సుమతి శతకము...

సుమతి శతకము...

.పెట్టిన దినముల లోపల

నట్టడవులకైన వచ్చు నానార్థములన్

బెట్టని దినములఁ గనకపు

గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ..

.

పూర్వజన్మమున తాను దానమిచ్చిన ఫలం వలన

 అర ణ్యమధ్యనున్నప్పటికినీ సకలపదార్దములు కలుగును.

పూర్వజన్మమున దానమీయకున్నచో తాను బంగారుకొండ నెక్కినను ఏమియు లభించదు.("యద్దాతా నిజ ఫాలపట్ట లిఖితమ్"అనుశ్లోకమున కనుకరణము).

సుమతి శతకము.

.ఎప్పుడు దప్పులు వెదకెడు

నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్

సప్పంబు పడగ నీడను 

గప్పవడించు విధంబు గదరా సుమతీ.

.

ఎప్పుడునూ తప్పులు వెదుకు మనష్యుని సేవించుటకూడదు.ఎందుచేతననగా,కప్ప తన్ను జంపునట్టి పాముయొక్క పడగ క్రింద నివసించిన నెంత హానికరమో ఆ సేవకుని స్థితి కూడా అంతే హానికరము.

.ఏఱకుమీకసుగాయలు

దూఱకుమీ బంధుజనులఁ,దోషము సుమ్మీ! 

పాఱకుమీ రణమందున, 

మీఱకుమీ గురువులాజ్ఞ,మేదిని సుమతీ.

.

లేతకాయలను కోయరాదు.చుట్టములను నిందింపరాదు. యుద్ధమునందు పాఱిపోరాదు.గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు..

.

కమలములు నీట బాడినఁ

గమలాప్తునిరశ్మిసోకి కమలిన భంగిన్

శమ తమ నెలవులు దప్పినఁ

దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

.

.కమలములు తమ స్థానమగు నీటిని వదిలిన యెడల తమకు మిత్రుడగు సూర్యుని వేఁడిచేతనే వాడిపోవును.అట్లే ఎవరుగాని తమ తమ యునికిపట్లు విడిచినచో తమ స్నేహితులే విరోధులగుట తప్పదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!