ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!

'విశ్వనాధ పంచశతి ' 

.

అదియెమిటో  గానీ విశ్వనాధ గారంటే అందరికీ గంభీరమైన పద్యాలే గుర్తుకు వస్తాయి. నాకు మాత్రం ఆయనలోని సునిశితమైన వ్యంగ్యం, హాస్య చతురతా జ్ఞాపకం వస్తాయి.

'విశ్వనాధ పంచశతి ' అని వారు ఐదు వందల పద్యాలు వ్రాశారు సరదాగా.

ఏ పద్యానికాపద్యమే ఓ రస గుళిక.

ఒక్కో పద్యాన్ని పంచ్ లైన్ గా తీసుకొని ఒక్కో కథ వ్రాయవచ్చు. 

" వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ

సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు

అంగనామణి పెండిలియాడి కూడ

ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె "

" ఊరి భార్యలెల్లరూహించి యామెను

మంచంబుతోనిడిరి శ్మశానమందు

అట పిశాచకాంతలాలోచనము జేసి

పడతి మరల నూరి నడుమనిడిరి "

ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!

Comments

  1. సర్, నమస్తే,
    వ్యంగ్య రచనలను నిర్భయంగా రాసిన వారు విశ్వనాధ వారు,
    ముఖ్యంగా తెలుగు పట్ల మన్నన లేకపోవటమే... ఈ రచనలు మరుగున పడ్డాయి

    ReplyDelete
    Replies
    1. అవును నిజమే .... మీ రచనలు ఈ మధ్య కాలంలో నాకు కనపడ లేదు..
      ఉంటే తెలుప గలరు.

      Delete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!