Wednesday, November 30, 2016

గోపయ్య నల్లనా.. ఎందువలనా?

                            గోపయ్య నల్లనా.. ఎందువలనా?

గోపయ్య నల్లనా.. ఎందువలనా?

.

"అమ్మా.." 

"ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని. 

"నాకు కోపమొచ్చింది"

"కోపం అంటే ఏంటి, కన్నయ్యా?"

"ఏమో! వచ్చింది. అంతే!" 

"సరే, వచ్చింది లే!"

"ఉహూ, ఎందుకూ? అని అడుగు"

"హ్మ్"

"హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి"

"అడిగాను లే , చెప్పు"

"నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు."

"పోన్లే, అన్నేగా!"

"వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు."

"నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు."

"మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!"

"అయితే!"

"అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు." 

"నీ అంతవాడివి నువ్వే కన్నా!"

"అంటే?"

"గొప్పవాడివనీ.."

"గొప్ప కాదు నల్లవాడినట."

"అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు కుచ్చులా ఉందో!" 

"జుత్తు కాదు అమ్మా.. నల్ల నల్ల వాడిని ఎందుకూ? చూడు, నువ్వు తెలుపు. పాలు తెలుపు. వెన్న తెలుపు. మీగడా తెలుపు. నాకు పాలబువ్వ తినిపిస్తావే ఆ వెండి గిన్నె తెలుపు. ఆ.. పాల బువ్వా తెలుపే! చందమామా తెల్లగానే! నా ముత్యాల పేరూ, కడియాలూ కూడా తెలుపు. ఇదిగో ఈ బృంద కూడా తెలుపే." దగ్గరికి వచ్చిన పెయ్యని చేత్తో తోసేస్తూ చెప్పాడు.

"ఇన్ని తెల్లగా ఉన్నాయే! మరి పాపం నల్లగా ఎవరుంటారు నాన్నా!"

"అంటే!"

"నలుపు నిన్ను శరణంది తండ్రీ! ఇందరు వద్దన్న నలుపుకి నువ్వు వన్నెనిచ్చావు." 

"ఏమో! అర్ధం కాలేదు."

"ఇటు చూడు బంగారూ! నీకు ఇష్టమైన ఆట ఏది?"

"దాగుడు మూతలు. భలే ఇష్టం నాకు."

"కదా! మరి వెన్నెల్లో దాగుడు మూతలు ఆడితే ఎప్పుడూ ఎవరు గెలుస్తారూ?"

"నేనే! నేనే!"

"చూసావా! తెల్లని వెన్నెల్లో నువ్వు ఇంకా తెల్లగా ఉంటే, టక్కున పట్టుబడిపోవూ ఋషభుడిలాగ."

"హ్హహ్హా.. ఋషభుడు ఎప్పుడూ మొదటే బయటపడిపోతాడు. అవును."

"అందుకని, నువ్వు నల్లగా ఉన్నావన్నమాట. "

"అవునా!"

"హ్మ్.. "

"భలే! పాలు ఇవ్వమ్మా.. తాగేసి ఆడుకోడానికి వెళ్తాను."

"ఇంకా చీకటి పడలేదు కన్నా! చీకటి పడనీ. అప్పుడు వెళ్దువుగాని వెన్నెల్లో ఆటలకి."

"చీకటి అంటే ఏమిటీ?"

"చీకటి అంటే, ఏమీ కనిపించదు."

"ఓహో, ఏమీ కనిపించకపోతే చీకటా?"

"అవును."

"అయితే, నాకు ఏమీ కనిపించట్లేదు చూడూ" కళ్ళు మూసుకొని చెప్పాడు అల్లరి కృష్ణుడు.

ఫక్కున నవ్వి, వెండి కొమ్ము చెంబుతో వెచ్చటి గుమ్మపాలు తెచ్చి ఇచ్చింది అమ్మ. 

తాగేసి, పాలమూతి అమ్మ చీరచెంగుకి తుడిచేసుకొని, ఆడుకోడానికి వెళ్ళిపోయాడు కన్నయ్య.

(మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.)

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!!

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!! 

ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!! 

అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు…

మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల వరకు వెళుతున్నారు…! 

నాలుగు గోడల మధ్య ఉండవలసిన భార్యా భర్తల తగాదాలను సర్ది చెప్పే 

పెద్దవారితో కాకుండా, అహంకారం కోసం ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని, వారి సలహలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు, మనతోపాటే జీవితం అనుకున్న వారిని దుఖః సాగరంలో ముంచుతున్నారు… 

ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు, 

అలాగే 100% ఒకే అభిప్రాయాలున్న మనుషులు ఎవరు ఉండరు

కాబట్టి ఇద్దరి మద్య బేధాలు సహజం.. 

కాని వాటిని సర్దుకొని పోవడంలోను, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోను, అభిప్రాయాలను, భావాలను మరొకరు గౌరవించుకోవడంలోనే ఆనందంకరమైన 

జీవితం ఉంది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు… 

కాబట్టి ఒకరు మూర్ఖంగానో కోపంగానో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు భార్యా భర్తల జీలితం సజావుగా సాగుతుంది…….

Tuesday, November 29, 2016

అందుకో జాలని ఆనందమే నీవు... ఎందుకో చేరువై.....దూరమవుతావూ..

అందుకో జాలని ఆనందమే నీవు...

ఎందుకో చేరువై.....దూరమవుతావూ..


మొన్నటి దాక అందానికి అందం ....

మొన్నటి దాక అందానికి అందం ....


ఈ బంగారు పాప ఇప్పుడు ఎక్కడుందో ?

ఈ బంగారు పాప ఇప్పుడు ఎక్కడుందో ?

శుభవేళ ... కలవరం.

                                         శుభవేళ ... కలవరం.

అప్పుడు ..... ఇప్పుడు.

అప్పుడు ..... ఇప్పుడు.

.

పౌరాణికజానపదసామాజిక చిత్రాల్లోనటించిన నర్తకి ఎల్ విజయలక్ష్మి.

చాలా చిత్ర్హాల్లో ఎన్టీఆర్ ఎఎన్ఆర్ లసరసన నటించి మెప్పించిన అరుదైననటి.

నర్తనశాల ఒక మచ్చుతునక

కాంచన!

కాంచన!

కాంచన (వసుంధర)చాలా అందమైన అమ్మాయి . 

కాలప్రవాహములో రూపురేఖలు మారిపోయాయి . 

అందరమూ అంతే. కొన్నాళ్ళకు రూపమే లేకుండా పోతాము . 

నామ రూపాలు లేకుండా 

ఏది అయితే మిగులుతుందో అదే నీవు . 

అదే ఆత్మ . అదే పరమాత్మ. అంతా భగవంతుని లీల .

తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

తెలుగులో తెలుగు నేతిబీరకాయలో నెయ్యంత?

.

‘నేను, చెట్టు, కన్ను, మొదలు, మన్ను, అమ్మ, చదువు, నేల, ఆకు’, ఇవి అచ్చమైన, కల్తీలేని తెలుగు పదాలు.

ఇక్కడ నాకు ఆనందం కల్గించిన విషయం ఏమిటంటే, ‘అమ్మ’,

ఈ పదం సంపూర్ణంగా మనది, మన తెలుగు పదం. కనీసం ‘అమ్మ’పైన ఎవరి ప్రభావం లేదు. కాకపోతే కాలానుగుణంగా ఆ పదం కూడా కల్తీ అయి ‘మమ్మీ’ అయిందన్న బాధ లేకపోలేదు.

.

ఇక్కడ "అచ్చ తెలుగంటే" ఏమిటి అన్న సందేహం కలుగకపోదు. 

సంస్కృత సమానం కాని పదాలను, భాషను అచ్చ తెలుగు అంటారు.

ఉదాహరణకు, ‘రాజు’ ఈ పదానికి అచ్చ తెలుగు పదాలు ఏలిక, ఎకిమీడు, దొర, పుడమిఱేడు. అలాగే ‘మేఘం’ – నీరుతాలుపు, మబ్బు, మొగిలు. 

మనం రోజువారి తెలుగు అనుకొని ఉపయోగించే అనేక పదాలు సంస్కృత పదాలే. 

ఉదాహరణకు, సుఖదుఃఖాలు, కంఠం, రథం, ఆజ్ఞ, శ్రీవారి బ్రహ్మోత్సవాలు.

చివరికి తెలుగు డిక్షనరీ, క్షమించాలి, నిఘంటువు లేక పదకోశం ఇవేవి తెలుగు పదాలు కావు, సంస్కృతం..

.


అనుకరణ వల్ల కావచ్చు, చమత్కారం కోసం కావచ్చు, ఉచ్చరణా సౌకర్యం కోసం కావచ్చు, వ్యావహారిక అనుకూలత, సద్దుబాటు వల్ల కావచ్చు, అన్యభాషా పదాలు తెలుగు పదాల్లాగే మన భాషలో చెలామణీ అయిపోతున్నాయి.

కిటికీ, కుర్చీ, స్టూలు, ఫ్యాన్, దర్వాజా, వరండా, రేడియో, టెప్ రికార్డర్,

అంకుల్, ఆంటీ, ఫ్రెండ్, దోస్తు, కారు, క్యాబ్, జల్దీ ఇలా చెప్పుకుంటూ పోతే సగం భాష మనది 

కాని మన భాష. స్పీడ్ పెరుగుతున్నట్టే భాషలో మార్పు కూడా అతి వేగంగా పెరుగుతోంది. 

.

కొన్నిసార్లు రాయడానికి వీలుగా భాషని మార్చేస్తాం. కొన్నిసార్లు పలకడానికి అనువుగా భాషని కుదించేస్తాం. 

ఈ పదాలు చూడండి: ముఖము ఇది మొగము, మొగం నుంచి నేటి మొహంగా మారింది. అలాగే, తేనియు – తేనే,

చిలుక – చిల్క,

కొలది – కొద్ది, 

చలిది – చద్ది, 

తరుగు – తగ్గు,

వంగకాయ – వంకాయ,

రాతి చిప్ప – రాచిప్ప,

ఫలకము – పలక, 

పీఠము – పీట. 

ఈ సద్దుబాటు కేవలం ఒక్కభాషకి పరిమితం కాదు. ఇవి చూడండి: కాగజ్ – కాగితం, కరార్ – ఖరారు, జప్త్ – జప్తు, ఖబర్ – కబురు, ఖండియా – కండువా, పహ్ర హుషార్ – పారా హుషార్, దుకాన్ – దుకాణం, జమీన్ దార్ – జమీందారు, రైల్ – రైలు, టికెట్ – టికెట్టు, కాలేజ్ – కాలేజీ, స్విచ్ – స్విచ్చు, క్లబ్ – క్లబ్బు. అకార, ఉకార, ఇకారాలను అనువుగా కలుపుకొని, ప్రతి భాషను మనదిగా చేసుకోవడం మన తెలుగు భాషకు మాత్రమే చెల్లిందేమో!

అంత:సౌందర్యాము !

 అంత:సౌందర్యాము !

అనగనగా ఒక యువరాజు. ఆ రాజు ఎంతసేపూ తన అందాన్ని చూచుకొని మురిసి పోతుండేవాడు; మైమరచి పోతుండేవాడు.

ఎవరైనా బాటసారులు రాజభవనానికి వస్తే "మీరెప్పుడైనా నా అంత సౌందర్యవంతుణ్ణి చూశారా?" అని వాళ్ళనడిగేవాడు. అందరూ 'లేదు'అనే చెప్పేవారు.

ఒకరోజు దర్శనాని కొచ్చిన ఓ బాట సారైతే "దేవుడు కూడా మీ అంత అందంగా వుంటాడని నేననుకోను...!" అంటూ అతిగా పొగిడాడు.

దాంతో పొంగిపోయిన యువరాజు "దేవతల కంటే కూడ నేనే సౌందర్య వంతుడినట.." అంటూ మరింత గొప్పగా చెప్పుకునేవాడు.

అలా రోజులు గడుస్తున్నాయి.

ఒకరోజు దేవదూతలమని చెప్పుకునేవాళ్ళు ఇద్దరు అతని దర్శనానికి వచ్చారు.

"మీరు చెప్పుకుంటున్నంత సౌందర్యవంతులో..కాదో.. చూద్దామని వచ్చాం" వివరించారు.

"ఏమని తేల్చుకున్నారు? నేను అత్యంత సౌందర్యవంతుడినా, కాదా!?" ఉత్సాహంగా అడిగాడు యువరాజు.

"మిమ్మల్ని ఈ రోజు ఉదయం నిద్రిస్తుండగా చూశాం. అప్పుడు ఇంకా అందంగా వున్నారు..." ఒక దేవ దూత చెప్పాడు.

"నా సౌందర్యం కొన్ని గంటల్లోనే ఎలా తగ్గిపోయింది?" అంటూ సేవకుల్ని పిలిచి "నేను ఉదయం ఇప్పటి కంటే ఎక్కువ అందంగా వున్నానా?" ఆరా తీసాడు యువరాజు.

"మీరు అప్పుడూ ఇప్పుడూ ఒకేలా వున్నారు ప్రభూ!" జవాబిచ్చారు సేవకులు.

"మేము దైవ స్వరూపలం. మీ సేవకులు చూడలేని వాటిని కూడా మేము చూడగలం. వాళ్ళ దృష్టి అసంపూర్ణం. కనుక వారు చెప్పింది నిజంకాదు. ఆ విషయం మీకు రుజువు చేస్తాం...." అంటూ ఒక దేవ దూత రాజుగార్ని ఒక పాత్రలో నీళ్ళు తెప్పించమని అడిగాడు.

రాజు వెంటనే ఒక పాత్రలో నీళ్ళు తెప్పించాడు.

దేవదూత సేవకుల్ని పిలిచి "పాత్రలోని నీటిని మీరు దగ్గరగా పరిశీలించండి. జాగ్రత్తగా గమనించండి. తరువాత గది బయటికి వెళ్ళండి" అని చెప్పాడు. సేవకులు పాత్రలోని నీటిని జాగ్రత్తగా పరిశీలించి, బయటికి వెళ్ళారు.

అప్పుడు ఆ దేవ దూత పాత్రలోంచి ఒక అరచెంచా నీటిని తీసివేశాడు. మళ్ళా సేవకుల్ని లోపలికి పిలిచాడు- "పాత్రలోని నీటిలో ఏమైనా తేడా వుందా?" అడిగాడు.

"ఏమీ లేదు" జవాబిచ్చారు సేవకులు.

"పాత్రలో నీళ్ళు తగ్గినట్లు మీ సేవకులు గమనించ లేకపోయారు. మీ అందం‌ తగ్గిన విషయం ఎలా గమనించలేదో ఇదీ అంతే..." రాజు గారితో చెప్పాడు దేవదూత.

ఆ మాటలకు రాజు కంపించిపోయాడు.

'నా అందం రోజు రోజుకీ తరిగిపోతోందన్న మాట! అంటే కొన్ని రోజులకు అది బాగా తగ్గిపోతుంది!

దాన్ని గురించి నేను ఇంత ఆరాట పడుతున్నానే, అయినా అది స్థిరంగా ఉండదన్నమాట! మరెలాగ?!'

అని ఆలోచనలోపడ్డాడు.

మెల్లగా అతనిలో జ్ఞానం‌ ఉదయించింది. అద్దం అతన్ని ఆకర్షించటం మానేసింది.

నశించిపోయే భౌతిక సౌందర్యానికి గాక, అంత:సౌందర్యానికి, తన కర్తవ్యానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని అతనికి అర్థమైంది.

కాలక్రమేణా అతను పూర్తిగా మార్పుచెందాడనీ, గొప్ప మానవత్వంగల రాజుగా ఎదిగి, అటుపైన రాజ్యాన్ని కూడా వదిలేసి విరాగి అయ్యాడనీ చెబుతారు.

మూలం: ది హిందూ, ఏప్రియల్ 10, 2012. అనువాదం: శ్రీ పి.వి.ప్రసాద్, విజయవాడ.

---శుభోదయం -సూక్తులు------

---శుభోదయం -సూక్తులు------


భక్తి పత్రమొ పుష్పమో ఫలమో తోయ 

మో యొసంగక వేలుపు లోసగ రెందు

బొంగి పొరలెడి ప్రేమ నొసంగు; వలయు 

నన్ని సుఖములు తనుదానె కన్నతల్లి !

పత్రము,పుష్పము, ఫలము,నీరు భక్తితో సమర్పిస్తేనే దేవుడు వరాలిస్తాడట. (అదీ అనుమానమే) ప్రతిఫల మాసింపక మనకు అన్ని సుఖములు,ప్రేమ,వాత్సల్యము యిచ్చేది కన్నతల్లి ఒక్కతే

.

పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణాం 

ధర్మే స్వయ మనుస్టానం కస్య చిత్తు మహాత్మనామ్ 

.

అర్థము:-- పరులకు ఉపదేశము చేయడములో అందరూ మహా పండితులే కానీ స్వయముగా తాము 

ధర్మము పాటించడము మాత్రం ఎవరో మహాను భావులు మాత్రమే చేయగలరు.

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే

పయః పానం భుజంగానాం కేవలం విష వర్ధనం 

తా:-నీచులకు ఉపకారము చేసినా వాళ్ళు మనకు అపకారమే చేస్తారు.ఎలాగయితే పాముకు పాలు పోయడం వలన దానికి విషము వృద్ధి యై మనల్ని కాటువేస్తుందో అలాగ.

మాతా పిత్రో ర్నిత్యం ప్రియం కుర్యాత్ 

ఆచార్యస్య చ సర్వదా 

తేషు హి త్రిషు తృప్తేషు 

తపస్సర్వ సమాప్యతే 

.

అర్థము:-- తల్లి తండ్రులతో, గురువులతో ఎప్పుడూ ప్రియముగా మాట్లాడ వలయును. వారు చెప్పినట్టు నడుచుకొని వారికి సంతోషము కలుగ జేయ వలయును. ఈ ముగ్గురు తృప్తి చెందినచో సర్వ తపములు ఫలించి నట్లే.

మాతృవత్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్ 

ఆత్మవత్స్స ర్వ భూతాని యః పశ్యతి స పండితః

అర్థము:-పరస్త్రీలను తల్లి లాగానూ, యితరుల ధనమును మట్టి పెళ్లలు లాగాను,

అన్ని భూతములు తనలాగా చూసే వారే నిజమైన పండితులు.


అంతు చిక్కని ప్రశ్న !

.

నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు

నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరు

మధ్యలో నలిగే ఈ కాలం గొడవేమిటి ????????????

గుండ్రని భూమికి ధిశలేందుకు మారుతున్నాయి ??????

ఎటు వెళ్ళినా నేను వెనక్కే ఎందుకు వెళుతున్నాను ??????

జీవితాన్ని ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ జీవిస్తున్నా కూడా, 

తేడా లేదెందుకు ???????????

Monday, November 28, 2016

" కన్యాశుల్కం".!

" కన్యాశుల్కం".!


హాస్యభరిత శైలిలో సాంఘిక దురాచారాలను దునుమాడిన నాటకం" కన్యాశుల్కం".

.

ఆధునిక గద్య రచనకీ ప్రారంభకుడూ, ప్రవక్తా గురజాడ అప్పారావు. ఎన్నెన్నో సాహిత్య రంగాలలో ఆయన కొత్త మార్గాలు తెరచి కొత్త ప్రక్రియలు అవలంబించారు. ప్రత్యేకంగా వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకు వెళ్ళాడు.

గురజాడ చేపట్టక పూర్వం, 

ఆయన మాటల్లోనే... "గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ... ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితిని"... అన్నాడు గురజాడ.

.

ఈనాడు వాడుక భాష దిక్కుమాలినది కాదు. గుడిసెల్లో పుట్టి పెరిగి, స్వయంప్రతిభతో కళాశిఖరాలందుకున్న నటీమణీతోనో, స్వల్ప ప్రారంభాల నుంచి బైటపడి, స్వయంకృషితో చదువులన్నీ నేర్చి, పార్లమెంటు భవనాల నలంకరించే విదుషీమణితోనో నేటి వ్యావహారిక భాషను సరిపోల్చవలసి ఉంటుంది. వాడుక భాషకు ఏ ఒక్కరైనా ఇంత గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావనే చెప్పాలి.

.

మన దేశభాషలన్నింటిలోనూ, పూర్తిగా వచనంతో, అందులోకి పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటి నాటకం రాసింది గురజాడ అప్పారావు గారనే అనుకుంటాను. సాంఘిక వాస్తవికతను దర్పణంలో వలె యధాతథంగా ప్రతిబింబించిన కళాఖండం మన భాషలోనే కాదు, మరే ఇతర భారతీయ భాషల్లోనైనా మొదటిదీ, ఆఖరిదీ కన్యాశుల్కమే అనుకుంటాను. కన్యాశుల్కం నాటకాన్ని ఆ తెగలో మించడం మాట అటుంచి, ఆ దరిదాపులకైనా రాగల నాటకం మన దేశంలో ఏదైనా ఉంటే దాని సంగతి ఇంతవరకూ ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరమే అని మాత్రం నేననక తప్పదు.

కన్యాశుల్కంలో ఎక్కడ, 'ఎప్పుడు' ఎవరి మాటలైనా తీసుకోండి. ఇక్కడ అప్పుడు సరిగా ఆ పాత్ర ఆ మాట తప్ప మరొకటి అనడానికి వీల్లేదు. ఇది నాటక రచనకి పరాకాష్ట. గురజాడ కవి మహత్తర విజయం.

అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'

అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'

శ్రీ Ranga Rao Peyyeti గారు.!

.

అమ్మకాల ఆసామీ పిలుపుగంట నొక్కేసరికి పేరిందేవి తలుపు తీసింది.

' అమ్మా! ఇది చాలా మంచి నిఘంటువు. ఏ తెలుగు పదానికి ఆంగ్లపదం కావాలన్నా ఇందులో దొరుకుతుంది. మీకు ప్రత్యేకమైన తగ్గింపు ధరలో ఇస్తాను. తీసుకోండమ్మా.'

పేరిందేవి విసుగ్గా అంది, ' మా ఇంట్లో నిఘంటువు వుందయ్యా. అదుగో, ఆ బల్ల మీద వుంది చూడు.'

' అమ్మా! అది నిఘంటువు కాదమ్మా. భగవద్గీత.'

పేరిందేవి ఆశ్చర్యంగా అడిగింది, ' ఇంత దూరం నించి అది ఏ పుస్తకమో కనబడదుగా! అది భగవద్గీత అని నీకెల్లా తెలిసింది?'

' చాలా దుమ్ము కొట్టుకుని వుండిపోయింది కదమ్మా? ఎప్పుడు తెరవకుండా వున్నారంటే అది భగవద్గీతే అనుకున్నానమ్మా.'

( నేను చిన్నప్పుడు ఆకాశవాణిలో ఒక పాట విన్నాను. ' పుట్టినావీ భరతఖండాన, చేత పట్టావ నువు గీత ఎపుడైన?')

పూలమ్మి పాట.

శుభోదయం !

(పూలమ్మి పాట.)

బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో

నీ బిడ్డ నీళ్ల గౌరి ఉయ్యాలో.. నీ బిడ్డ నీళ్లు పోసే ఉయ్యాలో

నిత్యం నీళ్లు పోసి ఉయ్యాలో.. నిత్యమల్లె చెట్టేసే ఉయ్యాలో

నిత్యమల్లె చెట్టూకు ఉయ్యాలో.. ఏడే మొగ్గలు ఉయ్యాలో

ఏడు మొగ్గలకు ఉయ్యాలో.. ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో

ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో.. సాలోనికిస్తే ఉయ్యాలో

సాలోడు నేసేనే ఉయ్యాలో.. నెలకొక్కపోగు ఉయ్యాలో

దిగెనే ఆ చీర ఉయ్యాలో.. దివిటీల ఆ చీర ఉయ్యాలో...

Kanyasulkam songs - Aanandham Arunavamaithe - Savitri,Susheela

అద్వైతం.! (మహా కవి శ్రీ శ్రీ)

(కన్యాశుల్కం సినిమాలో .. మహానటి సావిత్రి అద్బుత నాట్యం.)
.
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపు తంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.
.
నీ కంకణ నిక్వాణం_లో,
నా జీవన నిర్వాణం_లో
నీ మదిలో డోలలు తూగీ,
నా హృదిలో జ్వాలలు రేగీ
నీ తలపున రేకులు పూస్తే,
నా వలపున బాకులు దూస్తే
మరణానికి ప్రాణం పోస్తాం,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం
.
హసనానికి రాణివి నీవై
వ్యసనానికి బానిస నేనై
విషమించిన మదీయ ఖేదం
కుసుమించిన త్వదీయ మోదం
విషవాయువులై ప్రసరిస్తే,
విరితేనియలై ప్రవహిస్తే
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం
.
వాసంత సమీరం నీవై,
హేమంత తుషారం నేనై
నీ ఎగిరిన జీవవిహంగం
నా పగిలిన మరణమృదంగం
చిగురించిన తోటలలోనో,
చితులించిన చోటులలోనో
వలయములై చలించినపుడే,
విలయములై జ్వలించినపుడే
కాలానికి కళ్ళెం వేస్తాం,
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం.
.
నీ మోవికి కావిని నేనై,
నా భావికి దేవివి నీవై
నీ కంకణ నిక్వాణం_లో
నా జీవన నిర్వాణం_లో
ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం
.
(A.C.Swinburne తన రచనలలో, ముఖ్యంగా A Match అనే 
గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞ్~అతతో)
--శ్రీశ్రీ 1936 (?)

Sunday, November 27, 2016

Emani Pogadudume

చెలి చక్కదనము !

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము
యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు
ధర శింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను
మరుతల్లి యలమేలుమంగమోమై నిలిచె

బిసములు శంఖమును పెనుచక్రవాకములా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను
మసలక అలమేలుమంగ మేనై నిలిచె

అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండగాను
ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద
పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె

చందమామ రావే - జాబిల్లి రావే!

చందమామ రావే - జాబిల్లి రావే!


చందమామ రావే - జాబిల్లి రావే! 


కొండెక్కి రావే - గోగు పూలు తేవే! 


బండిమీద రావే - బంతి పూలు తేవే! 


పల్లకిలో రావే - పంచదార తేవే! 


సైకిలేక్కి రావే - చాక్లెట్లు తేవే! 


పడవమీద రావే - పట్టుతేనే తేవే! 


పెందలాడే రావే - పాలు పెరుగుతేవే! 


మంచి మనసుతో రావే - ముద్దులిచ్చిపోవే! 


అన్నియునుతేవే - మా అబ్బాయికీయవే

అన్నమాచార్య కీర్తన!

అన్నమాచార్య కీర్తనలు

ఈ పాదమే కదా యిల యెల్ల( గొలిచినది

యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది !!పల్లవి!!

ఈ పాదమే కదా యిందరును మ్రొక్కెడిది

యీ పాదమే కదా యీ గగన గంగ పుట్టినది

యీ పాదమే కదా యెలమి( బెంపొందినది

యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది !!ఈ పా!!

యీ పాదమే కదా యిభరాజు దల(చినది

యీ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది

యీ పాదమే కదా బ్రహ్మ కడిగినది

యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది !!ఈ పా!!

యీ పాదమే కదా యిహపరము లొసగెడిది

యీ పాదమే కదా యిల నహల్యకు( గోరికైనది

యీ పాదమే కదా యీక్షింప దుర్లభము

యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది !!ఈ పా!!

బ్రహ్మ కడిగిన –పాదము

బ్రహ్మము దానె నీ పాదము !!పల్లవి!!

1.చెలగి వసుధ గొలి చిన నీ పాదము

బలితలమోపిన పాదము

తల(కక గగనము దన్నిన పాదము

బలరిపు(గాచిన పాదము !! బ్రహ్మ!!

2.కామిని పాపము గడిగిన పాదము

పాము తలనిడిన పాదము

ప్రేమపు శ్రీపతి పిసికెడి పాదము

పామిడి తురగపు( బాదము !!బ్రహ్మ!!

3.పరమ యోగులకు( బరిపరి విధముల

పరమొస(గెడి నీ పాదము

తిరువేంకటగిరి తిరమని చూపిన

పరమ పదము నీ పాదము

. కృష్ణా!

క.

అల్ల జగన్నాథుకు వ్రే

పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్

గొల్లసతి యా యశోదయు

దల్లియునై చన్నుగుడిపె( దనరగ కృష్ణా.!

.

తా. కృష్ణా! 

జగన్నాథుడవైన నీకు వ్రేపల్లె ఆటస్థలమయ్యెను. 

గొల్లసతియగు యశోద తల్లియై పాలిచ్చెను.

వ్రేపల్లె ధన్యమయ్యెను. యశోద ధన్యురాలయ్యెను.

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 

సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు

శేష సాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణునాకర్ణించు వీనులు వీనులు

దేవదేవుని చింతించు దినము దినము

మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ”

పిల్లగాలికి ఎంత గర్వమో !

పిల్లగాలికి ఎంత గర్వమో ! 

చెలి కురులను తాకుతోందని ll

(ఈ ఫోటోలో పిల్లగాలి తగిలిన గర్వం ఎవరికంటే 

రెండు కళ్ళూ నెమలికళ్ళను చేసుకు చూస్తున్న ఓయదు ఓయరు.)

Saturday, November 26, 2016

“జంతూనాం నరజన్మ దుర్లభం“

“జంతూనాం నరజన్మ దుర్లభం“

 అని… అంటే జీవరాసులలోఅన్నిటికంటే

మనిషిగా జన్మించడం దుర్లభమని పెద్దలు చెప్తూంటారు

Balamuralikrishna-sthiratha-nahi-nahi-re-Amruthavarshini

నా మనసు లో మా ట శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో
చక్కగా వివరించారు బాల మురళీకృష్ణ గారు .
.
స్థిరతా నహి నహి రే ,
మానస —స్థిరతా నహి నహి రే ||
.
తాపత్రయ సాగర మగ్నానాం —దర్పాహన్కార విలగ్నానాం ||
.
–విషయ పాశ వేష్టిత చిత్తానాం –విపరీత జ్ఞాన విమత్తానాం ||
.
–పరమ హంస యోగ విరుద్దానాం —బహు చంచలతర సుఖ సిద్ధానాం ||
.
భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు అని రూధిగా తెలియ జేశారు
.ఎవరికి లేదు ?అని విచారించారు .
”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని
నిర్ద్వందంగా చెప్పారు .

జీవితమే సఫలము (అనార్కలి)

జీవితమే సఫలము

(అనార్కలి)

ఈ జీవితమే సఫలము

రాగ సుధా భరితమూ

ప్రేమ కధా మధురము

జీవితమే సఫలము

హాయిగా తీయగా ఆలపించు పాటలా

అనారు పూల తోటలా

ఆశ దెలుపు ఆటలా

జీవితమే సఫలము

వసంత మధుర సీమలా ప్రశాంత సంజ వేళలా

అంతులేని వింతలా అనంతప్రేమ ప్రేమ లీలగా

పరించు భాగ్యశీలలా

తరించు ప్రేమ జీవులా

జీవితమే సఫలము

Friday, November 25, 2016

ప్రాభాతి.!............(కరుణశ్రీ.)

ప్రాభాతి.!............(కరుణశ్రీ.)

.

రేగిన ముంగురుల్ నుదుట ప్రేమ సుధా మధురైక భావముల్

ప్రోగులు వోయగా నిదురపోవు దయామయి! నా యెడందలో

ఆగక పొంగు స్వాప్నిక రహస్యము లెవ్వియొ నీదు గుండెతో

దాగుడు మూత లాడ సరదా పడుచున్నవి కన్నులెత్తుమా!

మంచి వేదాంతం..

మంచి వేదాంతం.....మన దాకా వచ్చేదాకా తెలియదు!

.

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు

ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా??

అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని

అనుసరించుటే ధర్మమా??

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు... ఎవరూహించెదరు

తమ్ముళ్ళు అందరు లక్ష్మనులే ... ఉర్మిలలుఉరు కున్నత వరకే...

           తమ్ముళ్ళు అందరు లక్ష్మనులే ...ఉర్మిలలుఉరు కున్నత వరకే.!

*ధర్మం చేయండి బాబు*

*ధర్మం చేయండి బాబు*

------------------------------

ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.

ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?

'అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం' అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- "ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?" అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, 'వాడికి ఆకలిగా ఉంది' అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- 'తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!' అని.

పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులో‌చెయ్యి పెడుతూ- "మీకు ఎంత చెల్లించాలి?" అని.

"నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!"అన్నది ఆ యువతి నవ్వుతూ. "దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!" అన్నది.

పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. "అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి" అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.

ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది- 

ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.

చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.

ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. 'ఎలాగైనా ఆమెను రక్షించాలి' అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!

ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందో‌మరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.

ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె... బిల్లు చివర్లో‌ రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:

ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.

సం/-

దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!

మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.

*...✍🏻 హరి ఓం*

నేమి సేతును గురుడా ?

కొల్లగ రూకలు గైకొని

చల్లగ చీకట్ల దాచ చాతుర్యముతో,

" నల్ల " యని నవ్వి మోదీ

చెల్లక తాఁ జేసె ! నేమి సేతును గురుడా ? 😹

(ఒక అజ్ఞాత మహా కవి మనకు పంపిన పద్యం.)

ఇంకా చావని మానవత్వం.!

Raghavanand Mudumba గారి ఇంకా చావని మానవత్వం.!

.

ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ 

.

దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది . 

.

"దయచేసి చదవండి " అని రాసి ఉంది . ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను . 

.

.

" ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు . మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి " అని రాసి ఉంది .

.

.

నాకు ఎందుకో ఆ ఎడ్రెస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది

.

అడ్రెస్ గుర్తుపెట్టుకున్నాను .

.

అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక . దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లో నుండి ఒక వృధ్ధురాలు వచ్చింది . ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు .ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది . చేతి కర్ర సహాయం తో తడుము కుంటూ బయటకు వచ్చింది 

.

.

"ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది . అది ఇఛ్చి పోదామని వచ్చాను " అన్నాను 

.

.

.

ఆమె ఏడుస్తోంది . 

.

"బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక్కరూ ఒక 50 రూపాయలు ఇస్తున్నారు . నాకు కళ్ళు కనబడవు . నాకు చదవడం రాయడం రాదు .నేను అది రాయలేదు బాబూ ! ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో !" 

.

.

" పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో ! " 

.

.

బాబూ ! అది నేను రాయలేదు . నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు . వెళ్ళేటపుడు అది కాస్త చించెయ్యి బాబూ ! అంది 

.

.

ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది . ఒక్కరూ చించెయ్యలేదు . ఆమె రాయలేదు . ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు . 

.

.

ఆ రోడ్డున వెడుతున్న ఎందరిలోనో కొందరు అది చూస్తారు . అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయ పడాలని అనుకుంటారు . అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వఛ్చి ఆమెకు సహాయ పడతారు . నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను ............ ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు ..... అది చింపెయ్యనా ? ఉంచెయ్యనా ? నాకు చెప్పినట్టే ఇంతకు ముందు వాళ్లకు కూడా చెప్పి ఉంటుంది కదా ! వాళ్ళెవరూ చింపెయ్యలేదు . అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు ........ మరి నేను ఎందుకు అది చింపెయ్యడం ....... ఇలా అనుకుంటూ వస్తున్నాను .

.

.

ఒకాయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు 

.

.

.

సర్ ! ఈ ఎడ్రెస్ చెప్పగలరా ? నాకు ఒక 50 నోటు దొరికింది . వాళ్లకి ఇచ్ఛేద్దామని ఎడ్రెస్ అడుగుతున్నాను .

.

.

.

ఆమె ఎడ్రెస్ 

.

.

.

నాకు అనిపించింది "మానవత్వం చచ్చిపోలేదు" .

.

అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను . ఎవరికయినా సహాయం చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు . ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను . . ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడం లో నాకు సందేహం లేదు . 

.

.

అది చింపడం భావ్యం కాదు .అనిపించింది .

.

.

.

నేను అది చింపేయాలా ? అలా వదిలేయాలా ? 

.

.

వదిలేశాను 

.

.

.

.

.

వదిలేసి నేను మంచి పని చేశానా ? లేదా ? 

.

.

మీరే చెప్పండి ...... ఇది కధ అయి ఉండొచ్చు ... కానీ ఈ పరిస్థితి ఎదురయితే .....

పెళ్లి అయిన కొత్తలో..

పెళ్లి అయిన కొత్తలో..మీ పిన్ని (అంటే నా శ్రీమతి.)

.

మా పెళ్లి అయిన కొత్తలో ఒక రోజు మా అత్తగారు నన్ను ప్రక్కకి పిలిచి ఒక కాగితం ఇచ్చారు.

అందులో ఈ గేయం ఉంది. 

.

పాపాయి కన్నులు కలువ రేకుల్లు

పాపాయి జుంపాలు పట్టు కుచ్చులు

పాపాయి దంతాలు మంచి ముత్యాలు

.

నాకు ఏమి అర్ధం కాలేదు.

మీ ఆవిడ ఏడుపు మొదలు పెడితే ఒక పట్టాన ఆపదు. చిన్నప్పుడు ఏడుపు మొదలు పెట్టగానే నేను ఇది పాడేదాన్ని. అంతే ఏడుపు మానేసింది అని చెప్పారు.

మీ పిన్ని కాపరానికి వచ్చిన వారం రోజులకి వాళ్ళ అమ్మ మీద బెంగ పడింది.

నాకేమో సెలవు లేదు.ఆ మాట అన్నాను అని ఏడ్చేసింది.నాకు చాలా ఖంగారుగా అనిపించింది.ఏం చేయాలో అర్ధం కాక వెంటనే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కాగితం తీసుకుని ఉండుండు ఏడవకు అని గబా గబా ఆ గేయం చదివేసాను.

ఇక మీ పిన్ని అటు సంతోషం, ఇటు ఆశ్చర్యం ,మళ్లి అంతలోనే దిగులు..

కాసేపటికి మామూలు మనిషి అయ్యింది." మా అమ్మలా పాడలేదు మీరు ఊరికే పాఠం అప్పచెప్పినట్టు చెప్పారు "అని పోట్లాట మొదలు పెట్టింది.

సరే మీ పిన్ని బాధ కన్నా పోట్లాట మంచిది అనిపించి నేను కూడా "పోనిలే అని పాడితే వంకలు పెడతావ ?"అని అన్నాను.

మొత్తానికి చాలాసార్లు ఈ మంత్రం నాకు పనిచేసింది.

ఉన్నదొక్కటే. .

ఉన్నదొక్కటే. .

(శ్రీ ములుకుట్ల సుబ్ర్హమన్య శర్మ గారు.)

ఉన్నది ఒక్కటే, లేనేలేదు రెండవది 

నీలోనా, నాలోనా మన అందరిలోనా ఉన్నదొక్కటే 

నీటిలో,నింగిలో,గాలిలో,అగ్గిలో,భూమిలో 

అంతటా వ్యాపించి ఉన్నదొక్కటే

"నేను, నేనని" నీవనుచున్నావు, అదే నేనూ అనుచున్నాను 

అందరిలోనా వున్న ఈ నేనెవరన్నదే వేదాంతం 

ఈ దేహేంద్రియములు, ప్రాణముకూడా కాదు "నేను" 

గుండెగుహలో చిరుజ్యోతిగా వెలిగెడి ఆత్మయే "నేను"

ఆజ్యోతివెలుగులో వెలుగొందు నీజగము 

కనుమూసినంతనే కరగునీ జగము 

కట్టకడపటి వరకూరకుండెడివేల 

కదలిరా! తెలుసుకో! నీయాత్మ జ్ఞానంబిదే.

మాయలో కప్పబడినారు మానవులందరు 

ఆ మాయ యను చీకటిని పారద్రోలెడి ప్రజ్ఞ 

కలవాడీ ప్రాణికోటిలో నీమానవుడొక్కడే 

ఉదయింపచేయు మాజ్ఞానభాస్కరు నీజన్మలోనే

జనన మరణ చక్ర భ్రమణ మాగదీజగంబున 

ఆప శక్యంబు కాదీ యవనిలో నెవరికీ 

మరుజన్మమేమొచ్చొ మనచేతిలో లేదు 

సాధించు జన్మరాహిత్య మీజన్మలోనే.

‘మనసా రా’

నేను మనసారా దుకాణాలకి వెళ్ళి ‘మనసా రా’ అని కవ్వించే సారా తెచ్చుకోను, మనీ కోల్పోను.

.

ఏదో ఇలా ఎదుటవాడు మన పర్సు కత్తిరించక పోస్తుంటే నోరెళ్ళబెట్టుకోవడమే.

:అది కూడా ఎందుకూ? మంచినీళ్ళో, ఆ రేంజ్ ని దాటి ఆరెంజ్ జూసో అందుకుంటే పోలా?

నాకు కొందరు సినీ హీరో హీరోయిన్ల మీద తెగ జాలి. కొందరు 

ఏదో సరదాగా మిత్రుల బలవంతం వల్ల అలవాటు చేసుకునీ, మరికొందరు అణచుకున్న 

అవమాన భారం నుంచి తేలిక కావాలనుకునీ ఆ ద్రవం ఉపద్రవం చేసేంతవరకూ 

రోజుల తరబడి క్షార గరళం మింగుతూ నిక్షేపం లాంటి నట జీవితాన్ని 

వృధా చేసుకున్నారు,కుంటారు. మామూలు మనుషుల్ని ఎవ్వరూ పట్టించుకోరు.

ఇదిగో ఇలా కాస్తో కూస్తో నటనలోనూ, ఇతర ప్రజా ర్రంగాల్లోనూ పేరు సంపాయించుకునేవారు అలా బలి కావడం న్యాయమా?

Thursday, November 24, 2016

తెలుగు నాటకాలలో హాస్యం !

తెలుగు నాటకాలలో హాస్యం !

.

1880కు పూర్వం మన ఆంధ్రదేశంలో రంగస్థల ప్రదర్శనలు లేవు. అప్పట్లో ధార్వాడ్ వారు వచ్చి, తాత్కాలిక నాటక శాలలు కట్టి, అందులో హిందీ, మరాఠీ నాటకాలు ఆడేవారు.

ఒకసారి రాజమహేంద్రవరలో వాళ్ళు నాటక ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోయాక వాళ్ళు వదిలిన పాకలలో "కందుకూరి వీరేశలింగంపంతులు" గారు వారు రచించిన" చమత్కార రత్నావళి "అనే నాటికను ప్రదర్శించారు. ఇదే తెలుగు నాట ఆడబడిన తొలి నాటిక. ఇది హాస్య నాటిక కావడం గమనార్హం. ఇది షేక్స్పియరు "కామెడీ ఆఫ్ ఎర్రర్స"కు అనుసరణ.

ఈ ప్రదర్శనకు చాలామంది ప్రేక్షక్కులు వచ్చి, చూచి ఆనందించారు.

బ్రహ్మవివాహ విషయంలో కామయ్య తన రెండేళ్ళ వయస్సు కుమార్తెను ముసలి వాడికి పన్నెండువందల రూపాయల కన్యాశుల్కం పుచ్చుకొని పెళ్ళి చేస్తాడు. అయితే పెళ్ళికి ముందుగా వూరి పెద్దలను తను ఇలా కన్యాశుల్కం పుచ్చుకోవడం తప్పా అని అడిగితే ఒక శాస్త్రులు గారు ఏవేవో శ్లొకాలు కల్పించి, ఉదాహరణగా చెప్పి కన్యా కన్నా రెండింతలెత్తు ధనం పుచ్చుకొని పెళ్ళి చేస్తే కోటి యోగాల ఫలితం దక్కుతుందని సమర్ధిస్తారు.

కోర్టులో జరిగే అన్యాయాలను బహిర్గతం చెయ్యడమే వ్యవహార బోధిని నాటకం లక్ష్యం ఒక దళారి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వ్యాజ్యం నడిపించడానికి తలో వకీలు దగ్గరకు తీసుక్కు వెళ్ళి కమీషను పుచ్చుకుంటాడు. ప్లీడర్లు కూడా తమకు వీలయినంత సొమ్ము రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా ప్రజలలో కక్షలు కావేషాలు రెచ్చగొట్టి వాళ్ళని వ్యాజ్యాలకి పురిగొలిపి మధ్య దళారులు ప్లీడర్లు ఎలా బాగుపడతారో, ఈ అసాంఘిక కార్యక్రమాలను పంతులుగారు తాము వ్రాసిన ఇరవై హాస్య నాటకాలలో చూపించారు.

వీరి సమకాలీనులైన"వేదం వెంకట్రాయ శాస్త్రి" గారు "ప్రతాపరుద్రీయం" అనే హాస్య మిళితమైన నాటకం వ్రాసి ప్రదర్శించారు. ఇందులో పదగత, వాక్యగత, సన్నివేశగత హాస్యం చిందులేస్తూవుంటుంది. పేరిగాడి పాత్ర సహజసిద్ధమైన రూపం, అతని కట్టుబొట్టులో ఆటలో, పాటలో, మాటలో అన్నిటిలోను సిసలైన జాతీయత వుట్టిపడుతుంది.

"చిలకమర్తి లక్ష్మీనరసింహం' గారు కూడా "వీరేశలింగం 'గారి ఫక్కీనే ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ ఇరవైహాస్య నాటికలు రచించారు. వీరు వ్రాసిన బలవంతపు భ్రాహ్మణార్ధం నాటికలో ఒక కరణంకు తన తల్లి తద్దినం ఎప్పుడో తెలియదు. పురోహితుడు వచ్చి ఆరోజే అని చెప్పగానే అయ్యో ఉదయాన్నే మొహమైనా కడుక్కోకుండా చద్దివన్నం వుల్లి ఆవకాయ వేసుకొని తిన్నానే ఎలా? అంటే తమరు మొహం కడుక్కోకుండా తిన్నారు కనుక అది నిన్నటి లెఖ్ఖలోకి వస్తుంది అని సర్ది చెప్పి వెట్టి వాణ్ణి పంపించి వూరి చివర కాపుకాసి దారిని పోతున్న బ్రాహ్మణున్ని రెండవ భోక్తగా బలవంతాన రప్పిస్తారు. పురోహితుడు అంతకు క్రితం రాత్రి భార్యతో జగడమాడితే ఆమె అతని జందెం కాస్తా పుటుక్కున తెంపేస్తుంది. మళ్ళీ జందెం వేసుకోవడం మర్చిపోయి వచ్చేసాడు. అతని మెళ్ళో జందెం లేకపోవడం చూసి రెండో బ్రాహ్మణుడు ప్రశ్నించగా ఈ తద్దినం కరణం గారి తల్లి గారిది, ఆడవారికి జందెం వుండదు కనుక నువ్వు కూడా జందెం తీసెయ్యమంటాడు.

వీరు వ్రాసిన గణపతి నవల ఆధారంగా విజయవాడ ఆకాశవాణి వారు రూపకంగా మలిచి ఎన్నో సార్లు ప్రసారం చేసారు. ఇది ఆద్యంతం అద్భుతమైన హాస్య రచన. లక్ష్మీనరసింహం గారి ప్రహసనాలలో ఒక విశిష్టత వుంది. నేరస్థులను మృదువుగా మందలించి, క్షమించి, సంస్కరిస్తారు.


శివ ధ్యాన శ్లోకాలు !....(11) .

శివ ధ్యాన శ్లోకాలు !....(11)

.

.:రూపయౌవనసంపన్నా మూర్తేవ వనదేవతా

పుష్పితాశోకపున్నాగ సహకారశిశూపమః ||

పంచవింశతి నక్షత్రో మయూరకృతశేఖరః

అకలజ్ఞ్కశరచ్చంద్రపూర్ణబింబసమాననః ||

ప్రాన్తే బద్ధకపర్దాన్తో వసానశ్చర్మ కోమలమ్

సవ్యాపసవ్య విధృతకృతమాల విభూషితః ||

ధారాకదంబపుంజేన నాభిదేశప్రలంబినా

అజజ్ఞ్ఘప్రేక్షణీయేన ప్రేక్షణీయో2పి శత్రుభిః ||

భార్యాస్య చారుసర్వాంగీ వన్యాలంకారభూషితా

ఆదర్శ మూర్తిశ్శోభానాం వన్యానామివ నిర్మలా ||

.

తస్యా హస్తే ధనుర్దత్వా శరమేకం చ నిర్మలమ్

ద్వితీయమంసమాలామ్బ్యశిష్టం వామేన బాహునా ||

.

సుగన్ధి పుష్పస్తబకమాఘ్రాయాఘ్రాయ పాణినా

వీజ్యమానో మన్దమన్దం నవపల్లవశాఖయా ||

.

సమావృతో బాలకైశ్చ శ్వభిశ్చాపి మనోహరైః

గచ్చద్బిరగ్రతో దృప్తైర్ధ్యాతవ్యో జగతాం గురుః ||

.

.

ఏవంభూతో మహాతేజాః కిరాతవపురీశ్వరః

.

ఆకారము వహించిన రూపయౌవన సంపన్నమగు వనదేవతయో అనదగినవాడును, పుష్పితములగు అశోకపున్నాగసహకారముల గున్నలవలే నున్నవాడును, ఇరువదిఏండ్లవయస్సుకలవాడును, నెమలిపింఛం శిరము నందు దాల్చినవాడును, కలంకములేని శరత్కాలచంద్రుని నిండుబింబము పోలు బింబము గలవాడు, ఒకపక్కకు ముడవబడిన జటాజూటము కలవాడును, కోమలమగు వ్యాఘ్రచర్మము ధరించినవాడును, సవ్యముగా అపసవ్యముగా ఱేలపూదండలు దాల్చినవాడును, నాభిప్రదేశము మొదలు పిక్కలవరకు వేలాడునట్టి కడిమిపూలదండలచే శత్రువులకు ఆనందకరము అగు సౌందర్యము కలవాడును, తనవలే వన్యాలంకారములచే అలంకృతమయి నిర్మలయయి అడవియందలిశోభకు దర్పణమో అనదగి ఒప్పుచున్న సర్వాంగసుందరియగు దేవిహస్తమున ధనస్సును నిర్మలమగు ఒక బాణము ఒసగి ఆమె రెండవ మూపును తన వామబాహువుచే అవలంబించి రెండవచేత సుగంధియగు పూగుత్తిని పలుమాఱు మూఱ్కొనుచు క్రొంజిగురు రెమ్మచే వీవబడుచున్నవాడును, తనముందు గర్వించి నడుచుచున్న పిల్లవాండ్రచేత మనోహరమగు కుక్కలచేతను పరివేష్టితుడును, ఇట్టి ఆకారము దాల్చిన కిరాతవేషుడగు లోకగురువు ఈశ్వరుని ధ్యానించుచున్నాను.

.

దేవత: మహాదేవుడు

.

ఋషి: మహాదేవుడుx

శివ ధ్యాన శ్లోకాలు !....(12)

శివ ధ్యాన శ్లోకాలు !....(12)

భస్మోద్భాసితసర్వాంగం జటామండలమండితమ్

ధ్యాయేత్త్ర్యక్షం వృషారూఢం గణేశ్వరయుతం హరమ్"

విభూతిచే ప్రకాశించునట్టి యెల్లావయవములు గలవాడును, 

జటాసమూహముచే అలంకరింపబడినవాడును, మూడుకన్నులు కలవాడును, గణనాథునితో కూడిన వాడును, వృషభమును ఆరోహించినవాడు అగు హరుని ధ్యానించుచున్నాను.

Tuesday, November 22, 2016

సీత గడియ! (:ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు.)

సీత గడియ!

(:ఆచార్య వెల్చేరు నారాయణరావుగారు.)

.

"శ్రీరామ. భూసతికి చేడెయై పుట్టీ

కూర్మితో జనకునీ కూతురై పెరిగీ"

.

ఈ పాట పేరు సీత గడియ అని ఉండడం ఒక విశేషం. నిజానికిది రాముడు పెట్టిన గడియ. అంచేత రాము(డి) గడియ అవాలి. కాని సీత గడియ అని ఈ పాటకి పేరు పెట్టడంలో ఒక చమత్కారం ఉంది. గడియ పెట్టినవాడు రాముడైతే కావచ్చు గానీ అది తీయించింది సీత. ఆ గడియ తీయించడంలో సీత చూపించిన నేర్పు ఈ పాటలో ప్రధాన విషయం. అందుకని ఇది సీత తీయించిన గడియ. ఆ ప్రకారంగా ఇది సీత గడియ.

తేలిగ్గా కనిపించే ఈ పాటలో బలమైన నిర్మాణదక్షత ఉంది; ప్రతిభావంతమైన భావనాశక్తి ఉంది. మాటని జాగ్రత్తగా, పొదుపుగా వాడే ప్రత్యేకత ఉంది. అంతకు మించి తన నైపుణ్యంతో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, సమిష్టి కుటుంబంలో నిబ్బరంగా మెలగగల స్త్రీ ప్రత్యేకతని సున్నితంగా చిత్రించిన నేర్పు ఉంది.

జాజులు తలదాల్చి జవ్వాది యలది

వేచియు తానుండి వేడుకను విభుడు

అప్పుడు మొగవాళ్లు తలలో పువ్వులు పెట్టుకునే వాళ్ళు. అయినా ఇక్కడ ఆ సంగతి ప్రత్యేకించి చెప్పినప్పుడు రాముణ్ణి ప్రబంధనాయిక అయిన వాసకసజ్జికకి మొగ రూపంగా కవయిత్రి ఊహించిందని ఒక్క క్షణం ఆలోచిస్తే తడుతుంది.

ఎదురెదురు చూచెను వెలది రాదనుచు

తడవయ్యె రాదని తొందర పడుచు

సూర్యవంశజు డపుడు సొరిది కోపించి

ఘడియ గ్రక్కున బెట్టె కాకుత్సుడపుడు

సీతరో నీ పనులు చేయుట కాద

అవనిజ మైమరిచి నీవు వున్నావ

అని తలపంకించి కడు భ్రమ జెంది

శయ్యపై పవళించె రామచంద్రూలు.

ఎప్పటికీ సీత రాకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి పడకగది తలుపు గడియ పెట్టేస్తాడు. నీ పనులిలా ఉన్నాయా, నీకు వొళ్ళూ పై తెలియడం లేదు అని తల పంకించి ‘కడు భ్రమ చెంది’ పక్కమీద పడుకుంటాడు. ఇక్కడ ‘భ్రమ చెందడం’ చాలా అర్థవంతమైన మాట. లేనిది ఉన్నదని ఊహించుకోవడం భ్రమ. రాముడు తనకి సీత మీద లేని అధికారం ఉన్నదని ఊహించుకుంటున్నాడు. అది అతని భ్రమ. ఇది వొళ్లూ పై తెలియని కోపంలొ కలిగే స్థితి. లేదా ఇది శృంగార చేష్టల్లో ఒకటి. ఏ సంగతీ మనకి తరవాత తెలుస్తుంది.

రామయ్య తనకోసం ఎదురుచూస్తున్నాడు కాని సీతకింకా చాలా పనులున్నాయి. అత్తగారు కౌసల్యకి అడుగులొత్తి, మామగారు దశరథుడికి తమలపాకుల మడతలు అందించి, సుమిత్రకి వింజామరలు వీచి, కౌసల్యకి పక్క వేసి – ఈ పనులన్నీ చేసేసరికి చాలా సేపు అయిందని మనకు బోధపడుతుంది. ఇంత వరకు ఇంటికి మంచి కోడలుగా, తన సుఖాలకన్నా అత్తమామల పరిచర్యలే ఎక్కువని భావించే ‘ఉత్తమ స్త్రీ’గా సీత మనకి కనిపిస్తుంది.

ఇక తరవాత దొంతర, సీత సావకాశంగా తనను తాను ముస్తాబు చేసుకోవడం గురించి చెప్పేది. దాదాపు నూటరెండు పంక్తులున్న ఈ పాటలో 24 పంక్తులు ఇందుకోసమే వినియోగిస్తుంది కవయిత్రి. సీత స్నానం చేసింది. పసుపు పూసుకుంటుంది. బంగారు పూల చీర కట్టుకుంటుంది. తల దువ్వుకుని పాపిట తీసి వరసగా రకరకాల నగలు పెట్టుకుంటుంది. ఆ నగలు వర్ణించిన తీరు చూడండి.

దువ్వి పాపిట తీసి తింత్రిణీ పెట్టి,

తింత్రిణిలొ ముత్యాల పతకంబు బెట్టి

రవ్వల ముత్యాల జల్లి దిగవేసి [4]

ఇక అక్కడితో ఆగకుండా కవయిత్రి ఆ పెట్టుకున్న నగలని గురించి వాటి విలువతో సహా వేరువేరుగా చెప్పడం మొదలు పెడుతుంది.

వేయి జేయు కమ్మలు వెలయంగ బెట్టి

రెండువేలు జేయు హారములు వేసి

మూడువేలు జేయు ముక్కెర బెట్టి

నాలుగువేలు జేయు నాను మెడవేసి

పదివేలు జేయు పతకంబు బెట్టి

ఈ నగల విలువ పనిగట్టుకుని అంత గొప్పగా చెప్పాల్సిన అవసరమేమిటి? ఆడవాళ్లకి ఆస్తిహక్కులు వేరే లేని సమాజంలో వాళ్ల నగలే వాళ్ల ఆస్తి. అది స్త్రీ ధనం కాబట్టి కుటుంబంలో మగవాళ్ళెవరూ వాటిని ముట్టుకోరు. వాటి విలువ వల్లే ఆడవాళ్లకి నిబ్బరం, ధైర్యం, ఒకపాటి గర్వం కూడా. అందుకని ఆ నగల చక్కదనంతో పాటు వాటి విలువ, ఒకదానికన్నా ఒకటి ఎక్కువగా, విశృంఖలంగా వర్ణిస్తుంది కవయిత్రి.

ఆ తరవాత గంటల వడ్డాణం, నీలాలు తాపిన కీలుకడియాలు[5] పెట్టుకుంటుంది. వీటితో అలంకరించుకున్న తరవాత కన్నులకు కాటుక పెట్టుకుని అప్పుడు స్తిమితంగా నిలువుటద్దంలో తన రూపం చూసుకుని, తన అందానికి తానే ముచ్చటపడి చిరునవ్వు నవ్వుకుంటుంది సీత. ఈ అలంకరణ అంతా తన కోసం, తన ముచ్చట కోసం అనే సూచన వుంది ఈ వర్ణనలో.

ఇంక ఇప్పుడు సీత సావకాశంగా భోజనానికి కూచుంటుంది. ‘పంచభక్ష్యాన్నములు భుజించి’ లేచి చేతులు కడుక్కుని బంగారపు జరీతో చేసిన బుటేదారు శాలువ కప్పుకుని, బంగారు చెంబుతో మంచినీళ్ళు, ఒక పళ్ళెంలో ఆకులూ, వక్కలూ, అత్తరూ, పునుగూ, జవ్వాదీ, పన్నీరూ, గంధమూ, పళ్ళూ ఫలహారాలూ పెట్టుకుని, మల్లెలూ మొల్లలూ విరజాజులూ కొప్పులో ముడుచుకుని భర్త దగ్గరికి వెళుతుంది.

ఈ పాటికి రాముడు పడకగది తలుపు గడియపెట్టేశాడని సీత చూస్తుంది. ఇక్కడితో పాటలో మరో దొంతర మొదలౌతుంది. ఇందులో ఉన్న ఆలోచనల వరస చూడంది.

విరులను దెస్తినో వీరావతార

పుడమిలో వీరులకు తలనొగ్గకుండా

పరశురాముని భంగపరచితిరి మీరు.

‘మీకు పువ్వులు తెచ్చాను,’ అని భార్య అనడం ఏమిటి? మామూలుగా ఆడవాళ్ల కోసం మొగవాళ్ళు పువ్వులు తెస్తారు. వాళ్లని సంతోషపెట్టడం కోసం, వాళ్లమీద తమకి ప్రేమవుందని తెలియపరచడం కోసం. ఆ పువ్వులు అలంకరించుకుంటే ఆ అందాన్ని చూసి ఆనందించడం కోసం. ఇక్కడ పరిస్థితి అందుకు వ్యతిరేకం.

ఇక తర్వాత రెండు చరణాలూ రాముణ్ణి పొగడడం. ఇక్కడ శ్రీరాముని వీరాన్ని పొగడడంలొ ఒక సుకుమారమైన సూక్ష్మం వుంది. శృంగారానికి పూర్వరంగం ఇది. శృంగార వీరాలని సమయోచితంగా కలపడం మంచికవులకి మాత్రమే తెలిసే ఒడుపు[6].

సరే ఈ పాచిక పారలేదు. శ్రీరాముడు తలుపు తియ్యలేదు. ఇక తనచేతిలో రెండవ ఆయుధం;

శ్రీరాముడికి జాలి కలిగేలా తన అసహాయతని చెప్పడం;

నన్ను యేలే స్వామి కాకుత్సతనయ

తలుపేయ కోపంబు తాళంగ గలనా

నిలుచున్న పాదాలు చేతులును నొచ్చె

గడియ ఆలిసమైన గడియ బెట్టితిరా

తప్పులు పట్టక తలుపు తీయండీ[7]

ఇక ఇది పని చెయ్యకపోతే, వాన వొస్తోందని, తను తడిసిపోతున్నాననీ (అబద్ధం) చెపుతుంది.

దంతంపు తలుపులూ తియవోయి నాథా

వొంటొంటి చినుకుకె ఒక చెంగు తడిసె

కాముడ తియవోయి కనకంపు గడియ,

పట పట చినుకులకు పై కొంగు తడిసె

పచ్చలబాలుడా[8] తియవోయి గడియ

ఇక్కడ అకస్మాత్తుగా ఒక విశేషమైన చరణం ఒకటి కనిపిస్తుంది.

రత్నహారంబిస్తు తియవోయి గడియ.

ఈ చరణం బహుశా ఇంకా ముందు ఉండి ఉండొచ్చు, లేదా దీని తరవాత ఇలాంటివే మరి కొన్ని చరణాలు ఉండి ఉండవచ్చు. కాని ఇది వొదిలెయ్యడానికి వీలులేని చరణం. భార్యలకి భర్తలు నగలు ఆభరణాలూ (లంచంగా) ఇవ్వడం అందుమూలంగా వాళ్ళ అభిమానం సంపాదించుకోవడం అప్పటి కుటుంబాలలో (కొన్ని ఇప్పటి కుటుంబాలలో కూడా) పాదుకున్న వ్యవస్థ. కాని ఇక్కడ భార్య భర్తకి లంచం ఇవ్వజూపుతుంది.

కాని, ఇవేవీ పనిచెయ్యవు. శృంగార విశేషంగా సున్నితంగా వుండవలసిన కోపం శ్రుతి తప్పుతోందా? పైగా,

[నీవు లేకుంటేను] నాకేమి సీత

గంటవలే దీపమ్ము అదినాకు తోడు

[నీవు లేకుంటేను] నాకేమి సీత

పువ్వులూ బుక్కాయి అది నాకు తోడు

[నీవు లేకుంటేను] నాకేమి సీత

గంధమూ కస్తూరి అదినాకు తోడు

[నీవు లేకుంటేను] నాకేమి సీత

పట్టెమంచము పరుపు అది నాకు తోడు[9]

అని ఎదురు బుకాయిస్తాడు రాముడు. సీతని అవతలపెట్టి గడియవేశాడు సరే, కాని ఇంకోరకంగా తనని తాను గదిలో బంధించుకుని ఒంటరివాణ్ణి చేసుకున్నాడు. ఈ ఒంటరితనం పైమాటల్లో వినిపిస్తుంది. తిరస్కారపూర్వకంగా వినిపించే ఈ మాటల వెనకాతల ఒక దైన్యం వుంది, నిశ్శబ్దంగా. దీపమూ, పువ్వులూ, బుక్కాయీ, కస్తూరీ, పరుపూ, మంచమూ – ఇవా తనకి తోడుండేవి! కాని రాముడు పంతానికి పోతే పట్టు వదలడు అనే సూచన కూడా వుంది ఈ గొంతుకలో.

ఇక సీతకి మిగిలిన ఆఖరి ఆయుధం – తన అత్తగారు. అత్తగారు తన పక్షాన వుంటే రాముడి ఆట కట్టినట్లే. కోపంతో వెళ్ళి, సీత తన అత్తగార్ని పిలుచుకొస్తుంది.

అత్త కౌసల్యకు అన్ని దెల్పగను

తల్లి కౌసల్యొచ్చె రాము దగ్గరకు

సీత కౌసల్యకి ఏం చెప్పిందో ఊహించుకోవొచ్చు. అన్నీ చెప్పలేదనీ కూడ మనం ఊహించగలం. ఉదాహరణకి తాను అలంకరించుకోడానికి సావకాశంగా అంతసేపు తీసుకుందని చెప్పివుండదు. కౌసల్యకి తను శ్రద్ధగా సేవ చేసింది కాబట్టి, తన మాట ఆవిడ విని తన పక్షాన వుంటుందని సీత నమ్మకం.

దశరథుని పుత్రుడవు జనకులల్లుడవు

భూదేవి అల్లుడవు బుద్ధటర నీకు

సీత చేసిన తప్పు శీఘ్రాన చెప్పు

నాకు ఎరిగించరా నను గన్న తండ్రి

రాముణ్ణి నీకు బుద్ధిలేదా, అని రాముణ్ణి అనగలిగింది కౌసల్య ఒక్కర్తే. మళ్లా ప్రేమగా నను గన్న తండ్రీ అనగలిగిందీ ఆవిడే.

ఇంక రాముడికి తలుపు తియ్యక తప్పలేదు. అమ్మా నీ కోడలిని ఇలా ముద్దు చేస్తే నా మాట ఇంక వింటుందా, అని ఫిర్యాదు చేస్తూ, తప్పనిసరి చిరునవ్వు తెచ్చుకుని తలుపు తీస్తాడు రాముడు. అత్త కోడలిని వెనకేసుకుని వొచ్చి, కొడుకుని తప్పు పట్టడం నిజంగా విడ్డూరం. తెలుగు కుటుంబాల్లో పెళ్ళాం చెప్పిన మాటల్లా వింటున్నాడని తల్లి కొడుకుని సాధించడం మనకి పరిచితమైన విషయం. ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా, కోడల్ని వెనకేసుకుని వొచ్చి తల్లి కొడుకుని తిడుతుంది. రాముడు తలుపు తియ్యగానే అత్తగారితో పని అయిపోయింది సీతకి. ఆవిణ్ణి మరియాదగా సాగనంపాలి.

మా మామ దశరథులు ఒక్కరున్నారు

అత్త మీరు పొండి మా మామ కడకు

అని సీత చక్కగా సాగనంపుతుంది కౌసల్యని. ఇంక మేం ఏకాంతంగా వుండవలసిన సమయం ఇది అని అత్తకి సుకుమారంగా చెప్పడం ఇది. వాల్మీకి రామాయణంలో దశరథుడు ఎక్కువ కైక దగ్గిరే గడుపుతున్నట్టు కనిపిస్తుంది. కాని ఈ రామాయణంలో దశరథుడు పెద్ద భార్య దగ్గిరే వుంటాడు. అంటే కౌసల్యకి తన జీవితంలో అసంతృప్తులు ఏవీ లేవు. తన జీవితంలో సుఖంగా వున్న అత్తగారే కోడల్ని సుఖంగా చూడగలదని ఒక సూచన ఇది.

కథ ఒక్కసారిగా నవ్వుతుంది. కథ చివరికి వొస్తోందని చెప్పే ఆఖరి దొంతర మొదలౌతుంది.

సిగ్గుతో శ్రీ లక్ష్మి విభుని సన్నిధికి

చేరగానే దివ్వె కల కలా నవ్వె

వరసగా ఊపిరి తీసుకోకుండా సువాసనలని వర్ణిస్తుంది కవయిత్రి.

ఆకుల వాసనా పానుపు మీద

పోకల వాసనా పానుపు మీద

పువ్వుల వాసనా పానుపు మీద

బుక్కాల వాసనా పానుపు మీద

అంటే సీత పానుపుమీద పడుకుందని మనం ఊహించుకోవాలి. మంచం పక్కనే తను తెచ్చిన పువ్వులు, ఆకులు వక్కలూ, ఇతర పరిమళద్రవ్యాలూ పెట్టిందని అనుకోవాలి. రాముడికోసం తెచ్చానని చెప్పినవి ఏవీ రాముడికి తన చేత్తో ఇవ్వలేదు. అంటే తన కోపానికి అది సూచన అన్నమాట. ఇంతవరకూ సీతని బయట నించోబెట్టిన రాముడు ఆవిడ అలక తీర్చడానికి తనే ఏదో ఒకటి చెయ్యాలి. కాని అంత మాటకారిలా కనిపించడంలేదు రాముడు.

ఆడవారి కోపము ఎట్టిదో యనుచు

మళ్లి పరుండెను రవివంశజుండు

ఆడవాళ్ల కోపం గ్రహించగలగడం, దాన్ని తీర్చగలగడం చేతనైనవాడు కాడన్న మాట ఈ భర్త గారు. ఇక్కడ ఈ సమస్యని సరిదిద్దగలిగింది మళ్ళ సీతే.

అగ్గి చెంతను వెన్నెంత తడవగు నోడ

ఆడవారి కోపము అట్టిదే యనుచు

శీఘ్రాన కలిసెను శ్రీ లక్ష్మి యంత

ఎవరు నిప్పు, ఎవరు వెన్న? ఇది సంస్కృతంలో తరుచుగా చెప్పే ఉపమానానికి సరిగ్గా తల్లకిందులు. ఉదాహరణకి వరాహపురాణంలో ఈ శ్లోకం చూడండి.

అగ్నికుండ సమా నారీ ఘృతకుండ సమః పుమాన్‌

ఘృతకుంభో గ్నియోగేన ద్రవతే నతు దర్శనాత్‌

పుమాన్‌ స్త్రీ దర్శనాదేవ ద్రవతే యద్ విమోహితః[10]

ఆడది నిప్పుకొలిమి లాంటిది, మొగవాడు వెన్నకుండ లాటివాడు. వెన్న నిప్పు తగలగానే కరిగిపోతుంది, కాని నిప్పును చూసినంత మాత్రాన కరగదు. కాని, మొగవాడు ఆడదాన్ని చూడగానే కరిగిపోతాడు, స్త్రీ అంటే మోహం కొద్దీ.

మగవారికి వర్తించే ఈ ఉపమానాన్ని తిప్పి ఆడవాళ్లకి వర్తింపజెయ్యడంలో వుంది ఇక్కడ విశేషం. సరిగ్గా అలాటిదే ‘శీఘ్రాన కలిసెను శ్రీ లక్ష్మి యంత’ అన్న చరణంలో ‘కలిసెను’ అన్న పదం. ‘కలియు’ అనే మాట స్త్రీ పురుషుల సంయోగానికి మృదువైన పర్యాయ పదంగా బహువచన పదం కర్తగా వున్న వాక్యాలలో వాడుకలో వుంది. పురుషవాచక పదం కర్తగా ఉన్న వాక్యంలొ కలియు అనే మాట వాడడం కూడా వుంది. కాని ఈ క్రియ స్త్రీ కర్తగా ఉన్న వాక్యంలో వాడడం తరుచు కనిపించదు.

ఈ పాటలో కొస మెరుపు: ఫల శ్రుతి.

పుడమిలో ఈ పాట పాడినా విన్నా

ఐశ్వర్యవంతులై అతివలుండెదరు.

మామూలుగా ఫలశ్రుతిలో స్వర్గమో, మోక్షమో ఉంటాయి. అందుకు భిన్నంగా ఇందులో కేవలం ఐశ్వర్యం మాత్రమే ఉంది. ఒక విలక్షణమైన ప్రాపంచిక దృక్పథానికి గుర్తుగా.

ముగింపు

ఈ పాట మొత్తం అంతా చూస్తే దీనిలో రాముడూ, సీతా ఆలంబనాలే అని తెలుస్తుంది. నిజానికి ఇది ఆడవాళ్ల నిత్యజీవితాన్ని గురించిన పాట. ఇది కుటుంబ వాస్తవికతకి ప్రతిరూపం అని అంటే కవిత్వంగా దీని పటిమని తగ్గించినట్టవుతుంది. తన కాలం కన్న ముందుండగల కవులూ కవయిత్రులూ ఊహ ద్వారా జీవితాన్ని రమణీయతరంగా చూపిస్తారు. ఇది యధార్థానికి కల్పనాజనిత ప్రతిరూపం. ఇది నిజం కాదు. నిజం ఇలా వుంటే బాగుంటుందనిపించేది. మంచి కవిత్వం జీవితానికి పరిపూరకం, పరివర్థకం. ఈ ఊహని నిత్య జీవితం కన్న దూరంగా వుంచడం కోసం ఇందులో పాత్రల పౌరాణికత పనిచేస్తుంది. అయినా సంఘటనలు నిత్యజీవితంలో సమిష్టి కుటుంబలో ఎదురయ్యేవి కాబట్టి, ఈ పాత్రలు దగ్గిరగా వొస్తాయి. ఇలాటి కవిత్వం రాయగల స్త్రీలు ఉండడం ఈ సమాజంలో ఎలా జరిగింది? ఈ కుటుంబాలు ఎలాటివి? అందులో స్త్రీల జీవిత పరిస్థితులు ఏమిటి? అనే ప్రశ్నలకి ఈ కవిత్వం సమాధానం చెప్పదు. కాని ఇలాటి కవయిత్రి పుట్టి పెరగడానికీ, ఇలాటి రచన చెయ్యడానికీ, దానికి తోటి ఆడవాళ్ల మెప్పుదలా, ఆదరణా ఉండడానికీ కావలిసిన పరిస్థితులు ఉన్నాయని మాత్రం నిబ్బరంగా చెపుతుంది.

నాకు తెలిసి ఈ పాటలమీద ఆలోచన చేసిన వాళ్లు ముగ్గురు: ఇల్లిందల సరస్వతీదేవి (1951), శ్రీపాద గోపాలకృష్ణమూర్తి (1955), కోలవెన్ను మలయవాసిని (1986). వీరిలో మలయవాసినిగారిని నేను బాగా ఎరుగుదును. ఆవిడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలొ నాకు సీనియరు. ఆవిడ ఈ పాటలు చక్కగా పాడతారు కూడా. ఈ పాటల గురించి ఆవిణ్ణి చాలాసార్లు సంప్రదించాను.

శివ ధ్యాన శ్లోకాలు !....(10)

శివ ధ్యాన శ్లోకాలు !....(10)

"ముక్తాలంకృతసర్వాంగమిన్దుగంగాధరం హరమ్,

ధ్యాయేత్కల్పతరోన్మూలే సమాసీనం సహోమయా".

ముత్యములచే అలంకరింపబడిన సర్వావయములనుకలవాడు, 

చంద్రుని గంగను ధరించినవాడును, ఉమతోకూడ కల్పవృక్షము

క్రింద కూర్చుండినవాడును అగు హరుని ధ్యానించుచున్నాను.

.

దేవత: రుద్రుడు

ఋషి: మండూకుడు

Monday, November 21, 2016

గయోపాఖ్యానం!

గయోపాఖ్యానంలో అర్జుడు పెట్టిన ఒట్టు పద్యం జనాలకి చిర పరిచితమే .. 

నదిలో అర్ఘ్య ప్రదానం చేస్తున్న శ్రీకృష్ణుని చేతిలో గయుని నిష్ఠీవనం 

( ఉమ్మి ) పడింది! కృష్ణుడు ఆగ్రహంతో ఊగి పోయి, గయుని వధిస్తానని శపధం చేసాడు. గయుడు పరువెత్తి పోయ అర్జునుని శరణు వేడాడు. 

అప్పుడు అర్జునుడు ఒట్టు పెట్టి మరీ అతనికి అభయ మిచ్చాడు.

"నిటలాక్షుండిపు డెత్తి వచ్చినను రానీ !యన్నదమ్ముల్నను

న్విటతాటంబున బాసి పోయినను పోనీ ! కృష్ణఁడే వ

చ్చి, ‘వ ద్దిటు పార్ధా ! ’యననీ !మఱేమయిన గానీ, లోకముల్బెగిలం

బటు దర్పంబున నిల్చి యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్ ! ‘

.

అర్ధం..

.

‘ ఆశివుడే నామీద దండెత్తి రానీ ! అన్నదమ్ములు నా మీద కినుకతో నన్ను విడిచి పోతే పోనీ ! సాక్షాత్తు శ్రీకృష్ణడే వచ్చి, ‘‘అర్జునా ! వద్దు గయుని కాపాడ వద్దు ’

’ అననీ !ఇంకేమయినా కానీ, లోకాలు అదిరిపోయేలాగున నిలబడతాను. ఈ గయుని కాపాడుతాను ! ’’

Sunday, November 20, 2016

పోతన - శ్రీమద్భాగవతం !

పోతన - శ్రీమద్భాగవతం !

.

భూషణములు వాణికి నఘ

పేషణములు మృత్యుచిత్త భీషణములు హృ

త్తోషణములు గల్యాణవి

శేషణములు హరిగుణోపచితభాషణముల్!

.

పదవిభాగం: 

భూషణములు, వాణికిని, అఘ, పేషణములు, మృత్యు, చిత్త, భీషణములు,

హృత్తోషణములు, కల్యాణ, విశేషణములు, హరిగుణోపచిత, భాషణముల్.

.

భావం:

విష్ణుమూర్తిని వర్ణిస్తూ, ఆయనలో ఉన్న సుగుణాలను కీర్తిస్తూ పలికే పలుకులు 

సరస్వతీదేవికి అలంకారం అవుతాయి. అంతేకాదు సకల పాపాలను పోగొడతాయి.

మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మృత్యువును నివారిస్తాయి.

శుభాలు కలుగచేస్తాయి.

"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ !

"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ !

"కార్యేషు దాసీ కరణేషు మంత్రీ...భోజ్యేషు మాతా శయనేషు రంభా.

.అపురూపమైనదమ్మ ఆడజన్మ.... ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా..."

అని ఓ పక్కన రాస్తూనే ఉంటారు...ఇంకో పక్కన ఇల్లాళ్ళు అగచాట్లు పడుతూనే ఉంటారు.

.

ఏమైనా ఎదురు ప్రశ్నిస్తే.... "నీ సాధింపు తట్టుకోలేకపోతున్నా" అంటూ తాగి వస్తారు. "తాగేప్పుడు మీకు ఇల్లాలు జ్ఞాపకం ఉండదా" ??? అంటూ ప్రశ్నిస్తుందా అమాయక ఇల్లాలు.. "నిజం చెప్పమంటావా ? తాగినప్పుడు నేను ప్రతి బాధనూ మరిచిపోతాను" అంటాడు భర్త. పెళ్ళికి ముందు "నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం" అన్న వ్యక్తి పెళ్ళైన తరువాత ఇలా ఎలా మాట్లాడేస్తాడు ? అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. 

ఇదేదో బలవంతపు పెళ్ళో లేక పెద్దలు కుదిర్చి చేసిన సాంప్రదాయాల పెళ్ళిళ్ళ విషయంలోనోనే కాదు జరుగుతున్నది... "నీకు నేనూ, నాకు నువ్వూ...ఒకరికొకరం నువ్వూ నేనూ..." అనుకొంటూ పెద్దలను, సమాజాన్ని సైతం ఎదిరించి పెళ్ళి చేసుకొన్న ప్రేమైక జీవుల వ్యధ కూడా....

"ఎందుకిలా ?" అని అడగడం కూడా అనవసరమే... దానికి సమాధానం ప్రతి ఒక్కరికీ తెలుసు... కాకపోతే ఎవరి చేదు వారిది..... ఎవరి అనుభవాలు వారివి.... అందుకే కామోసు ఎవరో కవి అన్నాడు... "అందబోయి చేజారిపోయిన అందాలెన్నో ఈ లోకాన చేతికందీ చేదైపోయిన బంధాలెన్నీ జీవితాన" అంటూ... తన అనుభవాల సారాన్ని , ప్రతి వ్యక్తి జీవితాన్ని రెండు వాక్యాల్లో విదిలించి పారేసాడు.

అందనంత కాలం మధురంగా ఉండి... అందిన తరవాత చేదైపోవడమేంటో....

దంపతులు..:-

దంపతులు..:-

నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. 

.

నేనేం మాట్లాడుతున్నానో నీకు బోధపడడం లేదు.

.

అయినా కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుకొంటూనే ఉన్నాం " 

ఎదుటివారి గురించి పట్టించుకోవాలంటే ముందు మనమేమిటో మనకి తెలియాలిగా? 

.

"ఏ వ్యక్తీ జీవిత భాగస్వామిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అందుకే అర్థం చేసుకొనే విషయం లో ఆరాటాలొద్దు. మనం చేయవలసిందల్లా ఒక్కటే... తక్కువగా అర్థం చేసుకోవడం. ఎక్కువగా ప్రేమించడం" మనకన్నీ పున్నములే.... వెన్నెల పూల పున్నాగలే... అందుకే ప్రేమిద్దాం... 

.

ప్రేమ కోసం జీవిద్దాం... జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిద్దాం....

‘నా పాట నీ నోట పలకాల సిలకా’

‘నా పాట నీ నోట పలకాల సిలకా’ పాటలో 

‘నా నీడ సూసి నువు కిలకిలా నవ్వాల’ అంటూ నవ్వు గురించి రాసి; 

.

ఆచార్య ఆత్రేయ మరో మూడు పాటలను మాత్రం కన్నీటితో తడిపారు.

ఈ మూడు పాటల్లోని భావాలూ, వ్యాఖ్యానాలూ సినిమా పాత్రల పరిమిత

పరిధిని దాటిపోయాయి. అందరికీ అన్వయించే స్థాయిలో తెలుగులో స్థిరపడిపోయాయి. సందర్భానుసారం కోట్ చేసే పంక్తులుగా మారాయి.

‘ముద్దబంతి పూవులో మూగకళ్ళ వూసులో ’ పాటలో -

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి

ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా

మనసును పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకోవాలనే సూచన..

‘మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను’ పాటలో-

కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతపడితె నీళ్ళున్నాయి

కలల కనటం , అనుకున్నది జరగకపోతే కన్నీళ్ళు రావటం ఎవరికైనా సామాన్యమే అనే వాస్తవానికి అద్దం పట్టటం.

ఇక ‘పాడుతా తీయగా సల్లగా...’ పాటలో -

గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు

ఉండమన్న వుండవమ్మ శాన్నాళ్ళు

ఏడిస్తే బాధ తగ్గిపోయి ఊరట కలుగుతుందనేది కవితాత్మకంగా చెప్పటం. ఆ బాధ ఎంతటిదయినా కాలం గడిస్తే దాని తీవ్రత తగ్గిపోతుందని కూడా చెప్పటం .

‘పళ్ళు - పదారు’ ‘మూగమనసులు !

‘పళ్ళు - పదారు’ ‘మూగమనసులు !

.

మూగమనసులు సినిమాలో కొసరాజు -

‘ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ’ పాట రాశారు. 

.

‘సగం దేహమై నేనుంటే , అది పెళ్ళామంటే సెల్లదులే

పళ్ళు పదారు రాలునులే

పళ్ళు పదారు రాలునులే’

పళ్ళు ఎవరికైనా ముప్పై రెండు కదా? 

పదారు (పదహారు) అని ఎందుకు రాశారు? 

‘పళ్ళు - పదారు’ అనే ప్రాస కోసమేనా?

కొసరాజు అలా అర్థమేమీ లేకుండా రాస్తారా?!

మరి దీనిలో అంతరార్థమేంటి?

పురాణాల్లో శివుడు అర్ధ నారీశ్వరుడు కదా?

నోట్లో సగం పళ్ళు గౌరి (పార్వతి) వే. కాబట్టి

మిగిలిన పదహారు పళ్ళ సంగతే ప్రస్తావించి, 

అవి రాల్తాయని చమత్కారంగా చెప్పటమన్నమాట!

Saturday, November 19, 2016

సీత అగ్నిప్రవేశం..

సీత అగ్నిప్రవేశం.. సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. .....

(రామాయణ కల్పవృక్షం.! శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు.)

హనుమంతుని తోకకి నిప్పంటించినప్పుడు, అది కాలకుండా, అగ్నికున్న ఉష్ణాన్ని

సీత తనలో దాచుకుంటుందిట! 

ఇంద్రజిత్తు వేసిన ఒక అస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు. 

అప్పుడు రావణుడు వాళ్ళు చనిపోయారనే భావించి సీతదగ్గరకి వచ్చి, వాళ్ళు చనిపోయారన్న వార్త చెప్తాడు. 

సీత నమ్మదు. త్రిజట స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి చూసివచ్చి చెప్తుంది, వాళ్ళు పడిపోయే ఉన్నారు కాని వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉన్నాయని. 

అప్పుడు సీత ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకుంటుంది.

ఈ ఆపదనుంచి రామలక్ష్మణులు బయట పడిన తర్వాత, ఏ అగ్నిసాక్షిగా అయితే తను రాముని పెళ్ళాడిందో, ఆ అగ్నిలో తాను దూకుతానని ఆ మొక్కు. 

రావణుడాంటాడు, రామునిలాంటి భర్తని నమ్ముకుంటే నీకు అగ్నిప్రవేశమే గతి అని! రాముడెలాగూ యుధ్ధంలో చనిపోతాడు, అతనితో సీత సహగమనం చెయ్యడానికి నిప్పులో దూకాల్సి వస్తుంది అని అక్కడ రావణుని ఉద్దేశం. 

మరి తర్వాత సీత చేసిన అగ్నిప్రవేశం తన మొక్కు తీర్చుకోడానికా? తన భర్త ఉన్నా తనకి లేనట్టే అన్న పరిస్థిని సూచించడానికా? ఇన్ని ఆలోచనలని రేపే కల్పన ఇది!

ఇక అసలు ఘట్టానికి వద్దాం. సీత రాముడున్న ప్రదేశానికి ఇలా వచ్చింది:

"మత్త గజ మంథరగమనంబున భీతవోలె, విరాగిణివలె, దిరస్కారభావయుతవలె, భర్త్రనురక్తవలె నడచుచు బ్రవేశించి శ్రీరామచంద్రుని కెదురుగా నిలుచుండిన.

" అలా నిలుచున్న సీతని చూస్తే రామునికెలా అనిపించింది? 

ఏడాది యన్నమ్ము నెఱుగదు లలితాంగి నిద్దుర యెఱుగదు నీరజాక్షి ముడుచుకు కూర్చున్న యొడలుగా నంసభా గమున వంగినయట్లు కానిపించు మొగి నిరంతం బెడతెగని యేదో భయం బక్షుల వెనుభాగ మానరింప నఖిలలోకాతీత మైన సర్వాంగ వి న్యాస సౌభాగ్య సౌందర్య మొప్ప తన్ను హరిణంబు గొని తెమ్మటన్న కాంత సగము సగమైన మై రామచంద్రునకును తన సమస్త కామమున కాస్థాన భూమి కనుల యెదుటను వచ్చి సాక్షాత్కరించె.

అప్పుడు రాముని మనసులో ఏమనుకుంటున్నాడు? ఈ యమ హేతువై వనుల నెల్ల జరించెను దా బికారిగా నీ యమ హేతువై జలధి కెంతొ శ్రమంపడి కట్టగట్టె దా నీ యమ హేతువై గెలుచు టెంత శ్రమంబయిపోయె లంకలో నా యమ జూచినంత హృదయంబున బట్టగరాని కోపమై అతడు రాక్షసుం డటంచు సౌమిత్రి వ చించె సుంత వినదు చెలువ తాను ననుభవించె దాను ననుభవించితి మేము నాడదింత సేయుననుచు గలదె? 

ఇదంతా వాల్మీకంలోని "హృదయాంతర్గత క్రోధమే". ఆ తర్వాత విశ్వనాథలోని కవి ప్రవేశిస్తాడు. 

అక్కడున్న వచనం ఇది: "ఇట్లూహించుచు" రాముండు మనసులో "నూరక" కోపంబు పెంచుకొంచుండగా" కవి భాషాశక్తిని ఎలా ఉపయోగించుకున్నాడో చూసారా! ఊహించుకోవడం రెండర్థాలనిస్తుంది, అలానే "ఊరక" అన్న పదం కూడా. ఆ సీత చూసేవాళ్ళకి ఎలా ఉందిట? "తెలియన్ రాకయ చూచు నేత్రములకున్ స్త్రీమూర్తి తానింతలో పల నాగ్నేయ శిఖాకృతిం బొలుచు" అగ్నిశిఖలా ఉందిట ఆవిడ! 

అంతలో ఏమయింది? "అంత బడబాగ్ని చేత సళపెళ క్రాగి కళపెళలాడు సముద్రోపరి సముద్భూత బుద్బుదధ్వనులవోని కంఠరావ మొప్ప శ్రీరామచంద్రుడిట్లనియె" లోపల బడబాగ్ని చేత, పైన కళపెళలాడే అలలపై బుడగల చప్పుడులా ఉందిట రాముని కంఠం. ఏవిటా బడబాగ్ని అన్నది పాఠకులే ఊహించుకోవాలి. రాముడు వాల్మీకంలోలాగానే మాట్లాడతాడు. దాంతోపాటు ఇంకా దారుణంగా అనిపించే మరోమాట కూడా అంటాడు: మఱియున్ నీకొక మాట చెప్పవలయున్ మారీచునిం జంపితిన్ హరిణం బయ్యది కాదు లక్ష్మణుడు యాథార్థ్యంబు వాచించె ని ష్ఠురు లాయిద్దఱు గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క బ్బుర మా బంగరులేడి గోరెదని నీవున్ వార లెట్లెంచిరో? "అప్పుడు నువ్వుకోరిన బంగారు లేడి లక్ష్మణుడు అనుమానించినట్టే రాక్షసుడు, మారీచుడు. ఆ రావణాసురుడూ మారీచుడూ ఇద్దరూ కలిపి కూడబలుక్కొని ఈ పన్నాగం పన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏవిటంటే, నువ్వు అలా బంగారులేడిని కోరుకుంటావని వాళ్ళెలా ఊహించారో కదా!" అని దీనర్థం. ఎంత మహా ఘోరమైన నింద ధ్వనిస్తోంది ఇందులో! అప్పుడు సీత ఏం చేసింది? "అంత బెద్దసేపు జానకీదేవి రామచంద్రుని వంక జూచుచు నట్లే నిలుచుండి చివరకు లక్ష్మణుని గాంచి యిట్లనియె" "నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నేనీ దరి ద్రాకారంబున జచ్చియుం బ్రదికి యౌరా! యొక్కరీతిం దగున్" లక్ష్మణుని కావాలంటే పెళ్ళిచేసుకో అన్న రాముడికి ఈ మాటలు కొరడాతో కొట్టినట్టు అనిపించక మానతాయా! సీత అగ్నిప్రవేశానికి ముందు రాముణ్ణి పూర్తిగా కుంకుడుకాయ రసంపోసి మరీ తలంటేస్తుంది! ఆవిడ పెట్టే చీవాట్లు వింటే, సీతేదో అమాయకురాలు, నోరులేనిదీ, భర్త దగ్గర నోరెత్తనిదీ, దీనురాలు అనుకొనే వాళ్ళ ఆలోచనల్లో తుప్పొదిలిపోతుంది. నే నొక్కించుకసేపు లోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా మీ! నీ యాజ్ఞన్ వచియింతు గొంచెము సమున్మీలద్యశోధామ! దై వానన్ వచ్చిన దోసమంతయును నా వంకన్ నిరూపింతు, నీ వైనన్ దైవమ వండ్రు, నీకు కృపలే దందున్ మఱట్లైనచో దైవం వల్ల వచ్చిన దోషాన్ని నాపై పెట్టడానికి ప్రయత్నించావు. నిన్నందరూ దేవుడిలా చూస్తారు కాని, నీకు ఏమాత్రం దయా గుణం లేదు. మచ్చిక జెట్ట యర్థముల మాటలనంటివి నన్ను నీవనన్ వచ్చును నేనునైన బడవచ్చును, బంగరులేడి జూడగా విచ్చిన కంటితో నెడద విచ్చెను విచ్చిన గుండెలోపలన్ జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వ ఋషీంద్ర వాంఛలున్! ఏ ఋషి భావనా మహిమ ఏర్పడ నాయెదలోన జొచ్చి నన్ గోరగ జేసె లేడి, నది కోమలనీలపయోదదేహ! నా కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా నేరను వచ్చు, నీ విదియు నేరవె? సర్వఋషీంద్ర హృత్స్థితా! ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం బు కలుగనటం జూతురు తమోహరణా! దయజూచితేని కో రికయును నాది నీకు సురరీకృత కీర్తిరమా ఫలప్రదం బకలుష గుప్తశౌర్య బహిరాగతి దివ్యఫలంబు రాఘవా! నువ్వు ఊరికే అనవసరమైన చెడ్డమాటలన్నీ అన్నావు. అయినా నువ్వు నన్ననవచ్చు నేను పడవచ్చునూ. కాని అసలు విషయం చెప్తాను. బంగారులేడిని జూడగానే నా కళ్ళు చెదిరాయి నిజమే. కాని దాంతోపాటు నా గుండెకూడా చెదిరిపోయింది. చెదిరిన ఆ మనసులో సమస్త ఋషుల కోరికలు కూడా దూరాయి. నన్ను బంగారులేడిని కోరినట్లుగా చేసినది ఆ ఋషిభావనా మహిమ (దానవ సంహారమే ఆ ఋషుల కోరిక కదా). దానికి నువ్వు రాక్షస భావం అంటగడుతున్నావు. నీకామాత్రం నిజానిజాలు తెలియవా? సరే, ఒక పనివల్ల కలిగే మంచిచెడ్డలని చూసి ఆ పని సరైనదా కాదా అని నిర్ణయిస్తారు కదా. అలా చూసినా నేను కోరిన ఆ కోరిక నీకు మేలే చేసింది. నీలో దాగిన శౌర్యాన్ని అందరికీ తెలిసేలా చేసి నీకు కీర్తిని సంపాదించి పెట్టింది కదా! ఆడది యింత సేతు ననుటన్నది యున్నదె యంచు నన్ను నూ టాడితి, కైక కోరక మహాప్రభు నీ వని రాకలేదు, నీ యాడది సీత కోరక మహాసుర సంహరణంబు లేద, యా యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్ ఆడది ఎంతకైనా చేస్తుందన్నావే, నిజమే నయ్యా! నిన్నొక ఆడది కైక కోరిక కోరికపోతే అడవికి వచ్చేవాడివా, నేను (బంగారులేడిని)కోరకపోతే ఈ రాక్షసులనందరినీ సంహరించేవాడివా! ఇలా రాముడన్న ప్రతిమాటకీ సమాధానమిస్తుంది సీత. ఇనవంశేందు! మనస్సు లోపల మనస్సే లేదు నీకందు! నీ కొనరన్ నిక్కముగా మనస్సున మనస్సున్నన్ ధరాజాత నే మనినా వెవ్వరినో వరింపుమనియా? యయ్యయ్యొ! యా వేరి పే ర్లనినా వెవ్వరుగాని నవ్వరటవే, రామా! జగన్మోహనా! మనసున నింత యుంచుకొని మారుతితోడన యుంగరంబు పం చినయది గుర్తు చిత్రము, రచించిన నీయెదలోని చా టెఱుం గనియది, యిర్వదేండ్లు నిను గాంతుని గాగను నమ్మి సంసృతిం బొనరిచి నిన్ను నే నెఱుగబోవని నా తెలివిన్ హసించెదన్ "నీకు మనసంటూ లేదు రామా! ఇన్నాళ్ళూ నిన్ను తెలుసుకోలేని నా తెలివికి నేనే నవ్వుకుంటున్నాను" అని ఎంత సూటిగా చెప్పింది! పైగా ఎంటంటోందో చూడండి (ఇక ప్రతిపద్యానికీ వివరణ ఇవ్వడం నా వల్ల కాదు!): నీ పొనరించుదాన నొక నీతియు నున్నది నేనెఱింగినన్ నీ పొనరింపబోవు పనినే మరణించియ యుందు దేనికై యా పది శీర్షముల్ కలిగినట్టి మహాసురు నీవు చంపునౌ నీ పదిదిక్కులన్ యశమదెట్టుల దక్కును నీకు మత్పతీ! ఆమిక్షాకృతి విచ్చిపోదు రనసూయారుంధతుల్ గాని లో పాముద్రాసతిగాని నీ విటుల భూపాలా! మదిన్ నమ్మవే నీ, మోహాంధ వటంచు ధూర్జటి హిమానీశైలకన్యామణిం దా మాటాడునె? నీవు పల్కెదవుపో ధాత్రీ సతీకన్యకన్ అప్పుడరుంధతీ సతియు నంతిపురంబును నింక ద్రొక్కనం చొప్పమి లేచిపోయె విపినోర్వికి నేనును వచ్చు టెంచుచున్ జెప్పకు మింటి కేగి యిది, సీతయు నగ్నిని జొచ్చె నేను బో నప్పుడె యంచు జెప్పిన మహాప్రభు! దోసము మాసిపోయెడున్ ఆయా మౌనుల యిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్ ధ్యేయాకారలు వారి గేహినులు భక్తింబొల్చు న న్నీ గతిం జేయన్ నీవును గోప మూనెదరుసూ! సేమంబు కాదద్ది నీ వా యా మౌనులయిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్ ఆ వేళన్ వని జేరునప్పుడు ప్రసంగానీతమై చెప్పగా సావిత్రీకథ నేను నీ మరణవాంఛాబుద్ధి నైనట్లుగా నీ వాడన్ బ్రభు నేన చత్తునని యంటిన్ నిక్కమట్లయ్యె నీ నీవే కారణమౌట దానికిని బండెన్ మత్తపంబంతయున్ రాముడిని అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఋషుల ఇంటికి వెళ్ళడం క్షేమం కాదని హెచ్చరిస్తోంది! ఎందుకు? తననిలా తూలనాడినందుకు మునిపత్నులందరూ రామునిపై తీవ్రంగా కోపగించుకుంటారు కాబట్టి! నాపయి రామచంద్ర! రఘునాయక! మత్పతి! నీకు నెందుకో కోపము వచ్చె నద్ది యిదిగో పది యల్లితి వంశగౌరవ క్షేమముగాగ మచ్చ యని చెప్పితి వచ్చట నింత కంటె దీ వ్రాపద యున్నదయ్య రఘువంశము నందున గోప మేటికిన్ నీకు నామీద ఎందుకో కోపం వచ్చింది. అంచేత ఎవో పది రకాలుగా నన్నన్నావు. నువ్వేదో మీ వంశగౌరవం అంటున్నావే, దానికి నువ్వనుకుంటున్నదానికంటే పెద్ద నష్టం ఇప్పుడు వాటిల్లబోతోంది! ఏవిటది? నన్నున్ వీడి మఱీవు వేఱయిన కాంతం బొంద వప్డున్ గులో త్సన్నంబై చను గైకకంటెను భవత్సంపాదితంబైన సమా సన్నంబై చను పెద్దయెగ్గు రఘువంశంబందు లోకాగ్నికిన్ స్నాన్నాయంబగు నూహ లెత్తదు భవిష్యత్కాల సంసూచిగా భరతుడొసగిన ధర ధర్మపత్ని ప్రక్క లేక యేలెడు నర్హత లేదు నీకు నరపతివి కాక నన్ను గొనంగవచ్చు నుభయతోభ్రష్టతం బొందుచుంటి రామ! ఆహా! ఎంత తిరుగులేని మాట చెప్పింది సీత యిక్కడ! రాముడు తన్ను వీడి మరొక కాంతను ఎలానూ చేపట్టడు. దానివల్ల కైక రఘువంశానికి చేసిందనుకొంటున్న కీడు కన్నా కూడా మహాపద కలుగుతుంది. భరతుడు తనకి ఒప్పచెప్పిన రాజ్యాన్ని ధర్మపత్ని లేకుండా రాముడు ఏల లేడు. అప్పుడు మరి రఘువంశ భవిష్యత్తు ఏమి కావాలి? పైగా, రాముడు తన వంశాన్ని రాజ్యాన్ని వదులుకొని ఇప్పుడు సీతని గ్రహించవచ్చు. కాని సీతని పరిత్యజించి ఆ వంశగౌరవాన్నీ, రాజ్యాన్నీ ఎటూ పొందలేడు. అప్పుడతను రెంటికీ చెడ్డ రేవడే అవుతాడు! ఇది చెప్పిన తర్వాత, సీత మరో రహస్యం చెప్పి, అగ్నిప్రవేశానికి ఉపక్రమిస్తుంది. అగ్నిమండుచు నున్నది యారిపోక ముందు నే దానిలోనికి బోవవలయు జివరి కొకమాట నీకును జెప్పవలయు దెలియజాలరు దీనిని దేవతలును ఇరువురము నొక్క వెలుగున జెఱుసగమును దీని నెఱుగు శివుడొకరుండే పురుషుడ వీ వైతివి నే గరితనుగా నైతి బ్రాణకాంతా! మఱియున్ అచట చూచుచు నున్నట్టి యందఱకును జెలువ యేమని చెప్పెనో తెలియలేద చాది చూచిరి నట నుర్విజాత నచటి యుర్విజాత యన్నట్లుగా నున్నదాని మారుతి లక్ష్మణుండును క్షమాసుత బూర్వము చూచినట్టి వా రా రుచిరాంగి చెప్పినది యంతయు నర్థము చేసికొన్న వా రీ రచనంబు సర్వమును మహీయ మతీతమనస్కమై జనం బేరును రామునందున వహింపరు తొల్త దలంచు దోసమున్ "నిర్భీకవలె, స్వాధీనపతికవలె, బురస్కారభావయుతవలె, మత్తగజ మంథర సుందర గమనంబున నగ్నికడకు నడచి యగ్ని బ్రవేశించిన" ఈ చివరి సీత నడకని, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు వర్ణించిన నడకతో (ఈ టపా మొదట్లో ఉంది) పోల్చి చూడండి. అందులో ఎంతటి వైవిధ్యాన్ని విశ్వనాథ ప్రదర్శించారో, ఎందుకు ప్రదర్శించారో! ఈ అగ్నిప్రవేశ ఘట్టం మనల్నీ (రాముణ్ణీ) రామాయణం చివరికంటూ వెంటాడుతునే ఉంటుంది! ఆ తర్వాత సీతని ప్రసన్నురాలిని చేసుకోడానికి నా నా తిప్పలూ పడతాడు రాముడు. ఆఖరికి రాముడు జానకిని ప్రసన్నురాలిని జేసుకొనవలసిన స్థితినుండి, సీతచేత తాను అనుగ్రహింపబడవలసిన స్థితికి వస్తాడుట! 

తిరిగి అయోధ్యకి సీతారాములు ప్రయాణమైనప్పుడు ఋష్యమూక పర్వతం కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీతతో, అక్కడ ఎంతగా విరహాగ్ని తనని కాల్చివేసిందో చెప్తాడు రాముడు. 

అప్పుడు సీత, "నిన్నేమో అగ్ని కానిది అగ్నిలా దహించింది, నన్నేమో అగ్నే అగ్నిలా దహించకుండా పోయింది" అని ఓ పోటు పొడుస్తుంది! 

ఆ తర్వాత వాళ్ళు అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, సీత అనసూయకి జరిగిన వృత్తాంతం చెప్తూ, తనని రాముడు చేసిన అవమానం కూడ చెప్పి, రాముడన్న మాటలకి "జుగుప్సావార్ధులాడెం జుమీ!" అంటుంది. 

దాంతో అనసూయ, రాముని వద్దకు వచ్చి చాలా కోపంగా చూసి, తర్వాత తనని తమాయించుకొని మళ్ళీ లోపలకి వెళ్ళిపోతుందిట! 

భరతుడికి తను తిరిగివస్తున్నానన్న వార్త చెప్పమని హనుమంతుని పంపిస్తాడు రాముడు. హనుమంతుడు వెళ్ళేసరికి, రాముడు గడువు పూర్తయినా రాలేదని అప్పుడే అగ్నిప్రవేశానికి సిద్ధపడతాడు భరతుడు. అప్పుడు హనుమంతుని కంటికి భరతుడు ఇలా కనిపించాడట: 

ధరణిదేవికన్య దశరథసూనుండు రామమూర్తి యనలరాశి ద్రోచె దానికిన్ ఫలంబు తానే మహాగ్నిలో నుఱుకుచుండె నన్న యూహ తోచి భరతుడు రామునిలాగే ఉంటాడు కదా ఆకారంలో మరి! 

దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అగ్నిప్రవేశాన్ని మనకి గుర్తుచేసారు విశ్వనాథ. అయోధ్యకి తిరిగివచ్చిన తర్వాత, అరుంధతి తమని చూడటానికి వస్తున్నప్పుడు రాముడు తెగ భయపడిపోతాడు! 

అనసూయ అయితే కోపంగా చూసి ఊరుకుంది, అరుంధతికి కోపం వస్తే అలా ఊరుకుంటుందన్న నమ్మకం లేదు. అంచేత ఆమెకి ఏమీ చెప్పవద్దని సీతని ప్రాధేయపడతాడు రాముడు. సీత అతనికి అభయం ఇస్తుంది! 

ఇలా అగ్నిప్రవేశం గురించి కల్పవృక్షంలో చదివితే స్త్రీశక్తి, అందులోనూ సీతాదేవి మహోన్నత వ్యక్తిత్వం, మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రామాయణం "సీతాయాశ్చరితం" అన్నది మరింత బలపడుతుంది. 

వడలి మందేశ్వరరావుగారు "ఇది కల్పవృక్షం" అన్న పుస్తకంలో, అగ్నిప్రవేశాన్ని గురించి చెప్తూ, 

ఇది సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. దీనివల్ల ఇప్పటికీ రాముని వ్యక్తిత్వాన్ని సరిగా అంచనా వెయ్యడానికి కష్టంగానే ఉంది అన్నారు.

అది అక్షర సత్యం!

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం.

సత్య హరిశ్చంద్ర లో..బలిజేపల్లి లక్ష్మి కంత కవి గారి వారి ఒక పద్యం.

.

"మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్

నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం

తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో

నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.!

.

ఇందులో ఉన్నది పూర్తిగా వ్యక్తిగత దృష్టి. వ్యక్తిగా మనం మన శరీరంతోనూ, మనసుతోనూ అనేక బంధాలను పెంచుకుంటాం. ఆ బంధాల చుట్టునే మన బతుకు గుడుసుళ్ళు తిరుగుతుంది. "నేను" అనే ఒక భావం ఉన్నంత వరకూ ఆ బంధాలు ఉండనే ఉంటాయి కదా.

.

అంటే "నా" దృష్టిలో అవి నిత్యమే! అందులో మాయంటూ ఏముంది? ప్రాణం పోయిన తర్వాత ఇక "నేను" అన్నదే లేదు. మనసూ లేదు, అందులో భావాలూ లేవు, బంధాలూ లేవు. శరీరం కట్టెల్లో కాలిపోయేటప్పుడు "నా" అనుకొనేది ఏదీ అక్కడ లేదు. అంచేత అలాంటి సందర్భంలో "నా యిల్లాలు, నా పుత్రుడు" అనుకొనే ప్రసక్తే లేదు, ఇంక వాళ్ళు తోడై రావడమేమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, బతికుండి, ఆలోచించే బుద్ధి ఉండి, ఊహించే మనసుండి, భావాలు బంధాలూ అన్నీ ఉన్న స్థితిలో మనిషి తన "చావు"ని గురించి ఊహిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. చావులో కూడా తన అస్తిత్వం నశించే స్థితిని మనిషి ఊహించలేడు! 

.

అందుకే "తన" శరీరం కాలుతూంటే, "తన" బంధువులెవరూ "తన" వెంట రారని అనుకోడం. ఇదొక రకంగా "అసంబద్ధమైన" (contradictory) ఊహ. ఒక వ్యక్తి ఉన్నంత వరకూ, ఆ వ్యక్తికి అతని దృష్టిలో ఉన్న సర్వ ప్రపంచమూ నిత్యమైనదే, సత్యమైనదే. అందులో ఉండే వస్తువులు, మనుషులూ భౌతికంగా నిత్యం కాకపోవచ్చు. కాని జగమే అనిత్యం, అసత్యం కాకుండా పోవు!

పోతన పద్యం బాపు చిత్రం.!

పోతన పద్యం బాపు చిత్రం.!

.

"విశ్వాత్ముడు విశ్వేశుడు

విశ్వమయుండఖిలనేత విష్ణుండజు డీ

విశ్వములో దానుండును

విశ్వము దనలోన జాల వెలుగుచునుండన్."

.

విష్ణుమూర్తి పుట్టుకలేని వాడు, అంటే అజుడు.

ఈ ప్రపంచం అంతా తానే అయి ఉన్నవాడు. అంటే విశ్వమే ఆత్మగా కలిగినవాడు.

అంతేకాదు, ఈ విశ్వానికంతటికీ ప్రభువు. ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నవాడు.

అన్నిటికీ అధినాయకుడు. ఈ ప్రపంచంలో విష్ణువు ఉంటాడు. 

ప్రపంచం అంతా విష్ణుమూర్తిలో ప్రకాశించి ఉంటుంది. విష్ణుమూర్తి గురించి.

.

పోతన వివరించిన పద్యం ఇది.

Friday, November 18, 2016

తొలి తెలుగు మాట?

మీకు తెలుసా ! నాకు తెలియదు ఇప్పటి వరకు 

తొలి తెలుగు మాట?

మన అమరావతీ స్తూపం, చాలా ప్రాచీనమైనది. క్రీస్తు పూర్వం ౨౦౦ మొదలుకుని

క్రీ.స. ౨౦౦ వరకూ అనేక దశలలో దాని నిర్మాణం సాగింది. 

ఇక్కడ దొరికిన ఒక రాతి పలక మీద "నాగబు" అనే మాట కనపడింది.

దీన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగు పదమని మొదటగా గుర్తించారు.

ఇదే మనకు లభించిన మొదటి తెలుగు మాట. 

దాని అసలు సిసలు ద్రావిడ పదం "చెంబు" అంటారు.

రాగి పాత్రలు:


రాగి కి ఆంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుందట.రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు.కాబట్టి ఇందులో వున్నపధార్దాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ.


మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం.రాగి పాత్రలలో నీళ్ళు కనుక ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు.అందుకే పాత రోజుల్లో రాగిబిందెలు వాడేవారు.మనం ఎప్పుడైనా ఎక్కడైనా నదిని దాటేటప్పుడు అందులో నాణేలు వేస్తుంటాము , గుర్తుందా.ఎందుకోతెలుసా?

ప్రాస పదాలు!

ప్రాస పదాలు!

.

(ఈ పదాలు నేను తెలుగు దానం అనే వెబ్ సైటు నుంచి తీసుకున్నవి. 

వారికి కృతజ్ఞతలు.)

పాప గిలక తాత పిలక

సబ్బు మరకగడ్డి పరక

గుడి గంటవరి పంట

రంగు పలకకంటి నలక

పళ్ళ గంపముళ్ళ కంప

పిచ్చి కుక్కపూల మొక్క

చిట్టి తల్లిబుజ్జి చెల్లి

కాకి ఈకమేక తోక

తేలు కొండిరైలు బండి

బావి గట్టురావి చెట్టు

దోస పండుపూల చెండు

పట్టు కుచ్చుగొర్రె బొచ్చు

గండు పిల్లిబొడ్డు మల్లి

చీల మండుగోల కొండ

వెండి కొండనిండు కుండ

ఆల మందతీయ కంద

వరి అన్నంరాతి సున్నం

నీటి బుడుగపాము పడగ

ప్రాస వాక్యాలు

మంచి మాట ముద్దుకల్లలాడవద్దు

కీడు చేయ ముప్పువాదులాడ తప్పు

కట్టు లేని నోరుగట్టు తెగిన ఏరు

పెద్ద వారి మాటపెరుగన్నం మూట

కలసి మెలసి మెలుగుకలిమి బలిమి కలుగు

పొల్లుమాట విడువుగట్టిమాట నుడుపు

మాట తప్పబోకుమంచి విడువబోకు

అడుసు తొక్కుటేల?కాలు కడుగు టేల?

చదువురాని మొద్దుకదలలేని ఎద్దు

కీడుచేయ ముప్పువాదులాడ తప్పు

మంచివిద్య చదువుమంచిబుద్ధులొదవు

గట్టిమాట నుడువుగర్వమంత విడువు

ప్రియములేని విందునయముకాని మందు

పోరునష్టం పొందులాభం కలసి ఉంటే కలదు సుఖం.

ఇలాంటి పదాలు గమనించండి. ప్రాస ఆటోమాటిక్ గ పడాలంటే బాష మీద కొంచెం పట్టు సాధించండి.

బాబాయ్ ఒక రోజు రాత్రి డాక్టర్ కి ఫోన్ చేశాడు

బాబాయ్ ఒక రోజు రాత్రి డాక్టర్ కి ఫోన్ చేశాడు 

బాబాయ్ : మా ఆవిడ కడుపు నొప్పితో బాధపడుతుంది ... appendicitis అని నా అనుమానం

డాక్టర్ : appendicitis అయ్యే ఛాన్స్ లేదు ... already మీ ఆవిడకి appendicitis ఆపరేషన్ నేనే చేశా ఇంతకముందు ...! 

బాబాయ్ : లేదండి నొప్పిబరించలేకపోతున్నా అంటుంది ... ఇది కచ్చితం గా appendicitis నే ...! 

డాక్టర్ : ఎవరికైన కూడా రెండు appendix లు ఉండే ఛాన్స్ లేదయ్యా ... నా మాట వినవయ్యా బాబు

బాబాయ్ : కాని ఒకడికి ఇద్దరు పెళ్ళాలు ఉండే ఛాన్స్ ఉంది కదండి ... మీరు తొందరిగా రండి.