అమ్మరో! విన్నావటే ఈమాట - అన్నతో అన్నావటే .!.

-

అమ్మరో! విన్నావటే ఈమాట -

అన్నతో అన్నావటే .!.

(కాంచన విపంచి- శ్రీమతి చావలి బంగారమ్మ)

-

ఆపేక్షగల అన్న అర్ధచంద్రుడైతె

అది వదినకిత్తునూ అణచి ముక్కున బెడుదు

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే ..

-

నా సిగలో పువ్వల్లె నలినాక్షి పెదవదిన

నలిగిపోయీ నన్ను తొలగి చూచునొ యేమొ

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే ...

-

పులకరించని మేన పలుకరించని తాను

పట్టిలాగుచు బాధపెట్టునేమో నన్ను

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే ..

-

చుక్కంటి మావదిన చక్కన్ని చూపులో

చిక్కబట్టిందంటె టక్కరైపోతాడె

అమ్మరో! విన్నావటే ఈమాట

అన్నతో అన్నావటే .

-.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!