Posts

Showing posts from January, 2015

జపానీయ కవి ‘బషో’ ప్రసిద్ధ హైకూ.!

Image
హైకూ కవితా పితామహుడు,  17వ శతాబ్దంలో జీవించిన జపానీయ కవి ‘బషో’ ప్రసిద్ధ హైకూ.! . ఎండిపోయిన కొమ్మమీద కాకి ఒంటరిగా కూచుంది, చలికాలపు సాయంత్రం.

స్త్రీలకి చీరే శ్రీరామరక్ష!

Image
స్త్రీలకి చీరే శ్రీరామరక్ష! . "మన్ది హిందూదేశం." "........ " "ఇది పరమ పవిత్రమైన భూమి." "....... " "ఆడది ఆదిపరాశక్తి." "........ " "ఈ దేశంలో స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తాం." "........ " "స్త్రీల అందమంతా వారి చీరకట్టులోనే వుంది." ".......... " "చీర మన భారతీయ సాంప్రదాయం." "............ " "స్త్రీలకి చీరే శ్రీరామరక్ష." ".......... " "చీర కట్టిన స్త్రీని ఒక్కడు కూడా రేపు చెయ్యడు. చేస్తే నన్ను చెప్పుచ్చుకు కొట్టండి!" "............ " "బాపు బొమ్మకి చీరే అందం" "............ " "విశ్వనాథ్ సినిమాలకి చీరే ప్రాణం." "............ " "రోజులు మారిపోతున్నాయి, ఆడాళ్ళు మరీ బరితెగించిపోతున్నారు." "............ " "లేకపోతే ఆ డ్రస్సులేవిఁటీ ఛండాలంగా!" "........... " "జేసుదాసు అన్నాడంటే అనడా మరి?" "...

అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా?

Image
అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా? . దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది. . దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో! . ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని. . తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఒక రకంగా తాగుడు తప్ప గత

కృష్ణ శ్రీ ..వినోదం.

Image
కృష్ణ శ్రీ ..వినోదం. . ఫేస్ బుక్....... "ఫేస్ బుక్ తో కాలక్షేపం బాగానే వున్నట్టుందేమే.......ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు!" అడిగింది ఆండాళు. "యేం కాలక్షేపమోనే......తెల్లారగానే అందరికీ 'శుభోదయం' అని చెప్పడం; ఈనాడు పేపర్లో 'గ్రహం- అనుగ్రహం', 'అంతర్యామి' చదవడం, ఆ తిథీ, వార నక్షత్రాలనుబట్టీ, పండగలని బట్టీ అందరికీ శుభాకాంక్షలు కొట్టడం; ఇంక యెవరు ఆసుపత్రుల్లో వున్నారో చూసి, వాళ్లెప్పుడు పోతారో అని 'RIP' సందేశాలని రెడీ చేసుకుని పెట్టుకొని, వాళ్లు పోయారని తెలియగానే 'అందరికన్నా ముందు' పోస్టు కొట్టడం; మధ్య మధ్య లో ప్రొఫైల్ పిక్చర్ మారుస్తూ వుండడం; రాత్రి అందరికీ 'శుభరాత్రి' అని చెప్పడం--వీటి తోనే సరి పోతోంది! ఇంకా గ్రూపుల్లో ఛాట్లోటీ! నేను రాద్దామనుకున్నవాటికీ, చూడాలనుకున్న వాటికీ టైమేదీ!" వాపోయింది తాయారు నిట్టూరుస్తూ.

నిజమే కదా.!

Image
నిజమే కదా.! . కవితా కన్య రసజ్ఞత కవి కన్నా రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు; నవ కోమలాంగి సురతము భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును? , భావము: కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది. x

కన్నీటి కడలి లోనా ..చుక్కాని లేని నావ....దిక్కేని లేని నావ,!

Image
కన్నీటి కడలి లోనా ..చుక్కాని లేని నావ....దిక్కేని లేని నావ,! . దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు,

ఆ ఈశ్వరుని, ఆ స్థూల రూపుని, . ఆ సూక్ష్మరూపుని నేను భజియింతును.

Image
శ్రేష్ఠములైన ధర్మార్థ కామములను త్యజించు కోరిక గలవారై జ్ఞానులు ఎవరిని సేవించి  . తమకు ప్రీతిపాత్రమైన మోక్షగతిని పొందుదురో, . దగ్గరకు వచ్చి కోరువారికి నశ్వరము కాని దివ్యదేహమును దయతో ఎవరు ప్రసాదింతురో, . ముక్తిని కోరువారు పూని ఎవరిని ధ్యానింతురో, . సంతోష సాగరమందు మునిగి యున్న వారు విడువని భక్తి గలవారయి ఎవరిని ఏమియు కోరక పుణ్యచరిత్రమును పాడుచు నుందురో, . ఆ మహేశ్వరుని, ఆ అంతటికి ఆద్యుడైన వానిని, . ఆ తెలుసుకొనుటకు వీలు గాని వానిని, . అధ్యాత్మ యోగము ద్వారా చేరుకొన గలిగిన అట్టి వానిని, . ఆ సర్వ వ్యాపిని . , ఆ పరమాత్ముని, . ఆ పరబ్రహ్మముని, . ఆ ఇంద్రియముల కతీతుడైన వానిని, . ఆ ఈశ్వరుని, ఆ స్థూల రూపుని, . ఆ సూక్ష్మరూపుని నేను భజియింతును. x

రంగమ్మ గంగమ్మ..

Image
సరదాగా,,,,ఒక కధ.! .....(చదివితే చదవండి.)....చదివితే పోలే.! . రంగమ్మ గంగమ్మ.. . ఒక ఊళ్ళో రంగమ్మ, గంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు ప్రక్కప్రక్కనే కాపురం వుంటున్నారు. రంగమ్మకు రెండు గేదెలు ఉన్నాయి. నెయ్యి వ్యాపారం చేస్తూ వుంది. గంగమ్మకు ఎనిమిది గేదెలు వున్నాయి. పాలు అమ్ముకుని జీవిస్తున్నది ఆమె. ఇలా వుండగా ఒకసారి గంగమ్మ రంగమ్మ దగ్గర వీశెడు నెయ్యి అప్పుతీసుకున్నది. ఎన్నిరోజులు గడిచినా బాకీ తీర్చలేదు. గంగమ్మ గయ్యాళి గంప. ఎప్పుడూ ఇరుగుపొరుగు వాళ్ళతో నిష్కారణంగా తగవులాడుతూ వుంటుంది. ఆమె నోటికి భయపడి అందరూ ఏమీ అనలేక ఊరుకునేవారు. ఇలాంటి మనిషిని నెయ్యి బాకీ తీర్చమని ఎలా అడిగేది భగవంతుడా అని బుద్ది మంతురాలయిన రంగమ్మ లోలోపల మదనపడింది. చివరకు ఎలాగో ధైర్యం చేసి 'గంగమ్మక్కా! నా దగ్గార వీశెడు నెయ్యి అప్పు తీసుకున్నావు. నీవే బాకీ తీరుస్తావని వూరుకున్నాను కానీ, నెలలు గడిచిపోయినా నీవు ఆ ప్రస్తావనే చేయలేదు. మరచిపోయావేమోనని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంట్లో చుట్టాలొచ్చారు. నెయ్యి అప్పు తీరుస్తావా అక్కా!' అని ఎంతో మర్యాదగా అడిగింది. అది విని గంగమ్మ వెర్రెత్తినట్లు బర్రెగొంతుతో బి

భీష్మాచార్యునికి వందనం!

Image
తాత్త్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియనిగ్రహం -  . ఇన్ని సులక్షణాలు రాశిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవానునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. ఆచరించి, ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది. ఆ పర్వంలోనిదే భగవద్గీత.! యావద్భారత జాతీ సంస్మరించదగిన భీష్మాచార్యునికి వందనం!

నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం.!

Image
పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో  నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం.! . మృగమదసౌరభవిభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్.!. . “కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే గాలితెమ్మెర … అలా …వీచిందిట!” . పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది.

ఓబమా గారు .అమెరికా నుండి అనకా పల్లి కి జంపు.!

Image
.                      ఓబమా గారు .అమెరికా నుండి అనకా పల్లి కి జంపు.!

” Dosa …. Dosa …. Dosa … “

Image
” Dosa …. Dosa …. Dosa … “ Dosa is a fermented crepe or pancake made from rice batter and black lentils. It is a staple dish in the South Indian states of Tamil Nadu, Kerala, Andhra Pradesh and Karnataka. It is also popular in other parts of India, as well as other countries like Sri Lanka, Malaysia and Singapore. Here are 20 dosas that everyone must try: Do you have any more yummy dosas to add to this list? 1. Sweet Banana Wheat Dosa A tasty sweet treat, especially for children. Serve it with sliced bananas and warm chocolate syrup.    2. . Mysore Masala Dosa Commonly known as  Masala Dosa,  it is Karnataka's speciality.  The filling is prepared with soft mashed potatoes and curry leaves. It's the first choice when you want to enjoy South Indian food.  ౩. Paper Dosa Who doesn't remember munching on this paper thin crispy dosa  dipped in hot sambar and coconut chutney. As kids, it was our all-t

"మాన్ కి బాతు."!.

Image
ఒబామా గారు చెప్పిన "మాన్ కి బాతు.".అంటే ఇది కాదు ఏమో... నాకు హిందీ రాదు.

తెలుగు సాహిత్యంలో హాస్యం-2.

Image
తెలుగు సాహిత్యంలో హాస్యం-2. . శ్రీనాధుని హరవిలాసంలో మాయా బ్రహ్మచారి పార్వతిని పరీక్షించాలని వచ్చి ఆమె ఎదుట శివుని నిందిస్తూ, వారి కళ్యాణాన్ని నిరసిస్తూ చేసిన ప్రసంగం,, “రాయంచ యంచు చీరెక్కు జోకయగుగాక పచ్చి మెనిక తోలు పచ్చ్చడంబు,”.. వంటి వ్యంగ్యాలు హాస్య రసాన్ని అందిస్తాయి. శ్రీనాధునివిగా ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో కావలసినంత హాస్యం మనకు కనిపిస్తుంది. ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. . సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్.. తిరిపెమున కిద్దరాండ్రా పరమేశా గంగను విడుము పార్వతి చాలున్.. . నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు. . ఆయనదే మరో పద్యం.. పూజారి వారి కోడలు తాజారగబిందె జారి దబ్బున పడియెన్ మైజారు కొంగు తడిసిన బాజారే తొంగి చూసి ఫక్కుంజ నగియెన్… . ఎంత దగ్గరివారైనా ఇలాంటి సన్నివేశాల్లో దబ్బున జారిపడితే చూసినవాళ్లెవరికైనా ముందు వచ్చేది నవ్వే.. ఇలాంటి చాటువులు కోకొల్లలు,.

శ్రీ దేవుల పల్ల్లి వారి గీతం.!

Image
శ్రీ దేవుల పల్ల్లి  వారి గీతం.! . జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి.! . జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామ చలచ్చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి...!!

ఆనందం...తన వారు వస్తే..! . (బాపు గారి బొమ్మా.)

Image
ఆనందం...తన వారు వస్తే..! . (బాపు గారి బొమ్మా.)

అల్లసాని పెద్దన్న పద్యము.!

Image
అల్లసాని పెద్దన్న పద్యము.! కలనాటి ధనములు అక్కరగల నాటికి దాచ కమలగర్భుని వశమే , . . నెల నడిమినాటి వెన్నెల దాగునె గాది లో పోయ అమవస నిశికిన్ ! . x

అద్భుతమైన పద్యం ..శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి రచన.!

Image
భారత స్వాతంత్ర్య సమరం జరుగుతున్న కాలంలో తెలుగువారిని ఉత్తేజపరిచిన  అద్భుతమైన పద్యం ..శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి రచన.! . భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.

ఒక మంచి కధ...సేకరణ .శ్రీ .Krishna Sastry గారు..!

Image
ఒక మంచి కధ...సేకరణ  .శ్రీ .Krishna Sastry గారు..! . క్షణంలో సగం --శ్రీరంగం శ్రీనివాసరావు (ఇది--ఆంధ్ర జ్యోతి మాసపత్రిక, 1949 ఏప్రియల్--ఉగాది సంచికలో ప్రచురించబడింది. తరువాత ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో నేను చూడలేదు.) ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు.  "బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు కాబట్టి సగం సగం మాత్రమే నమ్ముతాను. ఇద్దరం బయలుదేరిన తర్వాత వీడు (ఎవరి పేరైతే చెప్పదలచుకోలేదో వాడు) "ఇప్పుడు మనం లక్షాధికారులం కావడం ప్రారంభిస్తున్నాం. తక్షణమే! జోరుగా నడు" అన్నాడు. ఇద్దరం తక్షణం ప్రారంభించాం. కాని ఆ ప్రారంభం ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉండి పోయింది. అప్పుడు బయల్దేరిన మేము ఇంకా బయల్దేరుతూనే ఉన్నాం. *   *   * ఈ సాయంత్రం ఇక్కడ
Image
నేను లేని చోట మీలో నేనున్నాను.! . నేను లేని చోట మీలో నేనున్నాను శ్వాసతో కలిసిపోయాను  నేను కనిపించని చోట మీకు కనించే రూపాలలో నేనున్నాను x

అమ్మవారికి పచ్చతోరణం.!

Image
అన్నమయ్యఈ సంకీర్తన నాకు భలే నచ్చింది. . .అసలు స్వామి అంతా అమ్మవారి సొత్తేనని భలే వర్ణించారు అన్నమయ్య.. . చెలి రాజ్యమే నీవు శ్రీవేంకటేశుడా... అనీ. అయ్యవారికి వేసిన తులసిదండ  . అమ్మవారికి పచ్చతోరణం అంట,  . స్వామి కౌస్తుభమని అమ్మవారికి అద్దం అనీ ఎంత చక్కగా వర్ణించారో..! . పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా  చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా || అలమేలు మంగకు సింహాసనము నీవురము కలిత హారములే సింగారపు దండలు | తొలుత నీహస్తములే తోరణ గంభములు చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా ||

ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ?

Image
ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ? . (రచయిత : సినారె) . సిరిమల్లెల విరియించే వసంతం చిగురాకులనే రాల్చేస్తే . నావను నడిపే చుక్కాని .. ఆ నావను తానే ముంచేస్తే  .  .వలపులు పోసి పెంచిన తీవే కాలసర్పమై కాటేస్తే . మమతలు పంచిన పాల మనసే మనసును కాస్తా విరిచేస్తే  . ఎవరిని అడగాలి ... బాపూ ఏమని అడగాలి ?

నల్లని కన్నయ్యా..

Image
నల్లని కన్నయ్యా.. . కలువపూలు తెలుపు, కమలములు తెలుపు, కల్పవృక్షం తెలుపు !  కసేరుక తెలుపు, కళానిధి తెలుపు, కామ ధెనువు తెలుపు ! కనికరము తెలుపు, కర్తవ్యం తెలుపు, కర్పూరం తెలుపు, ! కళ దేతుం తెలుపు, కళ త్రం తెలుపు, కల్యాణం తెలుపు, ! కాదమ్బరీ తెలుపు, కామేశ్వరీ తెలుపు, కారుణ్యం తెలుపు, ! కళ్ళు తెలుపు, కుతూహలమ్ తెలుపు, కిరణం తెలుపు, ! అన్నం తెలుపు , అన్నపూర్ణ తెలుపు, ఆనందం తెలుపు, ! ఉప్పు తెలుపు , ఉమ్మి తెలుపు , ఉషోదయం తెలుపు, ! x

తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.!

Image
తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.! . అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ తన శతకాల్లో అక్కడక్కడ హాస్యాన్ని మెరిపించారు. . “దయ్యాలను చూపిస్తా నయ్యారమ్మనుచు నొక్క ఆసామి నా కయ్యో తన కూతుళ్లను చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా ” . ఇక పేరడీ అనేది ఫక్కున నవ్వించే ప్రక్రియ ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే పద్యానికి శ్రీశ్రీ పేరడి ప్రసిద్ధమైనది. . “ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్ చొప్పడిన యూరకుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా ” . శ్రీశ్రీ రాసిన ‘ఏ దేశ చరిత్ర చూసినా’ కవితకు మచిరాజు దేవీప్రసాద్ గారి పేరడీ. . “ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణము రహదార్ల చరిత్ర సమస్తం ధూళి ధూస పరివ్యస్తం. ” ఆమోదయోగ్యమైన హాస్యాన్ని ఆనందంగా, అనుభవిస్తేనే ఆహ్లాదం, ఆరోగ్యం.

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...

Image
అండ దండా ఉంటానని ... నిను కొండ కొనకి వదిలేసడా. ఎంత విషాదమో..... .. తానననా... తానా...న తదరే.... నా.... ఆ.... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా... సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా... గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా... హ (హ) హ (హ) ఆ... ఆ..... ఆ......... సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా గుండే లేని మనిషల్లే... గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా అగ్గీ లోనా దూకి పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు నేగ్గేవమ్మా ఒక నాడు నింగి నేల నీ తోడు సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా... చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చ

'యుగపురుషుడు' .!

Image
'యుగపురుషుడు' .! . ఆంధ్రుల అభిమాన 'అన్నగారు', తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక యన్టీఆర్!.  . వారి జీవితంలో ప్రతీ పుట ఒక ప్రయోగం, ఒక సాహసం. వారు ఏది చేసినా తరువాతి . వారికి అదొక మోడల్. వారు 'ది రియల్ లెజెండ్'. తెలుగుజాతికి  . నందమూరి తారకరామారావు గారు, 'యుగపురుషుడు' .

మధువు మైకమునిచ్చు..!

Image
మధువు మైకమునిచ్చు..! . మధువు మైకమునిచ్చు మగువ సుఖమునిచ్చు ఈ రెండింటి వల్ల ఖర్చు హెచ్చు ఆ పై సకల రోగములు వచ్చు భావము: మధువు (మద్యపానం) మత్తునిస్తుంది. స్త్రీ లైంగిక సుఖాన్ని అందిస్తుంది. కాని ఈ రెండింటి వల్ల ఖర్చు అధికమవుతుంది. ఆ తర్వాత అన్ని రకాల రోగాలు వస్తాయి. x

గోదావారి.....ఆవకాయ.!

Image
గోదావారి.....ఆవకాయ.! . దారెరుగని వాడును గో దారిన తానొక్కమారు తడవని వాడును కూరిమిన ఆవకాయను ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి భావము: గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు, ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు అని కవిభావము. ఇక్కడ గోదావరి వైశిష్ట్యము, ఆవకాయ రుచి ప్రాముఖ్యత తెలుస్తున్నది. x

అరుదైన పద్యాలు.!...(౧)

Image
అరుదైన పద్యాలు.!...(౧) . ఒకతెకు జగములు వణకున్; అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్; ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా; పట్టపగలె చుక్కలు రాలున్ భావము: ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి,  ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి,  ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి.  . అంటే చాలా శక్తివంతురాలని భావము.

ఏరువాక పున్నమి.!

Image
ఏరువాక పున్నమి.! భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్యవనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదల య్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ 'కృషిపూర్ణిమ'. దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లున్నాయి. 'ఏరు' అంటే నాగలి అని, 'ఏరువాక' అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠపూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే- నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠపూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు (మంచు, ఎరువు, సూక్ష్మధాతువులు) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠపూర్ణిమనాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు. x

ఎవరి పిచ్చి వారికి ఆనందం’.!

Image
‘మోహం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది’,  . ‘ ఎవరి పిచ్చి వారికి ఆనందం’.! x

అలలా వచ్చిన దిగులే అంతాకాదు”..!

Image
అలలా వచ్చిన దిగులే అంతాకాదు”..! . జీవితం మీద విరక్తి కలగకూడదు దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు. బతుకు తీపి అనేదే ఒక అద్భుతం. మనం అల్పం అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ తీపి ఉంటుంది. చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ బతుకు తీపి. జీవితానికి ఉన్న విలువ అపారం-లౌకికమైన ప్రయోజనాలతోపాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం ` జీవితం ‘ అనే అంశంలో ఇమిడి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావల్సిన నైతికసూత్రాలు, నియమాలుం అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు. “ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. ఈ రెండింటినీ సాధించడమే అసలైన ప్రయోజనం ” అన్నది స్పష్టమైన నిర్వచనం. అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు. ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బతుకునే పూర్తిచేసుకోవాలనుకుంటాడు. ఈ ఆత్మహత్యా ప్రయత్నధోరణి ఉద్రేకం వల్ల, ఒత్తిడివల్ల కలుగుతుంటుంది. జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, `ప్రశాంతత ‘ అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని పోగుట్టుకుంటున్నాం. హనుమంతునికి సీతజాడ తెలియక నిరాశతో తిరిగివెళ