Posts

Showing posts from July, 2014

వాన దేవుడు సేయు కొంటె పనులు

Image
శ్రీమతి మదమంచి యనంతమ్మ గారు రాసిన కవిత.... వాన దేవుడు సేయు కొంటె పనులు ప్రక్రుతి వానదేవునికి స్వాగతిస్తున్న తీరు..చూడండి వర్ష లక్ష్మికి యాతిధ్య ప్రధమ ధర్మములైన యర్ఘ్య పాదములందించు తీరు గొల గొల జారెడు కొండవాగులు పసరుల గ్రక్కెడు పచ్చిక పట్టులు జీబులుదేరెడు చివురు జొంపములు మోసులు గట్టిన మొలక పైరులు అర్ఘ్యపాద్యముల నర్పించూ,ప చ్చకు పుట్టముల నందించూ,మే ల్పసిమి జాలరుల బరిపించూ,ఓ సజల జలదమా! స్వాగతము'' తుంటరి వానదేవుడు చేయు కొంటేపనులు..ఇలా వర్ణించారు మాటున దాచిన తాటి గొడుగులను పల్లె బాబుచే బట్టిన్చెద వోయి! కమత గాండ్ర కరి కంఠము గూర్తు గొల్లవారి తల గొంగళ్ళుఇడేదవు అటునిటు పనికై యరిగెడు సతులకు చేటలు నెత్తిన దీటు గొల్పెదవు కర్ర పెత్తనము గల పెద్దలకు గుడ్డ గొడుగు గీల్గొలుపుదువన్నా! కొమ్ములు దిరిగిన కోటీశ్వరునకు చెప్పులు చేతికి చేర్చి కుల్కెదవు.'' పైగా ఎప్పుడు రాకూడదో కూడా చెప్పారు ఖండ వృష్టి యని గర్హించెడి మా కాపు కుమారుల కండ్ల నీళ్ళతో పిడకలు,పుడకలు.పిండి పప్పులును ఎండపోయు తరి నేతెoచితివా సుదతులు పల్కెడి సూటి పోట్లతో'' వేళా పాళా లేకుండా రావొద్దని హ
Image
మొదటి స్వదేశీ పెన్ను .. రత్నం పెన్.  త యరు చేసిన వారు.. కోసూరి వెంకట రమణమూర్తి. గారు రాజమండ్రి.

కాలే కడుపుకి రుచి తెలీదు

Image
కళ్ళు మూసుకొని నిద్ర పోవాలా... లేక నిద్ర పోయి కళ్ళు మూసు కోవల .. తేలిక నాకు నిద్ర పట్టం లేదు.. కాలే కడుపుకి రుచి తెలీదు  మండే కట్టెకి వర్ణం లేదు  అర్ధించే చేతులకి తనపర భేదం లేదు  పీల్చే గాలికి కులం తాగే నీరుకి మతం లేదు నడిమధ్యన వచ్చావ్  చివరకి ఆమట్టిలోనే కలుస్తావ్  తోలుతిత్తి శరీరానికిబంధాల మందు జల్లి  అహం అనే మత్తులో కష్టాల కొలిమిలో భవసాగరాన్ని ఈదుతున్నవ్ ఊపిరి ఆగే వరకే ఈ బంధం  కట్టెకాలే వరకే ఈ పాశం జానెడు పొట్టకోసం ఆరడుగుల నేలకోసం ఇన్ని పాట్లా  మానవ జన్మకి ఇన్ని వెతలా ......@ బాటసారి

బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ.

Image
అయ్యా బాపు గురించి ఈ నవతరానికి తెలియాలి అందుకే ఈ పోస్టింగ్ సు. అయన అసలు పేరు కూడా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు. . బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.1955 వ సంవత్సరం లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నాడు.  బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. 'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది. కొంటెబొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలలూపు ఓ కూనలమ్మా! ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు

కుమారా శతకం

Image
మనకు కుమారీ శతకము గురించి తెలుసు.. . స్త్రీలు .కన్యలు నడచుకోవలిసిన తీరు తెన్నులు ఇందులో ప్రవచించారు..  అయితే శ్రీమతి ఆత్మూరి అన్నపూర్ణమ్మగారు.. పిచ్చ్సుకపై బ్రహ్మాస్త్రమన్నట్లు,బొడ్డూడ కున్నను,పురుషులమను పేరిట పల్కుబడి చెలాయించుచు.స్త్రేలకు నీతులు గరపువారే కాని.యెంత దుష్టులైనను పురుషులకు నీతి గరపువారు లేరని యామె.కటకటపడి రాసిన ది కుమారా శతకం . తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అని వచించు సామెతను దలంచి, నీదు దప్పు లెరిగి నేర్పున సవరించి, సఖుల నీతి గరప జను కుమార! నీ సతియు నీకు మిత్రము నీ సతియే నీకు దోడు,నిజముగసుమ్మీ, రోసమున సతిని దూరిన మోసము నీ సౌఖ్యమునకు ముందు కుమారా! రుస రుస లాడుచు,దిట్టుచు, గసరుచు గోపింప సతులు గ్రక్కున వశులై, మసలుదురని తలపోయుచు రసురుల వలె దుష్ట పురుషులవని గుమారా! ముదమున బతంగ నివహము వదలక ఫలరసములకును బరుగిడు కరణిన్ మృదు హృదయుడ వై మెలగిన సుదతి నినుo బొంద దలచు జూవె కుమారా! . సరసములగుభావముల కూర్పుతో ,సలలితమగు పదములతో .ఏర్చి. తీర్చిన ఈమె పద్యములు తిన్న గ పటితుల హృదయమును దూరి సన్నగా పనిచేయ గలవు. చల్లనైన జీవముతో మెల్లగా నర్తించు

ముండకోపనిషత్తు..

Image
ముండకోపనిషత్తు.. ఈ ఉపనిషత్తులోని 'సత్యమేవజయతే' అనే ఈ సూక్తి భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉండడం భారతజాతి గర్వించదగిన విషయం. ముండనం అంటే శిరసుపై జుట్టును తొలగించుట అని అర్థం. ముండనం చేయించుకోవడం ద్వారా, అన్ని కోరికలను పరిత్యజించి, మోక్షప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించడం, దీని కొరకు సన్న్యాసాన్ని స్వీకరించడం అనేది సంకేత రూపంలో తెలుప బడింది.  అటువంటి మోక్షేచ్చ కలవారికి ఉపదేశాన్ని అందించే ఉపనిషత్తు గనుక ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది. యజ్ఞ యాగాదులు, పుణ్యకార్యాలు చెయ్యడం వలన పుణ్యాన్ని సంపాదించుకొని, దాని ద్వారా, ఈ లోకంలో అఖండమైన కీర్తిని, భోగభాగ్యాలను, పరలోకంలో స్వర్గాది సుఖాలను పొందగల్గుతారు.  కాని వీటి ద్వారా మోక్షాన్ని పొందలేరు. విద్యాగర్వంతో విర్రవీగడం అజ్ఞానుల ప్రధాన లక్షణం.  తాము బ్రహ్మజ్ఞానులమనుకొని విర్రవీగే మూర్ఖులు ఒక గ్రుడ్డి వానిచే తీసుకొని వెళ్ళబడే ఇంకొక గ్రుడ్డివాడు చిక్కుల్లో పడినట్లుగా జరామరణాలతో కూడిన జననమరణ వలయంలో తిరుగుతూ ఉంటారు. సత్యమేవ జయతే నానృతం  సత్యేన పంథా వితతో దేవయానః (3.1.6) సత్యమే గెలుస్తుంది. అసత్యం ఎప్పటికీ గెలవదు. సత్యవ్రతాన్న

కాలంతో, కలంతో ఎలా మసులుకోవాలో తెలిసిన కవి..

Image
కాలంతో, కలంతో ఎలా మసులుకోవాలో తెలిసిన కవి.. సినారె...జన్మదినాన .......... జనం నోట్లో ----------- ఒలుకుతున్నాను నేను కలం గొంతుకనుంచి కాలంలా పరుచుకున్న  కాగితం గుండెమీద. ముద్దగా ఇంకిన చుక్కలు  మొనదేలిన అక్షరాలై  ఎగిరిపోయాయి కాగితాన్ని ఎడమకాలితో తన్నేసి. "ఏవీ ఆ అక్షరాలు?  ఏదీ నా ఆనవాలు?" అవి పదిలంగా నలుగుతూ ఉన్నాయి  అరిగిపోని జనం నోట్లో!! 1979లో ముద్రణ రూపం దాల్చిన " మృత్యువు నుంచి..బతుకులోకి" కవితల సంకలనంలో ఇవి ఆయన అక్షరాలు.. x

మేఘ సందేశం - : మహాకవి కాళిదాసు తెలుగు వ్యాఖ్య: డా|| కే ఏ సింగరాచార్యులు

Image
మేఘ సందేశం - : మహాకవి కాళిదాసు తెలుగు వ్యాఖ్య: డా|| కే ఏ సింగరాచార్యులు కాళిదాసు గురించి నేను చిన్నప్పుడు విన్న ఒక విషయం చెప్పాలి. అమ్మవారి కటాక్షం లభించడానికి ముందు కాళిదాసు అమయాకంగా ఉండేవాడట. అక్కినేని నటించిన కాళిదాసు సినిమాలో కూడా అదే చూపించారు.  ఆ రోజుల్లో ఒక ఊరి పడచు అతన్ని చూసి అస్తి కస్చిత్ వాక్ విశేషః? అని అన్నదట. అంటే "అసలు నీకు కొంచెమైనా మాట్లాడగలిగే విషయం ఉందా" అని. కొన్నాళ్ళకు అమ్మవారి కరుణతో గతం అంతా మర్చిపోయి మహాకవి అయిపోయాడని ఐతిహ్యం. గతం మర్చిపోయినా కాని 'అస్తి, కస్చిత్, వాక్' అనే ఆ పడచు పలికిన ఆ మూడు పదాలు మస్తిష్కంలో ఉండిపోయాయట. ఏదైతెనేం..ఆ మూడు పదాలతో మూడు కావ్యాలు మొదలెట్టేసి రాసేసాడు.  అస్తి...తో 'అస్త్యుత్తరస్యాం దిశ దేవతాత్మా...' అంటూ కుమారసంభవం 'కస్చిత్..తో..'కస్చిత్ కాంతా విరహ గురుణా..' అంటూ మేఘ సందేశం 'వాక్' ..తో..'వాగర్ధావివ సంపృక్తౌ...' అంటూ రఘు వంశం రాసేసాడు. అసలు నీకు మాటలొచ్చా? అన్న ప్రశ్నకు అమ్మవారు కాళిదాసు నాల్క పైన ఆ మూడు పదాలతో అజరామరమైన మూడు కావ్యాలే పలికించిందన్న విషయం చరిత్

సెల్ ఫోన్

Image
ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా నేలనాలుగు చెరగులనూ చుట్టబెట్టిన ఏకైక ఆధునిక పరికరం ఏమిటంటే సెల్ ఫోన్ అని ఇట్టే చెప్పెయ్యొచ్చు. ఓ ఇరవయ్యేళ్ళ క్రితంవరకూ ఎవరికీ తెలియని ఈ ‘బుల్లి పరికరం’ ఈనాడు ‘హస్తభూషణం’ గా తయారయి కూర్చుంది. ‘ఇంటికి ఒక్క ఫోనే’ అబ్బురమనుకునే దేశంలో – ఇంట్లోవున్న నలుగురూ ‘నాలుగు ఫోన్లు – ఎనిమిది రింగులుగా ‘ కాలక్షేపం చేసే కాలం వచ్చేసింది. కుటుంబ సభ్యుల నడుమ మాటా మంచీ తగ్గిపోయి – ముక్కూ మొహం తెలియని వారితో మాటా మంతీ పెరిగిపోయింది. ఇంకో లెక్క ప్రకారం రెండేళ్ళ క్రితం మన దేశంలోని మొబైల్ ఫోన్ ల సంఖ్య అమెరికాలో వాడే సెల్ ఫోన్లకంటే రెండు రెట్లు ఎక్కువ (ట). మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడానికే కాదు, సందేశాలు కూడా పంపుకోవడానికి కూడా వీలు వుండడంతో వీటి గిరాకీ మరింత పెరిగిపోయింది. ఈ ఫోన్లు రంగప్రవేశం చేసిన తొలినాళ్ళలో ఈ సౌకర్యం వుండేది కాదు. మొదట జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఈ దిక్కుగా ఆలోచించాయి. ఆ దేశాల ఫోన్ కంపెనీలు చేసిన కృషి ఫలితంగా – 1992 డిసెంబర్ మూడో తేదీన మొట్ట మొదటి ‘ఎస్ ఎం ఎస్ ‘ ఇంగ్లండ్ లోని నీల్ పాప్ వర్త్ అనే ఒక వ్యక్తి నుంచి వొడా ఫోన్ ద్వారా వెళ్ళింది. అప్పటినుంచి ఈ చిట్

కల్లాపు జల్లుచు కామాక్షి కనుపించె మల్లె పూలలోన మీనాక్షి కనుపించె

Image
కల్లాపు జల్లుచు కామాక్షి కనుపించె మల్లె పూలలోన మీనాక్షి కనుపించె నా గేటి సాల్లలో నాగమణి కనిపించే,  నాగుండె గుడిలోన నాదేవి నివసించె.

/నెమలి కన్ను...// చింతా దీక్షితులు

Image
/నెమలి కన్ను...// చింతా దీక్షితులు ధగ ధగ మెరిసే కంటిని చల్లే కళ్ళు నెమలి కెవరిచ్చారో పరి విప్పుతు అది నాట్యమాడగా తాండవ కృష్ణుడు జ్ఞాప్తికిరాడా! మేఘాలoదం. నీలాలందం కంతల కాటుక కన్నుల అందం అందాలన్నే జీవందాలిచి నీలో నాట్యం చేసేనే! జ్ఞాపకముంటే చెప్పరాదుటే కృష్ణుని బాల్య క్రీడలు మాతో! కృష్ణుని వేణికి నీవా అందం నీకే అందం ఆ వేణా! చెప్పరాదటే చిన్నీ క్రుష్ణునీ కూకటి ముడి తో తాండవమాడిన నాటి వైభవము నీదే అయితే కృష్ణ గాధలనుకర్ణామృతముగ! ఆ నాడా ముర లాలించితివట గోపాలోన్నత శిరమున నిలిచి మురళీ మోహన దివ్య గీతముల ప్రతిబింబములా..నీలో తళుకులు!

ఆదిత్య హృదయం పరమ పవిత్రం.....

Image
ఆదిత్య హృదయం పరమ పవిత్రం..... . తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః . రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలసి అగస్త్య మహర్షి కూడా వస్తాడు. యుద్ధంలో అలసివున్న రాముడిని చూసిన అగస్త్య మహర్షి "రామా! ఈ సందర్భంగా నీకు వేదంవలె నిత్యమైనదీ, మంగళకరమైనదీ, పురాతనమైనదీ, ఆరోగ్యప్రదాయకమైనదీ, ఆయుర్వృద్ధిని చేసేదీ, అత్యంత ఉత్తమమైనదీ, అతి రహస్యమైనదీ, అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాను" అని పలికి, ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అగస్త్య ఉవాచ: రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి ఓ రామా! గొప్ప బాహువులు గల రామా! ఈ రహస్యమును విను. నీకు యుద్ధంలో విజయం కలుగును గాక! . ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం . ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రు నాశనం కలుగును. దీనిని చదువుట వలన జయం, శుభం, పరము కలుగును. . సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమ

భారత్ ......

Image
భారత్  భారత్ అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించింది.  భాః అంటే వెలుగు, జ్ఞానం, భగవంతుడు అని అర్దం.  రతః అంటే రమించేవాడు అని అర్దం. భారతః అంటే సదా భగవంతుని యందు రమించేవాడు అని అర్దం.  ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. 

Roman Holiday ...

Image
Roman Holiday ... A 1953 romantic comedy directed and produced by William Wyler. It stars Gregory Peck as a reporter and Audrey Hepburn as a royal princess out to see Rome on her own. Hepburn won an Academy Award for Best Actress for her performance; the screenplay and costume design also won. In Hindi l had seen 1. Chori chori.. Raj kapoor & Nargis.. 2.Basanth ...Shammikapoor .& Nuthan. 3. Dil tho mantha nahi...Ameer khan & Pooja Bhatt.. based on this film.. Telugu Malleswari.. also is basd on the same... You may add some more...

ఏలనో నావిభుడు నన్నేలగ రాడాయె.....

Image
వాలుజడ వేసికొంటి వన్నెల చీరను గట్టితీ జాలువారే పైటలోన జలదరింపులనోపనైతి ఏలనో నావిభుడు నన్నేలగ రాడాయె.....

మహానటి సావిత్రి..

Image
మహానటి సావిత్రి.. . : మరులుగొల్పు మలయ మారుత మత్తేభ మందగమన మాధుర్య మధుశాల సావిత్రి, సొంపైన సొగసు సోయగాలు నింపి సుగంధ సౌరభాలు వెదజల్లు సుందరాంగి సావిత్రి, నిండుదనమే నిచ్చెనగా,హుందాతనమే హొయలుగా రంజింపు రసమయే సావిత్రి,\ గహన గాంభీర్య సన్నివేశ సమాహారంబున అలవోక సజీవ ప్రదర్శనమే సావిత్రి !!
Image
అందాల చందమామ..నిన్ను చూసి అలలు లేచి ఎగిసినవే భామ....భలే మురేసినే..భామా. x

// కో కిలా లాపము//

Image
// కో కిలా లాపము// మధుర పల్లవ పుష్ప సంభరిత చూత పోతమును నుజ్జగించి,యో ముగ్ధ పికమ, చేదు నిండిన య వేప చెట్టు మీద గాకులను గూడి యుంటకు గతము చెపుమ! మౌనమును మానుకొని పంచమ స్వరమున గుహి కుహీ నాద మొకటి పల్కుముపికంబ! కానిచో నెట్లు గుర్తింప గలము నిన్ను గాకి మూకలలోన మాకంద సాఖి కోకిలా! నీ శరీరము నలుపు, అదియు బర బోషితమ్ము,వనాంతరముల నితర విహగమ్ముల నుకూడి యెగురుచుందు; చెవుల నమృతంబు బిందువుల్ చిలుకు నేర్పు నే గరుక్మంతునొద్ద గ్రహించినావు? ప్రాంగణముచేరి కావు కావనుచు గర్ణ పరుషముగ గూయు కాకిని బార ద్రోలి ఎచటనో కొమ్మలందు గుహీరవమ్ము సలుపు కోకిల దెస జూపు నిలుపుబుధుడు. అరచెదవు,.గంతు వేసెద.వడిచి పెడేద, వేమి చేసిన నీ లోపమేమి? కాక; కోకిలావాస చూతమ్ము నీకు కూడ వసతి చేసిన విధి ననవలెను గాక. తాలుచును గాక నల్లని తనువు,ఫలర సమ్ములను గ్రోలుగాక,రసాల శాఖ నధి వసించు గాక యుద్యాన వీధి సంచరించును గాక,సుస్వర కళా ప్ర గల్భతన్ గాకి కాకె,పికమ్ము పికమె. .............. ( పింగళి లక్ష్మీ కాంతం గారి రచన)

యేకాంతసేవ....

Image
ఎంతగానో నామది యేకాంతసేవకు వేచియుండ ఇంతలో నాకాంతుని అల్లంత దూరమునందు గాంచితి
Image
Meraj Fathima...... నాకు శత్రువులంటూ ఎవరూ లేరు నా మనస్సే నాకు బద్ద శత్రువు. (రోజూ కొత్త,కొత్త ఆలోచానాస్త్రాలతో నాపై దాడి చేస్తుంది )

తాళలేకున్నాను ఓ తాపసీ

Image
 తాళలేకున్నాను ఓ తాపసీ నేను వేళ మించకుండ వెవేగ రారాద 1. మేను పులకరించె మోము చెమరించె మేనకను నేను మనసున్న దానను మనసున మరులాయె మదన తాపమాయె తనివి తీరగ నన్నుచేరంగ రారాదా 2. జపమాల యెందుకు నీ చెంతనేనుండ తపము చాలించి నా తాపము తీర్చుమ కోపగించక వేగ మరులనోదార్చుమ మాపటి వేళకు మర్మమ్ము తెలియు రచన: కొడవంటి

ఛందో మంజరి..

ఛందో మంజరి.. SUBBARAO MSV GARICHEA... ఊయల లూగే ఓ ఉత్పలమాల, చందనము పూసుకునే చంపకమాల,  మత్త కోకిల!నీ గళము సరళము, నీవాలపించే పద్యము తరళము. తేట తెలుగులో నీవాలపించే గీతి తేటగీతి, ఆకాశంలో విహరించే ఆటవెలది, మధురమైన నీ మాటలు మధ్యాక్కరలు, తేటగీతిన సాగే మత్తేభములు.  సుందరీ నీ స్వరము సప్తస్వర మంజరి, మోహన రాగమున ఆలపించవే మాలిని, నీ లాస్యము శ్రీనాధుని శ్రుంగార సీసము, నీ భాష్యము విశ్వనాధ కవి రాజ విరాజితము.  "గమనిక:- (1) వుత్పలమాల, (2) చంపకమాల,  (3) మత్తకోకిల,  (4) థరలము, (5) తేటగీథి,  (6) ఆటవెలది,  (7) మధ్య్యాక్కర,  (8) మత్తేభము,  (9) మంజరి,  (10) మాలిని,  (11) సీసము మరియు  (12) కవిరాజ విరాజితము.....ఛంధస్సును అధారంగా చేసుకొని తెలుగు పద్యాలకు పెట్టిన పేర్లు." x

ఈశావాస్యోపనిషత్తు

Image
@.జాజి శర్మగారు. 1. ఈశావాస్యోపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు ఏ వేదంలో ఉంది? ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలో ఉంది. ఈశావాస్యోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ఉపనిషత్తు 'ఈశావాస్య' అనే పదంతో ప్రారంభం అయ్యింది ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది. దీనినే ఈశోపనిషత్తు అని కూడా అంటారు.  ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి.  ఈశావాస్యోపనిషత్తు అందించిన ప్రధానమైన సందేశం ఏమిటి?  ఈ చరాచర ప్రపంచం అంతా ఈశ్వరుడి చేత ఆచ్చాదింపబడిందని, అందుచేత 'నేను', 'నాది' అనే భావాలు పరిత్యజించి, త్యాగబుద్ధితో, లోభరహితంగా, లభించిన దానితో సంతృప్తి చెంది అనుభవించడమే ఉత్తమ నైతిక జీవనమనే ఉదాత్త సందేశంతో ప్రారంభామవుతుందీ ఉపనిషత్తు. పరమాత్మ 'విశ్వవ్యాపి' అని చెప్పే మంత్రం ఏది? ఈశావాస్య మిదగ్ం సర్వం  యత్కించ జగత్యాం జగత్  ఈ సూక్తి ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రంలో మొదటి పాదం. ఈ దృశ్యమాన విశ్వం ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది - అంటే భగవంతుడు విశ్వవ్యాపకుడని అర్థం.  వివరణ: ఈ విషయం వేదంలో అనేక చోట్ల ప్రస్తావించ బడింది. ప్రసిద్ధమైన నారా

పూరీజగన్నాథ స్వామి....

Image
పూరీజగన్నాథ స్వామికి సంబంధించినటువంటి పురాణాలలో క్షేత్ర చరిత్రలలో ఒక అద్భుతమైన విషయం ఉన్నది. ఒకప్పుడు కర్ణాటక దేశానికి చెందినటువంటి ఒక మహాగణపతి భక్తుడు శ్రీక్షేత్రానికి వెళ్ళాడు. శ్రీక్షేత్రం అంటే పూరీ. వాళ్ళకి భేదం లేదు. ఏ భక్తులమైనా ఏ దేవతా క్షేత్రానికైనా వెళతాం కదా! భేదం లేదు కానీ ఇష్టం గణపతి అంటే. విష్ణు క్షేత్రమైన ఆ పూరీ క్షేత్రానికి వెళ్ళారట స్వామి దర్శనం కోసం. వెళ్ళి మనస్సులో గణపతిని ధ్యానిస్తున్నాడు. జగన్నాథ స్వామిని చూసి నమస్కారం చేస్తూండగా ఆ జగన్నాథుడు గణపతిగా కనపడి తొండం చాచి అతనిని చుట్టి తనలోపలికి లీనం చేసుకున్నాడట. ఇప్పటికీ దానికి తార్కాణంగా దానికి కథ చెప్పడమే కాకుండా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమినాడు స్వామి వారికి గణపతి అవతారం వేస్తారు జగన్నాథ స్వామికి. గణపతి ముఖం పెట్టి వేస్తారు. దీనినిబట్టి గణపతికీ, విష్ణువుకూ వాళ్ళు అభేదాన్ని పాటిస్తూ అది వాళ్ళు తరువాత జరుపబోయే రథయాత్రకి నెలముందు చేస్తారీపని. అదంతా నిర్విఘ్నంగా జరగడం కోసం విష్ణు స్వరూపుడైన గణపతి, గణపతి స్వరూపుడైన విష్ణువు మాకు సహకరించవయ్యా అని ప్రార్థన చేస్తారు. అప్పుడు స్వామికి నేత్రాలను ప్రక్షాళన చేయడం (కన్ను కడగడం అంటా

జన్మరాహిత్యం..

Image
మనలో కోరికలున్నంత వరకూ జన్మరాహిత్యం అసాధ్యం అసంభవం కదా..  ఆత్మ జన్మను కోరుతునే వుంటుంది కనుక.. అయితే నిజానికి జన్మరాహిత్యం కావాలి అనేది కూడా ఒక కోరికే కదా. ఎందుకు ఆ కోరిక మనకు కలిగింది అనే దానిని బట్టి ఆ జన్మరాహిత్యం మనకు దక్కుతుందో లేదో తెలుస్తుంది. వచ్చాక దాన్నేమి చేస్తాం...  బహుశా శూన్యాన్ని తనలోనూ తన ఆత్మలోనూ, శూన్యం లో తన దేహాత్మల్ని నిరంతరం చూసుకుంటూ వుండెవాడికి ఆ స్థితి దక్కుతుందేమో అనిపిస్తుంది 

ఎందుకే నీ కింత తొందరా...

Image
ఎందుకే  నీ కింత  తొందరా...

పోతనగారి ....పద్య రత్నాలు....

Image
పోతనగారి ....పద్య రత్నాలు.... 1. అమ్మల గన్నయమ్మ అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్. 2. అమ్మా మన్నుదినంగ అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?  నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవుగొట్టంగ వీ రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. 3. అలవైకుంఠపురంబులో అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై. 4. ఇంతింతై ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ప్రాస - అంత 5. ఇందుగలడందు ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు చ

అరువు ...అమ్మాయి...

Image
. అరువు ...అమ్మాయి...మన సినిమాలో తెలుగు అమ్మయిలు కరవు... అందుకే అరువు...... ఇది దారుణం... కో అంటే ఎంత మంది అమ్మయిలో ..పొరుగింటి పుల్ల కూర రుచి మరిగేరు మనవారు..

శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట.

Image
రామాయణము, అరణ్యకాండము - మొల్ల: .... శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట. ..కన్నులు కలువలో? కాము బాణంబులో? తెలివిగా నింతికిఁ దెలియరాదు, పలుకులు కిన్నెర పలుకులో? చిలుకల పలుకులో? నాతి కేర్పఱుపరాదు, అమృతాంశుబింబమో? యద్దమో? నెమ్మోము తెంపుతో సతికి భావింపరాదు. మన్మధుడికి పంచబాణుడు అని కూడ పేరుంది. ఆ ఐదు బాణాలు: అరవిందము (తెల్ల కలువ), అశోకము, మామిడి పూవు, నవమల్లిక, నల్ల కలువ: అరవిందమశోకంచ చూతంచ నవమల్లికా నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయకాః

స్త్రీలు ను మనం గౌరవించాలి..

Image
ఏ ఆడది మొగవారికి వ్యతిరేకం కాదు....లేకపోతే వారితో కాపురం ఎట్లా చేస్త్హారు... కాని మొగ అహంకారంతో వారు చేసి అన్యాయాలు ఎదిరి పోరాడే స్త్రీలు ను మనం గౌరవించాలి..

‪#‎బోనాలు‬

Image
‪#‎బోనాలు‬   (Eco Ganesh) .ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది #బోనాలు. భాగ్యనగరం (హైద్రాబాదు)లో ఎంతో వైభవంగా జరుగుతాయి. బోనం భోజనం అనే పదానికి వికృతి. మా పిల్లల్ని, కుటుంబసభ్యులను, మొత్తం గ్రామాన్ని చల్లగా చూస్తున్న ఓ జగన్మాత! అందరికి అన్ని ఇవ్వగల నీకు భక్తితో ఈ బోనం సమర్పిస్తున్నానమ్మా! మా అందరి కోసం ఊరి పొలిమేరలో కూర్చున్నావు, నీకు ఏదైనా ఇద్దామంటే నీ దగ్గర లేనిదేది లేదు. కానీ అమ్మ! భక్తితో నీకు బోనం(భోజనం) తెచ్చాను. స్వీకరించి మమ్మల్ని సదా అనుగ్రహించు తల్లీ! అంటూ బోనం సమర్పించి అమ్మకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ‪#‎బోనం‬ జగన్మాతకు చెప్పే కృతజ్ఞత . లలితా సహస్రనామాల్లో ' ఆబ్రహ్మకీట జననీ్' అని అమ్మకి ఒక నామం, అంటే బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకముల వరకు పక్షులు, చెట్లు, గ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, మనుష్యులు, దేవతలు మొదలైనవారందరికి ఆమెయే తల్లి అని అర్దం. ఇలా అమాయకుల ప్రాణాలు అనవసరంగా బలవడం అమ్మ(పరమేశ్వరి/జగజ్జనని)కి ఇష్టంలేదు. అందరం ఆమె పిల్లలమే. కాబట్టే అమ్మ మనందరికోసం భూమి మీదకు అనేకమార్లు అనేక రూపాలలో వచ్చింది. .మన కోసం ఆ జగన్మాత ఊరి పొలిమేరలో గ్రామదేవతగా కూర్చుంది. సంవ

నవ్వితే...నవ్వండి ...

Image
నవ్వితే...నవ్వండి ... 1.. నీకు విమానాలకు చౌకగా రంగువెయ్యటం ఎలాగో తెలుసునా?” అని శ్రీశ్రీ గారడిగారు.  “ఏం లేదు, విమానం పైకి వెళ్ళాక చిన్నదైపోతుంది కదా?  అప్పుడు వెయ్యాలి రంగు” అన్నారు, కలకల నవ్వుతూ. 2,.. రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు.స్వరం మారుతోంది."  "మేం ప్రమాణ స్వీకారం నాడే చెప్పాం." "ఏం చెప్పారు?" "మాకు ఓటేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేమని." 3.. అలవాట్లు స్కాట్స్ కు, ఐరిష్ లకు, ఇంగ్లీషు వాళ్ళకు పడదు. ఇంగ్లీషువాడు చెప్పినది. ఇంగ్లీషువాడు ట్రైన్ నిర్లక్ష్యంగా దిగిపోతాడట. ఐరిష్ వాడు తనవి ఎమైనా వదిలానేమో అని చూచుకుని దిగుతాడట. స్కాట్ వాడు ఎవరైనా ఎమైనా వదిలివెళ్ళారేమోనని చూచుకుంటూ దిగుతాడట. 4... "మార్కెన్ డెవిల్" కి వురి శిక్ష పడింది!! "నీ ఆఖరి కోరిక ఏమిటీ?" అని అడిగారు జడ్జి గారు! "మా ఆవిడని చూడాలి సార్!!" అన్నాడు "మార్కెన్ డెవిల్" ! "చాచ్చేముందు కూడా నీకు తల్లి తండ్రులని చూడాలని అనిపించటం లేదా??!!" అని అన్నారు జడ్జి గారు!  "ఇంకో జన్మ ఎత్త గాన

నన్ను మాత్రం లేపొద్దు.

Image
మీరు పొద్దున్నే లేచి ముగ్గురిని నిద్ర లేపండి. వాళ్ళ ముగ్గురిని మరో ముగ్గురిని లేపమనండి... ఇలా బద్దకాన్ని భారతదేశం నుండి తరిమేయవచ్చు. గమనిక : నన్ను మాత్రం లేపొద్దు.

ఇంట్లో కూర్చున్న నన్ను వరండాలోకి రప్పించి వీక్షకునిగా మార్చే చినుకుల అద్భుత మాయాజాలమే వర్షం

Image
 ఇంట్లో కూర్చున్న నన్ను  వరండాలోకి రప్పించి  వీక్షకునిగా మార్చే చినుకుల  అద్భుత మాయాజాలమే   

సుమతి శతకము...

Image
సుమతి శతకము... .పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములన్ బెట్టని దినములఁ గనకపు గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ.. . పూర్వజన్మమున తాను దానమిచ్చిన ఫలం వలన  అర ణ్యమధ్యనున్నప్పటికినీ సకలపదార్దములు కలుగును. పూర్వజన్మమున దానమీయకున్నచో తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు.("యద్దాతా నిజ ఫాలపట్ట లిఖితమ్"అనుశ్లోకమున కనుకరణము). సుమతి శతకము. .ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్ సప్పంబు పడగ నీడను  గప్పవడించు విధంబు గదరా సుమతీ. . ఎప్పుడునూ తప్పులు వెదుకు మనష్యుని సేవించుటకూడదు.ఎందుచేతననగా,కప్ప తన్ను జంపునట్టి పాముయొక్క పడగ క్రింద నివసించిన నెంత హానికరమో ఆ సేవకుని స్థితి కూడా అంతే హానికరము. .ఏఱకుమీకసుగాయలు దూఱకుమీ బంధుజనులఁ,దోషము సుమ్మీ!  పాఱకుమీ రణమందున,  మీఱకుమీ గురువులాజ్ఞ,మేదిని సుమతీ. . లేతకాయలను కోయరాదు.చుట్టములను నిందింపరాదు. యుద్ధమునందు పాఱిపోరాదు.గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు.. . కమలములు నీట బాడినఁ గమలాప్తునిరశ్మిసోకి కమలిన భంగిన్ శమ తమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ. .

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది

Image
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది ఎందుకో ఎందుకో ప్రతి పులుఁగు యేదో చెప్పబోతుంది వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది  .ఇదీ అద్భుతమమే బాపూరమణ గార్ల సంపూర్ణ రామాయణం లో kv మహదేవన్ పండించిన పాట ...https://www.youtube.com/watch?v=tw4aTlg0gLU&hd=1 అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో అసలే ఆనదు చూపు ఆ పై ఈ కన్నీరు తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో ఏలాగో.. నా రామా.. ఏదీ ఏదీ ఏదీ నీల మేఘమోహనము నీ మంగళ రూపము కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు..  పుట్ట తేనె రసాలు దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా... విందుగా అందీయనా

శ్రీకృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్

Image
శ్రీకృష్ణ లీలలు – యమళార్జున భంజనమ్ . శ్రీమద్భాగవతము లోని కథ . అల్లరి నల్లనయ్య తల్లిమీద కినుకబూని దధిభాండమును పగులగొట్టాడు. పొరుగింటిలో దూరి ఱోలు తిరగవేసి దానిమీదకెక్కి ఉట్టిమీదనున్న వెన్నను తీసి ఒక కోతికి ఇచ్చాడు. ఇటువంటి అల్లరి పనులు చేస్తున్న దొఱదొంగను చూచి యశోద “కన్నయ్య! నీవింతవరకూ ఎవరికి చిక్కలేదనీ ఎవరూ నీ ముద్దుమోము చూచి నిన్ను శిక్షించలేదనీ బొత్తిగా అదురూ బెదురూ లేకుండా అల్లరి పనులు చేస్తున్నావు. ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను” అని అన్నది. బెత్తం తెచ్చి కొడుకును బెదిరించడానికి వచ్చిన యశోద తన మదిలో ఇలా అనుకున్నది “ఇతడు పసివాడు అనుకొందామంటే కనీవినీ ఎఱుగని అత్యబ్ధుత కార్యాలు చేస్తున్నాడు. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని వీడు చూడని చోటులేదు ఎక్కరలేని విషయములేదు. భయము అంటూ ఒకటుందని వీడికి తెలీనేతెలియదు. నాన్నా! సాహసాలు మానరా! ప్రమాదమురా! అని చెప్పినా వినడు”. ఇలా పరిపరి విధాల తలచి ఆ యశోద చివరికి “అతి గారాబము చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు నయానో భయానో మంచి గుణాలు అలవాటు చేయాలి. దుడుకుగల పిల్లలకు దండోపాయమే మంచిది” అన

శ్రీకరమురామనామము

Image
Jaganatha Iragavaram గారి కవిత ఉత్పలమాల శ్రీమతి సీత రామునికి శ్రీమతి యవ్వగమిథిల లోపలన్ శ్రీమత మొచ్చెనార్యజనశ్రీసతులందఱు సౌఖ్యమొందగా శ్రీమతి పెంపు పొందెనిటశ్రీమతులైవిలసిల్లిరందఱున్ శ్రీమతి పూజ జేయుదముశ్రీసతులందఱుకూడిరండికన్ ...... ......... కందము శ్రీరామునిపరిణయమే శ్రీరమణీసీతతోడశ్రీకరమవగన్ విరిజల్లుకురిసెమిథిలలొ నరసురవరాయక్షగణమునానందింపన్ ,,,,,,, కందము శ్రీకరమురామనామము శ్రీకరమాసరయుతటినశ్రీనగరంబున్ శ్రీకరముసీతసన్నిధి శ్రీకరామాహనుమశక్తిశ్రీరఘురామా .......... కందము శతయోజనములసంద్రము  నతిశీఘ్రము దాటి రామ నామపు మహిమన్  సీతను జూసిన ఘనుడౌ  వాతాత్మజుహనుమసాటి వారలుగలరే కందము శ్రీరామునిపరిణయమే శ్రీరమణీసీతతోడశ్రీకరమవగన్ విరిజల్లుకురిసెమిథిలలొ నరసురవరాయక్షగణమునానందింపన్

సుందర కాండ శ్లోకము - వివరణ

Image
సుందర కాండ శ్లోకము - వివరణ శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః తా - లంకకు రాగలుగుటకు నలుగురికే సాధ్యము. వాలి పుత్రుడైన అంగదుడు, నీలుడు, బుద్ధిశాలి యగు మా ఏలిక సుగ్రీవుడు మరియు నేను (ఆంజనేయ స్వామి) వివరణ - ఆంజనేయ స్వామివారు సీతాన్వేషణకై పయనమై త్రికూట పర్వత శిఖరం మీద లంకా నగర ప్రాకారాన్ని చేరుకుంటాడు. దుర్భేద్యమైన లంకను చూసి హనుమంతుడు, దీన్ని దేవతలు కూడా జయించలేరు... ఈ నగరాన్ని చేరుకునే వారిలో పైన వివరించిన నలుగురు మాత్రమే రాగలరు అనుకుంటారు... వ్యాఖ్యానము - జీవాత్మ అరిషడ్వర్గములచే బంధింపబడి ఉంటుంది. ఆ బంధము నుండి జీవుడిని విముక్తి చేసి తిరిగి పరమాత్మను చేర్చు వాడు ఆచార్యుడే... గురువు ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది. ఇక్కడ సీతమ్మ జీవాత్మ... రాముడు పరమాత్మ... రావణుడు అరిషడ్వర్గములు...ఆచార్యుడు ఆంజనేయ స్వామి...రావణుని సర్వ నాశనం చేసి సీతమ్మను రాముని చేర్చు వాడు ఆంజనేయుడు. అనగా అరిషడ్వర్గముల బంధము నుండి జీవాత్మను తప్పించి భగవంతుని చేర్చు వాడు ఆచార్యుడు. ఇక్కడ మారుతి, నలుగురము మాత్రమే లంకకు రాగలమన్నాడు. వారు అంగదుడు, నీలుడు, స

భార్యతో మాట్లాడ్డం యెలా?

Image
భార్యతో మాట్లాడ్డం యెలా? (నిఝంగా వొట్టు నాకూ తెలవదు. కానీ రాయడానికి తెలవక్కరలేదు అని మాత్రం తెలుసు) ఓప్పుడు అంటే చాలా చాలా కాలం కిందట - ఓ సినిమాలో చెప్పినట్టు 'లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో' అన్నమాట. అంతకాలం క్రితం నేను మా ఆవిడతో బోలెడు బోలెడు మాట్లాడేవాడిని. పెళ్ళికి ముందు మాట్లాడడానికి వీలుండేది కాదు కాబట్టి ఎక్సర్ సైజ్ పుస్తకాల్లో ఉత్తరాలు రాసేవాడిని. అవన్నీ మా ఆవిడ పుట్టింటి అరణంగా ఇప్పటికీ అపురూపంగా దాచి పెట్టుకుంది. అలాటివాడిని ఏమైందో ఏమిటో అసలు మాట్లాడడమే మానేసాను. ప్రపంచం పెరిగిపోయి పెళ్ళాంతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోవడం పెద్ద అబ్బురమేం కాదు. కానీ బొత్తిగా మాటలు లేకపోతే ఎల్లా. అల్లా ఆలోచించి ఆలోచించి ఎల్లాగైనా సరే మళ్ళీ పాతకాలం మాటా ముచ్చట్ల కాలంలోకి వెళ్లాలని టైం మిషన్ ఎక్కాను. దిగి చూసేసరికి మొత్తం సీనే మారిపోయింది. అరవ తెలుగు సీరియల్ చూస్తూ మా ఆవిడా సమస్త ప్రపంచాన్ని మరచిపోయి అందులో లీనమై వుంది. కల్పించుకుని మాట్లాడబోతే, 'వుండండి అత్త కోడలికి విషం కలిపిన కాఫీ ఇచ్చి ఇప్పటికి మూడు వారాలయింది ఇంతవరకు తాగి చావలేదు. మీ ముచ్చట్లు ఏవో మ