Tuesday, June 30, 2015

కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi) ...By.."Padyala Vaidyudu" Late Sri Dr. C.M. Krishnamurthy Garu

కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi)

అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని. "అతి రూపవతి భార్యాశతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది.

రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది.

ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.

త||     "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు
           త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం
           తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి 
           తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్"

వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.

పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. "అతిరూపవతీ భార్యా, తు్రః"  అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.

రాజసూయ మహాధ్వరసమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని కన్ను కుట్టించింది. మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంస కంటే శత్రువు అసూయతోనైనా చేసే ప్రశంస సత్యము, ప్రశస్తమైనది.

"ద్రౌపదీదేవి అన్ని దేశాల నుండి రాజసూయ యాగం చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, దగ్గరి బంధువులను, స్నేహితులను, వీరభటులను, పనివాళ్లను, పేదలను, బైరాగులను, అందరినీ ప్రతిదినం స్వయంగా విచారించి,  తగిన రీతిగా దయతో అన్నం పెట్టి, అందరు భుజించిన తర్వాత అర్ధరాత్రి కాని తను తృప్తిగా భుజించేది కాదు. అంతేకాదు, ఆ మహాయాగంలో అధముడు కూడా ప్రేమతో పూజలందుకొన్నాడు గాని, కోరుకొన్నది లభించనివాడు ఒక్కడైనా లేడు".

రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు, సాత్యకి ముచ్చటగా ముత్యాలగొడుగు పట్టాడు. శ్రీకృష్ణపాండవులు పట్టాభిషిక్తులయిన రాజులందరిని వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మ్రొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే శ్రీకృష్ణపాండవులు, ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు" అంటాడు.

ఈ నవ్వే దుర్యోధనుని హృదయంలో గాడంగా గ్రుచ్చుకొన్నది. మాయాద్యూతానికి ఆహ్వానింపబడి ధృతరాష్ట్ర మందిరానికి భర్తలతో ఏతెంచిన పాండవధర్మపత్నిని-
"అఖిలలావణ్య పుంజంబు నబ్జభవుడు మెలతగా దీని యందు నిర్మించె నొక్కొ కానినా డిట్టి కాంతి యే కాంత లందు నేల లేదని సామర్ష హృదయలయిరి"
బ్రహ్మదేవుడు సమస్త సౌందర్యకాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీకాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు, ఇంతటికాంతి ఏ  యితర కాంతల్లోను కానరాదు- అని అక్కడి వాళ్లంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయ పడేటంత లావణ్యవతి ద్రౌపది. 

విశేషించి మయసభలో దుర్యోధనుడు పొందిన భంగపాటును చూచి, పరిచారికాపరివృతయై పక్కుమన్న ద్రౌపది నవ్వు, దుర్యోధనుని వేధించి వెంటాడి, అతనిలో ప్రతీకారజ్వాలలు రేపింది.

దాని పర్యవసానమే మాయాద్యూతం. ఇందులో ధర్మజుడు తనను, తమ్ములను, తుదకు కట్టుకున్న భార్యను కూడా పణంగా ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సూచించినవాడు, ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే. దీని పర్యవసానం భీముని భీష్మప్రతిజ్ఞలు. ఒకటి దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగటం, రెండు ఊరుభగ్నమొనర్చి, సుయోధనుని సంహరించటం.

జగద్రక్షకుడైన నారాయణుని మహిమవల్ల ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండటం చేత, ఆమె తన మానం కాపాడుకున్నది.
అరణ్యవాస సమయంలో ద్రౌపది, శ్రీకృష్ణునితో -
"నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని, వీరాధివీరులైన పాండవుల భార్యను, మహాబలశాలియైన ద్రుష్టద్యుమ్నుడి సహోదరిని, నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తల వెంటు్రకలు పట్టి ఈడ్చాడు, వలువ లొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్ధులు, బంధువులు చూచి ఊరకున్నారు. శరణువేడిన వారిని కాపాడే పాండవులే, నన్ను రక్షించండని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు గదా! ఇంకా భీమార్జునుల భుజబలమెందులకు?" అన్నది.

దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు "నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడై అర్జునుడి కఠోరబాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరక తప్పదు. సప్తసాగరాలు ఇంకినప్పటికిన్నీ, పగలూ, రాత్రీ తారుమారైనప్పటికిన్నీ, నా మాట నిజంగా జరిగి తీరుతుంది" అని ఓదార్చాడు.

అరణ్యవాస సమయంలో ఏకాంతంగా ఉన్న నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లత వలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మోహించి, బలాత్కరించబోగా, భీముడు వాని వెంటు్రకలు గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదుశిఖలుగా నిలిపి అవమానించాడు.

అజ్ఞాతవాస సమయంలో విరాటుని అంతఃపురంలో పరిచారికావేషములో ఉన్న ద్రౌపది సౌందర్యమే ఆమెకు చేటు తెచ్చి పెట్టినది.
పురజనులు, సైరంధ్రీవేషంలో ఉన్న ద్రౌపదిని చూచి ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని, మానవకాంత మాత్రం కాదు, తన రూపాధిక్యం చేత చూపరులను ఆకట్టుకొందనుకున్నారు.

దీనిని బట్టి సుధేష్ణ గాని, కీచకాదులు గాని ఆమె ద్రౌపదీత్వాన్ని గుర్తించలేదు. దేవాంగనేమో అనే సందేహంలో పడ్డారు. ఆ భావనే ఆమెకు, ఆమె అజ్ఞాతవ్రతానికి శ్రీరామరక్షగా నిలిచింది.

సుధేష్ణ ద్రౌపదితో తొలి సమాగమంలోనే, భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళూ్లరటం ఖాయం. అటువంటి నీ చేత నేను ఎట్లా పని చేయించుకొంటాను? ఆడవాళ్లు కూడా నీమీద చూపులు నిలిపి వింతగా చూస్తారు. ఇంకా వేరే మాటలు ఎందుకు?
భర్తలను మొదట అనుమానించటం స్త్రీల స్వభావం. తమ్ముడైన కీచకుడిని మాత్రం సుధేష్ణ శంకించలేదు.

అనుకున్నదొకటి, జరిగింది వేరొకటి. ద్రౌపది సౌందర్యం సింహబలునకు కాముకతను కల్పించింది, తుదకు అతని అసువులనే హరించింది.

కీచక వధాఘట్టమున ద్రౌపది వాక్చాతురి, నిర్వాహకత్వము తిక్కనగారు చిత్రించిన తీరు కడు ప్రశంసనీయమైనది. సుధేష్ణ కోరికపై కీచకమందిరానికి మద్యం తెచ్చేందుకు వెళ్లిన ద్రౌపది బలాత్కారానికి గురి కాబోయి తప్పించుకుని, పరుగుపరుగున విరాటరాజు కొలువు దీరిన సభ ప్రవేశించింది. కీచకుడు వెంటాడుతూ రాగా, కోపాతిశయంతో సమయం సందర్భం మాటమరచి, ఆగ్రహంతో ధర్మభీములున్న ఆ సభలో తన భర్తలకు తగిలి వచ్చేటట్లుగా మాట్లాడసాగింది.

మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఉన్నా, ఈ విధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ మిన్నకుండటం ఆశ్చర్యం కాదా? ఇక ఎవ్వరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈ విధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను, ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న మీలో, కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్స్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజుననాలి. కీచకుడు చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదలిపెడతారా? అని రోషంగా పలికింది. ఆ మాటలకు విరాటుడు మారు పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వవాక్యాలతో సమాధానపరచి పంపాడు. ప్రజలామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు.

ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజస్వరంతో ద్రౌపదితో ఓ వనితా, నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుధేష్ణ సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా, ఇప్పుడేమైనా, వారు కోపాన్ని ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలో ఇంతసేపు శంక లేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం సమంజసం కాదు అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడనుండి కదలలేదు.

అప్పుడు ధర్మరాజు ఇలా మందలించాడు. నీవు కులసతి గౌరవం కించపడేటట్లు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా మెలగటం తగునా? అన్నాడు. ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. కంకుభట్టా! నా భర్త నటుడు. ఆ మాట నిజం. పెద్దవారి వలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతి వలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి ఆలికి మర్యాద ఎక్కడుంటుంది? అని ఆర్తితో అక్కడి నుండి సైరంధ్రి వెళ్లిపోయింది.

ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముని వద్దకు రహస్యంగా రాత్రి వెళ్లింది. కరస్పర్శతో లేపింది. తన అవమాన గాధనంతా వివరించి చెప్పింది. అన్న ధర్మజుడు వారించకపోతే కీచకుడి అంతు ఆనాడే చూచేవాడిననీ, కానీ అందువల్ల సమయభంగమయ్యేదని వివరించాడు. మహాపద తప్పిందని ఇక కార్యసాధనకు ప్రణాళిక చెప్పాడు. కీచకుణి్న ఉపాయంతో చంపాలి. వాడు రేపు నిన్ను సమీపిస్తే, ఒడబడినట్లు నటిస్తూ నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని ఒంటరిగా అర్ధరాత్రి రమ్మని నిర్దేశించుము. సంకేతస్థలంలో నీ బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే విజృంభించి చంపి నీకు చూపుతానన్నాడు.

మరునాడు ద్రౌపది భీముడు చెప్పిన విధంగా చేసింది. అంతే, ఆ రాత్రి వాడు భీముని చేతిలో దుర్మరణం పొందాడు.

భీముడు గూఢమర్దనక్రియలతో కీచకుడిని చంపి కాళ్లూ, చేతులూ, కడుపులోకి చొప్పించి, ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. ఆ వికృతాకారాన్ని ద్రౌపదికి చూపి అదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమాన భారాన్ని మాన్చాను. నిజమా? ద్రౌపదీ, నీచింత తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్నవమానించ దలచుకొన్న ఎంత వీరుడి గతి అయినా ఇంతే. ఇది తెలిసి ఆనందించుమని భీముడు పలికాడు. భీముని ఉత్తమనాయకుడుగా కీర్తించింది ద్రౌపది.

అజ్ఞాతవాస పరిసమాప్తి అనంతరం, సంధిసంధాతగా శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరినాడు. పతులందరూ సంధికావలెనని కోరుచున్నారు. ఈ సంకటస్థితిలో శ్రీకృష్ణుడు, ద్రౌపది అభిప్రాయమడిగినాడు. ఇక ద్రౌపది పతులను వ్యతిరేకించుటెట్లు? అట్లని అవమానము భరించుటెట్లు? అప్పుడామె ప్రదర్శించిన వాక్చాతురి, నిర్వాహకత్వమును, తిక్కన ఆంధ్రభారతమున వ్యక్తీకరించిన విధానము అద్వితీయము, అమోఘము.

"వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు 
పాండుభూవరునకు కోడలైతి, జనవంద్యుల బొందితి, 
నీతివిక్రమస్థిరులగు బుత్రులం వడసితిన్, సహజన్ముల 
ప్రాపు గాంచితిన్ సరిసిజనాభ యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్"

(పుట్టింటి గౌరవం, మెట్టినింటి గౌరవం, అత్తామామల గౌరవం, భర్తల గౌరవం తనకున్నాయని అంటుంది ద్రౌపది).

"ద్రౌపది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్ దా వలచేత బూని, యసితచ్ఛవి బొల్చు మహాభుజంగమోనా విలసిల్లి వ్రేలగ, మనంబున బొంగు విషాదరోషముల్ గావగలేక బాష్పముల్ గ్రమ్మగ దిగ్గన లేచి యార్తయై"
ద్రౌపది తన ఒప్పిదమైన కొప్పును గ్రక్కున విప్పి శిరోజాలను కుడి చేతదాల్చి, నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలె ప్రకాశిస్తూ వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుఃఖాన్నీ, క్రోధాన్నీ ఆపుకొనలేక, కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున పీఠం నుండి లేచి కృష్ణా, ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చే వేళ అతడి చేతివ్రేళ్లలో చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వచనము లాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో ఉంచుకోవాలి.

ఈ నా తల వెంటు్రకలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతని దేహం యుద్ధంలో ప్రప్రథమంగా ఇంతింత ముక్కలై చెల్లాచెదురుగా నేలబడి రూపుమాసి ఉండగా చూచినప్పుడే నా మనస్తాపం చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడూ, నేను దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలమూ, ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవమధ్యముడి శౌర్యమూ తగులబెట్టనా ?

అచ్చతెనుగు పదములలో తిక్కనగారు ఏడ్చుచున్న ద్రౌపదిని, పెచ్చరిల్లిన అచ్చమైన ఆమె కోపాన్ని పఠితల కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేసినారు. శత్రుసంహారమే ఆమె కడుపు మంటకు చల్లార్పు!

దుష్టులను శిక్షించటానికి, లోకాలను రక్షించటానికి పూనుకొని ఉన్న నీవంటి తోబుట్టువు, మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవజనిత క్రోధాగ్నిని, నిప్పును ఒడిలో నుంచుకొన్న చందాన రాక్షససహనంతో భరిస్తున్నాను. ఈ పరాభవానలం శమించటం ఇంకెప్పటికో అని రోదించింది ద్రౌపది.

దీనికి సమాధానంగా  శ్రీకృష్ణుడు ద్రౌపదితో, అమ్మా! శపథం చేసి చెబుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులైన కౌరవులను యుద్ధంలో చంపి, ప్రకాశమానమైన, పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం. నమ్ముము.

కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానము ఆమె కడుపులో రగుల్కొన్న కోపాగ్ని మహాభారతసంగ్రామమునకు ఇతోధికముగ దోహదము చేసినవి. కౌరవనాశముతో అవి చల్లబడినవి.

కర్ణపర్వంలో 18 నాటి యుద్ధంలో దుశ్శాసనుడి మరణం సంభవిస్తుంది. భీముడెలా వాడిని చంపాడో తిక్కన గారి యుద్ధవర్ణనలో పరాకాష్ఠ -
"నరసింహుండసురేంద్రు వ్రచ్చు కరణి, న్రౌద్రంబుదగ్రంబుగా నురమత్యుగ్రత జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట న్వెరవారంగొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్ మొగంబున్ భయంకరరేఖం బొరయంగ జల్లికొను, నక్కౌరవ్యు జూచుం బొరిన్" 
నరసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్ట చించినట్లు భీముడు ప్రచండరౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు బెట్టిదంగా దుశ్శాసనుడి రొమ్మును చీల్చి పొట్ట నుండి పొంగే నెత్తురును దోసిలి నిండా పట్టుకొని, ఆనందాతిశయంతో ఉబ్బి, మధువు త్రాగినట్లు గుటగుట త్రాగి ఒయ్యారమొలికించి పనితనం చూపాడు. త్రాగుతూ నెత్తురును మెచ్చుకొన్నాడు. ఇంకా కొంత రక్తాన్ని ముఖం మీద, ఒంటి మీద చల్లుకొని భయంకరమూర్తి అయి క్రూరవిన్యాసాన్ని ప్రదర్శిస్తూ మాటిమాటికీ ఆ దుస్శాసనుడిని చూచాడు.

భీమునికి కౌరవులపై గల కసి, ఇట్లా చేయించింది. అతడి భయంకరరూపాన్ని చూచి యోధులు అందరూ యుద్ధం మాని నిశ్చేష్టులయ్యారు.

చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!


                                           ******* 

సైంధవుడు .!.
సైంధవుడు .!
సింధుదేశాధిపతి, దుర్యోధనునకు బావమరిది, నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సల భర్త.
స్త్రీలోలుడైన వీడు ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తికొనిపోగా, పాండవులు వీనిని పరాభవించి, తేజో వధకావించి వదిలారు. దీనికి ప్రతీకారంగా వాడు గంగానదీ తీరాన బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి పార్వతీపతిని మెప్పించి పార్థుడు లేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని వధకు కారణభూతుడయ్యాడు.
ముగియవలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని సైంధవుడని నేటికీ పిలుస్తారు.
పూర్తికావలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని లోకము సైంధవుడని పిలుస్తున్నది. ఈ అడ్డుపడు స్వభావం వీనిలో ఎలా కలిగింది? దీని పర్యవసానం ఏమిటో, మనం కవిత్రయ విరచితమహాభారతం చదివితే గగుర్పాటు కలిగించే ఉత్కంఠభరిత సన్నివేశాలను దర్శించగలం.
.
సప్తవ్యసనాలలోని, వెలది (స్త్రీ వ్యామోహం) వలన, వావివరుసలు తెలియక ప్రవర్తించిన దుర్మార్గుడు వీడు.
ఆనాడు పద్మవ్యూహమున సైంధవుడొక్కడే సవ్యసాచిని తప్ప తక్కిన పాండవులను, సాత్యకిని, ద్రుష్టద్యుమ్నుని, పెక్కుమంది సైనికులను అడ్డుకొనగలుగుట ఎవరికైన ఆశ్చర్యము కలిగించు అంశమే. అంతకు ముందతడు పాండవులచే పొందిన అవమానము, పరమేశ్వరుని ప్రార్థించి సాధించిన విశేషములతని చేత అంత పని చేయించినవి.
ఒకనాడు పాండవులు తృణబిందుడి ఆశ్రమంలో ధౌమ్యుడిని, ద్రౌపదిని ఉంచి, వేటకు వెళ్లారు. ఆ సమయంలో సైంధవుడు సాల్వకన్యను వివాహమాడే నిమిత్తమై ఆ వైపు నుండి ససైన్యుడై తరలి వెళ్తున్నాడు. ఆశ్రమద్వారంలో నిలిచి ఉన్న ద్రౌపదిని చూశాడు.
"నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగ జేయుచుం గ్రాలెడు వాలు గ్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలితదేహకాంతి పటలంబున జేసి వెలుంగ జేయు నబ్బాల వినీలకుంతవిభాసిని జూచి సవిస్మయాత్ముడై"
-నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లతవలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మనస్సులో మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.
సైంధవుడు మదనాతురుడై రథం దిగి ద్రౌపది ఆశ్రమంలో ప్రవేశించి ఆమెను పలుకరించాడు. ఆమె అతిథిమర్యాదలు చేసింది. సైంధవుడామెను వలపుగొన్న మాటలతో పలుకరించి తన వెంట రమ్మని అనుచితమాడాడు. ఆమె తనకు చెల్లెలని కూడా భావించకుండా కామాంధకారంతో మాట్లాడి, ఆమెను బలాత్కారంగా ఎత్తుకుని రథం మీద బయలుదేరాడు. ద్రౌపది ధౌమ్యుని పిలుస్తూ ఆక్రోశించింది.
అడవి నుండి తిరిగి వచ్చిన పాండవులు, ధౌమ్యుని వల్ల విషయం తెలుసుకుని సైంధవుడి మీదకు లంఘించారు. సంకుల సమరం సాగింది.
సైంధవుడు ద్రౌపదిని నేల దిగవిడిచి రథం తోలుకుని పలాయనం చిత్తగించాడు. భీమార్జునులు ఆ దుర్మార్గుని విడిచిపెట్టదలచలేదు. వారతనిని వెన్నంటి తరిమిపట్టుకొన్నారు. భీముడు సైంధవుడిని,
"ఒడలెల్ల బిండి కూడుగ బొడిచి యెగయనెత్తి త్రిప్పి భూస్థలి మీదన్
బడవైచి యురము మొగమును నడిచెను వడముడి తలప్రహార కుశలుడై"
భీముడు జయద్రథుడిని (సైంధవుడిని) లొంగదీసి శరీరాన్నంతటినీ మెత్తగా అయ్యేటట్లు దెబ్బలు కొట్టి పైకి లేవనెత్తి గిరగిర తిప్పి, తిరిగి భూమిపై పడవేసి అరచేతితో వక్షాన్ని, ముఖాన్ని మోదాడు.
"వాడియైన కత్తి వాతియమ్మున గొని పగతు శిరము చెక్క లెగయగొరిగి నరుల కెల్ల జూడ నవ్వగునట్లుగా గలయ నైదు గూకటులనొనర్చె"
-పదనుగల కత్తి అంచుగల బాణంతో భీముడు జయద్రథుడి తల పీతోలు లేచిపోయేటట్లుగా గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదు శిఖలుగా నిలిపాడు.
సైంధవుడి చేతులు వెనుకకు విరిచికట్టి తెచ్చి ధర్మజు సమక్షంలో ఉంచి, ఇతడే పాండవు దాసుడు అని నివేదించాడు. పిదప ధర్మరాజు సైంధవునితో-
"ఎట్టి కష్టుడైన నిట్టి పాపముసేయ నెత్తికొనునే ధరణి నీవు దక్క నరుగు మింక నేమి యందుము నిన్ను, నింద్రియ విలోలు, నల్పు, ధృతివిహీనున్"
-ఎట్టి దుష్టుడు అయినా ఇటువంటి నీచపు పనికి (పరదారను అపహరించేందుకు) పూనుకొంటాడా? నీవంటి అల్పుడు మాత్రమె అట్టి నీచకృత్యానికి ఒడిగట్టుతాడు. నీవంటి అల్పుడిని, ఇంద్రియవివశుడిని, ధైర్యవిహీనుడిని ఏమని నిందించలం. ఇక నీవు ఇచ్ఛవచ్చినట్లు పొమ్ము అని విడిచి పుచ్చారు పాండవులు.
పాండవులు అతడి తేజోవధ చేసి వదిలారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా జయద్రథుడు దీనుడైనాడు. అతడు సిగ్గుతో తల దించుకుని, గంగానది సముద్రాన్ని కలిసే పుణ్యతీర్థం వద్దకు వెళ్లి, ఏకదీక్షతో తన పాదం బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి, పార్వతీపతిని మనస్సులో ధ్యానిస్తూ ఘోరతపం చేశాడు. శివుడనుగ్రహించి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. సైంధవుడు పాండవులైదుగురను ససైన్యంగా ఓడించే వరం కోరాడు. శివుడది అసాధ్యమని పేర్కొన్నాడు. అర్జునుని జయించడం తనకే కష్టతరమని పేర్కొన్నాడు. పార్థుడులేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించగలిగే వరాన్ని ప్రసాదించి, అంతర్థానమైనాడు. సైంధవుడు తిరిగి సింధుదేశానికి వెళ్లాడు. ఆ సమయము కొరకు వేయికన్నులతో వేచి ఉన్నాడు.
కురుసంగ్రామం ప్రారంభమైంది. ద్రోణపర్వంలో ద్రోణుని చేత పద్మవ్యూహరచన జరిగింది. ఆ దినం తన అవమానం తీరు తరుణము, శత్రువుల ప్రియపుత్రుడు, పరాక్రమవంతుడైన అభిమన్యుకుమారుడు అంతమొందు సమయము, తన బలము, పరమేశ్వరవరము సఫలత నొందనున్న క్షణము, అన్నింటిని మించి పాండవులను జయించానన్న పేరువచ్చు ముహూర్తము, ఆనాటి సైంధవ విజృంభణము వెనుక అంత మనస్తత్వము దాగియున్నది.
పాండవులలో పద్మవ్యూహాన్ని ఛేదించి విజయాన్ని సాధించే నేర్పు అర్జునునకు, శ్రీకృష్ణునకే ఉన్నది. అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి ప్రవేశించటం తెలుసు గాని, విజయవంతంగా తిరిగి రావటం తెలియదు. వ్యూహంలో ప్రవేశించటం పాండవవీరులకు శక్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు, భీమాదులను వెంటబెట్టుకుని అభిమన్యుడి వద్దకు వెళ్లి, పార్థగోవిందుల ప్రశంసలు పొందుమని కోరాడు. భీమాదులందరూ వ్యూహంలో ప్రవేశించి దానిని ధ్వంసం చేయగలరని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు తనకు దొరికిన అవకాశం వినియోగించదలచాడు.
పద్మవ్యూహం ఛేదించిన అభిమన్యుడి వెంట, భీమాదులు మోహరంలో ప్రవేశించి, సైన్యాన్ని ఉరుమాడటం మొదలుపెట్టారు. వారికి సైంధవుడు అడ్డం పడ్డాడు. శివుడి వరం ఆనాడు సైంధవునికి అనుకూలమైనది.
పాండవులెంతో భయంకరంగా పోరాడినా సైంధవుని దాటి ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. అభిమన్యుడు వెనుకాడకుండా ముందుకు చొచ్చుకుపోయే కొద్దీ పాండవ సహాయం అందకపోవటంతో ఒంటరివాడయ్యాడు. అతని చేతిలో విల్లమ్ములుండగా జయించటం కష్టమని ద్రోణాచార్యుడు చెప్పగా, సుయోధనుడు, కౌరవవీరులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి, అన్యాయంగా అతడిని చంపటానికి ఏకమయ్యారు.
లోతైన నీటిలో దిగిన గజాన్ని బోయలు దయమాలి కొట్టి చంపినట్లు, వీరులందరూ అభిమన్యుడిని చుట్టుముట్టి ఆయుధాలతో కొట్టి చంపారు.
అరివీరభయంకరంగా యుద్ధం చేసిన అభిమన్యుడు నేలకొరిగాడు.
రక్తసిక్తమైన ఆ నేల మీద పడివున్న అభిమన్యుడు యోగనిద్రలో ఉన్న విష్ణువు వలె వెలుగొందాడు. "పెక్కండ్రు గూడి ఇమ్మెయి నొక్కని జంపుట అధర్మ మోహో" అని దిక్కులు పిక్కటిల్లేటట్లు భూతసమూహాలు కేకలు వేశాయి.
అభిమన్యుడి మరణానికి శోకించని మనిషి లేడు. అతడి పరాక్రమాన్ని కీర్తించని వీరుడు లేడు. ధర్మరాజు శోకం కట్టలు తెగిపోయింది.
సాయంకాలం సవ్యసాచి శిబిరానికి తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకుని ప్రియపుత్రుడి కొరకు విలపించి విలపించి కారణం తెలుసుకోగోరాడు.
ధర్మరాజు జరిగినదంతా వివరంగా చెప్పాడు. అభిమన్యుడికి భీమాదుల సహాయం అందకపోవటానికి సైంధవుడు అడ్డగించటమే కారణమని స్పష్టం చేశాడు. అర్జునుడు సైంధవకృత్యానికి మండిపడి అతనిని చంపుతానని భయంకర శపథం చేశాడు.
"అనిమిషదైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం, దునుముదు నెల్లి సైంధవుని, దోయజమిత్రుడు గ్రుంకకుండుమున్న, నరవరేణ్య, యిత్తెరగు నాకొనరింపగరాక యున్న నే ననలము సొచ్చువాడ నృపులందరు జూడగ గాండీవంబుతోన్"
ధర్మరాజా! దేవతలు, రాక్షసులు, కింపురుషులు మొదలైన ఎవరు వచ్చి కాపాడినా, రేపు సూర్యుడు అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే గాండీవంతో సహా అగ్నిలోకి దూకుతాను.
అర్జునుడి ప్రతిజ్ఞ అందరికీ ముఖ్యాంశమై నిలిచింది. పాండవ శిబిరంలో, కౌరవస్కంధావారంలో ప్రకంపనలు కలిగించింది. సైంధవుడు ప్రాణభయంతో గజగజలాడిపోయి పారిపోవ ప్రయత్నించాడు. ద్రోణాదులది క్షత్రియధర్మం కాదని, తమ రక్షణలో తనకెట్టి కీడు రానీయమని మాట ఇచ్చి మోహరంలో నడుమ భద్రంగా రక్షించటానికి నిశ్చయించారు.
అర్జునుడు తన ప్రతిజ్ఞ ఏ విధంగానైనా సఫలమయ్యేట్లు వరమిమ్మని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. గోవిందుడు విజయం తథ్యమని అభయమిచ్చాడు.
యుద్ధం భీకరంగా సాగింది. సూర్యుడు పడమటి కొండపైకి చేరబోతున్నాడు, కృష్ణుడు అర్జునునితో జాగ్రత్త వహించుమని మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పివేశాడు. సూర్యుడస్తమించాడని కౌరవవీరులు ఉప్పొంగిపోయారు. సైంధవుడు తల ఎత్తి పడమర వైపు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు ఆ అదనెరిగి వాడి బాణంతో సైంధవుడి తలను తెగ నరికాడు. దానిని క్రింద పడకుండా ఆకాశంలోనే చిత్రవిచిత్రబాణ విద్యానైపుణ్యంతో నిలుపుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు మాయాతిమిరం తొలగించాడు. సూర్యుడస్తమించకుండానే సైంధవుడిని చంపి, అర్జునుడు తన శపథాన్ని నిలుపుకొన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్దేశంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవశిరాన్ని అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడి ఒళ్లో పడేటట్లు చేశాడు. అతడా శిరస్సును నేల మీద పడవేశాడు. వెంటనే వృద్ధక్షత్రుడి శిరస్సు వేయి ముక్కలైపోయింది. సైంధవుడి శిరం ఎవరివలన నేలమీద పడుతుందో, అతడి శిరస్సు వేయి ముక్కలౌతుందని వృద్ధక్షత్రుడి శాపమే ఉన్నది. అతడి శాపంతోనే అతడిని దండింపజేసి, అర్జునుడికి ఆ కీడు కలుగకుండా శ్రీకృష్ణుడు చాతుర్యంతో రక్షించాడు.
స్త్రీపర్వంలో సైంధవుని భార్య దుస్సల హృదయవిదారక రోదన రణభూమి శ్మశానంలో కనబడుతుంది. ధృతరాష్ట్ర మహారాజు కోడళ్లు, కన్నీరుమున్నీరౌతూ, వారి వారి భర్తలను, అన్నదమ్ములను గుర్తిస్తూ కాకులు పొడచుకొని తింటున్న వారి శవాలను చూచి తూలిపోతున్నారు. ముక్కలైన దేహభాగాలను కలిపి తమ వారి ఆకారాలను కూర్చుకొని వనితలు భోరుమని విలపిస్తున్నారు. ఇటువంటి దారుణ దృశ్యాలను చూడటానికి బ్రతికి ఉన్న నేను పూర్వజన్మలో ఎంతటి పాపం చేశానో అని గాంధారి బావురుమన్నది. (వ్యాసమహర్షి గాంధారికి దివ్యదృష్టి ప్రసాదించాడు).
వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు, ఆమెను నిలువునా క్రుంగదీశాయి. స్త్రీపర్వంలోని స్త్రీల శోక ముపశమింపజేయ ఎవరికి సాధ్యం? భర్త కళేబరాన్ని గుర్తించలేక పిచ్చిదానివలె శ్మశాన రణభూమిలో తిరుగుతున్న దుస్సలను ఓదార్చ నెవరితరం? కారణం వృద్ధక్షత్రుని ఒడిలో పడ్డ సైంధవుని తలను ఎవరు తేగలరు? దాని చోటు ఒక్క పాశుపతాస్త్రానికే ఎరుక. ఆ రహస్యాన్ని ఎరిగినవాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆమె కోపం ఆయనపై కట్టలు తెంచుకున్నది. తుదకు యాదవనాశ శాపకారణంగా పరిణమించింది.
******

పరోపకారం... భగవంతుని చేరే మార్గం.!.
పరోపకారం... భగవంతుని చేరే మార్గం.!

భగవంతుడిని పొందడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. వాటన్నిటిలో ‘సర్వభూత హితాభిలాష’ కూడా ఒకటి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు కొలువై వుంటాడు. అందువల్ల సమస్త ప్రాణులకు హితాన్ని, సుఖాన్ని చేకూరుస్తూ వుంటే భగవంతుడిని సేవించినట్టే అవుతుంది. ఎవరి హృదయం అయితే పరుల హితాన్ని కోరుకుంటూ వుంటుందో వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాసు కూడా చెప్పాడు. స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది.
పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్
నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే
తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే
ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు.
నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...
లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః
ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.
పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుంది, పాప రహితులైన రుషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి. తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.
పరోపకారం... భగవంతుని చేరే మార్గం

భగవంతుడిని పొందడానికి ఎన్నో మార్గాలు వున్నాయి. వాటన్నిటిలో ‘సర్వభూత హితాభిలాష’ కూడా ఒకటి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు కొలువై వుంటాడు. అందువల్ల సమస్త ప్రాణులకు హితాన్ని, సుఖాన్ని చేకూరుస్తూ వుంటే భగవంతుడిని సేవించినట్టే అవుతుంది.  ఎవరి హృదయం అయితే పరుల హితాన్ని కోరుకుంటూ వుంటుందో వారికి లోకంలో దుర్లభమైనది ఏదీ వుండదని భక్త తులసీదాసు కూడా చెప్పాడు. స్కాంద పురాణంలో ఒకచోట ఇలా పేర్కొనబడింది.

పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్
నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే
తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్
తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే


ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు.

నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారు...

లభంతో బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూషితే రతాః


ఎవరి పాపములు నశించినవో, ఎవరి సకల సంశయాలు జ్ఞానం వల్ల తొలగిపోయినవో, ఎవరు ప్రాణుల హితమునందు ఆసక్తి వున్నవారై వుంటారో, ఎవరు మనస్సును జయించి నిశ్చలముగా పరమాత్మలో నిలిచి వుంటారో అట్టి బ్రహ్మవేత్తైన పురుషులు శాంత బ్రహ్మను పొందుతున్నారు.

పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగి వుంది, పాప రహితులైన రుషులు సర్వభూత హితరతాన్ని కలిగి వుండటం వల్ల నిర్వాణ బ్రహ్మను పొందుతున్నారు. కాబట్టి మానవుడు సర్వ విధాలా స్వార్థాన్ని పరిత్యజించి, తన తనువును, మనసును, ధనమును ఇతరుల హితానికి అర్పించి దుఃఖంలో వున్నవారికి, అనాథలు, ఆపదలో వున్నవారికి సేవ చేయాలి. అభావంతో బాధపడుతున్న ప్రాణుల దుఃఖాన్ని నివారించి వారికి సర్వం వినియోగించాలి.  తమ జీవనము, తమ సర్వస్వము దీనులు, దుఃఖ గ్రస్తులు, అనాథలైన జనులను సేవించడం కోసమే వున్నదని ఎవరైతే భావిస్తారో వారు ధన్యజీవులు.
- See more at: http://www.teluguone.com/devotional/content/%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AA%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AD%E0%B0%97%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B0%E0%B1%87-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82-278-33507.html#sthash.ArSWawk5.dpuf
      అవక్రీతుడు
       అవక్రీతుడు

       అవక్రీతుడు

అమృత వర్షిణి.!


అమృత వర్షిణి.!
అద్వైతాన్ని
అమరత్వాన్ని
అనంత జీవన ప్రవాహాన్ని
ఆద్యంత రహితమైన కాలాన్ని
నా పేరే అమృత వర్షిణి

బంధాన్ని
ప్రణయ ప్రబంధాన్ని
ప్రాయపు సరసులో
అరవిరిసిన అరవిందాన్ని
నా పేరే అమృత వర్షిణి
రాగాన్ని
సరస సరాగాన్ని
నీ హృదయం ఆసాంతం
నిండి ఉన్న అనురాగాన్ని
నా పేరే అమృత వర్షిణి
వేదాన్ని
ప్రణవ నాదాన్ని
ప్రకృతి వైవిధ్యాలుగా
వ్యక్తమౌతున్న ఏకత్వాన్ని
నా పేరే అమృత వర్షిణి
నీ కవిత్వాన్ని
నీ జీవన సమస్తాన్ని
నీ మధుర భావాలలో
సదా వ్యక్తమౌతున్న సత్యాన్ని
నా పేరే అమృత వర్షిణి
స్వరాన్ని
దైవ దత్తమైన వరాన్ని
శృతి సుమ పరిమళాల్ని
వెదజల్లు మలయ సమీరాన్ని
నా పేరే అమృత వర్షిణి
కావ్యాన్ని
కవి హృదయాన్ని
ఆ హృదయం పై ఎన్నటికి
మానని గాయాన్ని
నా పేరే అమృత వర్షిణి.!
.
(శ్రీ సునీల్ కుమార్ గారి..అమృత వర్షిని నుండి.)

Monday, June 29, 2015

కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!!
.
                                                            కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!!
"పొద్దున్నే ఈ వెధవ ట్యూషన్ కనిపెట్టినవాడిని చంపెయ్యాలి!", అని ఏడ్చుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరాను. అప్పుడు నా వయస్సు ఆరేడేళ్ళు వుంటాయ్ అనుకుంటా. ఇంటి పక్కనే, మా స్కూలు పంతులమ్మ ఒకావిడ పాఠాలు చెప్పేవారు. చాలా మంచావిడ. కాకపొతే కొంచెం ఆలస్యం ఐనా, మార్కులు తక్కువ వచ్చినా చంపేస్తారు. పొద్దున్నే అమ్మ ఎలాగో తన్ని నిద్ర లేపి పంపిస్తుంది, మళ్ళీ తన్నులు తినాలి అంటేనే కొంచెం బాధ. అది కూడా అమ్మాయిల ముందు! ఛీ.. ఛీ.. పరువు పోతుంది. 'ఏదో చిన్నపిల్లోడు, ఇంత పొద్దున్నే ఎలా వస్తాడు?', అని వదిలెయ్యొచ్చుగా! బాగా తంతారు, దానికి తోడు మిగతా పిల్ల రాక్షసులు పొద్దున్నే తగలెడతారు. వాళ్ళతో పోలిక ఒకటి. బతుకు నరకం అయిపోయింది. తొందరగా పెద్దోళ్ళం అయిపోతే ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుంది.
'ఇలా వారం అంతా గడిచిపోతుంది. పొద్దున్నే లేవటం, ట్యూషన్ కి వెళ్ళటం! అక్కడినుండి రాగానే స్కూలు! ఛీ! వెధవ బ్రతుకు ఎన్నాళ్ళు చదవాలో ఏంటో!', అనుకుంటుంటే వారాంతం వచ్చేది. వుండేది ఒక్క రోజు, కనీసం ఆ రోజు ఆడుకుందాం అంటే వచ్చే వారం నుంచి ఆ వేళ కూడా ట్యూషన్ పెడుతున్నారు. అర్థవార్షిక పరీక్షలు వస్తున్నాయి కదా! లాభం లేదు ఏదో ఒకటి చేసి ఆ వేళ ట్యూషన్ ఎగ్గొట్టాలి అని నిర్ణయించుకున్నా! పైగా ఆ వేళ లవుకాంత్ (నా స్నేహితుడు, వాళ్ళ అమ్మానాన్నల్ది ప్రేమపెళ్ళి గుర్తుగా వాడికి ఆ పేరు పెట్టారు) వాళ్ళతో మ్యాచ్ (కోతికొమ్మచ్చి) ఉంది. పోయినవారం మమ్మల్ని ఓడించి పెద్ద పోసు కొట్టాడు, వెధవ. ఈ వారం వాళ్ళకి చుక్కలు చూపించాలి అనుకున్నానే! ఇప్పుడేమో ఈ ట్యూషన్. ఆ విషయం వాడికి చెప్తే భయపడి, తప్పించుకోవటానికి ఇలా చెప్తున్నాను అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే వారం అంతా అయిపోయింది. వస్తుంది వస్తుంది అనుకుంటున్న ఆదివారం రానే వచ్చింది. అదృష్టవశాత్తూ ఆ వేళ పొద్దున్నే ట్యూషన్. "హిప్ హిప్ హుర్రే!", అనుకుంటూ ఎగిరి గంతేసాను. మొత్తానికి ట్యూషన్ మానటానికి అనవసరంగా అబద్దాలు చెప్పక్కర్లేదు అనుకుంటూ ఆనందంగా ఉదయాన్నే లేచి ట్యూషన్ కి బయల్దేరాను.
ట్యూషన్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం సరిపోయింది. చదువు-సంద్యా లేకుండా అలా అలా సమయం గడిపేశాను. మొత్తానికి ట్యూషన్ అయిపోయింది. ఇంక సంచి బుజాలకెత్తుకొని పరిగెత్తి పరిగెత్తి ఇంటికొచ్చాను. ఏదో రెండు మెతుకులు మెక్కి మ్యాచ్ ఆడటానికి పరిగెత్తాను. ఆడాం.. మళ్ళీ ఓడాం . ఉసూరుమంటూ ఇంటికి వస్తే నా ఖర్మ కొద్దీ రోజూ ఆలస్యంగా వచ్చే నాన్నగారు ఆ వేళ తొందరగా వచ్చారు. "ఎక్కడికి వెళ్ళావు రా ఇంట్లో చెప్పకుండా? నీకు అసలు భయం లేకుండా పోతుంది", అంటూ అప్పుడే కొట్టేసిన సరుకు చెట్టు పుల్లతో ఒళ్ళంతా వాయగొట్టారు. అసలే మ్యాచ్ ఓడిపోయి వస్తే ఇంట్లో కూడా వళ్ళు హూనం అయిపోయింది. అదే మొదటిసారి నాన్నగారు నన్ను కొట్టడం!! ఆ రోజంతా దెబ్బలు బాగా నొప్పిపెట్టాయి. ఇంకా జన్మలో మళ్ళీ కోతికొమ్మచ్చి ఆడకూడదు అని తీర్మానం చేసుకున్నా.
మళ్ళీ వారం అంతా స్కూలు, ఇల్లు, ట్యూషన్, చదువులతో సరిపోయింది. అన్నట్టు చెప్పడం మరిచాను మళ్ళీ ఆదివారం కోతికొమ్మచ్చి మ్యాచ్ ఆడాం. గెలిచాం కూడా. ఈ సారి నాన్నగారికి దొరకలేదు లేండి!!
.
కృతజ్ఞతలు:-బ్లాగ్ తెలుగువారమండీ(దీలిప్.)

_శ్రీ కృష్ణ శతకం.!........( 30 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

_శ్రీ కృష్ణ శతకం.!........( 30 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరున
భయమున రిపుసేన విఱిగి పాఱగ కృష్ణా!
.

ఓ కృష్ణా! కౌరవసేన, నీ సారథ్యమును చూసి భయపడి పారిపోయేటట్లు నీవు అర్జునునికి రథసారథివై అత్యంత వేగముతో రథమును తోలి విజయము సిద్ధించునట్లు సాయపడితివిగదా!
..
దుర్జనౌలగు నృపసంఘము
నిర్జింపcగదలcచి నూవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జునునకు నీవు సారధైతివి కృష్ణా!
.

సమస్త లోకములకు ఆధారభూతుడవైన ఓ కృష్ణా! దుర్జనులైన దుర్మార్గ రాజ సమూహములను నిర్మూలించుటకై, సన్మార్గుడైన అర్జునునకు సారధివైనావు.
.
శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్మ జంపఁగ జను నీ
విక్రమ మేమని పొగడుదు
శక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా!
.

ఓ కృష్ణా! కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుని ధాటికి ఆగలేక, అర్జునుడు భీతిల్లు సమయములో నీవు చక్రమును చేత ధరించి "భీష్ముని చంపుదు, నిన్నుగాదు విడువుమర్జునా" అని నీవు చూపిన పరాక్రమమును వర్ణించ, మేము ఎంతటి వారము?
.
దివిజేంద్రసుతుని జంపియు
రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్రసుతుని గాచియు
రవిసుతు బరిమార్చితౌర రణమున కృష్ణా!
.

ఓ కృష్ణా! నీ గొప్పతనము ఏమని పొగడగలను? ఎంతని పొగడగలను? రామావతారంలో ఇంద్రుని సుతుడు వాలిని చంపి, సూర్యుని సుతుడైన సుగ్రీవుని రక్షించావు. ఇప్పుడు కృష్ణావతారంలో సూర్యుని సుతుడైన కర్ణుని చంపించి, ఇంద్రుని సుతుడైన అర్జునుని కాపాడినావు. ఇది ఎంత ఆశ్చర్యకరము కృష్ణా! ఈ సూక్ష్మమును గ్రహించుటకు మేము ఎంతవారము తండ్రీ!


ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు - ఆరుద్ర

 

 

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం

మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో  ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?

ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం, సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి.

సంస్కృత హరివంశంలోని ౩౪వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.

యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ వున్నారు. ఆ పుత్రికల పేర్లను హరివంశం ఇలా చెబుతుంది.

పృధుకీర్తి: పృథాచైవ
శ్రుతదేవా శ్రుత శ్రవఁ
రాజాధిదేవీ చకదా
పంచైతై వీరమాతరః
                 (అధ్యాయం  శ్లో ౧౯-౩౨)

వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశం ఈ అధ్యాయంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.

౧. పృదకీర్తి
        భర్తః వృద్ధశర్మ కరూశాధిపతి
        కొడుకుః దంతవక్త్రుడు

౨. శ్రుతదేవ
        భర్తః కేకయేశ్వరుడు హిరణ్యధన్వుడు
        కొడుకుఛ ఏకలవ్యుడు

౩. శ్రుతశ్రవ
        భర్తః చేదిరాజు దనుఘోషుడు
        కొడుకుః శిశుపాలుడు

౪. పృధ(కుంతి)
       భర్తః పాండురాజు
       కొడుకులుః పాండవులు

౫. రాజాధిదేవి
       భర్తః అనంతపతి
       కొడుకులుః విందాను విందులు


         కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.

దేవశ్రవాః ప్రజాతస్తు
నైషాదిర్యః చ్రతిశ్రుతిః
ఏకలవ్యో మహారాజ
నిషాదైః వధివర్థితః
                     (౬-౪ శ్లో ౩౩)


ఈ శ్లోకార్థమేమిటంటే? దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన నేకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు.(పూర్వం ౩-౧౬౧) కేకయ రాజు సుక్షత్రియుడు కానందు వల్లనే నిషాదుడయ్యాడు.సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి వుంది. "కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు." క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.

ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు వుండేవి.

అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరుగాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రియ స్ర్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు.

మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాట-౪-౧౨౦) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది.

హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ౯౩వ అధ్యాయం నుంచి ౯౯వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది.


ఏకలవ్యుడు
(Ekalavya)

రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందినా పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. "అతను ఏకలవ్యుడంతటి దీక్ష కలవాడు" అని, "నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి" అని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా! అదేంటో తెలుసుకుందాం.
ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకలవారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంది. తాను నిషాద (ఎరుకల) కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు..
ఒకరోజు ఏకలవ్యుడు, అస్త్రవిద్యలో గురువర్యుడు అయిన దోణాచార్యుని వద్దకు వెళ్ళి, ''అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది" అని అడిగాడు. ద్రోణుడికి నిషాద బాలుడైన ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ, ఆ మాత బహిరంగంగా చెప్పకుండా "బాగా సాధన చేయి, అదే వస్తుంది" అన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి, వెనుదిరిగి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారుచేసుకుని, భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే, నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షటో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు.
ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే, కళ్ళతో చూడకుండా, కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ వేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మట్టుకు శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు.
ఏకలవ్యుడి సంగతి అలా ఉండగా...
దోణాచార్యుడు అస్త్ర విద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు దోణాచార్యుని అస్త్ర విద్యలు నేర్పేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే. కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ, అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహా ప్రేమ. తన అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు.
ఓ సందర్భంలో ద్రోణుడు, తన శిష్యునితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు, ఎవరు, ఏమిటి అని చూడకుండానే, శబ్దవేది విద్యలో ఘటికుడు కనుక కుక్క మొరిగిన దిశగా బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలింది. కుక్క మూలుగుతూ పడటంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు.
ఏకలవ్యుడి విలువిద్యా చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. ''తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారుచేస్తానని మాట ఇచ్చి తప్పారు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉంది. అంటే, తనను మాయచేసి, ఎరుకలవాన్ని మరింత ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు'' అనుకున్నాడు. దాంతో "గురువుగారూ, మీరు మాట తప్పారు.. మీకు నాకంటే నిషాదుడే ఎక్కువ కదూ!'' అనేశాడు.
ద్రోణుడు అర్జునుడు బాధపడటం సహించలేకపోయాడు. నిజంగానే తాను అర్జునిడికి ఇచ్చిన మాట నెరవేరలేదు. దాంతో ఏకలవ్యునివైపు తిరిగి, ''ఎకలవ్యా! విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు.. మరి, నా గురుదక్షిణ ఏది?" అన్నాడు.
ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ళతో కాళ్ళమీద పడిపోయి, "కోరుకోండి, అయ్యా.. నేను ఇవ్వగలిగింది ఎదైయినా ఇస్తాను'' అన్నాడు. ద్రోణుడు "నీ కుడిచేతి బొటనవేలు ఇస్తావా?" అన్నాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బొటనవేలు కోసిచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు.
- See more at: http://www.teluguone.com/devotional/content/ekalavya-278-2850.html#sthash.5PHTVxvV.dpuf
ఏకలవ్యుడు
(Ekalavya)

రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందినా పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. "అతను ఏకలవ్యుడంతటి దీక్ష కలవాడు" అని, "నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి" అని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా! అదేంటో తెలుసుకుందాం.
ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. సహజంగానే ఎరుకలవారికి విలువిద్యలో ప్రవేశం ఉంటుంది. ఏకలవ్యుడికి అందులో మరీ ప్రావీణ్యం ఉంది. తాను నిషాద (ఎరుకల) కుటుంబంలో పుట్టినప్పటికీ విలువిద్యలో అగ్రగణ్యుడిగా నిలవాలనుకున్నాడు..
ఒకరోజు ఏకలవ్యుడు, అస్త్రవిద్యలో గురువర్యుడు అయిన దోణాచార్యుని వద్దకు వెళ్ళి, ''అయ్యా, నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది" అని అడిగాడు. ద్రోణుడికి నిషాద బాలుడైన ఏకలవ్యుని శిష్యునిగా స్వీకరించడం ఇష్టం లేకపోయింది. కానీ, ఆ మాత బహిరంగంగా చెప్పకుండా "బాగా సాధన చేయి, అదే వస్తుంది" అన్నాడు. ఏకలవ్యుడు రెట్టించలేదు. ద్రోణుడన్న ఆ మాటనే ఆశీర్వాదంగా భావించి, వెనుదిరిగి వెళ్ళాడు. అంతేకాదు, ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారుచేసుకుని, భక్తిగా నమస్కరించాడు. ఇక ఆ విగ్రహాన్నే, నిలువెత్తు దైవంగా, ప్రత్యక్ష గురువుగా తలుస్తూ కఠోర దీక్షటో విలువిద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు.
ఏకలవ్యునికి విలువిద్యలో ఎంత నైపుణ్యం అబ్బిందంటే, కళ్ళతో చూడకుండా, కేవలం శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించగలడు. కంటితో చూస్తూ వేసిన వారికే ఎన్నోసార్లు గురి తప్పుతుంది. కానీ ఏకలవ్యుడు మట్టుకు శబ్దవేది విద్యలో ఆరితేరినవాడు కావడంతో గురి తప్పదు.
ఏకలవ్యుడి సంగతి అలా ఉండగా...
దోణాచార్యుడు అస్త్ర విద్యలో సాటిలేని మేటి. అందుకే భీష్ముడు కౌరవ పాండవులకు దోణాచార్యుని అస్త్ర విద్యలు నేర్పేందుకు గురువుగా నియమించాడు. గురువు అందరికీ సమానమే. కానీ శిష్యులు అనేక రకాలుగా ఉంటారు. ద్రోణుడు అందరికీ నేర్పిస్తున్నప్పటికీ, అర్జునుడు అందరికంటే మిన్నగా ఉన్నాడు. దాంతో అర్జునుడిపై ద్రోణుడికి మహా ప్రేమ. తన అనుంగు శిష్యునిగా భావించి ఎన్నో కిటుకులు నేర్పాడు.
ఓ సందర్భంలో ద్రోణుడు, తన శిష్యునితో కలిసి వేటకు వెళ్ళాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, వారి వెంట ఉన్న కుక్క అరిచింది. కొంత దూరంలో ఉన్న ఏకలవ్యుడు, ఎవరు, ఏమిటి అని చూడకుండానే, శబ్దవేది విద్యలో ఘటికుడు కనుక కుక్క మొరిగిన దిశగా బాణం వేశాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలింది. కుక్క మూలుగుతూ పడటంతో ఏకలవ్యుడు అటుగా వచ్చాడు. తన గురువు ఎదురుగా కనిపించడంతో ఆనందానికి గురయ్యాడు.
ఏకలవ్యుడి విలువిద్యా చాతుర్యానికి ద్రోణుడు మనసులో ముగ్ధుడయ్యాడు. అర్జునుడికి మాత్రం కోపం, దుఃఖం పొంగుకొచ్చాయి. ''తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారుచేస్తానని మాట ఇచ్చి తప్పారు అనిపించింది. అక్కడ గురువుగారి విగ్రహం కూడా ఉంది. అంటే, తనను మాయచేసి, ఎరుకలవాన్ని మరింత ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు'' అనుకున్నాడు. దాంతో "గురువుగారూ, మీరు మాట తప్పారు.. మీకు నాకంటే నిషాదుడే ఎక్కువ కదూ!'' అనేశాడు.
ద్రోణుడు అర్జునుడు బాధపడటం సహించలేకపోయాడు. నిజంగానే తాను అర్జునిడికి ఇచ్చిన మాట నెరవేరలేదు. దాంతో ఏకలవ్యునివైపు తిరిగి, ''ఎకలవ్యా! విలువిద్యలో నువ్వు నిజంగానే ఘనత సాధించావు.. మరి, నా గురుదక్షిణ ఏది?" అన్నాడు.
ఏకలవ్యుడు గురువు మెచ్చుకోవడంతో అంతులేని ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ళతో కాళ్ళమీద పడిపోయి, "కోరుకోండి, అయ్యా.. నేను ఇవ్వగలిగింది ఎదైయినా ఇస్తాను'' అన్నాడు. ద్రోణుడు "నీ కుడిచేతి బొటనవేలు ఇస్తావా?" అన్నాడు. ఏకలవ్యుడు నిర్వికారంగా తన బొటనవేలు కోసిచ్చాడు. అంటే తన ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేశాడు.
- See more at: http://www.teluguone.com/devotional/content/ekalavya-278-2850.html#sthash.5PHTVxvV.dpuf

చందమామ కధ......వెర్రి వెంగళమ్మలు.!


చందమామ కధ......వెర్రి వెంగళమ్మలు.!
.

భాష భారతి's photo. అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని. “మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ.
“ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు.
“ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ.
వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు.
తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా. వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా.
"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లో‌నే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా.
బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు.
మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది.
“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ‌ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా. “అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు.
ఆమె అమాయకపు మాటలకి వ్యాపారికి బలే కోపం వచ్చింది. అయినా తమాయించుకుని "ఆ బేరగాడి ఆచూకీ తెలుసుకొని వస్తాను ఆగు!" అని హడావుడిగా సంత వైపు బయలుదేరి పోయాడు.
సంతలో‌ మోసగాడి ఆచూకీ కొంత సులభంగానే దొరికింది. వాడి ఊరు మరీ ఏమంత దూరం కాదు. వ్యాపారి ఆ మోసగాడి ఆనవాలు పట్టుకుని ఆ ఊరికి బయలుదేరాడు.
నడుస్తూ నడుస్తూ వెనుదిరిగి చూసిన వ్యాపారికి ఓ వింత దృశ్యం కనబడింది. అతని వెనకగా ఎద్దుల బండి ఒకటి వస్తున్నది. ఆ బండి ఇరుసుపైన ఒక కాలు నిటారుగా మోపి, క్రిందికి పడిపోకుండా సర్దుకుంటూ నిలబడి బండిని తోలుతున్నది ఒకామె. బండిలో నిండుగా గడ్డి ఉంది- కావాలనుకుంటే ఆమె గడ్డి మీదైనా కూర్చోవచ్చు; లేదా దిగి నడుచుకుంటూ అయినా రావొచ్చు. రెండూ కాకుండా ఇరుసు మీద ఎందుకు, అలా ఒంటికాలి మీద నిలబడటం? 'ఈమె ఎవరో గొప్ప అమాయకురాలిలాగానే ఉంది' అనుకుని నవ్వుకున్నాడు వ్యాపారి.
వెంటనే అతనికి వెంగమ్మ మాటలు గుర్తొచ్చాయి. "పాపం, వెంగమ్మ మాటలు నిజమే కావొచ్చు- లోకం ఏమంత తెలివిగా లేదు- ఈమె ఎంత వెర్రివెంగళమ్మో కనుక్కుందాం!" అనుకున్నాడు.
కొంచెంసేపు ఆగి, బండి తన దగ్గరికి రాగానే ఆమెని పలకరిస్తూ "ఏమమ్మా, ఎందుకట్లా ఒంటి కాలిమీద నిలబడటం? పడితే ప్రమాదం కదా? గడ్డి మీద కూర్చొని రావొచ్చు; లేకపోతే అసలు పూర్తిగా దిగి నడిచి రావొచ్చు" అన్నాడు అతను.
“మా అబ్బాయి అట్లా చెప్పలేదు- బండి మీదే రమ్మన్నాడు" అన్నదామె పడిపోకుండా మళ్ళీ సర్దుకొని నిలబడుతూ- "ఇంతకీ నువ్వెవరు? నిన్ను మా ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు- ఏదో ఆకాశంలో నుండి ఊడి పడ్డట్లున్నావు!" అన్నది ఆమె.
వ్యాపారికి ఆమెను కొంచెం ఆటపట్టించాలనిపించింది. "అవునవును- బలే కనుక్కున్నావే?! నిజంగానే నేను ఆకాశం నుండి ఊడిపడ్డాను- మీ ఊరు చూసి పోదామని!" అన్నాడు ఎగతాళిగా.
ఆమె నిజంగానే అమాయకురాలు. వ్యాపారి మాటలు నిజమనుకున్నది. "అవునా, అయితే నిన్నొకటి అడుగుతా చెప్తావా? మా ఇంటాయన పైకి వెళ్ళి మూడేళ్ళవుతున్నది. నీకు ఆయన అక్కడ కనిపించే ఉండాలి కదా, ఎట్టా ఉన్నాడు, కులాసానేనా?!” అని అడిగింది సూటిగా.
'వార్నాయనో, ఈమెవరో మా వెంగమ్మ కంటే వెంగళమ్మ. దేశంలో నిజంగానే చాలామంది అమాయకులు ఉన్నట్లున్నది" అనుకున్నాడు వ్యాపారి- "ఓఁ, చూడకేమి?! రోజూ చూస్తూనే ఉన్నాను మీ ఇంటాయన్ని. పాపం ఆయనకి అక్కడ గొర్రెలు కాచే పని ఇచ్చారు. మరి అవేమో, ఒక్క చోట నిలవకుండా కొండా-కోనా; గుట్టలూ-మిట్టలూ తిరుగుతున్నాయి. వాటి వెంబడి తిరగలేక మీ ఆయన నానా అవస్థలు పడుతున్నాడు. గుడ్డలు కూడా పీలికలై పోయాయి!" అన్నాడు పైకి.
“అయ్యో, మాకు ఎట్టా తెలుస్తుంది ఆ సంగతి?! మేం‌ ఇక్కడే ఉన్నామాయె. అయినా మొన్న సంక్రాంతి పండక్కి బట్టలు కూడా పెట్టుకున్నామే; అంత అవసరం ఉంటే వచ్చి తీసుకు పోకూడదా?” అని యాష్టపడిపోయిందామె. "ఇక్కడే ఉండండి, ఇంటికి పోయి గుడ్డలు తెచ్చిస్తాను. ఈసారి పైకి వెళ్ళగానే మా యింటాయనకు ఇద్దురు" అని వేడుకున్నది.
వ్యాపారికి నవ్వు ఆగలేదు. ఆమెని ఇంకా పరీక్షించటం కోసం అతను "అది వీలు పడదు తల్లీ, ఆకాశానికి ఒక పెద్ద ద్వారం ఉంటుంది. అక్కడ ఉండే ద్వారపాలకుడికి లంచం ఇస్తేగాని వేటినీ లోపలికి తీసుకోని పోనివ్వడు, ఏం చేయను?!" అన్నాడు. “అలాగేలే, ఎంతో కొంత ఇస్తే సరి! నిన్ననే మా అబ్బాయి ధాన్యం అమ్మిన డబ్బులు తెచ్చి ఇనప్పెట్టెలో పెట్టాడు. గుడ్డలు, డబ్బులు తెచ్చి ఇస్తాను- కాసేపు ఆగండి" అని బండిని తోలుకొని ఇంటికి వెళ్ళింది ఆమె. వ్యాపారి అక్కడే ఆగిపోయాడు.
కొద్దిసేపటికల్లా గుడ్డలు, పైకం తీసుకుని అక్కడకి వచ్చింది అమె!
'ఈమె వెంగమ్మకు అక్క' అని గ్రహించిన వ్యాపారి కలవర పడిపోయి "ఒక్కసారి మీ అబ్బాయిని చూసి వెళతాను తల్లీ!" అని ఆమెతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె కొడుకుకు జరిగినదంతా చెప్పి, ఆమె ఇచ్చిన డబ్బులు, గుడ్డలు అతనికి తిరిగి ఇచ్చేశాడు.
ఆ యువకుడు వ్యాపారికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుని "మీరెవరు? ఏం పని మీద వచ్చారు?' అని అడిగాడు. "నా భార్య వెంగమ్మ కూడా మీ అమ్మ మాదిరిదే- ఏమీ తెలీదు పాపం. మొన్న నేను ఊళ్ళో లేనప్పుడు మీ ఊరివాడు ఎవడో వచ్చాడట; మా వెంగమ్మని మోసం చేసి ఆవులని రెండింటిని తీసుకెళ్ళిపోయాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఇట్లా వచ్చాను" చెప్పాడు వ్యాపారి విచారంగా.
ఆ కుర్రవాడికి ఊళ్ళో వాళ్ళంతా పరిచయమే- "ఓఁ, వాడు నాకు తెలుసు. వాడో పెద్ద మోసగాడు. నిన్ననే రెండు ఆవుల్ని తెచ్చాడు. అవి మీవే అయి ఉంటాయి- చూద్దాం పదండి" అని అతని ఇంటికి తీసుకు వెళ్ళాడు వ్యాపారిని.
తన ఆవుల్ని చూడగానే గుర్తుపట్టాడు వ్యాపారి. అవి కూడా వ్యాపారిని చూసి సంతోషంగా అరిచాయి. వెంటనే వ్యాపారి న్యాయాధికారికి ఫిర్యాదు చేయటం, న్యాయాధికారి విచారణ జరిపి మోసగాడిని శిక్షించటం, జరిమానాతో సహా ఆవుల్ని వ్యాపారికి ఒప్పచెప్పటం జరిగాయి.
వ్యాపారి ఇంటి కొచ్చి ఆవుల్ని కొట్టంలో కట్టేస్తుంటే "నేను చెప్పలేదూ, అతను చాలా మంచివాడేనని?! పాపం, మన ఆవుల్ని మనకు ఇచ్చేశాడు చూడు!" అన్నది వెంగమ్మ.
"నిజమేనే, లోకంలో నీలాంటివాళ్ళూ, నాలాంటివాళ్ళూ చాలా మందే ఉన్నారు. వాడిలాంటివాళ్ళూ ఉంటారు. అయితే అమాయకుల్ని మోసం చేస్తే ఎప్పటికైనా శిక్ష మటుకు

Sunday, June 28, 2015

బాపు ..రమణల కోతికొమ్మచ్చి చదివాక .


బాపు ..రమణల
కోతికొమ్మచ్చి చదివాక .....
నా మనసుకు గుబులొచ్చి ...
కొమ్మకు రెమ్మొచ్చి ,రెమ్మకు పువ్వొచ్చి ....
నాకేదో అనిపించి ......
రాయాలన్న తపన హెచ్చి ...
టావుల కొద్ది పేపర్లు చించి ..
తెగ రాసి విసుగొచ్చి ...
బజ్జొన్న ...నిదరొచ్చి ....!!!!!!
మాధవి అన్నాప్రగడ

మగవారూ - ఆడవేషాలూ .!

మగవారూ - ఆడవేషాలూ .!
.
ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం' నాటకానికి వెళ్లాను.
దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే దృశ్యం. చీరలు ఎంత మట్టుకు లాగాలో దుశ్శాసనుడికి తెలియదు. ఎంతవరకూ లాగించుకోవాలో ద్రౌపదికీ తెలియదు. ఇద్దరూ కూడా చెడ తాగి ఉన్నారు. ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పడి వుండేది. కాని వేషం కట్టినది పురుషుడు కదా! 'వద్దు వద్దు' అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు - ద్రౌపది ఆపలేదు.
చివరికి ద్రౌపది వేషధారికి పైన 'రైక', క్రింద గావంచా మిగిలింది. నెత్తిపైన బోర్లించిన బుట్టలా సవరం ఒకటి! సృష్టికంతకు ఒక్కటే దిష్టిపిడతలా ద్రౌపది మిగిలింది.
పుట్టు గుడ్డి వేషం వేస్తున్న ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు. తెర దించబోతే పడలేదు. ద్రౌపదికి నాటకం కాంట్రాక్టరుకి భయం వేసింది కాబోలు కిందకు ఉరికాడు. ద్రౌపది వేషధారి తను ఆడో, మగో మర్చిపోయి పురుషుల వైపుకు పరిగెట్టాలో, స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థం కాక చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ల మధ్యన కూచున్నాడు. ఆడవాళ్లంతా తటాలున లేచిపోయి పాక కాలినంత హడావుడి చేసి కేకలు వేశారు. చివరకు కొందరు మగవాళ్లు వచ్చి ఆ వేషధారిని చావగొట్టారు.
కొంతకాలం పాటు ఆడవేషాలు వేస్తే పాత్రధారి ఇలాగే అవుతాడు. -


మగవారూ - ఆడవేషాలూ

మగవారూ - ఆడవేషాలూ
-కవి శేఖర పానుగంటి లక్ష్మీనరసింహారావు
ఒక మహిళా సంఘంలో ఉపన్యాసం ఇవ్వడానికి ఒకామె రాసుకున్న ప్రసంగ వ్యాసం సాక్షి సంఘానికి చేరింది.

మగవాడు మొదటి నుండి మన అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని తెలిసి కూడా అతని పాపాన అతడే పోతాడని ఊరుకున్నాం చాలా కాలం.

ఇప్పుడు వాళ్ళకెదురు తిరిగి అన్ని రంగాలలో పైకి వస్తున్నాము కాబట్టి అసూయతో కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు.వారికి సమానం కావాలనే దురాశతో మనం వారిని అనుకరిస్తున్నామని వెక్కిస్తున్నాడు.

మనకు అవసరమైనది మనం చేస్తున్నాము కాని తనను అనుకరించే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదని అతనికి ఎందుకు తెలియదు.? తాను మాత్రం ఎవరిని ఇమిటేట్ చేసి యిన్ని వేషాలు తెచ్చుకున్నాడు.

తను మనసు కాఫీ కొట్టవచ్చా ? కానీ మనం మాత్రం అతన్ని కాఫీ కొట్టకూడదా ? నాటకాలలో స్త్రీ పాత్రలు మగవాళ్ళు ఎందుకు వెయ్యాలి ?సొగసుగా ఉంటుందని మనం, ముంగురులు ఆ చెంపా ఈ చెంపా..ఒక్కొక్క అంగుళం వెడల్పున కత్తిరించుకుంటే ఎంత అల్లరి పెట్టాడు.అలాంటిది తను మీసాలు పూర్తిగా గొరిగించుకుని నాటకం స్టేజి మీద పోతు పేరంటాలులా నిలబడినప్పుడు మనం చెంపలు వాయిస్తే తప్పేముంది?.

రైకకు బొత్తాలు అంటించి చేతులు రవంత పొడుగు చేసుకుంటే కళ్ళల్లో మేకులు కొట్టుకున్నాడే !అలాంటిది అతనిప్పుడు మన రైక తొడుక్కుని మరేవో తగలబెట్టుకుని సిగ్గులేక ఉభయ భ్రష్టత్వపు ఆడ రూపంలో మగముత్తైదవులా నిలబడితే మనని అవమానించినట్లే కదా !

చుట్ట కాల్చి, మాడ్చుకున్న పెదాల మీద లత్తుక పూస్తాడు.అసలే మన తల కంటే అతని తల పెద్దది.అది చాలనట్టు దానిమీద సవరాలు పెట్టడం.

మొత్తం మీద రాకాసి తలలా అనిపిస్తుంది.ఉలా తయారయ్యి తనేదో జనన్మోహిని అవతారం అనుకుంటాడు. ఆడదానిని అనుకరించడం తన తరమా ?

అసలు ఆడదాని చూపును అలవర్చుకోగలడా మగవాడు? సూటిగా ఒక్క క్షణం చూసి తక్షణం చూపు మరల్చుకోగల లావణ్యం మగవాడికుందా ?.

మంగళ హారతి ఇచ్చినట్టు ఒక్క చూపుతో పరిసరాలన్నీ తిప్పి చూడగల ఆడదాని నేర్పు, కళ్ళల్లో ఒక్కసారి మెరుపు చూపించి అంతలోనే ఆర్పేయగల ఒడుపు మగవాడు స్వంతం చేసుకోగాలడా ?

పెదాలపై పండు వెన్నెల్లా కనబడవలసిన మందహాసాన్ని పెదాల మీదనే దాచేసి కంటికోనలో ఓ మూల దాచేయడం ఆడదానికే తగుతుంది కానీ ఈ నపుంసక రూపానికా?.

అసలు ఆడదానిలా నిలబడగలడా మగవాడు ? చనువు ప్రేమ,కనబరచవలసిన భర్త ఎదుట ఎలా నిలబడాలో, కాసంత మాత్రమే గౌరవం చూపాల్సిన పెద్దబావగారి వద్ద ఎలా నిలవాలో, భయగౌరవాలు రెండూ కనబరచవలసిన మామ గారి వద్ద ఎలా నిలబడాలో ఆ తేడా మగవాడు చూపగలడా ?.

ఒక ఉదాహరణ చెప్తాను. నా భర్త 'శాకుంతలం 'నాటకంలో ప్రియంవద వేషం వేస్తున్నాడంటే చూడడానికి వెళ్లాను. మొక్కలకు నీళ్ళు పోయడానికి శకుంతలతో కలిపి చేతిలో చెంబు పట్టుకుని మా ఆయన స్టేజి ఎక్కాడు.ఎలా నిలబడ్డాడో తెలుసా ?.

ఎడమ చేయి నడుము మీడుకి జారి పోయింది. కుడిచేతిలో ఇత్తడి చెంబు పట్టుకుని ప్రాప్టింగు చెప్పేవాడి వైపు చూస్తున్నాడు.అదెలా ఉందో తెలుసా?.

టాయిలెట్ క్యూలో నిలబడినట్టుంది.అసలు ఏ స్త్రీయేనా అలా నిలబడుతుందా ?నడుము మీద చేయి వేసుకుంటే,బుగ్గ మీద వేలు పెట్టుకుంటే,మాటిమాటికి పైట సవరించుకుంటే ఆడదానిని అనుకరించినట్లేనా ?

వెర్రి వెర్రి పక్క చూపులు చూసి, ముసి ముసి నవ్వులు నవ్వితే మనంఆడదనుకోవాలా?ఆడదాని వేషం మగవాడికి ఎలా అబ్బుతుంది.

ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం 'నాటకానికి వెళ్లాను.దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే దృశ్యం.చీరలు ఎంత మట్టుకు లాగాలో దుశ్శాసనుడికి తెలియదు.ఎంతవరకూ లాగించుకోవాలో ద్రౌపదికీ తెలియదు.

ఇద్దరూ కూడా చెడతాగి ఉన్నారు.ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పది వుండేది.కానీ వేషం కట్టినది పురుషుడు కదా !'వద్దు వద్దు 'అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు.ద్రౌపది ఆపలేదు.చివరికి ద్రౌపది వేషధారికి'రైక క్రింద గావంచా మిగిలింది.నెత్తిపైన బుట్టలా పైన సవరం ఒకటి.

సృష్టికంతకు ఒక్కటే దిష్టిపెడతలా ద్రౌపది మిగిలింది.పుట్టు గుడ్డి వేషం వేస్తున్న ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు.

కర్టెన్ వేయబోతే పడలేదు.

ద్రౌపది నాటకం కాంట్రాక్టరంటే భయం వేసింది కాబోలు కిందకు ఉరికాడు.తను ఆడో,మగో మర్చిపోయి పురుషులవైపునే పరిగెట్టాలో,స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థంకాక చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ళ మధ్యన కూచున్నాడు.

ఆడవాళ్ళంతా తటాలుగా లేచిపోయి పాక కాలినంత హడావుడి చేసి కేకలు వేసారు.చివరకు కొందరు మగవాళ్ళు వచ్చి ఆ వేషధారిని చావగొట్టారు కొంతకాలం పాటు ఆడవేషాలు వేస్తె పాత్రధారి ఇలాగే అవుతాడు. ఇంకొక స్త్రీ పాత్రధారి గురించి చెప్తాను.

ఆయన ఓ రోజు మార్కెట్లో కూరలు కొంటున్నాడు.పైన ఉత్తరీయంలో కూరలు మూట కట్టుకుని వెళ్తున్నాడు.

జన్మత: ఆడంగివాడు కాదు కానీ పది సంవత్సరాలుగా ఆడ వేషం వేస్తున్నాడు ఓ నాటకం కంపెనీలో. ఇంతలో ఆ కంపెనీ యజమాని అలా వచ్చాడు.

అతన్ని చూడగానే ఇతను సిగ్గుపడి, ముడుచుకుపోయి మూట గట్టగా మిగిలిన ఉత్తరీయంతో పైట వేసుకోబోయి,అది చాలక పోవడంతో రెండు చేతులను కత్తెరలాగా ఛాతీపై వేసుకుని తలవంచుకుని నిలబడ్డాడు.

ఒక్క నిమిషంలో తన మగతనాన్ని మసి చేసుకున్నాడు.అలా అని ఆడదీ కాలేకపోయాడు.

బాహ్య లక్షణాలే అనుకరించలేనివాడు స్త్రీ అంతరంగ లక్షణాలు అనుకరించగలడా ?. మనసు అంగీకరించడానికి ప్రయత్నించి భంగపడిన మగవాడు మనం అతన్ని అనుకరిస్తున్నామనడం హాస్యాస్పదం కదూ !

అసలు మగతత్వానికి ఆడతనానికి ఎంతో భేదం ఉంది కాబట్టి స్త్రీ పురుషులకు ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఉంది.

ఇద్దరి మధ్య ఆ గీత చెరిపి వేయబోతే ఇలాగే ఉంటుంది ".

_శ్రీ కృష్ణ శతకం.!........( 29 /6/15)... (శ్రీ నరసింహ కవి.).
_శ్రీ కృష్ణ శతకం.!........( 29 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
హా వసుదేవ కుమారక
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా!
.

దీనజనోద్ధారకా! కృష్ణా! వసుదేవకుమారా! 'నా మానమును కాపాడుము' అని
ప్రార్ధించిన ద్రౌపదికి తరిగిపోని చీరలిచ్చి, అభయమిచ్చి కాపాడిన కారుణ్యమూర్తీ,
నీకిదే నా నమస్కారములు.

హళేబీడు బేలూర్ .!

హళేబీడు బేలూర్ .!
హళేబీడు బేలూర్ రెండుకూడా ఒకదానికొకటి 15 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఇక వీటి విషయానికొస్తే.. హళేబీడు అంటే " ప్రాచీన నగరం " అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని " ద్వారసముద్రం " అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు. హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సుమారు ఇరవెై నిమిషాలు వుంటుంది. కన్నడ భాషలో ‘హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం. ఈ రెండు ప్రదేశాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలని కలిపి " దక్షిణ వారణాసి " గా అభివర్ణిస్తారు
చెన్నకేశవ ఆలయం, బేలూర్బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినడి. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.
ఈ ఆలయం హొయసల కాలమునకు చెందినది మరియు వివిధ డిజైన్లకు తార్కాణంగా ఉన్న 48 శిల్ప స్తంభాలను కలిగి ఉంటుంది.1117 లో తాలక్కాడ్ యుద్ధ సమయంలో, ఈ మహానిర్మాణాన్ని చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.
అంతేకాక ఆలయం వరండ లోపల అనేక ఇతర ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి.ఈ దేవాలయలోని అనేక శిల్పాలలో అనేక రకాలైన ఆభరణాలు,పైకప్పులు, జంతువులు, పక్షులు, ద్వారాలు మరియు అనేక రకాలైన ఇతర చిత్రాలను చూడవచ్చును . పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు. విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి. ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.
హొయసలేశ్వరాలయం

ఇక్కడ ప్రధానాలయం హొయసలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవట. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం, దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి..

Saturday, June 27, 2015

ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు..! (కృతజ్ఞతలు ..శ్రీమతిస్వేతావాసుకి.)
.
ప్రతిష్ఠాత్మకంగా గోదావరి పుష్కరాలు..!
...........
(కృతజ్ఞతలు ..శ్రీమతిస్వేతావాసుకి.)
ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. 2015 జూలై 14నుంచి 25వరకు పుష్కరాలు నిర్వహిస్తున్నారు.
పుష్కరం అంటే ఏమిటి, పుష్కర సమయంలో దానాలు, పూజలు
పుష్కరం అంటే ఏమిటి, స్నానం ఎలా చెయ్యాలి..... స్నానం చేయటం వలన ఫలితమేమిటి వంటి వివరాలు
పుష్కర సమయంలో పుష్కర నది నీటిలో అనిర్వచనీయమైన దైవశక్తి నిఘూడమై ఉంటుంది. పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానం చేయటం వలన మనిషికి ఎన్నో ఆయుష్మిక ప్రయోజనాలు లభిస్తాయి. పుష్కర స్నానం చేసేముందు గంగాస్తుతి చదువుకుంటూ,
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ..
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు"
దోసిళ్ళతో నీళ్ళు తీసుకొని, తలపై మూడుసార్లు పోసుకొని అప్పుడు స్నానం చెయ్యాలి.
స్నానం చేయటం వలన ఫలితం ఏమిటంటే - ఒక పుష్కర దినంలో (గోదావరి) స్నానంచేస్తే ప్రతిరోజు ప్రాతఃకాలంలో గంగానదిలో స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుంది. గంగ, యమున నదుల సంగమంలో సంవత్సరం పాటు స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. నర్మదా నది ఒడ్డున తపమాచరించిన ఫలితాన్ని ఇస్తుంది.
పుష్కర వ్రతం - అంటే పుష్కరం 12 రోజుల్లో మన యథాశక్తి స్నానాలు, దానాలు, సూర్యార్చనలు, ధ్యానం, హోమాలు, తర్పణాలు, అర్ఘ్యాలు, అనుష్టానాలు, పితృ పిండప్రదానాలు చెయ్యాలి. ఈవిధంగా 12 రోజులు చేస్తే, 12 ముఖ్య మహాకల్పాల్లో జరిపే వ్రతానికి ఇవి సమానం అని పెద్దలు అంటారు.
పుష్కర సమయంలో 12 రోజుల్లో దానాలు, పూజలు ఏవి చేస్తే మంచిదో తెలుసుకుందాం
రోజులు దేవుడు దానాలు
1వ రోజు నారాయణుడు బంగారం, ధాన్యం, రజితం
2వ రోజు భాస్కరుడు వస్త్రాలు, ఉప్పు, గోవు, రత్నం
3వ రోజు మహాలక్ష్మీ బెల్లం, కూరలు, (ఏదైనా) వాహనం
4వ రోజు గణపతి నెయ్యి, నువ్వులు, తేనె, పాలు,వెన్న
5వ రోజు శ్రీకృష్ణుడు ----- ధాన్యము, (ఏదైనా)బండి, గేదె(బర్రె), ఎద్దు, నాగలి
6వ రోజు సరస్వతి కస్తూరి, మంచిగంధం చెక్క, కర్పూరం
7వ రోజు పార్వతీదేవి గృహదానం, ఆసనం, శయ్య
8వ రోజు పరమేశ్వరుడు కందమూలాలు, పుష్పమాలలు, అల్లం
9వ రోజు అనంతుడు కన్య, దాసదాసీ, పరుపు, చాప
10వ రోజు నరసింహస్వామి దుర్గాదేవి, లక్ష్మీదేవి, దేవీపూజ, సాలగ్రామం
11వ రోజు వామనుడు ----- కంబళి, సరస్వతి, యజ్ఞోపవీతం, వస్త్రం, తాంబూలం
12వ రోజు శ్రీరాముడు దశ, షోడశ మహాదానాలు
(ఈ దానాలు చేయడం వలన కోటిజన్మల పాపాలు నశిస్తాయని దైవజ్ఞులైన పెద్దలు చెప్పియున్నారు.)
గోదావరి నది "గో కళేబరం"ను ఆవరించి ప్రవహించిన కారణం వలన "గోదావరి" అని పేరు వచ్చింది.
కృతయుగంలో 'తుందిలుడు' అనే మహాతపస్వి చేసిన తపస్సును చూసి మెచ్చి పరమశివుడు అతనికి మూడు కోట్ల ఏభై లక్షల పుణ్యతీర్ధాలకు ఆధిపత్యాన్ని ఇస్తూ 'తుందిలిని' అధిపతిగా చేసాడు. అంతే కాకుండా శివుడు తన అష్టమ స్థానంలో ఒకడైన జలస్థానం తుందిలునకు శాశ్వత స్థానంగా కల్పించాడు. ఆ విషయాన్నీ తెలుసుకున్న చతుర్ముఖ బ్రహ్మ...పరమశివుని ప్రసన్నం చేసుకొని ఆ జలసార్వభౌముడు - పుష్కరుని తన సృష్టి కార్యనిర్వహణకు సహకరించే విధంగా తనకు ఇవ్వమని ప్రార్థించాడు. వెంటనే శివుడు సంతోషించి ఆ పుష్కరుడిని వరప్రసాదంగా బ్రహ్మకు ఇచ్చాడు. ఎన్నో మహిమలున్న ఆ పుష్కరుని తన కమండలములో ఉంచి 'సృస్తికార్యం' ప్రారంభించాడు బ్రహ్మ.
ఒకనాడు బృహస్పతి బ్రహ్మకోసం ఘోరతపస్సు చేసి సకల ప్రాణులకు జీవాధారుడైన పుష్కరుని తనకు వరంగా అనుగ్రహించమని కోరుతాడు. అది విన్న పుష్కరుడు బ్రహ్మను వీడి వెళ్ళనంటాడు. ఇంక చేసిదిలేక బ్రహస్పతిని, పుస్కరుని ఇద్దరికీ సమన్యాయం చెయ్యాలని నిర్ణయించి ఈవిధంగా చెప్పాడు. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదులలో పుష్కరుడు కూడా ప్రవేసిస్తాడు. ఆ సమయాన్ని 'పుష్కర కాలం' అంటారు.
బ్రహ్మ నియమానికి వారు కట్టుబడడం వల్ల ఒక్కొక్క సంవత్సరం, ఒక్కో నదికి పుష్కర సమయంగా నిర్ణయించబడింది. పత్నీ సమేతుడై ఇంద్రుడు 33 కోట్ల దేవతులు, సర్వగ్రహాలు, 50 లక్షల తీర్థాలు, ఆ పుష్కరకాలలో నివసిస్తూ ఉంటారు. అందుకే ఆయా నదుల పుష్కరకాలంలో మొదటి పన్నెండు రోజులూ మహా పుణ్యప్రదమైన పుష్కరరోజులుగా నిర్ణయిస్తారు.
పుష్కరం వచ్చే నది బృహస్పతి ప్రవేసించే రాశి పుష్కరం వచ్చే ప్రాంతం
1) గంగానది మేషరాశి కాశీ
2) నర్మదానది వృషభం అహ్మదాబాద్ లోని నారీశ్వర్
3) సరస్వతి నది మిధునరాశి ఉత్తరప్రదేశ్ లోని భీంపూర్
4) యమునానది కర్కాటకరాశి మధుర
5) గోదావరినది సింహరాశి రాజమండ్రి & భద్రాచలం
6) కృష్ణానది కన్యారాశి విజయవాడ, శ్రీశైలం
7) కావేరీనది తులారాశి శ్రీరంగం
8) తామ్రపర్ణీనది వృశ్చికరాశి తమిళనాడులోని బాణతీర్థం
9) బ్రహ్మపుత్రానది ధనూరాశి రాజస్థాన్ (అజ్మీర్ ప్రాంతం)
10) తుంగభద్రానది మకరరాశి మంత్రాలయం - కర్నూల్ జిల్లా
11) సింధూనది కుంభరాశి ఇది పాకిస్తాన్లో ఉన్నందున గంగానదిలో చేస్తారు
12) ప్రణీతనది మీనరాశి చోప్రా (కాళేశ్వరం సమీపంలో ఉంది)
పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహా పవిత్రమైన పుణ్యకాలం. అటువంటిది గోదావరి నదిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం 12 సంవత్సరాలుగా ఇతర నదులలో చేసిన పుణ్యం కంటే వెయ్యిరెట్లు ఎక్కువని, పుష్కర స్నానం చేస్తే - ఏడు జన్మలుగా చేసిన పాపాలు కూడా నశిస్తాయని, గంగానదిలో స్నానం చేయటం, నర్మదా తీరంలో తపస్సు చేయటం, కురుక్షేత్రంలో దానం చేయటం, కాశీలో (మరణం)మోక్షాన్ని ఇస్తాయని పెద్దలు చెప్పారు.
పుష్కరకాలంలో చేసే ప్రతీపని(పుణ్యకార్యము) ఎంతటి అధిక ఫలాన్ని అందిస్తుందో..... ఆ రోజుల్లో చేసే పాపకార్యాలు కూడా వందరెట్లై నరక కూపంలోకి తోసెయ్యటం కూడా అంతేనని చెప్పారు.
జూలై 14 నుండి 25 వరకు జరిగే పుష్కరాలలో పాల్గొందాం ..... మన పాపాలను ప్రక్షాళన చేసుకుందాం

Friday, June 26, 2015

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .! (వానవల్లప్పలువానవల్లప్పలు.)


బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .!
(వానవల్లప్పలువానవల్లప్పలు.)
{(వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు. బయటకుపోక చెల్లెలును
వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప. వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి) గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది - కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే, కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది.)}
(వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి,
నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము) ఆ తైలమును
పూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే,
కూడు కొంటుందంటాడు వల్లప్ప.)
......
వానా వానా వల్లప్ప!
వాకిలి తిరుగూ చెల్లప్ప!
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలువిరిగె
దానికేమి మందు?
వేపాకు పసుపూ,
వెల్లుల్లిపాయ,
నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,)
నూటొక్కసారి,
పూయవోయి నూరి,
పూటకొక్కతూరి.

బంగారిమామ పాటలు [కొనకళ్ల వెంకటరత్నం]


బంగారిమామ పాటలు [కొనకళ్ల వెంకటరత్నం]
............................................
మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై
తబ్బిబ్బయ్యెను నా మనసు
తళుక్కుమన్నది నీ సొగసు
ఉరుములురిమి నను తరిమికొట్టితే
మెరుపుతీగ కొరడా జళిపిస్తే
మందవీడిన తువ్వాయికిమల్లే
మన సూరక బెంబేలైపోతది
మబ్బులు...
కొండలోయలో చిక్కని నీడలు
గుంపులు గుంపులు నడుస్తవుంటే,
గుండెలోతులో నల్లనివరవడి
గుట్టుచప్పుడుగ రాశేదెవరో?
మబ్బులు...
చిటపటమంటా ఎండుటాకులో
చినుకొక్కటి వడి చిటిలిరాలితే,
కోరికలే గుదిగుచ్చుకొన్న ఒక
హారమె తెగినట్లదురు పుడతాది
మబ్బులు...

_శ్రీ కృష్ణ శతకం.!........( 27 /6/15)... (శ్రీ నరసింహ కవి.)


_శ్రీ కృష్ణ శతకం.!........( 27 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొసఁగితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా!
.

ఓ కృష్ణా! తన భార్య పంపగా, నీ ప్రియసఖుడు కుచేలుడు నీ దర్శనార్థమై వచ్చి,
నీకు ఏ కానుక ఇవ్వలేక, కొంగున ఉన్న అటుకులను ఇవ్వడానికి సిగ్గు పడుతుండగా, నీవు ఆ అటుకులను ఆరగించి, అతని మనస్సును తెలుసుకొని, సంపదలు ఇచ్చి కాపాడితివి. నీ విశాల దృష్టిని ఏమని పొగడగలను కృష్ణా!

చందమామకధ.... డబ్బుకు లోకం దాసోహం.!...చందమామకధ.... డబ్బుకు లోకం దాసోహం.!
సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు. మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు. ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా. మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా. ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు. మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.
అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా. పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది. వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. 'నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌?' అన్నాడు రాజా చిరాకు పడుతూ. 'నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నా' అన్నాడు రంగా నిజాయితీగా. ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా. ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌. అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, 'డబ్బుకు లోకం దాసోహం' అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.

Thursday, June 25, 2015

_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.).

_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.).
.
తనువెందాక ధరిత్రినుండు నను నందాకన్మహారోగ దీ
పన దు:ఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి, యా
వెనుక న్నీ పదపద్మముల్దలంచుచున్విశ్వ ప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండచేయ గదవే, శ్రీ కాళహస్తీశ్వరా!
.

ఈశ్వరా! ఈ శరీరం ఎంత వరకు భూమిమీద ఉంటుందో అంతవరకూ రోగాది బాధలు లేకుండా రక్షించి, ఆ పైన వైరాగ్యంతో ఈ ప్రపంచంనే తృణప్రాయంగా భావించు స్థితిలో ఉండేట్లు చేసి నన్ను ఉద్ధరింపుము.

_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.).

_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(26 /6/15.).
.
తనువెందాక ధరిత్రినుండు నను నందాకన్మహారోగ దీ
పన దు:ఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి, యా
వెనుక న్నీ పదపద్మముల్దలంచుచున్విశ్వ ప్రపంచంబుఁ బా
సిన చిత్తంబున నుండచేయ గదవే, శ్రీ కాళహస్తీశ్వరా!
.

ఈశ్వరా! ఈ శరీరం ఎంత వరకు భూమిమీద ఉంటుందో అంతవరకూ రోగాది బాధలు లేకుండా రక్షించి, ఆ పైన వైరాగ్యంతో ఈ ప్రపంచంనే తృణప్రాయంగా భావించు స్థితిలో ఉండేట్లు చేసి నన్ను ఉద్ధరింపుము.

_శ్రీ కృష్ణ శతకం.!........( 26 /6/15)... (శ్రీ నరసింహ కవి.)

_శ్రీ కృష్ణ శతకం.!........( 26 /6/15)... (శ్రీ నరసింహ కవి.)
అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా!
.
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
.
ఓ పరంథామా! శ్రీకృష్ణా! దేవకీదేవికి ఎనిమిదవ గర్భమున, రోహిణీ నక్షత్రమున,
అష్టమి దినమందు జన్మించి, పాపాత్ముడైన నీ మేనమామ కంసుని సంహరించి
లోకోద్ధరణ చేయటానికే పుట్టావు కదా!
.
వాసుదేవుని కొడుకైన, తల్లియైన దేవకీ దేవికి మిక్కిలి ఆనందమును కలిగించిన, కంసుడు, చాణూరుడు వంటి దుష్టులను మట్టుబెట్టినట్టి, జగత్గురువైనట్టి శ్రీకృష్ణుని నమస్కరింతును.

చందమామ కధ...అన్న..గోపాలా .!


                                             చందమామ కధ...అన్న..గోపాలా .!

.

ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు.
ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని
పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు.

సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో
వచ్చేవారు.
ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం
లేదు. కానీ రోజు చింతతోపు లోంచి
రావాలంటే చాలా భయమేస్తుందమ్మా!
నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?”
నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి
పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది.
ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ.
సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా
భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు.
ఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, “అన్నా! గోపాలా!” అని పిలిచాడు.
ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు?” అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు. పెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన
చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు.
కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని
కూడ అందరి లాగానే సత్కరించారు.
విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు
వడ్డించ మన్నారు. చిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని, అయ్యవారు
ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి
విస్తరలో వంపేరు.
ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళి
పెరుగు నిండిపోయింది. ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, “అద్భుతం! అమోఘం! ఈ
పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు?” అన్నాడు. వేరే వాళ్ళంతా, యేది, మాకు వడ్డించండి, మేమూ
చూస్తాము”, అన్నారు.
అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా,
అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది.
వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ యేది, అన్నా! గోపాలా! అని పిలూ,
మేమూ చూస్తాము!” అన్నారు.
అయ్యవారు అందరిని మందలించారు. “
మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం
దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.” అన్నారు.
అందరూ ఆకాశం వైపు చూశారు.....!!!!!!!!