసాద్'. 'సంసారం' చిత్రంలో.

Thursday, December 19, 2013

నారాయణస్తోత్రం

 నారాయణస్తోత్రం

త్రిభువనభవనాభిరామకోశం సకలకళంకహరం పరం ప్రకాశమ్ |

అశరణశరణం శరణ్యమీశం హరిమజమచ్యుతమీశ్వరం ప్రపద్యే || ౧ ||

కువలయదలనీలసంనికాశం శరదమలామ్బరకోటరోపమానమ్ |

భ్రమరతిమిరకజ్జలాఞ్జనాభం సరసిజచక్రగదాధరం ప్రపద్యే || ౨ ||

విమలమలికలాపకోమలాఙ్గం సితజలపఙ్కజకుడ్మలాభశఙ్ఖమ్

శ్రుతిరణితవిరఞ్చిచఞ్చరీకం స్వహృదయపద్మదలాశ్రయం ప్రపద్యే || ౩ ||

సితనఖగణతారకావికీర్ణం స్మితధవలాననపీవరేన్దుబిమ్బమ్

హృదయమణిమరీచిజాలగఙ్గం హరిశరదమ్బరమాతతం ప్రపద్యే || ౪ ||

అవిరలకృతసృష్టిసర్వలీనం సతతమజాతమవర్థనం విశాలమ్

గుణశతజరఠాభిజాతదేహం తరుదలశాయిన మర్భకం ప్రపద్యే || ౫ ||

నవవికసితపద్మరేణుగౌరం స్ఫుటకమలావపుషా విభూషితాఙ్గమ్

దినశమసమయారుణాఙ్గరాగం కనకనిభామ్బరసున్దరం ప్రపద్యే || ౬ ||

దితిసుతనలినీతుషారపాతం సురనలినీసతతోదితార్కబిమ్బమ్

కమలజనలినీజలావపూరం హృది నలినీనిలయం విభుం ప్రపద్యే || ౭ ||

త్రిభువననలినీసితారవిన్దం తిమిరసమానవిమోహదీపమగ్ర్యమ్

స్ఫుటతరమజడం చిదాత్మతత్త్వం జగదఖిలార్తిహరం హరిం ప్రపద్యే || ౮ ||

లాలీ పాట...

లాలీ పాట...

రామాలాలీ మేఘ శ్యామా లాలీ రామా

రామరాజ్యమైన దశరథ తనయాలాలీ

ఎంత ఎత్తు ఎదిగినావో.. ఏమి చేయుదుమో రామా

అందరి కన్నుల ముందర.. నీవు ముద్దుగ తిరిగేవో రామా

అయోధ్య నగరమంతా.. అలంకరించేమో రామా

నీవు నడిచే బాటల్లోన.. మల్లెలు చల్లేమో

అడ్డమైన ఆటలు... ఆడి అలసిపోతివో రామా

జో కొట్టి జోలలు... పాడి నిద్దురపుచ్చేమో రామా

బంగారు పట్టు... శాలువ పైన కప్పేమో రామా

జోకొట్టి జోలలుపాడి.. నిద్దురపుచ్చేమో రామా


Wednesday, December 18, 2013

తెలుగు వారము మేము


తెలుగు వారము మేము

ఛందస్సు: ద్విరదగతి రగడ


రచన: ఆచార్య వి. ఎల్. ఎస్. భీమశంకరం.


తెలుగు వారము మేము, తెలుగు జాతియె వెలుగు,

తెలుగన్న మాకెన్నొ తీపి తలపులు గలుగు,

ఏ దేశమందున్న, ఏ చోట కేగినా

ఏ దారి నడచినా, ఎంతెత్తు కెదిగినా, 4


ఆశ మా కెప్పుడూ అందాల తెలుగన్న,

దేశభాషల లోన తెలుగు లెస్సేనన్న,

మాతృ భాషను వదలి మనలేము మేమెన్న,

భాతృజన మన్నచో భక్తి భావము మిన్న - 8


తెలుగు కీర్తిని తలచి, తెలుగు సంస్కృతి నుంచి

నలువైన శబ్దముల లలితముగ వెలయించి,

కవనములు రచయించి, ఘనరవము వహియించి,

చవులూర పాడించి, భువినెల్ల అలరించి, 12


పలు బాస లెరిగినా తెలుగులో భాషించి,

వెలయించి మధురిమలు, కిల కిలా రవళించి,

అలరులను విరియించి అందరికి వినిపించి

వెలుగు చూపెదమింక, యెలుగెత్తి చాటించి - 16


మిగత వారిని గాంచి, మిగుల గౌరవముంచి,

ప్రగతి వారికి పంచి, బ్రతుకు విలువలు పెంచి,

జగలంబు నలి చేసి, జగడంబు వెలి వేసి,

సగటు మానవు వాసి సమృధ్ధిగా చేసి, 20


అగచాట్లు తగ్గించి, అమృతంబు పండించి,

జగతి స్వర్గము చేసి జాగృతిని హెచ్చించి,

తెలుగు సంస్కృతి శోభ నలువురూ గుర్తింప,

విలువలను పెంచెదము విఖ్యాతి వ్యాపింప. 24

నామరామాయణం

 నామరామాయణం


రామ రామ జయ రాజారామ |

రామ రామ జయ సీతారామ |


బాలకాండము-

శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మకపరమేశ్వర రామ |

శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |

చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ |

కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియధన రామ |

ఘోరతాటకాఘాతుక రామ | మారీచాదినిపాతక రామ |

కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ |

గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ |

నావికధావికమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ |

విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ |

సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ |

భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ |


అయోధ్యాకాండము-

అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ |

రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ |

ప్రియగుహవినివేదితపద రామ | ప్రక్షాళితనిజమృదుపద రామ |

భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ |

దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్పిత రామ |

విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ |


అరణ్యకాండము-

దండకావనజనపావన రామ | దుష్టవిరాధవినాశన రామ |

శరభంగసుతీక్ష్ణార్చిత రామ | అగస్త్యానుగ్రహవర్ధిత రామ |

గృధ్రాధిపసంసేవిత రామ | పంచవటీతటసుస్థిత రామ |

శూర్పణఖార్తివిధాయక రామ | ఖరదూషణముఖసూదక రామ |

సీతాప్రియహరిణానుగ రామ | మారీచార్తికృతాశుగ రామ |

వినష్టసీతాన్వేషక రామ | గృధ్రాధిపగతిదాయక రామ |

శబరీదత్తఫలాశన రామ | కబంధబాహుచ్ఛేదన రామ |


కిష్కింధాకాండము-

హనుమత్సేవితనిజపద రామ | నతసుగ్రీవాభీష్టద రామ |

గర్వితవాలిసంహారక రామ | వానరదూతప్రేషక రామ |

హితకరలక్ష్మణసంయుత రామ |


సుందరకాండము-

కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ |

సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ |

శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ |

కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ |


యుద్ధకాండము-

రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ |

శోషితశరదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ |

పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ |

రాక్షససంఘవిమర్ధక రామ | అహిమహిరావణచారణ రామ |

సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ |

ఖఃస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ |

అభిషిక్తవిభీషణవందిత రామ | పుష్పకయానారోహణ రామ |

భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ |

సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానస రామ |

రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ |

పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ |

కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ |

సమస్తలోకోద్ధారక రామ |


ఉత్తరకాండము-

ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ |

సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ |

విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ |

స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ |

అశ్వమేధక్రతుదిక్షిత రామ | కాలానివేదితసురపద రామ |

ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిభుదానందక రామ |

తేజోమయనిజరూపక రామ | సంస్మృతిబంధవిమోచక రామ |

ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ |

సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ |

వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యనందపదస్తిత రామ |


మంగళం-

భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ |

మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ |

ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ |

రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ |

Tuesday, December 17, 2013

దశావతారస్తుతి


 దశావతారస్తుతి


నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||


వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే

మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౧ ||


మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో

కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౨ ||


భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే

క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౩ ||


హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాzభయధారణహేతో

నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౪ ||


బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే

వటుపటువేష మనోజ్ఞ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౫ ||


క్షితిపతివంశసంభవమూర్తే క్షితిపతిరక్షాక్షతమూర్తే

భృగుపతిరామవరేణ్య నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౬ ||


సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో

రావణమర్దన రామ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౭ ||


కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే

కాళియమర్దన కృష్ణ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || ౮ ||


త్రిపురసతీ మానవిహరణా త్రిపురవిజయమార్గనరూపా

శుద్ధజ్ఞానవిబుద్ధ నమో భక్తాం తే పరిపాలయ మామ్ || ౯ ||


శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే

కల్కిరూపపరిపాల నమో భక్తాం తే పరిపాలయ మామ్ || ౧౦ ||


నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || ౧౧ ||

ఏక శ్లోకీ రామాయణం...

 ఏక శ్లోకీ రామాయణం


ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ |

వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||

వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |

పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||

Monday, December 16, 2013

ఐనా మనిషి మారబోడు…

ఐనా మనిషి మారబోడు…

(by gsnaveen)

ప్రాణం గాలిలో కలసిపోయింది

శరీరం అగ్నిలో ఆహుతైపోయింది

కంకాళాలు నీటిలో నిమజ్జనమైపోయాయి

ఆత్మ ఆకాశానికేసి పోయింది

నాలోని కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం

అనే పంచ “భూతాలు” మాత్రం నేను ఎత్తే మరుసటి

జన్మకోసం ఎదురు చూస్తూ భూమిపైనే ఉండిపోయాయి

———-౦౦౦౦::~O~::౦౦౦౦————

కృష్ణాష్టకం

 కృష్ణాష్టకం


వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |

దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || ౧ ||


ఆతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |

రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౨ ||


కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |

విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ || ౩ ||


మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |

బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ || ౪ ||


ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |

యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ || ౫ ||


రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |

అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ || ౬ ||


గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |

శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ || ౭ ||


శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |

శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ || ౮ ||


కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||

'సుందరకాండ' అని పేరు పెట్టడానికి గల కారణం...


'సుందరకాండ' అని పేరు పెట్టడానికి గల కారణం....

(భావరాజు పద్మిని...)


సుందరే సుందరో రామ:

సుందరే సుందరీ కథ:

సుందరే సుందరీ సీత

సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం

సుందరే సుందరం కపి:

సుందరే సుందరం మంత్రం

సుందరే కిం న సుందరం?


సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది?

Saturday, December 14, 2013

ఎంత చక్కటి అందం.... ఎన్నాలదో ఈ అనందం...

ఎంత చక్కటి అందం.... ఎన్నాలదో ఈ అనందం...

అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం


అందమె ఆనందం 


పడమట సంధ్యా రాగం 


కుడి ఎడమల కుసుమ పరాగం //పడమట //


ఒడిలో చెలి మోహన రాగం


ఒడిలో చెలి మోహన రాగం 


జీవితమే మధురానురాగం


జీవితమే మధురానురాగం //అందమె //
పడిలేచే కడలి తరంగం .. ఓ ..


పడిలేచే కడలి తరంగం


వడిలో జడిసిన సారంగం // పడిలేచే //


సుడిగాలిలో .. ఓ ..


సుడిగాలిలో ఎగిరే పతంగం


జీవితమే ఒక నాటక రంగం


జీవితమే ఒక నాటక రంగం ... // అందమె // 

రామ దాసు కీర్తన....

రామ దాసు కీర్తన.


ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామ

నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామ


శ్రీ రఘు నందన సీతా రమణ శ్రితజన పోషక రామ

కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు రామ


క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామ

దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామ


వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామ

దాసార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘు రామ

తెనాలి రామకృష్ణ కవి రచించిన “పాండురంగ మాహాత్మ్యం” నుండి ఒక పద్యం.

By Ramana Balantrapu

తెనాలి రామకృష్ణ కవి రచించిన “పాండురంగ మాహాత్మ్యం” నుండి ఒక పద్యం. 

మహా భక్తుడైన పుండరీకునికి బాలకృష్ణుడు సాక్షాత్కరించాడు. భక్తుడు భగవంతుని పొగుడుతున్నాడు. 


పొదలు నీ పొక్కిటి పువ్వు కాన్పున గదా !

పెను మాయ పిల్లల బెట్టుటెల్ల

బొడము నీ మొదలి యూర్పుల నేర్పులన కదా!

చదువు సంధ్యలు గల్గి జగము మనుట

కెరలు నీ యడుగు దామరల తేనియ గదా !

పాపంపు బెనురొంపి పలుచ నగుట

పొసగు నీ తెలిచూపు పస గదా ! ఇది రాత్రి

ఇది పవలను మేర లెఱుగబడుట

భవన ఘటనకు మొదలి కంబమును బోలె

భువనములకెల్ల నీ వాదిభూతి వగుచు

నిట్టనిలుచున్కిచే గాదె నెట్టుకొనియె 

గెంటు గుంటును లేక లక్ష్మీకళత్ర!

లక్ష్మీదేవి భార్యగా (కళత్రము) కలిగిన ఓ పరమాత్మా! అందమైన (పొదలు) నీ నాభి పద్మంలో (పొక్కిలి అంటే నాభి, బొడ్డు; పొక్కిటిపువ్వు=నాభిపద్మం) జన్మించిన బ్రహ్మదేవునివల్లనే కదా పెనుమాయ - ఈ లోకాలూ, జీవరాశులూ అనే పిల్లల్ని పెట్టింది.

పొడము అంటే జన్మించు. నీ తొలి నిట్టూర్పులలో జన్మించిన వేదముల నేర్పులవల్లనే కదా ప్రపంచానికి చదువు సంధ్యలు అబ్బింది. వేదాలను పరమాత్ముని నిఃశ్వాసాలుగా వర్ణించడం జరింది. వేదాలే చదువులు. అవే సంధ్యావందన మంత్రాదికం. అంచేత చమత్కారంగా వేదాలను చదువు సంధ్యలు అన్నాడు కవి. 

కెరలు అంటే అతిశయించు. అందం అతిశయించే నీ పాదపద్మాలనుంచి స్రవిస్తున్న తేనెవల్లనే కదా పాపము అనే రొంపి పలుచనై కడిగివేయబడుతోంది. గంగానది పాపహారిణి. అది విష్ణుపాదాలనుంచి పుట్టింది అంటారు. విష్ణుపాదోద్భవ. ఆ నదిని స్ఫురింపజేస్తోంది తేనియ అనే పదం. 

స్వామీ! నీ తేట తెల్లమైన దృష్టి (తెలిచూపు) ప్రభావం వల్లనే కదా - ఇది రాత్రి, ఇది పగలు అనే విభాగం (మేరలు) ఏర్పడుతోంది. సూర్యచంద్రులు శ్రీమన్నారాయణుని రెండు నేత్రాలు అని పురాణవర్ణన. 

గృహనిర్మాణానికి మూలస్తంభంలాగా (మొదలి కంభమువోలె) ఈ భువనాలకన్నీటికీ నువ్వే ఆదికారణానివి (ఆది భూతివి). అలా నువ్వు నిట్టనిలువుగా నిలబడ్డావు కాబట్టే ఈ భువనాలు అన్నీ త్రోపుడులు లేకుండా (గెంటు) కుంటువోకుండా కాలం నెట్టుకువస్తున్నాయి. ఇవి స్థిరంగా ఇన్ని వేల యుగాలు నిలవడానికి నువ్వే ఆదికారణం కదా!

Friday, December 13, 2013

ఏమిటో ఏ మాయ ఓ చల్లని రాజా

ఏమిటో ఏ మాయ ఓ చల్లని రాజా(మిస్సమ లో సావిత్రి పాడిన ఒక అద్బుతం.పాట వీడియో దొరకలేదు.)

వెన్నెల రాజా ఏమిటో నీ మాయ ఓ

చల్లని రాజా వెన్నెల రాజా ఓ

ఏమిటో నీ మాయ..

వినుటయే కాని వెన్నెల మహిమను(2)

అనుభవించి నేనెరుగనయా(2)

నీలో వెలసిన కళలు కాంతులు(2)

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ

చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ

కనుల కలితమిది నీ కిరణములే(2)

మనసును వెన్నగ చేసెనయా(2)

చెలిమి కోరుతూ ఏవో పిలుపులు(2)

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ

చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ

 ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా..!
(పరిచయం...శ్ రీపులికొండ సుబ్బాచారి గారు.)
.
మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది.
ఇందులో రెండు చందమామ పాటలున్నాయి.
వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను.
మిస్సమ్మలో లీలరాజా పాడిన" రావోయి చందమామ మా వింత గాథ వినుమా" 'అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే మీ ఆనందం మిన్నుముట్టుతుంది.
.ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

వినుటయె కాని వెన్నెల మహిమలు

వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.కనుల కలికమిడి నీకిరణములే

కనుల కలికమిడి నీకిరణములే

మనసును వెన్నగ చేసెనయా

మనసును వెన్నగ చేసెనయా

చెలిమికోరుతూ ఏవో పిలుపులు

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ....
.
ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.
.
అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు.
తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.

ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది. వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.
.
కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.

పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.

ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.

https://www.youtube.com/watch?v=ZKsj94I-Blg