Sunday, December 31, 2017

భగీరధ ప్రయత్నం!

భగీరధ ప్రయత్నం!

-

భగీరధుడు ఘోర తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగను భువికి దించి తన పితరులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు. 

ఇదీ సాదారణంగా అందరికీ తెలిసిన కధ.కానీ భగీరధుడి పూర్వులకు ఏమైనది? వారికి పుణ్యలోకాలు ఎందుకు కలగలేదు? అంటే మాత్రం ఏ కొద్ది మందో తప్పితే చెప్పలేరు.

.

ఇప్పుడు భగీరధుడు గంగ కోసం తపస్సు చెయ్యాల్సిన అవసరం ఎందుకొచ్చింది? చివరికి ఏమైనది అనేది ఈ ప్రచురణలో వివరిస్తాను

సగరుడు ఇక్ష్వాకు వంశంలోని రాజు. శ్రీరాముని పూర్వుడు. అతనికి యవనాశ్వుడనే పుత్రునితో పాటు అరవై వేల మంది పుత్రులు కలరు. ఒకనాడు సగరుడు అశ్వమేధ యాగము చేయుటకు తలచెను.తలచినదే తడవుగా తన కులగురువును సంప్రదించి సుముహుర్తము నిర్ణయించి యాగము ప్రారంభించెను.యజ్ఞ సమాప్తి అయిన పిదప యజ్ఞాశ్వమును వదలి దానికి రక్షకులుగా సగరుని అరవై వేల మంది పుత్రులు వెడలిరి.ఈ యాగమును చూసి ఇంద్రుడు ఇది తన ఇంద్ర పదవి కొరకై జరుగుతున్న యజ్ఞము గా భావించి దానిని భగ్నము చేయుటకై ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి పాతాళం లో ఉన్న కపిల మహర్షి ఆశ్రమములో దాచెను. అశ్వ రక్షకులైన సగరుని పుత్రులు దాని కొరకై వెదకుచూ అన్ని లోకములలోనూ గాలించి చివరకు పాతళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో తమ అశ్వాన్ని కనుగొని , కపిలుడే తమ అశ్వమును అపహరించినాడని తలచి పరిపరివిధముల కపిలుని దూషించిరి. దానికి మిక్కిలి కోపోద్రిక్తుడైన కపిలుడు వారిని భస్మము చేసెను. 

-

అశ్వ రక్షకులుగా వెళ్ళిన తన పుత్రుల జాడ తెలియక చింతించుచున్న సగరుని అతని మనుమడైన(యవనాశ్వుని పుత్రుడు) అంశుమంతుడు ఊరడించి వారిని గాలించుటకు తాను వెడలెను. అంశుమంతుడు సకల లోకాలనూ గాలించి చివరకు కపిల ముని ఆశ్రమమునకు చేరుకొని అక్కడ తమ యజ్ఞాశ్వమునూ, దాని ప్రక్కననే ఉన్న భస్మ రాశులను చూసి జరిగినది గ్రహించి కపిలుని వద్దకు వెళ్ళి పరిపరివిధముల ప్రార్ధించి తన పితరులకు పుణ్యలోకములు ప్రాప్తించు మార్గమును తెలుపమనెను. దానితో శాంతుడైన కపిలుడు అతనిని ఊరడించి దేవలోకములో నున్న గంగా జలము వారి భస్మ రాశుల పై నుండి ప్రవహించినచో వారికి పుణ్యలోకాలు సంప్రాప్తించగలవని సెలవిచ్చెను.

-

అంశుమంతుడు విచారవదనుడై తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతమును అందరికీ వివరించెను. అంశుమంతుడూ , అతని కుమారుడైన దిలీపుడూ గంగను భువికి తెచ్చు మార్గమును అన్వేషించుచునే పరమపదించినారు. దిలీపుని కొదుకైన భగీరదుడు తన పితరులకు ఎటులైననూ పుణ్యగతులు కలిగించవలెనని యోచించి గంగను గూర్చి తీవ్రముగా తపస్సు చేసెను. అటుల కొన్ని సంవత్సరములు గడచిన పిదప గంగ ప్రత్యక్షమాయెను. ఆమెకు ప్రణమిల్లి భగీరదుడు తన పితరులను పునీతులను చేయమని ప్రార్ధింపగా, తాను దివి నుండి భువికు వచ్చు వేగమును భూమి తాళలేదనియూ , తనను భరించువానిని చూపమని చెప్పి అదృశ్యమయ్యెను. తరుణోపాయము కానక భగీరదుడు బ్రహ్మ గురించి తపమారంభించెను. కొన్నాళ్ళకు బ్రహ్మ ప్రత్యక్షమై గంగను భరించుటకు తగినవాడు పరమశివుడే గాన ఆతనిని గురించి తపస్సు చేయమని సూచించెను. భగీరదుడు పరమశివుని గూర్చి తీవ్రమైన తపస్సు చేసెను. దానికి సంతసించి పరమశివుడు ప్రత్యక్షమై వరము కొరుకోమనగా గంగ భువి నుండి దివికి దిగు సమయమున ఆమె వేగమును భరించుమని వేడగా అట్లే యని తన అంగీకారము తెలిపెను. పిదప భగీరదుడు గంగను ప్రార్దించగా గంగ తీవ్రమైన ఉద్ధృతితో పై నుండి ప్రవహించగా మహదేవుడు అద్భుతముగా తన జటాజూటిలో బంధించెను. మరలా భగీరదుడు శివుని ప్రార్ధించగా తన జటలోనుండి ఒక పాయగా గంగను వదిలెను.అటుల భువికి దిగిన గంగ తన ప్రయాణంలో ఐదు పాయలుగా విడిపోయి ఒక పాయ భగీరదుని వెంట రాగా మిగిలిన పాయలు చెరొక దిశగా నాలుగు దిక్కులకూ ప్రవహించినవి.

-

అటుల భగీరదుని వెంట వచ్చుచున్న గంగలో ప్రజలందరూ పుణ్య స్నానములాచరించి పవిత్రులైరి. అలా వచ్చుచున్న గంగ ఉద్ధృతికి జహ్ను ముని ఆశ్రమమంతయూ జలమయమయ్యెను.దానికి కోపించిన ఆ ఋషి భగీరదుని వెంట వచ్చుచున్న గంగ లోని జలమంతయూ త్రాగి వేసెను. భగీరదుడు ఆ మునిని ప్రార్ధించగా ఆయన తన కర్ణ రంధ్రము ద్వారా గంగను వదిలెను. అలా ప్రయాణిస్తూ చివరికి పాతళంలోనున్న కపిలుని ఆశ్రమం చేరి అక్కడ ఉన్న సగర పుత్రుల భస్మరాశుల పై ప్రవహించి వారి కి పుణ్యలోక ప్రాప్తి కలిగించెను. సగరుల భస్మరాశులు కలిసిన ఆ ప్రదేశం సాగరం గా ప్రసిద్ధి చెందెను. అటులనే భగీరదుని చే భువికి గొని రాబడుటచే భాగీరధి అనియూ, మూడు లోకములనూ పావనము చేసినది గాన త్రిపధగ(ముల్లోకముల లోనూ ప్రవహించునది) అనియూ, జహ్నుముని చే ఉద్ధరింపబడెను కావున జాహ్నవి అనియూ పలు నామములతో కీర్తింపబడుచున్నది.

ఈ విధంగా భగీరధుడు గంగను భువి కి దించి తన పితరులకు పరలోక ప్రాప్తి కలిగించెను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భగీరధుడు తన స్వార్ధం కోసం ఏమీ చేయలేదు. తన పితృదేవులకు పరలోకప్రాప్తి కలిగించాలనేదే అతని ఆశయం.నిజానికి భగీరధుడు అలా చేయకపోయినా ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు. కానీ తనే ఎన్నో కష్టాలను లెక్క చేయక ఈ కార్యాన్ని సాధించాడు.ఇంకొక విషయం ఏంటంటే భగీరధుడు తపస్సు చేసిన ప్రతిసారీ అతనికి ఆ దేవత/దేవుడు ప్రత్యక్షం కావటానికి పట్టిన కాలం కొన్ని వేల సంవత్సరాలు అని గుర్తించాలి . 

-

ఇప్పుడు మీరే చెప్పండి భగీరధుని పేరు ప్రయత్నానికి మారుపేరుగా నిలిచిపోవటం సమంజసమే కద!

-


Saturday, December 30, 2017

-మహాభారతం-ఒక కొత్త విషయాము -10-.

-మహాభారతం-ఒక కొత్త విషయాము -10-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

--

మహభారతంలో శిఖండిది ఒక ప్రత్యేకమైన పాత్ర.భీష్ముడి మీద పగతో అంబ శివునికై తపస్సు చేసి తిరిగి శిఖండిగా జన్మిస్తుంది.అయితే శిఖండి ఎవరికి పుత్రిక గా జన్మిస్తుంది?

-

జ)అంబ పాంచాల రాజుకి శిఖండి అనే కూతురిగా జన్మిస్తుంది.

(శిఖండిని చలన చిత్రాలలో నపుంసకుడిగానూ, ఏమీ చేతకాని వాడి లాగానూ చూపిస్తారు. కానీ నిజానికి శిఖండి జన్మతః స్త్రీ. శిఖండి వరపుత్రిక కావటం వల్ల ఆమెను స్త్రీ లా కాక పురుషుడి లాగా నే పెంచుతాడు 

పాంచాల రాజు.యుద్ధ విద్యలూ నేర్పుతాడు.ఐతే ఆమె స్త్రీ అన్న విషయం తెలియని రాజ పురోహితులు ఆమెకు ఒక రాజకుమారి తో వివాహం చెయ్యతానికి నిశ్చయిస్తారు.చేసేది లేక పాంచాల రాజూ ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి కూతురికి ఈ విషయం తెలిసి శిఖండి స్త్రీ అన్న విషయం అందరికీ చెప్పేస్తుంది.తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకొందామని ఒక గుహలో ప్రవేశిస్తుంది శిఖండి. 

అక్కడ ఉన్న ఒక గంధర్వుడు ఆమె కథ విని జాలి పడి తన పురుష రూపాన్ని ఆమెకిచ్చి ఆమె స్త్రీ రుపాన్ని తాను గ్రహిస్తాడు.ఈ విధంగా శిఖండి స్త్రీగా జన్మించి పురుషుడిగా మారుతుంది.(ఆమెకు పురుష రూపాన్ని ప్రసాదించినందుకు గంధర్వ రాజైన కుబేరుడు ఆ గంధర్వుడి పై కోపించి ఆమె మరణించేంత వరకు స్త్రీ రూపం లోనే ఉండమని శపించటం వేరే కథ.)

-

బాలకృష్ణుడు!

బాలకృష్ణుడు! 

-

"ఘల్లున మ్రోవగ గజ్జెలు

ఘల్లున మ్రోవగ గజ్జెలు

ఝల్లున పొంగెను ఎడదలు జవరాండ్రలకున్

తెల్లని గోవుల వెంబడి

నల్లని గోవిందుడురుక నాట్యపు భంగిన్!

-

నల్లనివాడైన బాలకృష్ణుడు తన తెల్లని ఆవులను తోలుకొని

పోవుటకు సిద్ధమై, వాటివెంట ఉరుకగా, ఆయన పాదములకు

ఉన్న గజ్జెలు ఘల్లుమన్నవి. 

ఆ రవము వినగానే నందవ్రజములో ఉన్న యవ్వనవతుల హృదయములు ఒక్కసారిగా ఝల్లుమని ఆనందంతో ఉప్పొంగాయి.

భట్టుమూ ర్తి వ్రాసిన "వసుచరిత్రలో ఒక పద్యము.

భట్టుమూ ర్తి వ్రాసిన "వసుచరిత్రలో ఒక పద్యము.

-

వాసు రాజు వ్యాహ్యాళి కై వచ్చి ఒక చోట విశ్రమించినాడు.

అప్పుడు ఎక్కడి నుండియో మధుర గానము వినపడెను.

ఎవరో ఒకయువతి మధురముగా పాడుతూ వుంది.

అప్పుడు ఆ రాజు తన వెంట వచ్చిన వయస్యుని (మిత్రుడిని)ఎవరిదీ గంధర్వగానము?పోయి చూచిరా అనిపంపించాడు.

ఆ మిత్రుడు వెళ్లి చూసి వచ్చి ఆమె సౌందర్యమును యిలా వర్ణించాడు.

-

"కమనీయాకృతి యోగ్య కీర్తనలం గన్పట్టు నా శ్యామ, యా 

సుమబాణాంబక, యా యమూల్య మణి, యా చొక్కంపు పూబంతి యా 

సుమనోవల్లరి,ఆ సుధా సరసి యా సొంపొందు డాల్దీవి యా 

కొమరు బ్రాయంపు రంభ, ఆ చిగురుటాకుంబోడి నీకేతగున్ !

-


అర్థము:--ఆమె కమనీయ రమణీయ అవయవ సౌందర్య యౌవ్వనము,ఆమె మన్మధ బాణముల వంటి కన్నులు గలది.(అరవింద,మశోకంచ,చూతంచ,నవమల్లికా, నీలోత్పలంచ పంచైతేపంచ బాణస్యసాయికా ఈ 

ఐదూ మన్మధుని బాణాలు)పద్మరాగ మణి వంటి పెదవులు కలది.పూదీగేల వంటి చేతులు గలది,అమృత సరస్సు వంటి నాభి గలది,చొక్కమైన పూబంతుల వంటి కుచములు గలది,చిగురుటాకుల వంటి పాదములు గలది,అంతేకాక సన్నని దేహము గల్గి మన్మథ బాణము,అమూల్యమైన మణి పూబంతి 

వంటి యింతి ;పూలతీగే అమృత సరస్సు,కాంతి,దేవి యౌవనవతి,రంభ వంటిది చిగురు శరీరము గలది,

ఆ అపురూప సౌందర్యవతి నీకే తగును.నీవు తప్ప ఆమె కెవరూ సరిపోరు.

అనిన మిత్రుడిని జూచి ఆత్రుతగా నీవు ఆమెను కలిసితివా?అని రాజు అడిగాడు.అప్పుడు ఆ మిత్రుడు 

ఆమె తన చెలికత్తెలతో ఒక పొద వద్ద కూర్చునివాళ్ళల్లో వాళ్ళుపాటలు పాడుకుంటూ సరసాలాడు కుంటున్నారు అటువంటి సమయములో అక్కడికి నేను పోరాదు.అని

-

"స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్ 

భోరున లాతివారు చొరబూనినచో రసభంగమంచు,నే 

జేరక పువ్వు తీవెల చెంతనె నిల్చి లతాంగి రూపు క 

న్నారగ జూచి వచ్చితి నవాంబు రుహాంబక నీకు దెల్పగన్!


అర్థము:-రసభంగము చేయని మరొక పద్యము.ఆ వయస్యుడు మరియాద తెలిసినవాడు.యువతులను 

జూచుటకు వెళ్ళినాడు.వారు సంగీతమున నిమగ్నులై యున్నారు.వారు తనను గమనించిన పని చెడిపోతుంది.అందుకని అతను వసు రాజుతో యిట్లనుచున్నాడు.

స్వేచ్చావిహారులైన యువతులు, ప్రౌఢ లైన సారసలోచనలు (తామర రేకులవంటి కన్నులు గలవారు)

వున్నచోటికి హఠాత్తుగా పరాయి మగవారు ప్రవేశించిన యేమగును?రసభంగ మగును.అని నేను వెళ్ల లేదు.

వారి సరస సంభాషణలకు భంగ మగును అని ఒక అర్థము.."సారసలోచనలు" అను పదములో 'రస' అను అక్షర భంగ మయినచో వారు సాలోచనలగుదురు.అదొక చమత్కారము..అసలే పెద్ద కన్నులున్నవారు,నన్ను చూచిన

యింకా కళ్ళు విప్పార్చుకొని వీడెవడు?పానకంలో పుడక లాగ వచ్చినాడు అని సాలోచనలగుదురు.(కన్నులు యింకా పెద్దగా జేసి చూచెదరు)కనుక పూతీగేల నడుమ నుండి ఆ యువతినికన్నుల నిండుగా జూసి నీకు చెప్పవలెనని వచ్చినాను తమ్మికంటీ (తామర రేకుల వంటి కన్నులు కలవాడా!)ఆమె సారసలోచన మరి నీవు సారసలోచనుడవు.(నీవు పోవచ్చును అను అంతరార్థము).

భట్టుమూర్తి ఎంత అద్భుత మైన వర్ణన చేసినాడు కదా!"వసు చరిత్ర" లో వర్ణనలకే అధిక ప్రాధాన్యము యిచ్చినాడు కవి.

-నాయుడు పేట రాజమ్మ-శివ దీక్షా పరురాలనురా !

-నాయుడు పేట రాజమ్మ-శివ దీక్షా పరురాలనురా !

(బాపు గారి చిత్రం.)

-

నాయుడు పేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ.తన జీవితాన్ని శ్రీ కాళహస్తీశ్వరునికి -

చేసిన పుణ్యవతి ఆ దేవ నర్తకి.@ “శివ దీక్షా పరురాలనురా......” అనే పాటను, రాజమ్మ అభినయించింది. ఒక కోనసీమ పండితుడు ఆమె విద్వత్తును ఆమూలాగ్రమూ శోధించ నిర్ణయించుకున్నాడు. ‘ప్రతి హస్తము-’నకూ ఆమెను ఆపే వాడు; 

“ఈ హస్తమునకు, ముద్రకూ శాస్త్ర ప్రమాణాలను వివరించు!” 

అని ప్రశ్నలతో నిలదీసేవాడు.రాజమ్మ ఆతని సందేహాలకు దీటైన జవాబుగా నిలబడగలిగినది. శాస్త్రాల నుంచి శ్లోకములను చదివి, అభినయం చేస్తూ వెంత వెంటనే చూపించినది.“రాజామణీ! నీ విద్య నా హృదయాన్ని కదిలించి, కరిగించినది, ఇవాళ నృత్య కళలో లీనమై, మైమర్చిపోయాను ” తన్మయుడైన ఆ పండితుడు రాజమ్మకు – తన శాలువాను కప్పి, వినయపూర్వకంగా మనసారా గౌరవించాడు.@ శ్రీ కాళహస్తి రాజమ్మ సకల కళా విశారద. ఆమె నిండు పౌర్ణిమ నాటి సంగీత సాగరము, నీటి చెలమ నుండి ఊరే నీటి ఊట వంటిది ఆమె విద్య.స్త్రీ రూప తాండవ నృత్య మహేశుడు ఆమె.ఆమె విద్యలను దీటుగా నేర్చుకోగల విద్యార్ధి అసంభవమే!ఆంధ్ర కళామ తల్లి పూర్వ పుణ్య భాగ్య వశాత్తూ, నటరాజ రామక్రిష్ణ రూపంలో అద్భుత శిష్యుడు ఆమెకు లభించాడు.రామక్రిష్ణ – తన గురువు రాజమ్మ ప్రజ్ఞా, పాండిత్యధురీణతలను చెప్పేవాడు.రాజమ్మ గారికి వచ్చినన్ని పదములు, వర్ణాలు, జావళీలు, సలాం జతులు, మరెవరికైనా తెలుసునంటే సందేహాస్పదమే!రాజమ్మ ఒక చిన్న పద్యాన్ని ఏడు రోజులు అభినయించ గలిగారు. ఏడు కచేరీలలో ఏడు విధాలుగా ఆస్థానములో ప్రదర్శించి చూపగలిగారు.“ఆలయ విద్య” ను అభ్యసించే వారికి, భరత విద్యతో పాటుగా, ఆగమ పద్ధతిని, వివిధ దేవతల ఆరాధించే క్రమాన్నీ, 

జతులను సైతం నేర్పించిన అసమాన విదుషీమణి.

.

శివ దీక్షా పరురాలనురా నేశివ దీక్షా పరురాలనురా

శీలమ ెంత ైనా విడువ జాలనురా

నేశీలమ ెంత ైనా విడువ జాలనురా 

.

నేశివ దీక్షా పరురాలనురా

శివ శివ గురునాజఞమీరనురా 

.

శీీవ ైష్ణవుడెంటేచేరనురా నే.. శీీవ ైష్ణవుడెంటేచేరనురా

నేశివ దీక్షా పరురాలనురా

వడిగా వచ్చి మరము చొరవకురా 

.

శివారిన వేళ తలుపు త రవకురా

శివారిన వేళ నా మడుగు తావి చ రగు తీయకురా

.

మడుగు తావి చ రగు తీయకురా

మాటిమాటికీనోరు మూయకురా

తా మాటిమాటికీనోరు మూయకురా

శివ దీక్షా పరురాలనురా

.

-మహాభారతం-ఒక కొత్త విషయాము -9-.

-మహాభారతం-ఒక కొత్త విషయాము -9-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

-

కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధ్రుతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇస్తానంటాడు కృష్ణుడు.కానీ తన కుమారులు ఒకరినొకరు చంపుకోవటం తాను కళ్ళారా చూడలేనని తిరస్కరిస్తాడు ధ్రుతరాష్ట్రుడు. 

కానీ కృష్ణుడు వేరే అతనికి దివ్య దృష్టి ప్రసాదించి ధ్రుతరాష్త్రుడికి యుద్ధ విశేషాలు వివరించమంటాడు.

కృష్ణుడు ఎవరికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు?

జ)కృష్ణుడి ద్వారా దివ్య దృష్టి పొందేది సంజయుడు

.(ఇతను అర్జునుడికి ప్రాణ స్నేహితుడు.)

-

Friday, December 29, 2017

తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం! (రచన: వెల్చేరు నారాయణరావు.)

తెలుగులో మొదటి నీతి పుస్తకంసుమతి శతకం!

(రచన: వెల్చేరు నారాయణరావు.)

.

1966లో ప్రచురించిన సుమతి శతకానికి పీఠిక రాస్తూ నిడదవోలు వెంకటరావు

సుమతి శతకం మొట్ట మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు 

1868 ఏప్రిల్ 20వ తారీకున ప్రచురించారు అని రాశాడు.

తెలుగులో ఏ పుస్తకానికైనా ఇంత నిక్కచ్చిగా అది ప్రచురించబడిన సంవత్సరం, నెల, తేదీతో సహా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. 

దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఇంత విలువైన సమాచారం వెంకటరావుకి ఎలా దొరికిందో ఆయన వివరించలేదు. 

కానీ ఈ సమాచారాన్ని ఇంకొక ఆలోచన లేకుండా మచ్చా హరిదాసు 

(తథ్యము సుమతి: పరిశోధన వ్యాసాలు, 1984, పే. 67), 

ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, 2002, సంపుటం 1, పే 224) తిరిగి చెప్పారు.

కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు.

ఇలాటి ముద్రణ తాము చూసినట్లు ఏ పరిశోధకుడు నాతో చెప్పలేదు. 

అందుచేత 1870 సంవత్సరపు ప్రచురణనే సుమతి శతకానికి మొదటి ముద్రణగా నేను భావిస్తున్నాను.

.

1930లో ప్రచురింపబడి Director of Public Instruction వారిచే మూడవ తరగతి పాఠ్య పుస్తకముగా ఆమోదించబడిన ‘ఆనంద వాచకము’లో నీతి పద్యములు అనే పేరుతో సుమతి శతకం నుంచి 10 పద్యాలు ఉన్నాయి

.

కందం ఛందస్సు

ఈ రెండు రకాల సుమతి శతకపు పద్యాల నిర్మాణం వివరంగా చర్చించడానికి ముందు కంద పద్యపు ఛందస్సుని గురించి చెప్పడం అవసరం.ఈ వ్యాసం చదివే తెలుగు వాళ్లకి చాలా మందికి తెలిసే వుంటుంది కానీ స్పష్టత కోసం కంద పద్యపు ఛందస్సు స్థూలంగా చెప్తాను. కందంలో చతుర్మాత్రా గణాలే వుంటాయి. నాలుగు పాదాలుంటాయి. రెండో అక్షరం ప్రాస. మొదటి పాదంలోనూ మూడో పాదంలోనూ మూడేసి గణాలుంటాయి. రెండో పాదంలోనూ నాలుగవ పాదంలోనూ అయిదేసి గణాలుంటాయి. రెండవ పాదంలోనూ, నాలుగవ పాదంలోనూ నాలుగవ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలు అక్కర్లేదు. ఉదాహరణకి ఈ కింది పద్యం చూడండి.

అల్లుని మంచితనంబును

గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్

పొల్లిన దంచిన బియ్యము

తెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ

వావిళ్ళ సుమతి శతకంలో మౌఖిక లక్షణాలు

పై పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోతుంది. అంటే మొదటి పాదం లోని వాక్యం ఆ పాదం చివరితో అయిపోకుండా రెండవ పాదంలోకి ప్రవహించి నడిచే పరిస్థితి ఉండదు. అంతేకాక యతి స్థానం దగ్గర కొత్త మాట మొదలవుతుంది. పద మధ్యస్థంగా యతి పడటం, ప్రాస స్థానం దగ్గర కొత్త మాట ఆరంభం కావడం ఇలాంటి క్లిష్టమైన నిర్మాణాలు వావిళ్ళ సుమతి శతకంలో దొరకవు. అంతే కాకుండా వావిళ్ళ సుమతి శతకంలో యతి కోసం, ప్రాస కోసం వేసుకున్న పూరక పదాలు బోలెడు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇందులో ఉన్న 108 పద్యాల్లో 71 పద్యాల్లో పూరక పదాలున్నాయి. అందులో 52 యతి కోసం వచ్చినవి, 19 ప్రాస కోసం వాడినవి.

ఫూరక పదాలు ఎలా వుంటాయో చెప్పడానికి ఒక జాబితా యిస్తున్నాను: ఇలలో, భువిలో, మహిలో, మెదిని, వసుధను, ఎరుగుము, తెలియుర, నయమిది, మరి, నిక్కము, తథ్యము, సిద్ధము, సహజము, గదరా, …ఇత్యాది.

మామూలుగా ఈ కాలపు పండితులు ఈ పూరక పదాల్ని వ్యర్థపదాలంటారు. కానీ మౌఖిక ప్రచారంలో వున్న పద్యానికి ఇవి చాలా విలువైనవి. ఒకటి ఇవి ఎలా వుంటాయో ముందో ఊహించడం చాలా తేలిక. అంచేత పద్యం జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. పద్యం తాలూకు అర్థపు బరువును పెంచకుండా నిర్మాణ సౌష్టవాన్ని, శబ్దసుభగత్వాన్ని ఈ పదాలు నిలబెడతాయి.

వావిళ్ళ సుమతి శతకంలో చాలా పద్యాలు నిర్మాణంలో కూడా ఒక రకమైన పునరుక్త వాక్యాలను అనుసరిస్తాయి. అందుచేత వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం తేలికవుతుంది. ఉదాహరణకి:

నవ్వకుమీ సభలోపల

నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్

నవ్వకుమీ పరసతితో

నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ

ఈ పద్యంలో చివరి ముక్క నయమిది అనే పూరక పదంతో ప్రారంభం కావడం గమనించండి. అంటే కవికి ‘నా’తో మొదలయ్యే సార్థకమైన మాట వెతకవలసిన అవసరం తప్పిందన్న మాట.

-

పుచ్చు పప్పులు -

-

-పుచ్చు పప్పులు -

-


జ్యోతి' పత్రికలో అచ్చుతప్పులపై ఆరుద్ర "ఆరుద్ర బాతాఖూనీ" పేరిట ఓ శీర్షిక నిర్వహించేవారు. అందులో కొన్ని అచ్చు తుప్పులు చెత్తగించండి! )

.

'చల్ మోహన రంగా ! నీకు నాకు జోడు కరచెను గదరా!

.

చచ్చు బుడ్డి బాగా వెలగదు.!

.

డాక్టర్లు రోగుల పర్సు చూసి వైద్యం చేస్తారు!

.

అక్షరాలు మారటం వల్ల అర్ధం ఎలా మారుతుందో ఆరుద్ర చమత్కారంగా చెప్పారు!

. ......... 

కార్టూను .. ఆర్భక్ .!

పెళ్లి కొడుకు అసలే సన్నం ... దండ నిలవలెదు.

-

కొన్ని నిజాలు.!

-
కొన్ని నిజాలు.!

ఏమతం ?

1440 సంవత్సరములకు పూర్వము ఇస్లాం లేకుండెను.

2018 సంవత్సరములకు పూర్వము క్రైస్తవ మతములేకుండెను.

2500.సంవత్సరములకు పూర్వము బౌధ మతములేకుండెను.

అలెగ్జాండరు భారతదేశం పై దండయాత్ర చేసిన తదుపరి,

సింధూనది పరివాహక ప్రదేశమును "హిందూ " దేశముగా పిలవ బడెను

ఇందు నివసించివారు హిందూవులుగా పిలువబడిరి.

5115 సంవత్సరములకు పూర్వము, ఈ భూభాగము, జంబూద్వీపములో

భరతవర్షములో భరత ఖండముగా మేరుపర్వతమునకు (హిమాలయ) దక్షిణ

దిగ్భాగమందున్నదని భారతీయులచే కీర్తింపబడుచుండెను.

ఆ సమయమందు, ఈ భూభాగమందు వేదోక్త సనాతన సాంప్రదాయ జీవన విధానముండెను.

2085 సంవత్సరములకు పూర్వము, ఈ వేదోక్త సనాతన సాంప్రదాయమునుండి వివిధ శాఖలుత్పన్నమై, స్వతంత్ర మతములుగా ప్రభవిల్లెను.

అవి.... బౌధ్ధ, జైన, చార్వాక, గాణపత్య శాక్తేయ, పాశుపత, వీరశైవ ఇత్యాది స్వతంత్రమతములు, వాటినిర్మాతలు, సాహిత్యము, బలమైన సాంప్రదాయములు, జీవనవిధానము, పరస్పరవిబేధములు, నిందలు, దూషణలు, ఆధిపత్య పోరులు కొనసాగుచుండెను.

మరలా

1194 సంవత్సరములకు పూర్వము, ఆదిశంకరాచార్యులవలన. ఈ విరోధాభాసములు నిర్జింపబడి, కేవలము, వేదోక్త సనాతన ధర్మ ము, జీవనవిధానముగా నిర్దేశింపబడి, సమస్త భారతీయులచేత అంగీకరింప బడి వ్యాప్తి చెందుచూ వచ్చెను.

మహమ్మద్ ఘోరి, ఘజినీల దండయాత్రలవలన భారతదేశమందు తురుష్క మతప్రవేశము జరిగెను, తదాది 1000 సంవత్సరములు మహమ్మదీయుల ఆక్రమణలోఅసంఖ్యాత భారతీయులు, స్వేఛ్ఛతోగాని, బలవంతముగా గాని ఇస్లాం శరణు జొచ్చిరి. తదాదిగా ఈ భారత దేశమందు ఇస్లాం వ్యాప్తిచెందెను.

మరలా

ఆంగ్లేయులు.... మహమ్మదీయ రాజులను, పాలకులను చతుర్విధోపాయములతో నిర్జించి

తమ పాలన కొనసాగించిరి, ఆసమయమందు అనేకములగు ఆమిషలచేత ,భారతీయులు క్రైస్తవులుగా మతమార్పిడికి లోనైరి.

ప్రస్తుతము ఈ భారతదేశమందున్న ముస్లిములుకాని, క్రైస్తవులు గాని ఒకానొక సమయమందు మతమార్పిడికి లోనైనవారే.

ఆంగ్లేయులు, ఈ భారత దేశమునకు కొత్త నామకరణము చేసి. ఇండియా అని పిలుచుట ప్రారంభించిరి.

ఈ పైకారణములచేత,మరలా మతమార్పిడులకు లోనైనభారతీయులు, తిరిగి స్వధర్మమును

స్వీకరించుటలోఆటంకములుండరాదు.

ఈ విధముగా స్వధర్మాను రక్తులైన ప్రజల సంఖ్య ఈ భారతమందధికమైనయడల, కుహనా లౌకికవాదులకు రాజకీయ భవిష్యత్తు సూన్యమగునని,గుబులుతో దిగులు చెంది, నానావిధ ఆటంకములు కలుగచేయుచున్నారు.

జయతు జయ సనాతన ధర్మము .

-

మన కాయగూరల సంస్కృతం పేర్లు!

మన కాయగూరల సంస్కృతం పేర్లు!

-


-అవాక్పుష్పీ (బెండకాయ)

-జంబీరమ్ (నిమ్మకాయ)

-ఆలుకమ్ (బంగాళదుంప)

-ఉర్వారుక (దోసకాయ)

-కారవేల్ల (కాకరకాయ)

-కోశాతకీ (బీరకాయ)

-బృహతీ (ముళ్ళవంకాయ)

-మరిచకా (మిరపకాయలు)

-రాజకోశతకీ (కాప్సికం)

-లశున (వెల్లుల్లి)

-వార్తాక (వంకాయ)

-బింబమ్ (దొండకాయ)

-శీతలా (సొరకాయ)

-క్షుద్రశింబి ( గోరుచిక్కుడు)

-పలాండు (ఉల్లిగడ్డ)

-కూష్మాండ (గుమ్మడికాయ)

-తౄణబిందుక (చేమదుంపలు)

-మూలకమ్ (ముల్లంగి)

-రంభాశలాటు (పచ్చి అరటికాయ)

-సూరణ (కంద)

.

#నోట్:: వీటిని గుర్తుపెట్టుకోవాలంటే 

వీటిని తిట్లుగా వాడాలి అలా అయితేనే 

ఈజీగా గుర్తుపెట్టుకోగలం 😂😂😂

-ఊర్వారుక (దోసకాయ) -

-ఊర్వారుక (దోసకాయ) -

-

ఊర్వారుక (దోసకాయ) " అనే పదము మృత్యుంజయ స్తోత్రంలో వస్తుంది. "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం, ఊర్వారు కమివ భందనాత్....."

అంటే దోస కాయ పండు అయి ఎలా సహజంగా రాలి పోతుందో (అనాయాస మరణం) అలాంటి మృత్యువును ప్రసాదించు స్వామి 

అని ఈ శ్లోకము లో వుంటుంది. 

మహిళలు కొత్త మహిళా విధానం -

మహిళలు కొత్త మహిళా విధానం -

-

మహిళను సెక్స్ సింబల్స్ గా వస్తు విక్రయానికి బ్రాండ్ ఎమ్బాసిడర్లుగా మార్చి చూపింటచటమూ పతనానికి కారణమే ,కారు నుండి బారు సబ్బు వరకు స్త్రీ లనే ఆడ్స్ కు వాడి వారిని అవమానిస్తున్నారు . వారిది తెలుసుకోకుండా అందులో ధన సంపాదనే చూసుకొని మోస పోతున్నారు .ఇతర పాశ్చాత్య దేశాల కంటే డ్రెస్ కోడ్ విషయం లో ఇండియా కు ప్రత్యేకత ఉండేది. ఇప్పుడా సరిహద్దు చెరిపేశారు .చానళ్ళ ప్రకటనలో సెక్సీ గా హక్సీ గా మాట్లాడటం ఎక్కువై .ఇది వరకు ఎప్పుడో కాని విని పించని సెక్స్ పదం ఇవాళ ఒక మంత్రమే అయింది .ఇది దారుణం .ప్రతిదానికీ ‘’సెక్సీ సెక్సీ ‘’అంటూ రోదచేసి దాని పవిత్రతను బజారు పాలు చేస్తున్న్నారు .ఒకప్పుడు బ్రిటన్ లో మహిళా వోటు హక్కు కోసం ఉద్యమం చేసి అరవై ఏళ్ళ పోరాట ఫలితం గా పొందారు. తరువాత సమాన హక్కుల ఉద్యమం చేసి సాధించారు .ఇప్పుడు సంస్కృతిలో సెక్స్ విపరీత ధోరణుల చొరబాటు (హైపర్ సేక్సువలై జేషన్ )పై ఆందోళన చేస్తున్నారు .ఇది అయిస్టతకు ఒక చిహ్నమే .


ఇప్పుడు మహిళలు కొత్త మహిళా విధానం _

(న్యూ వేవ్ ఆఫ్ ఫెమినిజం )పై ద్రుష్టి పెట్టారు .దీనివలన స్త్రే పురుషుల మధ్య శక్తి సంబంధాలపై బలమైన ముద్ర పడుతుంది .సమాన హక్కులు సమాన హోదాలు జీతాలు మహిళలు సాదించుకొన్నారు .బ్రిటన్ లో కొన్ని మార్పులొచ్చాయి .పెళ్ళిలో రేప్ చట్ట వ్యతిరేకమైంది .పని చేసే చోట సెక్సువల్ హెరాస్ మెంట్ జరిగితే కోర్టులో కేసు వేయ వచ్చు .ప్రసూతి సెలవు పొందారుమహిళలు .కేధలిక్ ల కబంధ హస్తాల నుండి విడిపించుకొన్న ఐరలాండ్ దేశం లో ఇప్పుడు సుఖ శాంతులేక్కువగా ఉన్నాయిసెక్స్ ను అర్ధం చేసుకోవటం లో అనేక పద్ధతులు కలిసి కట్టుగా పని చేస్తున్నాయి .అతి సెక్స్ పై వెనుకడుగు వేస్తున్నారు .ఇది శుభ సూచకమే .


Thursday, December 28, 2017

ఇది రాజ రవి వర్మ చిత్రం.

శుభోదయం !

ఇది రాజ రవి వర్మ చిత్రం.

18వ శతాబ్దంలో కేరళకు చెందిన స్త్రీలు తమ ఎదల పైన ఆచ్ఛాదన లేకుండానే చీరెలు ధరించేవారు. 20 శతాబ్దం ప్రారంభం వరకు ఈ సాంప్రదాయం వుండేది.

కేరళకు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు సంస్థానాధీశుడైన రాజారవి వర్మ గీసిన చిత్ర పటాల్లో ఈ సాంప్రదాయం ప్రస్ఫుటమవుతుంది. 

కాగా 20 శతాబ్దం ప్రారంభంలో ట్రివాన్‌ కూర్‌ రాజు ఇలాంటి సాంప్రదాయాన్ని తొలగించి నివి (రవిక) ని ధరించడం అనివార్యం చేశాడు.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, మానవీయ విలులను పరిరక్షించడంలో 

చిత్రకారుడు రాజారవి వర్మ చేసిన కృషి చిరస్మరణీయము.

నిజం...మనకు సిగ్గులేదు...

నిజం...మనకు సిగ్గులేదు... 

అమ్మా.. నాన్నలను మరచిపోయెం.. ముమ్మిదాడికాలందాపురించింది...

నేను చిన్నపుడుచదివిన విజయవాడసత్యనారయణపురం 

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మునిసిపల్ స్కూలు లో కూడా తెలుగు మీడియంనుంచి 

ఇంగ్లీషు మీడియం మార్చారు అని గొప్పగా నా మనవలు వయసు పిల్లలు 

చెప్పితే సిగ్గువేసింది.

-మహాభారతం-ఒక కొత్త విషయాము -8-.

-
-మహాభారతం-ఒక కొత్త విషయాము -8-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

.-

యుద్ధ ప్రారంభ సమయంలో ధర్మరాజు ఇరుపక్షాల లో ఎవరైనా పక్షం మారాలనుకుంటే మారవచ్చని ప్రకటిస్తాడు.

ఆ సమయం లో ఎవరెవరు తమ పక్షాలు మారతారు?

జ)ధర్మరాజు చేసిన ప్రకటనతో పక్షం మారేది యుయుత్సుడు.

-

(ఇతను ధ్రుతరాష్త్రుడికి ఒక దాసి వల్ల జన్మిస్తాడు.

పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళే సమయం లో బాలుడైన 

పరీక్షిత్తు ను రాజుగా అభిషేకించి యుయుత్సుడికే రాజ్యభారం అప్పగిస్తారు.ఇతడు పాండవుల పక్షమున యుద్ధం లో చేరుతాడు.)

-

భాగవతంలోని పోతన ప్రసిద్ధ పద్యం! ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’

భాగవతంలోని పోతన ప్రసిద్ధ పద్యం!


‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’ 

చాలామందికి తెలిసిందే.ఆ తర్వాత కృష్ణుడి స్థితి ఏమైవుంటుందో ఊహించిఓ కార్టూన్ బాపు గారు వేశారు. 

హాస్యం కోసం పురాణేతిహాస ఘట్టాలను ఉపయోగించుకున్న

ఇలాంటి బాపు కార్టూన్లు చాలా ఉన్నాయనుకోండీ.

వీటిలోని చమత్కారం బోధపడక కోపాలు తెచ్చేసుకుని 

నొసలు చిట్లించేవారూ, అపార్థం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనేవుంటారు.

కానీ కళాకారుడిగా బాపు కుంచెను స్వేచ్ఛగా ఉపయోగించారనీ, సంకుచిత సరిహద్దులేమీ గీసుకోలేదనీ చెప్పటమే నా ఉద్దేశం.

-

తన ఫెయిల్యూర్ సినిమాలపై తనే కార్టూన్లు వేసుకున్నహాస్య చతురత ఆయనకుందని చాలామందికి తెలుసు!

-

Wednesday, December 27, 2017

తెలుగు సాహిత్యంలోన పదపల్లవాలు .-(రెండవ భాగం.)


-

తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని.

వీటిని ఎవరు రాశారో చూద్దాం.-(రెండవ భాగం.)

-

21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

- అల్లసాని పెద్దన


22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

- చేమకూరి వేంకటకవి


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

- త్యాగయ్య


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

- ధూర్జటి


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ 

- బద్దెన


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

- వేమన


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

- కంచర్ల గోపన్న


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

- సుద్దాల హనుమంతు


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

- ఆరుద్ర


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

- వేముల శ్రీ కృష్ణ


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

- త్రిపురనేని రామస్వామి


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

- బాలాంత్రపు రజనీకాంతరావు


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

- అడవి బాపిరాజు


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

- కరుణశ్రీ


35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

- గుడ అంజయ్య


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

- అలిసెట్టి ప్రభాకర్


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

- సావిత్రి


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

- ఖాదర్ మొహియుద్దీన్


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

- బాలగంగాధర తిలక్


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

- అన్నమయ్య


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

- ఏనుగు లక్ష్మణ కవి


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

- పాలగుమ్మి విశ్వనాథం


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

- చెలం


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

- విమల


45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

-నం డూరి సుబ్బారావు


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

- అందెశ్రీ


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

- చెరబండరాజు


48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

- కందుకూరి రామభద్రరావు


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

- నందిని సిధారెడ్డి


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

- మిట్టపల్లి సురేందర్

-


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ...

దేశభాషలందు తెలుగు లెస్స".

(శ్రీకృష్ణదేవరాయలు)

....

తెలుగు సాహిత్యంలో-పదపల్లవాలు !

తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం.

1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

-దేవులపల్లి కృష్ణ శాస్త్రి

2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

డా.సి.నారాయణరెడ్డి

3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

- కాళోజి

4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ 

- నన్నయ

5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

-సుబ్బారావు పాణిగ్రాహి

6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ 

-బలిజేపల్లి లక్ష్మీకాంతం

7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

-బసవరాజు అప్పారావు

8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

-గుర్రం జాషువా

9. ‘‘అత్తవారిచ్చిన అంటుమామిడితోటనీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

- కాళ్ళకూరి నారాయణరావు

10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

- దాశరధి

11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

-నార్ల వెంకటేశ్వర రావు

12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

- తిరుపతి వెంకట కవులు

13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

- గురజాడ

14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

- గరిమెళ్ళ సత్యనారాయణ

15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

- శ్రీనాథుడు

16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

- పోతన

17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

- గద్దర్

18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

- శ్రీ శ్రీ

19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

- వెన్నలకంటి

20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

- కొనకళ్ల వెంకటరత్నం

-

ఇంకా వున్నాయి !

-

Tuesday, December 26, 2017

--మహాభారతం-ఒక కొత్త విషయాము -7-.

--మహాభారతం-ఒక కొత్త విషయాము -7-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

.

రణరంగం లో వీరవిహారం చేస్తున్న ద్రోణుడిని అస్త్ర సన్యాసం చేయించటానికి శ్రీకృష్ణుడు 'అశ్వత్థామ' అనే ఏనుగును చంపించి ధర్మరాజు చేత 'అశ్వత్థామ హతః' అని గట్టిగా 'కుంజరః' అని చిన్నగా అనిపిస్తాడు.

ఇంతకీ ఆ 'అశ్వత్థామ' ఏనుగును చంపేదెవరు?

-

జ)'అశ్వత్థామ' ఏనుగును చంపేది భీముడు.

(తన కుమారుడైన అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు.)

తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత.

తిరుప్పావై .. బాపు బొమ్మ .. దేవులపల్లి కవిత.

.

రావే గోపవంశాన రాజిల్లే లతకూన!

రావే పాముపడగబోలే కటికలదానా!

లేవే నీరదశ్యామమోహనుని నామముల

నీ వాకిటనే నిలిచి నీవారు పాడరు!

మేలి పొదుగుల ఆలువేలు కలవారు, ఆ

భీలరణమున అరులబీర మడచేవారు, గో

పాలకుల కులమున వెలసే ఓ వనమయూరీ!

లేవే! కలములనెలవౌ ఓ నారి! ఒయ్యారి!

ఊర్మిళ!

తమ్ముళ్ళు అందరు లక్ష్మనులే ...

ఊర్మిళ లలుఉరు కున్నత వరకే.

ఊర్మిళ ఉరిమితే - అలో లక్ష్మణా లే !

-

ప్రమీలార్జునీయము.!
.ప్రమీలార్జునీయము.!

మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి.

ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు. 

ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు. 

ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు. 

అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు.

చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.

-

"పాలగుమ్మి వారి 'గాలి వాన' "

"పాలగుమ్మి వారి 'గాలి వాన' "

-

ప్రతి గొప్ప రచన వెనుక ఒక అలజడో,ఆవేదనో,అనుభూతో

ఉంటుంది. వెనుక వుండే కథ ఒక్కోసారిఆసక్తికరంగా ఉంటుంది. పాలగుమ్మి పద్మరాజుగారు భీమవరం కళాశాలలో కెమిస్ట్రీ హెడ్ గా ఉండేవారు. 

ఆ రోజుల్లోమామిడిపూడి వెంకట రంగయ్య,నండూరిరామకృష్ణమాచార్యులు, ధూళిపాల సోమయాజులు, డి. సన్యాసయ్యవంటిఅతిరధమహారధులకు

భీమవరంలో తమ కాలేజీలో ఉద్యోగమిచ్చి మళ్లీ వారెవ్వరూ కాలేజీ

వదిలి వెళ్లిపోకుండా ఉండేందుకు చిన్నచిన్న ఇళ్లస్థలాలు కూడా ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నారట అప్పటి కాలేజీ అధికారులు.

-

నండూరి వారి ఇంటిప్రక్కనే పద్మరాజుగారు చిన్న ఇల్లు కట్టుకున్నారు.

డబ్బు అంతగా లేకపోవడం వల్ల పక్కాఇల్లు కట్టుకోలేదు.

నాలుగైదు అడుగులఎత్తువరకూ ఇటుకగోడలూ,ఆపైన తాటాకులపాక. 

ఆ పాకనే గది,హాలు, వంటిల్లుగా విభజించుకుని కాలక్షేపం

చేస్తున్నారు. వారి ఇల్లు అంటే ఒక పెద్దతాటియాకుల పాక అన్న మాట.

ఒకసారి ఒక అర్థరాత్రి భయంకరమైన గాలివాన వచ్చి 

ఇంటి కప్పులు ఎగిరిపోతున్నాయి. 

పెద్దపెద్ద చెట్లు కూలిపోతున్నాయి. ఒకటే గాలీ, వానా. కరెంటు లేదు. 

పై కప్పు ఆకులు ఎగిరిపోతున్నాయి. ఇటుక గోడలు ఊగిపోతు

న్నాయి. ఇక ఇంట్లో వుంటే ప్రమాదం అనిచెప్పి పద్మరాజుగారు భార్యని హెచ్చరించిబయటకు వెళ్లిపోదాం అన్నారు.

ఇద్దరూబయలుదేరారు. ఆయన ఇలా బయటకు

వచ్చారు,ఆమె ఇంట్లో చిక్కుకుపోయారు.

ఇంతలో ఇటుకగోడలూ, ఇంటిపైకప్పు మొత్తం అంతా 

ఫెళ...ఫెళ...మని కూలిపోయింది. 

ఆ శిధిలాల క్రింద ఆమె చిక్కుకు పోయారు.

పద్మరాజుగారికి ఒక్కసారిగ పిడుగు పడినట్లయింది. తన భార్య... శిధిలాల క్రింద ఆమె ఏమైందో ? అవి తీయడానికి

తన ఒక్కడివల్ల అయ్యేది కాదు. చుట్టూ

కారుచీకటి. ....అంధకారం....భయంకర

మైన తుఫాను.... ఎవ్వరూ కనిపించడం

లేదు. నిస్సహాయంగా ఒక్కడూ నిలబడి

యున్నాడు. భార్య బ్రతికి ఉందా? చనిపోయిందా? భయంకరమైన ఆలోచనల్లో చేష్టలుడిగి, చైతన్యం నశించి

స్థాణువులా నిలబడిపోయాడు.

చేతుల్లోటార్చిలైట్లు పుచ్చుకుని 

హాస్టల్లో ఉన్న విద్యార్థులు, 

ఊళ్లో వున్న తోటి లెక్చరర్లూ

పరుగెత్తుకుని వచ్చారు. వంద రెండు

వందలమంది పోగుపడ్డారేమో ఓ అరగంట లోపులో

ఆ ఇటుకలూ,ఆకులూ

తొలగించి పద్మరాజుగారి భార్య శరీరాన్ని

బయటకు తీసారు. తీసారేకాని ఆమె

బ్రతికి ఉన్నదీ లేనిదీ తెల్లవారితేగాని

తేలలేదు. ఎట్టకేలకు కథ సుఖాంతమైనది.

.

ఈలోగా ఆయన పొందిన ఆవేదన, పడిన ఆందోళనా...గుండెనీ, మనసునీ

కలచివేసిన అనుభవం చాలా భయంకర

మైందీ,బలమైందీ.

అంత బలమైన అనుభూతిలోంచి వచ్చింది కనుకే ఆయన

"గాలివాన " తెలుగు వాస్తవ కథకి 

ప్రపంచ కథానికల పోటీలో ద్వితీయ బహుమతి

వచ్చింది.

విల్లును విరిచావట --తల్లిని గెలిచితి వట !


--
విల్లును విరిచావట --తల్లిని గెలిచితి వట !

కం:

విల్లును విరిచావట ఆ

తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !!

చెల్లెను ఆ పనులపుడే

వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్‌ ?

.

మంటల దింపితి వామెను

అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్‌

మంటలు మా పాలి ఇపుడు

కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్‌

-

అడవికి నీతో వచ్చెను

పడ దోసిన మంటలందు పరుషములనెనా ?

గడుసుగ మాటొకటను ఇపు

డు డమరములు మోగు నయ్య డస్సును చెవుల్‌ !!


Monday, December 25, 2017

--మహాభారతం-ఒక కొత్త విషయాము -6-.

--మహాభారతం-ఒక కొత్త విషయాము -6-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

.

అజ్ఞాతవాస సమయం లో పాండవుల మారు పేర్లేమిటి?

=

జ)ధర్మ రాజు: కంకభట్టు.---భీముడు:వలలుడు.


అర్జునుడు: బృహన్నల. ---నకులుడు:థామగ్రంధి.


సహదేవుడు:తంత్రీపాలుడు.-----ద్రౌపది -సైరంధ్రి.


-

'మాతృషోడశి'.!

'మాతృషోడశి'.!

'అమ్మా నేను గర్భంలో వుండగా నిన్ను చాలా బాధపెట్టాను

..

ప్రసూతి తర్వాత కూడా నా గురించి, నా తిండితిప్పల గురించి,

.

ఆరోగ్యం గురించి ఎంతో కష్టపడ్డావు.

.

ఆ బాధలు కలిగించినదానికి ప్రతిగా యీ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను.'

-మిత్ర బేదం-

-మిత్ర బేదం-

-

తెలుగు లో బాష ప్రవీణ చేసాడుట ఒక కుర్రవాడు.... అతను నన్ను అడిగిన ప్రశ్న.. 

పరవస్తు చిన్నయ సూరి మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు వారితో 

కధకు సంబధం ఏమిటి నాకు తెలియుట లేదు.. మీరు వివరింప గలరా... 

అంటే నేను అవాక్కు అయ్యెను...

ఆర్యా,

శుభోదయ నమస్కారములు తెలుగు పండితుల వారి

ప్రశ్నకు సమాధానము ఇది.

నావుడు, అనవుడు కరటక దమనకుల బిడ్డలు. 

నావుడు కరటకుని కుమారుడు అనవుడు దమనకుని పుత్రుడు. 

వీరిరువురు మారీచ సుబాహువుల ముని మనుమలు

కరటకుడి కొడుకు నావుడు నావుడి భార్య కింతు 

దమనకుడి కొడుకు అనవుడు అనవుడి భార్య పరంతు 

నావుడు కింతు ల సంతానము పశ్చాత్ అనవుడు 

పరంతు ల సంతానము భవతి భవంతు ఇంకా ఇంకా చాలా వుంది లెండి. 

అనామకుడు .

Sunday, December 24, 2017

-మహాభారతం-ఒక కొత్త విషయాము -5-.

-మహాభారతం-ఒక కొత్త విషయాము -5-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

.-

జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపేదెవరు?

యాగం ఆగే సమయానికి ఋత్విక్కులు ఎవరిని యజ్ఞ గుండం లోకి ఆవాహన చేస్తారు?

-

జ)సర్పయాగాన్ని ఆపేది అస్తీకుడు.

ఇతను ఆదిశేషుడికి మేనల్లుడు అవుతాడు.అస్తీకుడు సర్పయాగాన్ని ఆపటానికై జన్మించిన కారణ జన్ముడు. ఇతను యజ్ఞ వాటికకి వచ్చి వేద మంత్రాలతో ఆ యజ్ఞం చేస్తున్న రాజుకు ఆశీర్వచనాలు చదువుతూ ఉంటాడు. రాజు అతన్ని చూసి ముచ్చట పడి ఏం కావాలో కోరుకోమనగా ఈ యజ్ఞాన్ని ఆపేయమని కోరతాడు.

యజ్ఞం ఆపే సమయం లో ఋత్విక్కులు తక్షకుడిని ఆవాహన చేస్తారు.అయితే తక్షకుడు భయంతో ఇంద్రుడి అభయం పొందగా మంత్ర ప్రభావం వల్ల ఇంద్రుడు కూడా యజ్ఞ గుండంలో పడబోతాడు. ఐతే యజ్ఞం ఆగిపోయిన కారణంగా రక్షింపబడతాడు.

(తక్షకుడిని ఆవాహన చెయ్యటానికి ఋత్విక్కులు చదివే మంత్రం "సహేంద్రే తక్షకాయ స్వాహా!")

-

--మహాభారతం-ఒక కొత్త విషయాము -4-. -

--మహాభారతం-ఒక కొత్త విషయాము -4-.
-
మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.
.
అర్జునుడికి గాండీవి అనే పేరు ఆయన ధరించే ధనస్సు వల్ల వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ విల్లును అర్జునునికి బహుకరించేదెవరు? ఏ సమయంలో?
.
జ)గాండీవం అనే విల్లు నిజానికి వరుణుడిది.
(అందుకే మహాప్రస్థాన సమయంలో అర్జునుడు ఆ విల్లును గంగా నదిలో వదిలేస్తాడు.)
అయితే ఈ విల్లుని అగ్ని దేవుడు ఖాండవ దహన సమయంలో బహుకరిస్తాడు.

(కారణం ఖాండవ వనాన్ని ఇంద్రుడు రక్షిస్తూండటం.

Saturday, December 23, 2017

"మాయాబజార్" సినిమా !

"మాయాబజార్" సినిమా !

-

మన తెలుగు దృశ్యకావ్యము "మాయాబజార్" (విజయావారిది) సినిమా పూర్తిగా కల్పితము.

ఈ కధావృత్తాంతము అంతా శ్రీపింగళి గారి అపూర్వ సృష్టి. వ్యాసభారతములో దీని ప్రస్తావనలేదు. వ్యాసభారతము ప్రకారము అసలు బలరామునికి శశిరేఖ అనే కూతురు లేనేలేదు. ఆ లేని శశిరేఖను సృష్టించి కధ మొత్తము పాండవులు లేకుండా నడిపించారు విజయావారు.

శ్రీకృష్ణపాండవీయము:

శ్రీకృష్ణపాండవీయము లో శకుని పాత్ర కొండవీటివెంకటకవి (సినిమా టైటిల్స్ లో కధ శ్రీరామారావుగారని ఉంది) మరో రకంగా చిత్రీకరించారు.

చిత్రకధప్రకారము: భీముడు సుయోధనుడి సమక్షములో కౌరవులను "గోళకులు" అని సంభోధిస్తాడు. గోళకులు అంటే "భర్త పోయిన స్త్రీకి జన్మించిన వారు" అని అర్ధము. దీనికి సుయోధనుడు, వ్యాసుని నిజం అడుగుతాడు. అది నిజమేనని వ్యాసుడు చెప్పినట్లుగా మరో అసందర్భమైన కధ ఆ చిత్రములో చొప్పించారు. ఈ కధ వ్యాస భారతములో లేదు. ఇది ఎక్కడ నుండి సేకరించారో కనీసం నిర్మాతలు "టైటిల్స్" లో చూపించలేదు. వారి కధ ఇలా వుంది. 

ఆ కల్పిత కధ ప్రకారము "గాంధారి జాతకములో వైధ్యవ్యం ఉన్నదని, దానిని తప్పించుటకు, గాంధారి తండ్రి "ఓ మేకపోతుకిచ్చి గాంధారి వివాహం జరిపించి, ఆ మేకపోతును వెంటనే వధించి, గాంధారికున్న వైధవ్యమును అనుభవింపచేసి, తరువాత ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేశారని అందువలన కౌరవులు "గోళకులే" నని వ్యాసుడు అన్నట్లు చిత్రకధ చెపుతుంది. తరువాత తాతగారు కౌరవ వంశాన్ని మోసం చేసి అప్రదిష్ట పాలు చేశారని సుయోధనుడు గాంధారి తండ్రిని, వాని నూరుగురు పుత్రులను బంధించి కారాగారములో నుంచి,రోజు తిండిగా నూరు మెతుకులు వేస్తుండేవాడని, ఆ నూరు మెతుకులు చిన్నవాడైన శకునికి పెట్టి, అతనిని అందరు కలిసి బతికించి కౌరవ వంశము నాశనం చేయటానికి అతని దగ్గరనుండి వాగ్దానము తీసుకున్నారని,తండ్రి వెన్నెముకనుండి శకునికి మాయా పాచికలు వచ్చాయని, తరువాత కారాగారాములో జీవించి ఉన్న శకునిని , ఒక్కడే కదా అని జాలి తలచి సుయోధనుడు అంత:పురములో ఉండనిచ్చాడని, శకుని తరువాత కౌరవ వంశమును తన దుర్భోదలచే నాశనము చేసాడని ఆ చిత్రరాజము చెపుతుంది.

వ్యాసభారతము ఏం చెపుతోంది :

వ్యాసభారతము ప్రకారము శకుని గాంధారి వివాహసమయములోనే సోదరికి అండగా ఉండటానికి గాంధారమునుండి హస్తినపురము వచ్చేస్తాడు. మేనల్లుడు సుయోధనుడు అంటే శకునికి వల్లమాలిన ప్రేమ, అభిమానము. ఈ వల్లమాలిన ప్రేమాభిమానము చేతనే, సుయోధనునికి కౌరవసామ్రాజ్యము కట్టబెట్టాలని మాయోపాయాలు ఎన్నో చేశాడు. 

గాంధార రాజు సుబలుని ధర్మరాజు స్వయముగా తమ్ములలో ఒకరిని గాంధారము పంపి "రాజసూయ యాగమునకు" రావలసినదిగా అహ్వానిస్తాడు. ఈ అహ్వానమును మన్నించి గాంధార రాజు "రాజసూయము" నకు వచ్చి అతిధి మర్యాదలన్నీ స్వీకరించి వెడతాడు. కాబట్టి ఆయనను ఆయన నూర్గురు కుమారులను సుయోధనుడు బంధించి, అంతమోందించినది అవాస్తవము. అసంబద్ధము. 

ఈ విషయము "పురాణబ్రహ్మ," బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తమ మహా భారత ప్రవచనముములో ప్రస్తావించారు

మన ఘంటసాల !

మన ఘంటసాల !

-

చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల

గంధర్వ మణిమాల ఘంటసాల

సంగీత సాహిత్య సరసార్ధ భావాల

గాత్ర మాధుర్యాల ఘంటసాల

పద్యాల గేయాల వచనాల శ్లోకాల

గమకాల గళలీల ఘంటసాల

బహువిధ భాషల పదివేల పాటల

గాన వార్నిధిలోల ఘంటసాల 

కమ్ర కమనీయ రాగాల ఘంటసాల

గళవిపంచికా శృతిలోల ఘంటసాల

గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల

గాయకుల పాఠశాల మా ఘంటసాల।

-

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు ! (‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ )

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు !

(‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ )

-

ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం. 

తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు.

.

19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. కోడూరి, యద్దనపూడి, మాదిరెడ్డి, లత, రంగనాయకమ్మ మొదలగువారు తమ రచనలతో తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆ సమయంలో కొందరు రచయితలు కూడా స్ర్తీల పేర్లలో రచనలు చేశారంటే వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదో ఆలోచించవచ్చు. వీరందరూ కేవలం కథారంగానికీ, నవలా రంగానికీ పరిమితం. కవితా రంగంలో కాలు పెట్టలేదు. 80ల్లో కవిత్వ రంగాన్ని కుదిపివేస్తూ స్ర్తీవాద కవిత్వ ఉద్యమం ప్రారంభమైంది. సమాజంలోని పురుషాహంకార ధోరణిని ప్రటిఘటిస్తూ సంప్రదాయ భావజాలాలపై తిరుగుబాటు చేస్తూ ఒక ప్రభంజనంలా, ఒక విస్ఫోటనంలా, ఒక మహోద్వేగ ప్రవాహంలా తెలుగు కవిత్వాన్ని ఒక్క కుదుపు కుదిపింది స్ర్తీవాద కవిత్వం. 

స్త్రీలు తాము మాత్రమే అనుభవించి అనుభూతించి, తాము మాత్రమే రాయగలిగే భావాలకు అక్షర రూపమిచ్చారు. 

కవయిత్రులుగా కొత్త ప్రపంచపు తలుపులు తెరిచారు. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ తమ కవిత్వపు కొరడా దెబ్బలు ఝుళిపించారు. అక్షరాలను అగ్ని కేతనాలుగా ఎగుర వేశారు. పిడుగులు కురిపించారు. తుఫానులా విజృంభించారు. 

-


Friday, December 22, 2017

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం!

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం!

--

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం

భజే వాయుపుత్రం 

భజే వాలగాత్రం

భజే హం పవిత్రం 

భజే సూర్యమిత్రం

భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీ

నామ సంకీర్తనల్ చేసినీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం

బొక్కటింజేయ నూహించి,నీ మూర్తినిన్ గాంచి,

నీ సుందరం బెంచి,నీ దాస దాసుండనై, రామ భక్తుండనై

నిన్నునే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, 

వేడుకల్ చేసితే,నా మొరాలించితే, నన్ను రక్షించితేఅం

జనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే,

దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై 

స్వామి కర్యంబు నందుండి

, శ్రీరామసౌమిత్రులం జూచివారిన్ విచారించి, 

సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి 

యవ్వాలినిన్ జంపి,కాకుస్థతిలకున్ దయా ద్రుష్టి వీక్షించి,కిష్కిందకేతెంచి,

శ్రీరామ కర్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్గాల్చియున్,

భూమిజన్ జూచి, 

యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి,

యారత్నమున్ దెచ్చి,శ్రీరాముకున్నిచ్చి, 

సంతోషనున్ జేసి,సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,

యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్ ద్రుంచగా,

రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి,

యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి 

సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, 

కుంభకర్ణాది వీరాదితో పోరాడి,చెండాడి, శ్రీరామబాణాగ్ని 

వారందరిన్రావణున్జంపగానంతలోకంబులానందమైయుండనవ్వేళనన్,

నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి,

సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి,

అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సం రంభమైయున్న

నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితేపాపముల్ బాయునే భయములున్ దీరునేభాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునేవానరాకార!

యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర!నీవే సమస్తంబు

నీవే ఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ 

స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి,శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచునాజిహ్వయందుండి 

నీదీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై,రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై,

తేజంబునన్ రౌద్రిణీ జ్వాల కల్లోల హావీర హనుమంత!

ఓంకారహ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచంబులన్,గాలి దయ్యంబులన్,

నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టినీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,కాలాగ్ని రుద్రుండవైబ్రహ్మప్రభా భాసితంబైన 

నీదివ్యతేజంబునన్ జూచి, రార నాముద్దు నరసిం హాయంచున్దయాద్రుష్టివీక్షించి, 

నన్నేలు నాస్వామీ!నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే!వాయుపుత్రా నమస్తే!

నమస్తేనమస్తేనమస్తే నమస్తే నమస్తే నమః.

--

మంగళం!.

మంగళం!.

-

రామచంద్రయ జనక రాజాజ మనోహరాయ 

మామకబీస్తాదయ మహిత మంగళం !

-

చారు కుమ్కుమోపేత చందనాలు చర్చితాయ

హర కటక శోభితాయ బురి మంగళం!

-

విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ 

సుజన చిత్త కామితాయ శుభద మంగళం !

-

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ 

స్వామి భద్ర గిరి వరాయా దివ్య మంగళం!

దివ్య మంగళం!... .దివ్య మంగళం.!!

-


-మహాభారతం-ఒక కొత్త విషయాము -3-

-
-మహాభారతం-ఒక కొత్త విషయాము -3-.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం

--

మహాభారతం చదివిన వారికి గుర్తుండిపోయే పాత్రల్లో మొట్తమొదటిది భీష్ముడి పాత్ర.ఆయనకి ఆ పేరు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ వలన వచ్చినదే.అయితే భీష్ముడి అసలు పేరు ఏమిటి?

-

జ) భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు

నిజానికి భీష్ముడు శాపగ్రస్తుడైన ధ్యో అనే 

వసువు అంశలో జన్మిస్తాడు.

=

నిత్య సత్యాలు - సుజీవన మిత్రాలు!

నిత్య సత్యాలు - సుజీవన మిత్రాలు!

-కం: 

అడిగిన జీతమబీయని 

మిడిమేలపు దొరను గొలిచి నిడుకుట కన్నన్ , 

వడిగల యెద్దుల గట్టుక 

మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ!

-

ఎంత మొత్తుకున్నా పనిచేయించు కోవటమే తప్ప జీతం యచ్చేదిమాత్రం లేనేలేదు. జీతం అడగగనే యేదో ఒక జగడం. పనిసరిగా చేయటంలేదని వంకలు వెదకటం, ఇగో యిలాటివాడు మిడి మేలపు దొర ఇట్టి వ్యర్ధుని కడ పనచేయుట కవ్న వ్యవసాయ చేయుచు జీవించుట మేేలని కవి సందేశం!

-

ఒకప్పుడు వ్యవసాయం మీద యెంత విశ్వాసం!

దానిని స్వతంత్ర వృత్తిగా భావించేవారు. ఆఫలసాయం మీద అంత భరోసా. ఇప్పుడది పోయింది. అతివృష్టి, అనావృష్టి, దీనికి తోడు దళారీలదోపిడీ, కారణంగా నేడు వ్యవసాయం సన్నగిలలుతున్నది. కాబట్టి యీపద్యానికి వ్యాఖ్యానం ప్రస్తుతం కష్టమే కదా ?

-

Thursday, December 21, 2017

మరపు రాని మన మహా నటుడు !

మరపు రాని  మన మహా నటుడు !

-

నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము

.

సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది.

.

మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే. అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత,

.

ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు 

ఎన్టీఆరే అసలు నువ్వంటావేమో. 

.

పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం. గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు.

.

పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు.

.

ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. సుమారు మూడు నూర్లు సినిమాలలో నటించిన ఈ నటరత్నానికి లభించిన అవార్డులు మాత్రం లెక్కకు చాలా తక్కువ. తెలుగు కథానాయకులలో దాదాసాహెబ్ ఫాల్కేలు, పద్మభూషణ్ లు పొందిన నటులందరూ ఎవరిని మహానటుడని పొగుడుతుంటారో అటువంటి ఎన్టీఆర్ కి మాత్రం

’పద్మశ్రీ’ తోనే సరిపెట్టేసింది కేంద్రప్రభుత్వం.

-

Wednesday, December 20, 2017

రంగు మారిన కష్టాలు !

రంగు మారిన కష్టాలు !

-

అప్పట్లో కష్టం అంటే - 

తినడానికి సరైన తిండి దొరక్కపోవడం, 

చదివినా ఉద్యోగం దొరక్కపోవడం! 

భార్యకి భర్తపోరు అత్తపోరు, 

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు, 

ఆరుగాలం కష్టపడిన రైతుకి 

పంట చేతికి అందకపోవడం, 

ఇంటిల్లపాది ఒక్కరి సంపాదనతో బ్రతకడం, 

చాలీచాలని జీతాలు ఇలా 

ఒకస్థాయిలో ఉండేవి 

మిగతావాటికి చాలావరకు 

సర్దుకుపోయేవారు. సరిపెట్టుకునేవారు. 

🎾ఇప్పుడు కష్టం రూపురేఖలు మారిపోయాయి - 

పరీక్ష తప్పితే కష్టం, 

అమ్మ తిడితే కష్టం, 

నాన్న కొడితే కష్టం, 

పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం, 

సరైన చీర కొనకపోతే కష్టం...! 

ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే - 

-

💧అనుకున్నది దొరకాలి. 

అప్పుడు కష్టం లేనట్లు. 

పిన్నీసు దొరక్కపోయినా, 

ప్రాణం పోయేంత కష్టం 

వచ్చినట్లు బాధలు పడిపోతున్నారు...! 

అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది 

ఎందుకంటే చిన్ననాటి నుండి 

కష్టాలు చూసి పెరిగేవారు. 

ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా 

తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా 

వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము. 

మానసిక బలం తగ్గిపోబట్టి 

వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే...! 

🙏 ఇప్పటి కొత్తతరం పెద్దలకి చెప్పేది ఏంటంటే 

🌓 చదవండి చదివించండి. 

దాంతోపాటే కష్టపడడం నేర్పండి. 

మీరు ఎంత కష్టపడుతున్నారో 

తెలియజేస్తూ పెంచండి. 

"మేము పడుతున్న కష్టం చాలు, 

పిల్లలెందుకు కష్టపడాలి" 

అని అనుకోవడం చాలా పెద్ద పొరబాటు!

Tuesday, December 19, 2017

మహాభారతం-ఒక కొత్త విషయాము -2.

మహాభారతం-ఒక కొత్త విషయాము -2.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో

ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం-

-

పాండవుల పురోహితుడు ఎవరు? అతడిని పురోహితుని గా వారికి సూచించినదెవరు?

జ)పాండవుల పురోహితుడు ధౌమ్యుడు. 

అతణ్ణి వారికి పురోహితునిగా సూచించేది కుంభీనసి అనే ఒక

గంధర్వ కాంత. 

అర్జునుడు ఈమెకు పాశుపతాస్త్రాన్ని భోధించి తాను ఆమె వద్ద 

చాక్షుషీ విద్య నేర్చుకుంటాడు.

-

సకల బాష ప్రవీణ-బుడుగు! గిరిసానికి కంచెం తక్కువ -వెంకటేశానికి నికి కొంచెం ఎక్కువ !

సకల బాష ప్రవీణ-బుడుగు!

గిరిసానికి కంచెం తక్కువ -వెంకటేశానికి నికి కొంచెం ఎక్కువ !

-

అన్నట్టు చెప్పటం మరిచాను. 

నాకేమో ఉంగాబాషా, పిచిక బాష, చికబాష, క బాష, బాష, ష అవన్నీ తెలుసు.

నాకు కబాష సీగానపెసూనాంబ నేర్పింది. కానీ దానికి తెలుగు కూడా బాగా రాదు. 

నన్ను బురుగు, బులుగూ అని అంతుంది. దానికి అసలు మాతలాద్దమే చేతకాదు.

నాకిన్ని మాటలు ఎవరు నేర్పారు అనుకుంటున్నారా. రమణ. 

వాడి ఫ్రెండ్ ఉన్నాడే బాపు వాడు నాకు ఆకారం ఇచ్చి, నా చేత చాలా వేషాలు వేయించాడులే.

రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా! (గజేంద్ర మోక్షము )


-

రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!

(గజేంద్ర మోక్షము )

.

నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగుబట్టు

బైటకుక్క చేత భంగపడును

స్థానబలిమిగాని తన బలిమి కాదయా

విశ్వదాభిరామ వినురవేమ!

.

నీటి నుంచి బయటపడ్డ మొసలిని కుక్క కూడా బాధిస్తుంది.

అదే నీళ్లలోని మొసలి ఏనుగును కూడా పీడించగలదు.

ఈ అర్ధాన్ని తెలియచేసే పురాణగాథే భాగవతంలోని 

గజేంద్ర మోక్షం కథ.

త్రికూట పర్వతం చుట్టు పక్కల, పర్వతం మీద దట్టమైన అరణ్యాలు లెక్కకు మించి ఉండేవి. అందు ఒకానొక అరణ్యంలో మదపుటేనుగుల సమూహం ఒకటి ఉండేది. ఆ గజమూహం స్వేచ్ఛగా అరణ్యాన విహరిస్తూ, చిన్న,చిన్న జలాశయాలలో నీటిని తమ తొండాలలో నింపుకుని, వీపులమీద జల్లుకుంటూ, పండ్లను, కాయలను తింటూ జీవిస్తుండేవి. ఆ ఏనుగు సమూహం యొక్క రాజు మిక్కిలి మదించినవాడై, గర్వంతో, అహంకారంతో విహరిస్తుండేవాడు.

ఒకనాడు అరణ్యంలోని సరస్సులో తన పరివారంతో జలకాలాడటానికి ఆ గజేంద్రుడు ప్రవేశించగా, అచ్చటే ఉన్న మకరీంద్రుడు తన బలిష్టమైన దంతాలతో ఏనుగు కాళ్ళను పట్టుకున్నాడు.

కరి భూచరజీవులన్నింటిలోకి పెద్దది. దాని పదఘట్టనతో అది జీవులను హతమార్చగలదు. బలమైన దంతాలతో పొడిచి, అతిశక్తివంతమైన తొండముతో చుట్టి విసిరివేసి చంపగలదు. 

కానీ నీటిలోని మొసలి గజేంద్రుని కంటే బలమైనది. అది గజరాజుని చీల్చి, తోకతో కొట్టి బాధించి మరణసదృశంగా చేయగలిగిందంటే అది స్థానబలంకాక మరియేమిటి?

తాను బలశాలినని గర్వపడే గజేంద్రుడు తన శక్తినంతా వినియోగించి మొసలి బారి నుండి విడిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. గజేంద్రుని పరివారం నిలబడి చోద్యం చూడటం తప్ప మరియేమి చేయలేకున్నాయి. మొసలి గజమును నీటిలోకి, గజేంద్రుడు మకరిని బయటకు లాగుతూ వేయి సంవత్సరములు నిర్విరామంగా పోరాడాయి. క్రమం, క్రమంగా గజేంద్రుని శక్తి క్షీణించ సాగెను.

-

లావొక్కింతయులేదు ధైర్వము విలోలంబయ్యె ప్రాణంబులన్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చెతనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్పనితఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్

రావే ఈశ్వరా! కావవే వరద సంరక్షించు భద్రాత్మకా!

-

అంటూ తనను రక్షించవల్సిందిగా ఆ శ్రీహరిని శరణువేడుకున్నాడు. భక్తుని ఆర్తనాదం విన్న హరి హుటాహుటిని వచ్చి తన సుదర్శన చక్కంతో మకరిని వధించి గజేంద్రుని రక్షించాడు.

-

శివపార్వతుల కల్యాణం !

-శుభసమయం !

శివపార్వతుల కల్యాణం !

(దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో గురించిన పద్యం .)

మ. జడలో -దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్

నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి -పూరీతి;పా

-వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా

పడతిన్ బార్వతి బెండ్లియాడితివి -సాంబా! రుద్ర! సర్వేశ్వరా!

-

-

పరోపకారః పుణ్యాయ- పాపాయ పరపీడనమ్"!

పరోపకారః పుణ్యాయ- పాపాయ పరపీడనమ్"!

-

ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ పండితుడున్నాడు. పనిమీద పట్నం వెళ్లి

తిరిగి వస్తుండగా పెద్ద వాన పడింది. గొడుగు లేదు.

గబగబ ఒక ఇంటి అరుగుమీదకు చేరుకున్నాడు.

-

అది ఒక వేశ్య ఇల్లు. వర్షం తగ్గింది. ఆ ఇంటిముందునుంచి ఒక మరణించిన వ్యక్తి యొక్కశవాన్ని అంతిమయాత్రకు

తీసుకువెడుతున్నారు. ఆ వేశ్య తన కుమార్తెను పిలిచి 

ఆ చనిపోయిన వ్యక్తిస్వర్గానికి వెళ్లాడో లేక నరకానికి వెళ్లాడో

తెలుసుకుని రమ్మని పంపింది.

-

బయట వున్న పండితుడు ఆ మాటలు

విని ఆశ్చర్యపోయాడు. మరణించిన

వారు ఎక్కడకు వెళతారో తెలుసుకునే 

విద్య గురించి తనకు తెలియనందుకు చింతించి, ఆ

విషయమేమిటో తెల్సుకునేందుకు మరికొంతసేపు

అక్కడేఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఇంతలో బయటకు వెళ్లినామె వచ్చినది.

చనిపోయిన వ్యక్తి నరకానికి వెళ్లాడని

చెప్పింది. కాస్సేపటికి ఇంకొక శవయాత్ర

వచ్చినది. మళ్లీ ఆ అమ్మాయి బయటకు

వెళ్లి వచ్చినది. " అమ్మా! ఈ వ్యక్తి స్వర్గానికి వెళ్లాడు" అన్నది.

-

ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ఆ పండితుడు

ఇంటి తలుపు తట్టాడు. ఒక స్త్రీ తలుపుతీసి "ఎవరు మీరు? " 

అని అడుగగా 

అమ్మా! నీవు నీ కుమార్తెను వెలుపలకి

పంపడం గమనిస్తూ ఉన్నాను. మొదట చనిపోయినవ్యక్తి నరకానికివెళ్లాడని,రెండవవ్యక్తిస్వర్గానికివెళ్లాడని

మీఅమ్మాయిఎలాచెప్పగలుగుతున్నది?

అసలామె ఎక్కడకు వెళ్లి వచ్చినది?

తల్లి కుమార్తెను పిలచినది. ఆ అమ్మాయి

ఇలా అన్నది. 

-

"ముందుగా నేను మొదట మరణించిన

వ్యక్తియొక్క శవయాత్రలో పాల్గొన్నవారి

వద్దనుండి వివరాలు సేకరించాను. 

ఈయన మరణానికి ఇరుగుపొరుగు

చాలా ఆనందిస్తున్నారు. బ్రతికివున్న

పుడు ఇతడు అందరి వస్తువులు దొంగిలిస్తూండేవాడు

అందరినీ తిడుతూవాళ్లతో దెబ్బలాడేవాడు. 

అబద్ధపు సాక్ష్యాలు చెప్పి అందరినీ యిరికించి

కష్టపెట్టేవాడు. వీరి మాటలను బట్టి 

అతడు నరకానికి పోతాడు అని అర్థం చేసుకున్నాను. 

ఇక రెండవవాడి గురించి.

ఆవ్యక్తి చిరునామా తెలుసుకొని ఇరుగు

పొరుగు నుండి అభిప్రాయాలు సేకరించాను. అక్కడ అందరు దుఃఖిస్తున్నారు. అయ్యో రామా! ఎంత

విపరీతం జరిగింది. ఈయన అందరి తలలో నాలుకలా ఉండేవాడు. ఎల్లప్పుడూ సాధువులను,మహాత్ములను 

ఆదరించేవాడు. సత్సంగం చేసేవాడు.

అనారోగ్యంతో వున్నవారిని భౌతికంగానూ, ఆర్థికంగాను ఆదుకొనేవాడు. మానసిక ధైర్యం ఇచ్చేవాడు. అతడు మరణించినందు

వలన మేము దిక్కులేనివాళ్ల

మయ్యాము"అని విలపించసాగారు. 

వారి మాటలు విని అతడు స్వర్గానికే

వెళ్లాడని నిశ్చయించాను." అన్నది.

-

పండితుడు అనుకున్నాడు. "మంచి పనులు చేసేవారికి సద్గతులు, చెడుపనులు చేసేవారికి దుర్గతులుప్రాప్తిస్తాయని పెద్దలు చెప్పారు.

నేనే ఆ విషయం విస్మరించాను," అనుకున్నాడు.

-

"పరోపకారః పుణ్యాయ పాపాయ 

పరపీడనమ్"

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 31.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 31.

-

గురుచరణాంబుజ నిర్భర భక్తః 

సంసారాదచిరాద్భవ ముక్తః|

సేంద్రియమానస నియమాదేవ

ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం||

-

శ్లోకం అర్ధం : 

అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.

తాత్పర్యము : 

మానవుడు తెలివిగా నిత్య, అనిత్య వస్తువులేవియో, ఏమి పొందవలెనో, ఏమి విడువవలెనో వివేకముతో తెలుసుకొనవలెను. అష్టాంగ మార్గమును అవలంబించవలెను. ఆత్మ సాక్షాత్కారము బడయుటకు ఎనిమిది సాధనలు కలవు. అవి - యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యాస, సమాధులు. ఈ విధముగా చివరి స్థితికి చేరిన జీవికి నిర్వికల్ప ఆత్మానుభవము కలిగి, పరమ ఆనందము, శాంతి, సుఖము లభించి ఆత్మ పరమాత్మలో ఐక్యము అగును. 

-

-సంపూర్ణం -


Monday, December 18, 2017

మహాభారతం-ఒక కొత్త విషయాము -1.

మహాభారతం-ఒక కొత్త విషయాము -1.

-

మహాభారతం అనేది ప్రపంచ సాహితీ చరిత్ర లోనే అతి పెద్ద రచన.సూతుడు చెప్పినట్టు ఇందులో ఉన్నదే అన్ని చోట్లా ఉన్నది.ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు.చదివిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియచేసే నిత్య నూతన గ్రంధం మహాభారతం.

ప్రశ్న -.కౌరవులు పాండవులను లక్క ఇంటిలో దహనం చెయ్యటానికి కుట్ర పన్నారని మనందరికీ తెలుసు.అయితే ఆ లక్క ఇంటిని ఏ ఊరిలో నిర్మించారు?

దాన్ని నిర్మించిన వాస్తు పండితుడు ఎవరు?

-

జ) లక్క ఇంటిని కౌరవులు వారణావతం అనే ఊరిలో నిర్మిస్తారు. ఆ ఇంటిని నిర్మించిన వాస్తు పండితుడు పురోచనుడు. పాండవులకు ఆ ఊరిపై ఆసక్తి కలగటానికి ఎల్లప్పుడూ ఆ ఊరి గురించి వర్ణించేందుకు కౌరవులు కొందరు జీతగాళ్ళను నియమిస్తారు.వారి మాటల వల్ల ఆ ఊరిపై ఆసక్తి కలిగి పాండవులు ఆ ఊరికి బయలుదేరేటపుడు భీష్ముడు వారిని హెచ్చరిస్తాడు.అంతే కాక వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి(సొరంగం తవ్వేందుకు) ఒక సహాయకుడిని వారి కన్నా ముందే అక్కడికి పంపిస్తాడు.

గణ పతి భార్యలు సిద్ధి ,బుద్ధి .

శుభోదయం!

-

గణేశ –

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||

-

గణ పతి భార్యలు సిద్ధి ,బుద్ధి .

కుమారస్వామి భార్యలు వల్లీ ,దేవసెనలు .

వీరు శబ్ద వాచ్యులు ,శక్తి స్వరూపులే కాని ,స్త్రీ సుఖం ఇచ్చిన వారు కాదు .

భ్రాంతిలో ఉన్న దాంపత్యం ఇది .

-

విద్య!

విద్య!

-

విద్య లేకుంటేను

విభవమ్ము రోత;

వినయమ్ము లేకుంటె

విద్యలూ రోత!.

-


- భర్తృహరి సుభాషితం -

-

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్

విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్

విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్

విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.!

-


భావం : పురుషునికి విద్యయే రూపము. విద్యయె రహస్యముగా దాచి పెట్టబడిన ధనము,విద్యయే సకల భోగములను,కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్య లేనివాడు మనషుడే కాదు.


పెళ్ళాం-బెల్లం -- పిదప అల్లం ! -

-
-

పెళ్ళాం-బెల్లం -- పిదప అల్లం !

-

ఒంటికణతా నొప్పి

ఒరగాలితీపు

పంటిపోటూ వద్దు

పగవానికైన.!

_

మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 30.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 30.

-

ప్రాణాయామం ప్రత్యాహారం 

నిత్యానిత్య వివేకవిచారం|

జాప్యసమేత సమాధివిధాన

కుర్వవధానం మహదవధానం||

-


శ్లోకం అర్ధం : 

సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.

-


తాత్పర్యము :

 ప్రపంచమునందు ఎన్నో తెలియని విషయములు ఉండును. వాటిని తెలుసుకొనుటకు మానవునకు ఒక జీవితము చాలదు. అందులోనూ ఆధ్యాత్మిక విషయములు గురు ముఖముగా విన్నగాని అవగతము కావు. కావున, సత్ గురువును ఆశ్రయించి, మనసును గురు పాద పద్మములపై లగ్నము చేసి, అత్యంత గౌరవము, భక్తితో సేవించిన గురు కృపకు ప్రాప్తుడై, అచిరకాలములో అజ్ఞానము వీడి, సంసార బంధముక్తుడై, సాధన మార్గమును ఎరిగి, ఇంద్రియ నిగ్రహము, మనస్సుపై జయము సంపాదించి ఆత్మసాక్షాత్కారము పొందగలడు. కనుక శ్రీఘ్రముగా పరమాత్మను చేరవలెనన్న సత్ గురువు యొక్క కృప ఎంతయో అవసరము. 

   

-