ప్రహ్లాద చరిత్ర !

ప్రహ్లాద చరిత్ర.!

పోతన - శ్రీమద్భాగవతం.....ప్రహ్లాద చరిత్ర.!

.

ఇందుగలడందులేడని 

సందేహము వలదు చక్రి సర్వోపగతుండు

ఎందెందు వెదకి చూచిన

అందందే గలడు దానవాగ్రణి వింటే!

రాక్షసరాజయిన హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే ద్వేషం. 

కాని అతడి కొడుకు ప్రహ్లాదుడికి మాత్రం విష్ణువంటే మహాభక్తి కావడం వల్ల ఎప్పుడూ శ్రీహరినే ధ్యానించేవాడు. దాంతో కొడుకుపైన హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. ఎన్ని విధాలుగా చెప్పినా ప్రహ్లాదుడు విష్ణుభక్తిని మానుకోకపోవడంతో నిజంగానే శ్రీహరి అంతటా ఉన్నాడా? అని కొడుకును ప్రశ్నిస్తాడు. 

.

అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానమే ఈ పద్యం.

విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహం అక్కరలేదు.

ఆయన అన్నిచోట్లా ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు.

ఓ రాక్షసరాజా! ఇది సత్యం. 

.

ఈ పద్యంలో, ‘ఇందు, అందు, ఎందెందు, అందందే’ అనే పదాలు వచ్చాయి

. ఇవన్నీ ఒకేలాంటి పదాలు కావటం వల్ల వినడానికి చాలా హాయిగా ఉంటాయి. 

అంతేకాదు ఇలాంటివి నేర్చుకోవటం కూడా తేలిక.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!