ముసురేసిందంటే..! -- ( బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం.)

ముసురేసిందంటే..! -- ( బంగారిమామ పాటలు కొనకళ్ల వెంకటరత్నం.)
.
ముసురేసిందంటే పైన
అసలే మతిపోతది మామా!
ససిచెడినట్లుంటది లోలోన
ఓ ముద్దులమామా!
మబ్బు తెరల మసకలలోన
మంచుపొగల మెలికలలోన,
మనసేటో చిక్కడినట్లే
మనేద కుదిపేస్తది లోన
ముసురేసిం...
పసుపాడిన పైరులనడుమ
పడగెత్తిన సన్ననితోవ
నువు మసిలే చెలకలవంకే
నురుగులు గ్రక్కేను గరాళం
ముసురేసిం...
కోవెలచిరుగంటలు చెవిలో
కావాలని కతకలిపించీ,
దూరానున్నావని, నీపై
దుర్వార్త లెవో వినిపిస్తై,
ముసురేసిం...
ఏటి మళుపులో ధనుసల్లే
తోట ఒడలు విరిచినచోట,
నాటి మన పరాసికమంతా
నవ్వుతాలె అంటదిమెరుపు
ముసురేసిం...
.
(ఘంటసాల గారి సంగీతంలో బాలసరస్వతీ దేవి గారు )
http://www.divshare.com/download/26478528-273


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!