మత్తయి సువార్త !

మత్తయి సువార్త !

.

నీ కంటిలో దూలము ఉండగా 

.

నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయుమని చెప్పనేల ? 

.

.

.

1. మనం కిరాణా షాప్ కి వెళ్లి సరుకులు కొన్నప్పుడు బిల్ అడగము . అతడు ఆదాయం గా చూపే అవకాశం లేదు 

2. ఇంటి అద్దె కోసం దొంగ బిల్లులు సృష్టించి పన్నును ఎగవేయ్యడం మనం చెయ్యడం లేదా ?

3. మనం ఎపుడూ , ఎవరకీ మన పనులకోసం లంచం ఇవ్వకుండా ఉన్నామా ?

4. ఎపార్ట్ మెంట్ రేటు ఎంత చూపిస్తున్నాము రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నపుడు ?

5. 500 తీసుకోకుండా ఓటు వేస్తున్నామా ? వెండి గిన్నెలూ , సెల్ ఫోన్ లూ తీసుకోకుండా పట్టభద్రులు నియోజకవర్గ ఓటూ , ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటూ వేశామా ?

6. పోలీసులకు లంచం ఇవ్వకుండా రశీదు తీసుకుని ఫైన్ కడుతున్నామా ?

7. బడ్డీ కొట్టు రోడ్డుమీద పెట్టుకునే వాడు కూడా లంచం ఇవ్వకుండా వ్యాపారం చేస్తున్నాడా ?

8. డొనేషన్ కట్టకుండా కాన్వెంట్ ( రశీదు ఉండదు ) లో జైన్ చేస్తున్నామా ?

9. ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేసి అక్కడి చదువును మనం ప్రశ్నిస్తున్నామా ?

10. మనం పెంచి పోషిస్తున్న ఈ వ్యవస్థ లోపాలలో మన బాధ్యత ఏమీ లేదా ?

11. ఈ వ్యవ్యస్థ లోపభూయిష్టం గా ఉంది అని మనం అంటున్నాం , మన ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా ?

12. ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయంది అని తిట్టే మనం మన కృషి ఏమిటి ?

.

.

ఇన్నాళ్ళకు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేద్దాం అని ప్రయత్నిస్తూ ఉంటె మనం కూడా స్వంత లాభం కొంత మానుకుని జరిగే పనికి సహకరించగలమా ? విమర్శిద్దామా ?

.

మనలో లోపం లేని వారు ఎవరో చెప్పండి ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!