ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో:---


ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో:---

ఈ లలితగీతాన్ని ఎం.ఎస్.రామారావుగారు రచించి,స్వరపరచి,
గానం చేశారు.దీనికి బ్యాక్ గ్రౌండ్ ట్యూన్ పెండ్యాల నాగేశ్వరరావుగారు
కంపోజ్ చేశారు.
1952 లో ఇది అల్ ఇండియా రేడియో లో వినిపించేది.
ఇదే పాటను నీరాజనం అనే సినిమాలో వినిపించారు.

తాళం: త్రిశ్రగతి (హిందూస్తానీ దాద్రా) పల్లవి మధ్యమావతి (హిందూస్తానీ: మద్ మాత్ సారంగ్)లో ఉంటుంది. మొదటి చరణం స,చరి, అంగ,శుమ, ప, చధ స్వరాలతో ఉంటుంది. రెండవ చరణం శుద్ధసావేరి (హిందూస్తానీ: దుర్గా) రాగంలో సాగుతుంది.

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా

చరణం 1:

పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో..ఓ..
పండు వెన్నెల్లో వెండీ కొండల్లే
తాజ్ మహల్ దవళా కాంతుల్లో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా

చరణం 2:

నీ జీవిత..ఆ..జ్యోతీ.. నీ మధురమూర్తి
నీ జీవిత..ఆ..జ్యోతీ.. నీ మధురమూర్తి
ముంతాజ సతి సమాధీ సమీపాన నిదురించు
ముంతాజ సతి సమాధీ సమీపాన నిదురించు జహాపనా
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో..ఓ..
నిదురించు జహాపనా
నిదురించు జహాపనా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!