హళేబీడు బేలూర్ .!

హళేబీడు బేలూర్ .!
హళేబీడు బేలూర్ రెండుకూడా ఒకదానికొకటి 15 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఇక వీటి విషయానికొస్తే.. హళేబీడు అంటే " ప్రాచీన నగరం " అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని " ద్వారసముద్రం " అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు. హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. హళేబీడు, బేలూరుల మధ్య దూరంలో సుమారు ఇరవెై నిమిషాలు వుంటుంది. కన్నడ భాషలో ‘హళె' అంటే పాత అని అర్థం. బీడు అంటే పట్టణం. హళేబీడు అంటే పాత పట్టణం. ఈ రెండు ప్రదేశాలు హొయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణలు - తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రాంతాలని కలిపి " దక్షిణ వారణాసి " గా అభివర్ణిస్తారు
చెన్నకేశవ ఆలయం, బేలూర్



బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినడి. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.
ఈ ఆలయం హొయసల కాలమునకు చెందినది మరియు వివిధ డిజైన్లకు తార్కాణంగా ఉన్న 48 శిల్ప స్తంభాలను కలిగి ఉంటుంది.1117 లో తాలక్కాడ్ యుద్ధ సమయంలో, ఈ మహానిర్మాణాన్ని చోళులపై తన విజయానికి చిహ్నంగా హోయసల విష్ణువర్ధనుడు కట్టించాడు. పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును. వీటితో పాటు, వివిధ రంగులలో చెక్కిన నవ యవ్వన పడతుల చిత్రాలు మరియు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి.
అంతేకాక ఆలయం వరండ లోపల అనేక ఇతర ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి.ఈ దేవాలయలోని అనేక శిల్పాలలో అనేక రకాలైన ఆభరణాలు,పైకప్పులు, జంతువులు, పక్షులు, ద్వారాలు మరియు అనేక రకాలైన ఇతర చిత్రాలను చూడవచ్చును . పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు. విజయనగర సామ్రాజ్యం రోజులలో ఈ ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి. ఆలయం యొక్క అంతర్భాగంలోనే కప్పే చేన్నిగరాయ ఆలయం, మరియు లక్ష్మి దేవీకి అంకితం చేసిన ఒక చిన్న కట్టడము కూడా ఉన్నాయి.
హొయసలేశ్వరాలయం

ఇక్కడ ప్రధానాలయం హొయసలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవట. గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం, దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి..





Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!