Monday, May 20, 2019

🌺వడ్డాది వారి వయ్యారాలు 🌺

శుభోదయం .🌹


🌺వడ్డాది వారి వయ్యారాలు 🌺


👉🏿ఒప్పుల కుప్ప వయ్యారి భామ అంటూ


ఆడపిల్లలు నట్టింట్లో ఆడుతూ ఉంటె ఆ ముచ్చటే వేరు.


🌺🌺

ఒప్పులకుప్ప, వయ్యారిభామ

సన్నబియ్యం, ఛాయపప్పు

చిన్న మువ్వ, సన్నగాజు

కొబ్బరు కోరు, బాదంపప్పు

గూట్లో రూపాయి, మా బాబు సిపాయి

🌺🌺🌺🌺


ఒప్పులకుప్పా వయ్యరి భామ

మినపా పప్పూ మెంతీ పిండి

తాటీ బెల్లం తవ్వెడు నెయ్యు

గుప్పెడు తింటే కులుకూలాడి

🌺🌺

నడుమ గట్టే నా మాట చిట్టి

దూదూ పుల్లా దురాయ్ పుల్ల

చూడకుండా జాడా తీయ్

ఊదకుండా పుల్లా తీయ్

🌺🌺🌺🌺

దాగుడుమూతా దండాకోర్

పిల్లీ వచ్చే ఎలుకా భధ్రం

ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Friday, May 17, 2019

భగవాన్ శంకరులు-ఙిఙ్ఞాసామధనం.🌹

భగవాన్ శంకరులు-ఙిఙ్ఞాసామధనం.🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


మానవీయ మహాప్రస్థానములో విలువలు ఙిఙ్ఞాసావిష్కరణలు. 

భగవాన్ శంకరులుఙిఙ్ఞాసామధనంలో అంత వరకు చేరనిలోతుకు చేరి తన మనో వికాసాన్ని మానవ మేధోపురోగతికితోడుచేశారు. అప్పటి అవిష్కరణలు మన (మానవ) జాతి గమనములో మైలురాళ్ళుమాత్రమే. గీత గోవిందంలో చెప్పినట్టు వ్యాకరణాన్ని వల్లెవేయడము పురోగమన గతి కాజాలదు. మన దృక్పధము నిరంతర పురోగామిత్వముకావలె నన్నదే మహానభావుల ఆశయము. సత్యసోధనలో మనిషికి యెదురయ్యే ప్రశ్నలకి జవాబులు మారుతూనే వుంటాయి. ఎందుకంటే సత్యము నిశ్చయంగా జటిలము. నిత్య నవ జాతము. పైగా బ్రహ్మ విద్య. గురుభావము గురుత్వ గరిమ నిత్యనిరవధిక సోధనలోనే అంతర్లీనంగా వుంటుంది. మన'ని మనము అవగాహన చేసుకుని అవిష్కృత సత్యములన చదువు సంస్కారముల ద్వారా పరివ్యాప్తి చేయడమే ఆచార్యుల ఆంతర్యము. సహ జీవన సౌరభంలో వినడమూ వినుకోవడమూ అనేవి నిత్య వ్యవహారాన్నీ సత్య వ్యవహారాన్నీ పొంతన చెయడములో ఒదిగి వుంటాయి.

ఐహికాముష్మికసాధనసామర్థ్యం కలుగుతుంది. కనుక వీలయితే మూల శ్లోకాలతో , కనీసం ఈ తెలుగయినా రోజుకొకసారి చదివి మననం చేయాలి. 

ప్రశ్నలన్నీ శిష్యుడు అడిగినవీ జవాబులన్నీ గురువుగారు చెప్పినవీగా తెలుసుకోవాలి:

🌺🌺🌺


1. భగవన్, గ్రహించవలసినదేమిటి?

గురువాక్యం.

.

2. వదలవలసినదేమిటి?

చేయరాని పని.

.

3. గురువెవరు?

తత్త్వం తెలిసి ఎల్లపుడూ శిష్యునికి మేలు చేయటానికి సంసిద్ధుడయి ఉండేవాడు.

.

4. బుద్ధిమంతుడు త్వరపడి చేయవలసినదేమిటి?

సంసారం = జననమరణ చక్రం విరగగొట్టటం. 

.

5. ముక్తి తరువుకు విత్తనం ఏమిటి? 

కర్మాచరణం వల్ల (కలిగిన చిత్త శుద్ధి ద్వారా) లభించే తత్త్వజ్ఞానం.

.

6. అన్నింటికంటె పథ్యమైనదేది? 

ధర్మం.

.

7. ఈ లోకంలో శుచి అయినవాడెవ్వడు?

పరిశుద్ధమైన మనస్సుకలవాడు.

.

8. పండితుడెవరు?

ఆత్మానాత్మ వివేకం కలవాడు.

.

9. ఏది విషం?

గురువులను అవమానించటం.

.

10. సంసారంలో సారమైన దేమిటి?

అనేకులు అనేకవిధాలుగా ఆలోచించి నిర్ణయించినదే.

.

11. మానవులకు అన్నింటికంటె ఇష్టమైన దేమిటి?

తనకు మేలుచేసుకొనటానికీ ఇతరులకుపకారం చేయటానికీ నిరంతరం పూనుకొనే జన్మ.

.

12. మద్యంలా మత్తెక్కించేదేమిటి?

స్నేహం.

.

13. దొంగలెవరు?

ఇంద్రియవిషయాలు.

.

14. సంసారంలో కట్టిపడవేసే తీగె ఏమిటి?

తృష్ణ.

.

15. శత్రువెవరు?

ప్రయత్నించకపోవటం.

.

16. దేనికి భయపడాలి?

మృత్యువుకి.

.

17. గ్రుడ్డివానికంటె కబోది ఎవడు?

రాగం, విషయాసక్తి కలవాడు

..

18. శూరుడెవరు?

లలనల చూపుల తూపుల వ్యథచెందని వాడు.

.

19. కర్ణాం జలులతో పానం చేయదగిన అమృతం ఏది?

సదుపదేశం.


20. గౌరవానికి మూలం ఏమిటి?

యాచించకపోవటం.

.

21. గహనమైనదేమిటి?

కాంతనడత.

.

22. చతురుడెవరు?

కాంతనడతవల్ల ఖండితుడు కానివాడు.

.

23. ఏది దుఃఖం?

అసంతృప్తి.

.

24. తేలికచేసేది ఏది?

అధముని యాచించటం.

.

25. ఏది జీవితం?

దోషరహితం.

.

26. ఏదిజడత్వం?

చదివినా రాకపోవటం.

.

27. మేలుకొని ఉండేవాడెవడు?

వివేకి. 

.

28. ఏది నిద్ర?

ప్రాణి మూఢత్వం.

.

29. తామరాకు మీది నీరులా చంచలమైనదేది?

యౌవనమూ, ధనమూ, ఆయువూ.

.

30. చంద్రకిరణాల వంటి వారెవరు?

సజ్జనులు. 

.

31. ఏది నరకం?

ఒకరికి లొంగి ఉండటం.

.

32. ఏది సౌఖ్యం?

సర్వసంగపరిత్యాగం.

.

33. సాధించవలసినదేమిటి?

ప్రాణిహితం.

.

34. ప్రాణులకు ఏది ప్రియం?

ప్రాణం.

.

35. అనర్థకరమేది?

మానం.

.

36. ఏది సుఖప్రదం?

సాధుజనమైత్రి.

.

37. సకల కష్టాలూ పోగొట్టుకొనగలవాడెవడు?

సర్వవిధత్యాగి.

.

38. ఏది మరణం?

మూర్ఖత్వం .

.

39. ఏది అమూల్యం?

అవసరానికిచ్చిన దానం.

.

40.మరణం వరకూ బాధించేదేది?

చాటున చేసిన పాపం.

.

41. ఏ విషయమై ప్రయత్నించాలి?

విద్యాభ్యాసం, మంచిమందు, దానం.

.

42. తిరస్కరించవలసినదేది?

ఖలుడు, పరకాంత, పరధనం.

.

42. రేయింబవళ్లు ఆలోచించవలసినదేది?

సంసారం అసారమని, కాంత గురించి కాదు.

.

44. దేనిని ఇష్టం చేసుకోవాలి?

దీనులపై కరుణ, సజ్జనులతో మైత్రి.

.

45. ప్రాణాలు పోయేటపుడు కూడా ఎవరి మనస్సు కరగదు?

మూర్ఖుడు, శంకితుడు, విషాదగ్రస్తుడు, కృతఘ్నుడు -వీరిది

..

46. ఎవరు సాధువు?

మంచి నడవడి కలవాడు.

.

47. అధముడెవరు?

చెడునడవడి కలవాడు.

.

48. ఈ జగత్తును జయించిన వాడెవడు?

సత్యమూ, ద్వంద్వసహిష్ణుతా కలవాడు.

.

49. దేవతలెవనికి నమస్కరిస్తారు?

దయముఖ్యమనుకొనేవానికి.

.

50. ఏదంటే పండితునికి భయం?

సంసారారణ్యమంటే.

.

51. ప్రాణిగణం ఎవనికి వశమవుతుంది?

వినయవంతుడయి వినేవారినికి ప్రియమైన సత్యం పలికే వానికి. 

.

52. కనిపించే ప్రయోజనం సిద్ధించటానికి ఎక్కడ ఉండాలి?

న్యాయ్యమార్గంలో.

.

53. ఎవడు కబోది?

అయోగ్యకార్యాలు చేయటంలో ఆసక్తికలవాడు.

.

54. ఎవడు చెవిటివాడు?

హితవుమాటలు విననివాడు.

.

55. మూగవాడెవడు?

సమయానికి తగు ప్రియమైన మాటలాడడం తెలియనివాడు

..

56. ఏదిదానం?

ప్రతిఫలమాశించనిది

..

57. ఎవడు మిత్రుడు?

పాపం నుంచి మరలించే వాడు.

.

58. ఏది అలంకారం?

శీలం.

.

59. పలుకులకు ఏది భూషణం?

సత్యం.

.

60. మెరపుమెరపులా చంచలమైనదేది?

దుర్జనసాంగత్యమూ యువతులూ.

.

61. కలికాలంలో కూడా కులశీలాల నుంచి కదలింపరానివారెవరు?

సజ్జనులే.

.

62. ఇహంలో చింతాణిలా దుర్లభమైనదేది?

చతుర్భద్రం.

.

63. అంటే ఏమిటంటారు తమస్సు విదిలించుకొన్న జ్ఞానులు?

ప్రియవాక్యసహితమైన దానం, గర్వరహితమైన జ్ఞానం, క్షమాయుతమైన శౌర్యం, త్యాగసమేతమైన విత్తం - ఇది చతుర్భద్రం. ఇది దుర్లభం.

.

64. శోచనీయమేది?

కలిమిగల లోభిత్వం.

.

65. ప్రశస్తమేది?

ఔదార్యం.

.

66. విద్వాంసులు కూడ పూజించదగినవాడెవడు?

స్వభావసిద్ధమైన వినయం ఎల్లవేళలా కలవాడు.

.

67. ఈ జగత్తు ఎవనికి వశమవుతుంది?

ప్రియమైన హితమైన పలుకులు పలుకుతూ ధర్మాసక్తి కలవానికి.

.

68. విద్వాంసుల మనస్సును ఏది హరిస్తుంది?

జ్ఞానసహితమైన సత్కవిత్వం.

.

69. ఆపద లెవరినంటవు?

ఇంద్రియ నిగ్రహమూ ప్రకృష్టమైన జ్ఞానమూ కలవారి నను వర్తించేవానిని.

.

70. లక్ష్మి ఎవరిని కోరుకొంటుంది?

మనస్సులో సోమరితనం లేక నీతిమంతమైన నడవడి కలవానిని.

.

71. లక్ష్మిహఠాత్తుగా ఎవరిని వదలిపెడుతుంది?

ద్విజులను, గురువులను, సురలను, నిందించేవానినీ, సోమరినీ.

.

72. ఏమి ఉంటే నరుడు శోచనీయుడు కాకుండా ఉంటాడు?

చెప్పిన మాట వినే భార్యా, నిలుకడగల కలిమీ ఉంటే.


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

.

Wednesday, May 8, 2019

ఒక వాస్తవంగా జరిగిన కథ.

మిత్రులారా.....
మంచి msg ఒక 2 నిమిషాలు కేటాయించి చదవండి.....
🙏🙏🙏🙏

ఇది
ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు......
" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా
కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది.
" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది
పెద్దకోడలు.
" ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది.
కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ
చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని
ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను>"
అంది చిన్నకోడలు.
" ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు.
" మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో
చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో
ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం
మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు.
" మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం>" అంది చిన్నకోడలు.
ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని
చూసుకోవలని వారి ఉద్దేశ్యం. కానీ రోజూ భార్యల నస భరించలేక
ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు.
" నాన్నా! ఈ పిల్లలగొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేకపోతున్నాం.
మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి
చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ
చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్నిరోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని
బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి.
షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి.
" అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట
బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి.
ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి."
" నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా
కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా
ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి.
నా తదనంతరం ఈ ఇల్లు మీకే! పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే
pention తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నారు
తండ్రి.
" అదేంటి మామగారూ! వూర్లో్ జనాలు ఏమనుకుంటారు? బయటికివెళ్ళి
అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి. ఆలోచించండి" అన్నారు కోడళ్ళు.
ఊర్లో జనాలు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు.
ఇది నా ఇల్లు. నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు. నేను పోయేదాకా
ఇది నా సొంతం. నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి
ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన
మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి
వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ
తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపో్యారు.
షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ......కోడళ్ళకు.....
తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా
ఆశ్రమాలకు వెళ్ళిపోతు్న్నారు. వారు ఇలా తి్రగబడితే తప్ప
గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం ఉన్న
తల్లిదండ్రులను, ఆస్తిపాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ
శరణాలల్లో ఉంటున్నారు. వారు తప్పక తెలుసుకోవలసిన విషయం ఇది.
తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ
చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి.
.......ఓపిగ్గా చదివిన మీకు ధన్యవాదములు......
🙏🙏🙏🙏🙏🙏

పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ .(పోతనామాత్యుడు.)

🌹🙏🏿శుభోదయం.🙏🏿🌹

🌺🌺

పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ , నంభోయానపాత్రంబునన్

నెట్టం గల్గను , గాళి గొల్వను , బురాణింపన్ దొరంకొంటి మీ

దెట్టే వెంట జరింతు దత్సరణి నా కీవమ్మ ! యో యమ్మ ! మేల్

పట్టున్ నాకగుమమ్మ ! నమ్మితి జుమీ బ్రహ్మీ ! దయాంభోనిధీ.!

.

(పోతనామాత్యుడు.)

🌺🌺🌺🌺🌺

👉🏿భాగవతం ప్రార్థనా పద్యాలతో మొదలవుతుంది . 

సరస్వతీ మాత అనుగ్రహం కోరి పోతన రచించిన పద్యం . రమ్యం గా ఉంటుంది మరి చదవండి -పిల్లలతో చదివించండి . పుణ్యమూ , పురుషార్థమూ , చదువుల తల్లి అనుగ్రహమూ లభిస్తాయి .

👉🏿తలపై పుట్ట పెరిగింది వాల్మీకికి . ఆ వాల్మీకిగా నేను పుట్టలేదు .

వ్యాస భగవానుని లాగా పడవలో పుట్టలేదు .

కవికులతిలకుడై కాళిని కొల్చిన కాళిదాసునూ కాదు .

అయినా భాగవతాన్ని తెలుగు భాషలో రచించడానికి పూనుకున్నాను . అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను .

నాకు మార్గాన్ని నిర్దేశించి , చేయూత నిచ్చి నడిపించవమ్మా .

నీవే తప్ప ఇతఃపరంబెరుగను తల్లీ . అనుగ్రహించవమ్మా . 

నిన్నే నమ్ముకున్నానమ్మా ! చదువుల తల్లి సరస్వతీ ! 

నను కరుణించవమ్మా ! బ్రాహ్మీ ! నీవు దయా సముద్రురాలవు కదమ్మా .

👉🏿పోతన భాగవత ప్రారంభంలో సరస్వతీ మాత దయాబిక్ష 

కోరుతూ కొన్ని పద్యాలు అమోఘంగా రచించాడు .

అందులో ” తల్లీ ,నిన్ను దలంచి ” , “క్షోణితలంబునన్ ” , 

శారద నీరదేందు ” , కాటుక కంటి నీరు ” లాంటి పద్యాలు 

విద్యార్థులకు ప్రేమతో నేర్పించేవారు గురువులు — 

మొన్న మొన్నటి వరకూ . ప్రస్తుతం అవి కనుమరుగవుతున్నాయి . మాతృమూర్తి కరుణించినవారి రచనలు కలకాలం నిలిచాయి .

పోతనే అందుకు ఉదాహరణ . 

చదువులు నిజంగా వంటి కబ్బాలంటే , చదువుల తల్లి కరుణ కావాలి . బిడ్డలందరికీ ఈ పద్యాలు నేర్పించి , వల్లె వేయించి సరస్వతీ మాత దయకు పాత్రులను చేయడం మన ధర్మం.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Thursday, May 2, 2019

🌹💥 శ్రీరామచంద్రుడు పోషించిన -నవరసాలు💥🌹

🌹💥 శ్రీరామచంద్రుడు పోషించిన -నవరసాలు💥🌹


🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥


👉🏿కావ్యం లో నవరసాలకూ సమాన ప్రాతినిధ్యం వుండాలి అది అప్పుడే పాఠక హృదయాలను ఆకట్టుకుంటుంది.


ఇది రామాయణం లో వివిధ ఘట్టాల నేపధ్యంతో శ్రీరాముడు నవరసాలూ పోషించి నట్లు వివరిస్తుంది.

నవరసాలతో అల్లిన సీస మాలిక ఇది.


కడునొప్పు జానకీ కళ్యాణ శుభలగ్న 

కాలోత్సవంబు శృంగార రసము 

పట్టాభిషేక సంభ్రమ వేళ ముని వృత్తి జనుమన్న 

జనుటయే శాంత రసము

తను నరమాత్రునిగా దలచు తాటకనేయు 

నట్టపహాసస్ఫూర్తి హాస్యరసము,

పాదరేణువు సోకి పాషాణ మెలమి పొలతి యై 

నిల్చుటద్భుత రసంబు 

మాయా మృగంబైన మారీచు కనుగొని భయ

దాస్త్ర మేయుట భయరసంబు 

కడగి వారిధి మీద గదిసి లక్ష్మణు చేతి

విల్లందుకొను వేళ వీర రసము

తన బాణ హతి బడ్డ దైత్యుల వికృతాంగ 

భావంబు జూడ భీభత్సరసము

రాణివాస ద్రోహి రావణాసురు బట్టి 

రణ వీధి ద్రుంచుట రౌద్రరసము 

అల విభీషణుని లంకాధిపు జేయుచో 

రూడికి నెక్కు కారుణ్య రసము


నవరసంబులు నీయెడ నాటు కొనియె 

దశరథేశ్వర పుత్ర! సీతా కళత్ర 

తారక బ్రహ్మ! కౌసల్య తనయ! రాజ 

రాజ దేవేంద్ర! పట్టాభి రామచంద్ర!


1). రామా!సీతాదేవితో కళ్యాణ మప్పుడు నువ్వు శృంగార మూర్తిగా 

గోచరించావయ్యా.


2). పట్టాభిషేకం జరిగి రాజువు కావాల్సిన నువ్వు తండ్రి ఆజ్ఞ మేరకు

నారచీరలు ధరించి మునిలా అడవులకు బయల్దేరినప్పుడు నీ రూపం లో 

శాంత రసం కురిసిందయ్యా.


3). నిన్నేదో సాధారణ మనిషిగా భావించి నీ మీదికి దాడికి వచ్చిన తాటకను 

సంహరించే టప్పుడుహాస్య రసం ద్యోతక మైంది.


4) ఇంక నీ పాద ధూళి సోకి రాయి అహల్యగా మారినప్పుడు అద్భుతంగా

అనిపించింది.అప్పుడు నీవు అద్భుత రస మూర్తివి.


5) మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడి మీదికి బాణం వేసినప్పుడు

భయానక రసం గోచరించింది.


6) లంకకు వెళ్ళే సందర్భం లో నీ దర్శన భాగ్యం కలిగిన సంతోషం తో సముద్రుడు

వుప్పొంగితే అతని మీదికి విల్లు ఎక్కు పెట్టినప్పుడు, వీర రసం కనిపించింది

.

7) యుద్ధము లో రాక్షసులని చంపగా చెల్లా చెదరుగా పడిపోయినవారి దేహాల్ని

చూసినప్పుడు భీభత్స రసాలు కళ్ళకు కట్టాయి.


8). రావణుడిని చంపేటప్పుడు రౌద్రం ఎలా వుంటుందో తెలిసింది.


9) విభీషణు డిని లంకకు రాజుగా కూర్చో బెడుతున్న సందర్భం లో కరుణ రసం

గోచరించింది.


ఓ దశరధ నందనా,సీతాపతీ, తారకరామా, కౌసల్య తనయా,పట్టాభిరామా నీలోనే నాకు నవరసాలూ గోచరించాయి.అంటూ ఒక అజ్ఞాత కవి శ్రీరాముడిని తాను దర్శించడమే కాక తెలుగు వాళ్ళందరికీ దర్శింప జేశాడు.


కంటిన్ జానకి బూర్ణ చంద్ర వదనన్, గల్యాణిఁ నా లంకలో 

గంటిన్ మీపద పంకజాతము మదిన్ కౌతూహలం బొప్పగా 

గంటిన్ మీ కరుణావ లోకనము విఖ్యాతంబుగా గీర్తులం

గంటిన్ మా కపివీర బృందములలో గాంభీర్య వారాన్నిధీ!


గాంభీర్యములో సముద్ర సమానుడవైన వాడా శ్రీరామా! ఆ లంకలో చంద్రబింబము వంటి ముఖము కలది యైన సీతాదేవిని చూశాను.నీవు చెప్పిన పనిని పూర్తి చేసి తిరిగివచ్చి ఉత్సుకతతో నీ పాదపద్మాలను చూశాను. దయా

పూరితములైన నీ చూపులను చూశాను.మా వానరకులములో గొప్ప కీర్తులను పొందాను.

తెలుగులో రామాయణ రచన చేసిన కవయిత్రులలో ఆతుకూరి మొల్ల ప్రథమురాలు. ఈమె ఆతుకూరి కేసన పుత్రిక. నెల్లూరి సమీపంలోని గోపవరం ఈమె నివాస స్థలం.


' తేనె సోక నోరు తీయన యగు రీతి' మొల్ల రామాయణ రచన చేసింది. రామాయణంలో సుందరకాండ బహు సుందరమైనది. శ్రీరామునితో చెలిమి చేసిన సుగ్రీవుడు, సీతాన్వేషణ కోసం వానర సేనను నేల నాలుగు చెరగులా పంపించాడు. మహాశక్తిశాలి యైన హనుమంతుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ సముద్రాన్ని లంఘించి లంకలో అడుగు పెట్టి, అక్కడ అశోక వనంలో సీతా దేవిని చూసి, ఆమెకు శ్రీరాముని యోగ క్షేమాలను తెలియజేశాడు. ఆమెను విడిపింౘడానికి త్వరలో రాముడు రానున్నాడని ఆ తల్లికిచెప్పి ఊరట కలిగించాడు.శ్రీరాముడు యిచ్చి పంపిన అంగుళీయకాన్ని ఆనవాలుగా చూపాడు. శ్రీరాముని రూపలావణ్యాలను, గుణగణాలనూ వర్ణించి ఆమె అభిమానాన్ని ౘూరగొన్నాడు. తర్వాత లంకను గాల్చి తిరిగి వచ్చాడు. సీత జాడ కనుగొని వచ్చి ఆ వార్త రామచంద్రుని చెవిన వేసిన సందర్భములోనిదీ పద్యం.


దీర్ఘకాలం సీతజాడ తెలియక దుఃఖ సముద్రములో మునిగి యున్న శ్రీరాముని వస్తూనే ముందు "కనుగొంటిన్ జానకిని---" అంటూ రాముడికి ఆ వార్త తెలియజేశాడు. కనుగొంటిన్ జానకిని అని మొదులు పెట్టడం మొల్ల అపూర్వ శిల్ప నిర్వహణకు ఒక మచ్చుతునక. హనుమ బుద్ధికుశలతకీ, వాక్చాతుర్యానికి ఈ ఘట్టం ప్రబల తార్కాణం. స్వామికార్యం చక్కగా నెరవేర్చిన ఆ భక్తుని గుండెలో సదా శ్రీరామచంద్రుడు కొలువై వుంటాడు!


"రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్" 

(ఆంధ్రభూమి మాస పత్రిక సౌజన్యముతో)


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿