Friday, December 30, 2016

చాయాదేవి శాపం !

చాయాదేవి శాపం !

శ్రీమతి శారద పోలంరాజు గారికి కృతజ్ఞలతో.)

.

విశ్వకర్మ కూతురు సంజనకు (సంఙ్ఞ) సూర్యునితో వివాహం జరుగుతుంది. ఆమెకు మొదట మనువు, తరువాత యమ యమున అనే కవలలు జన్మిస్తారు.

ఆమె సూర్యుని కాంతి వేడిమి భరించ లేకపోతుంది. ఆమె శరీరము కూడా మసిబారినట్టు అయిపోయి సూర్యోదయ సూర్యాస్తమయాలలో ఉండే చీకటి రంగులోకి మారిపోవడం చేత దేవతలు ఆమెను సంధ్య అని అన్నారు.

బ్రహ్మాండ పురాణం మార్కండేయ పురాణాల ప్రకారం.........

సంధ్యకు వైవశ్వంతమనువు తరువాత యమున యముడు కవలలుగా జన్మిస్తారు.

ఏ విధంగానైనా ఆ వేడిమిని తప్పించుకోవాలనుకున్న సంధ్య తన అంశతో ఛాయ అన్న మరో రూపం సృష్టించి తాను తిరిగి వచ్చే వరకు తన బిడ్డలను చూసుకుంటూ సూర్యుడిని ఏ మాత్రమూ వదలకుండా వెన్నంటి తిరగమని ఆఙ్ఞాపించి తన ముగ్గురు పిల్లలను ఆమెకు అప్పగించి తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది.

ఛాయకు ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. మొదటివాడు శ్రుతశ్రవుడు అతను సావర్ణి మనువుగాను, రెండవవాడు శ్రుతకర్మ శనిగ్రహంగానూ ప్రఖ్యాతి చెందుతారు.

సంధ్యముగ్గురు పిల్లలని సరిగ్గా చూడక ఛాయ సవతి బుద్ది చూపించుకుంటుంది.

పెద్దవాడైన మనువు పట్టించుకోడు కాని యముడు కోపం తో ఆమెను కాలితో తంతాడు.

ఛాయ కోపంతో "తల్లినైన నన్ను ఏ కాలితో తన్నావో ఆ కాలు పడిపోతుంది." అంటుంది.

ఆమె శాపానికి బాధపడ్డ యముడు తండ్రి వద్దకు వెళ్తాడు. "తన్నటానికి కాలు ఎత్తాను కాని నా కాలు ఆమెకు తగల లేదు." అని మొరపెట్టుకుంటాడు.

అంత వరకు సంధ్య ఛాయల వృత్తాంతము తెలియని సూర్యుడు భార్య వద్దకు వెళ్ళి, "సంతానం అందరినీ సమానంగా చూడవలసిన తల్లివి ఈ విధంగా ఒకరిని ఎక్కువగానూ ఒకరిని తక్కువగానూ చూడదగునా? ఏమిటి కారణము?" అని నిలేసి అడిగేటప్పటికి అసలు రహస్యం బయటకు వస్తుంది.

యముడిని ఓదార్చి, "తల్లి నోటి నుండి వచ్చిన శాపం అనుభవించక తప్పదు. విరిగి కింద పడ్డ పాదము క్రిములచేత తినబడ్డ తరువాత శాప విమోచనము అవుతుంది. ఎవరు చేసుకున్న కర్మఫలము వారు అనుభవించాల్సిందే." అంటాడు సూర్యుడు.

తండ్రి మాటలకు వైరాగ్యం కలిగిన యముడు గోకర్ణం వద్దకు వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు.

ఆ తపస్సుకు సంతసించి శివుడు ప్రత్యక్షమైతాడు. పరమేశ్వరుని నుండి లోకపాలకుడుగా ఉండి ప్రజల ధర్మాధర్మములకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించే వరము పొంది శాపం నుండి విముక్తి పొందుతాడు..

పానకంలో పుడక !

పానకంలో పుడక!

.

 భట్టుమూర్తి వ్రాసిన "వసుచరిత్రలోది ఈ పద్యము.వాసు రాజు వ్యాహ్యాళి కై వచ్చి ఒక చోట విశ్రమించినాడు.

అప్పుడు ఎక్కడి నుండియో మధుర గానము వినపడెను.ఎవరో ఒకయువతి మధురముగా పాడుతూ వుంది.

అప్పుడు ఆ రాజు తన వెంట వచ్చిన వయస్యుని (మిత్రుడిని)ఎవరిదీ గంధర్వగానము?పోయి చూచిరా అనిపంపించాడు.ఆ మిత్రుడు వెళ్లి చూసి వచ్చి ఆమె సౌందర్యమును యిలా వర్ణించాడు.

కమనీయాకృతి యోగ్య కీర్తనలం గన్పట్టు నా శ్యామ, యా 

సుమబాణాంబక, యా యమూల్య మణి, యా చొక్కంపు పూబంతి యా 

సుమనోవల్లరి,ఆ సుధా సరసి యా సొంపొందు డాల్దీవి యా 

కొమరు బ్రాయంపు రంభ, ఆ చిగురుటాకుంబోడి నీకేతగున్ 

అర్థము:--ఆమె కమనీయ రమణీయ అవయవ సౌందర్య యౌవ్వనము,ఆమె మన్మధ బాణముల వంటి కన్నులు గలది.(అరవింద,మశోకంచ,చూతంచ,నవమల్లికా, నీలోత్పలంచ పంచైతేపంచ బాణస్యసాయికా ఈ 

ఐదూ మన్మధుని బాణాలు)పద్మరాగ మణి వంటి పెదవులు కలది.పూదీగేల వంటి చేతులు గలది,అమృత సరస్సు వంటి నాభి గలది,చొక్కమైన పూబంతుల వంటి కుచములు గలది,చిగురుటాకుల వంటి పాదములు గలది,అంతేకాక సన్నని దేహము గల్గి మన్మథ బాణము,అమూల్యమైన మణి పూబంతి 

వంటి యింతి ;పూలతీగే అమృత సరస్సు,కాంతి,దేవి యౌవనవతి,రంభ వంటిది చిగురు శరీరము గలది,

ఆ అపురూప సౌందర్యవతి నీకే తగును.నీవు తప్ప ఆమె కెవరూ సరిపోరు.

అనిన మిత్రుడిని జూచి ఆత్రుతగా నీవు ఆమెను కలిసితివా?అని రాజు అడిగాడు.అప్పుడు ఆ మిత్రుడు 

ఆమె తన చెలికత్తెలతో ఒక పొద వద్ద కూర్చునివాళ్ళల్లో వాళ్ళుపాటలు పాడుకుంటూ సరసాలాడు కుంటున్నారు అటువంటి సమయములో అక్కడికి నేను పోరాదు.అని

స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్ 

భోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచు,నే 

జేరక పువ్వు తీవెల చెంతనె నిల్చి లతాంగి రూపు క 

న్నారగ జూచి వచ్చితి నవాంబు రుహాంబక నీకు దెల్పగన్

అర్థము:-రసభంగము చేయని మరొక పద్యము.ఆ వయస్యుడు మరియాద తెలిసినవాడు.యువతులను 

జూచుటకు వెళ్ళినాడు.వారు సంగీతమున నిమగ్నులై యున్నారు.వారు తనను గమనించిన పని చెడిపోతుంది.అందుకని అతను వసు రాజుతో యిట్లనుచున్నాడు.

స్వేచ్చావిహారులైన యువతులు, ప్రౌఢ లైన సారసలోచనలు (తామర రేకులవంటి కన్నులు గలవారు)

వున్నచోటికి హఠాత్తుగా పరాయి మగవారు ప్రవేశించిన యేమగును?రసభంగ మగును.అని నేను వెళ్ల లేదు.వారి సరస సంభాషణలకు భంగ మగును అని ఒక అర్థము.."సారసలోచనలు" అను పదములో 'రస' అను అక్షర భంగ మయినచో వారు సాలోచనలగుదురు.అదొక చమత్కారము..అసలే పెద్ద కన్నులున్నవారు,నన్ను చూచిన

యింకా కళ్ళు విప్పార్చుకొని వీడెవడు?పానకంలో పుడక లాగ వచ్చినాడు అని సాలోచనలగుదురు.(కన్నులు యింకా పెద్దగా జేసి చూచెదరు)కనుక పూతీగేల నడుమ నుండి ఆ యువతినికన్నుల నిండుగా జూసి నీకు చెప్పవలెనని వచ్చినాను తమ్మికంటీ (తామర రేకుల వంటి కన్నులు కలవాడా!)ఆమె సారసలోచన మరి నీవు సారసలోచనుడవు.(నీవు పోవచ్చును అను అంతరార్థము). 

భట్టుమూర్తి ఎంత అద్భుత మైన వర్ణన చేసినాడు కదా!"వసు చరిత్ర" లో వర్ణనలకే అధిక ప్రాధాన్యము యిచ్చినాడు కవి.

అనిసెట్టి 'స్వీయచరిత్ర' అనే కవిత !

అనిసెట్టి 'స్వీయచరిత్ర' అనే కవిత !


'మానవత్వ సూత్రాలు మననం చెయ్యడంకంటే 

మందహాసంలో మంచితనం పంచిపెడితే చాలు' 

విగ్రహంలా వెయ్యేళ్ళు బతకడం కన్నా 

విద్యుత్తులా ఒక్కక్షణం వెలగడం మేలు.కంటికి కనిపించని సత్యం మనస్సులో గోచరిస్తుందని 

మనస్సుకు స్ఫురించానిది స్వప్నంలో సాక్షాత్కరిస్తుందని 

స్వప్నాలకందని సత్యం మానవాంతరాత్మలో 

మౌన సంగీతం ఆలపిస్తుందని ఆలకిస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను.


తన తత్త్వాన్ని విస్పష్టం చేస్తూ - తన యౌవనంలో ప్రచండావేషాల ఊయలపై ప్రతిక్షణం స్వారీ చేస్తూ, విశ్వాన్ని వెక్కిరిస్తూ, వెర్రిగర్వంతో విర్రవీగాడు; అయితే విపరీతమీ యౌవనం, వేకువ రాకముందే వెళ్ళిపోయింది అని తెలుసుకొన్నాడు, వేకువరాగానే.


నాలోని మృత్యువును బంధించి మారణాయుదంలో చేర్చాను

నాలోని ప్రాణశక్తి విజ్రుభించి ప్రచండ జీవనోద్వేగంగా మార్చాను 

సంహరించాను 

పురాణాల రాక్షసులని 

భూమిమీద క్రిముల్ని 

బుద్ధిలో ముసిరే 

దురాలోచనల్ని

,


అని చెప్పిన తీరు మాత్రం అందరినీ ఆకర్షించక తప్పదు.


అనిసెట్టి జీవన మహాయాత్రా పథంలో సర్వం సాధనకై ధారపోశాడు. తప్పొప్పుల .పట్టికలా తయారైన బ్రతుకును ధర్మానుగుణంగా సరిదిద్దుకున్నాడు.


నడుస్తున్నాను -

నడిదారిలో వాహనం ఈ దేహం కూలినా 

కడవరకూ ప్రయాణం సాగిస్తాను 

ప్రభంజనంలా పయనించే జనం నలుగడ 

ప్రతిక్షణం ప్రతికణంలోనూ మనుగడ 

ఇది నా స్వీయచరిత్ర 

ఇది ప్రతి ఆత్మచరిత్ర.


'నేను సైతం విశ్వసృష్టికి ఆశ్రువొక్కటి ధారపోశాను' అన్న కవితతో అభ్యుదయ సాహిత్యం ప్రారంభమైతే -


'వీడని కలకాల వేదనకు విశ్వం విడిచే కన్నీటి బొట్లు నేనౌతాను'

Thursday, December 29, 2016

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(3012)! (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(3012)!

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ

దెంపుతో వసనాభిఁ దినుటమేలు;

ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె

బండఁగట్టుక నూతఁబడుట మేలు;

పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;

బడబాగ్ని కీలలఁ బడుటమేలు;

బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ

గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;

.

తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి

జగడమాడెడు పనికంటెఁ జావుమేలు;

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Wednesday, December 28, 2016

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2912)!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2912)!

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న

మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను;

దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న

బడలి నీమంబులె నడపలేను;

దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న

ఘనముగా నాయొద్ద ధనములేదు;

తపమాచరించి సార్ధకము నొందుదమన్న

నిమిషమైన మనస్సు నిలుపలేను;

.

తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను

స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది;.

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


Tuesday, December 27, 2016

ఆహారం'.

ఆహారం'. గురించి ప్రముఖుల, మహాత్ముల అభిప్రాయాలూ , అనుభవాలూ !

-------------------------------------------------------

1. ' శ్రీరామ రాజ్యం' ఎలా వుండేదో ఉత్తరకాండలో ఈ వర్ణన చూడండి

" వ్యవసాయదారులు ఎవరూ పండిన వెంటనే పంట కోసుకోవాలని తొందర పడటంలేదు !

రాశులుగా పోసిన ధాన్యానికి ఎవరూ కాపలా వుండట్లేదు !

గాదెలు కట్టుకోటానికి ఎవరూ ఆత్రుత పడటంలేదు . ధాన్యం బస్తాలు

ఇంటిబైటే పడేసి అంతా నిశ్చింతగా నిద్రపోతున్నారు .రామరాజ్యంలో

ఎవరికీ తిండికరువూ , దొంగతనం అవసరం వుండదని వారికి తెలుసు ! 

( మహర్షి వాల్మీకి )

2. ఆకలిగొన్నవాడికి ' దేవుడు ' కనపడేది అన్నం రూపంలోనే !

( మహాత్మా గాంధీ ) .

3. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! 

ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !

( జంధ్యాలగారు ) .

4. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) .

5. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

6. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .

7. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు

" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు. 

అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ 

అర్ధం కాలేదు !

( ఆత్రేయ గారు )

8. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! 

అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !

( చాగంటి కోటే శ్వర రావుగారు ) .

9. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!

( గౌతమ బుద్దుడు ).

10. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !

( మాతా అమృతానందమయి ) .

11 . మీ భర్త ఎంత ధనవంతుడయినా, మీకోసం మీరు స్వంతంగా ఒక కప్పు కాఫీ సంపాదించుకునే శక్తి లేనప్పుడు మిడిసిపడటం అనవసరం !

( యద్దనపూడి సులోచనారాణిగారు ) .

12. మీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు 

మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు !

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2812)!

(శ్రీ శేషప్ప కవి)

సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ

లేశ మానందబు లేనివాఁడు

పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి

భావమందుత్సాహ పడనివాఁడు

భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ

దత్పరత్వములేక తలఁగువాఁడు

తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక

కాలమంతయు వృధా గడపువాఁడు

.

తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును;

మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది; 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Monday, December 26, 2016

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2712)!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2712)!

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి?

నా దీనతను జూచి నవ్వనేమి?

దూరభావములేక తూలనాడిననేమి?

ప్రీతి సేయక వంక బెట్టనేమి?

కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?

తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?

హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి?

చేరి దాపట గేలి సేయనేమి?

.

తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ

బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ! 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఔదార్యము!

ఔదార్యము!

.

ధీరో దార గుణంబులు 

కారణ జన్మునకు వేరే గరుపగ వలెనా 

ధారుణిలో టెంకాయకు 

నీరేవ్వరు పోసిరయ్య నిట్టల హరియా

.

అర్థము:-- ధైర్యము, ఉదారత్వము (ఔదార్యము)ఉత్తమునకు 

నేర్ప వలిసిన పని లేదు. 

కొబ్బరికాయలో నీరెంత సహజముగా పుట్టుకు వస్తుందో 

ధైర్య, ఔదార్య గుణాలు కూడా పుట్టుకతోనే వస్తాయి. 

నేర్చుకుంటే వచ్చేవి కావు.

తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత.

.. బాపు బొమ్మ .

తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత.

.

రావే గోపవంశాన రాజిల్లే లతకూన!

రావే పాముపడగబోలే కటికలదానా!

లేవే నీరదశ్యామమోహనుని నామముల

నీ వాకిటనే నిలిచి నీవారు పాడరు!

మేలి పొదుగుల ఆలువేలు కలవారు, ఆ

భీలరణమున అరులబీర మడచేవారు, గో

పాలకుల కులమున వెలసే ఓ వనమయూరీ!

లేవే! కలములనెలవౌ ఓ నారి! ఒయ్యారి!

'మాతృషోడశి'.!

'మాతృషోడశి'.!

'మాతృషోడశి'.!

'అమ్మా నేను గర్భంలో వుండగా నిన్ను చాలా బాధపెట్టాను

..

ప్రసూతి తర్వాత కూడా నా గురించి, నా తిండితిప్పల గురించి,

.

ఆరోగ్యం గురించి ఎంతో కష్టపడ్డావు.

.

ఆ బాధలు కలిగించినదానికి ప్రతిగా యీ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.'

Sunday, December 25, 2016

లోకరీతి.!

లోకరీతి.!
.
సీ. మంచిని అందరూ పంచుకో జూస్తారు
పంచుకోరెవ్వరు ఎంచి చెడుని
పాపపుణ్యములను పంచుకోమనగాను
పుణ్యము తీసుకు పాపమొదలు సుఖ దుఃఖముల నెల్ల సమముగ పంచగ దుఃఖములనొదలి సుఃఖము గోరు.కలిమికి లేమికి కొలబద్ద జూపిన కలిమికి కొలబద్ద కాంచ రెవరు ..ఆ. కష్ట సుఖములుండు కలిమి లేములు నుండుమంచి చెడులు పుణ్య పాపములును కలసి మెలసి యుండు కలగాపులగముగాకాల సహజ మింతె కలత పడకు.(మా అక్క గారు సుర్యలక్ష్మి తర్నకంటి గారు వ్రాసిన కవిత )

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2612)!

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు.

ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు,

కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు!

పల్లకిమ్మని నోటఁ బలుక లేదు,

సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు,

భూమి లిమ్మని పేరు పొగడ లేదు,

బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు,

పసుల నిమ్మని పట్టు బట్టలేదు,

.

తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ!

చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, .

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

మాగాడిమాయరోగం!

మాగాడిమాయరోగం!

.

స్త్రీ ఫలానా పురుషుడి భార్యగా గుర్తింప బడటానికి గర్విస్తుందేమో కానీ.....

మగవాడు మాత్రం - ఫలానా స్త్రీ భర్తగా గుర్తింప బడేకంటే ....చావడం నయం అనుకుంటాడు .....

.

భార్యా భర్తలు ఇద్దరూ 

సమానమైన , పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటే అది వేరే సంగతి. 

.

"ఇద్దరిలో ఎవరిది ఆధిక్యత-అంటే

భార్య తల వంచినట్లుగా , భర్త తలవంచలేడు .

బహుశా మగవాడికి ఈ అహంకారం ప్రకృతే ప్రసాదించి వుంటుంది......"

సూటిగా ఒక ప్రశ్న?

సూటిగా ఒక ప్రశ్న?

.

చాగంటి గారు ఇప్పటివరకు కొన్ని వేల ప్రవచనాలు చెప్పారు..

అన్ని వేల ప్రవచనాలలో ఎప్పుడూ సనాతనధర్మ వైభవం, విశిష్టత గురించే మాట్లాడారు..ఎక్కడా ఇతర మతాల గురించిన ప్రస్తావన గాని, వారిపై కోపగించుకోవడం గాని చేయలేదు..

కాని మొదటిసారి అలాంటి వ్యాఖ్యలు ఆయన నోటిద్వారా విన్నాను..ఒక వాట్సాప్ ఆడియో లో..ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే..

"ఒక మైకు పట్టుకుని అరుస్తున్నావ్..నువ్వెప్పుడైనా రామాయణం చదివావా?.....


Saturday, December 24, 2016

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2512)!

.

సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,

పుడమిలో జనుల మెప్పులకు గాదు,

జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని,

సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు,

ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని,

దండిభాగ్యము నిమిత్తంబుగాదు,

నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని,

కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు,

.

తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ

గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం ....(2)

శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం !

.

అగసాలిది కాబోలును 

సొగసైన మిటారి యోర చూపుల తోడన్ 

జగమెల్లను వలపించుచు 

మగటిమితో వచ్చె బురము మార్గము వెంటన్ !

.

శ్రీనాథుడు రాజమహేంద్రపుర వీధుల్లో సంచరించేటప్పుడు

ఒక విశ్వబ్రాహ్మణిని చూచి చెప్పిన పద్యం.

"మగటిమి" అనే పద ప్రయోగంవల్ల పురుషాయితము 

అనే అర్థం స్పురిస్తుందీ శృంగార చాటువులో.

శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం ! .

"
శృంగార శ్రీనాథుని" చాటుపద్య కవితా వైభవం !

.

పొచ్చెంబింతయు లేని హంస నడతో బొల్పొందు లే

నవ్వుతో, 

బచ్చల్ దాపిన గుల్కు ముంగరలతో, బాగైన 

నెమ్మోవితో, 

నచ్చంబైన ముసుంగువెట్టి, చెలితో నామాటలే చెప్పుచున్ 

వచ్చెంబో! కుచకుంభముల్ గదలగా వామాక్షి తా 

నీళ్ళకున్!

.

నీలాటిరేవు కడకు వచ్చిన ఒక నీలవేణిని వర్ణిస్తూ చెప్పిన పద్యమిది.

ఈ వామాక్షి నీళ్ళకోసం వచ్చింది కాబట్టి ఆమె చనుకట్టు కుచకుంభాలయ్యాయి. లేకుంటే మరేమయ్యేవో!

Friday, December 23, 2016

మన ఘంటసాల !

మన ఘంటసాల !

తెలుగు వాడికి తెల్లవారితే 'దినకరా శుభకరా' ; మధ్యాహ్నం బాధ కలిగితే ఓదార్చే 'భగవద్గీత' ; సాయంత్రం వేడుకైతే 'పడమట సంధ్యా రాగం, కుడి ఎడమల కుసుమ పరాగం' ; రాత్రి 'కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది' , అలా కానప్పుడు 'నడిరేయి ఏ జాములో'' ... 'నిద్దురపోరా తమ్ముడా' ....'కల ఇదనీ నిజమిదనీ తెలియదులే' , అంతలోనే తెల్ల వారితే 'నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో' అన్న సందేహంలో సంతృప్తి - ఇవన్నీ ఆయన ప్రసాదించిన వరాలే.

తెలుగు విద్యార్ధికి 'ప్రేమ తమాషా వింటేనే కులాసా' . కానీ 'పది మందిలో పాట పాడితే అది అంకితమెవరో ఒకరికే' అన్న సుతి మెత్తని బెత్తం దెబ్బా! తొందర పాటు నిర్ణయాలకు పోతుంటే 'కల కానిది విలువైనది బ్రతుకు- కన్నీటి ధారలలోనే బలి చేయకు' అన్న అక్షర లక్షల 'థెరపీ', ఆవేశం వస్తే 'ఆవేశం రావాలి' కానీ 'ఆవేదన కావాలి' అన్న మందలింపూ, ఆందోళనకు దిగితే 'తెలుగు వీర లేవరా' అన్న అదిలింపూ, ఎవరికి వారయి విడిపోతుంటే 'ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి' అన్న విదిలింపూ- ఇవన్నీ ఆయన అందించిన వివరాలే.

తెలుగు తల్లికి 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' నువ్వున్నావమ్మా అనగానే ఎంత సంబరం!

తెలుగు పడుచుకి 'దివి నుండి భువికి దిగి వచ్చే పారిజాతమే నీవే నీవే' అనగానే ఎంతటి గర్వం!

'తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా' ఎంతటి సిగ్గూ! ఇదంతా ఆయన గొంతు మహత్మ్యమే.

'పాపాయి నవ్వులే మల్లె పూలు' , ' ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే' అన్నప్పుడు ఎన్ని మల్లెలు పాపాయిలుగా పుట్ట్టా లను కున్నాయో? ఎన్ని బంతి పూలు ఆది శంకరుని తలచు కున్నాయో! 'బలే బలే పావురమా' , 'జగమే మారినది మధురముగా -- పావురములు పలుక' , 'గోరోంక గూటిలో చేరావు చిలక' , 'నా పాట నీ నోట పలకాల సిలక' అన్నప్పుడు ఎన్ని పక్షులు తెలుగు నేర్చుకున్నాయో!'శివ శంకరీ శివానంద లహరీ--మనసు కరుగదా' అనగానే ఎన్ని మృదంగాలు నాట్యమాడ లేదూ! 'మది శారదా దేవి మందిరమే' అనగానే ఎన్ని గంటలు మ్రోగ లేదూ! 

ప్రతి సంక్రాంతి 'అసలైన పండుగ-- కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ' గా వాసి కెక్కిందంటే అది ఆ గళం అందించిన బలమే.ప్రతి ఉగాది 'భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు' గా చెలామణి అయ్యిందంటే అది ఆ కంఠం ప్రోద్బలమే. ఇన్నిటికీ, ఇందరికీ, అన్నిటికీ, అందరికీ 'తెలుగు వారి ఇలవేల్పు' గా వెంకటేశ్వరుడుంటే "తెలుగు వారి గళ వేల్పు" ఘంటసాల !”

ఆరుద్రగారు అన్నట్టు మాస్టారూ, 'నీలి మేఘాలలో గాలి కెరటాలలో మీరు (నీవు) 

పాడే పాట వినిపించునే వేళా'!

అతడు కోట్ల తెలుగుల ఎద

అంచుల ఊగిన ఉయాల

తీయని గాంధర్వ హేల

గాయకమణి ఘంటసాల - సి.నారాయణరెడ్డి

ఘంటసాలవారి కమనీయ కంఠాన

పలుకనట్టి రాగభావమేది!

ఘంటసాలవారి గాన ధారలలోన

తడియనట్టి తెలుగు టెడద యేది! - దాశరథి

అతడు ప్రసన్న మధుర భావార్ద్రమూర్తి

సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి

లలిత గాంధర్వ దేవత కొలువుదీరు

కలికి ముత్యాలశాల మా ఘంటసాల - కరుణశ్రీ

“ఘంటసాల” ఆ పేరు వింటేనే తెలుగు వాడి గుండెల ఘంటలు గుడి ఘంటలు మొగినత శ్రావ్యమ్గా మోగుతాయి.

“ఘంటసాల” ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండరని ఘంటా పతంగా చెప్పవచ్చు.

ఆబాల గోపాలాన్ని తన కంచు కంఠంతో ఊగిసలాడించి, ఉర్రూతలూగించి, ఊయలలూపిన గాన గంధర్వుడు, గాయకులలో 'న భూతో న భవిష్యతి' గా వాసికెక్కిన మన గళవేల్పు ఘంటసాల మాస్టారి 90 వ పుట్టినరోజిది. ఏ అమరలోకంలో వారీ వేళ సురలకు స్వరలహరుల కచేరీ ఇస్తున్నారో ప్రస్తుతం. త్రిస్థాయిలలో పాడటమే కాక, అద్భుతమైన బాణీలు కట్టి, తెలుగు పద్యాలకు తన శైలిలో, తన ప్రతిభతో క్రొత్త వరవడిని దిద్ది పద్యమంటే ఇలా పాడాలని సూత్రీకరించిన మహా మేధావి, అయినా నిగర్వి మన మాస్టారు. గొంతులో తీపి, హృదయంలో మధురిమ గల గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.

తెలుగు వారి హృదయాలలో గాయకుడుగా, సంగీత దర్శకుడుగా చెరగని ముద్ర వేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 1922లో డిసెంబర్‌ 4 గుడివాడ సమీపం లోని చౌటుపల్లి గ్రామం లో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు . భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకేమో కానీ, ఘంటసాల గాత్రం మాత్రం తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతుంది. ప్రజలకు ఆరాధ్యుడుగా, ఓ సంస్కృతికి చిహ్నంగా మాత్రం ఏ గాయకులూ లేరు. ప్రతి తెలుగు కుటుంబంతో పెనవేసుకొన్న గాత్రం ఘంటసాలది.

ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. ఆరేళ్ళపాటు గురువు పట్రాయని సీతారామశాస్త్రిగారి వద్ద సంగీత శిక్షణ సాగింది. శాస్త్రిగారు సంగీతరావుగారి తండ్రి. తన తండ్రిని గురించిన విశేషాలు సంగీతరావు గారి వ్యాసాల్లో కనబడతాయి. అవి చదివితే గాయకుడుగా, సంగీత దర్శకుడుగా ఘంటసాలకు మార్గం చూపినది శాస్త్రిగారే ననిపిస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు. శాస్త్రిగారి నుంచి ఘంటసాలకు శృతిశుద్ధి, నాదశుద్ధి, గమకశుద్ధి, తాళగత, స్వరగత లయశుద్ధి అలవడ్డాయి. పాటల్లో సాహిత్యం ముఖ్యమనే అవగాహన కలిగింది.

ఘంటసాల వెంకటేశ్వరరావు తండ్రి సూరయ్య గారికి మృదంగం లోనూ, తరంగాలు పాడడం లోనూ ప్రవేశం ఉండేది. కాని పదకొండేళ్ళకే తండ్రిని కోల్పోయిన వెంకటేశ్వరరావుకు పేదరికపు కష్టాలు చిన్న వయసులోనే ఎదురయాయి. చదువు సరిగ్గా సాగకపోయినా తన తండ్రి కోరినట్టుగా సంగీతం అభ్యసించాలనే పట్టుదలతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అతను విజయనగరం వెళ్ళి సంగీత కళాశాలలో చేరాడు. విజయనగరం చేరిన ఘంటసాల వారాలు చేసుకుంటూ సంగీత కళాశాలలో స్థానం సంపాదించడానికి ప్రయత్నిస్తున్న సమయం లో పట్రాయని సీతారామశాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితముగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. వారాలు చేసుకుంటూ, మధుకరం(భిక్షాటన) చేసుకుంటూ సంగీత సాధన చేసి ద్వారం వెంకట స్వామి నాయుడి గారి చేతుల మీదుగా సంగీత పట్టా పుచుకున్నారు. సంగీత కళాశాల పట్టం పొంది విజయనగరం విడిచిపెట్టే తరుణంలో ఘంటసాల గారి కచేరి ఏర్పాటు కావడం, ఆదిభట్ల నారాయణ దాసుగారు తంబూరా బహూకరించడం ఘంటసాల జీవితం లో ఒక పర్వదినం. ఘంటసాల వెంకటేశ్వరరావు మొదట్లో జోలె భుజాన వేసుకుని మధూకరం ద్వారా పొట్ట పోషించుకోవలసి కూడా వచ్చింది. ఏలాగైతేనేం సంగీతంలో పట్టభద్రుడయ్యాడు.

1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారు ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.ముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసం వెతికి రాత్రి ఆ పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు.

1951లో పాతాళభైరవి ,1953లో వచ్చిన దేవదాసు 1955లో విడుదలయిన అనార్కలి ,1955లో విడుదలయిన అనార్కలి ,1957లో విడుదలయిన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి.1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకుని అర్ధ శతాబ్దం పాటు తన పాటలతో ఆంధ్రుల మనసులని పరవసింపచేసారు .

ముద్దబంతి పూవులో... 

నీవేనా నను పిలచినది... 

శివశంకరి... శివానందలహరి...

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై...

దేవదేవ ధవళాచల... 

ఘనాఘన సుందరా... 

కుడిఎడమైతే... 

జేబులో బొమ్మ... 

తెలుగువీర లేవరా... 

రాజశేఖరా నీపై... 

కనుపాప కరువైన...

పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.

ఘంటసాలగారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంతమాత్రమే. పెద్ద రికార్డింగ్ ఏదైనా జరిగితే ఆ మర్నాడు ఆయన విశ్రాంతి తీసుకోక తప్పేదికాదని సావిత్రిగారు ఏదో సందర్భంలో చెప్పారు.

.త్రిపురనేని మహారథి ఒక సంగతి చెప్పారు. రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన ఒక రికార్డింగుకు ఘంటసాల వెళ్ళి తయారుగా కూర్చున్నప్పటికీ రాజేశ్వరరావుగారు ఎంతకీ తన గదినుంచి బైటకు రాలేదట. ఘంటసాలగారు విసుక్కుంటూ ‘నేనింతమందికి పాడానుగాని రాజేశ్వర్రావుగారిలా ఇలా హింసపెట్టేవాళ్ళని ఎక్కడా చూళ్ళేదు’ అన్నాడట. దానికి మహారథి ‘దానికేముందండీ, పాడనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా?’ అన్నాడట. వెంటనే ఘంటసాల ‘అమ్మమ్మమ్మ, ఎంతమాట? రాజేశ్వర్రావు రికార్డింగు మానుకోవడమా? అలా ఎన్నటికీ చెయ్యను’ అన్నారట. అది ఆయన వినయానికీ, సంస్కారానికీ కూడా మంచి ఉదాహరణ.

ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు.

"నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు.

మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూటపదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.

పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు.

సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను 'అన్నా' అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు 'అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ' అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తనఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.

ఘంటసాల ఆ తాత్వికతను జీవితంలోనూ పొదుగుకున్నారు. కొత్తగా వచ్చిన గాయకులకు అవకాశం వచ్చేలా తన వంతు ధర్మాన్ని నిర్వర్తించే వారు. తమ సినిమాలో తానే పాడాలని ఒత్తిడి చేసే నిర్మాతలు, దర్శకుల్ని ఉద్దేశించి కొత్తగా వచ్చిన వారు బాగానే పాడుతున్నారు. వారికి అవకాశం ఇవ్వండి అంటూ వారిని తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తో ‘నా తరువాత నా అంతటి వాడవవుతావు నాయనా’ అంటూ మనసారా ఆశీర్వదించిన నిండు మనిషాయన. ‘బతికి ఉన్నంత కాలం పాడుతూ ఉండాలని, పాడుతున్నంత కాలమే బతికుండాలని కోరుకుంటున్నాను’ అంటూ తన బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసేవారు. చివరికి తాను ఆశించినట్లే , బతికున్నంత కాలం ఆయన పాడుతూనే ఉన్నారు.

1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండేనొప్పి రావటం తో కొంత కాలం విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో భగవద్గీత చేయాలన్న ఆలోచన రావటం వెంటనే దాన్ని అమలుపరచడం జరిగాయి. ఈనాటికీ ఘంటసాల వారి భగవద్గీత ఒక ఆణిముత్యం. 1974 ఫిబ్రవరి 11న ఆరోగ్యం పూర్తిగా క్షీణించి అర్ధశతాబ్దం పాటు మనలని తన గాన మాధుర్యం తో అలరించిన ఆ గొంతు మూగబోయింది. ఘంటసాల గారు మన అందరి హృదయాలలోనూ ఇంకా జీవిస్తూనే ఉన్నారు. వారు అమరులు….వారు అమరులు….వారు అమరులు.

ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి

రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.

గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ, శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానం, కరుణశ్రీ వారి సులభ శైలి గద్యాలు, పద్యాలు, రావులపర్తి బద్రిరాజు గారి వెంకటేశ్వరుడు, ఘంటసాల వారి 'మృత్యు వంటే భయం లేని' రచన, దేవులపల్లి వారి అపర కాళిదాసీయ మేఘ సందేశం-- ఆ గొంతులో ఎంతగా బందీలైపోయాయంటే మళ్ళీ అటువంటివి మరో గొంతు నుండి విడుదల కాలేదు.

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు 1944 లో 'స్వర్గ సీమ' చిత్రానికి తొలుతగా పాడి మూడు పదుల కాలం సంగీత సామ్రాట్టు గా చిత్ర సీమను ఏలారు. 'విధి ఒక విష వలయం' కనుక ఆ అమృత కంఠానికి కేవలం అయిదు పదుల కాలం మాత్రమే భౌతిక రూపం దక్కింది. ఇక అప్పటి నుంచి తెలుగు వారికి పద్యాలు కరువయ్యాయి, మంచి తెలుగు పలుకులు అరుదయ్యాయి.

చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల

గంధర్వ మణిమాల ఘంటసాల

సంగీత సాహిత్య సరసార్ధ భావాల

గాత్ర మాధుర్యాల ఘంటసాల

పద్యాల గేయాల వచనాల శ్లోకాల

గమకాల గళలీల ఘంటసాల

బహువిధ భాషల పదివేల పాటల

గాన వార్నిధిలోల ఘంటసాల 

కమ్ర కమనీయ రాగాల ఘంటసాల

గళవిపంచికా శృతిలోల ఘంటసాల

గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల

గాయకుల పాఠశాల మా ఘంటసాల।

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2412)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2412)

.

సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ

బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి

ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను

నిన్నుఁగాననివారి నే స్మరింప,

మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి

చెంతఁజేరఁగఁ బోను శేషశయన!

.

తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల

దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన, 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


నవ్వుల రాణి గిరిజ!

నవ్వుల రాణి గిరిజ!

నవ్వుల రాణి గిరిజ!

.

తొలి నాళ్ళల్లో హాస్య నటిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన దాసరి గిరిజ మొదటిసారి ‘పరమానందయ్య శిష్యులు’ చిత్రంలో కథానాయికగా నటించి ఆ తరువాత సినిమా రంగంలో అరంగేట్రంచేసి తిరుగులేని హాస్య నటిగా గుర్తింపుతెచ్చారు. గిరిజ ఎన్ని హాస్య పాత్రలు పోషించినా ‘పాతాళభైరవి’ చిత్రంలో పింగళి సృష్టించిన ‘నరుడా ఏమి నీ కోరిక’ అన్న డైలాగుతో అప్పటి ప్రేక్షకులకు చేరువయ్యారు. గిరిజ హాస్య నట ప్రస్థానం చిగురుతొడిగి మొగ్గవేస్తున్న తరుణంలో రేలంగితో జత కలిసి వారిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో హాస్యచిత్రాలు వచ్చాయి. గిరిజ తన హాస్య అభినయంతో ఒక ఇమేజ్‌ని సృష్టించుకున్నారు.

‘రాముడు-్భముడు, ‘జగదేకవీరుని కథ’, ’ చిత్రాల్లో రేలంగితో కలిసి సున్నితమైన హాస్యాన్ని ప్రేక్షకులకు అందించి చిరకాలం గుర్తుండిపోయేలా నటించింది.

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు .

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు 

.

ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం. 

తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు.

.

19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. ‘స్ర్తీ కి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి’ అని సంప్రదాయాల చేతిలో కీలుబొమ్మల్లా బతుకుతున్న స్ర్తీలలో చైతన్యం కలిగించేలా రచనలు చేసిన చలం స్ర్తీలకి ఎప్పటికీ చిరస్మరణీయుడే. 60ల నుంచి స్ర్తీలు సాహిత్య రంగంలో ప్రవేశించారు. 

కోడూరి, యద్దనపూడి, మాదిరెడ్డి, లత, రంగనాయకమ్మ మొదలగువారు తమ రచనలతో తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆ సమయంలో కొందరు రచయితలు కూడా స్ర్తీల పేర్లలో రచనలు చేశారంటే వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదో ఆలోచించవచ్చు. వీరందరూ కేవలం కథారంగానికీ, నవలా రంగానికీ పరిమితం. కవితా రంగంలో కాలు పెట్టలేదు. 80ల్లో కవిత్వ రంగాన్ని కుదిపివేస్తూ స్ర్తీవాద కవిత్వ ఉద్యమం ప్రారంభమైంది. సమాజంలోని పురుషాహంకార ధోరణిని ప్రటిఘటిస్తూ సంప్రదాయ భావజాలాలపై తిరుగుబాటు చేస్తూ ఒక ప్రభంజనంలా, ఒక విస్ఫోటనంలా, ఒక మహోద్వేగ ప్రవాహంలా తెలుగు కవిత్వాన్ని ఒక్క కుదుపు కుదిపింది స్ర్తీవాద కవిత్వం. స్త్రీలు తాము మాత్రమే అనుభవించి అనుభూతించి, తాము మాత్రమే రాయగలిగే భావాలకు అక్షర రూపమిచ్చారు. 

కవయిత్రులుగా కొత్త ప్రపంచపు తలుపులు తెరిచారు. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ తమ కవిత్వపు కొరడా దెబ్బలు ఝుళిపించారు. అక్షరాలను అగ్ని కేతనాలుగా ఎగుర వేశారు. పిడుగులు కురిపించారు. తుఫానులా విజృంభించారు. స్ర్తీ వాద కవిత్వంలో తొలి తెలుగు కవయిత్రి రేవతీ దేవి. తన అనుగార దగ్థ హృదయ జ్వాల సెగలతో తెలుగు కవితా ప్రపంచాన్ని జ్వలింపచేశారు. ‘నేనెవరినో మీ కెవరికీ తెలియదు. ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును. ఆ కళ్ళు అనురాగం కళ్ళు. లోకమంతట్లోనూ నన్నే చూసేది ఆ అనురాగపుటందమైన కళ్ళు. యుగ యుగాల సమస్త ప్రాణకోటి అనురాగాన్ని. నా పైన అవిరళంగా వర్షించే అనురాగ మేఘాలు ఆ కళ్ళు. ఈ హృదయం రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకొన్న నెత్తురు పువ్వు’. స్ర్తీలంటే కేవలం శరీరాలే తప్ప హృదయాలు గుర్తుకు రాని ప్రపంచంలో రవంత అనురాగ సుగంధం కోసం, కాసింత వలపు పరిమళం కోసం తపించి, జ్వలించి తన హృదయ పుష్పాన్ని నిస్పంకోచంగా రేకులు రేకులుగా విప్పి పరచింది రేవతీ దేవి. అవయవాలకే తప్ప ఆత్మలకు తావు లేని సాహిత్య ప్రపంచంలో మొట్టమొదట ‘అనురాగం’ అనే నాలుగు అక్షరాల పదాన్ని ప్రయోగించిన తొలి కవయిత్రి రేవతీ దేవి.. .

.

తన కలల గాలిపటాన్ని నిర్భయంగా ఎరుగవేసి, తన కాంక్షల చిత్తరువులపై పరదాలు తొలగించి తన అంతరంగ వర్ణాలను ప్రదర్శించిన భావుకురాలు రేవతీదేవి. కోపం, ద్వేషం, కోరిక మొదలైన రంగు రంగుల ఇంద్రధనుస్సుల సౌందర్యాలను పాఠకుల హృదయ వేదికలపై ఆరబోసిన రేవతీ దేవి రచించిన మరో కవిత ‘దిగులు’. ‘దిగులు/ దిగులు దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే/ దిగులెందుకు’ అని చెప్పలేని దిగులును గురించి అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది. స్ర్తీవాద కవిత్వంలో అనితర సాధ్యమైన శైలి రేవతీ దేవిది. పరస్పరం అనురాగ బద్ధంగా అన్యోన్యంగా జీవించవలసిన వివాహం స్ర్తీల పాలిట పెద్ద శిక్షగా మారడాన్ని వ్యాఖ్యానిస్తూ సావిత్రి ‘పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళి చేస్తానని/ పంతులుగా రన్నప్పుడే భయం వేసింది/ ఆఫీసులో నా మొగుడున్నాడు/ అవసరమైనా సెలవివ్వడని/ అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది/ వాడికేం మగ మహారాజని ఆడా మగా వాగినప్పుడే అర్ధమై పోయింది ‘పెళ్ళంటే పెద్ద శిక్ష’ అని/ మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని/ మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే/ మమ్మల్ని విభజించి పాలిస్తోందని- ‘బందిపోట్లు’ కవితలో భార్యలకు స్వేచ్ఛ నివ్వకుండా బానిసలుగా చూసే భర్తలను గురించి ఢంకా బజాయించి చెప్తారు. నేడు భార్య కన్నా భార్య తెచ్చే జీతాన్నే ప్రేమించే భర్తలు ఎక్కువయ్యారు. ఆనందానుభూతితో పరవశించవలసిన భర్త పరిష్వంగం భార్య పాలిటి సర్ప పరిష్వంగ మెలా అయ్యిందో మందరపు హైమవతి (ఈ వ్యాస రచయిత్రి) తన సర్ప పరిష్వంగం కవితలో ‘అంతా బాగానే ఉంటుంది/ అప్పటి వరకు/ కామంతో నైతే నేమి/ మోహంతో అయితే నేమి/ ఇరువురి తనువులొకటైనాక/ అదె్వైత స్థితి పొందినాక/ ఈ లోకాన్నే మరచిపోయిన/ అమృత ఘడియలలో/ అక్షయ తూణీరం నుంచి/ ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు/ జీత మెప్పుడిస్తారు’ అని. ఈ లోకాన్నే మరచిపోయిన అదె్వైత స్థితిలో కూడా భర్త భార్యని జీతం గురించే అడుగుతాడు. అప్పుడామె ఒక్కసారిగా ‘వేయి రాక్షస బల్లులు/ మీద పాకినట్టు/ మనస్సు ఝడుసుకొన్న ఆ క్షణంలో/ నా జీవితం నుంచి/ దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటాను నిన్ను!’ అని భర్తని వదలి వెయ్యాలనుకుంటుంది గానీ- భారత స్ర్తీ నైనందుకు/ సంప్రదాయాల సజీవ సమాధిలో/ ఊపిరాడక గిల గిల కొట్టుకుంటూ/ వివాహం ఊబిలో/ కూరుకుపోతున్నప్పుడు/ జీవితం నుంచి కాదు కదా/ శరీరం నుంచైనా కించిత్తుకూడా/ దూరమవడం నా చేతుల్లో లేని పని’ అంటుంది. ఇక్కడ ఆలు మగల అనురాగ పూరితమైన పరిష్వంగం ఆర్ధిక కారణాల వలన, భార్యని బదులు డబ్బును ప్రేమించడం వలన ఆ పరిష్వంగం అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా మారిపోయింది. ఆధునిక యుగంలో సర్వత్రా కనిపించేవి ఇలాంటి సర్ప పరిష్వంగాలే. పతియే ప్రత్యక్ష దైవమైన వ్యవస్థలో ఆ పతి పరిష్వంగాన్ని అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా భావించడమే ఒక ధిక్కారం, ఒక సాహసం. 

.

సాహిత్యం అంతా పురుషుల దృష్టితోనే రాయడం వల్ల, వారి కాముక దృష్టికి స్ర్తీలు కేవలం అవయవాల ప్రదర్శన శాలలు గానే కనిపిస్తారు. వారి దృష్టిలో స్ర్తీలంటే రెండు వక్షోజాలు, రెండు జఘనాలు మాత్రమే. వారి చూపులు స్ర్తీల నెలా ఇబ్బంది పెడతాయో కేవలం స్ర్తీలు మాత్రమే రాయగలిగిన కవిత ‘చూపులు’. స్కూలుకు వెళ్ళే విద్యార్ధినులను, ఉద్యోగాలు చేసే స్ర్తీలను, రోడ్డు మీద నడిచే మహిళలను మగవారు చూసే చూపులు, ఆకలి చూపులు, కామపూరితమైన వికృతమైన చూపుల గురించి- ‘రెండు కళ్ళనుంచి/ చూపులు/ సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై/ విచ్చల విడిగా తిరుగుతూ ఉంటాయి’ అని జయప్రభ వర్ణిస్తారు. బడికి వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, ఆఫీసుకు వెళ్తున్నా చూపులు ఆడవాళ్ళ శరీరాల మీద గాయాలు చేస్తూనే ఉంటాయి. ‘బస్సులోను/ క్లాసు లోనూ/ వేసే ప్రతి అడుగు వెనకా/ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని/ గాయం చేస్తూ/ విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి’ అంటూ పురుషుల చూపులు పడతుల హృదయాలనెలా ముక్కలు చేస్తాయో వర్ణించిన కవిత ఇది. అలాంటి చూపులను సహించలేని స్ర్తీలు అలాంటి పురుషులను ప్రతిఘటించాలనుకుంటారు. అందుకే కవయిత్రి ‘ఈ దేశంలోని ఆడదానికి/ వళ్ళంతా ముళ్ళుండే రోజు/ ఎప్పుడొస్తుందా అని’ ఎదురు చూస్తుంది. పిల్లల్ని కనే ప్రక్రియ ఎంత నరకమో ఆ స్థితిలో ఆమె పరిస్థితి ఎంత భయంకరమో కొండేపూడి నిర్మల ‘లేబర్‌ రూం’ కవితలో ‘ప్రపంచంలోని నరకమో/ నరకంలోని ప్రపంచమో/ త్రీడీలో చూస్తున్నట్టే ఉంటుంది’ అంటూ పరాకాష్ఠకు చేరిన బాధను వర్ణిస్తూ ‘కాళ్ళనలా ఎడం చేసి దీనంగా హీనంగా నీచాతి నీచంగా/ ఒక హింసాతల పరాకాష్ఠ కోసం ఎదురు చూడ్డమంటే/ రైలు పట్టాలమీద నాణెం విస్తరించిన బాధ/ కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండ చుట్టుకొన్న బాధ’ను కళ్ళకు కట్టినట్టు, మనసుకు పట్టినట్టు చిత్రీకరిస్తారు. పిల్లల్ని కనడం ఎంత నరకమో ఈ కవిత వర్ణిస్తే, తప్పనిసరి పరిస్థితిలో పిల్లలు వద్దనుకొని అబార్షను చేయించుకొని పరితపించే కొందరి తల్లుల మానసిక బాధను అబార్షను స్టేట్‌మెంట్‌లో పాటిబండ్ల రజని ‘నీకు పంచేందుకు రక్తం లేకనే కదా/ నిన్ను పెంచేందుకు తీరిక లేకనే కదా/ నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదనే గదా, నేన్నిన్ను వద్దనుకొన్నది/ నా టెంపరరీ ఉద్యోగమూ, ఆరోగ్యము, నీకు మరణశిక్షను ఖాయం చేస్తే/ తల్లడిల్లిన తల్లి మనసు అయ్యో/ పాలింకిపోవడానికికున్నట్టు/ మనసింకిపోవడానికి/ మాత్రలుంటే ఎంత బావుండు’ అని ఆక్రోశిస్తారు. స్ర్తీవాద కవితల్లో మరో ప్రముఖ కవిత వంటిల్లు. సమాజంలో వంటిల్లు స్ర్తీలకు, ముందు గది పురుషులకు కేటాయించారు. 

.

మంచి స్ర్తీకి కితాబు ఏమిటంటే మంచి మంచి వంటలు బాగా చేసి ఇంట్లో వాళ్ళను మెప్పించడము. ఏ కాలమైనా ఈ లక్షణం మాత్రం మారదు. ప్రవరుడు తీర్థయాత్రలు చేసి హిమాలయ సౌందర్యాలను ఆస్వాదిస్తే అతని భార్య మాత్రం అరుణాస్పద పురంలోనే ఉండి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని’ అని వంటింటికే అంకితమవుతుంది. నల భీమ పాకమని మగవారి వంటలు ప్రశస్తికి వచ్చినా ఆ నల భీముల పాకశాస్త్ర ప్రావీణ్యం కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితం. ‘అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది’ అంటూ వంటింటి రహస్యాల్ని విప్పి చెప్తారు విమల. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి/ అయినా చివరికి వంటింటి గిన్నె లన్నిటిపైనా/ మా నాన్న పేరే’ అని పచ్చి నిజాన్ని చెప్తారు. వంట చెయ్యడం, వడ్డించడంలోనే రోజులో చాలా సమయం గడిచిపోతుంది స్ర్తీలకు. చదవడానికే, రాయడానికీ దేనికీ సమయముండదు. అందుకే ‘ఎంత అమానుషమైందీ వంటగది? మన రక్తం పీల్చేసి మన ఆశల్నీ, కలల్నీ కాజేసి/ కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి గద్ద ఈ వంటిల్లు’ అని వంటిల్లు ఎలా స్ర్తీల శక్తుల్ని ధ్వంసం చేస్తుందో చెప్తారు. మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం/ గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను ధ్వంసం చేద్దాం రండి’ అంటూ వంటిళ్ళలోనే జీవితమంతా అంకితమైపోయిన స్ర్తీల గురించి ఘాటైన చురకలు వేస్తారు. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా మారాలని, నల్లటివాళ్ళు తెల్లగా మారాలనే నేపథ్యంలో ఎంత హింసను అనుభవిస్తున్నారో ‘సౌందర్యాత్మక హింస’లో ‘మన మంటే 34, 24, 35 కొలతలమైన చోట, మొటిమలు మొలవడం, జుట్టు రాలడం/ నడుం సన్నగా లేకపోవడమే/ మన నిరంతరాందోళలైన చోట/ దైహిక సౌందర్య పిపాస యే/ మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట/ ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!’ అని సకల స్ర్తీల బాధల గురించి విమల వ్యాఖ్యానిస్తారు. స్ర్తీవాద రచయిత్రులు చాలా మంది వివాహ వ్యవస్థలోని అసమానతల గురించి, ఎంత సేపూ భార్యలు మాత్రమే సర్దుకు పోవడం గురించి, దాంపత్యంలోని బోలుతనం గురించి ఎన్నో కవితల్లో విప్పి చెప్పారు. ‘సర్దుకుపో ఈ నాలుగక్షరాలే/ స్ర్తీని అగ్నికాహుతి చేసే సాధనాలు’ అని ఈ సర్దుకు పోవడం స్ర్తీలకే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్నిస్తూ ‘నీటిలోనే జీవిస్తుంది చేప/ కాసేపు నేలపైన ఉండమంటే/ నశిస్తుంది మరుక్షణమే/ నింగిలో విహరించే పక్షిని/ కాసేపు సర్దుకో నేలపైనే ఎగురు’ అంటే ఎంత అసహజమో ఈ సర్దుకు పోవడం కూడా అంతకష్టమైనదే అని మందరపు హైమవతి తన ‘సర్దుకుపో’ కవితలో వాస్తవ స్థితిని వివరిస్తారు. పురుషాధిక్య సమాజంలో స్ర్తీలు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో తెలిపే సిలబస్‌ను గూడ పురుషులే రూపొందించారు. స్ర్తీలను ప్రాణ పరిమళంతో అణువణువు స్పందించే మనుషులుగా గాక ఒక బానిసగానో, ఒక ఆటబొమ్మగానో, ఒక విలాసవస్తువుగానో చూసే సంఘం గుండెల్లో ప్రశ్నల బాణాలు సంధిస్తూ ‘ఎన్నాళ్ళు ఈ పూర్వకాలపు పాఠాలు/ మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు’ అని నిలదీస్తుంది మందరపు హైమవతి. ‘అలా పగలబడి నవ్వడం తప్పు గదూ/ అధరాలపై చిరు దరహాసమే సుందరం/ అలా భర్త మాటను ఎదిరిస్తావెందుకు/ సహనం స్ర్తీకి ఆభరణం/ గృహిణికి శాంతమే భూషణం’ ఇలాంటి పాఠాలనీ సిలబస్‌నీ అందరం కలిసి మార్చలేమా అని ప్రశ్నిస్తారు. స్ర్తీల దైహిక బాధల గురించి, మానసిక వేదనల గురించి, తరతరాలుగా యుగ యుగాలుగా పురుషులు చేసిన గాయాలనుంచి, అనేకానేక అనుభూతుల గురించి మనసులో గుచ్చుకునేటట్టు కవితలు రచించారు. ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్‌. జయ మొదలైనవారు ఎన్నో స్ర్తీవాద కవితల్ని రచించారు. లేబర్‌ రూం, పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్‌ స్టేట్‌మెంట్‌, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్‌గళ్స్‌ మొనోలాగ్‌, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాము మొదలగు కవితలు కవితా ప్రపంచంలో ఎంతో సంచలనాన్ని సృష్టించాయి. స్ర్తీవాద సాహిత్య ఉద్యమం మూడు దశాబ్దాలు దాటిన సందర్భంలో సమాజంలో ఎన్నో విజయాలు సాధించింది. సంఘంలో మార్పుని వేగంగా తీసుకువచ్చింది. అధికారులకైనా, మామూలు ప్రజలకైనా స్ర్తీ ంటే ఉన్న చులకన భావం పోయింది. సభల్లో నైనా, నిజ జీవితంలోనైనా స్ర్తీల గురించి ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి జంకుతున్నారు. ఆధునిక పురుషులు చాలా మంది ఇళ్ళల్లో భార్యలకి సాయం చేస్తున్నారు. పిల్లల పెంపకంలో పాలు పంచుకుంటున్నారు. 

.

నేడు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బస్సుల్లోనూ, రైళ్ళలోనూ, సినిమాల్లోనూ చంటిపిల్లల్ని మగవాళ్ళు ఎత్తుకున్న దృశ్యాలే కనిపిస్తాయి. స్ర్తీవాదం తెలుగు కవిత్వంలో ఎంత సంచలనం కలిగించినా ఆ తర్వాత ఉద్యమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్ర్తీలందరూ ఒకటి గాదు. ధనవంతులు, అగ్రవర్ణాల స్ర్తీలతో బాటు దళిత స్ర్తీలు, అణగారిన వర్గాల స్ర్తీలున్నారని, వాళ్ళ సమస్యలు వేరని ఆ స్ర్తీల సమస్యల్ని ప్రతిబింబిస్తూ దళిత వాద సాహిత్యం వచ్చింది. ఆ తర్వాత ముస్లిం వాద సాహిత్యం వచ్చింది. నీలి మేఘాలు, గురి చూసి పాడే పాట సంకలనాలు కాకుండా ‘నల్ల పొద్దు’ మొదలైన సంకలనాలు వచ్చాయి. దేనికైనా బలమైన పునాది స్ర్తీవాద సాహిత్యమే. సమాజంలో నేడు శ్రామిక స్ర్తీలు అధికంగా ఉన్నారు. ఇళ్ళలో పనిచేసేవారు, ఫేక్టరీలలో, షాపుల్లో, ఇళ్ళ నిర్మాణాల్లో, పొలాల్లో, తోటల్లో శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. వారి సమస్యలను చిత్రీకరిస్తూ, ఇంకా అట్టడుగు ప్రజల జీవనాల్లోకి వెళ్ళినప్పుడే స్ర్తీవాద సాహిత్యం బలోపేతమవుతుంది.

Thursday, December 22, 2016

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2312)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2312)


.

సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ

బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి

ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను

నిన్నుఁగాననివారి నే స్మరింప,

మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి

చెంతఁజేరఁగఁ బోను శేషశయన!

.

తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల

దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన

.భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః

స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థమిదేః

బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణను ఎరుగని తెలుగు లోగిలి లేదనడం అతిశయోక్తి కాదు. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో యజమానురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, గృహిణి... ఇలా నిజ జీవితంలో విభిన్న పాత్రలను పోషించి ఆయా రంగాల ప్రముఖులచే భేష్ అనిపించుకున్న ఘటికురాలు.

స్త్రీ స్వేచ్ఛపై తన అభిప్రాయాలను సుస్పష్టంగా చెప్పారామె. మహిళా స్వేచ్ఛ అంటూ చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారని డాక్టర్ భానుమతి పేర్కొంటూ, ఎవరినీ లెక్కచేయక విచ్చలవిడిగా తిరుగుతూ నిర్లక్ష్య ధోరణి గలవారు ఒకరైతే...

పురుషాధిక్యానికి గురై అమాయకత్వంతో కూడిన అజ్ఞానంతో కష్టాలు పడే మహిళలకు విముక్తినివ్వాలని సీరియస్‌గా వాదించేవారు ఇలా రెండు రకాల మహిళా స్వేచ్ఛావాదులు ఉన్నారంటారు. అయితే "మట్టిలో మాణిక్యం" చిత్రంలో తాను రూపొందించిన లలిత పాత్ర. స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్ధం అంటారు డాక్టర్ భానుమతి.

మహిళ తనకంటూ స్వంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని, తన పరిమితులను తానెరిగి, జీవిత భాగస్వానిగా, అమ్మగా, పరిపూర్ణ స్త్రీగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలని, తీవ్ర పరిస్థితులు ఎదురైనప్పటికీ తల ఒగ్గక సమాజంలోని దుష్టశక్తులను దునుమాడే ఆదిశక్తిలా ఉండాలనేది తన ఆకాంక్షగా భానుమతి స్పష్టం చేశారు.

అయితే, మహిళలందరికీ ఇలాంటి ఆదర్శ లక్షణాలు ఉండవని తనకూ తెలుసనీ, కొందరికి పుట్టుకతోనే భయం, పిరికితనం ఉన్నా అడుగడుగునా జీవితం నేర్పే పాఠాలు, పరిస్థితుల ఒత్తిడితో ఆత్మస్థైర్యం, ధైర్యం అలవడతాయని ఆమె అన్నారు.

డాక్టర్ భానుమతి జీవితాన్ని పరికిస్తే పై విషయాలు ఆమె స్వానుభవంతో చెప్పినవేనని అనిపిస్తుంది. ఈ కోణంలోనే "మట్టిలో మాణిక్యం"లో లలిత పాత్రను రూపొందించి, తరువాత అదే ప్రేరణతో "అంతా మన మంచికే" చిత్రంలోని సావిత్రి పాత్రకు ఊపిరి పోసినట్లు భానుమతి చెప్పారు.

ఈ సినిమాలు రెండూ ఎంతో ప్రజాదరణ పొందాయి. అదే రీతిలో తాను "అసాధ్యురాలు"లో భారతి పాత్రను ఒకింత ఎక్కువ స్థాయిలోనే మలిచానని వివరించారు.

అసాధ్యురాలు సినిమాలో హీరోకు పెద్దమ్మ అయిన భారతి ఐశ్వర్యవంతులమనే అహంకారంతో పేదలను నీచంగా చూసే వ్యక్తులను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రేమకు ఆటంకాలు కల్పించే శక్తులను ఎదుర్కొంటూ, చేయూతను ఆశించిన వారిని అండగా నిలిచి, ఒక్కో సన్నివేశలోనూ సమయస్పూర్తితో సమర్థవంతంగా వ్యవహరించేలా ఈ పాత్రను రూపొందించానన్నారు.

మొన్న లలిత, నిన్న సావిత్రి, తర్వాత భారతి పాత్రల ద్వారా స్త్రీ స్వేచ్ఛకు నిజమైన అర్థాన్నిచ్చిన డాక్టర్ భానుమతి నిజజీవితంలోనూ అదే వ్యక్తిత్వంతో స్త్రీ లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు.

ఈ ఆర్టికల్ రాసినవారు - యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు

వెబ్ దునియా ఉండి గ్రహించడమైనది

Wednesday, December 21, 2016

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2212)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ(2212)

(రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి)

.

సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత

దురితజాలము లెల్లఁదోలవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత

బలువైన రోగముల్ బాపవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత

రిపు సంఘముల సంహరింపవచ్చు,

నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత

దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు.

.

తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత

దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు!

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము.!

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము.!

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము.!

(అన్నమాచార్యుల కీర్తన.)

.

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము

యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు

ధర శింగిణులు శ్రీలు తలిరులును

అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను

మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె

బిసములు శంఖమును పెనుచక్రవాకములా

కసము నీలపుఁజేరు కరికుంభాలు

పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను

మసలక అలమేలుమంగ మేనై నిలిచె

అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు

వొనరి వరుసఁ గూడి వుండగాను

ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద

పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె.

Tuesday, December 20, 2016

ఆకులో ఆకునెఇ'!

ఆకులో ఆకునెఇ'!

ఆకులో ఆకునెఇ'!

.

.గిద్దలూరు-నంద్యాల బస్సు మరియు రయిల్ మార్గంలో గిద్దలూరు కు 

10కి.మీ.ల దూరం లో దిగువమెట్ట వున్నదిదిగువమెట్ట వద్దవుండి 

నల్లమల్ల అడవి మొదలుఅయ్యి గాజులదిన్నె వద్ద అడవి ముగుస్తుంది

.అడవి వేడల్పు 40-45 కి.మీ.వున్నది.వర్షకాలం లో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంతపచ్చగాతివాచిపరచినట్లుకనులవిందుగావుండును

.ఎత్తుఅయ్యినకొండలు,లోయలతో బస్సు ప్రయాణం చెయ్యునప్పుడు అందమయిన అనుబూతి కల్గుతుంది

.క్రిష్ణ శాస్త్రి గారికి సంబంధించిన వ్యాసాలలో'ఆకులో ఆకునెఇ' అనే పాటను

ఆయన రయిలులో విజయవాడ నుండి బళ్ళారి వెళ్ళునప్పుడు చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పెర్కొడం జరిగింది

.

పల్లవి :

ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : కవి అడవి సౌందర్యానికి ముగ్ధుడై అక్కడి ఆకులు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలతో తానూ ఒకడిగా కలసిపోయి అక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాడు.

చరణం 1 :

గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై

జలజలనీ పారు సెలపాటలో తేటనై

పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరి చేడే చిన్నరి సిగ్గునై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : తన మనసులోని భావాల్ని మరింత లోతుగా తరుస్తూ చిరుగాలిలో కెరటం లాగా, సెలయేరులో తేటగా, పూలమొగ్గలోని సిగ్గుగా వాటన్నితో కలసిపోవాలని కోరుకుంటాడు.

చరణం 2 :

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల

చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

వివరణ : అక్కడ అడవిలోని చెట్లు, ఆ చెట్ల పైనుంచి నీలి కొండలు ఎక్కుతూ మెలమెల్లగా ఆకాశాన్ని చేరుకొని నీలి మబ్బులోకి చేరి దాని నీలిరంగులో కలిసి ప్రకాశిస్తూ ఆకలి - దాహం చీకులు, చింతలూ లేకుండా ఏకాంతంగా విహరిస్తూ వెర్రివాడిలా తిరుగుతూ ఆ అడవిలోనే కలిసిపోయి ఉండిపోనా అంటూ కవి ప్రకృతిలో తానూ మమేకమయిపోవాలని కోరుకుంటున్నాడు.

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2112)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!
శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(2112)

.

 శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!


భక్త వత్సల! కోటి - భానుతేజ!


కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!


సాధురక్షణ! శంఖచక్రహస్త!


ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!


క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!


పక్షివాహన! నీలబృమరకుంతలజాల!


పల్లవారుణ పాదపద్మ యుగళ!


తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!


కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!


భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!


దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Wednesday, December 14, 2016

తేట తేట తెనుగులా....

తేట తేట తెనుగులా....

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

తేట తేట తెనుగులా....

మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.

పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది

ఏలాఅంటే

=======

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.

క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం

చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం

ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం

త థ ద ధ న……నాలుక కొస భాగం

ప ఫ బ భ మ……..పెదవులకు

య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా

ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.

సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.

తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.

మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.

తెలుగులో మాట్లాడండి. .

తెలుగులో వ్రాయండి. . .

తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..

తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .

_____________________________________

ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు

సీతాజననం !

సీతాజననం !

సీతాజననం !

మిధిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగము 

చేయుచూ భూమిని దున్నుచుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది. 

ఆ పెట్టెను తెరచి చూడగా అందులో ఒక పసిపిల్ల కనిపించింది. 

నాగటి చాలులో లభించినందున ఆమెకు సీత అని నామకరణము చేసి

జనకమహారాజు, ఆయన భార్య సునయన అల్లారు ముద్దుగా ఆ బిడ్డను పెంచుకొన్నారు.

కనుక సీత భూదేవి కుమార్తె అని అంటారు, 

శ్రీ సీతమ్మ జన్మనక్షత్రము ఆశ్లేష నక్షత్రము . 

సీత గర్భమున జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.

సీతాదేవి జననం సీత జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున

చైత్ర మాశ శుక్లపక్షంలో జరిగింది.

ఎందుకో ఈ సినిమా లో క్లారిటి లేదు ...

ఎందుకో ఈ సినిమా లో క్లారిటి లేదు ... 

సావిత్రి భర్త పద్మనాభం చని పోయి ఉండక పోతే 

ఆమె గంపెడు పిల్లతో హాయిగా వుండేది .. 

గోపి గౌరీ పెళ్లి చేసి కొనేవాడు 

ఆదుర్తి ముగ మనసులు మనం ఏడవడానికి 

రాధ భర్తను అన్యాయంగా చం పెసారు

Tuesday, December 13, 2016

శ్రావణ మేఘం !

శ్రావణ మేఘం !

కురిసే దాకా అనుకోలేదు
శ్రావణ మేఘమని
తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని

కలిసే ధాకా అనుకోలేదు తీయని స్నేహమని

జాబిలి కన్నా నా చెలి మిన్న

జాబిలి కన్నా నా చెలి మిన్న

జాబిలి కన్నా నా చెలి మిన్న

పులకింతలకే పూచిన పొన్న

కానుకలేమి నేనివ్వగలను

కన్నుల కాటుక నేనవ్వగలను

పాల కడలిలా వెన్నెల పొంగింది

పూల పడవలా నా తనువూగింది

ఏ మల్లెల తీరాల నిను చేరగలను

మనసున మమతై కదా తెరగలను


Sunday, December 11, 2016

వలచే మనసే మనసు

వలచే మనసే మనసు

తొలిచూపులు నాలోనే - 

వెలిగి౦చె దీపాలే
చిగురి౦చిన కోరికలే -
చిలికి౦చెను తాపాలే
.

వలచే మనసే మనసు

పాపం శమించుగాక!

పాపం శమించుగాక!

పాపం శమించుగాక!

భూమ్మీదఉండే అన్నీమతాలల లోనూ, (ఒక్క ఇస్లాంలో మాత్రం ఎవరికి అయితే అన్యాయంజరిగిందో వారు మాత్రమే ఆ తప్పుచేసిన మనిషిని 

మన్నిచగలరు, ఇంక ఎవ్వరికీ ఆ అధికారం లేదు). ఒకమనిషి పాపం చేసినతరువాత, దేవునిపేరు తలచినా, లేక ఆయన మూర్తిని దర్శనం చేసినా, లేక మన్నించమని కోరినా, దయామయుడు అయిన ఆ దేవుడు, వీళ్ళుచేసిన ఘోరమైన పాపాలు, తప్పులు అన్నింటినీ క్షమించి, వీళ్లను పవిత్రులుగా చేసేస్తాడు అన్నది ప్రచారంలో ఉంది.

నాదృష్టిలో ఈ "పాప విమోచనం" అన్నదే, ఈ లోకంలో జరుగుతూన్న అన్నితప్పులకూ మూలం అని. "నారాయణా" అన్న మాత్రాన సర్వ పాపాలు 

హరించుకు పోతాయి, దర్శన మాత్రాన వేయి జన్మల పాపాలు వివృత్తమౌతాయి. ముడుపులు కట్టి మొక్కుకుంటే ఆ దేవుడు, మీరు చేసిన పాపాలు అన్నింటినీ క్షమించి, కోరిన కోరికలన్నీ తీరుస్తాడు.

అందువల్లనే ఈ మధ్య వెంకన్న, కుబేరుడూ లక్ష్మీ, సాయీ లాంటి దేవుళ్ళకు డిమాండ్ పెరిగింది.

మూర్తికి ఒక ప్రమిద దీపం అంటించదానికి నోచుకోని గుడులన్నీ కబ్జా అయిపోయి, కొత్త కొత్త గుడులు, పుట్ పాత్ మీద వెలిసేస్తున్నాయి. చెయ్యడానికి ఉద్యోగం దొరకని బ్రాహ్మణులు, చేసుకునే "దేవుడిపూజ" చేసే పూజారి ఉద్యోగం, మంచి లాభదాయకంఅయిపోయి, బ్రాహ్మణులే కాకుండా అన్య జాతీయులు కూడా అర్చకత్వానికి ముందుకు వస్తున్నారు.

ఒక 40 సంవత్సరాలక్రితం గుడులకు ఇంత డిమాండు ఉండలేదు, ఇన్ని ముడుపులు ఉండలేదు, ఇంత రష్, ఇంత "భక్తి" ఉండలేదు. ఎక్కడినుండీ వచ్చిందో తెలియదు. కొన్ని పాడుబడిన గుడులలో పెకలించివేసిన మూలమూర్తిని మళ్ళీ గప్ చిప్ గా ప్రతిష్టించేసి డబ్బుచేసుకుంటున్నారు. ఉన్నట్లుఉండి స్వయంభూస్వాములు వెలిసేస్తున్నారు. (దీనికి నేనే సాక్ష్యం). దీన్ని నేను తప్పు అని అనడంలేదు. కానీ ఈ పనిని గత వందసంవత్సరాలలో చేయలేదు, కారణం అప్పట్లో ఇంత డిమాండ్ ఉండలేదు.

చేసిన పాపాలను కడుగుకునే టెక్నిక్ తెలిసిపోయింది, తను చేసినపాపం, కన్ఫెస్ చేసుకునేసి,/ నారాయణా అనేసి/ నాలుగు గుడులకెళ్లి భారీగా 

(లెక్కవేసుకుని 10 - 30 % వరకూ) ముడుపులు చెల్లించుకుని/ కిరీటాలు చేయించేసి, కళ్యాణం, ఆకుపూజలు వగైరా చేయించేసి, సత్రాలూ, భవనాలు గట్రా కట్టించేసి, తాము చేసిన పాపాలు పూర్తిగా కడుక్కునేసి, ఫ్రెష్ గా మళ్ళీ పాపాలను చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

అసలు "పాపవిమోచనం" అన్నపదమే కదా వీళ్ళకు ఇంత ధైర్యం ఇచ్చింది. "నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, దానికి ఫలితం ఈ జన్మలోనో, లేక నువ్వు చనిపోయిన తరువాతనో అనుభవించితీరాలి" అంటే, మళ్ళీమళ్ళీ ఇన్ని పాపాలు జరుగుతాయా?

చూడండి, పట్టుపడుతున్న దోషులలో అందరూ నామాలూ బొట్లు పెట్టుకున్న, దైవం మీద నమ్మకంఉన్న వాళ్ళే కనబడుతున్నారు. నాస్తికముండావాళ్ళు కనబడడంలేదు. ఇలా ఎందుకని? చేసిన పాపానికి "ప్రాయశ్చిత్తం" అనే షార్ట్ కట్ ఉంది, అని నమ్మిన దైవభక్తులు తప్పులుచేసి, దాన్నికడుక్కుని, మళ్ళీమళ్ళీ పాపాన్నిచేయడానికి వెనకాడడం లేదు.

భక్తి అనేదిఉంటే తప్పుకాదు, కానీ దాన్ని ప్రదర్శించుకుంటే మాత్రం తప్పు అయితీరుతుంది. ఏం మనకు భక్తి ఉంది అని అందరికీ తెలియచెప్పాలా? అప్పుడే ఆ భగవంతుడు మనలను గుర్తిస్తాడా? మన తప్పులను క్షమిస్తాడా?

40 కోట్ల కిరీటాన్ని ఇచ్చిన "గాలి" ని జైలు కెళ్ళకుండా వెంకన్న ఆపలేదు, ఇంకా ఆ విషయం పెండింగులోనే ఉంది, ఇహలోకంలో కానీ, ఆతర్వాత అయినా కానీ, అతనికి ఎంతటి తీవ్రమైన శిక్ష కాచుకుందో ఆ పైవాడికే తెలియాలి.

చేసిన పాపానికి తగిన శిక్ష తప్పదు, అది ఇక్కడకావచ్చు, మరెక్కడైనా కావచ్చు, కర్మసిద్దాంత ప్రకారం ఇది తప్పదు

అప్పటికి మనం...(నేను) పుట్టలేదు.. గనుక ఆ వివాహానికి హాజరు కాలేక పొయా !

అప్పటికి మనం...(నేను) పుట్టలేదు.. గనుక ఆ వివాహానికి హాజరు కాలేక పొయా !నటి కాంచన...

నటి కాంచన... 


నటి కాంచన... 

శాస్త్రి, విద్యాలతలకు జన్మించారు. వారిది సంపన్న కుటుంబం.

అయితే, తండ్రి తాగుడు, జూదం వంటి దురలవాట్లతో ఆస్తిని కరిగిస్తూ పోయాడు

. ఓ రోజున కాంచన చేత వారు తెల్ల కాగితంపై సంతకం చేయించి, ఆమెకు తెలియకుండా ఆమె ఆస్తినంతా తల్లిదండ్రులు తమ పేర్ల మీదికి మార్చుకున్నారు. అంతేకాకుండా, తమ కూతురు చెడిపోయిందని, ఎవరు కూడా ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదని కూడా తల్లిదండ్రులు ప్రచారం సాగించారు. 

ఆమె సినీ రంగాన్ని వదిలేసి, సామాజిక సేవలో మునిగిపోయారు. ఆమె బెంగళూరులో ఉంటూ దేవాలయాలను శుభ్రం చేస్తూ, నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. సుదీర్షమైన న్యాయపోరాటం ద్వారా తల్లిదండ్రుల నుంచి 15 కోట్ల రూపాయల విలువ చేసే తన ఆస్తిని ఆమె పొందారు. 

సోదరి గిరిజతో కలిసి ఆమె తన ఆస్తిని టిటిడికి అందించారు.

ఈవిడ నేటి తరం నటీమణులకు ఆదర్శప్రాయం కదా! —

రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం రచన: ఏల్చూరి మురళీధరరావు

రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం


రచన: ఏల్చూరి మురళీధరరావు


1973 హేమంతంలో అనుకొంటాను. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఇంటికి వెళ్ళాను.

ఆ రోజుల్లో కృష్ణశాస్త్రిగారి ఇల్లంటే సాహిత్యికులందరికీ సాహిత్య సంగీత హృదయంగమ సంగమతీర్థరాజం.

గోష్ఠీవినోదంకరణలతో అభ్యాగతులకు అయాచితంగా అనిమేషత్వం సిద్ధిస్తుండేది.

మేడ మెట్లెక్కి నేను కాలింగ్ బెల్ నొక్కేసరికి – భగవంతుడే మందిరద్వారాలు తీసినట్లు కృష్ణశాస్త్రిగారే తలుపుతీసి, ఆప్యాయనంగా పలకరించి, లోపలి గదికి తీసుకొనివెళ్ళారు.

అప్పటికే అక్కడ పిలకా గణపతిశాస్త్రి గారున్నారు.

నిండైన ప్రేమతో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆంధ్రదేశం భావకవిత్వపు ఇంద్రజాలంలో మంత్రముగ్ధమై ఉండిన కాలపు కవితాసవితల సన్నిధిరూపమైన పెన్నిధిని స్వాయత్తీకరించుకొంటూ కేవలానుభవానందమూర్తినై ఉన్నాను.

‘మాట్లాడుకోవటం’ అంటే కృష్ణశాస్త్రి గారు స్క్రిబ్లింగ్ ప్యాడ్ పైని వ్రాయటం, గణపతిశాస్త్రి గారు వాకోవాక్యాన్ని కొనసాగిస్తూ ప్రసంగించటం అన్నమాట.

నా అదృష్టం ఏకకాలంలో ప్రేక్షక – శ్రోతృ స్థానీయత. కృష్ణశాస్త్రిగారి అందమైన అక్షరాలను చూస్తూ, గణపతిశాస్త్రిగారి అక్షరప్రసంగాన్ని వినటం.

ఒక్కొక్కసారి గణపతిశాస్త్రిగారు కృష్ణశాస్త్రిగారి వ్రాతను పైకి చదివి, నిమీలితనేత్రులై ధ్యానమగ్నులై భావాన్ని మనోగతం చేసికొని, ఆ తర్వాత ప్రశాంతంగా సమాధానించటం జరుగుతుండేది.

విషయం: తెలుగు కవిత్వపు స్థితిగతులు. వర్తమాన స్థితి ఆధారంగా భావిగతుల అభ్యూహ.

అంతలో “పోస్ట్” అని కేక వినిపించింది.

శాస్త్రిగారికి అపరిచితులూ, సుపరిచితులూ అందరూ ఆత్మీయులే. ఎక్కడెక్కడి నుంచో వారికి లెక్కలేనన్ని ఉత్తరాలు వస్తుండేవి. ఆ ఉత్తరాలను అందుకోవటం అంటే వారికి దేవులపల్లి సోదరకవులు పిఠాపుర సింహాసనాసీనులైనప్పుడు చెప్పిన పద్యాలలో అంతటి పట్టరానంత సంతోషం.

రాజహంసగారు ఉత్తరాల కట్టను అందుకొని, లోపలి గదిలోకి తెచ్చి కృష్ణశాస్త్రిగారి చేతిలో ఉంచారు.

అందులో బుక్ పోస్టు పాకెట్టు ఒకటున్నది.

శాస్త్రిగారు ఉత్తరాలను ప్రక్కనుంచి, బుక్ పోస్టు పాకెట్టును పైకి తీసి, దానిని ఎవరు పంపినదీ చూడకుండానే, నిరాసక్తంగా దారాలను తప్పించి, వేళ్ళకొనలతో కాగితపు ఆచ్ఛాదనను తొలగించి, అందులో ప్లాస్టిక్ జాకెట్టుతో ఉన్న ఎర్రని అట్టపైని గిల్టు అక్షరాలను చూసి విభ్రాంతులై, అద్ధావాక్కుతో చకచకా పేజీలను తిరగేసి, పుస్తకాన్ని మిలమిల మెరుస్తున్న కాటుక కన్నులకద్దుకొని, గుండెలకు హత్తుకొన్నారు.

గణపతిశాస్త్రిగారు మేదురమైన ఆ ఆదరానికి, పారమెరుగని ఆ పారవశ్యానికి, నిండైన ఆ భక్తితాత్పర్యానికి చకితులై, “ఏదండీ, ఆ పుస్తకం ఇలా ఇవ్వండి” అంటూ చేయిజాపారు.

శాస్త్రిగారు తెల్లవారుజామున తొలితొలి వెలుగురేకల నునువెచ్చని పలకరింపులకు పులకరించి ఒకటొకటిగా రేకులు విచ్చుకొని విప్పారిన గులాబీ పువ్వులాగా ఆ పుస్తకాన్ని కరాంజలిబంధంలో నిలుపుకొని గణపతిశాస్త్రిగారి కరకమలాలలో ఉంచారు.

వారు పుస్తకాన్ని తెరుస్తున్నప్పుడు ప్రక్కన కూర్చొని ఉన్న నేనూ విస్తుపోయి చూశాను.

అది పూజ్యులు అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు ఢిల్లీనుంచి పంపిన తమ తండ్రిగారు శ్రీ అబ్బూరి రామకృష్ణరావు గారి అందమైన ఊహాగానము, ఇతర కృతులు ప్రథమ ముద్రిత ప్రకాశిత సువర్ణసంపుటం.

గణపతిశాస్త్రి గారు పుస్తకాన్ని తదేకంగా చూస్తుండగా కృష్ణశాస్త్రిగారు ఆ పద్యాలను పైకి చదవమని స్క్రిబ్లింగ్ పాడ్ పైని వ్రాసి, వారికి చూపారు.

గణపతిశాస్త్రి గారు పుస్తకం ముందునుంచి వెనుక దాకా పైపైని చూసి, మైమరపు నుంచి తేరుకొని, చివరికి – రామకృష్ణరావు గారి స్వహస్తాక్షరాలతో తిలకాయమానంగా విలసిల్లుతున్న పద్యాన్ని సుశ్రావ్యమైన మధుక్షీరద్రాక్షామధురధారాధారాళమైన స్వరసరణితో, పరమ మోహనమైన రాగధోరణిలో మరెన్నటికీ మరపుకు రానంత అందంగా పాడి వినిపించారు.

ప్రశాంతినిలయమైన వారి ముఖమండలం నుంచి వన్నెలు చిమ్ముతున్న మేనిచిన్నెలతో స్వరకిన్నెరలు శాంతికపోతాల వలె పైకెగిరి, మా హృదయకుహరాలలో విహరించి, ఇల్లంతా వ్యాపించి, కుడ్యగవాక్షరంధ్రాల గుండా వాయువీథులలోని కెగిసి ఒక్కటొక్కటిగా అంతర్హితములైపోతుండటాన్ని ఆ పుణ్యదివసాన కన్నులారా తిలకించి పులకించటం నాకింకా గుర్తున్నది:

“నేనే కాదు, సమస్తభూతతతియున్ నిర్వేదభారమ్ముచే

నానాభంగుల లాలనీయగతులన్ నా గీతమే పాడు; లో

కానీకమ్ముల లోన లోన నొక హాహాకార ముద్భూతమై

శ్రీ నారాయణపాదనీరజరజాశ్లేషమ్ము కాంక్షించెడిన్!”

అని పద్యాన్ని చదివి ముగించారు, గణపతిశాస్త్రిగారు. తాదాత్మ్యం వల్ల వారి కన్నులు అర్ధనిమీలితాలైనాయి.

అయితే ఎందుకో, ఆయన బొమలు ముడివడినట్లనిపించింది. గొంతు డగ్గుత్తికను చెందింది.

“శ్రీ నారాయణపాదనీరజరజాశ్లేషం అన్నారు, అబ్బూరి వారు …”

అంటూ, సందిగ్ధంగా కృష్ణశాస్త్రిగారికేసి చూశారు.

నేను అహమహమిక కొద్దీ ఉండబట్టలేక, “రజశ్శబ్దం నిఘంటువుల్లో సకారాంతం గానూ, అకారాంతం గానూ ఉన్నదేమో చూద్దాము” అన్నాను.

కృష్ణశాస్త్రి గారి వద్ద లేని నిఘంటువు ఉంటుందా? తామరలు నిండిన సరోవరం లాగా బీరువాలలో పుస్తకాలు నిండిన ఆ గది చదువుల తల్లికి కొలువుకూటం కదా!

రజశ్శబ్దం సకారాంతం. అందువల్ల దానిపై ఆశ్లేష శబ్దం సంధిల్లినప్పుడు సకారానికి లోపం వచ్చి ‘రజ ఆశ్లేషం’ అనీ; యకారం వచ్చినప్పుడు ‘రజయాశ్లేషం’ అనీ రెండు రూపాలే కాని, ‘రజాశ్లేషం’ కాజాలదని గణపతిశాస్త్రిగారి భావం అన్నమాట.

అబ్బూరి వారు పద్యంలో శ్రీమన్నారాయణుని పాదనీరజ రజాశ్లేషాన్ని కాంక్షించారు కదా.

కృష్ణశాస్త్రిగారు వెంటనే, “ఎర్రన్న యశశ్శబ్దాన్ని అకారాంతంగా ప్రయోగించాడు కదా, ఆ పద్యాన్ని చదువు” అన్నారు నాతో.

ఆ పద్యం స్ఫురింపక నేను ఖసూచకంగా చూశాను.

శ్రీ గణపతిశాస్త్రి గారు మహావిద్వాంసులు. శ్రీ మహాభారతాన్ని ఆంధ్రీసౌవస్తికులకోసం ఆధునికవచనంలో పాపఠ్యమానంగా ప్రపంచించిన పండితమూర్ధన్యులు. మహాకావ్యనిర్మాణధురంధరులు.

వారికీ స్ఫురించి ఉండదు. లేకపోతే చెప్పేవారే.

కృష్ణశాస్త్రిగారే ఆ పద్యపాదాన్ని వ్రాసి గణపతిశాస్త్రిగారికీ, నాకూ చూపించారు.

“నాకు తెలుగులో వేలకొద్దీ పద్యాలు వచ్చును. అయితే ఏదీ నియతంగా చదువుకోలేదు” అన్నారు. ‘చక్షూరాజీవయుగంబు’, ‘భద్రాయితమూర్తి’ అని చూసి నేర్చుకోవటమే కానీ, తాళ్ళూ దారాలూ తెలియవు.

చూడండి. ఒకప్పుడు నేనూ –

“ఈ లోకమ్ము దరిద్రతా కృపణతా హింసా రిరంసా రుషో

ద్వేలోల్లోలములందు మున్గి విలయాభీలస్థితిన్ మాయునే

మో! లేకున్న సహోదరాస్థిపలలమ్ముల్ తిందురే యెందు, త

త్కీలాలాసవపానలాలసమదాంధీభూతులై మానవుల్.”

అని వ్రాశానే కాని – అందులో గణాలూ, వ్యాకరణనియమాలూ చూసుకోలేదు” అన్నారు.

“మా అబ్బూరి అలా కాదు.

గొప్ప పండితుడు.

మహా మహా పండితుడు.

ఏది వ్రాసినా పరమగంభీరంగా ఉంటుంది.

ఎంతో గుండెల్ని కుదిపివేస్తేనే కాని వ్రాయడు.

వ్రాసిన ప్రతి అక్షరం ఆచి తూచి వ్రాసిందే.

మాకందరికీ గురువు.

నేను దేశమంతా సభల్లో తిరిగినప్పుడు పాడిన పద్యాలే ఇవి.”

అని, ఒక్కొక్క పంక్తినీ ఎంతో ఆవేశంగా వ్రాశారు.

“తాళ్ళూ దారాలూ” అంటే కృష్ణశాస్త్రి గారి పరిభాషలో వ్యాకరణ సూత్రక్రమం అన్నమాట. సూత్రాలను తాళ్ళూ దారాలు అనేవారు.

ఆ పంక్తులను మేమిద్దరమూ చదువుతుండగా – పై పంక్తిలోని మహా మహా పండితుడు లోని “మహా మహా” ల తర్వాత హంసపాదు పెట్టి, మళ్ళీ ఒకసారి “మహా” అని వ్రాసి, దానికి ఒద్దికగా క్రింది గీటు గీశారు.

“అబ్బూరి ‘ఊహాగానము’ అని పేరుపెట్టాడు. విశ్వనాథ అయితే ‘ఊహగానము’ అనాలంటాడు.”

అని వ్రాశారు.

చాలాకాలం తర్వాత ‘ఊహ’ శబ్దం పుంలింగం కనుక ‘ఊహగాన’మే సలక్షణమని, అయితే ‘ఊహాగానము’ సామవేదంలోని ఒక ప్రపాఠమని, ‘ఊహాగానము’ మరింత సార్థకమని – రామకృష్ణరావు గారి మనోగతం నాకు బోధపడింది. ఆ ప్రస్తారవిషయాన్ని తర్వాత నేను వ్యాసంగా వ్రాసి ప్రకటించాను.

రూఢమైన ఆవిష్టమనస్కత నుంచి తేరుకొనే దాకా మౌనవల్మీకస్థులై ఊరుకొని, కృష్ణశాస్త్రిగారు పుస్తకాన్ని గాఢంగా గుండెలకు హత్తుకొన్నారు.

“ఎంత మంచిపని చేశాడు, వరద!” అన్నారు. అన్నారంటే, వ్రాసి చూపారన్నమాట.

చేయి వణకే ఉత్తరవయస్సు నాటికీ తీరు మారని వారి అక్షరాలు – ముద్దులు మూటగట్టే సుప్పాణి ముత్యాలు.

“హైదరాబాదులో ఎవరో సన్మానం చేస్తానంటే ఆ సభలూ, సన్మానాలూ నాకు అక్కర్లేదన్నాను. మరీ మరీ బలవంతం చేశారు.

సభానిర్వహణ విషయమై నా నియమాలు ఇవీ:

1) సభ ఎక్కడ జరిగినా ఫర్వాలేదు.

2) ఎంతమంది వచ్చినా, రాకపోయినా ఫర్వాలేదు.

3) నేను సభాస్థలి ప్రాంగణంలోకి అడుగుపెట్టేసరికి వేదికమీద మా అబ్బూరి, రాయప్రోలు ఆసీనులై ఉండాలి.

5) నేను వేదిక మీదికెక్కి అబ్బూరి కాళ్ళకు మ్రొక్కి, రాయప్రోలుకు పాదాభివందనం చేసి, ఇద్దర్నీ కౌగిలించుకొని, పుష్పమాలలు వేసి, ఆ తర్వాత నేనూ కుర్చీలో కూర్చొనాలి.

6) సభ దరిదాపుల్లో ఎక్కడా మంత్రులూ, పందులూ ఉండటానికి వీల్లేదు – అన్నాను.”

అని, కలకల నవ్వారు.

నవ్వే వేళల్లో వారి కాటుక కళ్ళల్లో కన్నీళ్ళు జాలువారి మిలమిల మెరిసేవి.

కొన్నాళ్ళకు ఆ సంగతులన్నీ ‘కృష్ణశాస్త్రి జ్ఞాపకాలు’ అన్న పేరుతో ఒక వ్యాసం వ్రాస్తే నేను దానిని పుస్తక ప్రకటనార్థం ఫెయిర్ చేసి ఇచ్చాను.

“అందరికీ అటువంటి అదృష్టం ఉండదు. నా పద్యాలూ సంకలనం వెయ్యలేదు. తండ్రి ఋణం అంటూ ఏదైనా ఉంటే, పూర్తిగా తీర్చుకొన్నాడు వరద” అన్నారు.

ఇరవైయవ శతాబ్ది తెలుగు కవిత్వానికి కారయితలు శ్రీ అబ్బూరి రామకృష్ణరావు, శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారలు పార్శ్వగతులై మైత్రీమందస్మితాలను వెలయిస్తుండిన ఛాయాచిత్రాన్ని చూసినప్పుడు ఒకప్పుడు వెల్లివిరిసిన జ్ఞాపకస్రవంతికి అక్షరాంకనం ఇది.

Saturday, December 10, 2016

నీవు నేనైతే !

నీవు నేనైతే !

నీవు నేనైతే !

నిను నీలోనె కందు!

నేను నేనుగ నుంటె!

నీలోనె యుందు!

ముద్దు పేర్లు !

ముద్దు పేర్ల


ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు.

మనకు నవ్వుల కొరకు ఆమె ఈ విధంగా ముద్దు పేర్లతో 

పిలిచిది.

అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన,

రెండవ అమ్మాయి పేరు చిరిగిన,

మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన,

నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన...

ఇలా ఈ విధంగా ఆ తల్లి తన కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది.

ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు.

అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’

అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’

తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!

అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే కూర్చుంటాను’’

తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’

అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే కూర్చుంటాను’’

అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తరువాత....

తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా.. పాలు తీసుకుంటారా?’’

అతిథి : ‘‘టీ’’

తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’

అతిథి : ‘‘వద్దు వద్దులెండి.. నేను పాలు తీసుకుంటాను’’

తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని రామ్మా’’

ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి పారిపోతాడు.

దుష్ట మంధర మాటలు

దుష్ట మంధర మాటలు

సుతుని రాజుని చేసెడి సూత్రమిదని

దుష్ట మంధర మాటలు దూరచెవిని

వరము నెపమున రాముని వనము జేర్చి

దశరధుని చిన్న భార్య యె తల్లడిల్లె.!

Friday, December 9, 2016

పుట్టింటికి పురిటి కొచ్చింది పిల్ల.

పుట్టింటికి పురిటి కొచ్చింది పిల్ల.


పుట్టింటికి పురిటి కొచ్చింది పిల్ల. ఆమె వైభోగాన్ని చూడండి:

.

(దామెర్ల రామారావు గారి చిత్రం.)

"ఎవరాడబడుచమ్మ - ఎవరాడబడుచు?

యేరు దాటొచ్చింది ఎవరాడబడుచు?

కుచ్చులా పల్లకిని కూర్చున్నదీ - లోన

అచ్చంగ రాణిలా అమరున్నదీ!

పరుపు బాలీసుపై ఒరిగున్నదీ!

అన్నలైతే పసిడి అందెలిస్తారు

తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు

పెట్టి పోసేవారు పుట్టింటివారు

పుట్టింటికే తానూ పురిటి కొచ్చింది!

లక్ష్మి[పురిటికొచ్చిన పిల్ల]: అందుకు కాదమ్మోయ్ నేను వస్తా!

సుబ్బమ్మ: అదెంత సేపమ్మోయి పిల్లా!

మరదళ్ళు అడుగులకు మడుగు లొత్తేరు

వదినల్లు కనుసన్న నొదిగి మెదిలేరు

గౌరవానికి గాని ఘనతకు గాని

తన పుట్టింటిలో తాను దొరసాని!

అబ్బాయి తాతయ్య అంక మెక్కెను

అమ్మాయి అమ్మమ్మ చంక నెక్కెను

తన పుట్టింటిలో తాను దొరసాని

మగనింటిలో ఉంటె మగువ యువరాణి!

[దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారి 'ఏడాది పొడుగునా' అనే రూపకము లోని కొంతభాగం]

ఎంకి ... నాయుడుబావ... మధ్యలో ... సుబ్బారావు....అప్పరాయుడు.!

ఎంకి ... నాయుడుబావ... మధ్యలో ... సుబ్బారావు....అప్పరాయుడు.!

.

“సుబ్బారావుగారు ఆంధ్రజాతికి సహజములై – 

శ్రావ్యములై – సొంపు నింపుగల మృదుమధురగేయములలో 

అందునను నేడు వాడుకలో – వ్యవహారములోనున్న జీవద్భాషలో 

ఎంకి – నాయుడుబావల దాంపత్య పూతములును

భావోన్నతములును ముగ్ధముగ్ధములును అగు

ప్రణయగాధలను గానము సేయుచున్నారు… ”

.

ఈ పాటలన్నచో పండిత పామర సాధారణముగా నెల్లవారికిని 

యే మాత్రపు భావనాశక్తి యున్నను, అందుకొనుటకు, ఆనందించి తవిసి

తరింప చేయుటకును వీలైనట్టివి. నిక్కమగు ప్రేమను, దాంపత్యభావమును, 

ధర్మపరతమును, యెట్టి యాదర్శములను కలిగి యుండునోయను విషయమును

ఈ పాటలంత తేట తెల్లముగా … సాధారణ జనమున కంతటికిని తెల్పగల గేయములివి”. అంటే, అంతటి ప్రేమను, ధర్మము, దర్శనము రంగరింపయిన ప్రేమను, సామాన్యుడి అనుభవపరంగా పలికి, అతనితో పలికించి, అతని నోట పలికేలా చెయ్యగలిగిన మాధుర్యం, దివ్యశక్తి యీ పాటలకున్నయ్, 

.

సుబ్బారావుగారు చెప్తారు: 

“పాటలు అప్రయత్నంగా వచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞుడనా?

ప్రోత్సాహము చేసి వీపు తట్టిన అధికార్లవారికా? 

50 కవిత్వకళా రహస్యాలు తెలియజెప్పిన మా బసవరాజు అప్పరాయనికా? మువ్వురకును.” 

.

ఎంకి పాటలు అప్రయత్నంగా వచ్చినవే. సహజంగా, స్వేచ్చతో, ప్రయత్నమున్ననూ, అప్రయత్నమనే భావన కలిగిస్తాయి. అది కవి గొప్పతనం. హృదయం, మనసు, ఆత్మల సమ్మేళణ ఫలితం. మళ్ళీ నండూరి: “తెలుగుతల్లి యొక్క నిజస్వరూపం చూడవలెనని… తెలుగు పస, తెలుగు నుడి, తెలుగు నాదం, తెలుగు రుచి తెలిసికొని మానవ జాతి సాంప్రదాయాలలోగాల సొగసు, జీవనమూ,పదిమందికిన్నీ మనసుకెక్కించవలెనని.. ” ఈ గుణాలన్నిటినీ ఎంకిపాటలు మరపురాని పద్ధతిలో వ్యక్తం చేస్తాయి.

Thursday, December 8, 2016

తస్మాత్ జాగ్రత, జాగ్రత! !

తస్మాత్ జాగ్రత, జాగ్రత! !

.

దొంగ సంపాదన పాడైపోయిందనే ఉక్రోషంతో ఉన్న పార్టీవాళ్ళు కొందరు,

పనీపాటులేక అటువంటివాళ్ళచేత ప్రేరేపితులైన మరికొందరు, 

హిందూమతంలో మాత్రమే దోషాలు చూచే కుహనా లౌకికవాదులు కొందరు, ప్రతిదానికీ ఆక్రోశించే మరికొందరు 

మీ దైనందినవ్యవహారాలకు అడ్డుతగిలే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత, జాగ్రత!

'ధర్మబద్ధమైన కోపం!

'ధర్మబద్ధమైన కోపం!

.

సంస్కృతంలో ఒక శబ్దం ఉంది "మన్యు" అని. 

'ధర్మబద్ధమైన కోపం' అని దానికి తెలుగులో అర్థం చెప్పచ్చు. 

అది మానవుడికి ఉండవలసిన శుభలక్షణాలలో ఒకటి. మనిషి ఎక్కడ కోపం తెచ్చుకోవాలో అక్కడ కోపం తెచ్చుకోక తప్పదు.

అది లేకపోతే అవతలివాడు మనల్ని చేతకాని దద్దమ్మలుగా జమకట్టి, 

ఏడిపిస్తాడు.

Wednesday, December 7, 2016

"ఆ కాలపు నా యెంకి"

"నండూరి సుబ్బారావుగారి " ఎంకిపాటలు" నుండి

"ఆ కాలపు నా యెంకి"

.

దూరాన నా రాజు కే రాయిడౌనో

ఈ రోజు నా రాత లే రాలపాలో

సీమ సిటుకనగానె

సెదిరిపోతది మనసు ...

.


కాకమ్మ సేతైన కబురంప డా రాజు

దూరాన నా రాజు కే రాయిడౌనో....

కళ్ళకేటో మబ్బు

గమ్మినట్టుంటాది...

.


నిదరల్లొ నా వొల్లు నీరసిత్తున్నాది

దూరాన నా రాజు కే రాయిడౌనో...

ఆవు 'లంబా' యంట

అడలిపోతుండాయి ...

.


గుండెల్లొ ఉండుండి గుబులు బిగులౌతాది

దూరాన నా రాజు కే రాయిడౌనో...

తులిసెమ్మ వొరిగింది

తొలిపూస పెరిగింది ...

.


మనసులో నా బొమ్మ మసక మసకేసింది

దూరాన నా రాజు కే రాయిడౌనో....