Posts

Showing posts from September, 2017

వ్యాసుని జన్మ వుత్తాంతము : -

Image
- వ్యాసుని జన్మ వుత్తాంతము : - . (ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది) . మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ  డామె కన్నెతనము హతము కాని  వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె!  భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె (ుండు మధుసూదన్ గారి పద్యం ...వారికి కృతజ్ఞలతో ) . .  పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు . ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు .  ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ననిమాలు  ఇలా ఉనాయిట :- దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి , బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి , వదువు కన్య అయి ఉండాలి , వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి , లంక లో పెండ్లి జరగాలి , పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి , ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి , బ్రహ్మసమానుడై ఉంటాడని-

తెలుగు రావటం అంటే ఏమిటి??

Image
తెలుగు రావటం అంటే ఏమిటి?? . తెలుగు రావటం అంటే ఏమిటి?? అనే ప్రశ్న వచ్చింది. ఇంత చిన్నగా అడిగితే ప్రశ్న అర్ధంకాదు వివరిస్తాను చూడండి. .. తెలుగులో మాట్లాడటం రావటమా(వాడుక భాష)? అంటే భందుమిత్రులతోబాటుతెలుగువారితో మాట్లాడ గలిగేంత రావటం. తెలుగు నుడికారపు మెదటి సందువరకు వచ్చి ఆగిపోతారు  ఈ తరహా వాళ్ళు. లేక తెలుగు చదవటం రాయటం మెదలుగునవి రావటమా …?? వీరికి మాట్లాడటంతో కలిపి,పేపర్లు చదవటం, బస్సుల పేర్లు,సినిమా పోష్టర్ల పేర్లు చదవటానికి,తల్లి దంద్రులకు బందువలకు లేఖలు లేక వేగులు రాయటానికి సరిపడా వస్తుంది(సంసృతాంద్రము అంతగారాదు పరిసరాల బట్టి కొద్ది కొద్దిగా వస్తుంది.) లేక తెలుగు సాహిత్యం అంటే మక్కువ,తెలుగు కవితలు బాణీలు, కధలు వగయిరా వగయిరా…. ? వీరికి తెలుగు పుస్తకాలు చదవాలన్ని ఆశక్తి,తెలుగు సాహిత్యంలో ఉన్న పాతకొత్తవింత దోరణులు స్పృసించగల సత్త మరియు అలాంటి తపన ఉంటుంది…కొంత మంది ఒక అదుగు ముందుకేసి హైకులు,కవితలు,కవితలు లాంటివి రాస్తూ కొద్దిగా సాహితీ అభిమానం చూపిస్తుంటారు. లేక శ్రీశ్రీశ్రీ పండితారద్యుల పాపయ్య శాస్త్రీ , సహస్రఘనాపాటి అన్నా రేంజిలో  ఉండాలా ?? వీరు తెలుగుసాహ

ఎచటికి మన ప్రయాణం !

Image
ఎచటికి మన ప్రయాణం ! -నిర్వేదం  . పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి  కుదరదు అన్నట్టు సొంతంగా పూనుకుని ఏదైనా చేస్తే అది కాస్తా ఎదురుతంతే అభాసుపాలవుతామని జనం గట్టిగా అడిగితే గానీ చెయ్యని జడత్వం ప్రభుత్వంలో ఉంది. తమకేం కావాలో తెలియని అజ్ఞానం వల్ల అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడుతూ సొంతంగా ఆలోచించి సరైన పరిష్కారం కోసం డిమాండు చెయ్యని బద్ధకం ప్రజల్లో ఉంది. టపటపా స్కూళ్ళూ కాలేజిలూ సాంక్షన్ చేయించేసుకుని బొట్లేరింగ్లీషు టకటకా చదివేసి ఉన్న పది ఉద్యోగాలకి వంద మంది పోటీ పడితే ఎంత గింజుకున్నా పదిమందికే ఉద్యోగాలు వస్తాయి.ఆ పదిమందీ కాలరెగరేస్తూ పోటుగాళ్ల మాదిరి పోజులు కొడుతున్నారు. మిగిలిన 90 మందిలో మా కులానికి రిజర్వేషన్ శాతం పెంచితే గానీ తమకు మరిన్ని ఉద్యోగాలు రావని కొన్ని కులాల వాళ్ళూ వాళ్ళకి పెంచితే మా వాటా తగ్గుతుందని కొన్ని కులాల వాళ్ళూ కొట్టుకు చావడమే తప్ప కలిసి కూర్చుని తెలివిగా ఆలోచించి సమస్యకి మూలం చూసి సరైన పరిష్కారం కోసం ప్రయత్నించాలనే సద్బుద్ధి లేదు. ఒకసారి రాగింగులో సీనియర్లు ఆరవ వేదం అంటే ఏమిటి అని అడిగారు -  నేను నిర్వేదం అని చెప్పాను

ఆటుపోట్లు...జయ లలిత సినీ జీవితం .

Image
ఆటుపోట్లు...జయ లలిత సినీ జీవితం . (తెలుగు వారికి తెలిసిన జయలలిత.) . జయలలిత నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పండవపురా తాలూకాలోని మెల్కోటేలో 1948, ఫిబ్రవరి 24న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి(సంధ్య)లు.  ఆ కాలంలో సంధ్య ప్రముఖ సినీ నటిగా వెలుగొందారు. జయరాం తాత మైసూరు సామ్రాజ్యంలో వైద్యునిగా పనిచేసేవారు. జయలలిత రెండేళ్ల వయస్సులోనే తండ్రి జయరాం మరణించారు.  దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత చెన్నై కేంద్రం సాగుతున్న తమిళ చిత్రాలలో నటించడం ప్రారంభించింది.  అప్పుడే వేదవల్లి తన పేరును సంధ్యగా మార్చుకుంది. జయలలిత చెన్నైలోని సేక్క్రేడ్ హార్ట్ మెట్రిక్యూలేషన్ స్కూల్‍‌లో ప్రాథమిక విద్యను అభ్యసించింది. జయలలిత చదువులో రాణించడంతోపాటు తన తల్లి నటిస్తున్న చిత్రాలలో కూడా నటిస్తుండేది. చదువుకు ఆటంకం కలగకుండా ఆమె తల్లి చూసుకునేది.  ఈ క్రమంలో ఆమె నటించిన ఈపిస్ట్లి అనే ఇంగ్లీష్ చిత్రం 1961లో విడుదలైంది. హీరోయిన్‌గా ఆమె మొదటిసారిగా నటించిన కన్నడ చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అ

బాలనాగమ్మ స్టెజినాటకరచయిత" ఎవరు?

Image
బాలనాగమ్మ స్టెజినాటకరచయిత" ఎవరు? . కణ్వశ్రీ కణ్వశ్రీ నాటక రచయిత మరియు సినీ రచయిత. ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం[. చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతడు నెల్లూరు జిల్లా, కోట గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు నెల్లూరులో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్రాసిన తొలి రచయితగా ప్రసిద్ధుడు. ఇతని నాటకాలన్నీ లలితకళానిలయం పక్షాన రాష్ట్రమంతటా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఇతని బాలనాగమ్మ, మాయాబజార్ నాటకాలను నేటికీ సురభి నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు మద్రాసులో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు. నాటకాలు ! అజాతశతృ (1948) ఆనాడు (1948) ఇదా ప్రపంచం (1950) బాలనాగమ్మ (1950) మాయాబజారు (1950) నాటికలు[మార్చు] లవ్ ఈజ్ బ్లైండ్ (1970) సినీగీతాలు ! ఈ క్రింది సినిమాలలో పాటలను వ్రాశాడు శ్రీ కృష్ణ పాండవ యుద్ధం నీడలేని ఆడది అమ్మాయిలూ జాగ్రత్త .

అహా! ఆ కృష్ణుని వేణుగానం రాధికకి ఇలాగే వినిపించిందా?

Image
అహా! ఆ కృష్ణుని వేణుగానం రాధికకి ఇలాగే వినిపించిందా? (దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత) - ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల పడిపోవు విరికన్నె వలపువోలె . తీయని మల్లెపూదేనె సోనలపైని తూగాడు తలిరాకు దోనెవోలె . తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై పరువెత్తు కోయిల పాటవోలె . వెల్లువలై పారు వెలది వెన్నెలలోన మునిగిపోయిన మబ్బుతునుకవోలె . చిరుత తొలకరివానగా, చిన్ని సొనగ, పొంగిపొరలెడు కాల్వగా, నింగి కెగయు . కడలిగా, పిల్లగ్రోవిని వెడలు వింత తీయదనముల లీనమైపోయె నెడద! . (వడ్డాది వారి చిత్రం.)

తాపసుని జీవయాత్ర!

Image
- - తాపసుని జీవయాత్ర! (పోతనామాత్యుడు..భాగవతంలో..) పరమాత్మకు భిన్నమైన పదార్థమంటు ఏదీ లేదు. సత్పురుషులు శరీరాదులపై ఆత్మభావన వదులుతారు.  ఇతర విషయాలమీద వ్యామోహం విడుస్తారు.  మహనీయైలైన మాధవుని చరణారవిందాలను మనస్సులో అనుక్షణమూ నిల్పుకుంటారు. విష్ణుసంబంధ మగు పరమపదమే అన్నింటికంటె ఉత్తమస్థానమని గ్రహిస్తారు.  ఈ రీతిగా శాస్త్ర జ్ఞాన బలము అనే మంటలో విషయవాసనలను తగులబెట్టి వారు దేని మీదా అపేక్ష లేకుండా ఉంటారు. . శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలనివాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండంలో ఖేచరులు, సిద్ధులు, విహరించడానికి అనువైనది, అణిమాదులైన ఐశ్వర్యాలన్నింటితో కూడినట్టి బ్రహ్మలోకం చేరుతాడు. విద్య, తపస్సు, యోగం, సమాధులను అనుష్ఠించి లింగశరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల, వెలుపల సంచరిస్తుంటారని పెద్దల మాట.  కల్పాంతంలో అనంతుని వదనమునుండి వెలువడే కరాళాగ్ని  జ్వాలల్లో దగ్ధమయి పోతున్న త్రిలోకాలను చూస్తాడు.  అందువల్ల జనించే అగ్ని దాహం సహించలేక అక్కడనుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు, అక్కడే నివసిస్తాడు. . ఇలమీఁద మనువు లీరేడ్వురుఁ జనువేళ;  దివసమై యెచ్చ

గరికిపాటివారు ప్రస్తావించిన ఒమర్ ఖయాం పద్యం !

Image
గరికిపాటివారు ప్రస్తావించిన ఒమర్ ఖయాం పద్యం ! . ఉండగ చిన్ని పాకయు, పరుండగ చాపయు రొట్టెలొక్కటో రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి చెంతనుండగా పండుగ గాదె జీవితము! భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్ దండుగ గాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే?

ఓదార్పు!

Image
ఓదార్పు! ఓదార్పు ఒకసారే కోరుకోవాలి తరువాత మనల్ని మనమే ఓదార్చుకోవాలి .... ఆధారపడవద్దు బాధను మిగులుస్తాయి బయట బంధాలు ఆనందం నిపుతుంది ఆత్మ సంబంధం !

జన పద గీతం_చల్ మోహనరంగా !

Image
జన పద గీతం_చల్ మోహనరంగా ! - నీకు నీ వారు లేరు నాకు నావారు లేరు ఏతి ఒడ్డున ఇల్లు కడదాము పదరా చల్ మోహనరంగా నీకు నాకు జోదు కలిసెను గదరా మల్లె తోటలోన మంచి నీళ్ళ బావి కాద ఉంగరాలు మరిచి వస్తిని కదరా ||చల్ మోహనరంగ|| , కంటికి కాతుకేట్టీ కడవా సంకాన బట్టి కంటి నీరు కడవ నింపితి గదరా ||చల్ మోహనరంగ|| . గుట్టు దాటి ప్పుట్టదాటి - ఘనమైన అడవిదాతి అన్నిదాటి అడవి బడితిమి కదరా ||చల్ మోహనరంగ|| . నీకి నాకు జోడు అయితే - మల్లెపూలా తెప్పగట్టీ త్ర్ప్పమీద తేలిపోదము పదరా ||చల్ మోహనరంగ|| . అదిరా నీ గుండెలదరా - మధురా వెన్నెల రేయి నిదరాకు రమ్మంటిని కదరా ||చల్ మోహనరంగ||

ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు. (పోతనామాత్యుడు.)

Image
ప్రహ్లాద చరిత్ర లోని కొన్ని పద్యాలు. (పోతనామాత్యుడు.) చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ ! చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ ! చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ధ ముఖ్య శస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ !! ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి జూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే !! మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు బోవునే మదనములకు ! నిర్మల మందాకినీ వీచికల దూగు  రాయంచ సనునె తరంగిణులకు ! లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు ! పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మ్మరుగునే సాంద్ర నీహారములకు ! అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మే రీతి నితరంబు చేర నేర్చు వినుత గుణ శీల మాటలు వేయు నేల !! కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ  సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము  విష్ణు నాకర్ణిం

ఏడూ కొండలవాడా వెంకటేశా తిరుమలేశా... శ్రీనివాసా!

Image
ఏడూ కొండలవాడా వెంకటేశా తిరుమలేశా... శ్రీనివాసా! ఇంకా కొనసాగుతున్న తమిళ భాష పెత్తనం! భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆంద్ర రాష్ట్రంలో భాగమైన తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు తమిళ ఆధిపత్యంలోనే ఇంకా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా కొన్ని రకాలైన సేవల పేర్లను పరిశీలించండి : పరకామణి కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుచ్చి తిరుమాడవీధి తిరుప్పావై ఊంజల్ సేవై తిరుమంజనం తోమాల సేవ మేల్చాట్ వస్త్రం పోటు పడి వగపడి చెప్పుకుంటూ పోతే ఎన్నో అర్ధం కాని అరవ పేర్లు.  తమిళ భాషకు వ్యతిరేకంగా చెప్తున్న విషయం కాదు, తెలుగు భాషపై వున్న అభిమానం మాత్రమే.  ఇలాంటి వాటిని పట్టించుకొనే నాధుడు లేడు.  పరకామణి అంటే కానుకలు లెక్కించే ప్రదేశం, ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ అని, పోటు అంటే వంట గది అని, మేల్చాట్ వస్త్రం అంటే శేష వస్త్రం అని తెలుగులో (ఇంకా సరైన, ఖచ్చితమైన పేర్లు ఉండచ్చు) ఉపయోగించలేమా?

కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట. !

Image
చకారకుక్షి! _ కాళిదాసు వ్యాసుని చకార కుక్షి అనేవాడట. భారతం చాలా పెద్ద గ్రంధం. అందులో లక్షకు మించిన శ్లోకాలున్నాయి. అంతపెద్దగాధని వివరించేటప్పుడు ఆశ్లోకాలలో పాదపూరణకు 'చ'కారం యెక్కువగా వాడారట! . అదీ కాళిదాసు ఆయన్ని చ-కార కుక్షి యంటానికి కారణం. కాళిదాసు విశ్వనాథుని దర్శంచేందుకు ఒకపర్యాయం కాశీ వెళ్ళాడు. అక్కడ ఒకపరిచాయకుడు ఆయనకు ఆలయప్రాంగణంలోని వ్యాసుని విగ్రహం వద్దకు తీసికెళ్ళి " వీరు వ్యాసులవారు" అనిపరిచయం చేస్తూ విగ్రహం చూపారట. కాళిదాసు" ఓహో వీరా ఆచకారకుక్షి " అంటూ విగ్రహం బొడ్డులోనికి తన వేలు దూర్చారట. అంతే ఆవేలు యిరుక్కుపోయింది. కాళిదాసు ఆశ్చర్య పడుచుండగా ఆవిగ్రహంనుండి " మనవడా! నాపొట్టలో చకార లెక్కువ ఉన్నాయని నన్నాక్షేపిస్తున్నావుగదా! ద్రౌపది పాండవులు వారి బంధుత్వాలను గురించి చకారం లేకుండా ఒక్క శ్లోకంచెప్పు,? చెప్పావో నీవేలూడుతుంది. అన్నాడట. . కాళిదాసు వినయంగా తలవంచి" తాతగారూ! నాకుమీరంటే చాలాఅభిమానం.ఊరక యేదోవేళాకోళానికల్లా అన్నాను గానీ మరేదీ గాదు. మీవలెశ్లోకం వ్రాయటం నాచేతనౌతుందా? అయినా ప్రయత్నిస్తాను. ఆశీర్వదించండి" అనిపలికి - - శ్లో: ద్

':రాజరాజేశ్వరీ దేవి :-('విజయదశమి' ) :

శుభోదయం-దసరా శుభాకాంక్షలు !  - ఆశ్వయుజ శుద్ధ దశమి -తొమ్మిదో రోజు  (విజయదశమి' ) :రాజరాజేశ్వరీ దేవి   - శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే, శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే - అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం.  ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.

నయం గోచి ఆయిన మిగిలింది.😂

Image
- G S T -Effect ! - నయం గోచి ఆయిన మిగిలింది.😂

నీ కన్నుల లోనా దాగెను లే వెన్నెల సోనా

Image
- ఘంట సాల పాటల్లో నా కెంతో ఇష్టమైన పాటల్లో ఇదొకటి. ఘంటసాల గారి స్వరం చక్కని స్థితిలో, మాధుర్యం నిండి , మంచి కండిషన్ లో ఉన్న రోజుల్లో పాడిన పాట.  - ఈ సినిమాలో పాటలన్నీ ఇష్టమైనా...ఈ పాటంటే ప్రత్యేమైన ఇష్టం...  శ్రీ శ్రీ సాహిత్యం, రాజేశ్వర రావు సంగీతం,  ఘంటసాల గానం....ఈ మూడూ ఈ పాటతో నా అనుబంధం "నీ కన్నుల లోనా దాగెను లే వెన్నెల సోనా చకోరమై నిను వరించి అనుసరించినానే.... శ్రీ శ్రీ ఆణిముత్యం......!!  ఈ పాట మీద ఎవరో "విప్లవ గీతాలు రాసే మీరు ఈ పాట రాయడఏమిటి" అని అడిగితే  "అవునయ్యా, నా హృదయంలో నిదురించేది సోషలిజమూ, కలలో కవ్వించేది కమ్యూనిజమూ" అని చెప్పిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా! - ఈ పాటలో పియానో ప్లే చేసిన చేతులు సాలూరి రాజేశ్వర రావు గారి అబ్బాయి గారివి అట. . http://www.youtube.com/watch?v=3O5Uh4huG2k

ఆరుద్ర గారి అపురూపమైన నవల “ఆడదాని భార్య”!

Image
- ఆరుద్ర గారి అపురూపమైన నవల “ఆడదాని భార్య”! - వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు ************** మహాకవి ఆరుద్ర సినిమా రంగప్రవేశం చేసి డిటెక్టివు కథారచన పట్ల ఆసక్తి చూపిన పందొమ్మిదివందల యాభై దశకం నాటికే తెలుగు అపరాధ పరిశోధక నవలల రాజధాని వేంకట పార్వతీశ్వర కవుల పిఠాపురం నుంచి టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు గారల చెన్నపట్నానికి తరలివచ్చింది. అప్పటికే ఇంగ్లీషు, బెంగాలీ, రష్యన్ భాషల గ్రంథానువాదయుగం ముగిసి పూర్తిగా స్వతంత్రస్థాయిలో రచనలు వెలువడటం మొదలయింది. తొలినాటి రచనలలో లాగా గరళగ్రాంథికంలో రాయటం మాని రచయితలు సరళమైన వ్యావహారికాన్ని అభిమానింపసాగారు. క్రౌను కంటె చిన్నగా చేతికి అనువైన పోట్ ఆక్టెవో పాకెట్ బుక్ సైజులో న్యూసుప్రింటు కాగితం మీద జైహింద్ వారి స్పష్టమైన 10 పాయింటు, 12 పాయింటు ఇంగ్లీషు బాడీ ఫాంటులో 22 పాయింటు గ్రేట్ ప్రైమర్ శీర్షికలతో, త్రివర్ణ ముఖచిత్రంతో అందంగా అచ్చయి అందుబాటులోకి వచ్చిన ఆ నవలల కేర్పడిన ప్రచారం ఆ రోజుల్లో అంతా ఇంతా కాదు. అందులో కొన్ని అంచులకు ఎర్రరంగు అద్ది, చూడగానే ఇది అపరాధ పరిశోధక నవల అని గుర్తుపట్టడానికి వీలుగా ఉండేవి. ఆంధ్రాంగ్లాలలో నిష్ణాతులై అప్పటి

సుమతీ శతకం ఒక సమీక్ష!

Image
- ఇప్పటి "సామాజి సృహ" పరంగా ఉన్న అవగాహనతో చూస్తే  కొన్ని పద్యాలలో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది. . ముఖ్యంగా స్త్రీల పట్ల,  కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి.  (నమ్మకుమీ వామ హస్తుని",కోమలి నిజము, గొల్ల ని సాహిత్య విద్య" ఉండవని కవి వ్రాశాడు).  ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలే అని మనం గ్రహించాలి. . స్త్రీల ఎడ వాదులాడక బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ! తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు. . సిరి దా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరి దాఁ బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ! తాత్పర్యం: సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీరు వచ్చిన విధంగా రమ్యంగానే ఉంటుంది. అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులో గుంజు మాయమైనట్లే పోతుంది. . మేలెంచని మాలిన్యుని మాలను నగసాలివాని మంగలి హితుగా నేలిన నరపతి రాజ్యము నే

సుమతీ శతకము!

Image
- సుమతీ శతకము! - తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది.  బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును. - సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. క్రీ.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం.  ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో  ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు. . సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది.  (పాలకురికి సోమనాధుని వృషాధి