Wednesday, September 30, 2015

వటపత్ర సాయికి వరహాల లాలి


చాలా రోజుల తర్వాత ఇవాళ అమ్మగుర్తుకొస్తోంది.
విడివడిన కొప్పును జడ వేసుకోవాలనే తీరిక కూడా లేకుండా వొంచిన
నడుము ఎత్తకుండా నీ కోసం నా కోసం అన్న కోసం చెల్లి కోసం
చెమటను చిందించిన అమ్మ గుర్తుకొస్తోంది.
ఆమె పవిట పట్టుకొని తిరిగి ఎన్నాళ్లయ్యిందో! ఆమె పాడిన పాటను విని ఎన్నాళ్లయ్యిందో! ఆ జోలకు ఆదమరిచి ఒడిలో తల పెట్టుకొని నిదురించి ఎన్నాళ్లయ్యిందో.

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి…
ఆపు. చాలా బాగుందిగాని ఆపు. కసువుచిమ్మే పిలగాణ్ణి. గొడ్లు కాసే కసిగాణ్ణి. మా అమ్మ ఇలా పాడదే. మీ అమ్మ ఇలా పాడి ఉంటుందా? కాస్త మామూలు మాటల్లో పాడవయ్యా తల్లీ.
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు
గోపాల క్రిష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికే వెలుగు!

మధుర భక్తి!


మధుర భక్తి!

సుమారు క్రీశ:1670; ప్రాంతంలో పుసులూరి సోమరాజనేకవి జీవిచాడు. ఆయన శ్రీకృష్ణునిపై ెఅనేక భక్తి శతకాలు రచించాడు. గోపాల శతకం, నందనందనశతకం, ఇందుశతకం, మొదలయినవి. ఇవన్నీ పూర్తిగా మధుర భక్తితో నిండినవి. నందనందన శతకంలోని యీపద్యాన్ని చిత్తగించండి.

ఉ: పుక్కిట తమ్ములమ్మడుగ బోటికి నోటికి నియ్యజూచి, వే
రొక్కతె కోపగింప కనకోత్పలమాలిక లిచ్చినట్టి మే
లిక్కడ చూప వచ్చితి భళీ! యను రాధిక నూరడించు నీ
చక్కదనంబు జూడమనసైనది, చూపుము నంద నందనా!

తమ్ములమంటే బాగా నమిలిన తాంబూలం. ప్రేమించినవ్యక్తి, లేక భార్య లేదాభర్త , తాంబూలం నములుతూఉంటే, తమ్మనాకు బెట్టమని యడగటం ప్రేమకు నిదర్శనం. అది యామెకు బెట్టకపోగా, బంగారు కలువపూదండను వేరొకతె కిస్తున్నాడట కొంటెకృష్ణుడు. మరి రాధమ్మకు కోపంరాదా? రాధకు కృష్ణునిపైగల యధికాపము, చనవు అట్టివి. అలాఆమెయలిగినవేళ ఆమెను బ్రతిమిలాడే కృష్ణయ్య అందాన్ని చూచిన వారిదే భాగ్యం! అంటాడుకవి. బాగుందికదూ?

చకారకుక్షి!

చకారకుక్షి
__________

కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట. దానిపరిణామక్రమం తెలిసికుందాం!

భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు చకారం యెక్కువగా వాడారట!
అదీ కాళిదాసు ఆయన్ని చకార కుక్షి యంటానికి కారణం.

కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు.
అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట.
కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది.
కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట.
కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి" అనిపలికి -

శ్లో: ద్రౌపద్యా ః పాండుతనయాః
పతి ,దేవర, భావుకాః,
నదేవరో ధర్మరాజః
సహ దేవో నభావుకః; -
అని వెంటనే ఒకశ్లోకం చెప్పారట. నెచ్చుకుంటున్నానయ్యా!
నీపాండిత్యానికి, చిరాయుష్మాన్భవ! అని ఆశీర్వదించారట.
కాళిదాసు వేలు బయట పడింది.

ఇంతకీ దీనికి అర్ధంయేమిటి అని మీసమదేహంకదూ!
చెపుతా వినండి.
" ద్రౌపదీ దేవికి పాండవులతో భర్త, మరది , బావగారు, అనేమూడురకాల బాంధవ్యాలున్నాయి. ధర్మరాజు మరదికాడు , సహదేవుడు బావగాడు"
అనిదీవియర్ధం! చూశారా కాళిదాసు ప్రతిభ!
కాళికా వర ప్రసాదిగదా ఆతవికి యిక తిరుగేది?


Monday, September 28, 2015

పడతి . ఇలతిరిగెడు.. పూల్తురిమిన


పడతి . ఇలతిరిగెడు.. పూల్తురిమిన
యది ...పొసగెడు కత్తేరా!
బడినన్ నేర్వగ రాదే
జడకుండు మహిమ తెలియదు జడులకు జగమే
జడలుండు పడతి ఇలతిరి
గెడు తేనెలలది యది పొసగెడు కత్తేరా
పాఠాంతరం
బడినన్ నేర్వగ రాదే
జడకుండు మహిమ తెలియదు జడులకు జగమే
జడలుండు పడతి ఇలతిరి
గెడు పూల్తురిమిన యది పొసగెడు కత్తేరా!

Sunday, September 27, 2015

కూర్మావతారం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు!

కూర్మావతారం........సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు!
.
కూర్మావతారం ద్వారా మనిషి నేర్చు కోవలసిన ముఖ్యమైన లక్షణాలు పట్టుదల, ఓర్పు , సహనం అని సీతారామ శాస్త్రి గారు వివరించిన విధానం నిజంగా అమొఘం.. మనం ఏమైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు తలపెట్టేటప్పుడు ఆ పని భారం మంధర పర్వతం లాగ చాలా బరువుగా అనిపించి ఒకొక్కసారి వొదిలెయ్యాలనిపిస్తుంది.. దానికి తోడు తనను తాడు లాగా ఉపయోగిస్తున్న వాసుకి సర్పం బుసలు కొట్టే విషపూరితమైన అసహనపు నిట్టూర్పు సెగలు పరిస్థితులను ఇంకా తీవ్రతరం చేసినా కానీ పొందవలసినదందలేదని నిరాశ నిస్పృహలతో నీరశించకుండా ఓర్పుతోను, పట్టుదలతోను నొప్పిని సహిస్తూ అడుగు ముందుకెస్తే ఓటమిని కూడా ఓడించగలిగే అవకాశం ఉంటుందని, విజయం వరించడం ఖాయమని కూర్మావతారమర్మం అంటూ ఈ క్రింద అయిదు వాక్యాలతో అద్భుతంగా తెలియజేసారు .
.
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే...
పొందగోరినదందలేని నిరాశలో అణగారి పోతే....
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక....
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది...
క్షీర సాగర మధన మర్మం....


Friday, September 25, 2015

ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు

 

ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు....

దేవదాసు (అక్కినేని) తన తండ్రితో పార్వతి విషయం చెప్పినప్పుడు జమీందారు (ఎస్ వి.రంగారావు) టేబిల్ డ్రాయరు తెరిచి అందులోనుండి ఓ రివాల్వర్ తీసి టేబిల్ పై పెట్టి " నా గొంతుకలో ప్రాణం ఉన్నంత వరకూ ఈ పరువు ప్రతిష్టలు లేని పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవడం అంగీకరించలేను. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాలంటే ఈ రివాల్వర్ తో నన్ను కాల్చి ఆ పైన నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో" అంటాడు. అప్పుడు దేవదాసు ఏమీ చెప్పలేక పట్నం వెళ్ళిపోతాడు. 

పదహైదేళ్ళ వయస్సులో చూసినప్పుడు.

ఛ! ఈ నాగేశ్వరరావు ఒట్టి పిరికి, అదే మా ఎన్. టి. రామారావు అయితేనా (అప్పట్లో నేను ఎం టి రామారావు పార్టీ.) తండ్రిని ఎదిరించి అయినా పెళ్లి చేసుకునే వాడు. మనస్పూర్తి గా ప్రేమించిన అమ్మాయి కోసం తల్లి తండ్రులు కాదు లోకంఅంతా అడ్డం వచ్చినా ఖాతరు చెయ్యకుండా పెళ్ళిచేసుకోవాలి వాడే అసలయిన మగవాడు. అంత గుండె ధైర్యం లేనివాడు అమ్మాయిని ప్రేమించడానికి అనర్హుడు. అనుకున్నాను.

పదహారేళ్ళ వయస్సులో మళ్ళీ దేవదాసు సినిమాను చూసినప్పుడు :

పార్వతి తండ్రిని అవమాన పరచి పంపి వేసిన తరువాత, దేవదాసు పార్వతిని తీసుకుని పట్నం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉంటె దేవదాసు తండ్రి ఏమి చేసేవాడు. నాలుగు రోజులు భీష్మించుకుని ఆ తరువాత మెల్లిగా తన మనస్సు సమాధాన పరచుకునే వాడు కదా. ఒప్పుకోడని తెలిసికూడా తండ్రిని అడగడమెందుకు? రివాల్వర్ తీసి తనను చంపి పార్వతిని పెళ్లి చేసుకోఅంటూనే, అలిగి పట్నంవెళ్ళిపోయి ఏం సాధించాడు? తిరిగి పల్లెకు వచ్చేసరికి పార్వతి పెళ్లి నిశ్చయమయింది అని తెలిసి రా నా జతలో వచ్చెయ్యి అని పార్వతిని ఒప్పించలేక పోయాడు . "అదే నేనయితేనా! నేను ఇంకా ఎవరినీ ప్రేమించలేదు. ఒకవేళ ఎవరి నైనా ప్రేమించి ఉంటేనా, ఆ అమ్మాయికోసం ఎవరు అడ్డంవచ్చినా నిలువునా నరికివేసేవాడిని" అనుకున్నాను.

పద్దెనిమిది ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు;

అమ్మాయిలకు, ఓణీ వెయ్యగానే ప్రేమించడానికి అర్హత వచ్చేస్తుంది, కానీ అబ్బాయిలకు మాత్రం తన కాళ్ళమీద నిలబడి తాను ప్రేమిస్తే ఆ ఆమాయిని ఎలాంటి పరిస్తితిలో నైనా పెళ్లి చేసుకునే దైర్యం ఉంటే గానీ ఓ అమ్మాయిని ప్రేమించడానికి అర్హత రాదు. అల్లాంటి యోగ్యత, ధైర్యము లేని అబ్బాయిలు ప్రేమ గీమ అనకుండా వాళ్ళ తండ్రులు నిశ్చయించే ఆమ్మాయిని తలవంచుకుని పెళ్లి చేసుకోవడం మంచిది. అలా కాకుండా కన్నె వయస్సులోని అమ్మాయిల మనసులను దోచి సమయానికి పిరికివాడిలాగా వెనక్కు వెళ్ళిపోవడం మహా పెద్ద నేరం.

ఇరవయి ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు;

"అవును జమీదారు వెనకటి తరం మనిషి, ఆయన పరువు ప్రతిష్టలకై పట్టుబట్టడం సహజమే. తను ఈ తరం వాడు కదా, తన తండ్రిని నయానో భయానో, అదే రివాల్వర్ తీసుకుని తనకు గురి పెట్టుకుని పెళ్ళికి ఒప్పుకుంటావా లేక నన్ను కాల్చుకొమంటావా, అని అడిగి ఉండాలిసింది. ఒక్కగా నొక్క కొడుకు కోసం జమీందారు దిగి వస్తుండేవాడేమో. ఏమీ చెయ్యకుండా అలా పట్నం వెళ్ళిపోవడం వల్ల ఎ ప్రయోజనంలేదు అని దేవదాసుకు తెలియలేదే" అనుకున్నాను.

ఇరవయి అయిదేళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు; 

అప్పటికి నాకు పెళ్లయింది. మన ప్రయత్నం మనం చేశాము. కేవలం తన పిరికితనంతోనే, పార్వతితో పెళ్లి కాలేదు. అందుకని పగలూ రాత్రీ తాగడం వల్ల ఎం లాభం? మరిచిపోవడానికి ప్రయత్నించడానికి ఇతర మార్గాలేవీ కనుపించాలేదా? పార్వతిని తలుచుకుంటూ పగలూ రాత్రీ అదే చింతిస్తూ తాగుతూ ఉంటే అది మరచిపోవడానికి మార్గం కాదు కదా? మనస్సు రాయి చేసుకుని ఎలా పార్వతి ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంసారం చేస్తోందో అలాగే తనూ పార్వతిని మరచిపోయి వేరే పెళ్లి చేసుకోవాలి. ఆ సంసారంలో పడి పార్వతిని మరచిపోవడానికి ప్రయత్నించాలి" అని అనుకున్నాను.

ముప్పయి ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు; 

మొదటినుండీ పార్వతి దేవదాసుల ప్రేమ అంత గట్టిదనిపించడం లేదు. ఏదో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. లండన్ కెళ్ళి చదువుకుని వచ్చినప్పుడు కూడా, దేవదాసు పార్వతి ని పెళ్లి చేసుకోవడానికి తహతహలాడలేదు. ఇంకా అలా చెప్పాలంటే కన్నెవయస్సులోని పార్వతి కలలు కనడం సహజమే. అయినా ఆ కలలన్నీ అటక పైనపెట్టి తన ముసలి మొగుడితో కాపురం చేసుకుంటోంది కదా. అంత ఇరవయి నాలుగు గంటలూ తాగి తాగి పార్వతిని తలచుకునేంత ఘాటు ప్రేమ దేవదాసులో కనపడలేదు. అయిదేళ్ళు సంసారం చేసిన తరువాత, ఎటువంటి దాన్ని పెళ్లి చేసుకున్నా, కొంతకాలానికి ఇద్దరిలో పోట్లాటలు తప్పవు అని తెలిసింది. అంత పార్వతికై తనను తాను నాశనం చేసుకోవడానికి దేవదాసు పిచ్చివాడాయి ఉండాలి అంతే" అనుకున్నాను 

ముప్పయి అయిదు ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు;

పార్వతిని పెళ్ళిచేసుకోలేదు కాబట్టి పార్వతిని మరచి పోలేక పోతున్నాడేమో, పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఈసరికి పార్వతి, మీద ప్రేమ/ మోహం తగ్గిపోయి ఉండేదేమో? అయినా చీకటిలో అందరు ఆడవాళ్ళు ఒక్కటే కదా. ఒక వస్తువు దొరకనప్పుడు దాని విలువ పెరిగి పోతుంది. అలాగే అది దొరికినప్పుడు/ దాన్ని అనుభవించేసినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది కదా. అందుకు పార్వతయినా, వనజయినా, గిరిజయినా పెళ్లి చేసుకోవడం వల్ల ఒక్కటే ఫలితాన్ని దొరుకుతుందని, నా చుట్టూ పక్కల ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా కాపురం చేస్తున్నారో చూస్తున్నప్పుడు అసలు ప్రేమపెళ్లిల మీద నమ్మకం పోయేస్తోంది. అనుకున్నాను.

నలభయి ఏళ్ళప్పుడు మళ్ళీ ఈ దేవదాసు సినిమాను చూసినప్పుడు; 

పార్వతిని దేవదాసు పెళ్లిచేసుకుని ఉండిఉంటే ఈపాటికి పార్వతంటే మోహంమొత్తి అసలు తనను నిజంగా ప్రేమించలేదని, అలాగే పార్వతికి తనను నిజంగా ప్రేమించలేదని విసుగు పుట్టి ఎడమొహం పెడమొహాలు వేసుకుని, జమీందారు కాబట్టి దేవదాసు, ఏ చంద్రముఖినైనా చేరదీసి ఉండేవాడేమో ? ప్రేమించి పెళ్లిచేసున్నాక, ఏ ఆడదైనా ఒక్కటే చేస్తుంది అదే మొగుడిని నామీద నీకు మొదట ఉన్న ప్రేమ తగ్గిపోయింది అని వేపుకుతినడం. అందుకు పార్వతయినా, వనజయినా, గిరిజయినా ఫలితం ఒక్కటే. తలపగల కొట్టుకుని చావడానికి రాయి రంగు చూడాలా? ఎర్ర రాయైనా నల్ల రాయినా ఒక్కటే! అనుకున్నాను.

ఇంతకీ దేవదాసు పార్వతి ప్రేమను గురించి మీ అభిప్రాయం ఏమి అని అడిగితే

షాజహానుకు పెళ్ళాం మీద నిజంగా ప్రేముందో ఎవరికీ తెలియదు కానీ అతన ఆమె పేరుతో తాజ్ మహలును కట్టించాడని ఓహో అతనికి తన పెళ్ళాం మీద ఎంత ప్రేమో అని అందరూ అనుకుంటారు.ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేక పోయినవాళ్ళ కథలన్నీ ఇలాగ అమర ప్రేమ గాథలు అవుతాయి. అయితే ఇంతకన్నా గాడంగా ప్రేమించుకున్న ప్రేయసి ప్రియులు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ కథలు ఏమయినాయి అని ఎవ్వరూ అడగరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నతరువాత ఆ ప్రేమ అల్లాగే ఉండదు అని అందరికీ తెలుసు. ఒక వస్తువును పొందేంతవరకూ వున్న ఆకర్షణ, ఆ వస్తువును పొందిన తరువాత క్రమంగా సహజంగా తగ్గి పోతుంది. పార్వతిని దేవదాసు పెళ్లి చేసుకుని ఉంటే అది మామూలు కథ అయిపోయేది. లైలా మజ్ను, శీరీ పర్హాద్ , రోమియో జూలియట్ ల కథలు ఇలాంటివే వాళ్ళ ప్రేమలు సఫలం కాక, ఒకరో ఇద్దరో చచ్చిపోతారు కాబట్టి అవి అమర ప్రేమ కథలయినాయి.

నాదృష్టిలో ఒక పిరికివాడు ప్రేమించడానికి అనర్హుడు అని అంతే.

Thursday, September 24, 2015

శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ) (వికీపీడియా నుండి సేకరణ.)శ్మశానవాటిక (జాషువా విశ్లేషణ)
(వికీపీడియా నుండి సేకరణ.)
శ్రీశ్రీ తన మహప్రస్ధానము లో ఒకచోట అంటాడు కుక్కపిల్ల,సబ్బుబిళ్ల,అగ్గిపుల్ల.... కాదేది
కవిత కనర్హం..."'.

అంతకు కొన్ని దశాబ్దాలముందే ,అవునవును శ్మశానం కవితకు అర్హం అంటూ జాషువా ఈ ఖండకావ్యాన్ని లిఖించాడు.
ఈ కావ్యంలోని పద్యాలలోని పదభావం సూటిగా పాఠకుని హ్రుదయం లోతుల్లోనికి చొచ్చుకెళ్లి,గుండె బరువెక్కుతుంది,వైరాగ్యభావం దోబుచులాడుతుంది.జీవిత చరమాంకసత్యాన్ని కళ్లెదట నిలుపుతుంది.ఈ ఖండకావ్యంలో 8 పద్యాలున్నాయి.
అన్ని అణిముత్యాలాంటి పద్యాలే.

దువ్వురి వారి పానశాలలో ఒకచోట కవి...అంతం లేని ఈభువనమంతయు
ఒకవిశాల పాంధశాల, విశ్రాంతి గృహం,అందు ఇరుసంజెలు రంగుల వాకిలిల్.........కొంత సుఖించి పోయిరెటకో , అంటాడు.
.

జాషువ ఈకావ్యం మొదటీ పద్యంలో ఈవిషయాన్నే ప్రస్తావిస్తు,ఈ శ్మశానవాటికలో కొన్నివందల,వేల ఏండ్లగా నిద్రిస్తున్నవారు ఒక్కరుకూడా లేచి రాలేదు కదా అంటు ప్రారంభించాడు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈచలనంలేని నిద్ర అంటూ వాపోతున్నాడు.
ఈ రుద్రభూమిలో తమబిడ్దలును పొగొట్తుకున్న తల్లుల రోదనలతో నిండిన కన్నిళ్ళకు వల్లకాడులోని రాళ్లు క్రాగిపోయ్యాయి అని చింతిస్తున్నాదు. కవిహృదయం చూడండి.
.

ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ,యీ శ్మశానస్ధలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకఁడైనన్ లేచిరాఁ,డక్కటా!
యెన్నాళ్ళీచలనంబులేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నిటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్
.

ప్రకృతిగతి తప్పి,ఆకాశంలో కారుమబ్బులు కమ్మిచిమ్మచీకటీ నిండి,దయ్యాలు,గూడ్లగూబలు చెరలాడుచు,కాకులు ముకమ్మిడిగా గోలచేసిన జనవాసం భితిల్లుతుంది.కాని ఈ శ్మశానవాటికలో భీతికి తావేలేదు.అంతా నిశ్సబ్దం....శ్మాశాన నిశ్సబ్దం.....
.

కవికలం ఎమంటున్నది.?

ఆకాశంబున కారుమబ్బుగము లాహారించె,దయ్యాలతో
ఘూకంబుల్ చెరలాడసాఁగినవి;వ్యాఘోషించె నల్దిక్కులన్
గాకోలంబులు ; గుండెఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
దా కల్లాడిన జాడలే;దిచ్చట సౌఖ్యం బెంత క్రీడించునో!
.

ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే ఈ నేలలో.కవి,రాజు,లేత యిల్లాలి మాంగల్యం ,చిత్రకారుడు ఎవ్వరైతేనేమి ఆయ్యుస్సు తీరాక యిక్కడ విశ్రమించవలసిన వారే!.సృష్టికి లయకారుడు శివుడు.ఆయనకిష్టమైనది తాండవం.అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశానవాటిక కన్నమిన్న ఏమున్నది. ఈ వాటిక శివుడు తన పిశాచఅనుచరగణంతో నాట్యమాడు రంగస్ధలమంటున్నడు కవి. అంతేకాదు ఈ రుద్రభూమి మరణదూత భూమిని పాలించు బూడితతో చేసిన సింహసనమట! ఎంతలోతు భావం కవిది.
.

కవిహృదయం ఏమంటుందో చూడండి.
.

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియ,నశించె!
.

ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూత తీక్షమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
.

రాత్రి సమయం...తిమిరం నిండిన శ్మశానం....నిశ్శభ్దం రాజ్యమేలు వేళ....ఆ మూల కొత్తసమాధి....సమాధిపై ఆముదపుదీపం, కదులుతున్న మిణుగురులా రెపరెపలాడుచూ వెలుగు చున్నది. అరే! అదేమిటి? ప్రమిదలో అముదం నిండుకున్నను ఇంకా దివ్వె వెలుగుచున్నదేమి?! ఆ సమాధిలో నిద్రిస్తున్న అభాగ్యురాలు యొక్కహృదయం కాబోలు ఆ దివ్వె వెలుగు!?....పాఠకుని గుండెను సూటిగా తాకి ఆర్ధ్రమైయ్యే భావం.ఈలాంటి భావన చెయ్యడం చేయ్యితిరిగిన కవికే సాధ్యం.
.

ముదురు తమస్సులో మునిఁగిపోయిన క్రొత్త సమాధిమీదఁ బై
బొదలు మిణుంగురుబురువు పోలిక వెల్గుచున్నదివ్వె,ఆ
ముద ముడివోయినన్ సమసిపోవుట లేదది దీప మందుమా?
హృదయము సుమ్మి,నిల్పిచనియె న్గతపుత్రిక,యే యభాగ్యయో
.

కవితా సుధలొలికించిన కవులకలాలు, శ్రవణాందకరమైన గాయకుల కమ్మని కంఠస్వరాలు ... ఇదిగో ఈ శ్మశాన పూవాటికలో విశ్రమించాయి.పంచభౌతికమైన ఈ మేను కడకు ప్రకృతిలో కలసి పోవల్సినదే.అందులో మమైకం కావలసినదే.పుట్టుక కూడా తల్లిగర్భం నుంచే అయ్యినను,తల్లికూడా ప్రకృతి జనీతమే కదా.మట్టిలో ఖననము చెయ్యబడిన తనువు క్రమంగా కృషించి,నశించి,జీర్ణించి మట్టీలో మట్టిగా కలసిపోతుంది.మట్టిరేణువులలలో రేణువులుగా కలసిపోవును.ఔను నిక్కమే కదా!.అదిగో ఆ కుమ్మరి సారె మీదున్న మట్టిముద్దలో అల్నాటి సుకవులు కాళిదాసు,భారవుల మృతరేణువులు కలసి వున్నాయేమో కదా!.
.

మరి కవిమనస్సు ఏమంటున్నది.
.

కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భా
రవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై.
.

శ్మశానవాటిక వాకిటనుంచొని ఒకపర్యాయం పరికించి చూచిన మనగుండెలు తర్కుపోతాయి.మన మనస్సు కరిగినీరై పోతుంది ఆమూలనున్న అన్నెం పున్నెం ఎరుగని వయస్సులోనే మృత్యువు గర్భంలో చేరిన చిన్నారుల గోరిలను చూస్తే.ఆ పిల్లల సమాధులలో ఏచిన్నారి పొన్నారిరూపసి తనువు చాలించిందో? ఏ ముద్దులు మూటలుకట్టు రూపసి అలసిసొలసి నిద్రిస్తున్నదో.ఏ తల్లి లీలావతి కడుపుతీపి దాగున్నదో?
.

ఆలోకించిన గుండిల్గరగు; నాయా పిల్ల గోరీలలో
నే లేబుగ్గల సౌరు రూపరియెనో!యేముద్దు నిద్రించెనో!
యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?
.

వల్లకాడులో అస్పృశ్యతకు తావు లేదు.ఏ మతమైన,ఏ కులమైన,ఏ వర్ణమైన ఇక్కడ ఒక్కటే. అందరిని స్వీకరించడంలో సమతా భావం.పులిపక్కన సాధుజంతువు మేకను జేర్చి బుజ్జగించి ,వూరడించు అభేదభావనావని ఈ శ్మశానభూమి.

ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు;విశ్వంభరా
నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి, య
త్కటంపు బెబ్బులితోడ మేకఁ నొక్క పక్కజేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁ గారాడెడిన్
.

మారుతున్న ,పరిగెడుతున్న కలికాలంలో ఆర్ధికఅవసరాలు,ధనవ్యామోహం-రక్తబంధాలను,పాశాలను త్రెంచుతున్నాయి.తమను కని,అల్లారు ముద్దుగా పెంచి,పోషించిన తల్లిదండ్రులను వృధ్యాపంలో,బ్రతికి వుండగానే వల్లకాటిలో అర్ధరాత్రి వదలివెళ్ళూచున్న రోజులివి.ఆలాంటప్పుడు అనాధ పేదవాని మృతశరీరాన్ని పట్టించుకొని,ఖననముచెయ్యు దాతలెందరు?.అన్నింటికన్న దారుణమైనది,భయంకరమైనది దరిద్రం/పేదరికం. శ్మశానంలో ఖననానికి నోచుకోని ఒక అనాధపీనుగను గూర్చి కవి ఎంత హృదయఆర్తితో వర్ణించాడో.అది కవి వేదనకాదు...పాఠకుని హృదయ ఘోష...కాదందురా?
.

వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలరాతి గో

రీకడఁ బారవేయబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే

యాకటి చిచ్చునన్ గుమిలి,యార్చి,గతించిన పేదవాని దౌ

నో కద! వానికై వగవఁ డొక్కదండు; దాఁచదు కాటినేలయున్

నేను చూసిన నలుగురి దేవదాసులు ..


నేను చూసిన నలుగురి దేవదాసులు ..
.కే.ఎల్. సైగల్.. దిలీప్ కుమార్..అక్కినేని...శారురఖాన్ లు ...

నాకు నచ్చినవాడు దీలిప్ కుమార్.

Tuesday, September 22, 2015

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ!


పుత్తడి బొమ్మ పూర్ణమ్మ!
గురజాడ అప్పారావు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో, వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మక మైన కావ్యంగా, అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేసారు గురజాడ. ‘పుత్తడిబొమ్మా పూర్ణమ్మా’అంటూ అందచందాల రాశిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు, మూఢాచారానికి బలయిన తీరును ఈ కథలో వివరించారు గురజాడ.
ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనం ఆశతో పిల్లల్ని ముసలి వరులకు తండ్రులు పెళ్ళిచేయడాన్ని ఇతివృత్తంగా రచించినది.
ఒక పూజారింటను పుట్టిన పూర్ణమ్మ అనే బాలిక కన్యాశుల్కం కారణంగా తాత వయసు వున్న వరుడితో బాల్యవివాహమై మూఢాచారానికి బలయిన తీరు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదం మనసున్న ఎవరికైనా కళ్ళను చమర్చేటట్లు చేస్తుంది.
మేలిమి బంగరు మెలతల్లారా !
కలువల కన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా ఈ కథను ?

ఆటల పాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?

కొండల నడుమను కోనొకటున్నది !
కోనకి నడుమా కొలనొకటుంది !
కొలని గట్టునా కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.

పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజలు పువ్వులు కోసేది.

ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములున్
అంగము లందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.

కాసుకు లోనై తల్లీ తండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.

ఆమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు
ఆమని రాగా దుర్గ వనములో
కిలకిల పలికెను కీరములు.

ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.

ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాత యని కేలించ,
ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుక్కించె

కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
పుత్తడి బొమ్మను పూర్ణమను
చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు.

పసుపు రాసిరి బంగరు మేనికి
జలకము లాడెను పూర్ణమ్మ
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కై చేస్రీ.

పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
తల్లీ తండ్రీ దీవించ్రీ
దీవన వింటూ పక్కున నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !

చిన్నల నందర కౌగిట చేర్చుకు
కంటను బెట్టెను కన్నీరూ !
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.

"అన్నల్లారా తమ్ముల్లారా !
అమ్మను అయ్యను కానండీ
బంగరు దుర్గను భక్తితొ కొలవం
డమ్మల కమ్మా దుర్గమ్మ.

"ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ,
భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
డమ్మల కమ్మా దుర్గమ్మ

నలుగురు కూచుని నవ్వే వేళల
నా పేరొక తరి తలవండి
మీమీ కన్న బిడ్డల నొకతెకు
ప్రేమను నా పేరివ్వండి."

బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.

వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టన్
కాసుకు లోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడె.

యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
యేరిన పువ్వులు సరిగూర్చి
సంతోషమ్మున దుర్గను కొలవను
వొంటిగ పోయెను పూర్ణమ్మ.

ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
యింటికి పూర్ణమ రాదాయె.

చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె.

కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్ !
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ.

కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ నివేదన -

కాంచన విపంచి

- శ్రీమతి చావలి బంగారమ్మ 

నివేదన -

చూచివచ్చిన మాట తేటపడగాను

నోటజెప్పుట నీకు చేతకాదనుము

చురుకు గల చూపులతొ సూర్యుడా! నీవు

చూడలేవైతివా సున్నితపు విభుని

మనసు మెత్తనివాడు మహమంచివాడు

మాటాడ వెరతురూ మనబోటివారు

మగువలకు భయమన్న మరినమ్మవచ్చు

మగవారికేలయ్య మాటాడభయము

మగవారికైననూ మాటలాడుటకు

మనసు తెలుపని వాని మరులేలతిరిగె

పగలె పరికిస్తావు పారిపోతావు

చీకటిని జూచితే చిక్కుతాడేమొ

కునికిపాటున నీవు కునుకుతావేమొ

కుముదబాంధవునైన కూకలెట్టుమను.

Monday, September 21, 2015

తొందర పడకు తుమ్మెదా!

తొందర పడకు తుమ్మెదా!
.
ఎంత చక్కని వాడో అంత టక్కరివాడు...

ఎంతకూ ఓయమ్మో చిక్కనివాడు... అంతు చిక్కనివాడు..
తుమ్మెదా తుమ్మెదా ...తొందర పడకు తుమ్మెదా
ముందుంది ముసళ్ళ పండగా..
(బాణం వేసేవారు అందరు మన్మధు లు కారు.)


Friday, September 18, 2015

సహజగుణము! (బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి)


సహజగుణము!
(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి)

చిమడకే చిమడకే
ఓ చింతకాయ!
నువ్వెంత చిమిడినా,
నీ పుల్ల పోదు.

ఉడకకే ఉడకకే
ఓ ఉల్లిపాయ!
నువ్వెంత ఉడికినా,
నీ కంపు పోదు.

బాల సాహితీ !

బాల సాహితీ !
ఇందు భౌతికస్వభావము వరుస చొప్పునఁ జెప్పఁబడుటచే
బాలుఁ డా వరుస నంటు కొని, యొకటి రెండు మారులు వినినంతనే
తప్పకుండఁ బదము నప్పగింపఁగలడు
..ఎండలు కాసే దెందుకురా?
మబ్బులు పట్టే టందుకురా.
మబ్బులు పట్టే దెందుకురా?
వానలు కురిసే టందుకురా.
వానలు కురిసే దెందుకురా?
చెరువులు నిండే టందుకురా.
చెరువులు నిండే దెందుకురా?
పంటలు పండే టందుకురా.
పంటలు పండే దెందుకురా?
ప్రజలు బ్రతికే టందుకురా.
ప్రజలు బ్రతికే దెందుకురా?
స్వామిని కొలిచే టందుకురా.
స్వామిని కొలిచే దెందుకురా?
ముక్తిని పొందే టందుకుర
(వేటూరి గారి బాల సాహితీ నుండి సేకరణ)


సకలవిద్యాసనాధ కవిసార్వభౌమ శ్రీనాథుని 'శృంగార నైషధము' - ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు!


సకలవిద్యాసనాధ కవిసార్వభౌమ శ్రీనాథుని
'శృంగార నైషధము'
- ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు
.
శ్రీనాథుఁడు వ్యభిచారియను ప్రతీతి లోకమునందున్నది. అది యెంతవఱకు సత్యమో మనము చెప్పఁజాలము. కాని శృంగార రసపోషణమున నాతని కభినివేశము మెండని చెప్పుటలోమాత్ర మతిశయోక్తి లేదు. రచనలలో శృంగార రసమును చక్కఁగా పోషించు వారందఱును జీవితములోఁ గూడ శృంగార క్రియాలాలసులై యుందురని భావించుట యుక్తము కాదు.
శృంగార రసపోషణాసక్తి కలవాఁడయ్యును నైషధమున శ్రీనాథుఁ డౌచిత్య దృష్టితో కావించిన మార్పులావిషయమున నాతనికిఁగల నిగ్రహమును ప్రదర్శించును.
హంస దమయంతికి నలుని సౌందర్యమును వర్ణించిచెప్పునప్పుడు
మూలకర్త రంభాద్యప్సరలనేకాక యింద్రాణియు త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ లక్ష్మీ పార్వతులను గూడ నాతని యతిలోక సౌందర్యమును గూర్చి విని చిత్త విభ్రాంతికి లోనైరని వర్ణించియుండెను.
లోకమాతలైన ఆ సతీమతల్లుల కట్టి చిత్త వికారము కలిగెనని యూహించుట యసంభావ్యమును అనుచితమును అగుటచే శ్రీనాథుఁడా శ్లోకము లనువదింపక విడిచివైచెను. దేవవేశ్య యగుటచే రంభయందట్టి వికార మసంగతము కాదని తలంచుటచే కాఁబోలు నా శ్లోకమును మాత్ర మనువదించెను.
ఆ శ్లోకమిది.
.
అస్మత్కిల శ్రోత్ర సుధాం విధాయ
రంభాచిరంభామతులాం నలస్య
తత్రానురక్తా తమనాప్య భేజే
తన్నామగంధా న్నలకూబరం సా. (3-26)
.

(రంభ నలుని సాటిలేని కాంతినిగూర్చి చిరకాలము నా వలన విని శ్రవణామృతమును బొంది, యతని యందనురక్తయై యతని బొందలేక తన్నామ వాసన యుండుటచే కుబేర సుతుడైన నలకూబరుని పొందెను.)

దీనిని శ్రీనాథుఁడు
విను కలిఁ గూర్మిజిక్కి పృథివీ భువనంబునకుం డిగంగనే
యనువునులేక రంభయను నచ్చరలేమ, నలున్‌ వరింపఁబూ
నిన తనకోర్కి నొక్కమెయి నిండఁగఁ జేయుటకై భజించె దాఁ
గొనకొని వేల్పులందు నలకూబరుఁ డచ్ఛుభనామవాసనన్‌. (2-54)

అని యథామాతృకముగా ననువదించెను. మూలమునందలి 'అనాప్య' అను పదము నాతఁడు "పృథివీ భువనంబునకున్‌ డిగంగనే యనువునులేక" యని కారణసూచనపూర్వకముగా చక్కగా వివరించెను.

చదువుసందెలు(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .)చదువుసందెలు(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .)

విఘ్నమ్ము లేకుండ
విద్య నియ్యవయ్య
విఘ్నేశ్వరుడ నీకు
వేయిదండాలు.

 

ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి,
ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలుపాడి,
సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.

చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!

పిల్లలందరు రండి
బళ్లోకిపోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.

విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.


అరటిపండూ తీపి, ఆవుపాల్‌ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి.

చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధిచెప్పాలి.

చదువంటె అబ్బాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.

పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.

చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు

సౌఖ్యమ బ్బేను.

Thursday, September 17, 2015

మహర్షులు ప్రసాదించిన అమృతం!


మహర్షులు ప్రసాదించిన అమృతం!
.

జాతస్య మరణం ధృవం...పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు.
కానీ అకాలమరణాన్ని ఎలా జయించాలి? సత్యవ్రతాన్ని పాటిస్తూ, సద్వర్తనతో మెలగుతూ, ధర్మపరాయణులుగా ఉండడమే దీన్ని దాటే సులభమార్గం. ఈ విషయాన్నే ధృవీకరిస్తూ మనం చేయాల్సిన నిత్యకృత్యాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో వివరంగా చెప్పారు.

పూర్వం హైహయవంశంలో దుంధుమారుడు అనే రాకుమారుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేటకు వెళ్లిన సందర్భంలో జింక చర్మాన్ని ధరించి ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడిని జింకగా భ్రమించి బాణంతో కొట్టాడు. ఆ వేటుకు యువకుడు మరణించాడు. దుంధుమారుడు ఆ బ్రాహ్మణయువకుడి మృత కళేబరాన్ని చూశాడు. పొరపాటుకు ఎంతో విచారించాడు. ఈ విషయాన్ని తన కుల పెద్దలకు తెలిపాడు. వారందరూ సమీపంలో ఉన్న తార్క్షు్యడు అనే ముని ఆశ్రమానికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు.

ఆ బ్రాహ్మణయువకుని హతమార్చిన మహాపాపాన్ని తొలగించుకునే మార్గం చూపుమని ప్రార్థించారు. అప్పుడు తార్క్షు్యడు వారితో "ఆశ్రమంలో నివసించే వారికి భయం, రోగం, చావుల వంటివి వుండవు" అంటూ, మరణించిన బ్రాహ్మణ యువకుడిని సజీవంగా వారికి చూపాడు. ఈ మహిమకు కారణమేమిటని వారు ప్రశ్నించారు మునిపుంగవుడిని.

అందుకు తార్క్షు్యడు...
ఆలస్యం బొక యింత లేదు
శుచి ఆహారంబు
నిత్యక్రియాజాలం బేమరము
అర్చనీయు లతిథుల్
సత్యంబ పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము
అట్లౌట నెక్కాలంబుం బటురోగమృత్యు భయశంకం బొంద మేమెన్నడున్
- అని చెప్పాడు.

ఆశ్రమజీవితంలో మృత్యుంజయసిద్ధికి అనుష్ఠించబడే నియమాలు...

కాలం విలువ గుర్తించడం, ఆహారం పరిశుభ్రంగా ఉంచడం, ప్రతిదినం జరపాల్సిన పనులు ఏమాత్రం మరువకపోవడం, అతిథులను పూజించడం, సదా సత్యవ్రతాన్ని పాటించడం, శాంతి, ఇంద్రియ నిగ్రహంతో కూడిన నిష్కామవ్రతాచరణ చేయడం.

ఈ విధమైన ధర్మాచరణ వల్ల మనం రోగమృత్యు భయాందోళనలు లేక నిశ్చింతగా జీవించవచ్చనేది మహర్షుల బోధనాసారం.

ఫలశ్రుతి:
ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు
అర్థార్థులకు విపులార్థములును
ధర్మార్థులకు నిత్యధర్మసంప్రాప్తియు
వినయార్థులకు మహావినయ
మతియు పుత్రార్థులకు బహుపుత్రసమృద్ధియు
సంపదర్థుల కిష్టసంపదలును
గావించు నెప్పుడు భావించి
వినుచుండువారికి నిమ్మహాభారతంబు

భావం: మహాభారతం ఎల్లప్పుడు తలచి వినే జనులకు ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘాయుస్సును, ధనాన్ని కోరేవారికి అధికమైన ధనలాభాన్ని, ధర్మాన్ని కోరేవారికి సంతతధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, పుత్రసంతానాన్ని కోరేవారికి పుత్రసంతానాన్ని, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలను కలుగజేస్తుంది. ఇందులో చెప్పిన విషయాలు సుస్పష్టం. ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అందరూ కోరేవే. మరి ధర్మం - వినయాల ప్రాధాన్యం ఏమిటి?

విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం, తతస్సుఖం ||

ధనానికి ముందువెనుక ఉత్తమలక్షణాల నుంచారు మనవాళ్లు, అవే వినయం, ధర్మం. వినయం వల్ల ధనం సంపాదించే అర్హత లభిస్తుంది. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుడు వినమ్రుడై చేతులు జోడించి నిశ్చలభక్తితో నమస్కరించి కోర్కెల చిట్టా విప్పకూడదు. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనాన్ని, ఆ ధనాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని ఇమ్మని ప్రార్థించాలి అని శ్రీ వేంకటేశ్వర కరావలంబస్తోత్రం చెబుతోంది. సుఖశాంతులు లేనప్పుడు ఆయుష్షు, ధనం, సంతతి, ఐశ్వర్యం, అన్నీ వ్యర్థాలే.

******

Wednesday, September 16, 2015

వినాయక చవితి శుభాకాంక్షలు !!

వినాయక చవితి శుభాకాంక్షలు !!
మీకు మీ కుటుంబానికి గణేశుని అనుగ్రహం సదా లభించు గాక !!
బాలుల పండగ ఈ వినాయక చవతి వారికి నా దీవెనలు
శ్రీ గణ నాధం భజామ్యహమ్

వక్ర తుండ మహా కాయం
సూర్య కోటి సమప్రభం
నిర్విఘ్నం కురుమే దేవ

సర్వ కార్యేషు సర్వదా !!

.
పూజా విధానం!
.
 
వినాయక చవతి వ్రతకల్పం
ఆచమనం: 
ఓం శివాయ స్వాహాః, మహేశ్వరాయ స్వాహాః శంభవే స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా, యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః 
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.
ప్రాణాయామము చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను.
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......
ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, సిద్ది విణాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః, మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మృతః కుక్షౌత్సాగరాసర్వేసప్త ద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అధర్వనః అన్గైస్చ సాహితాసర్వే కలశాంబు సమాశ్రితః.
ఆకలశేశ్లో: గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సొందు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు|| కావేరి తున్గాభాద్రాచ క్రుష్ణవేన్యాచ గౌతమీ| భాగీరదీచ ప్రఖ్యాతాః పంచాగంగాః ప్రకీర్తితితః ఆయాంటూ దేవపూజార్ధం మమ (యజమానస్య) దురితక్షయకారకాః కలశోధకేన పూజా ద్రవ్యాని సంప్రోక్షయః. 
(కలశములోని నీళ్ళను పూజా ద్రవ్యములపైన, దేవునిపైన, తమ శిరస్సుపైన కొద్దిగా చల్లుకోవాలి) 
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
శ్రీ మహా గణాధిపతయే నమః ఆవాహయామి 
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥
శ్రీ మహా గణాధిపతయే నమః ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥
శ్రీ మహా గణాధిపతయే నమః ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥
శ్రీ మహా గణాధిపతయే నమః పాద్యం సమర్పయామి 
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥
ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥
మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥
పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥
శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥
వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥
ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥
గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥
పుష్పాణి పూజయామి.
అథాంగ పూజ:
(పుష్పములతో పూజించవలెను)
గణేశాయ నమః - పాదౌ పూజయామిఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామిశూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామివిఘ్నరాజాయ నమః - జంఘే పూజయామిఅఖువాహనాయ నమః - ఊరూ పూజయామిహేరంబాయ నమః - కటిం పూజయామిలంబోదరాయ నమః - ఉదరం పూజయామిగణనాథాయ నమః - నాభిం పూజయామిగణేశాయ నమః - హృదయం పూజయామిస్థూలకంఠాయ నమః - కంఠం పూజయామిగజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామివిఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామిశూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామిఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామిసర్వేశ్వరాయ నమః - శిరః పూజయామివిఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి ఏకవింశతి పత్రపూజ:
(21 విధముల పత్రములతో పూజింపవలెను)
సుముఖాయనమః -మాచీపత్రం పూజయామి। గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి। ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి। గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి| హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి। లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి। గుహాగ్రజాయనమః -అపామార్గపత్రం పూజయామి। గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి| ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి| వికటాయ నమః -కరవీరపత్రం పూజయామి। భిన్నదంతాయ నమః -విష్ణుక్రాంతపత్రం పూజయామి| వటవేనమః - దాడిమీపత్రం పూజయామి| సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి| ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి| హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి| శూర్పకర్ణాయనమః -జాజీపత్రం పూజయామి| సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి| ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి| వినాయకాయ నమః -అశ్వద్దపత్రం పూజయామి| సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి। కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి। 
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.
శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా
ఓం గజాననాయ నమః 
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥ 
ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపందర్శయామి।
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,
భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,
నైవేద్యం సమర్పయామి।
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం
తాంబూలం సమర్పయామి।
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
నీరాజనం సమర్పయామి।
అథ దూర్వాయుగ్మ పూజా
గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి। కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।
ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।
కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం.!

కాలునితో కలసి నడిచిన సతీసావిత్రికి జీవాత్మ దర్శనం.!
.
ప్రాణ, అపాన అనే వాయువులతో కలిసి అన్ని శరీరాల్లో సంచరించే అగ్నే జీవాత్మ. అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు, జీవాత్మగా భాసించే ఆ పరమాత్మ అని మహాభారతం అరణ్యపర్వంలో ఎర్రాప్రగడ వివరించాడు.

ప్రత్యక్ష దర్శనం...

Vinjamuri Venkata Apparao's photo. ఇంతకూ ఆ జీవున్ని ప్రత్యక్షంగా దర్శించిన వారెవరైనా ఉన్నారా అంటే, ఉన్నారు. ఆ వ్యక్తే మహాసాధ్వి సావిత్రి, సత్యవంతుని భార్య. జీవున్ని యముణి్న దర్శించగలిగింది, కేవలం ఆమె పాతివ్రత్య మహిమ చేతనే.

నల్లని మేఘంలా శోభిల్లే నల్లని కాటుకవంటి ఆకారంతో, భయంకరమైన కోరలతో, మిలమిల మెరిసే నెత్తుటి రంగు నేత్రాలు కలిగి, ప్రళయకాలంలోని అగ్నిలా మండుతూ బంగారు రంగుతో వెలుగుతున్న వస్త్రాలు ధరించి, లోకంలోని జనులకు భీతిని కలిగించే విధంగా యమధర్మరాజు సావిత్రికి ప్రత్యక్షమవుతాడు. నిడివి ఎక్కువగా గల పాశాలను రాకుమారుడైన సత్యవంతుడి పైకి భయంకర రీతిలో ప్రయోగిస్తాడు. అతడి శరీరం నుంచి జుత్తిలి కొలత గల (చూపుడు వేలు, బొటనవేలు చాపగా, పైన నడిమ కొలతకు లోబడిన ఆకృతి) జీవుడిని బంధించి బయటకు లాగగా ఆ జీవుణి్న సావిత్రి ప్రత్యక్షంగా దర్శిస్తుంది.

కారణజన్మురాలు...

సావిత్రి ఉపాఖ్యానం మహాభారతంలో ఒక విశిష్ఠ రచన. వైధవ్యం తప్పదని తెలిసి వివాహం చేసుకున్న సాధ్వి సావిత్రి. ఆమె కారణజన్మురాలు, ధీరమాత కూతురు. ఆమె అంగీకారానికి ఆమోదముద్ర పలికిన ఆమె తండ్రి ధైర్యవంతుడు. 'పేర్కొనజాల పెంపునన్' అని కోరిన వరునితో వివాహం జరిపిస్తాడు. త్రిరాత్రోపవాసం చేసిన సావిత్రికి యమదర్శనం కలగడం విడ్డూరం కాదు. కాని ఆమె వివాహమైన తరువాత ఆ సంవత్సరకాలం కాలుని ఆగమనం కోసం నిరీక్షిస్తున్న పుణ్యవతిగా గోచరిస్తుంది. అంటే ఆమె తన భర్త మరణకాలాన్ని కొలుస్తున్నందువల్లే ఆమె కాలుడిని చూడగలిగిందన్నమాట. సావిత్రి కాలుడితో చాలా దూరంగా నడిచి ఎన్నో మాటలు మాట్లాడింది. 'సఖ్యం - సాప్తపదీనం' అంటూ ఏడు అడుగులు నడిచి మాట్లాడితే ఎవరైనా బంధువులవుతారని వివరించింది. ప్రసన్నుడైన యమధర్మరాజు పరిపూర్ణ ఫలాన్నిచ్చాడు సావిత్రికి. భర్త పరిపూర్ణ ఆయుస్సును, శతపుత్ర లాభాన్ని వరంగా పొంది పుట్టింటికి, మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహాపతివ్రతా శిరోమణి సావిత్రి. కొలిచిన దైవం ప్రత్యక్షం కాగా కలిసి నడిచిన ఏకైక భక్తురాలు సావిత్రి, ధన్యురాలు.

త్రిరాత్రోపవాస వ్రతం..

సావిత్రి ఉపాఖ్యానంలో సమాధానం దొరకని ఒకే ఒక ప్రశ్న, భర్త మరణాన్ని ఆమె ఎలా ఎదుర్కోపోతున్నది ? కథను పరిశీలిస్తే మనకు తెలిసే విషయాలు స్వల్పం. సావిత్రి అందమైన ఆభరణాలు, వస్త్రాలు త్యజించి నారచీరలతో అడవిలో భర్తకు సపర్యలు చేసింది. నారద మహాముని చెప్పిన ప్రకారం తన భర్త ఆయువు ప్రమాణం లెక్కించుకుంటూ గడిపిన సావిత్రి అతని మరణానికి ఇంకా నాలుగురోజులే ఉన్నట్లు తెలుసుకుంది. అంటే అప్పటికి నాలుగురోజులు తక్కువగా ఒక సంవత్సరకాలం గడిచిపోయిందన్నమాట. వెంటనే పరమనిష్ఠతో త్రిరాత్రోపవాస మహావ్రతాన్ని పూనింది. పగళ్లతో కూడిన మూడురాత్రులు దీక్షతో ఉపవాసాలు చేసింది. నాలుగవ రోజున వేకువనే కాలకృత్యాలు తీర్చుకుని, భక్తితో భర్త శుశ్రూష చేసి, అత్తమామలకు, పెద్దలకు ప్రత్యేకంగా నమస్కరించింది. వారు ప్రీతితో చిరకాలం మాంగల్యంతో వర్ధిల్లమని పలికిన దీవెనలను మనసారా గ్రహించింది. భర్త సమిధలు, దర్భలు తేవడానికి అడవికి పోతుండగా అత్తమామల అనుమతితో అతడిని అనుసరించింది. అడవిలో చెట్లు నరుకుతుండగా సత్యవంతుడు శిరోవేదనతో బాధపడుతూ సావిత్రి ఒడిలో తలపెట్టుకున్నాడు. ఆ క్షణంలో ప్రత్యక్షమైన యముడిని చూసి "ఆర్యా, మీరెవరు?" అని ప్రశ్నించింది సావిత్రి. ప్రతిగా యముడు నేను కాలుడను సుమా! నీవు మహాపతివ్రతవు, అందుకనే నన్ను చూడగలిగావు. నీ భర్త ఆయువు తీరింది. ఇతడు పుణ్యాత్ముడు కనుక నేనే స్వయంగా వచ్చాను అంటూనే సత్యవంతుడి శరీరం నుంచి జీవుడిని బయటకు లాగి బంధించి దక్షిణ దిశగా బయలుదేరాడు. ఆయనను అనుసరిస్తూ సావిత్రి యముణి్న భక్తిపూర్వకంగా ఆరాధిస్తూ ఇలా సంబోధించింది.

"అంతకుండు, దండధరుడు, సంస్తుతగుణుడు, సమవర్తి, పితృపతి, ధర్మదేవత, యముడు, జలజాప్తసుతుడు, బ్రేతపతి, వైవస్వతుడు, ప్రథమ ధర్మాధ్యక్షుడు, ధర్మరాజు, ధర్మపదవీ పరిరక్షణుడు..."

గమనిస్తే ఆమె సంవత్సర కాలం త్రికరణశుద్ధిగా ఆరాధించి కొలిచిన దైవం ఎవరో కాదు...కాలుడే (కాలం) అని అర్థమవుతుంది. ఆ కాలాన్నే ఆమె లెక్కిస్తూ నిరంతరం కాలాన్ని కొలవడం వల్ల యముణి్న ఆరాధించిన ఫలం దక్కింది. దీక్షతో త్రిరాత్రోపవాసాలు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని భర్త ప్రాణం పొంది ఆదర్శనారిగా, పతివ్రతగా జీవించింది ధీరవనిత సతీసావిత్రి.
.
(కృతజ్ఞతలు ..."Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu)

విజయ విలాసం!

విజయ విలాసం!

.

విలాసం ”.అలాగే శృంగార చేష్టలకూ విలాసం అనే పేరుంది .విజయుడు అయిన అర్జునుడు ముగ్గురు స్త్రీ లతో విలాసం గా ప్రవర్తించిన సంఘటనల మాల ”విజయ విలాసం ”ఈ కావ్యం లో ముగ్గురు నాయికలున్నారు .”ఉలూచి ”అర్జునున్ని ,స్వయం గా వరించిన ప్రౌఢ .దీన్నే SETTLED MARRIAGE అంటాం మనం .చిత్రాంగదను అర్జునుడే వరించాడు .ఇదే ARRANGED MAARRIAGE .ఈమె ముగ్ధ .ఇక సుభద్రార్జును లకు ఒకరిపై ఒకరికి గాడాను రాగం ,ప్రేమ వున్నాయి .దీనికి మించి బంధుత్వము వుంది .దగ్గర కావాలనే తపనా వుంది .నవోద అయిన సుభద్ర అర్జునున్ని చూడ గానే ప్రౌఢ గా మారింది .ఆమె ను ”మధ్యమ నాయిక ”అంటారు .x

భారతంలో నన్నయగారి చివరిపద్యం -

నన్నయగారి చివరిపద్యం:

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన -
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)
తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్రమాలికలతో కూడి ఉన్నవి, వికసించిన కొంగ్రొత్త తెల్ల కలువల దట్టమైనసుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటావెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్నిఆవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా వున్నాయి.
దీంట్లో నన్నయ తనమహాభినిష్క్రమణని సూచించాడా?
విశేషంలో వివరణ ఇలా వుంది: కొందరు పండితులు
ఈ పద్యంలోని చివరిపదగుంఫనం - పాండురుచిపూరములు + అంబరపూరితంబులై -
అని విరవటానికి బదులు - పాండురుచిపూరములన్ + పరపూరితంబులై- అని సంధి విశ్లేషిస్తే,నన్నయ చివరిమాట "పరపూరితంబులై" అని ఏర్పడుతుంది.
అంటే భారతం పరులుపూర్తి చెయ్యాల్సిందేనని నన్నయ తన మరణాన్ని సూచించాడు!

Tuesday, September 15, 2015

జీవాత్మ దర్శనం !

జీవాత్మ దర్శనం !
.
రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా సుదర్శన చక్రం శిశుపాలుడి తలను ఖండించింది. ఒక కొండలా అతడి తల క్రిందపడింది. వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ బయటికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది.
ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు.
శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు.

ఆత్మనివాసం....

జీవి (జీవాత్మ) నివాస స్థానం గురించి మంత్రపుష్పంలో ఇలా ఉంది-

'పద్మకోశ ప్రతీకాశగ్o హృదయం చాప్యధోముఖం'

గొంతుకు కింద, నాభికి పైన ఉన్న ప్రదేశంలో 12 అంగుళాల ఎడంగా ఉండే హృదయ కమలమే జీవాత్మ-పరమాత్మ నివాసస్థానమని మంత్రపుష్పం తెలుపుతున్నది. సృష్టికి మూలమైన ఆ మహాశక్తి అగ్నిమాలికలా ప్రకాశిస్తున్నది. ప్రాణ, అపాన అనే వాయువులతో కలిసి అన్ని శరీరాల్లో సంచరించే అగ్నే జీవాత్మ. అచేతనమైన దేహాన్ని చేతనంగా చేసేవాడు, జీవాత్మగా భాసించే ఆ పరమాత్మ అని మహాభారతం అరణ్యపర్వంలో ఎర్రాప్రగడ వివరించాడు.
(కృతజ్ఞతలు...""Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu)

Monday, September 14, 2015

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?


నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?
‘మ' కారము మధనానికి అని అర్ధము. ‘యూర'అనే పదం హృదయానికి అని అర్ధం.
ఇంకా ‘మ' అంటే మగనెమలిని అని కూడా అంటారు.
పక్షిజాతిలో ‘యోగవిద్య' తెలిసిన పక్షులు 5మాత్రమే ఉన్నాయి.
అవి..శుకము, హంస, గరుడు, నెమలి చివరిది పావురము.
వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఝానము ఉన్నది.
అసలు నెమలి అందమే పింఛం.
క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

స్త్రీ స్వేచ్చ ... చలం (మైదానం)..........విశ్వనాధ(చెలియలికట్ట)..


స్త్రీ స్వేచ్చ ... చలం (మైదానం)..........విశ్వనాధ(చెలియలికట్ట)..


స్త్రీల సామాజిక దుస్థితి గురించి,వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలని గురించి తన ఆందోళనని జీవితాంతమూ కొనసాగించిన రచయిత గుడిపాటి వెంకటాచలం.
(చలం అనే పేరు తో ప్రాచుర్యం).చలం సాహిత్య ప్రభావం బలమైనది.తెలుగు సాహిత్యం లో చలం అంతటి వివాదాస్పద రచయిత మరొకరు లేరు.స్త్రీ పురుష సంబందాల మధ్య ఏ అంశాలనయితే ముట్టుకోడానికి కూడా మిగతా రచయితలు వేల ఏళ్ళుగా సాహసించ లేదో,ఆ సాహసాన్ని స్త్రీ కోసం మనసారా చేసిన తొలి రచయిత చలం.పురుషుల నిరంకుశ ధోరణి కింద స్త్రీలు అనుభవించే హింస తాలూకు బహు ముఖాలనీ తన సాహిత్యంలో నిజాయితీగా బొమ్మ కట్టి మరీ చూపినవాడు చలం.
పురుషాధిక్య సమాజపు వికృత నీతిని తన రచనల్లో ఏ ముసుగులూ వెయ్యకుండా భాషించ గలిగిన వాడు చలం. సాహిత్యం లో శశిరేఖ,అరుణ,వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను చిరస్థాయిగా ఉంచిన వాడు చలం.అయితే చలం రచనల్లో ఎక్కువ సంచలనాన్ని సృష్టించిన నవల మాత్రం "మైదానం". ఈ మైదానం నవలని చలం 1925 లో రాశారు.మైదానం నవల చాలా చర్చలను రేపింది.ప్రతికూల విమర్శల నెదుర్కొన్నది.స్త్రీ స్వేచ్చ మీదా,స్త్రీ పురుషుల సంబందాల మీదా కొత్త సిద్ధాంతాలు చేసింది.ఈ నవల వివాదాస్పదంగా మారడానికి కారణాలేమిటి?
ఒక సంప్రదాయ బ్రాహ్మణ గృహిణి ఒక ముస్లింతో కలిసి వెళ్లిపోవడం మాత్రమేనా? కాదు ..తనకి నచ్చిన మనిషితో వెళ్లిపోయి మైదానం కధానాయిక రాజేశ్వరి ఎలా బతికి ఉన్నా ఇంత గొడవ జరిగేది కాదు.ఆమె తన చర్య తోపాటు అభేద్యమైనదని సంప్రదాయ వర్గాలు అనుకుంటూ ఉన్న వివాహ వ్యవస్థ ఎంత లొసుగులతో ఉందో వివరం గా మాట్లాడుతుంది.పవిత్రమైనవంటూ ప్రచారం చేసే దాంపత్య సంబంధాలలోని బోలు తనాన్ని నిగ్గదీసి అడుగుతుంది. ఇందుకూ- ఈ పుస్తకం సమాజాన్ని ఎక్కువ కలవరపరచింది.

ఎన్ని విప్లవాలు నడచినా పర్వాలేదు కానీ ,కుటుంబ వ్యవస్థ కూలిపోతుంటే మాత్రం ...దాన్ని ఆధారం గా చేసుకుని అధికారం చెలాయిస్తున్న పురుష ప్రభుత్వాలకు విపరీతమైన భయం పుడుతుంది.అందువల్ల తమ మధ్య ఉండే సైద్ధాంతిక విభేదాలన్నీ కూడా వదిలేసి ఈ విషయంలో అన్ని వర్గాలకు చెందినవారూ ఏకమై ముక్తకంఠంతో ఇటువంటి రచనల పట్ల వ్యతిరేకతను కనబరుస్తారు.సంప్రదాయానికి ఉనికిపట్టులైన యుని
.వర్సిటీ వాళ్ళు మైదానం పుస్తకానికి బహుమతి ప్రకటించడానికి భయపడ్డారు.
.
.చలం మైదానానికి సమాధానంగా 1933 లో విశ్వనాథ సత్యనారాయణ "చెలియలికట్ట" అనే నవల రాశారు.
60లలొ గోపీచంద్ కూడా చలం భావజాలం మీదనే స్పందించి "గడియ పడని తలుపులు","మెరుపులమరకలు","గతించని గతం" వంటి పుస్తకాలు రాశారు. చెలియలికట్ట లో నాయిక రత్నావళి, ఆమె మరిది (చలం భావాలకు ప్రేరేపితుడై జీవించిన) రంగారావూ నవల చివరిలో ఆత్మహత్య చేసుకునేందుకు సముద్రం లోకి కలిసికట్టుగా పోతారు.
.
గోపీచంద్ రాసిన గడియపడని తలుపులు నవలలో కూడా ఆధునిక వేషం తో స్వేచ్చగా సంచరించినట్టు రచయిత చిత్రించిన నాయిక కోటేశ్వరమ్మ నవల చివరిలో పశ్చాత్తాపంతోనే సనాతన ధర్మం వైపు మల్లి కృశించి చచ్చిపోతుంది.

.మైదానం లో చలం కధానాయిక రాజేశ్వరి విసిరిన సవాళ్ళకు బదులుగా ఒక రత్నావళిని తయారు చేసిన బహు దిట్టమైన రచన విశ్వనాథ వారి చెలియలికట్ట మాత్రమే.
అందుచేత చలం మైదానాన్ని,విశ్వనాథ చెలియలి కట్టనీ రెండింటినీ తీసుకుని, అవి రెండూ స్త్రీ స్వేచ్చ కోసం చూపిన మార్గాల బలాబలాలను ఇక్కడ చర్చిద్దాం. మధ్య తరగతి వర్గం అతి ముఖ్యమైనవిగా స్త్రీలకి నూరిపోసిన "పరువు-ప్రతిష్ట " ఈ రెంటినీ గంగలో కలిపి బ్రాహ్మణ గృహిణి రాజేశ్వరి - సంసారంలో తనకి అన్ని హంగులూ అమర్చగలిగిన లాయర్ భర్తనీ,తన కుటుంబాన్నీ,తాను జీవించే సమాజాన్నీ వదిలి పెట్టి ,సమాజం లో గౌరవించగలిగే అర్హతలేవీ లేని అమీర్ అనే డబ్బులేని తక్కువ రకం తురక వాడితో పురుష సమాజ పరిభాషలో "లేచిపోతుంది".
సరిగ్గా ఈ వాక్యం తోనే మైదానం నవల మొదలవుతుంది.అలా తాను కలిసి వచ్చేసిన అమీర్ తననెంత ఘాడంగా ప్రేమిస్తాడో ..... తామిద్దరూ కలిసి మైదానంలో ఏ మిధ్యా గౌరవాలకూ ప్రాధాన్యత లేని చిన్న గుడిసెలో... దాని పక్క నదీ తీరంలో స్వేచ్చగా అనుభవించిన శృంగారానుభావాలన్నీ నవల ఆసాంతం రాజేశ్వరి తన స్నేహితురాలితో కధగా చెప్తుంది. అంతే కాకుండా స్త్రీ మనసులో కూడా ఏకకాలంలో ఒకరి కన్నా ఎక్కువ మంది మీద ఇష్టం కలిగే అవకాశం ఉందంటూ తాను అమీర్ తోపాటు మీరా అనే మరొక ముస్లిం కుర్రాడిని అభిమానించిన విషయం,దానితో తన జీవితం లో ఎదురైన కల్లోలమూ.... దాని పర్యవసానమూ కధలో వివరిస్తుంది.ఇదీ మైదానం నవల.
.
ఇక చెలియలికట్టలో సీతారామయ్య రెండో భార్య రత్నావళి .ముందు భార్య రత్నమ్మ చనిపోతే రత్నావళితో అతనికి మళ్ళీ పెళ్లి జరుగుతుంది. సీతారామయ్య తమ్ముడు రంగారావు (రంగడు) ను అతికష్టం మీద డబ్బులు పంపి లక్నోలో చదివిస్తుంటాడు.ఈ రంగారావు ఆధునిక భావాలను పెంచుకుంటూ అటు పాశ్చాత్య రచయితలనీ,ఇటు పాశ్చాత్య భావాలు పలికే (చలం వంటి) తెలుగు రచయితలనీ చదివి ఆ స్త్రీ స్వేచ్చా భావాలన్నీ కెక్కించుకుని సనాతన ధర్మాలకు దూరం కావడమే కాకుండా, తన అన్న భార్య అయిన రత్నావళికి కూడా తాను చదివే పుస్తకాలిచ్చి, తన భావాలన్నీ నూరిపోసి ఆమెలో విప్లవ భావాలను నాటుతాడు.
వీటన్నిటి మూలంగానే ఆమె సీతారామయ్య పట్ల విముఖురాలై రంగడితో మదరాసు "లేచి" వచ్చేస్తుంది.ఇక ఇక్కడి నుంచి రత్నావళి రంగడి సిద్ధాంతాలు ఎలా తప్పుల తడకలో నిరూపించడం కోసం పేజీ పేజీ లోనూ వాదనలను పెంచుకుంటూ పోతుంది.చివరికి ఆమెకి చదువు చెప్పడానికి సాక్షాత్తూ విశ్వనాధ సత్యనారాయణ గారే ముకుందరావు అనే పాత్ర గా ప్రవేశించి రత్నావళి లో రంగడి సిద్ధాంతాల పట్ల ఏర్పడిన చులకన భావాలకు నీరు పోసి,మరింతగా పెంచి తన వాదనాపటిమతో, బోధనా గరిమతో రత్నావళిని తిరిగి సనాతన ధర్మం వైపు మళ్ళించి తనంత దానిగా తయారు చేస్తారు.
రత్నావళి నవలలో చివర్లో మాట్లాడినవన్నీ ఈ ముకుందరావు మాటలే.చేసిన నిర్ణయాలన్నీ ముకుందరావు చూపిన మార్గానికి నడవడం కోసం చేసినవే.ఒకసారి వివాహవ్యవస్థ కాదని కాలు బయటపెట్టిన ఆడదానికి మరణం లో తప్ప నిష్కృతి లేదు కనుక, రత్నావళి నవలచివర్లో ఈ సంగతి మిగతా పాత్రలతోనూ(పాఠకుల తోనూ) చెప్పి మరీ చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె తాను విడిచివచ్చిన సీతారామయ్య కాళ్ళ మీద పడుతుంది.
మద్రాసులో విదుషీమణి (తెలుగు టీచరు రత్నావళి)తాను సంపాదించిన డబ్బును ,తన భర్త మూడవ భార్య (రత్నావళి వెళ్ళిపోయాక సీతారామయ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు) రాజ్యలక్ష్మికి పుట్టిన కొడుకు పేర రాసి వాడు తనకి తద్దినాలు పెట్టేట్లుగా వాగ్దానం చేయించుకుని అప్పుడు చచ్చిపోవడానికి వెళ్ళిపోతుంది.చివరికి ఆమె తోపాటు రంగారావు (చలం భావజాలాన్ని నమ్మినవాడు)కూడా తన తప్పులన్నీ ఒప్పుకుని రత్నావళితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఉప్పెన ముంచుకొస్తున్న సముద్ర తీరానికి వెళ్ళిపోతాడు.
క్లుప్తంగా ఇదీ కధ.

Sunday, September 13, 2015

బాల సాహిత్యము బాలభాష --- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి !

బాల సాహిత్యము బాలభాష --- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి !

దొంగవో? దొరవో?
.
పెద్దవారు బిడ్డను ముందు కూర్చుండబెట్టుకొని
'నీవు దొంగవో దొరవో కనుగొందునా' అని అడిగి -

దొంగవో దొరవో?
దొంగవో దొరవో?

అంటూ ముడ్డిపూస దగ్గరనుండి ముచ్చిలిగుంట దాకా
వెన్నెముకను అలాకనగా తాకుతారు. దాని చేత బిడ్డకు
చక్కిలిగిలి యేర్పడుతుంది. కొంత దూరము ఓర్చుకోవచ్చునుగాని,
ముచ్చిలిగుంట చేరువకు రాను రాను చక్కిలిగింతను
నిబ్బరించు కోవడము సాధ్యము కాకపోతుంది. నిబ్బరించుకోలేక
చక్కిలిగింతపడి బిడ్డనవ్వును. నవ్వితే దొంగ, నవ్వకుంటే దొర అని నిర్ణయము.
'నవ్వినావులే' అని చక్కిలిగిలి పెట్టినవారు గేలిచేస్తారు. అందుకని బిడ్డ
చక్కిలిగిలి పడకుండా నిబ్బరించుకునేటందుకు ప్రయత్నించును.

.......

 

దీపారాధన
రక్ష రక్ష!
సంధ్య రక్ష!

సర్వ రక్ష!
దీపరక్ష!
దివ్య రక్ష!
చిన్ని నా అబ్బాయికి
శ్రీరామ రక్ష!

(దీపం పెట్టగానే దీపానికి అరచేయి చూపి,
అబ్బాయి కండ్లకు అద్దుతూ ఈ పాట పాడుతారు.)

ఒద్దిక కలిగిన భార్య!

వేమన శతకం!
.
ఆనుకూల్యము గల అంగన కలిగిన
సతికి పతికి పరమ సౌఖ్యమమరు
ప్రాతికూల్యయైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినురవేమ!

.ఒద్దిక కలిగిన భార్య ఉన్నట్టయితే ఆమెకూ ఆమె భర్తకూ సుఖ సంతోషాలు సమకూరి ఆ కాపురం ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది. విరుద్ధమైతే మాత్రం ఆ దాంపత్యం నిలువదు. అట్లాంటప్పుడు ఆమెను వదిలెయ్యటం తప్ప గత్యంతరం లేదు అంటున్నాడు వేమన.
ఇది 17వ శతాబ్దంలో చెప్పిన పద్యం. మూడున్నర శతాబ్దాలు గడచిపోయాయి.
భార్యాభర్తలిద్దరికీ అసలే పడకపోతే ఇద్దరూ విడిపోవడం ఇద్దరికీ మంచిది. ఇక్కడ ఇద్దరూ ఒకరినొకరు వదిలేస్తారన్న మాట. కాని ఈ పద్యంలో అతడు ఆమెను వదిలెయ్యాలని ఉంది. అంటే ఇక్కడ పురుషాధిపత్యం ఉంది. ఇది ఒక్క వేమన్న పద్ధతే కాదు వ్యష్టి ప్రత్యేకతకూ సమష్టి ప్రయోజనానికీ సంఘర్షణ ఈనాటిది కాదు. ఒకప్పటి నిరక్షరాస్య స్త్రీకీ, నేటి చదువుకున్న మహిళకూ పరిస్థితిలో మార్పు వచ్చింది.
ఆ కాలంలో ఎదురు తిరిగే భార్యను భర్త పరిహరించాలన్నాడు వేమన. మరి ఈనాడు భర్త భార్యను పరిహరిస్తాడా? భార్య భర్తను పరిహరిస్తుందా, లేక ఇద్దరూ ఒకరినొకరు పరిహరిస్తారా అనేది ఇప్పటిదాకా గడచిన వారి జీవితం నిర్ణయిస్తుంది. వారిని కలిపి ఉంచే బలం వారి కాపురానికి లేకపోతే వారిని కలిపి ఉంచే శక్తి ఏ బాహ్య శక్తులకూ ఉండదనేది లోక సత్యం.

Saturday, September 12, 2015

-భోగినీ దండకము

-భోగినీ దండకము
బమ్మెర పోతన-.. ఇది పోతనామాత్యుడు రాసినది కాదు.. ఎవరో రాసి అయన పేరు పెట్టేరు
అని నా నమ్మకం... ఇది పోతనగారి సైలి కాదు.
.
**సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట**
.
శ్రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు

*

భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్‌ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస్తకంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషు నీకాశయై యుండి దర్శించి తద్వైభవంబుల్‌ విమర్శించి సంతోష బాష్పాంబు పూరంబు వర్షించి హర్షించి కందర్పబాణాహతిం జెంది లోఁ గుంది మోహించి సంగంబు నూహించి యే వేళఁ దల్లిన్‌ బ్రమోషింతు? నేలీల భూపాలకున్‌ జేరి భాషింతు? నేరీతిఁ గామానలంబున్‌ నివారింతు? నేనాతితోడన్‌ విచారింతు? నే వెంట రాచూలి వంచింతు? నేవంకఁ గోర్కుల్‌ ప్రశంసింతు? మున్నేఁ బ్రశస్తార విందంబు నైనన్‌ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబునై యుందుఁబో రత్నహారంబునైనన్‌ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో! యేల యిట్లైతి? నెట్లో గదే! యంచు శంకించుచున్‌ నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్‌ మనోవీథి నంకించుచున్‌ ఘోషమాణాలికిన్‌ మందవాతూలికిన్‌ జంద్రమః కీలికిన్‌ గోకిలారావ దంభోళికిన్‌ జిత్తభూభల్లికిన్‌ దల్లికిన్‌ లోఁగి సంతాప ఘర్మాంబులన్‌ దోఁగి కామానలజ్వాలలన్‌ వేఁగి చింతా భరా క్రాంతయై క్రాఁగి చింతించు నింతిన్‌ బరీక్షించి బుద్ధిన్‌ విచక్షించి తన్మాతమాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత లోకైక విఖ్యాత వారాంగనాధర్మ శిక్షాది సంభూత సమ్మోహితానేక రాజన్య సంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి కూఁతున్‌ బరీక్షించి నీతిన్‌ విచారించి బాలన్‌ గళత్కుంతల వ్రాతఫాలన్‌ గరాంభోజ రాజత్కపోలన్‌ సమందోష్ణ నిశ్శ్వాసజాలన్‌ విపర్యస్త సన్యస్తచేలన్‌ మహాందోళన ప్రేంఖిత స్వర్ణడోలన్‌ మృగేంద్రావలగ్నన్‌ దయావృష్టిమగ్నన్‌ మనోజాగ్నిభగ్నన్‌ నిరంధన్‌ బరిస్రస్త ధమ్మిల్ల బంధన్‌ సముద్విగ్న మోహాను బంధన్‌ నిరాలాప నాలాపనస్వీకృతానేక కేయూరహారన్‌ గలద్పాష్పధారన్‌ బరిత్యక్త లాస్యన్‌ బరాభూత లీలావయస్యన్‌ బదాలేఖనాలక్షిత క్షోణిభాగన్‌ బరిక్షీణరాగన్‌ విలోకించి బుద్ధిన్‌ విచారించి లోనం బరాయత్తయై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై విన్నయై ఖిన్నయై యున్న భావంబు భావించి నెయ్యంబు గావించి రావించి..
రీమన్మహామంగళాకారు నాకారలక్ష్మీకుమారున్‌ గుమారీమనోరాము రామాంబరీషాది రాజన్య రాజద్యశఃకాముఁ గామాహితక్షీరవారాశి తారేశ వాగీంద్ర నాగేంద్ర మందార కుందార విందాభ్ర కల్లోలినీకాశ విఖ్యాత సత్కీర్తి ముక్తావళీ భూషితాశాంగనాలోక సీమంతు సీమంతినీ మానసారామవాటీ వసంతున్‌ వసంతావనీనాథ సంసేవితాంచత్పదాంభోజు నంభోజరాజీ సుహృత్తేజుఁ దేజోజయప్రాభవోద్దాము నుద్దామజన్యావనీ భీము భీమప్రతాపానలాభీలజిహ్వాలి కీలావినిర్మూలితారాతి పాండ్యక్షమాపాల దుర్వారగర్వాటవీవారు వారాధిపోరుప్రభా భాసుర స్ఫార కల్యాణ దుర్వారు వారాశి వేలాపరీతావనీ భార ధౌరేయు ధౌరేయతారాతిరాజన్మహాబాహు బాహాకఠోరాసి ధారావినిర్భిన్న సోమాన్వయోత్పన్న భూభృత్సమూహున్‌ సమూహామహాశేముషీ కుంఠితాశేష శత్రుక్షమావల్లభున్‌ వల్లభామానసేచ్ఛాకలాదుర్లభున్‌ దుర్లభారిక్షమానాథ మత్తేభయూధంబులం జించి చెండాడు రాసింగమున్‌ సింగభూపాలు

**సింగభూపాలునిఁ గాంచి భోగిని మోహించుట**

భూపాలగోపాలగోపాలికాకృష్ణగోపాలు గోపాలదేవోత్సవ క్రీడలో మేడలో నుండి జాలాంతరాళంబులన్‌ వారయోషాతనూజాత విద్యానయోపేత సౌందర్య చాతుర్య విఖ్యాత చంచద్గుణోపేత భృంగాంగనాలబ్ధ కేళీ మహాహస్తకంజాత సంకాశ తూణీనిరుద్ధ ప్రసూనేషు నీకాశయై యుండి దర్శించి తద్వైభవంబుల్‌ విమర్శించి సంతోష బాష్పాంబు పూరంబు వర్షించి హర్షించి కందర్పబాణాహతిం జెంది లోఁ గుంది మోహించి సంగంబు నూహించి యే వేళఁ దల్లిన్‌ బ్రమోషింతు? నేలీల భూపాలకున్‌ జేరి భాషింతు? నేరీతిఁ గామానలంబున్‌ నివారింతు? నేనాతితోడన్‌ విచారింతు? నే వెంట రాచూలి వంచింతు? నేవంకఁ గోర్కుల్‌ ప్రశంసింతు? మున్నేఁ బ్రశస్తార విందంబు నైనన్‌ మహీపాలు హస్తారవిందంబుపై నేఁడు లీలారవిందంబునై యుందుఁబో రత్నహారంబునైనన్‌ శుభాకారు వక్షోవిహారంబుఁ గైకొందుఁబో! యేల యిట్లైతి? నెట్లో గదే! యంచు శంకించుచున్‌ నిత్యకల్యాణు లీలావతీ పంచబాణున్‌ మనోవీథి నంకించుచున్‌ ఘోషమాణాలికిన్‌ మందవాతూలికిన్‌ జంద్రమః కీలికిన్‌ గోకిలారావ దంభోళికిన్‌ జిత్తభూభల్లికిన్‌ దల్లికిన్‌ లోఁగి సంతాప ఘర్మాంబులన్‌ దోఁగి కామానలజ్వాలలన్‌ వేఁగి చింతా భరా క్రాంతయై క్రాఁగి చింతించు నింతిన్‌ బరీక్షించి బుద్ధిన్‌ విచక్షించి తన్మాతమాయాపరాభూత జామాత మిథ్యానయోపేత విజ్ఞాత నానావశీకార మంత్రౌషధవ్రాత లోకైక విఖ్యాత వారాంగనాధర్మ శిక్షాది సంభూత సమ్మోహితానేక రాజన్య సంఘాత వాచాలతాబద్ధ నానామహాభూత యేతెంచి కూఁతున్‌ బరీక్షించి నీతిన్‌ విచారించి బాలన్‌ గళత్కుంతల వ్రాతఫాలన్‌ గరాంభోజ రాజత్కపోలన్‌ సమందోష్ణ నిశ్శ్వాసజాలన్‌ విపర్యస్త సన్యస్తచేలన్‌ మహాందోళన ప్రేంఖిత స్వర్ణడోలన్‌ మృగేంద్రావలగ్నన్‌ దయావృష్టిమగ్నన్‌ మనోజాగ్నిభగ్నన్‌ నిరంధన్‌ బరిస్రస్త ధమ్మిల్ల బంధన్‌ సముద్విగ్న మోహాను బంధన్‌ నిరాలాప నాలాపనస్వీకృతానేక కేయూరహారన్‌ గలద్పాష్పధారన్‌ బరిత్యక్త లాస్యన్‌ బరాభూత లీలావయస్యన్‌ బదాలేఖనాలక్షిత క్షోణిభాగన్‌ బరిక్షీణరాగన్‌ విలోకించి బుద్ధిన్‌ విచారించి లోనం బరాయత్తయై చిత్తజాతాసిధారాచలచ్చిత్తయై విన్నయై ఖిన్నయై యున్న భావంబు భావించి నెయ్యంబు గావించి రావించి


-కరుణశ్రీ గారి మందార మకరందాలు -


-కరుణశ్రీ గారి మందార మకరందాలు -
.
పుష్పవిలాపము.

ఉ.

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో

రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళువిప్పి "మా

ప్రాణము తీతువా" యనుచు బావురుమన్నవి - క్రుంగిపోతి - నా

మానసమం దెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై.

ఉ.

ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా

తీయత దిద్ది తీర్తుము - తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై

నూయల లూగుచున్ మురియుచుందుము - ఆయువు దీరినంతనే

హాయిగ కన్ను మూసెదము - ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై.

ఉ.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం

గాలకు విందు సేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే

త్రాలకు హాయి గూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో

తాళుము త్రుంపబోవకుము ! తల్లికి బిడ్డకు వేఱు సేతువే !

ఉ.

ఊలుదారాలతో గొంతు కురి బిగించి

గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము

అకట ! దయలేనివారు మీ యాడువారు.

ముద్దుల నా యెంకి

యెంకి పాటలు నండూరి సుబ్బారావు
.
ముద్దుల నా యెంకి
గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
.
కూకుండ నీదురా కూసింతసేపు!
నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది
.
యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది
.
దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
యీడుండ మంటాది యిలుదూరిపోతాది
.
యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥
మందో మాకో యెట్టి మరిగించినాదీ
.
వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

Thursday, September 10, 2015

కిన్నెరసాని పాటలు కిన్నెర దుఃఖము! . (శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)


కిన్నెరసాని పాటలు కిన్నెర దుఃఖము!
.
(శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)
.
హా యని కిన్నెర యేడ్చెన్‌
తన మనోహరుడు శిలయైనా డని
తా నేమో యీ వాగైనా నని
హా యని కిన్నెర యేడ్చెన్‌
ఊగులాడు కెరటాల నాపుకొన
సాగులాడు తరగల్లు నిల్పుకొన
ప్రాకిపోవు తనగుణము చంపుకొన
చాలక చాలక చాలక చాలక
హా యని
తన తొందరయును తన పతి ప్రేమయు
తాను చేసినా తెలివితక్కువయు
తన పతి చూపిన త్యాగగౌరవము
తలచుకు తలచుకు బోరున బోరున
హా యని
ఏడుపు నిప్పుక లెగసి చిమ్ముకొని
ఏటి నీరముల నెండగట్టుకొని
చేటు తప్పిపోయేటిరీతిగా
బాట యేల కనరాదని రాదని
హా యని
చుక్కనైతె యీ బెడద తప్పునే
మొక్కనైతే యీ వగపు తప్పునే
అక్కట నా చెలువునిదెస చేసిన
యిక్కలుషము నే దాటు టెట్టులని
హా యని
కడలి లోకముల నేలేరాజట
కడలి ధర్మములు నిలిపే దొరయట
కడు పతివ్రతల కవయ నెంచుటలు
కడలికి తగునా తగునా యిట్లని
హా యని
అతడు మంచివాడే యగునేమో
సతి వాగై ప్రవహించిన దం చన
అతనికోసమే అయిన దటంచును
మతి తలపోయుట తప్పెట్లగు నని
హా యని
ఏడ్చి ఏడ్చి జలమెల్ల నెర్రనయి
ఏడ్చి ఏడ్చి తనువెల్ల నల్లనయి
ఏడ్చి ఏడ్చి నురుసుల్లు తెల్లనయి
ఏడ్చి ఏడ్చి నడకల్లు వేగమయి
హా యని
బొట్టు బొట్టు కొక వేయియెదలుగా
తరగ తరగ కొక వేయినోళ్ళుగా
బడలి నీరమే యేడుపుమయమై
కడలిమ్రోత లెక్కుడు భయమిడగా
హా యని
గాలిపొరలలో కదలాడినవో
అడవిచెట్లలో అణగారినవో
వెలుగు దారులను విచ్చిచొచ్చినవో
కిన్నెర ఏడుపు సన్నని యెలుగులు
హా యని
కిన్నెర యేడుపు సన్నని యెలుగులు
విన్న యడవిలో చిన్ని పులుగుగమి
కిన్నెరతో పాటుగ గొంతులలో సన
సన్నని యేడ్పులు జాలు వార్చగా
హా యని
శిలయైన పతిం దెలచిన గాలులు
మెల మెల్లగ తన తరగల నూగగ
చలచల్లన ప్రాణమ్ములు తేరగ
తలచిన కొలంది దుఃఖము పొంగగ
హా యని
క్రొత్తవాగు పరతెంచి వచ్చె నని
క్రొత్తతోగు పరతెంచి వచ్చె నని
క్రొత్త క్రొత్త యాబాలనీరములు
క్రోలగ వచ్చిన పులులు దిగుల్వడ
హా యని
ఎక్క డెక్కడీ మృగములు వచ్చెను
ఎక్క డెక్కడీ పులుగులు వచ్చెను
ఎక్క డెక్కడీ గాలులు వచ్చెను
కిన్నెర నోదార్చుటకై పాపము
హా యని
కిన్నెర యేడుపు చూచి పులుగులూ
కిన్నెర దుఃఖము చూచి మృగములూ
కిన్నెర యేడుపు చూచి గాలులూ
ఓదార్చగలే కవియు నేడ్చెనూ
హా యని
చూడవచ్చినా లేడి కిన్నెరా
గాడివారినా యెడదలోపలా
వాడి వాడి లేజివురు వత్తలై
బేడిస కన్నుల నీరము వెట్టగ
హా యని
ఒడ్డునందు కుందేటికూన లవి
చిన్ని చెవులు తెగ నిక్కపొడుచుకొని
ముందుకాళు లింపొంద నెత్తి యో
దార్చలేక తెల్లతెల్ల వోవగా
హా యని
గూళ్ళలోన తమ పిల్లల వదలెను
మేతకొరకు పోవాలని మానెను
అడవి పులుగులూ లల్లల్ల చేరుకుని
అడవివాగు నోదార్చవచ్చెనూ
హా యని
పికిలి పిట్టలూ అడవి పిచ్చికలు
నీటి పులుగులూ నేలపులుగులూ
తెగగుమికట్టిన తెలుగు పిట్టలం
దొకటి యేడ్చి మఱియొకటి యేడ్వదా
హా యని
కిన్నెర యేడుపు సన్నని యెలుగులు
మిన్ను మన్ను నడి యెడము నెడమునా
చిన్ని వెలుగులో పిన్న గాలిలో
సన్న సన్నగా జాలువారగా
హా యని
చిన్ని కిన్నెరా సన్నని యెలుగులు
పిన్నగాలి కెరటాల చొచ్చునూ
ఎన్నడొ వెనుకటి బ్రతుకున మిక్కిలి
విన్నవాటివలె విరవిరబోవును
హా యని
చిన్ని కిన్నెరా సన్నని యెలుగులు
చిన్ని చెట్ల క్రొంజివురు లంటునూ
ఎన్న నందనము గున్న మావులం
దున్న తుమ్మెదలరొదవలె మొరయును
హా యని
పడతి కిన్నెరా ప్రన్నని యెలుగులు
అడవి పచ్చికలయందున ప్రాకును
అడవి పావురా యెడబాటగ్గికి
గుడగుడ గొంతున కూసిన యట్లగు
హా యని
అల్ల నల్ల కిన్నెర యేడుపులవి
వెల్లివిరిసి గోదావరి కెరటము
లల్లలాడు నా నడిమిసందులో
మెల్లగ దూరెను మొదలిడు పోలిక
హా యని
అల్ల నల్ల కిన్నెర యేడుపు లవి
మెల్ల మెల్ల గోదావరి గర్భము
వెల్లిలోన చొరబారి మొత్తుకొని
గొల్లుమనుచు మొరపెట్టుకొన్నయవి
హా యని
గోదావరి యీవార్త విన్నదీ
గోదావరినది గుండె కరగినది
గోదావరినది జాలి పొందినది
గోదావరి కన్నీరు కార్చినది
హా యని
గోదావరినది పొంగి వచ్చినది
గోదావరి తా నభయ మిచ్చినది
గోదావరి కెరటాలు చాచినది
గోదావరి రమ్మన్నది కిన్నెర
హా యాని
కిన్నెర యెదలో పొంగిపోయినది
కిన్నెర యెదలో తాండవించినది
కిన్నెర మఱి కన్నీరు కార్చినది
కిన్నెర తనకత చెప్పుకున్నదీ
హా యని
కిన్నెర తన కెరటాలు తగ్గినది
కిన్నెర తన యూగిసల నాపినది
కిన్నెర గోదావరి కెరటాలకు
చిన్ని యలలు తా నంది యిచ్చినది
హా యని.

శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.!

శ్రీ రామదాసు కీర్తనల్లో సీతమ్మవారి ప్రస్తావన.!

'శ్రీ భద్రాచల రామదాసు.' రామదాసు గొప్ప రామభక్తుడు. సీతారామచంద్రులను తల్లిదండ్రులుగా ఎంచి, ఆయన ఆలపించిన ప్రతి కీర్తనలో భక్తి-జ్ఞాన-వైరాగ్యాలు, శ్రవణ-కీర్తన-స్మరణము వంటి నవవిధ భక్తిరసాలు ఉట్టిపడుతూ ఉంటాయి

.

(- జానకి పెండ్లి ఆడినప్పుడు నెత్తి బియ్యం నేను తెచ్చివుందునే...

- సీతమ్మకు హరికి ఆకులు నేను ముడిచి ఇచ్చి ఉందునే...

- కనక మృగమును... అయ్యో! అమ్మకు నేను తెచ్చియుందును గద...

- రావణుడు సీతమ్మను చెరబట్టగ, నేను ధైర్యము చెప్పియుందునే..

- అమ్మ జాడ నేను తెచ్చి యుందునే...)

శ్రీరాములతో ఆహా ! పుట్టనైతిని రఘు రాములతో

అయ్యో ! పుట్టనైతిని శ్రీరాములతో పుట్టి సేవలు జేయనైతిని // పల్లవి //

దశరథ నందనుడై దాశరథి రాములు 

వశముగ బాలురతో వరదుడై యాడంగ

వనజ నాభునకు నే భక్తుడనై 

భయ భక్తి ప్రేమలతోడ శ్రీరామ రామ // ఆశ //

సకల సేవలు సలుపుచు మురియుచు

అకట ! నల్గురతో నాడు కొందును గద

అయోధ్యా నగరిలో గజమునెక్కి 

అచ్యుతుడు వెడలి రాగాను // ఆశ //

నాట్యమాడుచు నను రక్షింపు మందును ;

విశ్వామిత్రుని వెంట పోగానే పోదును

జనకుడు హరికి జానకిని పెండ్లి సేయగా

వారిద్దరికి నెత్తి బియ్యము నేదెత్తును // ఆశ //

అమ్మకు హరికి నాకులు మడిచిత్తును ; , నరులార !

ఇతడే నారాయణుడని జాటుదును

; , మనలను రక్షించే, మాధవుడు వచ్చెనందును

; , మన గతి ముందు ఏమందును // ఆశ //

బలిముఖులకు గల బలము జూతుగద 

శుభరాములతో సొంపు కందుగద

లక్ష్మణాగ్రజుడు సేనను రావించి 

లక్ష్మి కొరకు కపులు లంక జుట్టగ

రక్షించు భద్రాద్రి రామదాసుడని 

రణములో రావణుని ద్రుంతును

ఆ క్షణమున రఘువరుని అప్పుడే బిలుతును 

మంగళ పతివ్రతను మాధవుకర్పించి మురియుదు // ఆశ //

నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…


నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…
.
కవి సామ్రాట్టు విశ్వనాథ వారి మాట కరుకు, మనసు వెన్న అని అనడానికి ఒక చిన్ని ఉదాహరణ. చాలు..ఓ రోజు ఓ కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు.
ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది.
ఆ అబ్బాయి ”విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? ” అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది.
ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా .. దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు.అసలే పేరు మోసిన కవి..
ఇతను వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నారాయన ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు.
” నీ పేరేమిటి ? ” అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు…. ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. ” ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? ” అనడిగాడు. ” ఆయనతో నీకేం పని ” అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. ” పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ” అన్నాడా అబ్బాయి తాపీగా. అంతే… ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది
. ” వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది ” అని గయ్యిమన్నారు.
దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన్ని క్షమించమన్నాడు ఆ అబ్బాయి. . అంతే ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది. ఆ అబ్బాయిని లేవదీసి…” లేరా అబ్బాయీ .. నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ

నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా “…… అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పమ్పారుట.

Wednesday, September 9, 2015

పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!

పోతన గారి శ్రీ కృష్ణ భక్తి.!
(శ్రీ పద్మ విభూషణ నారయణ రెడ్డి గారి పరిశిలన.)
నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది.
రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది ప్రధానంగా సఖ్యభక్తి. అనుషంగికంగా ఆ సఖ్యం చుట్టూ స్మరణవందన పాదసేవనాదులు పరివేషించక పోలేదు.
మరి మధుర భక్తికి మూలమేది? జీవాత్మ పరమాత్మల వియోగం. అఖండ పరమాత్మనుండి ఖండశః అంశతః విడివడిన జీవాత్మలు ఆ మూలాత్మను కలుసుకోవాలనే తపనమే భగవద్రతిభావనకు ప్రాతిపదిక. త్రేతాయుగంలో మునులు, ద్వాపర యుగంలో గోపికలు భగవద్విరహంలో సంతప్తలైన జీవాత్మలు. గోపిక లున్నారు. వాళ్ళకు ఇళ్ళూ, వాకిళ్ళూ ఉన్నాయి. కొందరికి పతులూ, సుతులూ ఉన్నారు. అయినా శారదయామినిలో యమునా తీరంలో బృందావనిలో గోపాలుని మురళీగానం ఆలకించగానే అన్నీ మరచి పరుగులు తీస్తారు. బృందావని చేరుకొని నందకిశోరుణ్ణి కానక రసోన్మాదంలో ఎలుగెత్తి పిలుస్తారు. ఆ మోహనమూర్తిని పదేపదే స్మరించుకొని ఇలా ఆక్రందిస్తారు -
"నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁ డొకఁడు చెల్వలమానధనంబు దోచె నో
మల్లియలార! మీ పొదల మాటున లేఁడుగదమ్మ! చెప్పరే!"

మధ్యమధ్య ఆ మాధవుడు, ఆ గోపికా మనోభవుడు తళుక్కున మెరుస్తాడు. అంతలోనే అంతర్హితుడౌతాడు. అప్పుడు గోపికల వియోగవిధురహృదయాలు ఇలా సంభ్రమిస్తాయి -
"అదె నందనందనుం డంతర్హితుండయ్యెఁ - బాటలీతరులార! పట్టరమ్మ!
హేలావతులఁ గృష్ణ! యేల పాసితివని - యైలేయలతలార! యడుగరమ్మ!
వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా - చూతమంజరులార! చూడరమ్మ!
మానినీమదనుతో మారాక యెఱిఁగించి - మాధవీలతలార! మనుపరమ్మ!
జాతిసతులఁ బాయ నీతియె హరి కని
జాతులార! దిశలఁ జాటరమ్మ!
కదళులార! పోయి కదలించి శిఖిపింఛ
జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ!"
సమస్త చరాచర జీవకోటికి అధినాధుడు మాధవుడు. ఆ మాధవుడే తమధవుడని భ్రమించినారు గోపికలు. ఆ భ్రమావరణమే వారి మనస్సుల మీద మోహయవనికలను కప్పింది. ఆ ముగ్ధప్రవృత్తే మధురభక్తికి మూలం. ఈ మధురభక్తిని రాసక్రీడాది వర్ణనంలో హృదయంగమంగా చిత్రించినాడు పోతన్న.