_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(25 /6/15.).


_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(25 /6/15.).
.
ఎన్నేళ్ళుండుదు? నేమి గందు? నిఁక నే నెవ్వారి రక్షించెదన్?
నిన్నే నిష్టభజించెద న్నిరుప మోన్నిద్రా ప్రమోదంబు నా
కెన్నం డబ్బెడు? నెంతకాల మిఁక నేనిట్లున్న నేమయ్యెడిన్‌?
జిన్నం బుచ్చక నన్ను నేలుకొనవే! శ్రీ కాళహస్తీశ్వరా!
.

ఈశ్వరా!
ఎన్నాళ్లు బ్రతుకుతాను? చూడవలసినవన్నీ చూశాను. ఇంకేం చూడాలి?
ఇంతకాలం, భార్యాపుత్రులను పోషించాను. ఇంకెంతకాలం పోషించగలను.
నిన్నే నమ్మి సేవించే నాకు తురీయావస్థలోని
(జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునికి మూడు అవస్థలుంటాయి. ఆ మూడింటినీ మించి నాలుగవ అవస్థ కూడా ఉంటుంది. దానిని తురీయమందురు. ఆ తురీయావస్థకు (అనగా ధ్యానసమాధికి) చేరుకొన్న యోగసిద్ధులు ఆత్మసాక్షాత్కారం పొంది ఆనందిస్తారు.)
ఆ ఆనందము నాకెప్పుడు కలుగును. ఎంతకాలం ఈ నిరీక్షణలో గడిపినా ప్రయోజనం ఏం ఉన్నది? నన్ను నిరాశపరచక దయచూపి రక్షించు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!