తెలుగు తెలుసుకోండి.. ప్రథమా విభక్తి!

తెలుగు తెలుసుకోండి.. ప్రథమా విభక్తి!

– 

‘ప్రథమా విభక్తి’ ని కొంచెం విపులంగా పరిశీలిద్దాం:-

డు/ము/వు/లు – ప్రథమా విభక్తి ప్రత్యయాలు (first preposition).

అనేక సంస్కృత నామవాచకాలు (nouns) తెలుగులోకి , ఒక వాక్యం లో కర్త గా వచ్చినపుడు ఎలా మారతాయో ప్రథమా విభక్తి సూచిస్తుంది. ఇది పుంలింగం (masculine), స్త్రీలింగం (feminine) లేక నపుంసకలింగం (neutral) అని మూడు లింగాలు (genders) లో ఒకటవుతుంది

‘డు’ అనేది – ముఖ్యంగా సంస్కృత పదాలకు చేరి – తెలుగులో పుంలింగ ఏకవచన పదాలుగా రూపాంతరం చెందిస్తుంది. అనేక సార్లు దాని ముందు అక్షరం కూడా ‘ఉ’ కారం గా పరివర్తనం చెందుతుంది.

ఉదా: రామ, కృష్ణ (సం) – రాముడు, కృష్ణుడు (తె)

‘ము’ అనే ప్రత్యయం (suffix) – అనేక సంస్కృత నపుంసక లింగ ఏకవచన పదాలకి చేరి తెలుగులో ఆ యా పదాల సరిజోడు పదాలని తయారుచేస్తుంది.

ఉదా: పుస్తకం (సం) – పుస్తకము (తె)

‘వు’ కొన్ని సంస్కృత మూల పదాలకు చేరి తెలుగు పదాలను తయారు చేస్తుంది .

ఉదా: ధేనుః (సం) – ధేనువు (తె) = cow

‘లు’ అనేది తెలుగులో అన్ని లింగాలలోనూ సాధారణంగా వచ్చే బహువచన ప్రత్యయం.

ఉదా: పుస్తకాః (సం) = పుస్తకాలు/పుస్తకములు (తె) = books

—————————

చివరి అక్షరాలకి వచ్చే ప్రత్యయాలే కాకుండా, దాని ముందు అక్షరానికి ‘ఉ’ త్వం రావడానికి, లింగానుసారంగా, దాని ముందు అక్షరానికి ‘ఉ’ త్వం రావడానికి, అనేక వ్యాకరణ సూత్రాలున్నాయి.

ఉదా: 1) రామ (సం) = రాముడు (తె)

(‘మ’ కు ఉత్వం వచ్చి, ‘డు’ ప్రత్యయం చేరుతుంది)

ఇది ఏకవచన పుంలింగ శబ్దం

2) హరి (సం) = హరి (తె )

ఈ పదానికి ప్రత్యయాల సూత్రాలు చివరికి ఏ ప్రత్యయాన్నీ మిగల్చవు.

3) కలిమి (ఏక వచనం) – కలుములు (బహు వచనం)

ఈ అచ్చ తెలుగు పదంలో ‘లు’ ప్రత్యయం రావడం, ముందు అక్షరం (మ) ‘ఉ ‘ త్వాన్ని పొందటంతో పాటు, ఇంకొంచెం ముందు అక్షరం (ల) కూడా ‘ఉ’ త్వాన్ని పొందుతుంది.

4) యామిని (ఏక వచనం) – యామినులు (బహు వచనం)

ఈ సంస్కృత పదం తెలుగలో ఉపయోగించినప్పుడు బహువచనానికి ‘లు’ ప్రత్యయం చేరి, దాని ముందు అక్షరానికి (న) ‘ఉ’ త్వం వసుంది కాని, ఇంకొంచెం ముందున్న (మ) అక్షరం మాత్రం తన ‘ఇ’ త్వాన్ని నిలుపుకుంటుంది – ఉత్వంగా మారదు.

—————————

డు/ము/వు/లు చేరని అనేక సంస్కృత పదాల తెలుగు రూపాలను కూడా ప్రథమా విభక్తి నిర్దేశిస్తుంది.

ఉదా : రాట్ (సం) = రాట్టు (తె) = king

ఇవన్నీ కలిపి, తెలుగు వ్యాకరణంలో చర్చించిన సంస్కృత తత్సమ, తద్భవ పద రూఫాలకే కాక అనేక ఆంగ్ల, ఇతర భాషా పదాలు (ఈ మధ్య వచ్చి బాగా వాడకంలో ఉన్నవి) కూడా తెలుగులో కొంత రూపాంతరం చెందటాన్ని ‘ప్రథమా విభక్తి’ సూత్రాలు ప్రభావితం చేస్తాయనే చెప్పాలి.

ఉదా: ఆంగ్లం నుంచి.

కారు (for ‘car’)

బస్సు (for ‘bus’)

పారశీకం నుండి

మరమత్తు (for ‘marammat’ meaning ‘repair’)

తమిళం నుంచి

కల్లు (for ‘kal’ meaning ‘stone’)

—————————

ఎన్ని ఇతర భాషా పదాలను వాడినప్పటికీ వాక్యం తెలుగులో తెలుగు వారికి అర్థమయే రీతిలో నిర్మించడంలో – ‘కర్త’ రూపానికి (కారు, బస్సు లాగ) సంబంధించినంత వరకు ప్రథమా విభక్తి పాత్ర ఇది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!